1, జూన్ 2018, శుక్రవారం

దత్తపది - 140 (కామ-భామ-మామ-రామ)

కామ - భామ - మామ - రామ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

73 కామెంట్‌లు:



  1. పంచ పాండవులు - శ్రీకృష్ణుడు ;
    నేను కావాలో నా సైన్యం కావాలో తేల్చుకో అర్జునా !


    మా మది లో నిలిచితి వ
    య్యా! మురళీధర! కొలుతుమయా! రా ! మవ్వం
    పై మావైపు సకా! మము
    నీ మది శోభామయముగ నిల్పుకొనుమయా !

    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సఖా'ను 'సకా' అన్నట్టున్నారు!

      తొలగించండి
    2. 'సకుడు' శబ్దం ఉన్నది. మన్నించండి!

      తొలగించండి
  2. (భీమసుయోధనుల గదాయుద్ధం )
    కాంచనపు కామ నొప్పారు గదను ద్రిప్పి
    భామ ముప్పొంగ ధీరుడు భీముడపుడు
    "మామకీనము నీయూరుమర్దనమ్ము ;
    రామకిక శాంతి రారాజ! రార !" యనియె .

    రిప్లయితొలగించండి
  3. శుభ కామనలతో కృష్ణ సత్యభామలు
    వెలుగగ మోములందు వేయి చందమామలు
    దీవించిరదె బలరామ సుత శశిరేఖను
    వెలయించిరి పెండ్లికి తాము శుభలేఖను

    రిప్లయితొలగించండి


  4. మధురానగరి సకా ! మది,
    యధరములున్వేచెనయ్య యవనారీ రా !
    మదన! సభామర్యాద గొ
    ను! దవళముగ మా మనసున నురికె కవనముల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    సుయోధనుడు మయసభ లో.... ఇట్టిది పాండవులకు కలదని.. తమకు లేదని పరిహసించుటకు విడిదిగా ఏర్పాటు చేసినట్లు భావిస్తూ....

    ఈ మయనిర్మితిన్ పరిహసించుటకా ? మము జేర్చినారు , శో...
    భామయ రత్నదీపిత సభాంతరవారిజ కుడ్యచిత్ర ని...
    స్సీమితదివ్యకాంతులు విచిత్రముగా కనువిందు జేయుచున్
    మా మది దోచె , నిట్టిదిక మాయురె ! లేదవురా ! మహీస్థలిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  6. కీచకుడు -


    మా మది కలవరమయె రమామణీ ని
    ను గని ! గలభా మరి వలదు !నొవ్వ జేయ
    నేల! గంధర్వుడిక రాడు! నెయ్యపు కర
    ములివి ! గొను! కామ నీకు సముచిత మరుని ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రామ' శబ్దం? 'కామ నీకు సముచిత మరుని' అర్థం కాలేదు.

      తొలగించండి
  7. సైరంధ్రితో కీచకుడు
    కామనయుఁగల్గె నీపైన కంజనేత్రి!
    నీ శుభా మహితోక్తులు నెమ్మి నమ్మి
    మామకాదర్శములు వీడి మనసు పడితి!
    రామణీయకతానంద ధామమీవె!

    రిప్లయితొలగించండి
  8. ఏమా మయసభ యందము
    కామన చేయగ వింత కవనము లల్లన్
    రామకపు సొగసు లున్నవి
    భామము భాసిల్లు నట్టి భవనం బనగా

    రామకము = సంతోష పఱచునది
    భామము = కాంతి



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "కామన చేయంగ..." అనండి.

      తొలగించండి
    2. ఏమా మయసభ యందము
      కామన చేయంగ వింత కవనము లల్లన్
      రామకపు సొగసు లున్నవి
      భామము భాసిల్లు నట్టి భవనం బనగా

      రామకము = సంతోష పఱచునది
      భామము = కాంతి

      తొలగించండి
  9. {మా మ}దిని దోచిన వనితా. మనసు పడితి
    బంగరు చిలు{కా, మ}రుడు భాధ పెట్టు
    చుండె ,ఆ{రామ} వాహ్యాళి గుండెకు నిడు
    సంత సమ్ము, రం{భా మ}రు శరము నీకు
    తగుల లేదా యని బలికె ద్రౌపది గని
    కీచ కుండు యెల్ల జనులు చూచు చుండ

