5, నవంబర్ 2016, శనివారం

సమస్య - 2190 (దేవుఁడు లేనెలేఁడని....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్"
లేదా...
"దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్"

103 కామెంట్‌లు:

  1. బ్రోవుమనగఁ గరిఁ గాచెను
    సేవించి తనే కుచేలు సేమము జూచెన్
    దేవుండగు హరి మించెడు
    దేవుడు లేఁడనుచు నమ్మి తిరముగ గొల్తున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      "దేవుడగు హరిని మించెడు" అనండి. బాగుంటుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:బ్రోవుమనగఁ గరిఁ గాచెను
      సేవించి తనే కుచేలు సేమము జూచెన్
      దేవుఁడగు హరిని మించెడు
      దేవుడు లేఁడనుచు నమ్మి తిరముగ గొల్తున్

      తొలగించండి
  2. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నా భూయ: !
    అజో నిత్య: శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ||             (భగవద్గీత 2:20)


    "నీవే చెప్పితివి గదర!
    చావే లేదనుచు నాకు చక్కగ కృష్ణా!
    తావేల శంకకిక? యమ
    దేవుఁడు లేఁడనుచు నమ్మి! తిరముగఁ గొల్తున్!"

    రిప్లయితొలగించండి
  3. దేవేశుని గొలిచిన మది
    భావా వేశమును పొంది భక్తిగ నుండన్
    సేవా తత్పరత మించిన
    దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగ గొల్తున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యగారు మీ పూరణ యూహ బాగున్నాయి. మూడవ పాదములో గణదోషము. సేవా తత్పరు మించిన అనండి.

      తొలగించండి
    2. దేవేశుని గొలిచిన మది
      భావా వేశమును పొంది భక్తిగ నుండన్
      సేవా తత్పరు మించిన
      దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగ గొల్తున్

      తొలగించండి

  4. కోవెల లోమాత్రమ్మే
    దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్
    నీ వునికి యెల్లెడెలగద!
    నీవే హృదయపు జిలేబి నెలతాల్పుగనన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి వందనములు. మీ అబ్బాయి కాలికి తగిన చికిత్స సక్రమంగా జరిగి త్వరలో పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  6. దైవము సకల చరాచర
    జీవులలో సతతము నివసించుట నెఱుగన్
    కావగ మనలను మఱియొక
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారు మీపూరణ బాగుంది. గావగ అనండి. ద్రుతసంధి నిత్యము.

      తొలగించండి
  7. డా.పిట్టా
    జీవుడ! దేవుడీవయని జెప్పగ వింటి "జగంపుటాటలో
    పావులరయ్యు ద్వైతమును భావన జేయకు"డన్న "మాయ"యే
    చావుల జూపి కష్టముల జాలగ గూల్చగ "నాకు నీవె" యే
    దేవుడు లేనె లేడని మదిన్ నెరనమ్ముచు గొల్తు భక్తితోన్ (పరస్పర మానవ సహకారం)"నాకు నీవె".
    పాశ్చాత్య పోకడలో:
    భావనలు వేరు బ్రకృతిని
    చావులకున్ పుట్టుకలకు సాక్షిగ గనమే
    దీవెననిడు నా శక్తియె
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్!

    రిప్లయితొలగించండి
  8. భావనలోన యత్నమున బల్కులయందున నొక్కరీతి సం
    భావన జేసి దీనులకు భాగ్యవిహీనుల కెల్లవేళలన్
    సేవలు చేయుచుండినను క్షేమము లందగ జేయనట్టిడౌ
    దేవుడు లేనె లేడని మదిన్ నెరనమ్ముచు గొల్తు భక్తితోన్.

    శ్రీవిభుని కంటె మిన్నగ
    ధీవైభవ మొసగి యెపుడు దీనుల యెడలన్
    సేవాభావము గూర్చెడు
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారు మీ రెండు పూరణలు నుత్తమముగా నున్నవి. జేయకుండెడిన్ అంటే యెలా యుంటుంది?

      తొలగించండి
    2. ఆర్యా!
      నమస్కారములు,
      మీ సూచన మరింత సముచితముగా నున్నది. ధన్యవాదములు.

