17, ఏప్రిల్ 2017, సోమవారం

సమస్య - 2340 (పగలె శోభించెఁ జంద్రుఁడు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన"
(లేదా...)
"పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

110 కామెంట్‌లు:

  1. సూర్య భగవాను నెప్పుడు చూడ గలము
    పగలె; శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
    నిండు పున్నమి రాత్రిలో నిక్కముగను;
    విరుపు తప్పలే దక్కట! పరువు దక్క!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలు శాస్త్రి గారికి నమస్సులు! చక్కగాచెప్పితిరిగదా! అయినా ఒక్కొక్క తరి విరుపు తురఫు ముక్క.

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      తప్పని విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. ఈ g p శాస్త్రి గారు.. శంకరాభరణం లోని ishani.. శ్రీ ప్రభాకరశాస్త్రి గారు ఒకరేనని అనుమానం.. నమోనమః

      తొలగించండి
    4. మైలవరపు వారలకు వందనములు:

      నేనె ప్రభాకర శాస్త్రిన్
      నేనె "ఇషాని" కిని తాత నిశ్చయ మిలలో
      నేనె ప్రవాసి ఖరగపుర
      నేనే శంకరుని దయన నిండుగ నలరన్

      తొలగించండి


    5. ఖరగపుర వాసి శాస్త్రియు
      తరంగ వేగపు యిషాని తాతయు నొకరే !
      వరమాయె శంకరుని కొ
      ల్వు, రాసి పద్యముల వాసి వురుకులు పడెనౌ !

      జిలేబి

      తొలగించండి
    6. జిలేబి గారల కందాలకు పదివేల వరహాలు!!!

      తొలగించండి
  2. దినకరుడుదయించి రగులు దినము నందు
    పగలె, శోభించె చంద్రుడంబరము పైన
    రాత్రి, గాలి వీచును దివా రాత్రములను
    భేద మించుక లేకయె వినుము బాల.

    రిప్లయితొలగించండి
  3. భాను గాంచిన పద్మాలు పరవశించి
    కులుకు లీనుచు వికసింప కొలను జూడ
    పగలె శోభించెఁ , జంద్రుఁ డంబరముపైన
    కానవచ్చునెప్పుడనుచు కలువ వేచె

    రిప్లయితొలగించండి
  4. పచ్చని పసిడి వర్ణపు పట్టుచీర
    తార లేణాంకు తోడను తరలిరాగ
    నద్భుతంబగు నల్లిక నమరగాను
    పగలె శోభించె జంద్రుఢం బరము పైన!

    అంబరము=వస్త్రము

    రిప్లయితొలగించండి


  5. నిగనిగ లాడు గుండునటు నింగిని సూర్యుడు కాల్చ తారల
    న్నిగలిసి నాట్య మాడగను నిండుగ చుక్కల రీతి నెత్తిపై
    పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
    సెగలను దాచి మానవుని సేనము చట్టన సేద దీరనౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. వగల మారి జిలేబి కవనపు వేడి
    సెగల మధ్యన జనులటు సేద దీర
    పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
    రగడ యన యిదియేగద రత్నమాల !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    ఉస్సురుస్సుల వేసవి నురుకు పరుగు
    లెత్తు జీవిక కళ్ళకు లేవె రెండు
    నీలి రంగుటద్దంబులు నింగి జూడ
    పగలె శోభించె జంద్రు డంబరము పైన!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    వగలె కవిత్వమై జెలగ వన్నెల చిన్నెలు శబ్ద శక్తినిన్
    తెగ గనిపింప జేయుచును తీరిచి దిద్దవె చూపి చుక్కలన్?
    దిగుమల "లాసునాంజెలుసు"దీప్తులు నిన్ను భ్రమింప జేయు నా
    పగలె శశాంకుడంబరము పై విలసిల్లెను ,సత్కవీశ్వరా!
    (LosAngels USA లో భవనంలోనే పైన ceiling కాంతులతో పగలే వెన్నెలను చూపించే మయసభ ఉంటుంది.పెద్ద ప్రదర్శన శాలల్లో యిలాంటి విచిత్రాలు దర్శన మిస్తాయి.)

