1, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2861 (పతి పూజయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్"
(లేదా...)
"పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే బండకాడి అంజయ్య గారి సమస్య)

88 కామెంట్‌లు:

  1. ఆట పొడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పతియే శ్రీరాముండని
    పతియే కృష్ణుండనుచును భక్తిని రక్తిన్
    పతియే విష్ణువు హరుడను
    పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యాన్ని ఇలా చెప్తే ఇంకా బాగుంటుందని నా సూచన.....
      పతియే శ్రీవిష్ణుండని
      పతియే శంకరు డనుచును భక్తిని రక్తిన్
      పతియె పరబ్రహ్మ మనుచు
      పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్ :)

      తొలగించండి
    2. పతి వక్రుండైనను బో
      పతి శుక్రుండైన బ్రహ్మ పాతకుడైనన్
      పతియే పరమాత్ముడనుచు
      పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. మతిలేని సేవ సతికట
      వెతలను కలిగించు మదికి వేయి విధమ్ముల్
      పతిదేవు కంటె వేంకట
      పతిపూజ యెకార్తికమున భద్రత నొసగున్

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. వెతలను దీర్చెడు వాడగు
    క్రతువును మదితలచినంత కలతలె తొలగున్
    వ్రతముగ జేసెడు లక్ష్మీ
    పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదానికి అన్వయం ?

      తొలగించండి
  4. అతివను తలపై దాల్చిన
    శితికంఠుడె లోకరక్ష జేయును గాదే
    క్రతువుగ జేసెడు గౌరీ
    పతి పూజయె కార్తికమున భద్రత గూర్చున్

    రిప్లయితొలగించండి
  5. పతి తో సతి యును జత యై
    యతులిత మగు భక్తి తోడ న భ వుని గొల్వ న్
    వ్రత దీక్ష ను గొనియు పశు
    పతి పూజ యె కార్తి క మున భద్రత నొసగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదంలో వ్రత దీక్ష ను గొని యును పశు అని సవరణ చేయడమైనది

      తొలగించండి
    2. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    స్థితి ధృతి గతి మతి నీవని
    శతకోటిస్తుతుల గొలిచి , సాష్టాంగముగా
    నతులొనరించెడి గౌరీ
    పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధృతి నీవే స్థితి నీవె సర్వమును నీవే యంచు బ్రార్థింప , దు...
      ర్గతి బాపున్ , పరమేశ్వరుండతడనన్ కారుణ్యవారాశియౌ !
      అతులానందము గల్గజేయునతడే ఆనందరూపుండుమా
      పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


  7. పతి! పతి! పాతి! పతి! జిలే
    బి తిరగలిని తిప్పి మగడు భీతిగొనెడు రీ
    తి తరుణి గొల్వగ నీ యా
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్:)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. సతులకు పతులకు నృపతీ
    తతులకుసంతతికియతికి దళితులకైనన్
    గతియుపతియుహరియౌ శ్రీ
    *పతిపూజయెకార్తికమున భద్రతనొసగున్*

    రిప్లయితొలగించండి
  9. ఔపవస్తము తో నుండి మాపు వరకు
    జలముతో నభిషేకము సలిపి చేయు
    కాలికా పతి పూజయె కార్తి కమున
    భద్రత నొసఁగున్ సతము శుభముల నిడుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      కందపాద సమస్యకు మీ తేటగీతి పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. శంకరాభరణము నిన్నటి సమస్య గురువు గారు ఒక సరి పరిశీలించండి

    కాశ్మీరపుటలజడి జన కళ్యాణ మిడున్

    సమస్య పాదము కందము నేను సీసములో పూరణము చేశాను


    ఐక్య రాజ్య సమితి పాకిస్తానును ఉగ్రవాద చర్యలు ఆపి భారత దేశము తో మైత్రి గా ఉండాలని బిల్లు
    పెట్ట సభలో అన్ని అగ్ర రాజ్యాలు భారత దేశమునకు మద్దతుగా బిల్లుకు ఓటింగు వేసెను దానితో పాకిస్తాను భయపడి
    ఖంగు తిని సరిహద్దు కాల్పులు విరమించు కొని స్నేహ హస్తము అందిoచ కాశ్మీరు అలజడి సమసి పోయి లోక కళ్యాణము
    ఏర్పడెను అని ఒకడు ఈ వార్తను తన చుట్టాలకు తెలియ పర్చుదామని అను కొను చుండగా "తెల్ల వారింది లేవండి" అన్న పని మనిషి పిలుపుతో మెలుకువ వచ్చింది ఒకనికి. ఇది కల గద అని నవ్వుకున్నాడు అని భావన



