20, నవంబర్ 2016, ఆదివారం

సమస్య - 2204 (పడ్డవాఁడు కాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు"

78 కామెంట్‌లు:

 1. తండ్రి యాజ్ఞ లన్ని తలదాల్చి ముదముతో
  రాజ్య మొదలి వెడలె రాఘవుండు
  కాననమున కేగి కడలిని దాటెరా!
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వదలిని ఒదలి అన్నారు.. 'రాజ్యము విడి వెడలె...' అనండి.

   తొలగించండి
  2. చెడ్డ వారి దెచ్చి సింహాస మునునిడ
   అడ్డ మైన పనుల నమలు జేసి
   దొడ్డ వారి నెల్ల దోచెడు యో !మోడి !
   "పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు"

   తొలగించండి
 2. రాముని గుడిఁ గట్టి రంజిల్లు చున్నట్టి
  భక్తరామ దాసు బ్రహ్మ రాతఁ
  జేయని దురితమున చెరసాల పాలయ్యె
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. నల్లధనమునెల్ల నాశనమొందించ
  పెద్దనోట్లనెల్ల రద్దు సేయ
  శత్రుగణములెల్ల శపియింప మోదీని
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. డా.పిట్టా
  చెనటి యంభి వలన చేజేత విజయము
  నంది గ్రీకు వీరు డడిగె పూరు
  "బడితి వెట్లు నిన్ను బాటింతు?"నన దెల్పె
  "పడ్డవాడు కాడు చెడ్డవాడు!"
  పూరుడు॥పురుషోత్తముడు.అంభి॥పగబట్టి అలెగ్జాండరు విజయానికి తోడ్పడిన హిందూ రాజు.పడితివి॥ఓడిపోతివి.బాటింతు॥ఎన్నవలెను?.గ్రీకు వీరుడు॥అలెగ్జాండరు

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  వృద్ధ పెన్షనరుడు విధిని బొదుపు జేసి
  వైద్య సాయమంచు పట్టె ఖాత
  హద్దు దాటెనంచు నైటీల గట్టెరా!
  పడ్డవాడు కాడు చెడ్డవాడు
  నిద్ర నుండ జంపు నిధుల కాపరి మోడి
  వీరుడాయెనయ్య వినరె జనులు!
  Pensioner॥పెన్షనరుడు.పట్టె ఖాత॥బ్యాంకి ఖాతాలో వేశాడు.నైటీ॥ I.T ఇన్కమ్ టాక్సు. పడ్డవాడు॥వృద్ధుడై ఓడి పోయినాడు.నిద్ర నుండ ॥ముసలివాడు వీరుడే ఐనా నమ్మి care freeగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఇతనిని జంపినంత పని జేసిన నేత వీరత్వం కొనియాడండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో ఆటవెలదిని ఆరు పాదాలతో వ్రాశారు. అలా వ్రాయరాదు. కేవల సమపాద పద్యాలకే (తేటగీతి, వృత్తాలు) ఆ అవకాశం ఉంది.

   తొలగించండి
 6. మిత్రులందఱకు నమస్సులు!

  పనులు చేయునట్టివానిఁ దిట్టుచు నుండ్రు;
  వట్టివాని నేమి తిట్టకుండ్రు!
  నడచు గిత్తనె యెపు డదలించుదురుకాదె?

  పడ్డవాఁడు, కాఁడు చెడ్డవాఁడు!

  రిప్లయితొలగించండి
 7. వన్నె కత్తె కూడి వయసున ప్రేమలో
  పడ్డ వాడు కాడు చెడ్డ వాడు!
  వలపు చెఱపి వైచి భార్యగా వేఱొక
  భామ పొందు గోరు వాడె తులువ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పెట్టు వాని కేల పెద్ద రోగమనుచు
   దుష్టు డైన వాని దూఱ బోరు!
   పరుల కొఱకు నెపుడు పాటు పడుచు మాట
   పడ్డ వాడు కాడు చెడ్డ వాడు!

