1, నవంబర్ 2016, మంగళవారం

దత్తపది - 101 (కన్ను-ముక్కు-చెవి-నోరు)

సోదరీ సోదరులకు యమద్వితీయ (భగినీ హస్త భోజనం) శుభాకాంక్షలు!
కన్ను - ముక్కు - చెవి - నోరు
పై పదాలను ఉపయోగిస్తూ
దీపావళి సంబరాలను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

74 కామెంట్‌లు:
 1. పండగ సంబరాలతో డిల్లీ నగరం లో కాలుష్య మెక్కువై పోయిందంటండీ :)

  చెవి పోటు కండ్ల మంటల
  ట! విరివి కాలుష్యమంట టమటమ లౌ మా
  నవులకట ముక్కు దిబ్బడ
  కవీశ , నోరొకటి తీపి గాంచె జిలేబీ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దత్తపదిలో 'కన్ను'ను 'కండ్ల' అని మార్చరాదు. 'టమటమలౌ' అన్నదాన్ని 'ఠవఠవలౌ' అనండి బాగుంటుంది.

   తొలగించండి
 2. కన్ను, ముక్కు, చెవియు కాస్త భద్రంబురా
  దూరముండి చేత నోరుమూసి
  కాల్చ వలయు మీరు కడు జాగరూకు లై
  మందుగుండ్లు పిల్ల లంద మొప్ప.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాస్త' అన్నది గ్రాంధికం కాదు, మాండలికం.

   తొలగించండి
  2. ఆర్యా!
   నమస్కారములు.
   "కన్ను ముక్కు చెవియు కరము భద్రంబురా"
   అని సవరించ ప్రార్థన.

   తొలగించండి
  3. ఆర్యా!
   నమస్కారములు.
   "కన్ను ముక్కు చెవియు కరము భద్రంబురా"
   అని సవరించ ప్రార్థన.

   తొలగించండి
 3. కన్నుల పండుగ జగతిని
  వెన్నెల వెలుగేమొ మింట వేయి విధమ్ముల్
  సన్నని ఘాటది ముక్కున
  మిన్నంటు రొదకు చెవి నోరు మెలిబడి పోవన్

  రిప్లయితొలగించండి
 4. డా.పిట్టా
  నాడు షట్చక్రభేదన నైన రవము
  వెల్గు లంతస్తులను దాట విలువ దెలిసె
  కన్ను ముక్కు చెవిన్నోరుగరప తపము
  దివ్య దీపావళి జ్యోతి తెల్లమాయె!
  కన్నులు జాలవాప్రభలు!గందరగోళపు బాంబు ప్రేలుటల్
  మిన్నున కంటునే!చెవినమేయముగా వికటించు ముక్కునున్
  బన్నిన గంధకంపు పొగ బారెడినంతట యుద్ధ భూమినా
  కన్నయ పత్ని బాణములకాంతులె వర్ణన నోరు విప్పెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. మిన్ను నంటెడి రవ్వలు కన్నులందు
  చెక్కిళులు, ముక్కు మీదను చిట్లి పడును
  బాంబు ప్రేలిన చెవి, నోరు ప్రాంతమంత
  కాల గలదయ బాపురే, కంఠమంత,
  వినుము కళలీను దీపాల వెలుగు చాలు!
  తెచ్చుకొన బోకు కష్టాలు, నొచ్చుకొనకు!

  రిప్లయితొలగించండి
 6. వివిధములగు నోరూరించె విలువ గలుగు
  పెక్కు వంటల ఘుమఘుమల్ ముక్కు జేర్చు
  కన్ను లదిరెడు కమనీయ కాంతులీను
  ధనధనాధన ఘోరశబ్ధాల హోరు
  మిన్ను దాకెడు ఘనపర్వమిదియె భువిని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నోరూరించు' అనండి.

   తొలగించండి
 7. కన్నులు చెదరెడి వెలుగుల
  చిన్నలు పెద్దలు చెవులవి చేతుల మూయన్
  అన్నియు ముక్కులదరుగద!
  కొన్నవి నోరూరు లడ్లు కోరిక తీర్చెన్!