    ఐక్య రాజ్య సమితి లౌక్యము గా నొక బిల్లును సభ లోన పెట్ట, నగ్ర
    రాజ్యాధిపతులు భారత దేశమునకు ననుగలము గా నిడె నుగద తీర్పు,
    పాకిస్తానుకు కల్గె భంగపాటు, విరమించగ కాల్పులను సంత సముగ సమసి
    పోయెను కాశ్మీరపుటలజడి జన కళ్యాణ మిడున్గద లక్షణముగ
    నిక యనుచు సంతసంబును నేను పొంది
    శుభము గొల్పు నీ వార్తను చుట్టములకు
    తెలుప దలచ, పనిమనిషి తెల్లవారె
    నని పిలువ నా కల చెదరి నగవు వచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాకిస్తానుకు' అన్నచోట గణభంగం. సవరించండి.

      తొలగించండి
  11. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    గురుభ్యో నమః క్ష మిం చం డి . మొన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన.


    శ బ రి భ క్తి
    -----------------


    కలత వహించు చేను బహుకాలము నీకయి వేచియుంటి , నే

    ‌నలయక | నేడు నిన్ను కనులారగ గాంచితి | ధన్యనైతి | కే

    వల మొక పేదబోయెతను స్వామి ! రఘూద్వహ మా కుటీర మీ

    తలమున నుండె రాగదె ? ముదంబున నే బదరీఫలంబులన్ ,

    వలవనివా తినం దగినవా రుచి జూచుచు , నిచ్చెదన్ బ్రభూ !

    చులకన చేయకుండ దయజూచుచు , గైకొను బీద పూజలన్ |


    { అలయక = విసుగొందక ; తలము = ప్రదేశము చోటు ; బదరీ

    ఫలము = రేగు పండు ; వలవని = పనికిమాలిన ; }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  12. కం: వ్రతములు నభిషేకమ్ములు
    సతీసుతుల తోడుత తొలి జామున కడు నం
    కిత భక్తిన్ గుడిలో పశు
    పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్

    రిప్లయితొలగించండి
  13. డా. పిట్టా సత్యనారాయణ
    మతిమంతుండగు నర--పతి
    క్షితిలోనే గానరాడు స్త్రీ నే యడుగన్
    సతతము శిలయౌ వేంకట
    పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్

    రిప్లయితొలగించండి
  14. సతతము ధార్మిక చింతన
    బ్రతుకునుపండించిమించి బాధలు దీర్చున్,
    శ్రితజన లోలుడు నౌపశు
    పతిపూజయెకార్తికమునభద్రతనొసగున్.
    కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్, రంగారెడ్డి

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    అతి మర్యాద ననామకుం బతియనన్నాహ్లాదమే నాతికిన్
    జతనాపిల్లల బాపలం గనుటకే, సాయుజ్యమా?శాంతియా?
    పతినిన్ వీడి చరిత్రకెక్క గనమే, భక్తిన్ గణించ న్నుమా
    పతి పాదార్చన కార్తికమ్మున గడున్ భద్రమ్ము జేకూర్చులే

    రిప్లయితొలగించండి
  16. పతి తప్ప వేరు లేదిల
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్
    సతి యొకటి దలచి మనమున
    పతిపదములబట్ట తాను, పశుపతి మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  17. అతులిత వైభవమున శ్రీ
    పతి గౌరీపతులపట్టి పదముల శరణా
    గతితో చేయు శబరిమల
    పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్!

    రిప్లయితొలగించండి


  18. పతి మూలాధారమున ! సు
    మతి, స్వాధిష్టానపు పతి, మణిపూరకమం
    దతడె యనాహతమున ! నా
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. " గతి నీవే ! పతి నీవె ! " యంచు దృఢమౌ
    గంభీరసంకల్పయై
    పితయున్ మాతయు నాపినన్ వినక నా
    విశ్వేశు భావించు బా
    ర్వతికిన్ ; గౌరికి ; శైలజారమణికిన్ ;
    రాజిల్లు కైలాసపుం
    బతి పాదార్చన కార్తికమ్మున గడున్
    భద్రమ్ము జేకూర్చులే !