      తొలగించండి
  9. ఆ విష్ణువునే నమ్మితి
    "నీవే నాదిక్క"నుచును నెర నమ్మితిగా!
    కావగ దను దక్క నితర
    "దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్"
    ****()()()****
    సేవల పూజలన్ మునిగి చేతమునంగల దివ్య శక్తిని
    న్నావల బెట్టుచున్ భువిని యార్తిగ విగ్రహ పూజలేలయా?
    భావము నందు గల్గుగద !భౌతిక రూపము గల్గునట్టి యే
    "దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్"
    &&&&%%%%&&&

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు మీ రెండు పూరణలు ప్రశస్తముగానున్నవి. భువినినార్తిగ అనండి. నిన్ ద్రుతాంతముగద.
      నమ్మితి నమ్మితి నని మీ నమ్మకాన్ని నొక్కి వక్కాణించారు. బాగుంది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు ! తెలుగు పాఠాలు చదివి నలభై రెండేళ్ళు కావస్తున్నది.(రాజనీతి శాస్త్రం వాళ్ళం) ఎప్పుడు నేర్చుకుంటామో ఈ యడాగమ, నుగాగమ, సరళాదేశ, ధృత,టుగాగమ,పుంప్వాదేశ etc సంధులు!

      తొలగించండి
  10. గురువులకు నమస్కారములతో ....
    ---
    ఏమి దురదృష్టమోసామి !యే మొ కాని
    కష్ట ములుమీ కె రాకకు కత న మేమి ?
    ప్రతిది నమ్మును దప్పక భక్తి తోడ
    నాలయమ్మును జుట్టును నారు మార్లు
    తిరుగ ,దొలగును బాధలు దిరము గాను

    రిప్లయితొలగించండి
  11. నీవే చెట్టున పుట్టన
    నీవే రాయినను రప్ప నీవుండగనో,
    రావే గోపాల! ఇతర
    దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్!

    ....సునీల్ బాబు

    రిప్లయితొలగించండి
  12. నీవే నాకిల దైవము
    నీవే మఱి యుందు వండ్రు నిఖిలము జూడ
    న్నోవేంకట నిను మించిన
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నయ్య నీ పూరణ బాగుంది. నిఖిలమునందు / న్నీ వేంకట పతి మించిన అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  13. భువిపై సేవకుని మిగులు
    దేవుడు లేడనుచు నమ్మి, తిరముగ గొల్తున్,
    భవమునకుకలుగ సద్గతి,
    యవశ్యముగ బడుగుజనుల హర్షముతోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు! అన్నిపాదములలో మొదటి యక్షరములు గురువు లవ్వాలి సమస్య పాదము గురువుతో నున్నది కాబట్టి.

      తొలగించండి
    2. కవివర్యులు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు. I have written kandam blindly by mistake.I will try to rewrite correctly.

      తొలగించండి
  14. మీ అబ్బాయికి శత్రచికిత్స చక్కగా జరిగి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి

  15. జీవుల చిత్తమందు విలసిల్లు పరస్పరప్రేమమందునన్
    ఆవురుఆవురంచనెడి ఆకలి దప్పిక దీర్చు హార్దపున్
    భావములోన జూచి యిక స్వర్గమునందున వేరె యెక్కడో
    దేవుదు లేనె లేడని మదిన్ నెర నమ్ముచు గొల్తు భక్తితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు మొదటి పాదము లో యతిభంగము. "ఆవురుఆవురం" విసంధిగా వ్రాసారు. ఎవరిని గొల్తురన్నది చెప్పలేదు.

      తొలగించండి
    2. శ్రీ కామేశ్వరరావుగారూ ,చ,ఛ,జ,ఝ,శ,ష,స,లకు యతి చెల్లునుకావున యతి భంగము లేదు.విసంధి లేకుండా రెండవ పాదమునుమార్చుచున్నాను.జీవులలోని పరస్పర ప్రేమను,
      దయాగుణాన్ని గొల్తునని భావము.సవరణ చేసినపద్యము
      జీవుల చిత్తమందు విలసిల్లు పరస్పరప్రేమమందునన్
      ఆవురుమన్నదీనులకు నాకలి దప్పిక దీర్చు హార్దపున్
      భావములోన జూచి యిక స్వర్గమునందున వేరె యెక్కడో

      దేవుదు లేనె లేడని మదిన్ నెర నమ్ముచు గొల్తు భక్తితోన్


      తొలగించండి
    3. తిమ్మాజీ రావు గారు యతి భంగము లేదు యే దృష్టిలో అన్నానో తెలియుట లేదు. క్షమించండి.
      సవరించిన మీపూరణ బాగుంది. మందు / న్నావురు అనండి. దేవుడు ముద్రణ లోపము.