   తొలగించండి
  2. శ్రీధర రావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి


 8. పడ్డ వాడి తెలివి బతుకున హాయిగా
  సాగి పోవు వాడి సత్తు కన్న
  హెచ్చు, జీవితమున హెచ్చవేయు జిలేబి
  పడ్డ వాడు, కాడు చెడ్డ వాడు!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. తండ్రి తాతలంత తాగుబోతులు వారు
  ధూర్తులంచు మీరు దూర నేల?
  నిజము నెఱుగుమికను నీదు పుత్రికనిష్ట
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

  రిప్లయితొలగించండి
 10. జూదమందునోడి చుల్కనయయ్యెను
  భార్య నిండు సభను భంగపడియె
  అడవిపాలుగాగ నధ్వాన్నమయ్యెను.
  పడ్డవాడుకాడు చెడ్డవాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. ఆ.వె. నీచు డెపుడు బ్రదుకు నిందలు వేయుచు
  సజ్జనుండు బ్రదుకు చక్క గాను
  నిజము సుంత లేని నిందల నెన్నియో
  "పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు"

  రిప్లయితొలగించండి
 12. దేశ వికసనంబె స్థిరలక్ష్యమని చేయు
  జగతి కుపకరించు చర్యవలన
  విమతులైన వారి వివిధంపు మాటలు
  పడ్డవాడు కాడు చెడ్డవాడు.

  తల్లిదండ్రి గొలిచి ధన్యత్వమును గాంచ
  గోరుచుండ జూచి కుమతి జనము
  లహరహమ్ము చేయు బహువిధ దూషణల్
  పడ్డవాడు కాడు చెడ్డవాడు.

  సంఘసేవ గోరి సతతంబు నిష్ఠతో
  పుణ్యఫలమటంచు భువిని దిరుగు
  చుండు కార్యమందు మెండైన కష్టాలు
  పడ్డవాడు కాడు చెడ్డవాడు.

  ధర్మరక్షణంబె తనభాగ్య మని యెంచి
  సద్ధితంబు గూర్చు సత్కృతులిల
  నాచరించు వేళ ననుపంబులౌ పాట్లు
  పడ్డవాడు కాడు చెడ్డవాడు.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 13. నింద మోపి మిగుల నిందించె రాముని
  చాకి వాని మాట సరకు గొనుచు
  పడ్డ వాడు కాడు చెడ్డ వాడు భువిని
  రాముడనగమనకు రక్ష కుండు

  రిప్లయితొలగించండి
 14. కలిమి లేము లవియు కావడి కుండలు!
  జాలి లేని వాని జోలి కేల?!
  బలిమి యెకటె నీకు భాగ్యంబు నీయదు!
  పడ్డ వాడు కాడు చెడ్డ వాడు!

  రిప్లయితొలగించండి
 15. శ్రీగురుభ్యోనమః

  మర్త్యలోకమందు మమతానుబంధంపు
  ధర్మ మెరిగినట్టి కర్మయోగి
  రామచంద్రమూర్తి లలితుడు కష్టముల్
  పడ్డవాఁడు, కాఁడు చెడ్డవాఁడు

  అనుచు వాల్మీకి మునివర్యు డాశ్రయమున
  గురువు తానౌచు బోధించె కుశలవులకు
  రాజ ధర్మమ్ములన్ దెల్ప ప్రణతులిడుచు
  రాజధానిని జేరిరి రాజ సుతులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీపతి శాస్త్రి గారూ,
   మీ పూరణ, దాని ననుసరించి వ్రాసిన పద్యం బాగున్నవి. అభినందనలు.
   'ఆశ్రమమున'... 'ఆశ్రయమున' అయిందా? లేక కావాలనే అలా వ్రాశారా?

   తొలగించండి
  2. గురువుగారు ధన్యవాదములు. "ఆశ్రమమున" అని టైప్ చేసినాను. కాని నా ఫోన్ లో ఇదివరకు టైప్ చేసిన పదములకు దగ్గరగా నున్న పద్యములు డీఫాల్ట్ గా పడుతుంటాయి.
   "మునివర్యు డాశ్రమమున" అని సవరించుచున్నాను.

   తొలగించండి
 16. అడ్డదారులందు నార్జించి ధనమును
  యెన్నికైన నేత కన్న నితము
  ప్రాణ మాన ములు సరకు సేయకను పాటు
  పడ్డవాడు కాడు చెడ్డవాడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ధనమును+ఎన్నికైన' అన్నపుడు యడాగమం రాదు. 'సంపద। లెన్నికైన..' అనండి.

