కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే"
లేదా...
"అయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా"
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే"
లేదా...
"అయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా"
అయ్యను గూర్చి సాధ్వి తపమద్భుతరీతిని జేయుచుండ బా
రిప్లయితొలగించండిపయ్యగ మారి తాను విటలాక్షుని నిందిల నేవగింపునన్
కయ్యపు మాటలాడు నిజకాంతకు సత్యము తెల్పినిల్చుసాం
బయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
ఫణికుమార్ తాతా గారూ,
తొలగించండిబహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాపనయ్యను బాపయ్య అనువచ్చునా అన్నది సందేహం... (రాముడు రామయ్య అయినప్పుడు బాపడు బాపయ్య అయ్యే అవకాశం ఉందనుకోండి!)
గురువుగారూ ధన్యవాదములు. ఈ మధ్య కొద్దిగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన పూరణలు చూడలేకపోయాను. మన్నించండి. బహుశః విదేశీ యానము చేయవలసియున్నందున ఒక రెండు నెలలు ఇలాగే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీలైనంతలో పూరించే ప్రయత్నం చేస్తాను.
తొలగించండిఫణికుమార్ గారూ,
తొలగించండిమీరు విదేశీయానం చేయబోతున్నందుకు మహదానందంగా ఉంది. స్వస్తి!
అన్నట్టు... డిసెంబర్ 4న వరంగల్లులో పుల్లాభొట్ల నాగశాంతి స్వరూప గారి అష్టావధానాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అవకాశం ఉంటే రావాలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
గురువుగారూ ధన్యవాదములు. నేను అప్పటికి భారతదేశంలో ఉంటే తప్పకుండా వస్తాను.
తొలగించండిశ్రీరాముని జూసి మోహించి రావణుడేమనునో యని మది దలచిన శూర్పణఖ:
రిప్లయితొలగించండిఅయ్యా! అన్నయ్యా! మరి
కయ్యము తలపెట్ట వద్దు! కనుమా యనుచూ;
వియ్యము గోరుచు నారా
మయ్యనుగని విరహమందె నతివ సహజమే!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కనుమా యనుచున్' అనండి.
రిప్లయితొలగించండిఅయ్యరు గారిని వదలదు
సయ్యాటలతా వదలదు సరస జిలేబీ
కయ్యమున కూడ బాడబ
నయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిఅయ్యరు గారిని ప్రస్తావించే ఏ అవకాశాన్నీ వదలనట్టున్నారే! బాగుంది పూరణ. అభినందనలు.
కానీ... 'బాడబనయ్య'... అర్థం కాలేదు.
వియ్యాల వారి విందున
రిప్లయితొలగించండిసయ్యాట లసరస మందు సరి జోడన్నన్
నెయ్యము గాదని తొలగెడి
నయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
ఒయ్యారముగా జానకి
రిప్లయితొలగించండిపయ్యెదపైవ్రాలినట్టి పావనవేళన్
శయ్యా స్వాంతన క్రియరా
మయ్యనుగని విరహమందె నతివ సహజమే
చేపూరి శ్రీరామారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండివియ్యమె కయ్యము కాగా
చయ్యన "నా సుతను బంప చాల్చా"లనగా
నెయ్యమును, పతిని బాపిన
అయ్యనుగని విరహమందె నతివ సహజమే
వియ్యము గాదు రాక్షస వివేకపు కూడిక గాన రుక్మిణిన్
నెయ్యము దల్చిగొంపొనుటనే మదినెంచియు విప్రు బంపె క
న్నయ్యకు దెల్పుమంచు, కడు నార్తిని, యుగ్మహితంబుగోరు యా
య య్యను గాంచి నాతి విరహాతురయయ్యెను సాజమే కదా!?
డా. పిట్టా సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'..గొంపొనుట'...?