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది
    ఇచ్చిన పదాలు :: *కామ భామ మామ రామ* (అన్యార్థములో) విషయం :: భారతార్థం
    సందర్భం :: రాయబార సభలో శ్రీ కృష్ణ భగవానుని విశ్వరూపాన్ని దివ్యనేత్రములతో దర్శించుకొన్న ధృతరాష్ట్రుడు ఓ యదునాయకా! భక్తపాలకా! శ్రీకృష్ణా! నా మనస్సులో కొలువుదీరి ఉండవయ్యా నిన్నే కీర్తిస్తానయ్యా మాయను తొలగించవయ్యా పుత్రవ్యామోహాన్ని పోగొట్టవయ్యా కొడుకులమీద ఉన్న మమకారంతో నేను చేసిన తప్పులను క్షమించవయ్యా నన్ను కాపాడవయ్యా అంటూ ప్రార్థించే సందర్భం.

    శ్రీ యదునాయ(కా! మ)ది వసింపుము, నీదగు విశ్వరూపమున్
    బాయక సన్నుతింతు ప్రతి(భామ)తి! నే ధృతరాష్ట్రుడన్ మహా
    మాయను ద్రుంచివేయు మిక (మామ)క మోహము నెల్ల వీడగా
    జేయర! బ్రోవ(రా! మ)మతఁ జేసిన తప్పులనే క్షమించరా!
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (1-6-2018)

    రిప్లయితొలగించండి
  11. రాయభారానికేగు చున్న కృష్ణునితో పాండవుల పలుకులు:
    భీరులము మేము {కామ}ని విన్నవించు
    పద్మనా{భా! మ}నసెఱుగు బంధువీవు
    {మామ}తమిది యని తెలుపు మరువకయ్య!
    యడ్డు {రామ}ని శాంతికి యరచి చెప్పు!
    ****)()(****

    రిప్లయితొలగించండి
  12. జూదమున ఓడించి పాండవులను వన వాసమునకు పంపిన తదుపరి తన సోదరునితో దుర్యోధనుడు బలికిన మాటలు
    మామ మాటల తోడ మా మదికి కలిగె
    తెరపి, ఆరామ వాసము తీర్చు నుపగ,
    యిందుకా, మన మామకు ముందు జూపు
    నధిక మే, గలా భా మన నష్ట కార
    ణమ్మని పలికి మనతోడ నప్పుడ నుచు
    రంజ నమ్ముగ బల్కెను రాజ రాజు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. డా.పిట్టాసత్యనారాయణ
    (విశ్వరూప సందర్శనము, ధృతరాష్ట్రునితో మౌన సంభాషణము జేయుచు...)
    "కోర్కెలు దీరు*రా!(నీ కోర్కెలు దీరుననుకుంటున్నావా?)మ*హిని గూర్చు స*భా మ*రియాద యిట్టిదా?

    మార్కొను జ్ఞాతి బృందము సు*మా మ*హితాత్ములు జూడ నగ్నులే
    మూర్కొనవా దురాత్మ!యిక మోక్షము కెన్నడు చింతజేయ? నీ
    వూర్కొన బుత్రనాశనపు బుణ్యము*కా? మ*రిచేవు సత్కృతిన్!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మరిచేవు' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
  14. కీచ'కా! మ'దీయ పతులగోచరులయి
    నన్ను క్షో'భామ' యార్తగాఁగన్న, నిన్ను
    మడతు'రా మ'హా గంధర్వులడరుమీవు
    చూపబో'కుమా' మదమింతనాపుమింక

    రిప్లయితొలగించండి
  15. అర్జునుడు కృష్ణునితో పలుకుట
    పురుషోత్త (మా! మ)ది పరవశ మ్మొoదెను, విశ్వరూపము కాంచ, వేద గర్భ!
    బ్రహ్మనా(భా! మ)ది భ్రాంతిని వీడెను నీ బోధనల తోడ, నీరజాక్ష!
    గోపాల(కా! మ)ది కోరుచుం డెనిపుడు సమరము, పట్టెద శరము నిపుడు,
    దామోద(రా! మ)న తార్క్ష్యము నడుపుమ నీకపు సరసకు నిర్భయముగ
    నేను జేతును యద్ధము, దాన వాంత
    కా గధాధరా! కేశవా! కంబు పాణి !
    మాధవా!మధుసూధనా! మన్నన మిడు
    మయ్య యనుచు బలికె నల్లనయ్య తోడ



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. గు రు మూ ర్తి ‌ ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,


    .............. ద్రౌపది కీచకునితో ................


