17, నవంబర్ 2016, గురువారం

సమస్య - 2201 (భామా రమ్మనుచు...)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్" 

77 కామెంట్‌లు:

  1. ప్రేమను రంగస్థలమున
    గోముగ భామా కలాప గుణనిక సేయన్
    కోమలి వేషము నుండగ
    భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భామాకలాపంలో స్త్రీవేషధారియైన భర్తను పిలిచినట్లుగా మీ పూరణ బాగున్నది.
      నాట్యము, హారము అనే అర్థాలతో పర్యాయపద నిఘంటువు 'గుణనిక' పదాన్ని పేర్కొన్నా అది అంత ప్రసిద్ధం కాదు. 'గోముగ భామాకలాప కూటమి నుండన్' అనవచ్చు కదా!

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      ప్రేమను రంగస్థలమున
      గోముగ భామా కలాప కూటమి నందున్
      కోమలి వేషము నుండగ
      భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్

      తొలగించండి
    3. గురువుగారూ మీ సవరణకి ధన్యవాదములు.

      తొలగించండి
  2. మా కుమారుని ప్రోద్బలముతో ఆంగ్ల పదములు వాడితిని...క్షంతవ్యుడను...


    రామా! మా పనిమనిషి 'యొ
    బామా' యని పలుకలే 'కొభామా' యనియెన్!
    ఆమే యమెరికనైన 'నొ
    భామా' రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్! 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ మోహిని రూపమునన్
      దామోదరు డమృతమిచ్చి ధరణిని బ్రోవన్
      కామావేశమ్మున రమ
      భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్! 

      తొలగించండి
    2. ఒబామాను ఒభామా మార్చిన మొదటి పూరణ, మోహినీరూపంలో ఉన్న హరిని లక్ష్మి పిలిచిన రెండవ పూరణ బాగున్నవి.
      'ఆమె+ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ 'ఆమెయె' అనండి.

      తొలగించండి
    3. శ్రీ శంకరయ్య గారు:

      శుభాకాంక్షలు! గత రెండు వారాలలో శ్రీ కామేశ్వర రావు గారి సూక్ష్మమైన సూచనలు నాకు చాల ఉపయోగించాయి. మీరిరువుర మార్గదర్శకత్వం మహదానంద దాయకం.

      __/\__

      తొలగించండి
  3. డా.పిట్టా
    ప్రేమాశ్రయ విహరణకై
    సీమాంతర యాత్ర జేయ శీతల గిరులన్
    ఏమా జ్వర తీవ్రత పో!
    భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జ్వరతీవ్రత వల్ల భార్య భర్తను భామా అని పిలిచిందా? పూరణలో స్పష్టత కొరవడినట్లుంది.

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      104 F దాటితే పరాకుగా మాట్లాడుతారు.సన్ని పాత జ్వరం అనే ఊహను ఇమిడించలేక పోయితిని."!" తో ఆవిషయం understood గా ఉండ వలసి యుండెను.Ddrawing లో కావాలని చిత్రకారుడు వదిలిచూపరులను ఆ రేఖను ఊహించేలా చేసి suggestiveness ను పోషిస్తాడు.నేను సఫలత పొందలేదు,ఆర్యా ఏమనుకోకండి

      తొలగించండి
  4. డా.పిట్టా
    సమస్య
    సహగమనమ్ము పద్యమవ సాగె వితంతు వివాహ గద్యముల్
    సతిని యతి గల్పి చంపగ సాగె గద్య......