అయ్యడవిలోన సీతకు
రిప్లయితొలగించండికుయ్యనుచున్ కవలలైన కూనలుఁబుట్టన్
నెయ్యముఁబోలికలన్ రా
మయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే ||
అయ్య యొసంగనానతి దయారహితుండయి లక్ష్మణయ్యకున్
సయ్యని యేగి సీతను వనంబున దింపెను నిండుగర్భిణిన్
కుయ్యనిఁబుట్టిరే కవలకూనలునన్నిట పోలియుండి రా
మయ్యనుఁ, గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా ||
సవరణ
తొలగించండిఅయ్య యొసంగనానతి దయారహితుండయి లక్ష్మణయ్యకున్
సయ్యని యేగి సీతను వనంబున దింపెను నిండుగర్భిణిన్
కుయ్యని పుట్టిరే కవలకూనలునన్నిట పోలియుండి రా
మయ్యనుఁ, గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా ||
డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.మాడుగుల అనిల్ కుమార్ గారు నమస్సులు. అలాగే "లక్ష్మణయ్యకున్ / జయ్యని" అంటే బాగుంటుంది. "సయ్యన" వాడుకలో అంటారు సాధారణముగా ప్రథమ మీద వచ్చును గాన.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఆర్య! కామేశ్వరరావుగారూ! అనేక నమస్కారములు. ముందు మీరు చెప్పినట్లు చయ్యని అనే ఉపయోగించాను. కానీ ఆ పదం బ్రౌన్ నిఘంటువులో లేదు. కానీ సై అనే పదం ఉంది. సహ అనే సంస్కృత పదం సై అని మార్పు చెందినదని కలదు. అందువలన సందర్భం సరిపోయి అలా ప్రయోగించాను. ముందు నేను వ్రాసినదీ మీరు సవరించినదీ కూడ ఒకటే. అలాగే సవరించి పంపుతున్నాను. సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.
తొలగించండిఅయ్య యొసంగనానతి దయారహితుండయి లక్ష్మణయ్యకుం
జయ్యని యేగి సీతను వనంబున దింపెను నిండుగర్భిణిన్
కుయ్యని పుట్టిరే కవలకూనలునన్నిట పోలియుండి రా
మయ్యనుఁ, గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా ||
డా. అనిల్ కుమార్ గారు ధన్యవాదములు.
తొలగించండిబ్రౌన్ నిఘంటువులో సంస్కృత పదమని "సయ్యన" ఈ బడినది.కాని అది పొరపాటే, సంస్కృత నిఘంటువులలో లేదు.
దృష్టాంతముగా "తెవులు సయ్యనవచ్చున్." అని ఉంది. తెవులు మీది పరుషమునకు "స" ఆదేశమైనది.
మిగిలిన అన్ని నిఘంటువులలోను "చయ్యన" పదమును చూడ వచ్చును. ఇక్కడి చ దంత్యము.
ఆర్య! మీరు తెలియజేసిన విధంగా బ్రౌన్ నిఘంటువులో దంత్యములలో చయ్యన కలదు. అనేక ధన్యవాదములు.
తొలగించండిధన్యవాదములండి. సహసా (శీఘ్రముగా) సంస్కృత పదము కదా. "సహసా విదధాతి న క్రియామ్" నానుడి కదా.
తొలగించండిఆర్య! సః = వాడు లేక అతడు. సహ = కూడుకొని లేక కలసి. సహసా = వెంటనే లేక శీఘ్రముగా.
తొలగించండిఇవి మూడు వేటికవే వేరైన పదములు.
సహకారము. కలసి చేయుట, సహకరించుట.
సహ+అని = సయ్యని అని నిఘంటువులో పేర్కొనినది. దానినే సై అని ఉపయోగిస్తున్నారు. అంటే నీవు చెప్పిన దానికి సహకరిస్తాను అనే అర్థం వస్తుంది. రూఢి అర్థం పంతమునకు పోవునట్లుగా చిత్రీకరించినారు.
సహసా విదధీత న క్రియామవివేకః పరమాపదాం పదమ్ |
తొలగించండివృణుతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః ||
ఈ శ్లోకం సుభాషితంగా ప్రసిద్ధమై మహాకవి భారవి రచించిన కిరాతార్జునీయం లోనిది.
బాగుందండి. ధన్యవాదములు.
