కాకతీయ పద్య కవితా
వేదిక, వరంగల్
అవధాన రాజహంసిని, శతావధాన
విశారద
కుమారి పుల్లాభట్ల నాగశాంతి
స్వరూప గారిచే
(తెలుగు అధ్యాపకురాలు, ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, రాజమహేంద్రవరము)
అష్టావధానము
వేదిక : రైజింగ్ సన్ హైస్కూల్, వాసవి కాలనీ రోడ్, కొత్తవాడ, వరంగల్
తేదీ : 04-12-2016 (ఆదివారం); సమయం
: ఉదయం 10-00 గం.లకు.
అధ్యక్షులు : Ln. తమ్మెర లక్ష్మీనరసింహరావు గారు,
MJF., T 20 F.,
సమన్వయ కర్త : డా॥ ఇందారపు కిషన్
రావు గారు, (ప్రముఖ అష్టావధాని)
ముఖ్య అతిథి : శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, (ప్రముఖ పద్యకవి)
విశిష్ట అతిథి : డా॥ టి. శ్రీరంగస్వామి
గారు, (శ్రీలేఖ సాహితి, వరంగల్)
పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి : శ్రీ గుండు మధుసూదన్ గారు
సమస్య : శ్రీ జీడికంటి శ్రీనివాస మూర్తి గారు
దత్తపది : శ్రీ కంది శంకరయ్య
వ్యస్తాక్షరి : శ్రీమతి బోయినిపల్లి రాధ గారు
వర్ణన :
డా॥ పాతూరి రఘురామయ్య గారు
ఆశువు : శ్రీ చేపూరి శ్రీరామ్ గారు
ఘంటావధానము : చి॥ యం. వెంకటలక్ష్మి
అప్రస్తుత ప్రసంగము : డా॥ పల్లేరు
వీరస్వామి గారు
అందరూ ఆహూతులే!
ప్రాయోజకులు :
శ్రీ రామడుగు షణ్ముఖాచారి గారు,
ప్రిన్సిపాల్, రైజింగ్
సన్ హైస్కూల్, వరంగల్.
అవధానము దిగ్విజయంగా జరుగుగాక...అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండికాకతి కవితా వేదిక
కాకలు మరి దీరినట్టి కవిపృచ్చకులే
కాకగ నడుగగ, వేడిగ
కాకను, చల్లగ వధాని కైతల జెప్పున్.
గురువుగారూ, అదృష్టవశాత్తు నా విదేశీయానం ఇంకా ఖరారు కాలేదు. కావున నేను తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఆహూతులు అన్న మాట కన్నా అహ్వానితులు అనటం బాగుంటుందండి.
రిప్లయితొలగించండిశ్యామలీయం గారూ,
తొలగించండిధన్యవాదాలు!
ప్రింటు చేసిన ఆహ్వాన పత్రికలలో 'ఆహ్వానితులు' అనే వేశాం. ప్రముఖ అష్టావధాని డా. ఇందారపు కిషన్ రావు గారు ఆ పత్రికను చూసి 'ఆహ్వానితులు' అనే పద ప్రయోగం తప్పు అనీ, అక్కడ 'అందరూ ఆహూతులే' అని కాని 'అందరికీ ఆహ్వానం' అని కాని ఉండాలన్నారు. ఆంధ్రభారతి నిఘంటు శోధనలో 'ఆహూతుడు = పిలువబడినవాడు' అని ఉంది. 'ఆహ్వానితుడు' అన్న పదం లేదు. దీని విషయమై కొంత వ్యాకరణ చర్చ అవసర మనుకుంటాను.
నాగశాంతిగారినందనోద్యానక
రిప్లయితొలగించండివనపువేదికనలరునటువంటి
కందిశంకరయ్యగారికివందన
శతములిచ్చుచుంటిసాదరముగ