      తొలగించండి
    4. శ్రీ కామేశ్వర రావు గారికి ధన్యవాదములుమీసూచన మేరకు సవరించిన పద్యము
      జీవుల చిత్తమందు విలసిల్లు పరస్పరప్రేమమందున
      న్నావురుమన్నదీనులకు నాకలి దప్పిక దీర్చు హార్దపున్
      భావములోన జూచి యిక స్వర్గమునందున వేరె యెక్కడో
      దేవుడు లేనె లేడని మదిన్ నెర నమ్ముచు గొల్తు భక్తితోన్

      తొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దేవరయై భువి నేలుచు
    వావిరి గరుణన్నరయుచు ప్రాణుల నెల్లన్
    దీవించెడి శివుని కడచు
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    రిప్లయితొలగించండి
  17. భావము నందునమ్మితిని భక్తుల పాలిటి వేంకటేశనిన్
    జీవిత కాలమంతయును జేసేద సంస్తుతి దేవ వేరె యే
    దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్
    గావుము భక్త కోటులను కష్టములన్గడ తేర్చి కేశవా.

    రిప్లయితొలగించండి
  18. భావము నందునమ్మితిని భక్తుల పాలిటి వేంకటేశనిన్
    జీవిత కాలమంతయును జేసేద సంస్తుతి దేవ! వేరె యే
    దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్
    గావుము భక్త కోటులను కష్టములన్గడ తేర్చి కేశవా!

    రిప్లయితొలగించండి
  19. నీవిల తండ్రియున్ జనని తమ్ముడు నన్నయు దిక్కు మ్రొక్కు సం
    భావన సేయగా గురుడు భర్తయు మిత్రుడు తోడునీడయున్
    కావలి త్రాతయున్ సఖుడు కాక మరెవ్వరు రామ నిన్ వినా
    దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారు మీ పూరణ బాగుంది. మొదటి పాదములో యతి భంగము. మిత్రుడు , సఖుడు పునరుక్తిగద.

      తొలగించండి
    2. నీవిల తండ్రియున్ జనని నేస్తము నన్నయు దిక్కు మ్రొక్కు సం
      భావన సేయగా గురుడు భర్తయు మిత్రుడు తోడునీడయున్
      కావలి త్రాతయున్ పరము కాక మరెవ్వరు రామ నిన్ వినా
      దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్.

      కామేశ్వరరావు గారూ దోషాలకు చింతిస్తున్నాను.
      సరిదిద్దిన పద్యం యిది.
      ధన్యవాదాలు.

      తొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దైవము తల్లి దండ్రి తగు దాత గురుండు సఖుండు నిన్నెకా
    భావన సేయుచున్ సతము బాతిని గూడుచు సజ్జకమ్ముగా
    పావనమూర్తి యా హరిని పంకజ నాభుని సౌరి మించు నే
    దేవుడు లేనె లేడని మదిన్ నెర నమ్ముచు గొల్తు భక్తితోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు మీ పూరణ బాగుంది. శౌరి అనండి. సౌరి యన్న యముడు / శని అవ్వచ్చు.

      తొలగించండి
    2. శ్రీయుతులు కామేశ్వరరావు గారికి రాజారావు నమస్కారములు.
      ఆచార్య జి. యన్‌. రెడ్డిగారి తెలుగు పర్యాయ పద నిఘంటువులో -
      శౌరి , సౌరి - రెండు పదాలకు " విష్ణువు " అని అర్ధము ఇచ్చారు.