తొలగించండి[నిన్నటి నా దత్తపది పద్యమున చిన్న సవరణము]
రిప్లయితొలగించండినిజమేనండీ కామేశ్వర రావు గారూ...నేను గమనించనేలేదు. రాత్రి యేక సమయమున మీరు పెట్టిన వ్యాఖ్యను గమనింపకయే, శంకరయ్యగారికి ధన్యవాదములు తెలిపి, నిద్రించితిని. లేచి యిప్పుడే మీ వ్యాఖ్య జూచితిని! తెలిపినందులకు ధన్యవాదములు!
ఉదంత తద్ధర్మార్థ విశేషణముల కచ్చు పరమగుచో నుగాగమము వచ్చును గదా! అయితే నేనిటుల సవరించుచున్నాను...
వన్నెలొల్కు సుందరుల మూఁక న్నుతించు
చు న్నుఱికి దుముక్కునఁ డపాసులనుఁ బ్రేల్ప,
నన్నట వలచె విరిబోణి! నాఁటి దినమె
కలసి, నను నోరుగల్లునఁ గట్టుకొనియె!
స్వస్తి
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిసవరణ చేసినందుకు సంతోషం!
ఆ దత్తపది పదాలు స్వార్థమున రాకూడదను నియమము లేకున్నను వారికై వారా నియమం విధించుకుని శ్రీ గుండు మధుసూధన్ గారు చేసిన పూరణ బహు లెస్సగా నున్నది.అభినందనలు !
తొలగించండిజనార్దన రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు! గుండు వారే కాదు పోచిరాజు వారు కూడా దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించారు. ఒకసారి పరిశీలించండి.
కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు.
తొలగించండిసుకవి మిత్రులు జనార్దన రావు గారికి...పోచిరాజు వారికి...ధన్యవాదములు!
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఉయ్యెల మంచమందుఁ దగ నూఁగెడి రాధను వీడి యా యెడన్
జయ్యన గోపకాంతలనుఁ జక్కఁగఁ జేరియు రాసకేళిలో
నెయ్యముతోడఁ దేలఁగను నిప్పుల దూఁకిన రీతి వేగఁ గృ
ష్ణయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు శంకరయ్య గారూ!
తొలగించండినిన్నటి దత్తపది
రిప్లయితొలగించండిఅన్న కన్నుల నుత్సాహమలుముకొనఁగ
ముక్కు మూసుకు జూచెను ముదిత చెల్లి
మెరసె చెవిరింగులు మతాబు మిన్ను జేర
నోరు తీపిఁ జేసె మురిసి నోము నోచ
నేటి పూరణ
వెన్నుని తలఁచెడు గోపిక
చిన్నగ మురళీ రవమ్ము చేరగ చెవులన్
కన్నుల మోహమెగయఁ గృ
ష్ణయ్యనుఁ గని విరహమందె నతివ సహజమే
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సహదేవుడు గారూ! కృష్ణయ్యను తెచ్చే తొందరలో ప్రాసలో పొరబడ్డారు.
తొలగించండిగోలి వారూ,
తొలగించండినేను గమనించనే లేదు... ధన్యవాదాలు..
*****
సహదేవుడు గారూ,
ప్రాసను సవరించి మరో పూరణ చెప్పండి.
కృష్ణయ్యను కన్నయ్యగా మారిస్తే సరి !
తొలగించండిగురుదేవులకు మరియు మిత్రులు గోలివారికి ధన్యవాదములు.అదేంటో కృష్ణయ్యనైన రామయ్యనైన రప్పించాలంటే మహదానందం. కృష్ణయ్యనే రప్పిస్తూ సవరించిన పూరణ:
తొలగించండిఅయ్యమునా తీరమునన్
సయ్యాటల నాడఁ బిల్చి చాటగుచు తనే
చయ్యన నెదురయ్యెడు క
న్నయ్యనుఁగని విరహమందె నతివ సహజమే!
సహదేవుడు గారూ,
తొలగించండిసవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
సహదేవుడు గారు కృష్ణయ్యనే రప్పిస్తూ సవరించిన యని యంటూ యీసారి కృష్ణయ్యనే మర్చిపోయారు.
