31, జనవరి 2017, మంగళవారం

సమస్య - 2269 (తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తల్లిం జంపి ప్రసిద్ధుఁ డయ్యె జగతిన్ ధర్మాత్ముఁ డెంతేనియున్"
లేదా...
"తల్లినిం జంపి యశమందె ధర్మమూర్తి"

30, జనవరి 2017, సోమవారం

సమస్య - 2268 (చీర విప్పి సుదతి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"చీర విప్పి సుదతి చిందులాడె"
లేదా...
"చీరను విప్పి మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్"

29, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2267 (భండనమ్మునఁ బాఱెను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భండనమ్మునఁ బాఱెను భార్గవుండు"
లేదా...
"భండనమందు భార్గవుఁడు పాఱెను భీత మనస్కుఁడై వడిన్"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

28, జనవరి 2017, శనివారం

సమస్య - 2266 (మూషికం బొండు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మూషికం బొండు పిల్లిని ముద్దులాడె"
లేదా...
"మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్"

27, జనవరి 2017, శుక్రవారం

సమస్య - 2265 (వర్ష మిచ్చుఁ జింత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు"
లేదా...
"వర్ష మొసంగు రైతున కవారిత చింతనుఁ దీవ్రదుఃఖమున్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

26, జనవరి 2017, గురువారం

సమస్య - 2264 (భారత గణతంత్రము...)

కవిమిత్రులారా!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భారత గణతంత్రము జనభారం బయ్యెన్"
లేదా...
"భారతదేశమందు జనభార మగున్ గణతంత్ర మన్నచో"
[జనభారము = జనులకు భారము]
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

25, జనవరి 2017, బుధవారం

సమస్య - 2263 (మారీచుండు ధరాతలమ్మునను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మారీచుండు ధరాతలమ్మునను సంరక్షించె జీవాళినిన్"
లేదా...
"మారీచుఁడు రక్షకుండు మహిఁ బ్రాణులకున్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

24, జనవరి 2017, మంగళవారం

గమ్మత్తైన పద్యం

పూర్వం ఒక రామ భక్తుడు....  రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.
"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః। 

లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః  పరమేశ్వరో నః॥
ఆశ్చర్య పోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్  అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు. అర్ధం చూడండి...

గవీశపాత్రః ... గవాం ఈశః  గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే. 

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. 

అనాదిః ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.

చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం.

అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.  

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని  దర్శించగలిగితే వాడు  శైవుడు.  ఇది మన భారతీయ కవితా వైభవము.


విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి
('అనంత్ మూగి' గారికి ధన్యవాదాలతో...)

సమస్య - 2262 (తరుణి! పుత్రివో?...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తరుణి! పుత్రివో? పౌత్రివో? ధర్మసతివొ?"
లేదా...
"రమణిరొ! పుత్రివో? మనుమరాలవొ? చెల్లివొ? ధర్మపత్నివో?"

23, జనవరి 2017, సోమవారం

సమస్య - 2261 (ఇంతుల నెల్ల....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఇంతుల నెల్ల నంత మొనరించెడువాఁడె ఘనుండు వీరుఁడున్"
లేదా...
"భామినుల నంతమొందించువాఁడె ఘనుఁడు"

22, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2260 (పురుషుండే ప్రసివించి....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

 "పురుషుండే ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా" 
లేదా...
"పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్"

21, జనవరి 2017, శనివారం

సమస్య - 2259 (రాముఁడే నా హితుండనె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాముఁడే నా హితుండనె రావణుండు"
లేదా...
"రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే"
ఈ సమస్యను పంపిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

20, జనవరి 2017, శుక్రవారం

సమస్య - 2258 (శునకమ్ములు పూవులాయె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"శునకమ్ములు పూవులాయెఁ జోద్య మెటు లగున్?" లేదా...
"శునకమ్ముల్ గుసుమంబు లాయె ననఁగాఁ జోద్యమ్ముగా నెంతురా?"

