29, ఏప్రిల్ 2017, శనివారం

న్యస్తాక్షరి - 40 (శ-కుం-త-ల)

అంశము- శకుంతలా దుష్యంతుల ప్రణయము
ఛందస్సు- తేటగీతి
మొదటి పాదం రెండవ గణం ప్రథమాక్షరం 'శ'
రెండవ పాదం మూడవ గణం ప్రథమాక్షరం 'కుం'
మూడవ పాదం నాల్గవ గణం ప్రథమాక్షరం 'త'
నాల్గవ పాదం ఐదవ గణం ప్రథమాక్షరం 'ల' ....ఉండాలి!

87 కామెంట్‌లు:

  1. పరవ శవదనమున బల్కె ప్రాణనాథ !
    నే విరహమోప కుందునె? నీవులేక
    తాపము పరితాపంబును తగ్గ వోయి
    మరువక గొనుమ ననునిక మనక లయిక.
    (పరితాపము= భయము/కంపనము)

    రిప్లయితొలగించండి
  2. నాదు శపథమ్మిదియె ప్రియే! నమ్ము నన్ను!
    నీదు పసుపును కుంకుమ నిక్కముగను!
    త్వరగ నంపెద సుకుమారి! తల్లడిలకు!
    భారమౌ నీ విరహము సౌభాగ్య లక్ష్మి!

    రిప్లయితొలగించండి
  3. భరతుని విరహ వేదన
    మదను శరణము కోరి నే మనసుజారి
    తరుణి!నిను గాంచకుండ నే నుండగ లనె?
    తవ్వి!భరతుడ! నిను గూర్చి తలచి తలచి
    విరహ తాపము నోర్తునా! వేగి చాల.

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      భరతుడు కాదు, దుష్యంతుడు అని గమనించండి.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదాన్ని "తన్వి! దుష్యంతుడను నిన్ను తలచి తలచి" అనండి.

      తొలగించండి
  4. నేను శక్తి సంపన్నుడ, నిన్ను వలచి
    నాను,వినుము శకుంతలా, నేను మాట
    తప్పని ఘనుడ , కణ్వసుతతనయుండు
    నాదు రాజ్యము నేలును, నావలపుల
    వామ లోచనా, సుందరీ, వలదు శంక
    నీకు, నాచేయి గైకొని నీవు నన్ను
    పరిణయమునాడ వలయును భంగ పడక

    రిప్లయితొలగించండి
  5. మదన శరమును బోలిన మౌనికన్య
    మందయాన శకుంతల మనసుదోచి
    తరణి వంశజుడు దమకు తగినరీతి
    కోరి గాంధర్వరీతిని కోర్కెలలర
    పరిణయము నొందె ప్రణయము పండగాను!

    రిప్లయితొలగించండి
  6. అక్క్రాలుBoldచెయ్యటం,Highlightచెయ్యటం, underline చెయ్యటం నాకు తెలియదు క్షమించండి

    రిప్లయితొలగించండి
  7. విరహ తాపము నోర్తునా వినుము వలన
    4వపాదం ఇలా చదువ ప్రార్ధన
    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
  8. సవరంచిన పద్యం
    మదను శరణము కోరి నే మనసు జారి
    తరుణి నిను పొందకుండగా తరమె నాకు
    తగిన మగడను నినుగూర్చి తలచి తలచి
    విరహ వేదన భరియింప! వినుము లలన!!

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
  9. పంచ శరముల యోధుడో యంచయాన!
    యిపుడిదె నను (శ)సుకుంతలా! యేర్చుచుండె
    తాళ లేనింక చేరుమా తడయకుండ
    ముదము గూర్చుము రమ్ము నా హృదయలక్ష్మి!
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  10. విధియు,శనివలన మనము విడివడితిమి
    విరహపు కొలిమి కుండలుగ రగిలితిమి
    తరలె చెడుదినములు మన తనయు వలన
    నని పెనగొనె పతి, భరతుజనని లతగ!

    రిప్లయితొలగించండి


  11. జూచె శమనపు రమణిని, చూర గొనగ
    మది, వనమునందు కుందన మగుచు రాజు
    తరుణిని వరించె గాంధర్వ తరము గాన,
    మరిచె నగరము తిరుగన, మవురి లలన !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పద్యాన్ని సరళాదేశంతో మొదలు పెట్టారు.'చూచె' అని కదా ఉండవలసింది. 'శమనపు రమణి'...? 'తిరుగన మవురి'...?

      తొలగించండి
  12. డా.పిట్టా
    మరుని శ*రముల ద్రోయు నీమంబు యిదియ
    తాళ జాల శకుం*తలా!తరళ నయన
    తరుణ మిదియె దుష్యంత్యంక త*ల్పమందు
    రాణివై వరాజిలగ రా!రమ్ము, ల*లన!

