కృష్ణా రావు గారు మీ పూరణ బాగుంది. రెండవ పాదములో గణ దోషము. "రామచంద్రు పదము" అన్నప్పుడు "ద్రు" మీద నర్థానుస్వార మక్కర లేదు. రామచంద్రుని యొక్క పదములని కదా మీ భావన.
సంపత్ కుమార్ శాస్త్రి గారు మీ సీసపద్య వర్ణన మనోహరము. పూరణముత్తమము. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము వేసినట్లు యీ చిన్ని నాలుగు మాటలకు నంత పెద్ద పద్యము! దత్త పదముల నెంత చిన్న పద్యము లో కూర్చితే యంత ప్రజ్ఞ! రాక్షసరిపు లంటే సుర లనుకొనే ప్రమాదము కూడ నున్నది.
కవిమిత్రులారా! మా అబ్బాయికి రేపు కాని ఎల్లుండి కాని శస్త్రచికిత్స జరుగుతుంది. ఇంటికీ హాస్పిటల్‍కు తిరగడం తోనే సరిపోతున్నది. మీ పూరణలను చదువుతున్నాను కాని, స్పందించలేకపోతున్నాను. మన్నించండి. మరొక మూడు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. ******** పోచిరాజు కామేశ్వర రావు గారూ, నా పరిస్థితిని సానుభూతితో అర్థం చేసికొని మిత్రుల పూరణలపై స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు! మీ సహకారం ఇలాగే కోనసాగించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.
ఇప్పుడే శ్రీ వూలపల్లి సాంబశివరావు గారి ద్వారా వార్త తెలిసి ఈ మీ సందేశాన్ని చూశాను. ఈశ్వరానుగ్రహం వల్ల సర్వం సానుకూలమై బాబు సత్వరం కోలుకోవాలని, మీకు చిత్తస్థైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాము.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి చరణారవిందములకు నమస్సులు. ఆర్యా మీ కుమారునకు శ్రీపరమేశ్వరుని అనుగ్రహమున శస్త్ర చికిత్స విజయవంతమై ఆయురారోగ్యములు కలుగవలెనని పరమేశ్వరుని ప్రాథించుచున్నాను.
గడుసరియగు దాసి గమనించి కైకమ్మ
రిప్లయితొలగించుపదము లొత్తుచుండి పలికె నిటుల:
"బానిసత్వ మౌను భరతునకును నీకు
రాముడవగ రాజు రాజ్య మునకు!"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుశాస్త్రి గారు మీ పూరణ యద్భుతముగానున్నది.
తొలగించుహనుమంతుడు రావణునితో:
రిప్లయితొలగించుసరిరారెవ్వరు రామచంద్రునకునున్ సంగ్రామమందున్ ధరన్
శరణమ్మొందగ మంగళంబగును నీ సామ్రాజ్యమందెప్పుడున్
నిరసింపన్ హరిమాటగా తెలుపగన్ నీవాపదల్ గోరుటౌ
చరితంబెన్నక సాగినంత చ్యుతి నిస్సందేహమౌ నీకనిన్
ఊకదంపుడు గారు మీ పూరణ చాలా బాగుంది. "జరితం.." అంటే బాగుంటుంది.
తొలగించుడా.పిట్టా
రిప్లయితొలగించుసరిరారెవ్వరు నిన్ను బోల్చ గమ కాత్సౌ జన్యశీలంబులన్
నెరి మూటన్ సిరిగట్టి బంచితివితన్నీమాలు నీసన్నలున్
నర జన్మం గను వేదమంత్రపు పదాల్ నారాయణుండౌటకే
వర విద్యార్థములయ్య పుణ్యఫలమున్ వాసిన్గనన్ రాఘవా!
డా.పిట్టా వారు మీపూరణ బాగుంది. "పోల్చగమకాత్సౌజన్యశీలంబులన్" అర్థము కాలేదండి.
తొలగించుతన్నీమాలు: నీమము తెలుగు మాట కదా.