    రిప్లయితొలగించండి
  20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2861
    సమస్య :: పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే.
    *కార్తీకమాసంలో పతిసేవ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం ::
    ప్రహ్లాద నారద పరాశర పుండరీక
    వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్।
    రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
    పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి॥ అనే శ్లోకంలో
    పరమ భాగవతుడుగా కీర్తింపబడినవాడు రాజర్షి అగు అంబరీషుడు ఒకప్పుడు కార్తీకమాసంలో ప్రత్యేకంగా శ్రీహరి పాదార్చన చేయగోరి యమునా నదీ తీరంలో ద్వాదశీ వ్రతాన్ని ప్రారంభించాడు. వ్రతం ముగిసే వేళకు వచ్చిన దుర్వాసుడు తనను అగౌరవించినాడని అంటూ అంబరీషుని శిక్షించబోగా, విష్ణు భగవానుడు సుదర్శన చక్రమును పంపి తన భక్తుడగు అంబరీషుని రక్షించినాడు. కాబట్టి కార్తీకమాసంలో శ్రీపతి పాదార్చన భద్రములను కలిగిస్తుంది అని అంబరీషోపాఖ్యానమును వివరించే సందర్భం.

    అతిభక్తిన్ వర కార్తికమ్మున హరిన్ ప్రార్థించుచున్ ద్వాదశీ
    వ్రతమున్ జేసెడి యంబరీషు గని దుర్వాసుండు శిక్షింపగా
    మతి నెంచన్, మధువైరి చక్రమును బంపన్ భద్రముల్ గల్గె; శ్రీ
    పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (1-12-2018)

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  22. అతులితభక్తినినతివలు
    సతతంబునుబరమశివునిశ్రధ్ధనుగొలువన్
    సతులకునరయగనాశ్రీ
    పతిపూజయెకార్తికమునభద్రతనొసగున్

    రిప్లయితొలగించండి
  23. సతి తాజెప్పెను మగడా
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్
    చెదిరెను కలయె తనసతియె
    యుదకము జల్లగ, దబదబ యురికెను, భీతిన్

    రిప్లయితొలగించండి


  24. పతియతడె విశుద్ధిని ప
    ద్ధతిగా భృకుటిని సహస్ర దళ కమలములో
    సతి శక్తి గా పతి శివుడు!
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  25. సతి బ్రహ్మరంధ్రమును దా
    టి త్రికూటమ్ములను దాటి టిక్కిని దాటన్
    పతి పెంజీకటి కావల!
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. అతిగను జేయగఁ బోకుమ
    మితిలేకను బ్రేలఁబోకు మ్లేచ్ఛుడవగుచున్
    స్థితి గతి ద్యుతి నెరుగుము శ్రీ
    *"పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్"*

    రిప్లయితొలగించండి
  27. స్తుత శాస్తా దీక్షా స్వీ
    కృతితో మాలం ధరించి కీర్తించుచు స
    మ్మతితో నేగ శబరిమల
    పతి పూజయె కార్తికమున భద్రత నొసంగున్.

    రిప్లయితొలగించండి
  28. ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారి సమస్య....

    *కరణము నమ్మువారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయంబుగన్*

    మీ పూరణలను క్రింది చిరునామాకు 6-12-2018 (గురువారం) లోగా పంపించండి.
    padyamairhyd@gmail.com

    రిప్లయితొలగించండి
  29. సతులకు నుర్వీ తలమున
    సతతము పతు లొసఁగు వార సంపద లెల్లన్
    నుతు లీయరె యొక మాసముఁ
    బతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్


    శ్రిత మందార యశో విరాజితుఁడు కాశీ పత్త నాధీశుఁడున్
    నుత సీతాపతి నాగ భూషణుఁడు విష్ణుస్కంధ నారాచుఁడున్
    నత శక్రాది సురౌఘ పూజిత మహానందుండు దాక్షాయణీ
    పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అతివా! నూతన భారతీయ మగువా! హాయిన్ విహారించవోయ్!
    వెతలేలా మన సాఫ్టువేరు బ్రతుకుల్ వేధించు చుండంగనోయ్
    మతిలేనట్టివి మాటలివ్వి గదవే మర్యాద లేదేయిటన్:
    "పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే"!!!

    "భారతీయ మగువ"...ఇంపైన దుష్టసమాసము.

    రిప్లయితొలగించండి
  31. మతభేదంబులజూడకుండగనుసమ్మానంబుతోనానుమా
    పతిపాదార్చనకార్తికమ్మునగడున్భద్రమ్ముచేకూర్చులే
    పతియాశంకరుడన్నివేళలనుసూప్రాణంబురక్షించుగా
    నతులన్జేతునుమార్ధదేహునకునానారీతులొప్పారగన్

    రిప్లయితొలగించండి


  32. కం:అతివలు పురుషులు పిల్లలు
    ప్రతిదినమీమాసమందు వాసిగ భక్తిన్.
    సతతము చేసిన గిరిజా
    పతిపూజయెకార్తికమున భద్రతనొసగున్

    రిప్లయితొలగించండి
  33. కుతకుత లాడు విషమ్మును
    హితముగ పుక్కిటను బట్టు నీశానుండౌ
    సితికంఠుండు, భవానీ
    పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్!!!