19, జనవరి 2017, గురువారం

సమస్య - 2257 (కాంచ గంధర్వనగరమ్ము...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

“కాంచ గంధర్వనగరమ్ము కాపురమ్ము”
లేదా...
"కన గంధర్వపురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

18, జనవరి 2017, బుధవారం

దత్తపది - 105 (కుడి-గడి-జడి-పొడి)

కుడి - గడి - జడి - పొడి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

17, జనవరి 2017, మంగళవారం

దైవస్తుతిః


1. విఘ్నేశ్వర స్తుతి:

శ్రీగణేశం శ్రితార్తిఘ్నం సర్వ విద్యా ప్రదాయినమ్।
పుష్టికాంతం సురాధ్యక్షం పృథ్వీగర్భం నమామ్యహమ్॥1॥

మూషికానింద్య సంచారం మోదక హస్త భాసురమ్।
నమామి గిరిజా సూనుం వక్రతుండం వినాయకమ్॥2॥

లంబోదరం సదాదాన మేకదంతం గజాననమ్।
చతుర్భుజం మహాకాయం వందే హరవరాత్మజమ్॥3॥

ద్వైమాతృక వరం దేవం నాగోపవీత భాసితమ్।
విఘ్నరాజం గణాధ్యక్షం ప్రణమామి భవాత్మజమ్॥4॥

శూర్పకర్ణం కుమారాగ్ర్యం హేరంబం కుబ్జవిగ్రహమ్।
శుక్లాంబరం ప్రసన్నాస్యం మందహాసం నమామ్యహమ్॥5॥


2. శంకర స్తుతి:

శ్రీశైలస్థిత కేదారం కాశీనాథం త్రిలోచనమ్।
హరం త్రిపుర సంహారం దిగంబరం నమామ్యహమ్॥1॥

కైలాస గిరి సంవాసం హైమవతీ మనోహరమ్।
గంగాధరం మహాదేవం నమామి చంద్ర శేఖరమ్॥2॥

హాలాహల విషాహారం భస్మకాయ విరాజితమ్।
భూతప్రేత గణాధ్యక్షం నటరాజం నమామ్యహమ్॥3॥

ఫాలనేత్రం జటాజూటం శాశ్వతం నాగభూషణమ్।
ఊర్ధ్వరేతస మీశానం వృషధ్వజం నమామ్యహమ్॥4॥

రచన - పోచిరాజు కామేశ్వర రావు

సమస్య - 2256 (పార్వతి ముద్దాడె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పార్వతి ముద్దాడె మెచ్చి పంకజనాభున్"
లేదా...
"పార్వతి మెచ్చి ముద్దుగొనె పంకజనాభునిఁ బ్రేమ మీరఁగన్"

16, జనవరి 2017, సోమవారం

సమస్య - 2255 (కంసుఁడు మిము బ్రోచుగాత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కంసుఁడు మిము  బ్రోచుగాత కరుణామయుఁడై"
లేదా...
"కంసుండే మిము బ్రోచుగాత తనదౌ కారుణ్యమున్ జూపుచున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

15, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2254 (తరుణము మించఁ గార్యములు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తరుణము మించఁ గార్యములు దద్దయు మేలొనరించు నిద్ధరన్"
లేదా...
"తరుణాతీత కృత కర్మ తతు లిడు శుభముల్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

14, జనవరి 2017, శనివారం

సమస్య - 2253 (రైతు దుఃఖించు...)

కవిమిత్రులారా!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు"
లేదా...
"సంకటమే కదా మకరసంక్రమణమ్మున రైతు లేడ్వగన్"

13, జనవరి 2017, శుక్రవారం

సమస్య - 2252 (జలమున నగ్ని పుట్టెనని...)

కవిమిత్రులారా!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"జలమున నగ్ని పుట్టెనని సంతస మందెను మీనజాలముల్"
లేదా...
"జలములో నగ్ని పుట్టె మత్స్యములు మురిసె"

12, జనవరి 2017, గురువారం

సమస్య - 2251 (వేవుర సంప్రతించ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వేవుర  సంప్రతించ నవివేకము వోవును విద్య లేలయా"
లేదా...
"చను నజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

11, జనవరి 2017, బుధవారం

సమస్య - 2250 (ఖరమునుఁ గనినంత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఖరమునుఁ గనినంత నాకుఁ గడు  సంతసమౌ"
లేదా....
"ఖరమునుఁ గాంచినంత మదిఁ గమ్మని భావము పొంగులెత్తెడిన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

10, జనవరి 2017, మంగళవారం

సమస్య - 2249 (కారాగారమునందు లభ్యమగు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బెన్నఁగా సాధ్యమే"
లేదా...
"కారాగారమున ఘనసుఖంబులు దక్కున్"