రామా! నీసరి రక్షకుల్ గనమిలన్ రమ్యాతిరమ్యంబు నీ
రిప్లయితొలగించునామంబే గమనించినాడ పలుకన్ నాకిమ్ము సామర్ధ్య మో
స్వామీ! నీపదసన్నిధిం నిలుచు సద్భాగ్యమ్ము ప్రాప్తించినన్
నీమంబూని సదా చరింతు ననియెన్ నిష్ఠంగపీంద్రుడటన్.
హ.వేం.స.నా.మూర్తి.
మూర్తి గారు మీ పూరణ చాలా బాగుంది. "నిష్ఠంగపీంద్రుండటన్" అనుకుంటా.
తొలగించుఅవునండీ. సున్నా పడలేదు. ధన్యవాదాలు.
తొలగించు
రిప్లయితొలగించుసరిలేరెవ్వరు రాముని
శరవేగపు గమకములకు, చంపెను నొక బా
ణరవమున వాలిని పరా
త్పర పదములవి గొని సఖుని తత్వము గనవే !
జిలేబి
జిలేబి గారు మీ పూరణ బాగుంది. బాణ రయమున అంటే బాగుంటుందేమో?
తొలగించుకొసరి తినిపించె ముచ్చటఁ గొరికి చూచి
రిప్లయితొలగించుపళ్ల తీపిని గమనించి పడతి శబరి
పదమునంటెడు భాగ్యమ్ము ముదము నీయ
నవని సద్గుణ రాముండు నాదరమున
సహదేవుడు గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించుసరి యేడు తాళము లవే
రిప్లయితొలగించువరుసగ మరి చూడు మొక్క వాడిశరమునన్
నరుకుము పద వానిని నీ
యురవడి గని సంతసింతు నో రఘురామా.
మిస్సన్న గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుకొసరి కొసరి వినదగు గద
రిప్లయితొలగించువిసుగన్నది లేక ముదము వెస గమకింప
న్నసమమగు జ్ఞాన సంపద
నిసర్గముగ రామ కథయె నిరతము మనకున్.
జనార్దన రావు గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించుధన్యవాదాలు కామేశ్వర రావు గారూ !
తొలగించుమీ పదసంపదలో ఓ పది శాతం మాకివ్వరా ?
జనార్దన రావు గారు ధన్యవాదములు. ఆంధ్ర వాఙ్మయము మహా సముద్రము వంటిది. అది యందరికి నందుబాటులోనే యుంటుంది. ఎవరి యిష్టానుసారము వారు తోడు కోవచ్చునండి.
తొలగించునిజమే !
తొలగించుకొసరి కొసరి యా పండ్లను కొరికి చూచి
రిప్లయితొలగించుశబరి యందించగ మధుర శాకమనియె!
గుహుడు కోరిన పదసేవ బహుమతిచ్చె!
యట్టి రాముని సన్నిధి నందె నుడుత!
శ్రీధర రావు గారు మీ పూరణ బాగుంది. నట్టి రాముని అనండి.
తొలగించుజిత ఘన కేసరి గమ నాం
రిప్లయితొలగించుచిత పద పంకజ నిసర్గ చిత్తానందాం
కిత సత్య ధర్మ పాలన
ధృత విక్రమ యాతుధాన ధృతి హర! రామా!
వ్యాఖ్యానించే అర్హత లేకున్నా ఆస్వాదించే మనసున్నది కాబట్టి చెబుతున్నాను. అద్భుతం!
తొలగించుజనార్దన రావు గారు ధన్యవాదములు. ఎవరి దోషములు వారికి తెలియక పోవచ్చును. నా పూరణను మీరు సమీక్షింప సమర్థులే.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుసరి గమ పద నిస లందున
తొలగించుస్వర మేళనమొంది రమ్య సారస్వతమై
వరమయె లవకుశుల గళా
ధ్వరమై రామాయణంబు పరమాద్భుతమై!