    రిప్లయితొలగించండి
  34. హితమున్గూర్చగగీడునూడ్చగజగత్ హేలారమాశ్రీస్థితై
    మతిబ్రామిన్కులదెచ్చెమోసెగిరినిన్మర్ధించెస్వర్ణాక్షును
    గ్రతనర్సింగుడువర్ణిభార్గవుడుశ్రీరాముండు గృష్ణుండు స
    ద్యతిబుద్ధుండికమీదగల్కియగునాదామోదరానంతశ్రీ
    "పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే"


    సవరణతో

    రిప్లయితొలగించండి
  35. వెతలను వీడగ గంగను
    సతతము తలదాల్చినట్టి శంకరు కృపకై
    యతులిత భక్తిని యాసతి
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్

    రిప్లయితొలగించండి


  36. పతియే దైవము! క్షేత్రి ,చెల్వుడతడే! పాదమ్ము లొత్తంగ నీ
    కతివా మోక్షము గిట్టునమ్మ వినవే కాత్యాయనీ!సత్యమ
    మ్మ! తరింపన్ భళి జీవితేశ్వరిగ సమ్మానంబు పొందన్ సఖీ
    పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చు!లే!

    పతి పాదార్చన లో తరియించి
    ఇప్పుడే బయటపడి మత్తేభమై :)

    రిప్లయితొలగించండి
  37. నుతులన్ దినమంతయునూ
    గతిదప్పని సేవజేయ కారుణ్యముతో
    సతతము గాచెడు గౌరీ
    పతిపూజయె కార్తికమున భద్రత యొసగున్.

    రిప్లయితొలగించండి
  38. బ్రతుకవట సూక్ష్మ జీవులు
    మతిమంతులు నెంచుకొన్న మంగళకరమౌ
    వ్రతమిది!దీపపు కాంతుల
    పతి-పూజయె కార్తికమున భద్రతనొసగున్!

    రిప్లయితొలగించండి


  39. పతి గణపతి! పతి బ్రహ్మయు
    పతి విష్ణువు! పతి శివుండు! పతిజీవాత్మన్
    పతి పరమాత్మ! జిలేబీ!
    పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. సమస్యా పూరణం
    కం

    గతితప్పక చేతురు మా
    పతిపూజయెకార్తికమున భద్రత నొసగున్
    సతతము నా హరిహరులన్
    వెతలను తీర్చంగగొల్వవేడినరీతిన్

    రిప్లయితొలగించండి


  41. సతి శాకిని!సతి కాకిని
    సతి లాకిని! రాకిని సతి! సతి ఢాకిని మేల్
    సతి హాకిని! మూలంబగు
    పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  42. పతి రక్తము! పతి పీతము
    పతి నీలము! పతి యరుణము పతి ధూమ్రమగున్
    పతి విద్యుత్కర్పూరము!
    పతి పూజయె కార్తికమున భద్రతనొసగున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  43. సతతము ధర్మము నిలుపుట
    కతిశయ ముగనవ తరించె గరుడ గమనుడై
    గతియై గాచిన లక్ష్మీ
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్

    రిప్లయితొలగించండి
  44. కందం

    వెతలిడు భస్మాసురుల వి
    నతులకు వరములిడి పరుగున తడబడక హా
    రతులందఁగ హరునకు శ్రీ
    పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్

    రిప్లయితొలగించండి
  45. వెతలెల్ల తీర వలెనని
    సతులెల్లరు చేరి వేగ సద్భావనతో
    సతతము చేసెడు గౌరీ
    పతిపూజయెకార్తికమున భద్రతనొసగున్.

    2..సతినురమున దాల్చిన శ్రీ
    పతిపూజయెకార్తికమున భద్రతనొసగున్
    వ్రతములు పూజలు విడువక
    సతతము చేయంగ వలెను జనములు జగతిన్.

    3.నతులను నుతులను చేయుచు
    సతి పతులిరువురు వ్రతములు సతతము చేయన్
    హితమొను గూర్చెడి యాపశు
    పతిపూజయెకార్తికమున భద్రతనొసగున్.

    రిప్లయితొలగించండి
  46. డా. పిట్టా సత్యనారాయణ
    విధాన మమరని వచనపు
    వధూటిని మరుగు పరచగ వలయునదెట్లో
    విధూత రవముల మురళీ
    వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ

    రిప్లయితొలగించండి
  47. సతతము దలచెడి భక్తుల
    వెతలను దీర్చుచును తానె వీడకనెపుడున్
    గతులను మార్చెడి గౌరీ
    పతిపూజయె కార్తికమున భద్రత నొసగున్

    రిప్లయితొలగించండి