      తొలగించండి
    3. పదాలకు యోగము, రూఢము యోగరూఢము అని త్రివిధాలుగా అర్థప్రతీతి ఉంటుంది. కృష్ణావతారంలో శూరసేనుడనే వాడి వంశస్థుడు కాబట్టి విష్ణువుకు శౌరి అని యేతదవతారకాలానుగుణంగా ఒక సంబోధన. అలాగే సూర్యుడి కుమారులు కాబట్టి శశైశ్చర యమదేవులకు సౌరి అని సంబోధన. సౌరి అంటే విష్ణువు అని యౌగికమైన అర్థం ఏమన్నా ఉన్నదేమో పరిశీలించాలి. ఒకవేళ ఉన్నా అది రూఢిగా (వాడుకలో)‌లేదు. కాబట్టి యోగరూఢము కాదు. కొన్ని పదాలకు కొన్నికొన్ని అర్థాలు రూఢిలోనికి తప్పుగా వస్తూ ఉంటాయి, విలేఖరి అన్న పదం పతికల్లో వార్తలు వ్రాసేవాళ్ళన్న అర్థంలో వచ్చినట్లుగా. అలాంటివి కేవలం‌ రూఢాలే కాని యోగరూఢములు కావు.ఒకవేళ ఏదో యౌగికార్థంగా సౌరి అన్న మాటకు విష్ణువు అన్న అర్థాన్ని తీయగలిగినా అది అప్రసిధ్ధం కాబట్టి వాడుక చేయటం అంత ఉచితం కాదు. పద్యాలు వ్రాయటానికి చేసే కృషిలో‌ ఏదన్నా పదాన్ని తప్పుడు అర్థంలో వాడకుండా జాగరూకత కోసం‌ నిఘంటువుతో సరిచూసుకోవటం సముచితమే కాని ఛందస్సుతో‌ కుస్తీలో భాగంగా గణాల్లో‌ పేర్చి వాడటానికి పదాలను వెదకటానికి నిఘంటువులను ఉపయోగించటం ఎంత తక్కువగా చేస్తే పద్యాలూ అంత సాఫీగా వస్తాయి. ఎంత తక్కువ శ్రమతో పద్యం ఎంత నిరాటంకంగా వస్తుందో అంత అందంగా పద్యం హృద్యంగా వస్తుంది.

      తొలగించండి
    4. శ్యామలరావు గారు నమస్కారములు. మీ వివరణకు ధన్యవాదములు.

      తొలగించండి
    5. శ్రీయుతులు శ్యామలరావు గారి సహేతుక ఉదాహరణలతో గూడిన వివరణ నాకు చాలా నేర్పింది. వారికి హృదయపూర్వక నమస్కారములు. ఇటువంటి పండిత సమూహంలో ఉంటున్న నేను అదృష్టవంతుడెనే.


      తొలగించండి
  21. పావన భావనలు విరిసి
    జీవన మంతయు సిరులు జూచుచు బ్రతుకన్
    కావగ జనకుల మించిన
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామారావు గారు మీ పూరణ బాగుంది. రెండవ పాదములో ఒక లఘువు తక్కువ అయ్యింది. యతి భంగము కూడా. జీ- జూ హల్లు సరిపోయింది కానీ అచ్చు తేడా. ఇ,ఈ, ఎ,ఏ లకు కుదురుతుంది.
      గావగ అనండి. ద్రుత సంధి నిత్యము.

      తొలగించండి
  22. రిప్లయిలు
    1. ఏ విధి నిల్చు నిప్పుడమి యింపుగ దైవమ లేక యున్నచో
      బావన నామ కీర్తనలఁ బన్నుగఁ గొల్చిన సంతసించుచుం
      బ్రోవగ నేర్చు సంతతము రోషముఁ బూనుచు శాప మిచ్చెడిన్
      దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్


      కైవల్యానుగ్రహ సు
      శ్రావితుడు కలియుగ మందు సప్త నగేశుం
      డీ వేంకటేశు మించిన
      దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్

      తొలగించండి
  23. జీవుల గూర్చి తల్చుచును సేవలఁ జేయు సుశీలు కంటె నే
    దేవుడు లేనె లేడని మదిన్ నెరనమ్ముచు, గొల్తు భక్తితోన్,
    జీవన యానమందునను చేటును చేయక, బీదసాదలన్
    పావనమైన చిత్తమున బాధ్యత తోడుత నాత్మ తృప్తికై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు మీ పూరణ మానవతా దృక్పధముతో నలరారు చున్నది. బావనమైన అనండి.

      తొలగించండి
    2. కవివర్యులు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  24. పావన జీవనావనిన భారము మోయుచు జీవితాంతమున్
    దైవము కన్న మిన్నగ వధాన్యత జూపుచు రక్షసేయుచున్
    కావగ తల్లిదండ్రులు సుఖాల నువీడుదు రట్టి వారినే
    దేవుడులేనెలేడని మదిన్ నెర నమ్ముచు గొల్తు భక్తితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామారావు గారు మీపూరణ ప్రశస్తముగా నున్నది. వదాన్యత ముద్రణ లో పొరపాటనుకుంటాను.

      తొలగించండి
  25. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరు రాత్రి ఒంటిగంట వరకు మెలుకవగా ఉన్నట్టు కన్పించుచున్నది. అది ప్రశాంతముగా నిదురించవలసిన సమయము.
    మెలుకువ వచ్చినా పరుండుట మంచిది. ఆరోగ్యము ముఖ్యము కదా!

    రిప్లయితొలగించండి
  26. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    బ్రోవగ జా గదేల ? ఫణిభూషణ ! శ౦కర !

    ………… నిన్ను మి౦చి యే

    దేవుడు లేనె లేడని , మదిన్ నెరనమ్ముచు

    ………… గొల్తు భక్తి తోన్ |


    పావన నామ ! సర్వ భవబ౦ధ వినాశన !

    ………… చ౦ద్ర మౌళి ! దీ

    నావన ! నీలక౦ఠ ! కరుణాకర !

    ………… భక్త వశ౦కరా ! శివా !


    """"""""""""""""""""""""""""""""""""""""

    నీవే గద నా ప్రాణము

    నేవే నా తోడు - నీడ నిజముగ | నీవే

    జీవము | ధవునిన్ మి౦చెడు

    దేవుడు లేడ౦చు నమ్మి , తిరముగ గొల్తున్

    ( జీవము = బ్రతుకు )

    రిప్లయితొలగించండి
  27. సేవించగ నొరుల మనిషి
    దేవుండయి బరగు కతన దీనులయెడనా
    భావము జేకొని మరియొక
    "దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్!"

    రిప్లయితొలగించండి
  28. దేవుడు లేనె లేడని మదిన్ నెర నమ్ముచు గొల్తు భక్తి తో న్
    దేవుడు లేనిచో నెటుల దేవుని గొల్తువు రామరాజ ! యే
    జీవుని కై న నెప్పుడును జీవము గల్గు ట సంభ వించుటన్
    దేవుడె యూ నుగా !భువిని ,దీ రె నె ?నీకనుమానమిప్పుడున్

    రిప్లయితొలగించండి
  29. కోవెల లోని విగ్రహము కోర్కెల దీర్చగ నిల్చెనంచు భ
    క్తావళి విశ్వసించి యట దండిగ బూజలు సేయనేమి స
    ద్భావన లేని వేళ, నిల తల్లిని దండ్రినిమించి వేరుగా
    దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్

    పావని యె బదులిడె పరమ
    పావని జానకి యడిగిన ప్రశ్నకు రామున్
    పావన చరితుని మించిన
    దేవుఁడు లేఁడనుచు నమ్మి తిరముగఁ గొల్తున్

    * * నిన్నటి సమస్యకు నా పూరణలు * *

    వినయము విజ్ఞతన్ గలిగి వేదము నేర్చిన వాడె యైన నా
    జనకుని సోదరుండొకడు జక్కని చుక్కను పెండ్లియాడె నా
    వనితకు గర్భమందు పసి బాలుడు పుట్టెను, నాకునయ్యెనా
    తనయుఁడు, తమ్ముఁ డయ్యె నది తప్పగునా మఱి యొప్పగునా సఖీ

    తనయకు బుట్టిన కొడుకును
    జనకుడు చేకొనగ దత్తు జామాతయె సై
    యనగను పుత్రిక కంతట
    తనయుఁడు తన తమ్ముఁ డయ్యెఁ దప్పో యొప్పో


    జనకుడు గోరెనంట మగసంతతి లేదని ప్రేమమీరగన్
    తనయనె, యామె పుత్రుడను దత్తత నిమ్మను చున్ విధేయుడై
    తనకిక వారసత్వ పరితాపము తప్పుననంగ నొప్పెనా
    వనితయె, తాతకయ్యెనిక పౌత్రుడు పుత్రుడు గాదెనారికిన్
    తనయుఁడు తమ్ముఁ డయ్యె నది తప్పగునా మఱి యొప్పగునా సఖీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారు యీనాటి మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. విశేషించి యమకాలంకారముతో రెండవ పద్యము భాసిల్లుచున్నది.
      నిన్నటి పూరణలు: మీ పూరణలు బాగున్నవి.
      మొదటి వృత్తములో అయ్యెను పునరుక్తియయ్యినది. సమస్య పాదములో "యొప్పునో" అని ఉండాలి.

      తొలగించండి
    2. కామేశ్వరరావు గారకి నమస్కారములండీ! మీ సూచనకు ధన్యవాదములు ప్రస్థుతం సవరించిన పాదం వనితకు గర్భమందు పసిబాలడు పుట్టగ నాకు నారికిన్ / తనయుడు తమ్ముడయ్యె..... సరిపోతుందనుకుంటాను

      తొలగించండి
  30. జీవుల పూర్వ జన్మ కృత చేష్టలె జన్మకు కారణం బగున్;
    రావణ కుంభకర్ణ పలు రక్కసులన్ పరి మార్చి భూమిజన్
    గావగ మానవుండయిన కారణ జన్ముడు గాక, వేరుగా
    దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారు మీ పూరణ బాగుంది. రావణ కుంభకర్ణ పలు రక్కసు లని సమసించ తగదు.
      "రావణ కుంభకర్ణు లను రక్కసులన్" అంటే బాగుంటుంది. రక్కసులం బరి మార్చి అనండి.

      తొలగించండి
  31. . జీవుల యందునన్ నిలిచి జీవన సారము బంచ నెంచి సం
    జీవిగ మానసానగల చిత్ర విచిత్రపు భావనాలతో
    జీవ వికారముంచుట విశేషముగా దలపోసి? మూడుడై
    దేవుడు లేనెలేడని మదిన్ నెరనమ్ముచు గొల్తు భక్తితోన్|
    2.దీవెన లొసగెడి పితరులు
    భావనలోభర్తసుఖము భాగ్యమటంచున్
    జీవన సారముతో యే
    దేవుడులేడనుచు |నమ్మితిరముగ గొల్తున్| {తలిదండ్రులను,భర్తను}




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారు మీ మొదటి పద్యము ఛందోబద్దమైయున్నది. భావము సరిగా అర్థము కాలేదు నాకు. సమస్యకు పరిష్కారమెలా చూపారు?
      రెండవ పూరణ బాగుంది.

      తొలగించండి
  32. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    శ్రీ యుత పోచిరాజు కామేశ్వర రావు గారికి

    నమస్సులు & ధన్యవాదములు
    ి

    రిప్లయితొలగించండి
  33. కవిమిత్రులారా! నమస్కృతులు.
    ప్రమాదంలో కాలు విరిగిన మా అబ్బాయికి రేపు శస్త్ర చికిత్స జరుగుతుంది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయినా ఇంటికీ హాస్పిటల్ కూ తిరగటం తప్పడం లేదు. మీ పూరణలు సమీక్షించడం అటుంచి కనీసం చదవడానికి కూడా అవకాశం, మానసిక ప్రశాంతత లేవు. మన్నించండి.
    ******
    పోచిరాజు కామేశ్వరరావు గారూ,
    మీరు శ్రమ తీసికొని మిత్రుల పూరణలను సమీక్షిస్తూ నాకెంతో సంతోషాన్ని ధైర్యాన్ని ఇస్తున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి శుభాకాంక్షలు. విజ్ఞులు శ్రీ కామేశ్వర రావు గారికి ధన్యవాదములు. శంకరాభరణ మిత్రులందరికీ అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చాలా బాధాకరమైన సంఘటన. భగవంతుని దయవలన అన్ని త్వరలో సర్దుకో గలవని ఆశిస్తున్నాము.
      దీని గురించి చింతించకండి. మాలో యెవరైనా చూడగలరు. నిరంతరాయముగా సాగుతుంది శంకరాభరణము. మీ కుమారులు త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము.