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా
    రాణివై "విరాజిలగ" గా చదువ ప్రార్థితుడను,ఆర్యా,"వ"టైపాటు,old age effect.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      'నీమంబు+ఇదియ' అన్నపుడు సంధి నిత్యం. "నీమంబె యిదియ" అందామా? "దుష్యంత+అంక= దుష్యంతాంక" అవుతుంది. "దుష్యంతాంకతల్పమందు" అనండి. మీరు 'దుష్యంతు+అంక' అనుకుంటే మొదటిది దుష్యంతుని అనే అర్థంలో తెలుగు పదం. దానిని సంస్కృత పదంతో యణాదేశ సంధి చేయరాదు.

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా ధన్యవాదములు,అలాగే సరిచేసుకున్నాను,కకతజ్ఞతలు.

      తొలగించండి
    3. డా.పిట్టా
      ఆర్యా ధన్యవాదములు,అలాగే సరిచేసుకున్నాను,కకతజ్ఞతలు.

      తొలగించండి
  14. మదన శర పీడితుండయి మనుజ విభుఁడు
    కణ్వసుత నీలకుంతలఁ గనియు బాస
    లెన్నియో చేసి పెండ్లాడి తన్వితోడ
    సుఖము లందె నా వనమందు శుభములఁ గనె.

    రిప్లయితొలగించండి
  15. దుష్యంతుడు శకుంతలతో :

    కుసుమ *శ*రములు నాటె నీ నొసటి విల్లు
    వలపు సిరి పంచు *కుం*దమే వనజ నయన
    యొప్పు గాంధర్వమను పెళ్లి *త*ప్పు గాదు
    గౌరవింతు నిన్ నా వంశ చారు *ల*తగ

    రిప్లయితొలగించండి
  16. అరయ శర్వుని రాణిని నాశ్రయింప
    భక్తి భావమకుంఠిత భావమవ్వ
    తనదు భక్తుల కాచును తల్లివోలె
    చూడగోరెద నన్నిక శుభము లలర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      పద్యం బాగుంది. కాని ఇది ఎవరు ఎవరితో అన్నారు? ఎక్కడా శంకుంతలా దుష్యంతుల ప్రస్తావన లేదు.

      తొలగించండి
    2. పద్యం వ్రాసినప్పుడు ఇచ్చిన అంశం మరచిపోయి వ్రాశాను.అందుకే మరల వ్రాశాను.దయచేసి చూడగలరు.

      తొలగించండి
  17. మరుని శరముల జిక్కితి మంజువాణి
    బిడియమేల శకుంతలా! ప్రియవధూటి
    దరికి రావేల కణ్వుని తనయ నిన్ను
    హృదయరాణిగ జేకొందు మధుర లలన!!!

    రిప్లయితొలగించండి
  18. అరయ శర్వుని రాణిని నాశ్రయింప
    భక్తి చూడనకుంఠిత భావమవ్వ
    తనదు భక్తుల కాచును తల్లివోలె
    చూడగోరెద నన్నిక శుభము లలర

    రిప్లయితొలగించండి
  19. మదన శమమది కలుగను మానితాంగి
    కామినివి నీవకుంఠిత కన్య గాదె
    తవులుకొమ్మిక నన్నిట తనివితీర
    చూచుచు దుష్యంతుడడిగెను సుఖము లలర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ చివరి పాదం ప్రారంభంలో గణదోషం. "చూచి దుష్యంతు డడిగెను..." అనండి.

      తొలగించండి


  20. చూచె శమనపు రమణిని, చూర గొనగ
    మది, వనమునందు కుందన మగుచు రాజు
    తరుణిని వరించె గాంధర్వ తరము గాన,
    మరిచె నగరము వెడలగ, మవురి లలన !

    జిలేబి

    సరియేనా ? శమనపు రమణి - శాంతిశ్రీ - శకుంతల

    మవురి లలన నాగస్వరమైన లలన - శకుంతల

    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. తే.గీ।।
    పంచశరుదూపులకుజిక్కిపరవశించి
    తరుణిపతివంకకుంజూడదాయె,సిగ్గు
    దఱుమ పతియుహర్షపులకితమతియయ్యె
    మేనకాసుతగూడెనుమేనులలియ.

    రిప్లయితొలగించండి
  22. కుసుమ శరుడంత బాణముల్ కొసరివేయ
    రాజ చంద్రుండు కుందన రాశియైన
    తరుణి కౌశికపుత్రిని తలపులోన
    నిలుప నామెయు మనసిచ్చె నిర్మలముగ
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  23. మైలవరపు మురళీకృష్ణ గారి (వాట్సప్ పూరణ)....

