కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్"
లేదా...
"వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా"
(కవిశ్రీ సత్తిబాబు గారికి ధన్యవాదాలతో...)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్"
లేదా...
"వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా"
(కవిశ్రీ సత్తిబాబు గారికి ధన్యవాదాలతో...)
మనమున నున్నది తెలుపమి
రిప్లయితొలగించండికనగన్ మగువకు సహజము;కవనము వెసతో
గన గలుగును రవి కననిది
వనితయు గవితయు జనులను వంతల బెట్టున్.
మనమున గల్గు దానినిల మానిను లెన్నడు దెల్ప బోరుగా
రిప్లయితొలగించండికనుగొన శక్యమౌనె యది కంజుని కైనను నెన్నడేనియున్
కనులకు గానకుండునది కావ్యము చప్పున జెప్పునే కదా!
వనితయు కావ్యమున్ జనుల వంతల బెట్టుట సత్యమే కదా !
గుఱ్ఱం జనార్దన రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదాలు శ్రీశంకరయ్య గారు !
తొలగించండినిరాశ్రయా న శోభంతే పండితాః వనితాః లతాః
రిప్లయితొలగించండిధన ధాన్యము లేని నరుడు
వనితను కవితను వలచిన వాపోవునుగా
మనసది మాయర వేమన!
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరాశ్రయా న శోభంతి పండితాః వనితాః లతాః
తొలగించండిThank you venerable sir! I copy-pasted it from Google...'poor cheating'. I don't know Sanskrit at all...
తొలగించండిఆర్యా క్షమించండి నేనే పొరబడ్డాను. ఆత్మనేపదము "శోభంతే" సాధువు. శోభతే శోభేతే శోభంతే (ప్రథమపురుష ఏక ద్వి బహు వచనముల రూపములు)
తొలగించండినిరాశ్రయా న శోభంతే పండితాః వనితాః లతాః
రిప్లయితొలగించండిమనువాడి, మదిని దోచుచు
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టు
న్ననుమానము వలదు సుమీ
మన చిత్తంబును జిలేబి మాయల దేల్చున్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనసును కలచక కవనము
రిప్లయితొలగించండిజనియించదు మరి మునియును జవ్వని చూడన్
దనువు మరచి దాసుడగున్
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్"
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిమనన విహీనపు కావ్యము
గని కనకము ముదిత పొందు కన్నను సుఖమే
మనదను "భౌతికత"న జన
వనితయు గవితయు జనులను వంతలబెట్టున్
కనకము కాంతలున్ చరితకందని గోప్యము వానినంటియే
జనమనముండు లోకమున చర్వితచర్వణలీల; కావ్యమున్
గనెడి జనాళి లుప్తమయె కంఠము దాటని సంస్కృతంబునా
వనితయు గావ్యమున్ జనుల వంతలబెట్టుట సత్యమేకదా!
(కంఠముదాటని॥మ్రింగుడు పడని.మనన విహీనపు॥మాటిమాటికి చదువాలనిపించునట్టిదికానటువంటిది.సంస్కృతము గొట్టు యని అభ్యసన కొరవడి కొరకరాని కొయ్యగా మారి dead language గా పరగణిస్తుండడం.నా॥అన్నట్లు)
మనసది జెప్పిన మాటను
రిప్లయితొలగించండివినకనె బ్రమలోన ముంచు వేయి విధమ్ముల్
వినువీధిని విహరణమున
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్
తను జెప్పెడి హితము మఱచి
రిప్లయితొలగించండిగుణహీనుండగుచు వసుధఁ గూలెడు నాడున్
మనమున గుర్తుకు వచ్చెడు
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్
మనమును, భావము దెలుపక
రిప్లయితొలగించండితనవారిని జేరినపుడు తల భారమ్మౌ
కన మస్తక పుస్తకముల
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్.
వనితా!వినుమీసత్యము
రిప్లయితొలగించండివనితయుగవితయుజనులనువంతలబెట్టున్
మననీయకవిననీయక
యనయముమనమనసుదానుహరియించునుగా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః"
తొలగించండిమన వనితయె మన సంపద
మన కవితయె మనకునిచ్చు మహదానందం
వినుముర తధ్యమ్మిది! పర
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివినుమురరాజశేఖర! వివేకపుబుధ్ధినినీక్షణంబునన్
రిప్లయితొలగించండివనితయుగావ్యమున్ జనులవంతలబెట్టుటసత్యమేకదా
యనయమువారలందరునునాశలుజూపుచునెల్లవేళలన్
మనములబాధవెట్టుచునుమాంద్యునిజేయుదురేకదాసదా
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅనువున ననువగు పదములు
నినుపున నొనయిక బఱచుచు నెఱినిడు విధమున్
పెనుపడ నపుడిట దలచగ
వనితయు గవితయు జనులను వంతల బెట్టున్.
మనసుకు ముదమును కూర్చని
రిప్లయితొలగించండివనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్
పనితనముగల్గు పడతుక
ఘనముగ రసనమును చేరు కవిత శివమిడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఘనపు సమాసమ్ముల నం
తొలగించండిదనపు టలంకరణల విశదపు వ్యాకృతులన్
ఘన వర్ణ నార్థ రతులై
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్
[సమాసము= సంక్షేపము ( ఎక్కువగా మాట్లాడకూడదు), సమాసములు; అలంకరణ = నగలు, అలంకారములు; వ్యాకృతులు = వివరణలు, వ్యాకరణము; వర్ణన = పొగడ్తలు, వర్ణనలు; అర్థము = ధనము, భావము]
సునిశిత దోష శోధకుల సూక్ష్మపుఁ జక్షువు లెల్ల దాటుచున్
మనమున నున్న భావమును మాన్యులు మెచ్చగఁ జెప్ప నొప్పగున్
జనహిత చిత్త మోదకర శబ్ద సుయుక్త నిగూఢ భావ సు
స్వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా
5/11/2015 నాటి “వనితయుఁ గవితయు రెండును...” పద్య రచనాంశము:
తొలగించండివనితయుఁ గవితయు రెండున
వని కుసుమ సదృశులపార భావ నిగూఢుల్
మనముల నలరింతు రిరువు
రు నలంకారప్రియులు గురుతర గమనులే
కనుగొన లేరు,కావ్యమున కమ్మని భావమునందు నున్న యా
రిప్లయితొలగించండిఘనమగు తత్వబోధ లిక,కామిని మెత్తని గుండె లోన దా
గిన తొలి ప్రేమలో పతిని కిమ్మనకుండగ జేయు రీతులున్.
వనితయు కావ్యమున్ జనుల వంతల బెట్టుట సత్యమే కదా!
అనుపమమైన రీతి కడు హర్షము గూర్చెడి కాంక్షతో భువిన్
రిప్లయితొలగించండిఘనతరమైన సద్ధితము కర్మలయందున చూపబూని తా
మనిశము బల్కుచుందు రిక నయ్యది చేకొనలేని దృష్టికిన్
వనితయు గావ్యమున్ జనుల వంతలబెట్టుట సత్యమే కదా
ఘనతరముగ కర్మలలో
ననిశము సద్ధితము బల్కు నతివయు, కావ్యం
బనుచిత మెంచెడి దృష్టికి
వనితయు గవితయు జనులను వంతల బెట్టున్.
హ.వె.స.నా.మూర్తి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅనువగు నణకువ గలిగిన
దనువగు నెలతయు మనవగు ధార్మిక కవితల్
ననిశము నలరించగ పర
వనితయు గవితయు జనులను వంతల బెట్టున్.
అనవరతమ్ముస్వార్థపు ప్రయాణముఁ జేయుచు స్వంతయింటిలో
రిప్లయితొలగించండిపనితనమించుకంతయును వర్తనమందున చూపకుండగన్,
ఘనముగ నాల్కలందునను కమ్మగపల్కక వ్యర్థమైనచో
వనితయు, గావ్యమున్ జనుల వంతలబెట్టుట సత్యమేకదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమనగలవు మాన్యతన్ గన
రిప్లయితొలగించండివనితయు గవితయు; జనులను వంతల బెట్టున్
తన వాదమొకటె సరియని
పెనఁగొను వారల విధంబు వివరించంగన్!
ఘనమైన వంపు సొంపులు
రిప్లయితొలగించండికను విందును జేయనేమి కాఠిన్యతతో
మనసును గ్రుచ్చుచు నిరతము
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్
ఘనమగు సోయగమ్ముల సుగాత్రులె యైనను మర్మ గర్భ భా
వనలను గల్గి చూపరుల భావ రసజ్ఞుల చిత్తమందు ని
ల్చి నభము లోని తారవలె చేతికి చిక్కని భంగి యందకన్
వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ వనితల మదిలోని భావము ( ఉద్దేశ్యము )
పెద్దన పద్దెముల లోని భావము ( అర్థము )
పూర్తిగా తెలుసుకొనుట చాలా కష్టము
సరియైన నేర్పు లేని యెడల > వనిత
సరియైన ఙ్ఞానము లేని యెడల > కవిత
మనలను బాధి౦చి తీరును . }
________________________________________
వనితల మది దాగి యున్న
………… భావము , పెద్దన కావ్య
మున గల జటిలమౌ పద్య
ె
……… ముల భావము కనగ తరమె ?