    రిప్లయితొలగించండి
  5. సుకవివర్యులు కామేశ్వర రావు గారు ఎంతో సహనంతో కవిమిత్రుల పూరణలను విశ్లేషిస్తూ సహాయంచేస్తున్నారు. పండిత నేమానీ గారి పిదప మాకు రెండవ గురువు దొరికినందులకు సంతోషముగా ఉన్నది. కవి మిత్రులు వారి అభిప్రాయాలను గౌరవించి తగిన సవరణలను చేసికొని అనవసర వాదనలను చేయకుండా వృద్ధిని పొందవలెనని వేడు కుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్ర మండలిలోనే విజ్ఞానం పెరుగాలనిblog వారి ఉద్దేశ్యం కదా.Wisdom lies in council అంటుంది సామెత.ప్రశ్నించడం మొండితనం కాదు. కవి తన ఊహ పాఠకునికి ఎలా చేరిందని తెలుసుకో డం ముఖ్యం.పెద్దలతో చర్చించడం జవాబు కొరకే.అది రాలేదంటే లేఖకుడు తప్పు జే‌సినట్లే అని నమ్మి మనం మనల్ని సవరించుకోవాలని నా‌సవినయ భావన,ఆర్యా డా.పిట్టానుండి

      తొలగించండి




  6. కాముని పున్నెమ! వెన్నెల
    గీముని చల్లని సమయము గీరము గానన్,
    మామేనత్త కొమరుడా,
    భామా, రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యాలను కామేశ్వర రావు గారు ప్రశంసించడం చూశాను. సంతోషం!
      మేనత్త కొడుకును భామా అని పిలిచిందా? పూరణలో అన్వయం లోపించినట్లుంది. 'పున్నమ' సాధురూపం.

      తొలగించండి
    2. కందివారు

      నమో నమః ! పుంర్దర్శనం ఆనంద దాయకం !


      భాముడు అంటే బావ అని‌ ఆంధ్రభారతి‌ అర్థం చెబితేను అట్లా వ్రాసానండి - మా మేనత్త కొమరుడా , బావా !



      జిలేబి

      తొలగించండి
    3. 'భాముడు' శబ్దానికి ఉన్న అన్యార్థాన్ని గమనించక వ్యాఖ్యానించాను. మన్నించండి.
      మీ పూరణ అన్ని విధాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ఖం.కోమలి యొక్కతె భర్తతొ
    గోముగ ననె "నీ మనసును గొన్నది యెవరో?
    మామా ! నేనా? మరియా
    భామా? రమ్మ"నుచు ముదిత భర్తను బిలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంబోధనను ప్రశ్నార్థకంగా మార్చి చేసిన మీ పూరణ చాల బాగున్నది.
      'భర్తతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. అక్కడ భర్తను/భర్తకు.. అనవచ్చు. 'మనసున గొప్పది..' అనండి.

      తొలగించండి
  8. భామల మాధవరావును
    భామాయని పిలుతురనుచు భావింపగన్
    కామాతుర భార్యామణి
    భామా రమ్మనుచు ముదిత భర్తను పిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంటిపేరుతో ముద్దుగా పిలువబడే భర్తను గురించిన మీ పూరణ బాగున్నది.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ప్రేమ రసాస్వాదినియై
    కామాతురతో చపలము గల్గిన వేళన్
    నేమము లెంచక కైపున
    భామా! రమ్మనుచు ముదిత భర్తను పిలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రేమరసాస్వాదనతో కైపెక్కిన భార్య ఇంకెలా పిలుస్తుంది? బాగుంది మీ పూరణ.
      'చపలత గల్గిన..' అంటే బాగుంటుంది.

      తొలగించండి
  10. కాముక కీచకు విషయముఁ
    దా మగలకు చెప్పనెంచి ద్రౌపది వరుసన్
    ప్రేమగ బృహన్నలన్ గని
    భామా రమ్మనుచు ముదిత భర్తను పిలిచెన్

    రిప్లయితొలగించండి
  11. భామా విరహము నందున
    కామాతురకాంతయనగ కాంతుడు వెలుగన్
    ప్రేమంజిలిపిగ నవ్వుచు
    భామా!రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిలిపితనంతో భర్తను పిలిచిన భార్యను గురించిన మీ పూరణ బాగుంది.

      తొలగించండి
    2. కృతజ్ఞతలు శంకరయ్య గారు. మీరు అనారోగ్యంతో బాధపడుతు కూడ ఈ పూరణలు సమీక్షించడం కొంత మీ సాహితీపిపొసను సూచించినా దయచేసి మీరు విశ్రాంతి తీసికొంటేనే మా అందరికి ఆనందము,తృప్తి,త్వరగా కోలుకుంటారని. కామేశ్వరరావుగారు చేసే సాహితీసేవ నిజంగా అభినందనీయము. వారికి సర్వదా శతధా కృతజ్ఞతలం. మీ ఆరోగ్యం, మీ కుమారుని ఆరోగ్యం కుదుటబడాలని కోరుతు......