తొలగించండివియ్యమయి యారు నెలలయె
రిప్లయితొలగించండినియ్యెడ సైనికుడు సేరె నింటికి నెలమిన్
నెయ్యపు మగనిని, తన సొగ
సయ్యను గని విరహమందె నతివ సహజమే
చిటితోటి విజయకుమర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చయ్యన బూరింప బడియు
రిప్లయితొలగించండిరయ్యిన జూడవలె శంక రయ్యేననుచున్
ఒయ్యన కవితా కన్నియ
అయ్యను గని విరహమందె నతివ సహజమే.
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శంకరయ్యే యనుచున్' అనండి.
బాబోయ్! రోజూ ఎందరు కవితా కన్యకలు నా విరహంతో వేగిపోతున్నారో?
తొలగించండిఅయ్యడవిలోన నుండగ
రిప్లయితొలగించండితొయ్యలి యా శూర్పణఖయె తొందరబడెగా
నయ్యతి సుందరుడౌ రా
మయ్యను గని విరహమందె నతివ సహజమే.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బియ్యము దెమ్మని గోరెను
రిప్లయితొలగించండిన య్యను గని, విరహ మందె నతి వ సహజమే
తియ్యగ బెనిమిటి పలుకుచు
నియ్యంగా నొక్క ముద్దు నిటు నటు ప్రేమన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
'...గోరిన దయ్యను గని...' అనండి.
[11/2, 6:29 AM] Kandi: కవిమిత్రులారా,
రిప్లయితొలగించండి'శంకరాభరణం' బ్లాగులో ఈరోజు పూరించవలసిన సమస్య (2187) ఇది...
"అయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే"
లేదా...
"అయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా"
http://kandishankaraiah.blogspot.com
[11/2, 8:13 AM] sreeramaraochepuri: కయ్యము లాడుచున్ మురళి గానము మోహము పెంచు నట్టులున్
నెయ్యము గోపికాతతి మనీషల నిండగ,కొంటె భావనల్
నుయ్యలలూగ,పూర్ణకుచ నూర్జిత శంకలుదీర,దొంగ కృ
ష్ణయ్యను గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమేకదా
చేపూరి రామారావు గారూ,
తొలగించండికేవలం పద్యం పెడితే చాలు!
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
శ్రీరామా రావు గారు చక్కటి పూరణ. "భావనల్ / నుయ్యల" ఇక్కడ ను గాగమము రాదు కదా.భావన/లుయ్యల అవుతుంది. "చింతలే / యుయ్యల" అనండి.
తొలగించండిఅలాగే పూర్ణకుచ కర్త గా ప్రథమావిభక్తి అందు చేత నుగాగమము రాదు. సంధి లేమి యడాగమము. యూర్జిత అనండి.
నెయ్యములేక సతమ్మును
రిప్లయితొలగించండికయ్యములను చేయుబావ కట్నమడుగక
న్నియ్యకొన పెండిలికి బా
వయ్యనుఁగని విరహ మందె నతివ సహజమే
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అయ్యలివేణి నాథునికి నయ్యెను దూరము బ్రహ్మ మాయచే
రిప్లయితొలగించండివెయ్యి యుగమ్ములైనవవి వేసరి పోయను నాథు రాకకై
చయ్యన వాయుపుత్రుడు తన జాడను కన్ గొన వచ్చినట్టి రా
"మయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంతకూ ఆ అలివేణి ఎవరు? వాయుపుత్రుడు జాడ కనుగొన్నాడు కనుక ఆమె సీత కావాలి. కాని వేయి యుగాల వియోగం ఎక్కడిది? అమె రావణుని చెరలో ఉన్నది సంవత్సరమే కదా! ఆ కాలాన్ని వేయి యుగాలుగా భావించిందా?
మూడవ పాదంలో గణదోషం. ' వాయుసూతి తన జాడను కన్గొన...' అనండి.
అన్వయం కూడా కుదరనట్టుంది.
"వెయ్యి యుగాలైనవని " వేసరి పోవుట అంటే మీరు "literal meaning తీసుకున్నారు, కాని అది figurative meaningలో వాడబడిండి కదా!( వాస్తవ అర్థము- కవనార్థము).
తొలగించండిఇక గణ దోషం సవరించినందుకు ధన్యవాదాలు."జాడను" బదులు "జానకి" అందామను కున్నాను.మరి ఎందుకో చెప్పలేను జాడను అన్నాను. Thanks a million!