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టానుండి
    ఆర్యా.'అల' ప్ర‌సిద్ధిని తెలుపును శ.ర "అలపర్జన్యుడు" యాదృశ్చికంగా పడగా సరి జూచుకొన్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. వేద మంత్రాలు వల్లించ విప్రవరులు
    ధరణి పుత్రిక మెడలోన తాళికట్టి
    పగలె శోభించె జంద్రు, డంబరముపైన
    అమరులెల్లదీవించి శుభము లొసగ

    రాముడిని రామ చంద్రుడు అని అనుకొని అల్లాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శుభము లొసంగ' అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
    2. ఆర్యా నమస్కారము ముద్రా రాక్షసము o పడలేదు.

      తొలగించండి
  11. సెలవు లగుటను యాత్రలు చేయుచుండి
    బాలు డొక్కడు నక్షత్ర శాల కేగి
    యచట విజ్ఞాన దృశ్యాల నరయు నపుడు
    పగలె శోభించె చంద్రు డంబరముపైన.

    నగరపు శోభలన్ దెలియు నవ్యకుతూహల మంకురింపగా
    తగునని బాలుడొక్కరుడు తన్మయ మందుచు జేరి యచ్చటన్
    సొగసుల కబ్బురం పడుచు సుందర తారల శాలకేగినన్
    పగలె శశాంకు డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా!

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. ప్రేయసీనీఒడిని నేను ప్రేమ పాన
    చిత్తవివశ పరవశాన సేదదీర
    చలువ పందిళ్ళు వేయగ జాణ కనులు
    పగలెశోభించె చంద్రుడంబరముపైన

    రిప్లయితొలగించండి
  13. రగిలెడు కక్షతో తనను రాహువు మ్రింగగ వచ్చు వేళలో
    జగముల చీకటిన్ విడువజాలక భానుడు నిల్చె నట్టులే
    గగనము నందు, డాసె, గను గ్రక్కున మ్రింగెను
    సైంహికేయుడున్
    పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా.

    రిప్లయితొలగించండి
  14. భగభగలాడనెండ నిటు ప్రక్కనె త్రోవకు , *చీరచెంగు* తా
    *మొగమును దక్క* గప్పి , యొక మోహిని యమ్మగ "కల్లు , ముంజెలన్ ,
    దిగి తన వాహనమ్ము , సుదతిన్ గని యొక్కడు పల్కెనిట్లిదే !
    " పగలు *శశాంకుడంబరముపై* విలసిల్లెను సత్కవీశ్వరా !! "

    పగలు... ఎండలో
    అంబరముపై.... వస్త్రముపై
    శశాంకుడు... ముఖచంద్రుడు


    నేతలో క్రొత్త మెలకువల్ నేర్చి , పడుగు
    పేక లలర చుక్కలను జాబిల్లి కలిపి
    నేయ , జీరను కవులు వర్ణించిరిట్లు
    పగలె శోభించె చంద్రుడంబరము పైన !!

    రిప్లయితొలగించండి
  15. సొగసులు నావినీకలముసొత్తుగవ
    ర్ణనసేయగా మదిన్
    వగలను రేపనాగక, ప్రవాసము వీడితినోయి యోకవీ
    రగిలెనునీదుపద్యమకరందపు మాధురినూహలందులన్
    పగలె శశాంకుడంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రేపనాగక'.... రేపు+అని+ఆగక... అని మీ ఉద్దేశమా? అని యాగక... అని యడాగమం వస్తుంది.

      తొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. పగలె శోభించె చంద్రుడంబరముపైన
    చివరిపాదం

    రిప్లయితొలగించండి
  18. తగ సినిమాను తీయునెడ దర్శకుడాదిగ చిత్రబృందమో
    నగరమునందు దృశ్యములనాణెముగావెస తీయువేళలో
    గగనమునందు కృత్రిమముగా శశిబింబమునేర్పరింపగన్
    పగలె శశాంకుడంబరముపైనుదయించెను సత్కవీశ్వరా
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  19. తూర్పుదిక్కున మెల్లగా తొంగిచూచి
    చాలుచాలంచు పొమ్మన చంద్రుడపుడు
    పడమరను గృంక సూర్యుండు బారెతాను
    పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      "పడమరను గ్రుంక సూర్యుండు గడచె నంత। పగలె..." అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...
      తూర్పుదిక్కున మెల్లగా తొంగిచూచి
      చాలుచాలంచు పొమ్మన చంద్రుడపుడు
      పడమరను గ్రుంక సూర్యుండు గడచె నంత
      పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన.

      తొలగించండి
  20. వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ
    నన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె
    పగలె, శోభించె చంద్రుడంబరము పైన
    స్వాగతమ్మని తీర్చగ వాడలందు
    (శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      తెలంగాణ చంద్రునిపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆంధ్ర చంద్రుడు తక్కువవాడా? అమరావతిలో పగలే వెన్నెల కురిపిస్తున్నాడు. :-)

      తొలగించండి


    2. అమరావతిలో పగలే
      సమరస వెన్నెల జిలేబి చంద్రుడు కురిపిం
      చి మహిష్మతి నగరపు రా
      జమౌళి చిత్రపు కలల మజను గనుచుండెన్ :)

      జిలేబి

      తొలగించండి
    3. అందరికి నొకడె చంద్రుం
      డాంధ్రప్రజల కిరువురు గద నాహాయనగా
      చంద్రు తలదాల్చె నొక్కరు
      చంద్రుడు తానాయెనొకరు చక్రము దిప్పన్!

      తొలగించండి
    4. జిలేబీ గారూ, సీతాదేవి గారూ,
      జంట కవయిత్రుల వ్యాఖ్యారూప పద్యాలు అలరింపజేశాయి.ధన్యవాదాలు!

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    6. గురువుగారికి క్షమార్పణలు! మొదటి పాదంలో ప్రాస తప్పింది! డా.జి.పి.శాస్త్రిగారు సూచించారు! సవరణ కూడా వారిదే!
      వారికి కృతజ్ఞతలు!

      తొలగించండి


    7. చంద్రుం డొకడే గగనము
      నాంధ్ర ప్రజల కిరువురు గద నాహాయనగా
      చంద్రు తలదాల్చె నొక్కరు
      చంద్రుడు తానాయెనొకరు చక్రము దిప్పన్!

      తొలగించండి
  21. వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ
    నన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె
    పగలె, శోభించె చంద్రుడంబరము పైన
    స్వాగతమ్మని తీర్చగ వాడలందు
    (శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)

    రిప్లయితొలగించండి
  22. క్రొత్తగా పెండ్లిజరుగంగ కోడలపుడు
    అత్తవారింటికేగంగనామెభర్త
    పలికె నిట్టుల సుందరీ బాగుబాగు
    పగలె శోభించె చంద్రుడంబరముపైన

    రిప్లయితొలగించండి
  23. భానునిన్ వెస మ్రింగ స్వర్భానుడపుడు
    పగలె శోభించె చంద్రు డంబరముపైన
    వేడితగ్గెను భువిపైన వేగముగను
    విడువగా రాహువు మరల వెలిగె తరణి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని ఒక సందేహం... సూర్యగ్రహణం అమావాస్యనాడు వస్తుంది. ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోను చంద్రుడు కనిపించడు కదా!

      తొలగించండి
    2. మీరన్నది వాస్తవమే. కానీ పూర్ణ సూర్యగ్రహణము లో ఒక క్షణం పాటు చంద్ర బింబం "వజ్రపుటుంగరం" వలె శోభిస్తుంది. దీనిని నేను ఖరగ్పూరులో (1999) చూచియుంటిని.