      తొలగించండి
    3. ధన్యవాదాలు. మీ సలహాలను పాటిస్తాను.

      తొలగించండి
  12. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    { ఉ ద య ము సూర్యుని భ ర్త

    ప్రా ర్థి ౦ చే స మ య ము న ౦ దు

    భా ర్య అ త ని ని పి లి చె ను }


    ::::::::::::::::::::::::::::::::::;:;::::::::::


    నీమ౦ బగు భక్తిమెయిన్

    రామయ సూర్యోదయమున ప్రార్థి౦చె నిటుల్

    " సేమము గూర్ప జగతికిన్

    భామా ! ర " మ్మనుచు | ముదిత భర్తను

    . . . . . . . . పిలిచెన్


    :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


    { రామయ = రామయ్య ; భామము =

    కిరణము ; భాముడు = సూర్యుడు ;

    భామా ! = సూర్య భగవానుడా ! }


    ----------------------------------------

    ముదిత భర్తను పిలిచెన్ అనే దానికి ము౦దు

    అపుడు లేదా అత్తరి అనే పద౦ ఉ౦టే

    బాగు౦టు౦ది . క౦దములో స్థలము లేదు .

    పాఠకులు అర్థము చేసుకో గలరు

    -----------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భామ శబ్దానికి ఉన్న సూర్యార్థంతో మీ పూరణ బాగున్నది.
      "సేమ మ్మిడవే జగతికి। భామా!" రమ్మనుచు..." అనండి. కొంత అన్వయలోపం తొలగిపోతుంది.

      తొలగించండి
  13. 15 వ తేదీన ఇచ్చిన సమస్యను పూరించి
    కూడ,ఫోను మొరాయించినందువలన పంప
    లేకపోయాను.ఇప్పుడు పంపుచున్న నా 2వ
    పూరణమును పరిశీలించ ప్రార్ధన.

    ఊటించు నా దళారులు

    నీటుగ వేషమ్ము వేసి నీమము లేకన్

    ధాటిగ సంపాదించగ

    పాటుపడిన వారికెట్లు ఫలితము దక్కున్?

    ( ఊటించు = మోసగించు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దళారుల మాయతో పాటుపడిన వారికి ఫలితం దక్కకపోవడం మనం రోజూ చూస్తున్నదే! చక్కని పూరణ.

      తొలగించండి
  14. గోముగ మగడనియె కలువ
    భామా రమ్మనుచు! ముదిత భర్తను బిలిచెన్
    ప్రేమగ సుధాకరుడనుచు
    యామిని వేళలనె కువలయము విరియుననెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారికి వందనములు. మీ అబ్బాయి, మీరు త్వరలో పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు.

      తొలగించండి
  15. శ్రీమతి శ్రీవారు కలిసె
    నేమో మొగమటుగద్రిప్పి యిట్టుల తుదకున్
    బామాలుచు భర్త పిలిచె
    భామా రమ్మనుచు, ముదిత భర్తను బిలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దంపతులు పరస్పరం పిలుచుకున్నారన్న మీ పూరణ బాగున్నది.

      తొలగించండి
    2. మాస్టరుగారూ ! ధన్యవాదములు.మీ పునర్దర్శనం ఆనందదాయకము.కాని అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోండి. చక్కాని సూచనలు..విశ్లేషణ చేయుచున్న కామేశ్వర రావు గారికి ప్రత్యేక ధన్యవాదములు.

      తొలగించండి
  16. శ్యామామల జల కైరవ
    తామరసాన్విత మధుకర తటినిం గనుమా
    కామద దర్శిత నిర్జర
    భామార మ్మనుచు ముదిత భర్తను బిలిచెన్

    [భామా+ఆరమ్ము=భామారమ్ము; ఆరము = ఒక తటాకము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వైవిధ్యంగా పూరించాలన్న మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ఆరము వైకృత పదం. దానిని భామాతో సంధి చేయవచ్చునా? పరిశీలింపవలసినదే!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
      ఆరము అ కారాంత పుంలింగ పదము.
      దీనికి రంధ్రము, ఒక వృక్షము, అంగారక గ్రహము, శనిగ్రహము, ఒక తటాకము మున్నగు నానార్థములు.
      తటాకము గ కౌషీతకి ఉపనిషత్తు లో ప్రమాణము కలదని సంస్కృత నిఘంటువు చూపుచున్నది.
      అది గమనించియే నేనీ పూరణ చేసితిని. పరిశీలించ గలరు.
      విశేష్యముగ ఇత్తడి, ఇనుము, ముల్లు, కోణము, మూల ఇత్యాది నానార్థములు.

      తొలగించండి
    3. నేను కేవలం ఆంధ్రభారతి నిఘంటుశోధనను ఆశ్రయించి ఆ విధంగా వ్యాఖ్యానించాను. మీ సహేతుకమైన సమాధానంతో తృప్తి చెందాను. ధన్యవాదాలు.
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  17. కవిమిత్రులకు నమస్సుమాంజలి!
    శస్త్ర చికిత్స అనంతరం మా అబ్బాయి మొన్న ఇల్లు చేరాడు. దాదాపు రెండు నెలలు మంచంమీద ఉండాలి.
    నిన్న మా నాన్నగారి ప్రథమ ఆబ్దికం జరిగింది.
    కొన్ని నెలలుగా వస్తూ పోతూ ఉన్న జ్వరం ఇంకా నన్ను వదలలేదు. నిన్న జ్వరంతోనే నాన్నగారి ఆబ్దికం తంతు నడిపించాను. ఈరోజు జ్వరం లేదు కాని నిస్సత్తువగా ఉంది.
    ఇంతకాలం వ్యస్తుణ్ణై బ్లాగుకు దూరంగా ఉన్నాను. ఈ ఏడు సంవత్సరాలలో బ్లాగుకు దూరంగా ఇంతకాలం ఉండడం ఇదే ప్రథమం. మిత్రుల పద్యాలను సమీక్షించడం అటుంచి, కనీసం చదవడానికి కూడా అవకాశం దొరకలేదు. అయినా అందరూ ఉత్సాహంగా పాల్గొంటూ పూరణలు పంపిస్తూ నాకు నూతనోత్సాహాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించారు. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు!
    ముఖ్యంగా పోచిరాజు కామేశ్వర రావు గారు నా పరిస్థితిని సానుభూతితో అర్థం చేసికొని శ్రమకోర్చి మిత్రుల పూరణ పద్యాలను సమీక్షిస్తూ అవసరమైన సవరణలను సూచిస్తూ బ్లాగు కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేలా చేస్తూ వచ్చారు. సమీక్షించడంలో వారు నాకంటె కొన్ని మెట్లు పైనే ఉన్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు. ధన్యవాదములు.
      మీ కుమారులు విశ్రాంతితో పూర్తిగా కోలుకోగలరు. మీ యారోగ్యము జాగ్రత్త.

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. త్వరగా మీ కుమారులు కోలుకోవాలని కోరుకుంటున్నాము.
      మీకునూ త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాము.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారికి, ఫణికుమార్ గారికి ధన్యవాదాలు.

      తొలగించండి
  18. ప్రేమించు 'భర్త'లో 'భా'
    'మామ'గతల్లికినితముని 'మా'తో జేర
    న్నాముగ ప్రణయమునందున
    "భామా'రమ్మనుచు ముదిత భర్తను పిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది.
      తమ్ముని... తముని అన్నారు.