  రిప్లయితొలగించండి
 8. కన్నుల్ కాంతులనీనుచుండ ధర స్వర్గంబయ్యె దీపావళిన్
  పన్నీరుంజెవులందుఁబోయు పగిదిన్ వాక్రుచ్చుచుంజెల్లెలు
  న్నన్నాయంచును నోరునూర పరమాన్నంబు వడ్డించగ
  న్వెన్నై డెందము ముక్కునాన భుజియించెన్ సూర్యసూనుండిలన్ (శ్రాద్ధదేవుండిలన్)||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   ఆహా! భగినీ హస్త భోజనాన్ని కూడా చేర్చి చక్కని పూరణ చేశారు. అభినందనలు.

   తొలగించండి


  2. ఈ భగినీ హస్త భోజనం అంటే ఏమిటండీ ?

   జిలేబి

   తొలగించండి
  3. 'యమద్వితీయ' అను 'భగినీ హస్త భోజన' పర్వదినం.

   కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను
   జరుపుకుంటారు.
   ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా
   దేవి (నది)ని స్మరించి పూజించాలి.
   సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజుగారు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమే తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా వరం కోరుకోమనగా. యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన
   చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు. అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మను పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు.
   దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర, పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ.
   అందువలన అవకాశం లేనివారికెలాగూలేదు, ఉన్నవారందరూ ఈ పండుగను జరుపుకొని, రక్త సంబంధాలనీ, ఆత్మ సంబంధాలనీ, కుటుంబ బాంధవ్యాలనీ పెంపొందించెదరు గాక. తరవాత సోదరుడు తన సోదరిని పరివారంతో సహా తన ఇంటికి మరునాడు ఆహ్వానించి అంతే ఆప్యాయంగా సోదరీమణులను ఆదరించి ఇతోధికంగా కానుకలిచ్చి గౌరవించి పంపడం ఆచారం ఈ రోజును సోదరీ తృతీయ అని పిలుస్తారు.

   తొలగించండి
  4. ఆర్య ! మీ ప్రోత్సాహకమునకు అనేక నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
  5. ఆర్య! క్షమించలెను. ఒక లఘువు తక్కువగుటచే ఛందో దోషము వచ్చినది. సవరించి పంపుచున్నాను.


   కన్నుల్ కాంతులనీనుచుండ ధర స్వర్గంబయ్యె దీపావళిన్
   పన్నీరుంజెవులందుఁబోయు పగిదిన్ వాక్రుచ్చుచుంజెల్లెలు
   న్నన్నాయంచును నోరునూర పరమాన్నంబెంచి వడ్డించగ
   న్వెన్నై డెందము ముక్కునాన భుజియించెన్ సూర్యసూనుండిలన్ (శ్రాద్ధదేవుండిలన్)||

   తొలగించండి
  6. ఆ గణదోషాన్ని గమనించలేదు. ప్రయాణంలో ఉన్నాను కదా! సవరించినందుకు సంతోషం!

   తొలగించండి


  7. కథాక్రమం బాగుందండీ కంది వారు


   యముడును యమునయు సూర్యుని
   కొమరు,కుమార్తె, నొకనాడు కోరి యముడు తా
   యమున గృహంబున కేతెం
   చె ముద్దుల సహోదరి మురిసెను బువ్వనిడెన్ !

   జిలేబి

   తొలగించండి
 9. కన్ను పగలుగ కనబడు కాంతి మెరుపు
  చెవులు పగులగ శబ్దమ్ము చేయు బాంబు
  ముక్కు పగులగ మందులు ముంచు ఘాటు
  మీరు దీపోత్సవమునాడు నోరు తీపి.

  రిప్లయితొలగించండి
 10. కవిమిత్రులకు నమస్కృతులు...
  ఈరోజు భగినీ హస్తభోజనము కదా! మా అక్కయ్య దగ్గరికి వెళ్తున్నాను. అంతర్జాలం అందుబాటులో ఉండదు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
  ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 11. కనులు మిరిమిట్లు గొలిపెడి కాంతి విరిసె
  ముక్కు పుటములదర గంధ మెక్కుడాయె
  చెవులు చిల్లులు పడెనన జెలగె నౌట్లు
  నోరు దీపావళి రుచుల నూరిపోయె.

  రిప్లయితొలగించండి
 12. "కన్ను మిరిమిట్లు ?" సరియైన ప్రయోగమేనా ? తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కన్నులు మిరుమిట్లు గొలుపు కాంతి విరిసె" అనండి... సరిపోతుంది.

   తొలగించండి
 13. కన్నుల విందగు వెలుగుల
  కెన్నంగా ముక్కు తనియు నీగంధములన్
  మిన్నంటు ధ్వనులు చెవికిని
  మన్నికయగు నోరు తీపిమయ మగును గదా.

  రిప్లయితొలగించండి
 14. ఇంటి కరగి దుముక్కున, వంటయింట
  గాంచి నోరూరు పలువంటకముల, మంచి
  చవిగలట్టి గాసముతో తనివిని పొంది
  కన్నులార టపాసుల కాల్చు చుంద్రు
  పెద్దల నుడి పెడచెవిన బెట్టి ప్రీతి

  రిప్లయితొలగించండి
 15. కన్ను లదర గొట్టు కాంతుల తూటాలు
  చెవిని చిల్లులుపడ చిటపటలును
  ధూమ మెగుర ముక్కు దుర్గంధ మయమైన,
  నోరు తీపి చేయ గోరు దినము

  రిప్లయితొలగించండి
 16. రిప్లయిలు
  1. తెగువన మనోరువేగ ప
   తగమున సద్ద్వారకన్నుత నివాసుడిలన్
   దగ నంబుముక్కు వర్ణుడు
   బిగి మగువ గన సమయించె విలయుని నరకున్

   [అంబుముక్కు = మేఘము]

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   ఈరోజు మీరొక్కరే దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించి పూరణ చేశారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.
   (మొదట దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించాలి అనే నియమం పెట్టాను. ఆ విధంగా పూరించాలని ప్రయత్నించాను. కాని సఫలుణ్ణి కాలేదు. దానితో అన్యార్థంలో అన్న పదాన్ని తొలగించాను.)

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   దృక్కు, వాక్కులు స్ఫురణకు వచ్చాయి కాని ముక్కు పదమును కూర్చుట కష్టమనిపించింది. అప్పుడు మీరు చెప్పినది గుర్తుకు వచ్చి “క్కు” అక్షరమును వ్రాసి ఆంధ్ర భారతి లో వెతికితే అంబుముక్కు (అంబుముచ్ ప్రాతిపదిక) దొరికింది.

   తొలగించండి
 17. బాణసంచను గాల్చగా వలయు సరిగ
  లేని యెడల ముక్కు చెవులు కన్ను నోరు
  నిప్పు రవలకు గాలును నప్పుడపుడు
  జాగ రూకత మంచిది సర్వు లకును

  రిప్లయితొలగించండి
 18. ప్రణయోత్తేజ సువీచికా మలయ మాప్యాయంబుగా తాకుచున్
  మనసున్ హాయిని నింపగా విమల ప్రేమాస్వాద మోదంబునన్
  తనువుల్ కల్పుదమో చెలీ నిటను నిత్యంబైన శృంగార తోరణమేగా సుఖశాంతులిచ్చి మనకున్ రంజిల్ల జేయున్ మదిన్

  రిప్లయితొలగించండి
 19. పెద్దలు శంకరయ్యగారికి
  మీ ప్రోత్సాహం తో నిన్నటి పూరణ కు వృత్తం వ్రాసాను.పరిష్కరించి ఆశీర్వదించండి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   చాల సంతోషం. మీరు వృత్త రచన కూడా సమర్థంగా చేయగలరని నిరూపించారు. అభినందనలు.
   గాలి అనే అర్థంలో 'మలయ' పదాన్ని వాడారు. 'సువీచికా పవన మాప్యాయంబుగా...' అనండి. అలాగే 'చెలీ యిటను' అనండి.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మరీచిక పదమున్నది కాని "వీచిక" పదము పై సందేహ మున్నది. వీచి అల యర్థమున ఆ కారాంత స్త్రీలింగ పదము కదా.గ్రామ్యమేమోయని నా యనుమానము.