అయ్యా!కన్యను ముదుసలి
రిప్లయితొలగించండికియ్యవలదు పెండ్లి జేసి,యిపుడా సతితో
నెయ్యము జేసెను జవ్వను
డయ్యను గని విరహ మందె నతివ సహజమే.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇయ్యమ కప్పు డేండ్లు పదునేడని చెప్పెను బామ్మ మెల్లగా
రిప్లయితొలగించండినెయ్యము కూడె వీనికిని నీమెకు ప్రేమము పుట్టె పెద్దలున్
వియ్యము నంద లగ్నమును బెట్టిరి జాలము తాళలేక యీ
అయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కయ్యపు మాటలన్ సతము కంపిల చేయుచు గేలిచేయుచున్
రిప్లయితొలగించండిదయ్యమటంచుపిల్చి సత తమ్మును తిట్టెడు యత్తపుత్రుడే
చయ్యన పెండ్లికిన్ తెలుప సమ్మతి కట్నము కోరనంచు మా
మయ్యనుఁ, గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా!
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తిట్టెడు నత్తపుత్రుడే' అనండి.
బియ్యము నిండుకుండె మఱి వేగమె దెమ్ముము వంట జేయగ
రిప్లయితొలగించండిన్న య్యను గాంచి ,నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
యొయ్యనబ్ర క్కజేరి పతి నోముగ బల్కుచు నామెతోడ ,దా
నియ్యగ నొక్క ముద్దపుడు నింపుగ నామెను మెచ్చుచు న్స దా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వేగమె తెమ్మనె వంట జేయ న।న్నయ్యను...' అనండి అన్వయం కుదురుతుంది.
ఒయ్యారమొలుకగ మగని
రిప్లయితొలగించండిసయ్యాటల మది తలచుచు సంతస మందన్
తియ్యదనాల దశమి చం
ద్రయ్యను గని విరహమందె నతివ సహజమే!
గురువు గారికి నమస్కారములు. నిన్నటి దత్తపది పద్యాన్ని కూడా చూడ గోరుతాను.
ధన్యవాదములు.
కన్ను, చెవి, ముక్కులే కాదు, కాయమెల్ల
కలుషతమగు టపాసుల కాల్చుకొనగ!
పరిసరముల చెఱుపునది పండుగగునె?
తియ్యదనము పంచెడి తీరు తెలిసికొనుడు
నోరు తీపి జేయంగ బూనుకొను నేడు!
మీ రెండు పూరణలు బాగున్నాయి. కలుషితమగు అనండి.కొనుడిపుడు అంటే బాగుంటుంది.
తొలగించండినెయ్యమున లేప ముంగొని
రిప్లయితొలగించండియియ్యగమున చిక్కితేను నెరుగను మరలన్
గుయ్యిడె నతడు వరూధిని
యయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే
[అయ్య = పూజ్యుడు]
అయ్య నియోగ మంత శిరమందునఁ దాల్చి వనాంతరమ్మునం
జయ్యన లక్ష్మణుండు సతి జానకి తోడుగ సంచరించగన్
దయ్యపు రూపు శూర్పణఖ ధార్మికుఁ డున్నత సుందరుండు రా
మయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
[ధార్మికుఁడు = ధానుష్కుఁడు]
సింహోరస్కం మహాబాహుం పద్మపత్రనిభేక్షణమ్.
తొలగించండిఆజానుబాహుం దీప్తాస్యమతీవ ప్రియదర్శనమ్৷৷3.17.7৷৷
గజవిక్రాన్తగమనం జటామణ్డలధారిణమ్.
సుకుమారం మహాసత్త్వం పార్థివవ్యఞ్జనాన్వితమ్৷৷3.17.8৷৷
రామమిన్దీవరశ్యామం కన్దర్పసదృశప్రభమ్.