    భ్రమరశబ్దమ్ము విని దాని బాటనేగి
    గాంచి బంభరకుంతలన్ కణ్వసుతను
    వలచె దుష్యంతుడును శకుంతలను, నిలను ,
    గొప్ప కావ్యమ్మునమరె శాకుంతలమ్ము !!
    ******
    చిటితోటి విజయకుమార్ గారి (వాట్సప్) పూరణ....

    కుసుమ శర శర తప్త శకుంతల మఱి
    ప్రణయి దుష్యంత కుంభినీ పాలకుండు
    తనరు ప్రణయాబ్ధిలో మున్గి తనిసి సొలయ
    ప్రమదమందె నేణులు శకుంతములు లతలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ, చిటితోటి వారూ,
      మీ యిద్దరి పూరణ మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  24. ప్రసవ శరముల మదనుండు విసరుచుండ
    ప్రణయ మాధుర్య కుంజమ్ము పరిమళింప
    నిలిపె మేనకనందనన్ తలచి రాజు
    వలచె దుక్ష్యంతు తానును లలనయపుడు
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      బాగుంది మీ పూరణ. "మేనకా నందనన్" అనండి. చివరిపాదంలో ఐదవ గణం మొదటి అక్షరం 'ల'. మీరు నాలుగవ గణం మొదటి అక్షరంగా ప్రయోగించారు.

      తొలగించండి
  25. దుష్యంతుని సంభాషణము
    మదన శరములు తాకెను మనము పైన,
    నేను ఘనముగా కుంభిని నేలు చుంటి,
    ధాత కైనను పొగడంగ తరము కాదు
    నీదు సుందర రూపము, నీకలయిక
    దైవ నిర్ణయంబు మనకు, దేవ లోక
    అప్సరస శాపగ్రస్తఐ అడుగు బెట్టె
    నీ అడవిలోన,సీమంతినీ జనకుని
    ఆజ్ఞ కోరుట న్యాయమే, అలరు బోడి
    నన్ను నమ్ముము, దుష్యoతుడన్నమాట
    తప్ప బోడు, నీ తనయునే ధరణి పైన
    రాజు గా చేతు,ఇంతిరో, రమ్ము కరము
    పట్టి నాడెద ఇప్పుడే పరిణయమ్ము




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దేవలోక+అప్సరస' అన్నపుడు సవర్ణదీర్ఘ సంధి. విసంధిగా వ్రాయరాదు. "పట్టి యాడెద..." అనండి.

      తొలగించండి
  26. పరవశము జెంది చూడగఁ బడతి నచట
    ఋషి వరేణ్యు నికుంజ పరిసర చరిత
    తరళ తను సుమాపచయ సంతత రతాత్మ
    భూరి దుష్యంతుఁడు వరించె భూతలమున

    రిప్లయితొలగించండి
  27. [4/29, 11:09 AM] sreeramaraochepuri: కుసుమ శరఘాతపరవశ కోమల దేహ
    వికస విదళిత కుంతలప్రేమ భరిత
    తాళజాలని తపమున తల్లడిల్లి
    మురిసిదుష్యంతునొడిలోన మురిసె లలన
    [4/29, 11:10 AM] sreeramaraochepuri: మురిసి దుష్యంతు నొడిలోన మునిగె లలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదం చివర గణదోషం. "కోమల తను" అనండి.

      తొలగించండి
  28. దశమిశనివార మందున దశయటంచు
    కుంతలముల శకుంతల కూర్పునేర్పు
    దలచిదుష్యంతు డత్యంతతలపునందు
    కలసి పెళ్ళాడనెంచెనుకాంక్ష లమర|

    రిప్లయితొలగించండి
  29. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*
    29, ఏప్రిల్ 2017, శనివారం

    *న్యస్తాక్షరి - (శ-కుం-త-ల)*

    *అంశము- శకుంతలా దుష్యంతుల ప్రణయము*
    *ఛందస్సు- తేటగీతి*
    *మొదటి పాదం రెండవ గణం ప్రథమాక్షరం 'శ'*
    *రెండవ పాదం మూడవ గణం ప్రథమాక్షరం 'కుం'*
    *మూడవ పాదం నాల్గవ గణం ప్రథమాక్షరం 'త'*
    *నాల్గవ పాదం ఐదవ గణం ప్రథమాక్షరం 'ల' ....ఉండాలి!*

    *ఇక్షుశరలీలదుష్యంతువక్షమెక్కె*
    *వయసుమనసు శకుంతలన్ మాయ సేయ*
    *తప్పుఁతలపక ప్రేమలో తడిసెఁజంట*
    *రాత్రిరాక నరయకన్ పరవశులగుట*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ పూరణ బాగున్నది.అభినందనలు.
      (ఒక మనవి.. మీరు కేవలం పూరణను ప్రకటించండి)

      తొలగించండి

  30. అదిగొ శశి కాంతులీనెడీ యద్భుత వని
    ప్రేమబాణ నికుంజ ప్రకామ ధునియు
    తనను వలచెడి దుష్యంతు తలచు కొనుచు
    జేరె మృదుహాస హేలల దీరె లలన!