   తొలగించండి
 20. కన్నుగనలేని వాసనల్ గట్టెముక్కు
  ముక్కువినలేని వార్తలు దక్కెచెవికి
  నోరు జేరకే వంటల జోరు బెరిగె|
  నరకు నంతంబు సత్యయే జరిపెగాన
  నాడె దీపావళి| వెలుగు నాట్య మాడు
  చిచ్చు బుడ్డియుమెరుపులు చిందు లేయ|
  2.ముక్కుకు సూటిగా బలుకు మోదము నింపెడి బాణముల్ గనన్
  చక్కటి సంతసంబుచె విచారము మాన్పును దీప కాంతులే
  మక్కువ కన్నులన్ బడగ?మాయగ చీకటి వెన్నెలాయగా
  దక్కెను నోటికిన్ రుచులు దానవ చేష్టలె నంత్య మవ్వగా|  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో 'సంతసంబుచె' అని చే ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'సంతసంబున' అనవచ్చు. అలాగే 'చేష్టలె యంతమవ్వగా' అనండి.

   తొలగించండి
 21. శంకరయ్య గారికి నమస్సులు !
  కం. కవిమిత్రులు పూరణలను
  చెవులకు నింపుగను గూర్చి చెలరేగిరిగా !
  చవి చూచెడి భాగ్యమ్మును
  నవిరళముగ మాకు మీరె యందించితిరే !
  (సమస్య :2186)

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. కన్నుల దివ్వె వెల్గులిడ కమ్మనిమల్లియ పూలు ముక్కుకున్
  సన్న పరీమళమ్ములిడ సజ్జనులందరు నోరు నొవ్వగన్
  పెన్నిధి కీర్తనల్ చ్గెవిని వెన్నుని సన్నిధి ప్రస్తుతించ పే
  రెన్నికగన్న పర్వమిది యిమ్మహి దీపపు తోరణాలతోన్

  రిప్లయితొలగించండి
 24. పర్వ దినమని కాల్చ టపాసులెన్నొ

  కన్నులకు చూడగా పండగౌను గాని

  వెలువరించిన ధూమము వలన నోరు

  ముక్కులకును వివిధ రోగముల్ కలుగును

  చెవులు బాంబుల మోతకు చిల్లు పడును.

  రిప్లయితొలగించండి
 25. చిటపట లాడుచు చిట్టికాకర తాను
  ........కలసియుంటె సుఖము కలుగు ననియె
  అల్పులయినవారి నలుసుచేయకుడని
  ........యగ్గిపెట్టెయె నవ్వె నందముగను
  ఎదుగుచున్నకొలది యొదిగియుండుమనుచు
  ........చిచ్చుబుడ్డియుజువ్వ చెప్పి యెగసె
  మౌనమే భూషణమని యెరుగుడనుచు
  ........పాము మాత్ర బలికె పక్కనుండి


  కన్నుముక్కు నోరు కాస్త జూసుకొనుచు
  కాల్చుకొనిన మేలు కలుగు ననుచు
  చెవికి నిల్లు గట్టి జెప్పమతాబులు
  దివ్వెలువెలిగించి నవ్వుకొంటి!!!

  రిప్లయితొలగించండి
 26. దివ్యమయినరోజు దీపావళియనుచు
  ........చిన్నపెద్దకలసి చిన్మయముగ
  దీపములను బెట్టి తీరుగా మహలక్ష్మి
  ......పూజచేయుదురుగ పుడమిలోన
  చిచ్చుబుడ్లునునౌట్లు హెచ్చుగ గాల్చుచు
  .......పంచెదరుమిఠాయిపర్వదినము
  పెద్దలందరు చిన్నపిల్లలై బోవుచు
  .......జగతిని వెలిగించుసంబరముగ


  చెవియె రింగు మనెడు సీమటపాసులు
  కన్నుదోయి మెరియు వెన్నముద్ద
  నోరుముక్కులోన దూరుపొగలతోడ
  గాల్చు భాణసంచ ఘనము గాను!!!

  రిప్లయితొలగించండి

 27. కన్ను లమిరు మిట్లు కల్గించు దీపాలు
  చెవుల సవ్వడి విన చిల్లు పడును
  ముక్కు నందు ఘాటు నెక్కుడుగా నెక్క
  నోరు గొంతు మండు నూపిరాగు.

  బాణములను గాల్చ పడుకన్నులన్ ధూళి
  ముక్కు నందు చేర మూర్ఛ కలుగు
  నోరు నెండి పోవు నొసలుమండుచు నుండు
  చెవులు రెంటి కపుడె చెవుడు వచ్చు

  నిజమేనండీ నేటికీ కర్ణాటకలో భావన బిదిగి,అక్కన తదిగి అంటూ అక్కచెల్లళ్ళను ఆదరించడం కానుకలు వారికి వీరు వీరికి వాఖరు ఇవ్వడం జరుగుతుంది.


  యమున చేతి వంట యద్భుతము యటంచు
  భగిని చేసి నట్టి భక్ష్యములను
  ఆదరంబున దినె నాయముండు నిదియె
  పండుగయ్యె గాదె వసుధ యందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు, యమద్వతీయను గురించిన పద్యం బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి

 28. పార కన్నులమిన్న యీ బాంబుల గని
  చూడు ముక్కుపిడుగులని బోడి పేరు
  దీని మలచె విచిత్రమౌ హీన మైన
  ధ్వనిని నోరువాకిలి యేల తగదు భయము.

  రిప్లయితొలగించండి
 29. మిత్రులందఱకు నమస్సులు!

  [దీపావళి పండుగకు వరంగల్లునకుం బోవఁగ, నటఁ టపాకాయలఁ గాల్చునట్టి తనను గాంచిన యువతి తన నెట్టులఁ బెండ్లాడెనో తన మిత్రులకుం దెలుపు నొక యువకుని మాటలు]

  "వన్నియల నొలు కన్నుల మిన్నలఁ గను
  చు న్నుఱికి దుముక్కునఁ డపాసులనుఁ బ్రేల్ప,
  నన్నట వలచె విరిబోణి! నాఁటి దినమె
  కలసి, నను నోరుగల్లునఁ గట్టుకొనియె!"

  స్వస్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. చిన్న సందేహము. "ఒలుకునన్నులమిన్న" అనవలసి వస్తుందేమో? సందేహ నివృత్తి చేయ గోర్తాను.

   తొలగించండి
  3. నిజమేనండీ కామేశ్వర రావు గారూ...నేను గమనించనేలేదు. రాత్రి యేక సమయమున మీరు పెట్టిన వ్యాఖ్యను గమనింపకయే నిద్రించితిని. లేచి యిప్పుడే మీ వ్యాఖ్య జూచితిని! తెలిపినందులకు ధన్యవాదములు!

   ఉదంత తద్ధర్మార్థ విశేషణముల కచ్చు పరమగుచో నుగాగమము వచ్చును గదా! అయితే నేనిటుల సవరించుచున్నాను...

   వన్నెలొల్కు సుందరుల మూఁక న్నుతించు
   చు న్నుఱికి దుముక్కునఁ డపాసులనుఁ బ్రేల్ప,
   నన్నట వలచె విరిబోణి! నాఁటి దినమె
   కలసి, నను నోరుగల్లునఁ గట్టుకొనియె!

   స్వస్తి

   తొలగించండి
  4. కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. సవరించిన మీ పూరణ చాలా బాగుంది.

   తొలగించండి
 30. ఈ రోజు భగినీ హస్త భోజనమన్నారు ! సంతోషం ! ఎందరిళ్ళకని వెళ్ళేది ? నాకు మూడొందల యాభై కోట్ల మంది అక్క చెల్లెళ్ళుడగా ఎవరింటికని వెళ్ళేది?
  అందుకే వారి వదిన చేతి వంటనే తిన్నాను.

  రిప్లయితొలగించండి
 31. అన్న కన్నుల నుత్సాహమలుముకొనఁగ
  ముక్కు మూసుకు జూచెను ముదిత చెల్లి
  మెరసె చెవిరింగులు మతాబు మిన్ను జేర
  నోరు తీపిఁ జేసె మురిసి నోము నోచి

  రిప్లయితొలగించండి