9, జనవరి 2017, సోమవారం

కృష్ణ స్మరణ

రచన: కామేశ్వర రావు పోచిరాజు
శంఖ చక్ర గదా ధరమ్ కౌస్తుభ మణి భూషితమ్|
శ్రీరమా సుమనోహరమ్  స్మరామి సతతమ్ హరిమ్||                   1
నీలాంబుదనిభశ్యామం నీరజపత్రలోచనం |
శిఖిపింఛధరం కృష్ణం స్మరామిమురళీధరం ||                               2                                  
తృణీకృత తృణావర్తం పూతనా ప్రాణ హారిణం |
అర్జున మోక్ష దాతారం స్మరామి బక మర్దనం ||                           3
కాళీయఫణ సంత్రాసమ్ అఘాసుర విదారిణం |
మత్త కుంజర హంతారం స్మరామి నందనందనం ||                       4

సమస్య - 2248 (చెల్లెలినిఁ బెండ్లియాడ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"చెల్లెలినిఁ బెండ్లియాడ మెచ్చెను జగమ్ము"
లేదా...
"చెల్లెలిఁ బెండ్లియాడిన విశేషముగా జనమెల్ల మెచ్చిరే"

8, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2247 (సోదరు లిర్వురున్ మిగుల...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాథలన్."
లేదా...
"సోదరులు రెండు కథలకు శోభ నిడిరి"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

7, జనవరి 2017, శనివారం

సమస్య - 2246 (ఆపద లంద మానవుల...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఆపద లంద మానవుల యాశలు దీరును సత్వరమ్ముగన్"
లేదా...
"ఆపదలు మానవుల యాశ లన్ని తీర్చు"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

6, జనవరి 2017, శుక్రవారం

సమస్య - 2245 (నరుఁడయి జన్మనెత్తె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నరుఁడయి జన్మనెత్తెఁ గరుణారహితుం డయి చంద్రమౌళియే"
లేదా...
"నరుఁడుగా జన్మనెత్తె శంకరుఁడు గనలి"

5, జనవరి 2017, గురువారం

సమస్య - 2244 (పుట్టగోచిని ధనికుండు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పుట్టగోఁచిని ధనికుండు పెట్టి మురియు"
లేదా...
"ధనికుఁడు పుట్టగోఁచిని సతంబు ధరించి ముదంబు నందురా"

4, జనవరి 2017, బుధవారం

సమస్య - 2243 (కడచె రాతిరి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కడచె రాతిరి చుక్కల గములు వొడమె"
లేదా...
"కడచెన్ రాతిరి చుక్కలెల్ల వొడమెన్ గన్పట్టెఁ చంద్రద్యుతుల్"

3, జనవరి 2017, మంగళవారం

నూతన సంవత్సరము

రచన - పోచిరాజు సుబ్బారావు

భారతీయుల నోముల పంటగాను
వచ్చె రెండువేల్ పదునేడు వత్సరమ్మె
యాయురారోగ్యసంపద లన్ని యిచ్చి
కాచు గావుత మనలను గరుణతోడ

పాడిపంటల వృధ్ధియె బహుళమగుచు
కూడుగుడ్డల కెప్పుడు కొదవలేక
యైకమత్యము దోడన నహరహమ్ము
పంచుకొందురు సంతోషపరిమళమును

తెలివితేటలయందున దెలివిమీరి
యేది మంచిది చెడ్డది యేది భువిని
దాన నెరుగుచు బ్రతియొక్క మానవుండు
మసలుచుండును నిరతము మాన్యుడగుచు

వత్సరమంతయు నరయగ
మత్సరములు వీడి జనులు మమతలతోడన్
నుత్సుకతలు గనబరచుచు
నుత్సవములు జేసికొందు రోపినగొలదిన్

అంతర్జాలము నేర్చిరి
వింతగ నీతరమునాటి పిల్లలు మిగులన్
పంతుళ్ళు వారు మనకిక
సంతసమున వారియొద్ద చట్టులు మనమే

సామరస్యము గలుగుచు సకలజనులు
వారు వారల వృత్తులు భవ్యముగను
జేయుచుందురు విడువక న్యాయ మెపుడు
సాలు మహిమయే యిట్లుండు సాంతముగను.

సమస్య - 2242 (అంది యందని యందమె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అంది యందని యందమే విం దొసంగు"
లేదా...
"అందియు నందనట్టిదగు నందమె విం దొసఁగున్ బ్రజాళికిన్"

2, జనవరి 2017, సోమవారం

సమస్య - 2241 (మాతను బెండ్లియాడి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మాతనుఁ బెండ్లియాడి జనమాన్యత నందెను రామభద్రుఁడే"
లేదా...
"మాతనుఁ బెండ్లాడి లోకమాన్యుం డయ్యెన్"

1, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2240 (నూతన వత్సర మనుచు...)

కవిమిత్రులారా!
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నూతన వత్సర మనుచు వినోదము లేలా"
లేదా...
"నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా"