9, నవంబర్ 2016, బుధవారం

సమస్య - 2193 (దోషము లెంచ రెవ్వరును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో"
లేదా...
"దోషము లరుదు ధనమున్న దుష్టునందు"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

76 కామెంట్‌లు:



  1. దేశమున పెద్ద నోట్లకిదే మరొక్క
    యాఖరి యవకాశముగద! యవియె యున్న
    దోషము, లరుదు ధనమున్న దుష్టునందు
    నీతి, వారికిక గతి కన్నీరు జూడ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. నీతి నియమము లేక రాణించ వచ్చు
    చిలిపి చేష్టలు చేసి రాజిల్ల వచ్చు
    కనక మహలక్ష్మి కరుణించ కాల సర్ప
    దోషము లరుదు ధనమున్న దుష్టునందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారు మీ పూరణ చాలా బాగుంది. మహాలక్ష్మి సాధువు. మాసతి అన్న సరిపోవును. మా = లక్ష్మి (తత్సమము).

      తొలగించండి
  3. పెద్ద నోట్లకు వచ్చెను పెనుతు ఫాను
    కోట్లు మ్రింగిన దేవుడు గుట్టు గాను
    తనివి తీరక శపియించె తాప మందు
    దోషము లరుదు ధనమున్న దుష్టు నందు

    రిప్లయితొలగించండి
  4. దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో
    వేషము లెన్ని మార్చినను వేయివి ధమ్ముల ప్రోత్సహించు చున్
    రోషము మర్చి పోయిక్రియ రూపము నొందిన చాలునంచు తా
    భేషజ మందు సాగుచును బీరము బల్కును డాంబికంబు గా

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    రోషము బెంచుకోనగును రూకల గూర్చగ సర్వ యత్నతన్
    ఈషణలన్ జిగుర్చుకొని యిచ్చిన వానికి హస్త మిచ్చి వే
    భూషలు ఘల్లు ఘల్లుమన బుద్ధిని తాకటు బెట్టినన్ సరే!
    దోషములెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్తమున్నచో
    పోషణకైన విత్తమును పొందుటె జీవన సత్యమన్నచో
    ఈషణలన్ త్యజించవలె యీయవలెన్ఋణ దాతమెచ్చ శు
    శ్రూషలు బాధితాళి కిడ శుద్ధత గాంతువు గాని నేడు పో
    దోషములెంచ రెవ్వరును దుష్టునిచెంతను విత్త మున్నచోన్
    పెట్టి పుట్టిన వాడన పుట్టముంచు
    నట్టి మొనగాడు మనకిచ్చు నర్థచయము
    కాసులకు దాసు లవసర కాలమందు
    దోషములరుదు ధనమున్న దుష్టునందు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా వారు మీ మూడు పూరణలు బాగున్నవి. యత్నత / న్నీషణలన్; చో / నీషణలన్; తాకట బెట్టినన్ అనండి.

      తొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నేరముల నెంచి దుర్నీతి నిలిపి యుండి
    సంపదల దోడ యధికార చనవు నొంది
    సొత్తుతో బ్రజ ననచుట జూచు చుండ
    దోషములరుదు ధనమున్న దుష్టు నందు.

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వేషము లెన్నియో చలిపి వీకను గూడని రీతులెంచు శై
    లూషు డతండు నాగడము లూంచుచు సంపదలొంది లోకులన్‌
    పోషణ జేయుచు న్ననచి పోతరమెత్తుచు సంచరించినా
    దోషము లెంచరెవ్వరును దుష్టునిచెంత విత్తమున్నచో.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు మీ రెండు పూరణలు బాగున్నవి.అధికార చనవు సమాసము సాధువు కాదు. "అధికారశంస" అనవచ్చు. "అణచుట", "అణచి" యనుకుంటాను.

      తొలగించండి
    2. శ్రీయుతులు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీ సూచనలను అమలుజేస్తాను. ' నణచుట ' సరియైనది.


      తొలగించండి
  8. వేషమ దెట్టు లుండినను వేయివిధమ్ముల వెఱ్ఱియుండినన్
    భాషయె రాక పోయినను బాధ్యత గానక తిర్గుచుండినన్
    దూషణ భూషణమ్ములను దూరుచు నుండిన నేమిజేసినన్
    "దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో"

    రిప్లయితొలగించండి
  9. రూపు లేకున్న కడు కుష్టు రోగియైన
    విద్య యున్నను లేకున్న వెఱ్ఱియైన
    వేష మెట్టు లుండినను వింత గాను
    "దోషము లరుదు ధనమున్న దుష్టునందు"

    రిప్లయితొలగించండి
  10. తేట గీతి మూడవ పాదం సవరణ:
    "వేష మెట్టు లుండినను బో వింతగాను"

    రిప్లయితొలగించండి
  11. భూషణ సమాన సద్గుణ పూర్ణులందు
    దోషములరుదు ధనమున్న-దుష్టునందు
    ద్వేషభావాలు రగిలించి తీవ్రమైన
    వేషములువేయు సంపద వింతగాను.