( 1 ) చతురత లేకున్న యెడల ,
…… ( 2 ) ఙ్ఞానము లేకున్న యెడల
( 1 ) వనితయు ( 2 ) కవితయు జనుల
……… వ౦తల బెట్టున్ నిజముగ !
___________________________________
వనితల మనసులు తెలియగ
రిప్లయితొలగించండిజనులకు వశమే? కవితల సాగరమందున్
మునుగగ లోతున్ దెలియునె?
వనితయు గవితయు జనులకు వంతల బెట్టున్.
కనులకుగనబడు సత్యము
రిప్లయితొలగించండివనితయు,గవితయు జనులకు వంతలబెట్టున్
అనవరతము విశ్లేషణ
ధన కాంక్షలమధ్య నలుగు ధర్మము లేకన్
2.మనుగడ యందు మంచి పరిమాణముదెచ్చెడి మానవత్వమే
గనబడ నీయకన్ మనిషి కల్మష బుద్దుల కాలయాపనే
దినసరి చర్యగా జరుప?దీనత యందుననిల్ప బూనుచున్
వనితయు గావ్యమున్ జనుల వంతలబెట్టుట సత్యమేగదా|
మనమున మధురోహ లొడమ
రిప్లయితొలగించండివనితయు కవితయు జనిల వంతల బెట్టున్
ననియెడు పలుకులు కల్లలె
యనుచును విపరీతమౌను యాలోచింపన్.
మనసొంతంబయి నట్టి క
వనంబును,వనితయుమనకు పంతురు ప్రేమన్
ననయము యాపద లగు పర
వనితయు కవితయు జనుల వంతల బెట్టున్.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఉదయం నుండి విపరీతమైన శిరోవేదన కారణంగాను, మరొక ఐదు రోజులలో జరుగనున్న అష్టావధానానికి ఏర్పాట్లు చేయడంలో వ్యస్తుడనై ఉన్న కారణంగాను మీ పూరణలను నిశితంగా పరిశీలించలేక పోతున్నాను. మన్నించండి.
ఈనాటి సమస్యలకు చక్కని పూరణ లందించిన...
పిట్టా సత్యనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
ప్రభాకర శాస్త్రి గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
క్రొవ్విడి వెంకట రాజారావు గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
పోచిరాజు కామేశ్వర రావు గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
శిష్ట్లా శర్మ గారికి,
విరించి గారికి,
గురుమూర్తి ఆచారి గారికి,
పిన్నక నాగేశ్వర రావు గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
డా. బల్లూరి ఉమాదేవి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
అనితరసాధ్యము కవితల్
రిప్లయితొలగించండికనికరమున వ్రాయగల్గు కవులకు ప్రేరణ
కనియగు వనితన్ జూచిన
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్
తనసతి యలుగుచు పరుగిడ
రిప్లయితొలగించండిననిరుద్ధుడు పాట్లు పడడె నరునిగ భువిపై,
ఘన సంస్కత కవిత యటులె;
వనితయుఁ గవితయు జనులను వంతలఁ బెట్టున్
నిన్నటి సమస్యకు పూరణము
భూతల వాసిగా హరియె భూతల స్వర్గమునన్ విరక్తుడై
రాతిగ మారి నిల్వ, తన రాజును గూడగ వచ్చి కొండపై
రాతిని గూడినట్టి చెలి రాతిగ మారె నదేమి చిత్రమో
చూతమటన్న విగ్రహపు శోభను గాంచగనీరు సేవకుల్
కనుముర కాకతీయ కవి! కన్నెను గాంచగ ముచ్చటాయెనా!
రిప్లయితొలగించండివినుముర మంచి మాటలివి వీడుము కావ్యపు మోహమున్నహో...
అనువుగ మల్చ లేరిచట నమ్మిని బొమ్మను పద్దెమున్నురా!
వనితయుఁ గావ్యమున్ జనుల వంతలఁ బెట్టుట సత్యమే కదా!