శర్మ గారు కళాధ్వరమనా లేక గళాధ్వరమానా మీ భావము?
తొలగించుగళాధ్వరమని నా అభిప్రాయం .... ఒప్పునా?!(గాత్ర యజ్ఞమని నా ఉద్దేశ్యం)
తొలగించుశర్మగారు మీ పూరణ మనోహరముగానున్నది.
తొలగించుగాత్రమును యజ్ఞమనడము సరికాదేమో? యజ్ఞమొక క్రియ కదా. సంగీతకళను యజ్ఞముగా భావించ వచ్చును. అప్పుడు "లవకుశుల కళా" అనాలి.
ఆయెను, అయ్యెను లు సాధువులు. అయె వ్యావహారికము. "వరమయ్యె లవకుశ కళా / ధ్వరమై" యన్న నొప్పును.
ధన్యవాదములు... కామేశ్వర రావుగారూ....మీ సవరణకు కృతజ్ఞతలు ..... పద్యాన్ని సవరిస్తాను..... నమస్సులు.
తొలగించుసవరించినది:
తొలగించుసరి గమ పద నిస లందున
స్వర మేళనమొంది రమ్య సారస్వతమై
వరమయ్యె లవకుశ కళా
ధ్వరమై రామాయణంబు పరమాద్భుతమై!
కొసరి రమ్మని పలుమార్లు గోరుచుండి
రిప్లయితొలగించురాముని సహోదరు డానాడు రామచంద్రుఁ
పదములను బట్టె ; గమనించి పాదరక్ష
లను, గొని మరలె భక్తకి లక్ష్యమనగ
కృష్ణా రావు గారు మీ పూరణ బాగుంది. రెండవ పాదములో గణ దోషము. "రామచంద్రు పదము" అన్నప్పుడు "ద్రు" మీద నర్థానుస్వార మక్కర లేదు. రామచంద్రుని యొక్క పదములని కదా మీ భావన.
తొలగించురాముని పదసేవను జేయు బ్రేమ గలిగి
రిప్లయితొలగించునాతని సమీప మునజేరి యాశతో డ
కొసరి కొసరియారా మునకు శబ రియట
యంది యీయగమధురమైన ట్టి పండ్ల
నార గించెను బ్రియమున నాత డపుడు
అన్నయ్య నీ పూరణ చాలా బాగుంది. "యట / నంది యీయగ" అనాలి కద. అచ్చట యను నర్థమున ద్రుతాంతము.
తొలగించురావణునకు విభీషణుడు హితవాక్కులు చెబుతున్నట్టుగా నూహించి
రిప్లయితొలగించుగమనింపుము రాముని తో
సమరము సరికాదని, సతి సద్గుణ వతియౌ
ప్రమదను రాఘవు జేర్చి ప
దముల శరణువేడినంత దయజూపుగదే
విరించి గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించుసరిలేని శస్త్రాస్త్ర చాపయుద్ధోద్ధతిన్
రిప్లయితొలగించు.......... ఋషియజ్ఞమును గాచె రిపులజంపి
కఠినశాపమున నిర్గమనయైన యహల్య
.......... కును నిజరూపంబు కోరి యిచ్చె
శివధనుర్భంగ విశేష కార్యము సల్పి
.......... జానకీప్రేమకాస్పదము జూపె
తండ్రియాజ్ఞానిబద్ధతజేత వనవాస
.......... మున ముని సన్నిభ మూర్తి యయ్యె
కపులుతో గూడి రాక్షస రిపుల జంపె
నిగమ వందిత భూజాత వగపు దీర్చె
పరమపదమైన భక్తిభావమ్ము నిచ్చె
మదిని సతతమ్ము నెలకొని ముదము గూర్చె.
సంపత్ కుమార్ శాస్త్రి గారు మీ సీసపద్య వర్ణన మనోహరము. పూరణముత్తమము.