    భాషణమందునమ్రతయు పావనజీవనతత్త్వజీవియౌ
    "భూషణు"నామధేయుకడ పుష్కలసంపదలుండియుండినన్
    దోషములెంచరెవ్వరును-దుష్టునిచెంతను విత్తమున్నచో
    శేషునిభీకరాగ్రఘన శీర్షమునందున నున్నయట్లుగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారు మీ రెండు పూరణలతో విరుపులతో నుత్తమముగా నున్నవి.
      భీకరోగ్రఘన శీర్షమునందున యన నెట్లుండును?

      తొలగించండి
    2. అత్యున్నతంగా ఉంటుంది. అప్పటికి ఆ ఆలోచన రాలేదు. మరీ రసస్ఫూర్తి నిస్తుంది, నిస్సందేహంగా. ధన్యవాదాలు. ....11న నా బెంగుళూరు ప్రయాణం. ఆపరేషన్ తేదీ వరకు పాల్గొంటాను.అందరిని రోజు పలుకరించగలగటం మహదానందం....

      తొలగించండి
  12. వేషము మార్చనేల, కడువేదన జెందుటదేల నిత్యమున్
    భూషణమౌనె సంపదయె, పొందునె సత్సుఖమెందు, లేమిచే
    దోషము లెంచ రెవ్వరును, దుష్టుని చెంతను విత్తమున్నచో
    భూషితుడై వెలుంగునె, యపూర్వపు గౌరవ మందగల్గునే?

    సాధుజనులందు సన్మార్గ చరులయందు
    దోషము లరుదు ధనమున్న, దుష్టునందు
    మిక్కుటం బవి లెక్కకు మించియుండు
    నలఘు మదజాత కలుష సంకలితుడగుట.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  13. సుజనుల శ్రమకు దొరకిన సొమ్ముల కిట
    దోషము లరుదు! ధనమున్న దుష్టులందు
    నల్ల ధనము గూడ బ్రతుకు గుల్ల యగును
    ముఱికి చేర నా నిధులెల్ల ముఱిగి పోవు!

    రిప్లయితొలగించండి
  14. ధనముచుట్టును లోకము మనుచు నుండె
    ఖలులు నేతలై భువిని ప్రబలుచునుండ్రి
    చట్టములు కూడ వారల చుట్టమగుట
    దోషము లరుదు ధనమున్న దుష్టునందు

    రిప్లయితొలగించండి
  15. వేషముఁ జూడఁ జిత్రము కుబేరుని మించెడి భోగ భాగ్యముల్
    భాషను విన్న రోత యగుఁ బండిత వర్గము గొల్చు నిత్యమున్
    రోషము భూషణమ్మట విరుద్ధము లాతని పల్కు లెల్లయున్
    దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో


    శాంత మెరుగని ఘోర పాషాణ హృదయ
    మున్నఁ గాషాయ వస్త్రము లూన నింక
    నవని ఘోషించునవి కల్ల లైన నేమి
    దోషము లరుదు ధనమున్న దుష్టు నందు

    రిప్లయితొలగించండి
  16. వేశ్య పావని, దుష్టుడు వేల్పులగుదు
    రవని ధనము సంపాదించనధిక రీతి
    డబ్బు పెంచును హోదాను డాబు నరయ
    దోషములరుదు ధనమున్న దుష్టునందు

    రిప్లయితొలగించండి
  17. దూషణ చేయు చైద్యుని యదూద్వహు డేసెను చక్ర ధారచే
    రోషము బూని భీముడిక క్రూర బకాసురు మచ్చ మాపగన్
    దోషము లెంచ రెవ్వరును,దుష్టుల చెంతను విత్తమున్నచో
    ఊషము నుండి దోష కడ కోడక చిందును స్వార్ధ బుధ్ధితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు మీ పురాణ చాలా బాగుంది. దూషణ చేయఁజైద్యుని అంటే యింకను బాగుండునేమో?