      తొలగించండి
    2. గురువుగారికినమస్కారములు మీ చిరంజీవి కోలుకున్నారని సంతోషము.మీఆరోగ్యము
      నిర్లక్ష్యము చేయవలదు. పద్యమును సవరించితిని.పరిశీలించగోరెదను
      ప్రేమించు 'భర్త'లో 'భా'
      'మామ'గతల్లికి ననుజుని'మా'తో జేర
      న్నాముగ ప్రణయమునందున
      "భామా'రమ్మనుచు ముదిత భర్తను పిలిచెన్

      తొలగించండి
    3. ధన్యవాదాలు.
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. ఏమీ యిట్లo టివి యిట
    భామా !రమ్మనుచు ముదిత భర్తను బిలిచె
    న్గోముగను ముద్దు లొలుకగ
    నీ మా పటి వేళ కనుచు నెంతయొ వేడ్కన్

    రిప్లయితొలగించండి
  20. . “ప్రేమగ భార్యను బిలిచెను
    భామారమ్మనుచు”|”ముదిత భర్తను బిలిచెన్
    కాముకులకు నీయడ్డా
    రామా |యిటు వైపు జూడు రమ్మని గొణిగెన్”.

    రిప్లయితొలగించండి
  21. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఈ
    సమస్యను ఇచ్చినపుడు నేను పంపిన పూరణము.

    భామగ మగడు నటించిన

    డ్రామా చూచిన తదుపరి గ్రామానికి పో

    దామా యని హాస్యముగా

    భామా! రమ్మనుచు ముదిత భర్తను పిలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నటుడైన భర్తను పిలిచినట్లు చెప్పిన మీ పూరణ బాగున్నది.
      (నిజానికి ఈ సమస్యను మీ 'కవితా మంజూష' నుండే స్వీకరించాను).

      తొలగించండి
  22. ధామమునుండి పిలచె పతి
    భామా రమ్మనుచు, ముదిత భర్తను బిలిచెన్
    కాముని పున్నమి దినమున
    సోముని వెన్నెలఁ బరచితి సొగసుల ననుచున్

    రిప్లయితొలగించండి
  23. ఏమీ యల్లరి చేష్టల
    నేమని భరియింపగలను యీ పిల్లల గతు
    లేమీ గడబిడ లికయ
    బ్భా! మారమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్.

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శ్రీ శంకరయ్య గురువుగారికి నమస్కారములు. నాఫోను పాడవడం వలన -మరియు - మీ ఫోను నెంబరును విడిగా వ్రాసుకోకపోవడం వలనను మీతో మాట్లాడలేక పోయాను. క్షమించండి. మీరు, మీకుమారుడు త్వరలో పూర్తిగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. దయతో మీ ఫోను నెంబరును, మీ ఇ-మెయిలు అడ్రస్సును తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  25. కం. ప్రేమగ బిలుచుచు నుందుము
    మా మిత్రుడు భాగవతుల మాధవ గారిన్
    భా.మా.యనుచున్నటులే
    "భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భామగా మారిన భాగవతుల మాధవను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  26. కామించిన దవ్వానిని
    భామగ నటియింప జూచి, పరిణయమాడెన్
    ప్రేమాతిరేక పరవశ
    భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భామగా నటించే భర్తను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. కామాతురుఁడై యొక్కఁడు
    లేమల తగులములఁ గోరి లేకితనమునన్
    బాములఁ నందఁ "దిరస్కృత
    భామా! ర" మ్మనుచు ముదిత భర్తను బిలిచెన్.

    రిప్లయితొలగించండి
  28. గోముగ పిలిచెను భార్యను

    భామా! రమ్మనుచు, ముదిత భర్తను బిలిచెన్

    మామా ! తొందర జెందకు

    నా మదిలో నిలిచినట్టి నవ మన్మధుడా

    రిప్లయితొలగించండి
  29. మామయె నటనకు "భామ"వ
    దామోదరుడొత్తె నీ పదమ్ములు సత్యా!
    నీ మంత్రము నాకు దెలుప
    భామా రమ్మనుచు ముదిత భర్తను బిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నటుడైన భర్తను గురించిన మీ పూరణ బాగుంది.
      భామ+అవ అన్నపుడు సంధి లేదు. "మామయె నటింప భామగ" అనవచ్చు కదా!

      తొలగించండి