      తొలగించండి
    3. బాగా కోలుకున్న తర్వాత తీరికగా ఇదెప్పుడైనా చూడవచ్చు. ముందు ఆరోగ్యం సంగతి చూడండి. Wish speedy recovery

      తొలగించండి
    4. గురువుగారూ, మీ కుమారులు త్వరగా కోలుకోవాలని, మీరునూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

      తొలగించండి
    5. నమస్కారములు
      పులిమీద పుట్రలా ఇబ్బందులు కలుగుతున్నందుకుమాకే బాధగా ఉంది .ఇకమీ సంగతి వేరే చెప్పలేము.కాకపోతే ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి .శంకరాభరణం గురించి ఆలోచించ కండి .అందరూ ఆత్మీయులె. ఎవరోఒకరు సరిచెస్తూ ఉంటారు.ముందు మీఆరోగ్యము అబ్బాయి ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోండి. గాడ్ ఈజ్ గ్రేట్ .ఆశీర్వదించి అక్క.

      తొలగించండి
  34. నీవే దిక్కని నమ్మితి
    గావవె యనిపిలువ కరిని గాచిన వాడౌ
    శ్రీవేంకటపతి కన్నను
    దేవుఁడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్!!!


    నీవే జీవము భావము
    నీవే నా మతియు గతియు నీవే సచియున్
    దైవము ,నాథుని మించిన
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారు మీ రెండు పూరణలు వజ్రపు తునకలు. సీత,సావిత్రి,అనసూయ,ద్రౌపది,దమయంతులు పుట్టిన గడ్డ మాహాత్మ్యాన్ని చాటి చెప్పారు!

      తొలగించండి
    2. గురుతుల్యులు శ్రీ కామేశ్వరరావుగారికి చాలాచాలా ధన్యవాదములు.. నాపద్యములు మీ ప్రశంశకు పాత్రమైనందుకు చాలా సంతోషంగావుంది...

      తొలగించండి
  35. తావుకొని సప్తగిరిపై

    బ్రోవుచు భక్తులను వారి పూజలు గొనుచు

    న్నా వేంకటపతి మించిన

    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారు మీ పూరణ బాగుంది. సప్తగిరివాస, సప్తనగాధీశ అన్న సమాసములు సాధువులే గాని సప్తగిరి ద్విగు సమాసము ఒక్క గిరి కాదు కదా అందుకని సప్త గిరులపై అనవలసి యుంటుంది.

      తొలగించండి
  36. మిత్రులందఱకు నమస్సులు!

    నిన్న నేను మా చెల్లెలి కుమార్తె పెండ్లికి హాజరగుటచే పూరణము పెట్టలేకపోయాను. ఇప్పుడు పెట్టుచుంటిని.

    >>నిన్నటి పూరణము:
    [తన చిన్ననాఁటి స్నేహితురాలితో తన భార్య చెల్లెలి భర్త గూర్చి ముచ్చటించుచున్న యొకానొకని మాటలు]

    వినయము, సాధువర్తనము, విజ్ఞత వీడియు సంచరించుచు,
    న్ననయము కయ్యమాడుచును, నందఱఁ జొక్కిడి, నాదు ధర్మ ప
    త్న్యనుజనుఁ బెండ్లియాడి, యిఁక నాకును బంధుఁడయెన్; గనంగ వీ

    త నయుఁడు, తమ్ముఁ డయ్యె, నది తప్పగునో, మఱి యొప్పునో సఖీ!

    >>నేఁటి పూరణము:
    భూవనితాత్మజన్ సతిగఁ బొందియు, వాలి యధర్మ మార్పియున్,
    రావణ కుంభకర్ణులను రక్కసులన్ దునుమాడి, దైత్యవి
    ద్రావణుఁడైనయట్టి రఘురామునకున్ సరిసాటియైన యే

    దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెఱ నమ్ముచుఁ గొల్తు భక్తితోన్!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిపుంగవులు మధుసూదన్ గారు మీ రెండు పూరణలు మనోహరముగా నున్నవి. నేను శాంత నయుని ప్రస్తావిస్తే మీరు వీత నయుని ప్రస్తావించారు. బాగుంది.
      ఇంకో విశేషముంది. ఈరోజు కవి వరులు కృష్ణారావు గారి పూరణలోని "రావణ కుంభకర్ణ పలు రక్కసులన్" సమాసమునకు సూచించిన "రావణ కుంభకర్ణు లను రక్కసులన్" సరిగ్గా మీపూరణలో కన్పించింది.