      తొలగించండి
    2. శ్రీకామేశ్వరరావు గారూ,మీసూచన మేరకు సవరించిన పద్యము
      దూషణ kరావు చేయు జైద్యుని యదూద్వహు డేసెను చక్ర ధారచే
      రోషము బూని భీముడిక క్రూర బకాసురు మచ్చ మాపగన్
      దోషము లెంచ రెవ్వరును,దుష్టుల చెంతను విత్తమున్నచో
      ఊషము నుండి దోష కడ కోడక చిందును స్వార్ధ బుధ్ధితో

      తొలగించండి
  18. వేషములెన్నొవేసి ధనవృద్దిని కోరుచుదాహ మెక్కువై
    రోషములేక సంపదలు రోజుకురోజుకు పెంచు కుందురో
    మోసముజేయుచున్ విపణి మీరుచునీతిని వారిలో జనుల్
    దోషములెంచరెవ్వరును దుష్టుని చెంతను విత్తమున్నచో

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారూ ! నమస్కారములు. దయతో క్రింది పూరణలను పరిశీలించగలరు.

    తిండిని యంశము జేయుచు
    నండూరందున జరిగిన నద్భుత క్రీడన్
    మెండుగ సుబ్బడు నచ్చట
    బోండా లరవై నమిలెను బొరుగుల వలెనే.

    శ్రీరాముని నర్చించుచు
    పారమ్యముగా జరిగిన పౌషము నందున్
    పోరామిని నిలిచిన జన
    హారము గొల్చిన నది పది యామడ లుండెన్.

    రిప్లయితొలగించండి
  20. దో షము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్తమున్నచో
    దోషము లెంచరెవ్వరని దుష్టుని దండన జేయకుండుచో
    దోషము లెన్నియో యికను దొంతర గామరి జేయునే గదా
    దోషికి శిక్ష యీ యుటలు దోషము కాదుగ జింత జేయగన్

    రిప్లయితొలగించండి
  21. వేషము మార్చి నాయకులు పేదల మన్నన గద్దెనెక్కి యే
    మోసము తోడనైన సిరిఁబొందిన తప్పక పేరువచ్చు నా
    దోషము లెంచ రెవ్వరును, దుష్టుని చెంతను విత్త మున్నచో
    భాషను నేర్వకుండినను పల్గురు మెచ్చిభజించ కుందురే?

    రిప్లయితొలగించండి
  22. దోషములరుదుధనమున్నదుష్టునoదు
    నాాబలుకగనుసరిగాాదునమ్ముడాార్య!
    దుష్టుడనగనేనుoడునుదోషముగద
    యట్టివాానికిధనమున్నబుట్టుబొగరు

    రిప్లయితొలగించండి
  23. రోషము జూపినన్ పిదప రోయుట నిక్కము దుష్టు చెంత నే
    వేషము వేసినన్ కడకు వీగుట దప్పడటంచు దల్చుచున్
    దూషణ భూషణమ్ములను దోసిలి యొగ్గి భరించ జూడమే!
    దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో

    రిప్లయితొలగించండి
  24. వేషము లెన్నియో నడిపి వేదన జెందెడి మానవాళికిన్
    పోషణ గూర్చునట్లు తగు పొంతనలేకను లాభమెంచుచున్
    భాషణ,భూషణాదులచె భావితరాలభయంబు బెంచగా?
    దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్తమున్నచో|
    2.”మంచి బెంచెడి మహనీయమాన్యులందు
    దోషములరుదు”|”ధనమున్న దుష్టునందు
    నీచగుణములు నిత్యంబు నిలువలుండి
    పరుల బాగోగు లెంచనిప్రతిభయుండు”|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారు మీ రెండు పూరణలు బాగున్నవి. "రోషణాదులను" అంటే బాగుంటుందేమో?
      "ప్రతిభనుండు" అనండి.

      తొలగించండి
  25. మంచి గుణములు గల పేద మనిషి యందు

    దోషములరుదు; ధనమున్న దుష్టునందు

    నుండు మోసము లెన్నియో మెండుగాను

    కాసుల కొఱకు వేసెడు వేసములును.