తొలగించుపిచ్చుక మీద బ్రహ్మాస్త్రము వేసినట్లు యీ చిన్ని నాలుగు మాటలకు నంత పెద్ద పద్యము!
దత్త పదముల నెంత చిన్న పద్యము లో కూర్చితే యంత ప్రజ్ఞ!
రాక్షసరిపు లంటే సుర లనుకొనే ప్రమాదము కూడ నున్నది.
గురువులు శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి వందనములు. మీ సూచన శిరోధార్యము.
తొలగించుధన్యోస్మి.
సమర కేసరి వాలిని సంహరించె
రిప్లయితొలగించుసచ్ఛరాసన నిర్గమ శరము తోడ
నల రుమా పతి యాపద తొలగి పోవ
ధరణిజా పతి, వాని సదా స్మరింతు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించువిజయ కుమార్ గారు మీ పూరణ చాలా బాగుంది. ధరణిజపతి సాధువు.ధరణిజేశుడు అంటే బాగుంటుంది.
తొలగించుధన్యవాదాలు కామేశ్వర రావు గారూ!
తొలగించుగడుసరి యగు నగ్రజుతో
రిప్లయితొలగించుతడబడక విభీషణుండు తద్యత్నంబున్
విడువగ మన్ననలందుచు
నొడయని సత్పదము లోన నుండగ బలికెన్.
సరియగు సీతను బంపుట
సురవైరీ!మోక్షపదము సుగమము చేయున్
గురుముని సమ్మత మిది నీ
కరయంగా రామచంద్రు డతి హర్షమునన్.
హ.వేం.స.నా.మూర్తి
మూర్తి గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి. దడబడక అంటే బాగుంటుంది. ద్రుతసంధి నిత్యము.
తొలగించుసరి యెవరు జగ మందలి జనపదముల
రిప్లయితొలగించుగజగమన ధరణిజకు చక్కదనమందు
రాఘవుని సహధర్మిణి కడు రమణకెక్కె
కష్టములఁగొని పతితోడ కానలందు
సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ బాగుంది. "కడు" తీసేయండి. ఉంచితే గణములకు కడు కీడు.
తొలగించుThank you sir.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించుహరియె రాము డనెడి సరిసత్తు గమనించి
రామ పదముల దరి గోము గలిగి
భక్తి దోడ రామ బానిస యౌచును
భక్తులందు హనుమ భవ్యు డయ్యె.
రాజారావు గారు మీ పూరణ బాగుంది.
తొలగించురామ బానిస సమాసము సరి కాదు. కేవల సంస్కృత శబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు. రాముబానిస అనవచ్చు.
పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీసూచనను తప్పక పాటిస్తాను. కృతజ్ఞతలు.
తొలగించురావణవధానంతరం విభీషణుడు తోడ్కొని వచ్చిన సీతను చూడుమని హనుమంతుడు రాముని వేడుకుంటున్నాను.
రిప్లయితొలగించుత్రిదివౌకస రిపు మర్దన!
మదనాగ మణి ప్రకాశ మకుట ధరా! యా
పద గడచి వచ్చె సీతమ
సదయా! మునిసన్నుత పద! సరగునఁ గనుమా!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అద్భుతమైన పూరణ. శ్రీరామచంద్రుని దయ వలన మీ కష్టములు శ్రీఘ్రమె కడతేరాలని మా యాకాంక్ష.
తొలగించుకవిమిత్రులారా!
రిప్లయితొలగించుమా అబ్బాయికి రేపు కాని ఎల్లుండి కాని శస్త్రచికిత్స జరుగుతుంది. ఇంటికీ హాస్పిటల్‍కు తిరగడం తోనే సరిపోతున్నది. మీ పూరణలను చదువుతున్నాను కాని, స్పందించలేకపోతున్నాను. మన్నించండి.
మరొక మూడు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను.
********
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
నా పరిస్థితిని సానుభూతితో అర్థం చేసికొని మిత్రుల పూరణలపై స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు! మీ సహకారం ఇలాగే కోనసాగించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యభీష్టము మేర నా శక్తి కొలది ప్రయత్నిస్తాను.