బభూవేన్ద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహితా৷৷3.17.9৷৷
ఇయ్యదె వెన్నెలల్ గురియు నిచ్చట పూవులు తావి బంచగ
రిప్లయితొలగించండిన్నయ్యదె బారుచుండె గన నత్తఱి చిత్తము దోచు యేరులున్
శయ్యగ చెంత దీరు నవ శారద శాద్వల హేల లందు చం
ద్రయ్యను గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే గదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండినా రెండవ పూరణము:
ఇయ్యది సంధ్యా సమయం
బయ్యదిగొ సుధాకరుండు నరుదెంచెంగా
నయ్యమ మదిలో పతి రా
"మయ్యను గని విరహమందె నతివ సహజమే!"
మీ రెండు పూరణలు బాగున్నవి. దోచు నేరులున్ అనండి. శయ్యగ చెంత దీరు?
తొలగించండికవివరేణ్యులు శ్రీ కామేశ్వర రావు గారికి నమస్సులు.
తొలగించండిశాద్వలము.... చెంతలో శయ్యలాగా అమరియున్నది అని నా భావన...... అన్వయం సరిగా రాలేదా....? ఊరిలో లేకపోవటం వలన ఆలస్యముగా స్పందించటం జరిగినది....
శయ్యగ నొప్పు నట్టి అంటే బాగుంటుందేమో!
తొలగించండిఅయ్యలివేణి వరూధిని
రిప్లయితొలగించండిచయ్యన ప్రవరుండు తనను సాయంబడగన్
నెయ్యము గలుగగ బాడబ
డయ్యనుగని విరహమందె నతివ సహజమే!!!
తియ్యగ వేణువునూదుచు
సయ్యాటించు సకలజన సమ్మోహనుడౌ
కయ్యములు బెట్టు నా క
న్నయ్యను గని విరహమందె నతివ సహజమే!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. బాడబుడయ్య అనండి.
తొలగించండిఅయ్యసురుల పరి మార్చగ
రిప్లయితొలగించండినియ్యవనిన బుట్టినట్టి హేమాంబరుడౌ
యయ్యరవిందనయను రా
మయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే
అయ్యసురాళినే దునుమ నాసుర బృందము వేడినంతనే
యయ్యరవింద లోచనుడగాశ్రిత పోషకు డైన శ్రీ హరే
యియ్యవనీతలంబున త్రయిాతను వాన్వయుడయ్యె, నట్టి రా
మయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
మీ రెండు పూరణలు బాగున్నవి. మొదటి పద్యములో "నియ్యవనిని" అనండి.
తొలగించండిత్రయీతనువు+అన్వయుడు= త్రయీతనువన్వయుడు. అనండి.
లేదా త్రయీతను+అన్వయుడు = త్రయీతన్వయు డవుతుంది (యణాదేశ సంధి). అప్పుడు గణదోషము.
శుభకరుడు = శంకరుడు
రిప్లయితొలగించండివియ్యమునకు నెయ్యమునకు
కయ్యమునకు నీడుజోడు కావలెనని మా
నెయ్యక నా 'కవిత' శుభక
రయ్యనుగని విరహమందె నతివ సహజమే!
మీ పూరణ చాలా బాగుంది. మానెయ్యక వ్యావహారికము. శుభకరయ్య కూడా సరి కాదు. అయ్య పదము వ్యక్తి నామము చివర చేరవచ్చు.
తొలగించండి..తా
నియ్యకొనక నా 'కవిత' శి
వయ్యను.. అందామా? శివయ్య అన్న మీరనుకొన్న శంకరుడు అర్థమే వస్తుంది.
Thank you sir for your wonderful corrections!
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచయ్యన భూజము దిగిరా
తొలగించండిమయ్య శుభదహస్త కలిత యంగుళియకమున్
దొయ్యలి కైనిడు నాహను
మయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే
అన్వయము సరిగా లేదనిపించుచున్నది. హనుమను గని యన్న యర్థము వచ్చుచున్నది.కైనిడు లో కై అంటే చేయి యనా లేక చతుర్థీ విభక్తి ప్రత్యయమా? రెండు సందర్భములలోనూ ను గాగమము రాదు.
తొలగించండిప్రథంగా సమీక్షకు కామేశ్వరరావు గారికి కృతజ్ఞతలు.