    రిప్లయితొలగించండి
  26. భూషలు లేని వారలను పూటకు తిండికి లేని సత్య వా
    గ్భూషణమున్నవారలను కూరిమి నిత్యము పంచువారలన్
    దోషుల రీతి గాంచుదురు దుర్దశ భారత జాతి కాని యే
    దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో

    రిప్లయితొలగించండి
  27. భూషలు లేని వారలను పూటకు తిండికి లేని సత్య వా
    గ్భూషణమున్నవారలను కూరిమి నిత్యము పంచువారలన్
    దోషుల రీతి గాంచుదురు దుర్దశ భారత జాతి కాని యే
    దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో

    రిప్లయితొలగించండి
  28. మా అబ్బాయికి నిన్న శస్త్ర చికిత్స జరిగింది. బాగున్నాడు. ఆరు రోజులు హాస్పిటల్ లోనే ఉండాలి. వాడికి జరిగిన ప్రమాదం కారణంగా మా నాన్నగారి ఆబ్దికం 16వ తేదీకి వాయిదా పడింది. (మాలో సాంవత్సరికం తిథికి కొన్ని రోజులముందు చేసే సంప్రదాయం ఉంది. తిథి ప్రకారమైతే 19న జరగాలి).
    16వ తేదీ వరకు సమస్యలను షెడ్యూల్ చేశాను. అప్పటి వరకు నాకు తీరిక ఉండదు.
    నేను పూరణలపై స్పందించకున్నా కామేశ్వర రావు గారి ప్రశంసలను, సవరణలను సహృదయంతో స్వీకరిస్తూ బ్లాగులో పద్యాలు వ్రాస్తున్న అందరికీ పేరు పేరునా అభినందనలు, ధన్యవాదాలు!
    సమస్యలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నాకు పోచిరాజు కామేశ్వర రావు గారు పూరణలను సమీక్షిస్తూ అందిస్తున్న సహకారం మరువరానిది. ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలను? చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కరించడం తప్ప!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ కుమారులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. మీ ఆరోగ్యము జాగ్రత్త.

      తొలగించండి
  29. ఆలు బిడ్డల సేమము కూలునేమొ?
    తప్పు పట్టిన వారల తలలు తెగునొ?
    యిట్టి భయములన్ లోకాన నెంచ లేని
    దోషము లరుదు ధనమున్న దుష్టులందు

    రిప్లయితొలగించండి
  30. డాపిట్టా నుండి
    సమస్య
    కోడెల కుమ్ములాటలను గూలెను లేగలు చూచి నవ్వరే!!
    కోడెలుకుమ్మ కాళులను కృంగెను లేగలు పొంగి పొండికన్

    రిప్లయితొలగించండి
  31. మానవత్వము కలిగిన మనుజులందు
    దోషములరుదు, ధనమున్న దుష్టులందు
    వికృత రూపము ధరియించివిస్మయమగు
    దారుణమ్ములు జేయించు ధరణిలోన!!!

    రిప్లయితొలగించండి
  32. ఏడువంకలు కలిగినా ఎరుపు గాయు
    రాజకీయపు బలమున్న రౌతెరాజు
    భోగభాగ్యములున్నచో యోగి భోగి
    దోషములరుదుధనమున్న దుష్టులందు!!!

    రిప్లయితొలగించండి
  33. డాపిట్టా నుండి
    సమస్య
    కోడెల కుమ్ములాటలను గూలెను లేగలు చూచి నవ్వరే!!
    కోడెలుకుమ్మ కాళులను కృంగెను లేగలు పొంగి పొండికన్

    రిప్లయితొలగించండి
  34. మిత్రులు శంకరయ్యగారికి నమస్సులు. మీ అబ్బాయి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, మీరును తగినరీతి కోలుకోవాలని కోరుకుంటున్నాను.
    నేను కూడ ఒక 4,రోజులలో కాటరాక్ట్ ఆపరేషన్ బెంగుళూరులో చేయించుకోబోతున్నాను. అవకాశమున్నంతవలకు పాల్గొంటాను. నమస్సులతో...

    రిప్లయితొలగించండి
  35. డా.పిట్టా
    కోడెలే కుమ్ముకొన లేగకృంగె కాళ్ళ. సమస్యcontd.

    రిప్లయితొలగించండి
  36. కోడెలే కుమ్ము కొన గాళ్ళ గ్రుంగె లేగ!
    డా పిట్టా. సమస్య యతి సవరణ తో

    రిప్లయితొలగించండి
  37. దోషము లేకయే ప్రజల విత్తము దోచుచు వింతరీతులన్
    భాషణ లిచ్చుచున్ విరివి బాధల నోర్చుచు వోట్లకోసమై
    వేషము లెన్ని మార్చినను వేడుక మీరగ రాజధానిలో
    దోషము లెంచ రెవ్వరును దుష్టుని చెంతను విత్త మున్నచో

    రిప్లయితొలగించండి