తొలగించుమాన్యులు శ్రీ శంకరయ్య గారికి
తొలగించునమస్కారములతో,
ఇప్పుడే శ్రీ వూలపల్లి సాంబశివరావు గారి ద్వారా వార్త తెలిసి ఈ మీ సందేశాన్ని చూశాను. ఈశ్వరానుగ్రహం వల్ల సర్వం సానుకూలమై బాబు సత్వరం కోలుకోవాలని, మీకు చిత్తస్థైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాము.
శం భవతు.
కందము:సొగసరి రఘుకులతిలకుదు,
రిప్లయితొలగించునిగమముల కెరుకపడవతని పదకమలముల్
తగులగ శిల మగువగునని
సగుణుని బొగడగ దొరకును శమము నెలమినిన్
తిమ్మాజీ రావు గారు మీ లఘుతమ కంద పూరణ మత్యంత మనోహరముగా నున్నది.
తొలగించుశ్రీ కామేశ్వరరావు గారికి ధన్యవాదములు
తొలగించుభక్తుడైనను సరి గాని రక్తి గోరి
రిప్లయితొలగించునిగమ రూపుని చేతిలో నిహతు డయ్యె
దశముఖుడు, పౌరుల నాపదలు తొలగగ
రమ్యరీతిని సత్కీర్తి రామ విభుడు
శ్రీరామా రావు గారు మీ పూరణ బాగుంది. మూడవ పాదములో యతిగణ దోషములు.
తొలగించు"దశముఖుండు,ముని గణాపదలను తీర్చె" అన్న సరి పోవును.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించుకేసరినందనుండు జయగీతము బాడుచు నార్ద్రనేత్రుడై
కోసల రాజనందనుని కోమలమున్ గమనించి మ్రొక్కుచున్
బాసల జేసి రామపదపద్మములన్ మదినిల్పి ధీరతన్
భూసుత జాడ గన్ గొనగ పూని సముద్రము దాటె నత్తరిన్
శ్రీపతి శాస్త్రి గారు మీ పూరణ ప్రశస్తముగానున్నది.
తొలగించుగురువర్యులు శ్రీ కామేశ్వరరావు గారికి నమస్సులు, ధన్యవాదములు.
తొలగించురామ పదమంటి ప్రణమిల్లి రయము తోడ
రిప్లయితొలగించునాతని సతి జాడ నెఱంగ నలసటనక
గడసరి పవన సుతుడంత కడలి దాట
కదలె వాయువేగ మనోవే గాన కపియు
విరించి గారు మీ పూరణ బాగుంది. నాల్గవ పాదములో గణ దోషము. గడుసరి సాధువు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుమూర్తి గారు దత్త పదములన్ని చక్కగా కుదిరినవి.
తొలగించుపద్యము మధ్యలో నచ్చులను బ్రయోగించ దగదు. నాగమ, నాపద అనిన సాధువు.
ఆపదల నుపదల (కానుకలు) సేయు పదప్రయోగము సముచితముగా లేదనిపించు చున్నది.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించు[అశోకవనంలో హనుమంతునితో సీత పలికిన సందర్భము]
"కేసరి సుత! శ్రీరామున
కీ సంగతి సుగమముగను నెఱుకపఱచియున్,
వాసిగఁ బతిపదయుగళిని
నీ సీతయె నమ్మె ననుమ నెమ్మిని సదయన్!"
స్వస్తి
తే.గీ.
తొలగించు[2]
కేసరి సుతుండు సని జానకిఁ గని యంగు
ళీయక మ్మిడ, గమనించి, "యోయి హనుమ!
వేగ నా యాపదను మాన్ప వేడెద! నిఁక,
రావణుని సమయింపఁగ రమ్మను"మనె!
కవి పుంగవులు మధుసూదన్ గారు మీ రెండు పూరణలందు నిస్పక్షపాతముగా నాలుగు పదములను నాల్గు పాదములలో కూర్చినారు.
తొలగించుగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
{ శూర్పనఖ రామునితో అన్న మాటలు }
సరి లేరెవ్వరు నీకు | వేగమ పరిష్వ౦గమ్ము
………… లోనన్ ననున్
గరగి౦పన్ వడి రమ్ము | శూర్పనఖ
……… యాగ౦ జాల | దో రామ ! నీ
పురుషత్వ౦బున కేను బానిస | నికన్
………… బోనాడు మా జానకిన్ |
దరికిన్ జేరుమ , జా గదేల | పద ! --
…………… దివిద్వారాన నిన్ జేర్చెదన్ |
గురుమూర్తి ఆచారి గారు మీ పూరణ చాలా బాగుంది.
తొలగించుశూర్పణఖ మీద కోపమును చేటనఖను (శూర్పనఖ) చేసి తీర్చుకున్నారా!
నాల్గవ పాదములో గణ దోషము.
...జా గదేల పద స్వర్ద్వారాన...అంటే సరి!
తొలగించుఇలను కే'సరి'సుతు 'సరి' యెవ్వరనుచు
రిప్లయితొలగించునా 'గమ'ని'గమ' నిపుణుడు నాతడనుచు
నా'పద'లఁ బా'ప ద'గునీత డాఢ్యు డనుచు
రాముడిత'ని స'ఖుడ'ని స'రసన జేర్చె
కామేశ్వరరావుగారూ, ఔనండీ, మీరన్న తరువాత నాకునూ ఔచిత్యంగా లేదనిపించింది.మార్చి వ్రాశాను. చిత్తగించండి
బాగుందండి.
తొలగించు
రిప్లయితొలగించుకొసరి కొసరి పెట్టె కోమలి శబరి తా
నిగమవేద్యుడైన నీరజాక్షు
పదకమలము నంటి భక్తితో ఫలములు
తనిసతండు మెచ్చె ధరణి యందు.
కేసరి తనయుడప్పుడా సముద్రము దాటి
నిగమములకు దొరకు నేత దలచి
ధరణిజ పద ములకు తలవంచు మ్రొక్కుచు
గాంచె నవనినిసరిగాను కపుడు.
డా. ఉమా దేవి గారు మీ మొదటి పద్యములో తనిసి_అతండు= తనిసియతండు అవుతుంది. యడాగమము. క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.అప్పుడు నిస పదము మరుగవుతుంది.
తొలగించురెండవ పద్యము మొదటి పాదములో "తనయుడపుడా" అనండి లేకున్నగణదోషము. అవనిని గాంచుట: భావము కూడా సంతృప్తికరముగా నున్నట్లు లేదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుముక్త సరిగమ హిజబల్కె మూర్ఖుఁజూచి
రిప్లయితొలగించు"నీ పదనిస ర్గముదెలిసె, నీకు మృత్యు
దర్శన సమయము మిగుల దగ్గరయ్యె
శఠము వీడి రామచరణ శరణు గొనుమ
మూర్తి గారు మీ పూరణ బాగుంది. మహీజ సాధువు.
రిప్లయితొలగించునీ సరి సాటి లేరు మహి నిక్కము జూడగ మర్త్యసింహమా
రిప్లయితొలగించుబాసను సేయుచుంటి నిక భక్తిగ మ్రొక్కుచు నీ పదంబులన్
వేసట లేకనేనిచట వేడుక నుండెద నీదురాకకై
వాసిగ నంది గ్రామమున బానిస రీతిగ వేచియుండెదన్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి చరణారవిందములకు నమస్సులు. ఆర్యా మీ కుమారునకు శ్రీపరమేశ్వరుని అనుగ్రహమున శస్త్ర చికిత్స విజయవంతమై ఆయురారోగ్యములు కలుగవలెనని పరమేశ్వరుని ప్రాథించుచున్నాను.
రిప్లయితొలగించు