తొలగించండిఆమె చేత ఉంగరమునిడు చున్న హనుమను చూచిన సీతకు రాముడు (అంగుళీయకము వలన)గుర్తుకు రాగా, అని నా భావము
మూర్తి గారు నేను మీ భావము నూహించాను. కాని మీ మనోజ్ఞమైన భావము పద్యము లో సరిగా ప్రతిబింబించుట లేదనిపిస్తోంది. అంగుళీయకము నంగుళియకమనడము కూడ సరి కాదు.
తొలగించండిఈ సవరణ యొప్పునేమో పరిశీలించండి.
చయ్యన భూజము దిగి హను
మయ్య రఘూత్తమ శుభప్రదాంగుళి ముద్రన్
దొయ్యలి కిడ నందున రా
మయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే
కామేశ్వర రావు గారూ చాలాబాగుందండీ.
తొలగించండినా ఊహను నాకన్నా బాగుగా వ్రాశారు. ఈబ్లాగు
మీవంటివారితో ఒక చక్కని పాఠశాలగా ఉంది.మా అదృష్టం.సుకృతం
నేను కొద్దిగా మార్చి వ్రాశాను.
చయ్యన భూజము దిగిరా
మయ్య శుభకరాంగుళీయకాభరణంబున్
దొయ్యలి కైనిడు నాహను
మయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమే
శయ్యను సిద్ధపరచి తన
రిప్లయితొలగించండినెయ్యపు కాడిని పిలిచెను నెలతయె యపుడే
వుయ్యూరు నుండి వచ్చిన
యయ్యను గని విరహమందె నతివ సహజమే
మీ పూరణ బాగుందండి. నెయ్యపు గాడిని అనండి.
తొలగించండిగురువుగారికి వందనములు
రిప్లయితొలగించండిఅయ్యమునా తటిన్ వరగుణాకర చంద్రుడు వాసుదేవుఁడే
నెయ్యము జూపుచున్ కడు వినిర్మల భావ రసాబ్ధిఁ దేలుచున్
కయ్యములాడుచున్ ప్రణయ గాథల తూలి రమింపజేయు కృ
ష్ణయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
మీ పూరణ యుత్తమముగానున్నది. లాడుచుం బ్రణయ అనండి.
తొలగించండితియ్యని యూహలన్ మునిగి తీరని కోర్కెలు చుట్టు ముట్టగా
రిప్లయితొలగించండిపయ్యెద లాగి, దాగి, పరువంబును దోచగా జూచు మాధవు
న్నెయ్యెడ గాంచ లేక , మరునిన్ తఱుమంగను లేక నేడ్వ, కృ
ష్ణయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
మీ పూరణ చాలా బాగుంది. దోచగ జూచు అనండి.లేకపోతే గణ దోషము. మరునిం దఱుమంగ అనండి.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితియ్యని యల్కకున్మిగుల తీయనిమూలుగు మేళవించి యా
రిప్లయితొలగించండిదొయ్యలి సత్యభామతన దోరపునూర్పులఁహంసదూలికా
శయ్యనుజేరి చిత్తరువు సంగడి లీలగ గేలొసేయు క
న్నయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా"
మీ పూరణ బాగుంది. గేలి సేయు యనా మీభావము?
తొలగించండిఔనండీ, టైపంగు లోదోషం దొర్లింది.
తొలగించండికృతజ్ఞతా పూర్వక నమస్సులు
నెయ్యము ప్రేమగ మార్చగ?
రిప్లయితొలగించండిసయ్యాటగ యవ్వనంబు సరియగు జోడీ
జెయ్యగ|మనసున సంతస
మయ్యెను|గనివిరహ మందె నతివ సహజమే|
2.దయ్యముగాదు సూర్పణఖ |ధైర్యము నిండిన యందగత్తె|రా
మయ్యను గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమేగదా
సయ్యన లెక్కజేయకను సాకుల యందున సాగిపోవగా
అయ్యమ శిక్ష లక్ష్మణుడె నందగ జేసెను రామునాజ్ఞచే.
మొదటి పూరణలో సమస్యను అయ్యెను గా మార్చారు. అది సమ్మతము కాదు.
తొలగించండిమీ రెండవ పూరణ బాగుంది. శూర్పణఖ అనండి.