    రిప్లయితొలగించండి
  31. పరవశమున శకుంతల మురిసి పోయె
    నుదుటిపైదిద్ది కుంకుమ - ముద్దుపెట్టి
    తాళికట్టి చేసికొనగ తనను సతిగ
    కోరి దుష్యంతు పెనవేసికొనెను లతగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదం యతి తప్పిందని అన్నపరెడ్డివారు సూచించారు..ధన్యవాదాలు సార్..సవరించిన పూరణ
      పరవశమున శకుంతల మురిసి పోయె
      నుదుటిపైదిద్ది కుంకుమ - ముదముతోడ
      తాళికట్టి చేసికొనగ తనను సతిగ
      కోరి దుష్యంతు పెనవేసికొనెను లతగ

      తొలగించండి
    2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. వేగ శరపరంపరలను వేయ మరుడు
    కాంచి సుదతి శకుంతలఁ గరము తృప్తి
    తన్విరూపము మదిలోన తళుకు లాడ
    కోరివరియించె ప్రీతినా కోమలాంగి (గోత్రలలన)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      గోతలలన అంటే కులీనురాలు అని మీ భావమా?

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. గోత్రము అంటే అడవి అనే అర్థం లో - అడవిలో కాంచిన స్త్రీని " గోత్రలలన" అని ప్రయోగించాను. ఇది దుష్ట సమాసమా? దయతో తెలియ జేయ ప్రార్థన.

      తొలగించండి
  33. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరవశమ్మును గొల్పు నీపాట వినిన
    నాదు మనమో శకుంతలా! నాట్యమాడె
    తన్మయమ్ము ననుచు తన్వి తరపు జేరి
    కోరి వలచె దుష్యంతు శకుంతలనట

    రిప్లయితొలగించండి
  34. మదన శరములు రువ్వుచున్ మరులు గొలుపె
    కలికి గనతాళ కుంటిని గాదె కణ్వ
    తనయ బెండ్లాడు టన్నది తథ్యమనుచు
    నామె కెరిగింపు మీవిషయమ్ము లలన

    విరులె శయ్యగా మార్చిన ప్రియుని గాంచి
    మగువ సిగ్గిల్లి కుంతలమందు మోము
    దాచుకొనగను ప్రేమతో తరుణి నుదుట
    ముద్దులాడగ దరిచేర మురిసె లలన

    మదన శరములె వేధింప మత్తులోన
    కణ్వుడచట లేకుండుటన్ గాంచినృపుడు
    తాపమందున జేరెనా తరుణి గోరి
    కపట భాషణలాడగన్ కరిగెలలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూర్ణశశిబింబవదన ! నీ పొందు గోరి
      నీలబంభరకుంతలా! నిలిచి యుంటి !
      ధరణిపతి నేను , కణ్వర్షి తనయవీవు ,
      పుట్టబోయెడి వాడేలు బుడమి లలన !!


      పడతి ! శక్తిని గలిగిన *బాహుబలి*ని !
      రమణి ! వర కుచకుంభ ! నే *రాజమౌళి*
      దయను , ప్రియశకుంతల ! నాదు తలపు నీవె !
      నన్ను జేరుము దేల్తునానందలహరి !!

      తొలగించండి
    2. విరించి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      *****
      మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  35. పూర్ణ శశివద నామని పూలుగోయు
    వేళ గాంచె శకుంతలన్, వేగిరమున
    తలపులో ప్రేమ యుప్పొంగ తక్షణంబె
    పరిణయంబాడె దుష్యంతు డరుణలలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శశివదనామని...', అరుణ లలన'...?

      తొలగించండి
    2. గురువర్యులకు దన్యవాదములు పద్యమును సవించాను

      పూర్ణ శశివదన వనిని పూలుగోయు
      వేళ గాంచె శకుంతలన్, వేగిరమున
      తలపులో ప్రేమ యుప్పొంగ తక్షణంబె
      పరిణయంబాడె దుష్యంతు డమలలలన

      తొలగించండి
  36. సుమపు శరములు గలిపెను చూపు లనఁగ
    మరులు గొలుప శకుంతల మార్దవమున
    ధరణి పులకించె దుష్యంతు తలపు వలన
    శుభము గాంధర్వ విధిలోన శోభ లలరె
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి


  37. మరుని శరమది తాకగ మనసు మురియ
    వనమునందు శకుంతలన్ వాసిఁగనుచు
    ధరణిపతికి నచ్చో టనె తమియు నధిక
    మవగ మదిని తోషమునందె నతివఁ లలిని.

    రిప్లయితొలగించండి