      తొలగించండి
  37. జీవన వేదమై నిలచి జీవన సారము నెల్ల నేర్పెడిన్
    పావన రామగాధ మన భారత దేశపు జీవగఱ్ఱ యా
    రావణు యుద్ధరంగమున లావణగించిన నీకు సాటియౌ
    దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రావణు యుద్ధరంగమున లావణగించిన రాము సాటియౌ

      తొలగించండి
    2. ఫణికుమార్ గారూ యద్భుతమైన పూరణ. అనింద్య గ్రామ్య పదమునకు రామ రసముతో జీవము పోసి కవిసార్వభౌములు శ్రీనాథ భట్టారకునకు సుమాంజలులు సమర్పించారు.

      తొలగించండి
    3. రావణు యుద్ధరంగమున లావణగించిన అన్నారు కాబట్టి రాముడని చెప్పకయే చెప్పినట్లయినది. నీకు సాటియౌ ప్రయోగమే సుందరముగా నున్నదని నాభావన.

      తొలగించండి
  38. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  39. మాస్టరుగారూ!చాలా విచారకర సంఘటన. మీ అబ్బాయికి కాలి గాయం త్వరగా నయమవ్వాలని కోరుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  40. సేవయె దైవంబందురు
    కైవల్యంబొసగు నట్టి కార్యంబిలలో
    సేవయె దీనిని మించిన
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    కావగ భక్తుల ధరలో
    దైవము సతతము గనుచును దరిశెన మొసగున్
    శ్రీవెంకన్నను మించిన
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    ఆవనిత మొరలిడగనే
    కావగ వచ్చిన మురారి కంటెను జగతిన్
    దైవము గలడే?మరియొక
    దైవము లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    రిప్లయితొలగించండి
  41. సేవయె దైవంబందురు
    కైవల్యంబొసగు నట్టి కార్యంబిలలో
    సేవయె దీనిని మించిన
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    కావగ భక్తుల ధరలో
    దైవము సతతము గనుచును దరిశెన మొసగున్
    శ్రీవెంకన్నను మించిన
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    ఆవనిత మొరలిడగనే
    కావగ వచ్చిన మురారి కంటెను జగతిన్
    దైవము గలడే?మరియొక
    దైవము లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    రిప్లయితొలగించండి


  42. దేవుళ్ళాడక బయటే
    దేవుని మదిలోననిలిపి దేహీ! పాహీ!
    దేవుడ ! యన రక్షింపని
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్.

    రిప్లయితొలగించండి
  43. డా.పిట్టా
    జీవుడ! దేవుడీవయని జెప్పగ వింటి "జగంపుటాటలో
    పావులరయ్యు ద్వైతమును భావన జేయకు"డన్న "మాయ"యే
    చావుల జూపి కష్టముల జాలగ గూల్చగ "నాకు నీవె" యే
    దేవుడు లేనె లేడని మదిన్ నెరనమ్ముచు గొల్తు భక్తితోన్ (పరస్పర మానవ సహకారం)"నాకు నీవె".
    పాశ్చాత్య పోకడలో:
    భావనలు వేరు బ్రకృతిని
    చావులకున్ పుట్టుకలకు సాక్షిగ గనమే
    దీవెననిడు నా శక్తియె
    దేవుడు లేడనుచు నమ్మి తిరముగ గొల్తున్!

    రిప్లయితొలగించండి
  44. కోవెల లెన్నియో నిచట కోరిక తీరగ కట్టితిన్ గురూ
    లేవనకుండనే ముడుపు లెన్నియొ నిచ్చితి రోటరీలకున్
    నావలె దాతలేడనుచు నమ్ముచు చాటుచు నన్నుమించెడిన్
    దేవుఁడు లేనెలేఁడని మదిన్ నెర నమ్ముచుఁ గొల్తు భక్తితోన్

    రిప్లయితొలగించండి