కయ్యములాడు బాల్య చెలికాడు గనంబడి గుర్తు జేసె నా
రిప్లయితొలగించండినెయ్యపు బాసలన్ని.పరిణీతగ, నేడవి విస్మృతంబయెన్
అయ్యనురాగ.మైన,తన యాత్మగతమ్మున లిప్త మాత్రమే
అయ్యను గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
మీ పూరణ బాగున్నది. బాల్య చెలికాడు దుష్ట సమాసము. తొంటిచెలికాడు అనండి.
తొలగించండిశ్రీ కామేశ్వరరావు గారికి నమస్కృతులు తమరి సూచన మేరకు పద్యమును సవరించు చున్నాను. ధన్యవాదములు.
తొలగించండికయ్యములాడు తొంటి చెలికాడు గనంబడి గుర్తు జేసె నా
నెయ్యపు బాసలన్ని.పరిణీతగ, నేడవి విస్మృతంబయెన్
అయ్యనురాగ.మైన,తన యాత్మగతమ్మున లిప్త మాత్రమే
అయ్యను గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా
చయ్యన పుట్టింటికి జనె
రిప్లయితొలగించండినయ్యాషాఢమ్ము వచ్చినంత సతియు; రా
త్రయ్యెను,కలలో పతి సీ
తయ్యను గని విరహమందె నతివ సహజమే.
మీ పూరణ చాలా బాగుంది.
తొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఆరవ తేదీన మా నాన్నగారి ప్రథమాబ్దికానికి సంబంధించిన ఏర్పాట్లలో రోజంతా వ్యస్తుణ్ణై ఉన్నాను. పైగా శిరోవేదన తగ్గలేదు. పూర్తిగా అలసి ఉన్నందున నేటి పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
చయ్యన పుట్టింటికి జనె
రిప్లయితొలగించండినయ్యాషాఢమ్ము వచ్చినంత సతియు; రా
త్రయ్యెను,కలలో పతి సీ
తయ్యను గని విరహమందె నతివ సహజమే.
వయ్యారి భామ యొక్కతె
రిప్లయితొలగించండిసయ్యాట లాడ దలచిన,సరసుడు చిక్కన్;
చయ్యన తొయ్యలి నాకా
మయ్యను గని విరహమొందె నతివసహజమే.
విద్వాన్,డాక్టర్.మూలె రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రోద్దటూర్.7396564549.
మీ పూరణ బాగుంది. బేసి గణము జ గణమయ్యింది. పరిశీలించండి.
తొలగించండి
రిప్లయితొలగించండికంది శంకరయ్యలకు నా వందనములు
డెందము పులకించి మిగుల చిందు లేసె;
సాహితీ బంధ మిచ్చెను సంద్రమంత
సంబర మ్మహా!యెట్లిది సాధ్య మయ్యె. రెండు రోజుల కిందటి మీ పలకరింతకు నా పులకింత.
నెయ్యంబయ్యెను వనిలో
రిప్లయితొలగించండివియ్యంబందగ తదుపరి విశ్వము నందున్
ఛయ్యన పనికై చను బా
వయ్యను గని విరహమొందె నతివ సహజమో
గయ్యనుచు లేచు యా కృ
ష్ణయ్యనుగనివిరహమందెనతివ సహజమే
ఛయ్యనశౌరిని జూచుచు శౌరి
నయ్యారే యింతవంచనాయంచరిచెన్
మీ మొదటి పూరణ బాగుంది. చయ్యన అనండి. బావయ్య సరికాదు పాపయ్య అనవచ్చు. పేర్ల చివర అయ్య పదము రావచ్చు.
తొలగించండిరెండవ పూరణ లో మూడవ పాదములో శౌరి పద మధికముగా నున్నది.లేచు నా కృష్ణయ్యను, చయ్యన అనండి.
పొయ్యిని నూదియూది పొగ పోరుచు స్నానపు నీళ్ళనిచ్చునే
రిప్లయితొలగించండికుయ్యన కుండ రోజతడు కుంపటి రాజిడి కాఫి పెట్టునే
కయ్యము నేలజేసితిని కన్నడు నేడిక పారిపోవునం
చయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదా