31, మార్చి 2017, శుక్రవారం

సమస్య - 2324 (తనయుఁడె తల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తనయుఁడె తలఁ గొరిగినాఁడు తండ్రికి  సుమ్మీ"
లేదా...
"తనయుఁడె తండ్రికిన్ దలను దన్మయ మొందుగ గీకె నవ్వుచున్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

84 కామెంట్‌లు:

  1. కనగా నెన్నిక లందున
    జనతయె యుత్తర ప్రదేశ జాతక మివ్వన్
    జనులను కొనుమాటలివియె
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ ప్రస్తుత కాలోచితమై అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. ఏల్చూరి వారూ,
      బ్లాగులోని మిత్రుల పూరణలను వీక్షించడమే కాక స్పందించినందుకు ధన్యవాదాలు!

      తొలగించండి
    3. సమకాలీన విషయములను ప్రస్తా వించుచూ విలక్షణ మైన రీతిలో పద్య సుమ మకరందము వెదజల్లుచూ వృత్తాకృత మధురరసపూరిత “జిలేబి” గారికి నమస్సులు ధన్యవాదములు.

      తొలగించండి
    4. మహామహోపాధ్యాయ, అసమాన ధీ సపన్న గౌరవ ఏల్చూరి మహోదయులకు శతాధిక వందనములు. మీ ప్రశంస యే ఒక అవార్డు. ధన్యుడను. మీకు నా ధన్యవాదములు.

      తొలగించండి
  2. జనకుని వెదకుచు ఢంకన
    కనుగొని శిల్పమున వంక కదనము నందున్
    జనకుండని తెలియక తన
    తనయుఁడె తలఁ గొరిగినాఁడు తండ్రికి  సుమ్మీ


    ఢంకన = అమరశిల్పి జక్కన తనయుడు
    తలగొరుగు = ఓడించి అవమానించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      జక్కన ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      "వంక గలదని చెప్పెన్" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమస్సులు: ఓడి చెయి కోయించుకొనెదని పందెము కాసినాడు కదా. అందుకు "పందెము" కు బదులు "కదనము" అన్నాను యతి కోసం.

      తొలగించండి


  3. తన కుల వృత్తిని నేర్పగ
    తనయుఁడె తలఁ గొరిగినాఁడు తండ్రికి  సుమ్మీ,
    కనగోరగ సుతుని తరము
    తన పనిలోన పితరుండు తరుణి జిలేబీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మనకొద్దు రాజకీయము
    తనయా!తగదన్న వినక తా నెన్నికలో
    ధనము న్వ్యయించి యోడిన
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. 'వద్దు'ను 'ఒద్దు' అన్నారు. "మన కేల రాజకీయము..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  5. తనవాడని వ్యాపారపు
    ధన మంతయు కట్టబెట్ట తద్భక్షణతో
    తనివారక ఋణములతో
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ.

    అనుపమ మైన ప్రేమమున నాతని బెంచుచు నుద్ధరించువీ
    డనుకొనె వాడు నీచుడయి యన్నిట ధర్మము దప్పుచుండి త
    జ్జనకుని వృద్ధుడైన తరి సాకక వీధుల వెంటబంపె నౌ
    తనయుడె తండ్రికిన్ దలను దన్మయమొందుచు గీకె నవ్వుచున్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. మైలవరపు మురళీకృష్ణ గారి పూరణలు....

    పనియే దైవము, భగవం
    తునిదౌ కల్యాణకట్ట, దోసంబున్నే!
    తన దరికి రాగ వరుసను
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ!!

    తనయుని వృత్తి కొండపయి, తండ్రియు సంతసమందుచున్ మదిన్
    మనుమడు బుట్టె నంచు, నభిమానత మ్రొక్కులు దీర్ప వేంకటే
    శుని గిరి జేరెనంత నట చోద్యము, క్షౌరకవృత్తినున్న యా
    తనయుఁడె తండ్రికిన్ దలను దన్మయ మొందుగ గీకె నవ్వుచున్ !!

    రిప్లయితొలగించండి
  7. గౌరీభట్ల బాలముకుంద శర్మ గారి పూరణ...

    ఘనదీక్షాంతవిధిని ఖం
    డనకై నాపకమహావిడంబనసహియిం
    పని పనుపునసమయమెఱిగి
    తనయుడెతలఁగొరిగినాఁడుతండ్రికిసుమ్మీ

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    తన తలదాకగ నెదుగను
    తనయుని గన సంతసంబు దనరుననవినెన్
    తన పిత దుర్గుణముల గొని
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  9. తన తండ్రిని చెరసాలకు
    బనుపుచు నౌరంగజేబు పాలకుడైనన్
    జనవాక్యము వినుమిదియే
    "తనయుడెతలఁగొరిగినాఁడుతండ్రికిసుమ్మీ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      ఔరంగజేబు ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. డా.పిట్టా
    "అనయము పైసనున్ గనుము యార్జనయే పొదుప"న్న గాంధియే
    తనదు విదేశ జీవన విధానపు క్షౌరము తానె జేసుకోన్
    వినయము మీర తద్గతిని వేదపు వాక్కుగ నెంచి యెప్పుడున్
    తనయుడె తండ్రికిన్ దలను తన్మయ మొందగ గీకె నవ్వుచున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పైసనున్'...?

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా,"A penny saved is a penny got"అనేది సామెత. పొదుపే ముఖ్యమనే భావనతో వెళితే పైసా అని న్నీ పైసను కు న్ రావడం కూడదనికదా మీరు చెప్పినది?ఈ భావం వచ్చేలా సవరణ సూచించ గలరు.నేను కూడ ఆలోచిస్తాను.

      తొలగించండి
    3. ఎందుకో 'పైసనున్' ప్రయోగం కృతకంగా అనిపించింది. '...గనుము+ఆర్జనయే' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "పైసనే గనవె యార్జనయే..." అనవచ్చు ననుకుంటాను.

      తొలగించండి
  11. ……………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    వినరా కొడుకా వలదుర

    ధనమును నీవిటు వ్యయి౦ప దగదుర యని చె

    ప్పిన జెవి యొగ్గక , నున్నగ

    దనయుడె తల గొరిగినాడు త౦డ్రికి సుమ్మీ

    రిప్లయితొలగించండి
  12. తనవ్యాపారము చూడగ
    ఘనముగ నియమించి సుతుని కాశికిఁ బోవన్
    ధనమంతయు పోకారిచి(ఖర్చు సలిపి)
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. తనకొక యుద్యోగంబున్
    జనులెవ్వరు నీరె యనుచు జడవక మంగలి
    పనికిన్ తిరుమల జేరగ;
    తనయుఁడె తలఁగొరిగినాఁడు తండ్రికి సుమ్మీ
    (ఉద్యోగము దొరకని పిల్లవాడు తిరుమలజేరి కళ్యాణకట్టలో ఉద్యోగము జేయుచుండగా
    విధివశాత్తు తండ్రి అక్కడికి రాగా తలగొరగ వలసి వచ్చెను - "ఆకలి రాజ్యం
    సినిమాలోలాగా అన్నమాట)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. రెండవ పాదాంతంలో తప్పక గురువుండాలి కదా! "జడవక తన వృ।త్తిని జేయ దిరుమలకు జని..." అందామా?

      తొలగించండి
  14. వినుమా సోదర ! యియ్యది
    తనయుడె తల గొఱిగి నాడు తండ్రికి సుమ్మీ
    వినుటను జరిగినె నిట్లుగ ?
    మునుపెన్నడు గాని నీకు మోమిడి చెపుమా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మోమిడి అంటే ఏమిటండి ?

      జిలేబి

      తొలగించండి
    2. మోమిడి అంటే సమాచారం ! నెల్లూరి యాసలో! పద్యం చదవగానే సుబ్బారావు గారు నెల్లూరి వారా యని అనుమానం వచ్చింది!

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. కవిగారి మనోభావం తెలుసుకోకుండా తొందరపడి వ్యాఖ్యానించి నందుకు క్షమాపణలు! నాకు తెలిసిన నమాచారం ఇచ్చాను!

      తొలగించండి

    5. మోమిడి అన్న పదము ఆంధ్రభారతి నిఘంటువు లో కనబడటం లేదండి ; ఇదేమన్నా రెండు పదాల కలయికా?

      జిలేబి

      తొలగించండి
    6. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      జిలేబీ గారూ,
      'మోము+ఇడి = మోమిడి = ముఖం పెట్టు'... పెడమోమిడి = పెడమొగం పెట్టి...

      తొలగించండి
  15. తనయుని కాంతను వీడియు
    తన తపమున జ్ఞానమొంది తాబుద్ధుండై
    తన తండ్రికి మతము నొసగి
    తనయుఁడె తలఁ గొరిగినాఁడు తండ్రికి  సుమ్మీ

    రిప్లయితొలగించండి
  16. ఋణమును దీర్చగ పితరుల
    తనయుడె తలగొరిగినాడు; తండ్రికి జుమ్మీ
    యొనయగ బ్రహ్మపదమ్మును
    తనయుల కుత్తమ పధమును తార్కాణముగన్!