      __/\__

      తొలగించండి
    3. శాస్త్రి గారూ,
      ధన్యవాదాలు! శాస్త్ర విషయాలు నాకంతగా తెలియదు.

      తొలగించండి
  24. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    మగువదినీసతీమణియెమాటకుమాటజవాబుచెప్పుచున్
    మగమహరాజుమీకునవమానముజేసెనటంచురౌద్రమం
    దగఁదగునే?సతీపతుల తప్పులనెంచుచుకాపురంబులన్
    *పగలె ?శశాంకు డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా*
    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహరాజు' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  25. సెలయు గ్రీష్మ నిదాఘపు సెగలలోన
    నడచు వారలు తాపము నడచివేయ
    దారి చలిపందిరుల చల్ల దప్పి దీర
    పగలె శోభించె జంద్రు డంబరము పైన!

    సెలయు=విజృంభించు

    రిప్లయితొలగించండి
  26. చక్రవాకము లంతట సంతసించెఁ
    గలువ లింపుగ వికసించెఁ గొలను లోన
    హితులఁ గాంచ నేరక విరహిణుల యోరు
    పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన

    [ఓరుపు+అగలె = ఓరుపగలె; అగలు = క్షీణించు]


    ఎగిరెను సాగరమ్ము దన యెల్లల నెల్ల నతిక్రమించుచున్
    గగన విహార మోదమున గంతులు వేసెను గోకపక్షులే
    యగుపడ నంత పట్టపగలై నిసి చోరుల కెల్ల రేఁగెనే
    పగలె, శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా

    [పగలు = విరోధములు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలను చదివి మిమ్మల్ని ఏమని ప్రశసించాలో పదాలకోసం వెదుక్కున్నాను ఇంతసేపు... మీ పూరణ బాగుగా, చక్కగా, ప్రశస్తంగా, ఉత్తమంగా, ఉత్కృష్టంగా అన్న పడికట్టు ప్రశంసాపదాలు పనికి రావు మీ విషయంలో. ఎప్పటికప్పుడు వైవిధ్యంగా ఆలోచిస్తూ, ఆ ఆలోచనను చక్కని ధారతో పద్యనిక్షిప్తం చేస్తున్న మీ భాషాపటిమకు, రచనా నైపుణ్యానికి జోహార్లు. నమశ్శతం!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. మీ నుండి యింతటి ప్రశంస నందుకున్నందులకు ధన్యుడనయ్యాను. మీ ప్రోత్సాహానికి మార్గ దర్శకత్వమునకు సహస్రాధిక వందనములు.

      తొలగించండి
  27. సూర్య గ్రహణపు దినముననార్య!పగలె
    యంధకారమౌటవలన నయ్యదునన
    పగలె శోభించె జంద్రు డంబరము పైన
    సూర్య చంద్రులి రువురును జోతులెగద

    రిప్లయితొలగించండి
  28. నీరజమ్ముల ముద్దాడె సూరుడదివొ
    పగలె, శోభించె జంద్రుడంబరముపైన
    కలువ కన్నెల వలపుల కాంతులెగసి
    నిండుపున్నమి రేయిలో నింగిలోన!!!


    విశ్వకర్మను తలపించ వినుతికెక్కు
    రాజధానిని నిర్మించు రచనజేసి
    యాంధ్రమందున దీర్చుచు నద్భుతముగ
    పగలె శోభించె జంద్రుడంబరముపైన!!!



    రిప్లయితొలగించండి
  29. అష్టదిగ్గజ కవుల మహాద్భు తాంధ్ర
    కావ్యనిర్మాణ చాతుర్య కళకు పొంగి
    వర్ణనా క్రమమున తమవంతు రాగ
    పగలె శోభించె జంద్రుడంబరముపైన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అగణితమైన ప్రజ్ఞ కదలాడెడు మాటలలోన మంత్రమై
      సొగసుగసాగు పద్యముల సొంపగుకావ్యముఁగాగ సూర్యుడా
      గగనపువీధి వీడకనె,కావ్యజగత్తున మీదు వర్ణనన్
      పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా

      తొలగించండి
    2. రాజ్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  30. పట్టుబట్టలు గట్టిరి పగటివేళ
    పడక జేరగ?మిద్దెపై పట్టవాయె|
    ముద్దుముచ్చట జంటకు హద్దు మీరు
    పగలె|”శోభించె జంద్రు డంబరముపైన
    నిశిని పున్నమి వెన్నెల నెగడనీక”
    పగను బెంచెనుయవ్వన ప్రతిభలాగ|
    2.పగలన?గ్రీష్మ తాపమును భానుడు బంచెడి లెండవేడిమే|
    మగువల కామవాంచలకు మార్గమె వెన్నెల పూలనవ్వులే|
    తగదని కోప తాపమును దంపతు లందున మాన్పగల్గులే
    పగలె|”శశాంకు డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా”|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  31. తగు సమయంబు మించునని దైన్యమునొందిన పాండునందనున్
    విగతుని చేయనెంచు కురు వీరుల పీచ మణంగ జేయ శీ
    ఘ్ర గతిని కృష్ణ చక్రమది కాశినిఁ గ్రమ్ముచు దాచి వేయగన్
    పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా

    రిప్లయితొలగించండి
  32. పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
    జగను శోభించె కడపలో పగలు రాత్రి
    మమత శోభించె మోడిపై మండి పడుచు
    మోడి శోభించె మోముపై దాడి తోడ

    అంబరము = అమరావతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      'దాడి' అన్యదేశ్యమైనా మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. సార్! "దాడి" శబ్ద రత్నాకరములో నున్నది:


      దాడి



      దాడి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912      


        గ్రంథసంకేతాది వివేచన పట్టికవై. వి. 


      1. శత్రుజయార్థము దండెత్తిపోవుట; (చూ. జోడఁగి)

      2. గడ్డము.

      తొలగించండి
  33. కవిగారి భార్య ఆవేదన..

    తెల్లవారిన నుండి నీ తెల్గుపద్య
    ములను గోలతో పూర్తిగా ముగిసె జూడు
    పగలె ! శోభించె చంద్రుడంబరము పైన
    ఇంక చాలించి నను గమనింపుమయ్య !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      మీ పూరణలోని చమత్కారం అదిరింది. అభినందనలు.

      తొలగించండి
  34. పగతుడు దుష్టసైంధవుని ఫల్గుణుడొప్పుగ సంహరించుటన్
    సుగమము చేయనెంచి హరి సూర్యునికడ్డుగ చక్రముంచగా
    జగతినినిండె చీకటులు జాగృతి నొందెదివాంధబృందముల్
    వగలె శశాంకుడంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్రహ్మణ్య శాస్త్రి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  35. గగనము నందు భాస్కరుని గాంచిన చాలును విచ్చుతామరల్
    పగలె, శశాంకుడంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
    ఖగుడటు పశ్చిమాచలపు కౌగిలి సేరిన వేళగాంచుమా
    సొగసగు వెన్నెలే కురిసె సోయగ మొప్పెడు కైత వ్రాయుమా

    రిప్లయితొలగించండి
  36. సొగసుగనింగిఁ దూర్పుతటిసూర్యుడుతోచగవిచ్చె తామరల్
    పగలె, శశాంకు డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా
    జగతికి పండువెన్నెలను చక్కగ పంచుచు కూడి భార్యలన్
    మగువలు దాల్చి పూలు నిజ మానిసి జేరగనెంచి వేచెడిన్
    తగుకవితల్ లిఖించి కడు తన్వి నొసంగుము మానసమ్ముకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మానసమ్ముకున్' అన్న ప్రయోగాన్ని గురించిన వ్యాఖ్య సమూహంలో చూడండి.

      తొలగించండి
  37. నమస్కారం...

    నేటి సమస్యకు నా పూరణ...