   తొలగించండి
  2. గురుదేవుల సూచనమేరకు సవరించిన పద్యము
   అడ్డదారులందు నార్జించి సంపద
   లెన్నికైన నేత కన్న నితము
   ప్రాణ మాన ములు సరకు సేయకను పాటు
   పడ్డవాడు కాడు చెడ్డవాడు

   తొలగించండి
 17. గాటనున్నట్టి జంతువే కాలుదువ్వి
  మోరనెత్త జూచి మోజుగనుచు
  దున్న తోడను పంప సంతోషమందె
  పడ్డ, వాఁడు కాఁడు చెడ్డవాఁడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   విషమపాద పద్యాన్ని వ్రాశారే. 1.3 పాదాలు తేటగీతి, 2,4 పాదాలు ఆటవెలది అయ్యాయి.

   తొలగించండి
  2. మాస్టరు గారూ..పొర "పడ్డా" ను... తెలిపినందులౌ ధన్యవాదములు..
   సవరణతో...

   గాటనున్నపశువు కాలుదువ్వుటగని
   మోరనెత్త జూచి మోజుగనుచు
   దున్న తోడు బంప తోషమున దలచె
   పడ్డ, వాఁడు కాఁడు చెడ్డవాఁడు.

   తొలగించండి
 18. అడ్డ దిడ్డ మయిన నడ్డి విఱుగఁ జేయు
  జడ్డ లడ్డమైన గిడ్డ గాక
  దుడ్డు గడ్డుజడ్డు నొడ్డి దొడ్డ మనసు
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

  [జడ్డ=సంకటము; గిడ్డ=పొట్టి; జడ్డు=తగులము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   వృత్త్యనుప్రాసాలంకార శోభితమై మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 19. యమతనూజుఁ డొసఁగె నగ్రాసనంబని
  సంబరపడి గౌరవంబుఁ గొనఁగ
  సిగ్గు లేదటంచు శిశుపాలుచే నింద
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు.
  (శ్రీ ఇందారపు కిషన్ రావు గారికి ధన్యవాదాలతో)

  రిప్లయితొలగించండి
 20. మంచిచేయ నీవు మందికి మనసుతొ
  ఎంచి నిన్ను జనము ఏడిపించు
  విస్మరించి కదులు విజయము వైపుకు
  పడ్డవాడు కాడు చెడ్డ వాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవసరాల రామలక్ష్మి గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ ప్రయత్నం ప్రశంసార్హం. బాగుంది.
   'మనసుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'జనము+ఏడిపించు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. మీ పద్యానికి నా సవరణ....

   మంచి సేయగ పదిమందికి మనసార
   నెంచిన నిను ప్రజ లేడిపింత్రు
   విస్మరించు కదలు విజయము వైపుకు
   పడ్డవాడు కాడు చెడ్డవాడు.

   తొలగించండి
 21. పరుల మోసగించి పాపాలు సాగించి
  విలువలేవి లేక విత్తమరయ
  విధివశాన తనదు విత్తమంతయుఁబోవ
  పడ్డవాఁడు కాఁడు, చెడ్డవాఁడు

  రిప్లయితొలగించండి
 22. అతివ చేరరాగ నగ్నిపరీక్షను
  చేయమనిన 'వాడు ' చెనటి కాడు
  కాంత నడవికంపె కఠినాత్ముడనుమాట
  పడ్డ 'వాఁడు' కాఁడు చెడ్డవాఁడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. ప్రజల మంచి కోరి పట్టుతోడ ప్రధాని
  నోట్లు రద్దు చేసి పాట్లు పెంచె
  నిజము దెలిసి కొనియు నీతి మార్గమ్మున
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 24. క్షీరచషకమందు క్షీరాబ్దిసుతుఁగాంచి
  మణినపహరించె మాయగాడు
  ననెడు ఘోరమైన నపవాదుఁదనపైన
  "పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. రాజ్యమేల తిరిగి రమ్మని యడుగగ

  యన్న కొఱకు భరతుడవని కేగ

  లక్ష్మణుండు భ్రమసి రణమున కనుకొనె

  పడ్డవాడు కాదు చెడ్డవాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 26. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దాచి యుంచి నట్టి ధననిధు లన్నియు
  వెలికి దీయు చుండు వీక నందు
  అక్రమార్జునులిట ననుచుండు మాటలు
  పడ్డ వాడు కాదు చెడ్డ వాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 27. నీతి,నిర్మలత్వ నియమాలతోకష్ట
  పడ్డవాడు కాడుచేడ్డవాడు
  యనుట తప్పుగాద?నైశ్వర్యవంతులు
  ఈర్ష్య లందుజగతి యిముడు చుండె|
  2.కనుల కొలనుయందు మునుగకనేయిష్ట
  పడ్డవాడు కాడు చెడ్డవాడు
  ననగ సాక్ష్య మేది? ఆంతర్యమేదప్ప
  ముందు చూపు లేక మోసమగును.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలు 'వాడు+అనుట, వంతులు+ఈర్ష్య' అన్నపుడు సంధి నిత్యం యడాగమం రాదు. 'తప్పుగాద+ఐశ్వర్య..' అన్నపుడు యడాగమం వస్తుంది.

   తొలగించండి
 28. అడ్డు యదుపు లేని యవినీతినిన్ జంప
  వేటగాని వోలె వ్రేటు వేసె |
  తీవ్రవాద మెదుగ ధీరంబుగా నడ్డు
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తంగిరాల రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అడ్డు నదుపు లేని..' అనండి. అలాగే 'ధీరత్వమున నడ్డు పడ్డవాడు...' అనండి.

   తొలగించండి
 29. ఎండ మండుచున్న కండలెండుచునున్న
  గుండె బండ జేసి మెండు పంట
  లవనికందజేయ ననవరతము పాటు
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

  మధుర పద సరళిని మహిమాన్వితంబైన
  గేయ రచన చేయ గేలి సేయ ,
  భావ శూన్యమైన గావు కేకకు పాటు
  పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు

  నిన్నటి సమస్యకు నా పూరణ

  నిగ్రహ మావశ్యకమే
  యాగ్రహము గలుగ మనసు నియంత్రణమునకు ,
  న్నుగ్రపిశాచుల నడుచుట
  కాగ్రహ మున్నపుడె మెత్తు రందఱు సుజనుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 30. నందకులములోని నవనీత చోరుఁడు,
  గోపికారమణుల గోలచేసి
  చీరలెత్తుకెళ్లు నేరగాడని మచ్చ
  పడ్డ వాడు కాడు చెడ్డవాడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 31. వడ్డి గట్టి దెచ్చి పంటలు బండించి
  అన్న దాత బడెను యప్పులందు
  అప్పులందు బడియు అన్నము దినిపించ
  పడ్డ వాడు కాడు చెడ్డ వాడు
  కొరుప్రోలు రాధాకృష్ణారావు
  గురువుగారికి నమస్కారములు.తేది 11 - 07 -2015 నుండి ప్రధానోపాధ్యాయునిగా zphs దాదాపూర్
  దోమ ,వికారాబాద్ జిల్లా లో పని చేస్తున్నందున,సమస్యా పూరణం లో పాల్గొనలేక పోవు చున్నాను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 32. నందకులములోని నవనీత చోరుఁడు,
  గోపికారమణుల గోలచేసి
  చీరలెత్తుకెళ్లు నేరగాడని మచ్చ
  పడ్డ వాడు కాడు చెడ్డవాడు

  రిప్లయితొలగించండి
 33. చెడ్డ వారి దెచ్చి సింహాస మునునిడ
  అడ్డ మైన పనుల నమలు జేసి
  దొడ్డ వారి నెల్ల దోచెడు యో !మోడి !
  "పడ్డవాఁడు కాఁడు చెడ్డవాఁడు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సింహాసనము'ను 'సింహాసము'...?

   తొలగించండి
 34. ఎలాగు పొలిటికల్ సెటైర్లకు తెర నెత్తారు, ఈ సమస్యను పరిశీలించండి.
  "మూర్ఖత్వ మదేలనోయి మోదీ భాయీ !"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. గూర్ఖా వోలెన్ తిరుగుచు
   బుర్ఖా ల వెనుక ద్రవిణము బుంగుడు పరచన్
   సర్ఖాల నణచవలె నను
   మూర్ఖత్వ మదేలనోయి మోదీ భాయీ :)

   జిలేబి

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   బాగుంది.
   'సర్ఖా (దోపిడి)' అని మాండలికాన్ని ప్రయోగించారు. అలాంటి దుష్కర ప్రాసకు తప్పదనుకోండి.

   తొలగించండి