    రిప్లయితొలగించండి
  17. వినయవిహీనుఁడంచిత వివేకమొకించుక లేనియా సుయో
    ధనుఁడు తెగించి దేవవర దత్తుల పాండవులన్ రణంబునన్
    దునిమెద నంచు బల్కి తను దుర్మరణంబు వొందె చూడఁగా
    ననయము పుత్ర హీనతన యా ధృతరాష్ట్రుఁడు గాంచె దు:ఖమున్
    తనయుఁడె తండ్రికిన్ దలను దన్మయ మొందుగ గీకె నవ్వుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "దుర్మరణంబును పొందె..." అనండి.

      తొలగించండి
  18. అనయము ద్రాగు చుండియు సహాయము జేయక దిర్గు చుండగా
    తనయుడె తండ్రికిన్ దలను దన్మయ మొందగ గీకె నవ్వుచున్
    వినుముర దండ్రు లెప్పుడు వివేకము తోడను మెల్గుచో మరిన్
    దనయులు వారి కిత్తురు గ ధైర్యము , ద్రా గక నుండు మార్గమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మరిన్' అన్నదాన్ని వదిలిపెట్టరా?

      తొలగించండి
  19. వినుతింపుము నారాయణు,
    మనుమాతని మహిమ గొల్చి,మంత్రమ్ములచే,
    యనుచును హిరణ్యకశిపుని
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మంత్రమ్ములచే। ననుచును...' అనండి.

      తొలగించండి
    2. వినుతింపుము నారాయణు,
      మనుమాతని మహిమ గొల్చి,మంత్రమ్ములచే,
      ననుచును హిరణ్యకశిపుని
      తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ.
      గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము

      తొలగించండి
  20. వినయమ్మునఁ జని చని తా
    ననునయపు మినుకుల గురుని యతి మర్మంబౌ
    యనుమతి వర్ణంబు లరసి
    తనయుఁడె తలఁ గొరిగినాఁడు తండ్రికి సుమ్మీ


    అనయము వంశవృత్తు లవి యాదరణమ్మున స్వీకరించఁ గా
    ననమున నున్న మేలగును నమ్ముము నిత్యము నాదు పల్కులన్
    ననుపున మంగళప్రదుడు నాపిత వంశ వివర్ధకుండు వే
    తనయుఁడె తండ్రికిం దలను దన్మయ మొందుగ గీకె నవ్వుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      క్షమించాలి... పద్యాలు ఉదాత్తంగా ఉన్నవి. కాని పద్యాల భావాలను అవగాహన చేసికొనలేక పోతున్నాను. దయచేసి వివరించండి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీకు శ్రమ కల్గించినందులకు క్షంతవ్యున్ని.
      మొదటి పద్యములో అనుమతి వర్ణము (pass word) తెలుసుకొని తండ్రి ధనము గ్ర హించినాడని నా భావము.
      రెండవ పద్యము లో మంగలి వారి కులము లో పుట్టిన వాడు ( నాపిత వంశ వివర్ధనుండు) తన తండ్రికి కేశ కర్మము చేసినాడని నాభావము. పొరపాటున వివర్ధకుండు (ఇప్పుడే గమనించాను) అని పడినది.
      పరిశీలించ గోర్తాను.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ధన్యోఽస్మి!
      పాస్ వర్డుకు మీరిచ్చిన 'అనుమతి వర్ణం' నాకు బోధపడక మొత్తం పద్యమే అర్థం కాకుండా పోయింది. మీరు పద్యం క్రింద అనుమతి వర్ణము = Pass word అని ఇచ్చి ఉంటే ఈ ఇబ్బంది ఉండకపోయేది. రెండవ పూరణలో నేను 'నాపిత' శబ్దార్థం కోసం ఒకసారి ఆంధ్రభారతి సంప్రదిస్తే సరిపోయేది. నా పొరపాటే! మన్నించండి.
      మీ రెండు పూరణలు (షరా మామూలే అన్నట్టు) అద్భుతంగా, వైవిధ్యంగా అలరారుతున్నవి. అభినందనలు.
      ఈరోజు నావల్ల మీకు ఏమైనా బాధ కల్గించి ఉంటే క్షమించమని మనసారా కోరుతున్నాను. స్వస్తి!

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీ సమీక్షణ మానంద దాయకమే కాని లేశమైన క్లేశము లేదు.

      తొలగించండి
  21. ఘనమౌ పదవుల కన్నను
    తనకులవృత్తియె మిహియని తలపని గొని నా
    యనకు తనపనిని చూపగ
    తనయుడె తలగొరిగినాడు తండ్రికి సుమ్మీ!!!

    మిహి = మిన్న , తలపని = క్షౌరము

    ఘనముగ చదువగ లేకను
    మనుగడ సాగించు చుండ మంగలి షాపున్
    తన జనకుండరుదెంచగ
    తనయుడె తలగొరిగినాడు తండ్రికి సుమ్మీ!!!

    రిప్లయితొలగించండి
  22. చంపకమాల
    కనులకు వచ్చి శుక్లములు కార్యములేమియు చేయకుండుటన్
    తనయుడె చూచు చుండెతన తండ్రి, స్వయమ్ముగ చేయు వృత్తి, తా
    వినయముతోడ క్షౌరకుల వృత్తినిచేయుచు మందిరమ్మునన్
    తనయుడె తండ్రికిన్ దలను దన్మయమొందుచు గీకె నవ్వుచున్

    రిప్లయితొలగించండి
  23. రణమున నసహాయుండయి
    తనయుడె తల గొరిగినాడు, తండ్రికి సుమ్మీ
    తన తనయుని యొప్పించగ
    ఘనముగ స్వర్గమున కేగె గాండీవి సుతున్ ౹౹

    (తలగి ఒరిగినాడు = తల గొరిగినాడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యం చివర కొంత అన్వయలోపం ఉన్నది.

      తొలగించండి
  24. జనకుడు ములయము నిజ సుతు
    గొని సింహాసనము చేర్చి కూర్మిని జూపన్
    మనమున తన మన తలపక
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  25. చదువుకు,పదవియు కొరకై
    కుదువన పొలమిల్లు బెట్టి కొడుకును సాకన్?
    వదలెను భార్యయు రాగా
    తనయుడె తలగొరిగి నాడు తండ్రికిసుమ్మీ|
    2.వనమున గ్రీష్మతాపమట పైబడ నెంచగ?చెట్లయాకులే
    కనబడ బోని నీడ తనకంటగ| మైమరుపందు నిద్రలో
    తనయుడె తండ్రికిన్ దలను తన్మయ మొందగ గీకె నవ్వుచున్
    మనసుకు మంత్ర తంత్రముగ మాయగ హాయిని బంచగాలియే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

    2. శాస్త్రి గారి కళ్ళు మా గట్టివి :) ద త న ల కి ప్రాస కుదురు తుందను కుంటా నండి

      జిలేబి

      తొలగించండి
    3. క్షంతవ్యుడను...క్రొత్త విషయము నేర్చితిని...ధన్యవాదములు...

      తొలగించండి
    4. శాస్త్రి గారూ,
      ధన్యవాదాలు! అది నా దృష్టికి రాలేదు. అక్కడ ప్రాస దోషమే! జిలేబీ గారన్నట్టు ద-న లకు ప్రాస లేదు.

      తొలగించండి

  26. పిన్నక నాగేశ్వరరావు.

    ఘనతరమౌ పద్ధతిలో

    తనయుండొక క్షౌరశాల తా నిర్మించన్

    మును ప్రారంభించగ పిత
    ( మును ప్రారంభించెద నన )
    తనయుడె తల గొరిగినాడు తండ్రికి సుమ్మీ!

    *********************************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిన్నక నాగేశ్వర రావు గారూ,
      మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  27. తనువును వీడిన తాతకు
    తన తండ్రియెకర్మజేయు తరుణమురాగా
    తనునొక క్షురకుడుకాగా
    తనయుడు తలగొరిగినాడు తండ్రికి సుమ్మీ

    రిప్లయితొలగించండి
  28. కనకపు సింహాసనమున
    తనసుతు గూర్చుండబెట్ట తండ్రి ములాయ
    మ్మును వంచించిన కథవిన
    తనయుడె తలగొరిగినాడు తండ్రికి సుమ్మీ



    జనకుడు పీఠమెక్కెనని సంతసమందుచు పుత్రుడొక్కడున్
    వినయము నేనటించుచును పేదల ముంచుచు వేలకోట్లుగా
    ధనమును కొల్లగొట్టి తన తండిరికేయపకీర్తి తెచ్చుచున్
    తనయుడె తండ్రికిన్ దలనుదన్మయమొందగ గీకెనవ్వుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో "తండ్రికి తా నపకీర్తి..." అనండి.

      తొలగించండి
  29. కనునకు పాప గాపెరిగి కంటికి నందక పారిపోవుచున్
    వనమున బుద్ధుడై వెలిగి వందన లొందుచు శాక్యమౌనిగా
    జనమున వంద్యుడై తరల జాగృతి జేయగ జన్మభూమికిన్
    తనయుఁడె తండ్రికిన్ దలను దన్మయ మొందుగ గీకె నవ్వుచున్

    రిప్లయితొలగించండి