    పట్ట పగలు పనికొరకు పాకులాడి
    నీరసించి యాదమరచి నిదుర పోవ
    వాడి కలలోన సృష్టియు గాడి తప్పి
    పగలె శోభించె చంద్రుడంబరముపైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పప్పీ(?) గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      ఇది సమూహంలో చదివిన పద్యమే. ఇప్పుడు వెదికితే దొరకడం లేదు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు ఏ ఈమెయిల్ చిరునామాతో పంపినా పద్యానికి ముందో వెనుకో మీ పేరును తెల్పండి.

      తొలగించండి
  38. వైరి వర్గాల నిమిడించు వాంఛ తోడ
    నన్ని జిల్లాల విడగొట్టి నంతఁ దొలఁగె
    పగలె, శోభించె చంద్రుడంబరము పైన
    స్వాగతమ్మని తీర్చగ వాడలందు
    (శ్రీ కేసిఆర్ గారు ఫ్లెక్సీల మీద శోభించి నాడను భావము)

    రిప్లయితొలగించండి

  39. పిన్నక నాగేశ్వరరావు.

    క్రమ్మిన కరిమబ్బు తొలగ రవి కిరణము

    పగలె శోభించె ; జంద్రుడంబరము పైన

    పున్నమి దినము రాత్రి సంపూర్ణమైన

    శుక్ల పక్షపు బింబము శోభలీనె.

    ***************************

    రిప్లయితొలగించండి
  40. నెమ్మదిగ గణేశు వెడలె, నిండు పొట్ట
    పగలె, శోభించెఁ జంద్రుఁ డంబరముపైన
    దొరలె మోదకంబుల జూచి దుడుకుగా న
    శాంతి, శోకమై పార్వతి శాప మొసగె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే... 'గణేశు' అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. 'పగిలె' అన్న క్రియాపదం సాధువు.

      తొలగించండి
  41. భరత పట్టాభిషేకోత్సవమ్ము , రామ
    కాననావాసమును గోర కైక, దశర
    థునకు దోచెను చుక్కలు కనులముందు
    పగలె శోభించె చంద్రుడంబరము పైన !!

    రిప్లయితొలగించండి
  42. ఎడమొగము పెడమొగముగా నిట్టులుండ
    తగునె ? శాశ్వతములొకొ ఈ తగువు బిగువు
    పగలె ?, శోభించె చంద్రుడంబరము పైన !
    ఇట్టి వేళను పాడొనరింపవలదు !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  43. జనులు కార్యములు సలుపు సమయమెపుడు?
    వికసిత కుసుమ శోభల విరులవాటి
    చల్లదనమది జగతికి చాటునెవడు?
    పగలె,శోభించె,చంద్రుడంబరముపైన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల సత్యనారాయణ మూర్తి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. కొంత అన్వయలోపం. రెండవ ప్రశ్న, సమాధానాలలో శోభ పునరుక్త మయింది. నా సవరణలతో మీ పద్యం...
      జనులు కార్యములు సలుపు సమయమెపుడు?
      వికసిత కుసుమ వన మెట్లు వేడ్క గనెను?
      చల్లదనమది యిచ్చు నెచ్చట నెవండు?
      పగలె,శోభించె,చంద్రుడంబరముపైన.

      తొలగించండి
  44. తగులముజూపి పద్యసుమతాడిత మానసమందు నిల్చి నన్
    వగను వివాహమాడియు ప్రపంచ తెనుంగు సభల్గనంగనే
    గ, గడచె కాలమట్లు కనికారము జూపుము తాపమింక నో
    "పగలె, శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా"

    రిప్లయితొలగించండి
  45. ధగధగ లాడు బ్యానరుల ధాటిగ నవ్వెడి నిండుమోముతో
    నిగనిగ మెర్యు రంగులన నీటుగ పూసిన కాస్మెటిక్సుతో
    గగనపు ఫ్లెక్సిలందునను గాలికి హాయిగ చంచలించుచున్
    పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా!

    రిప్లయితొలగించండి