    గుణవతు లయిన రామలకు పరిరక్ష

    ణమ్ము లేదె మీ రాజ్యమున ‌? దగని దగు

    కామనన్ వెంటబడు కీచకా వినుము | మ

    దీయ పతుల కీ విషయమ్ము తెలిసె నేని ,

    చండ శౌర్య భామల ప్రతి స్పర్శ తోడ

    భస్మ మొనరింత్రు | మెలగుము భయము కలిగి |



    { రామలకు = స్త్రీలకు ; చండ శౌర్య భామలు =

    భయంకర మైన శౌర్య కిరణములు }

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  17. మయ సభ ను గాంచిన సుయోధ ను డు ___:
    రామ ణీయక మయ సభ ర హి ని గాంచి
    మామక మది లో జనియించె మత్సరం బు
    నీ సభా మహి మ ల నెన్న నీ శుకై న
    బ్రహ్మ కా మ నో జ్ఞ ప్ర శం స వలను గాదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  18. డా.పిట్టాసత్యనారాయణ
    (విశ్వరూప సందర్శనము, ధృతరాష్ట్రునితో మౌన సంభాషణము జేయుచు...)
    "కోర్కెలు దీరు*రా!(నీ కోర్కెలు దీరుననుకుంటున్నావా?)మ*హిని గూర్చు స*భా మ*రియాద యిట్టిదా?

    మార్కొను జ్ఞాతి బృందము సు*మా మ*హితాత్ములు జూడ నగ్నులే
    మూర్కొనవా దురాత్మ!యిక మోక్షము కెన్నడు చింతజేయ? నీ
    వూర్కొన బుత్రనాశనపు బుణ్యము*కా? మ*రిచేవు సత్కృతిన్!"

    రిప్లయితొలగించండి
  19. నడకా మనోహరము! ని
    న్నొడిజేర్చ ప్రభా మతల్లి యూర్వశి విజయా!
    తడబడడమా! మదన! నీ
    బిడియము విడరా మగువయె ప్రేమను పంచన్!

    రిప్లయితొలగించండి
  20. నరవరా! మదిగెలిచిన నరుడ వంచు
    మా మది మురిసె జాగేల మగువ జేర
    కృష్ణ వల్లభా! మన్మథ కీలలింక
    వేగలేను రాకా మంథి వీవె కదర.

    రాకా ...పున్నమి
    మంథి... చంద్రుడు.

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. అర్జునుఁడు కృష్ణునితో:

      భామ నిభ తేజ! రవిసో
      మామర వంద్య! నలినాయతాక్ష! రుచిర స
      త్కామ బహుళ! ముని హృదయా
      రామ! మురారీ! బుధజన రక్షా దక్షా!

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      కృష్ణ సూర్య కుమార్ గారు నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి


  22. మా మత్తల్లిక సత్యసంధకు సభామర్యాద నేజేతురా!
    కామయ్యా భయసీలులైన మనుజుల్ కామయ్య! మా మానినిన్
    నీమమ్ముల్తొఱగించి నీడ్చితివిగా! నీరక్తమున్ద్రాగెదన్
    రా!మత్తేభముగాక్రమించెదనురా రావంబిదే! భీముడన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భయశీలురైన' అనండి. అలాగే "తొలగించి యీడ్చితివి' అనండి.

      తొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    [పాండవులు వనవాస ప్రస్థులైనప్పు డెందఱో బ్రాహ్మణులు వారి ననుసరించి, యడవులకు వెడలిరి. వారి పోషణభారము పాండవులపైఁ బడఁగా, ధర్మరాజు సూర్యు నుపాసించి, యక్షయపాత్రనుఁ బడసెను. దానిచే నందఱును క్షుద్బాధ యనునది లేక, హాయిగ నుండిరి. ఒకనాఁడు కౌరవుల పనుపున దూర్వాసుఁడు పాండవుల కడ కేతెంచి, నదీ స్నానానంత రాతిథ్యము కోరి, నది కేఁగఁగా, నక్షయపాత్ర నప్పుడే శుభ్రపఱచి, దాచిన విషయము ద్రౌపది ధర్మరాజున కెఱింగించెను. అప్పు డాతఁ డా యాపదనుండి గట్టెక్కింపఁ గృష్ణునిఁ బ్రార్థించు సందర్భము]

    శ్రీ కృష్ణా! హరి! గోపికా మదన! శౌరీ! పర్వతోద్ధారకా!
    రాకా చంద్ర నిభా! మహేశ సఖ! సర్వానంద సంధాయకా!
    మా కీ యక్షయపాత్ర భోజ్య మిడియున్ మన్నింపుమా మమ్మిఁకన్!
    నీకై వేచితిఁ, గావరా! మధురిపూ! నీలాభ్రదేహా! ధ్రువా!

    రిప్లయితొలగించండి
  24. దుర్యోధనుడు తండ్రితో

    జనకా! మదీయ జ్ఞాతుల
    కనుమతి నారామ మేగ కాదన కిడుమా!
    చనునా మామధ్య పగలు?
    మనసున జన వల్లభా! మమత నెంచకుమీ!

    రిప్లయితొలగించండి
  25. ద్రౌపది కృష్ణునీతో
    తే: కడుఁ ప్రకామ గతిని వార లడుగిడుచును
    నిండు కురుసభామధ్యము నిర్భయముగ
    వలువ లూడ్చి మా మర్యాద పాడు చేసి
    పంపిరా మకురులు మమ్ము వనములకును(వనములకట)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కడు' తరువాత అరసున్న ఎందుకు?

      తొలగించండి
    2. బ్రకామగతి అనివ్రాయబోయి ప్ర టైపు అయ్యింది

      తొలగించండి
  26. దత్తపది :-
    *కామ - భామ - మామ - రామ*
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    భారతార్థంలో
    నచ్చినచందంలో

    తే.గీ*

    (మా మ)దిన వి(రామ)ము లేక నీ మనోజ్ఞ
    రూపమే బాలి(కా మ)ణీ కోప పడకు
    నీ కొరకు స(భా మ)ర్యాద నియతి దప్పి
    కపట యతి రూప మెత్తిన కవ్వడీని
    ...................✍చక్రి

    (అర్జునుడు సుభద్ర తో....)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కవ్వడేను' అనండి.

      తొలగించండి
  27. రా!మమకాంరంబిడగా
    మామది పులకించె నేడు మౌనసుభద్రా
    కోమలి ప్రతిభా మక్కువ
    ఈమునికా?మమతలన్ని యీడేర్చుటకా?
    (అర్జునుడుమునివేషాన నున్నసంధర్బము)

    రిప్లయితొలగించండి
  28. కురుసభామధ్యమున కీడ్చు కొనుచు రాంగ
    కృష్ణకా మరదిపయిన కింక పుట్ట
    కాన్చిరామగలు ధర్మము కట్టిపెట్ట
    పినుగు చందమామల్లులు పేలకుండె

    పేలు=సెగ(కోపపు) చేత ఉబుకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపు దోషాలున్నవి.

      తొలగించండి
  29. కామము తీర్చగ రాహరి
    మామకభీష్టములు దీర్చు మాధవుడీవే
    రా,మము కావంగశశిని
    భా,మహిని నినువిన బ్రోచు వారెవరయ్యా.



    2.రా,మధుసూధన మాధవ
    మామనవొక్కటి దెలిపెద మాకైదూళ్ళున్
    కామపితా ,యొసగగ శో
    భా,మయమగువిధమొనర్చు వారిజనాభా.

    రిప్లయితొలగించండి
  30. మా మనసును దోచినదీ
    భామిని యౌరా! మదీయ భాగ్యంబనగా!
    కోమలి యలుకా! మదిరను
    కామునికలభా! మరాళ గామిని తేవే!

    రిప్లయితొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂దత్తపది🤷‍♀.. .. .. .. .. ..
    కామ - భామ - మామ - రామ
    పై పదాలను అన్యార్థంలో
    భారతార్థంలో నచ్చిన ఛందస్సులో..

    సందర్భము:
    అర్జునుడు "నందకుమార! నా రథమునందు నీ వుండడమే నా భాగ్యము. నీవు యుద్ధం చేయాల్సిన పనిలేదు." అని కృష్ణునితో అంటున్న సందర్భము.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    నంద కుమారకా! మధుర
    నాద సమన్విత వేణు గీతి కా
    నంద విహారకా!శుభ గు
    ణా! కరుణాభరణా! స భామరా!..
    అందము చిందగా నొగల
    యందున మామకమౌ రథాన నీ
    వుందువ యేని భాగ్య మదె!
    యుద్ధము గిద్దము వద్దురా! మహిన్

    స భా అమరా= ప్రకాశంతో కూడిన దేవా!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  32. కోట రాజశేఖర్ గారి పూరణలు సర్వదా భావ బలాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. మంచి పూరణ పద్యాలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి