30, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2860 (కాశ్మీరమ్మున నుగ్రవాదము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్"
(లేదా...)
"కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్"

43 కామెంట్‌లు:

  1. దుశ్మనులను నోడించుచు
    పశ్మీనా ధరలు పెంచి భాగ్యమ్మిడుచున్
    కశ్మలము పారద్రోలుచు
    కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    అశ్మాకార కృపావిహీనమతులై ఆ యుగ్రవాదుల్ సదా
    కాశ్మీరమ్మున శాంతి గూల్చ హితమే ? కన్నీరు రాదే ? యశో
    రశ్మిన్ గావ ప్రణాళికారచన నార్పంజేయుడీ ! తగ్గగా
    కాశ్మీరమ్మున నుగ్రవాద., మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కశ్మలహృదయులు హైందవ
      రశ్మిని పొడసూపనీక రణరక్తములన్
      వేశ్మముల గాల్చ నెట్టుల
      కాశ్మీరపుటలజడి జన కళ్యాణమగున్ ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


  3. కంది వారివ్వాళ సెలవా :)



    కాశ్మీరంబు మనకు మఖ
    వాశ్మము మన కుఱగలిని నుపశమిల్లక తా
    నాశ్మంతంబాయెనయా
    కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాశ్మీరమును జిలేబిగ
      కశ్మలమతులెల్ల పట్టి కరకర నమలన్
      కశ్మల నేతలు చర్చలె
      కాశ్మీరము నందు జరుగ కాంక్షింతురహో !

      తొలగించండి

    2. కశ్మీరమను జిలేబిని
      కశ్మలమతులెల్ల పట్టి కరకర నమలన్ :)


      జిలేబి

      తొలగించండి
  4. రశ్మీ తృణాధి న్యాయము
    కశ్మల మునుపార ద్రోలి కలహము వీడన్
    భశ్మాసుర హస్తముల దృంచ
    కాశ్మీరపు టలజడి జన కల్యాణ మిడున్

    రిప్లయితొలగించండి


  5. కాశ్మీరమ్మొక నాడు భూతలపు స్వర్గంబై భళా వెల్గె! తా
    పశ్మీనాలకు పేరు గాంచెను! సదా వైదుష్యమున్ చేర్చె! హా
    కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్?
    కాశ్మీరమ్ము జిలేబి గా తనరగా గాదే సఖీ మేల్ సుమా ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. అశ్మాత్ముండయిబోయడొక్కడడవిన్నాపెన్మహర్షుండ్ర నీ
    యశ్మాకారునిపూర్వసంచితమహో!యజ్ఞానికిన్ జ్ఞానధీ
    రశ్మిన్నజ్ఞతదూరమయ్యెనటులుగ్రాత్ముండ్రజంపించినన్
    *కాశ్మీరమ్మున నుగ్రవాదమొసగున్ గళ్యాణమిద్ధాత్రికిన్*

    రిప్లయితొలగించండి
  7. కాశ్మీరంబునకాళిదాసుతనరన్ గైతల్ రచించెన్గదా
    కాశ్మీరంబునబుట్టివచ్చెనట దీక్షాదక్షుడానెహ్రు యే
    కాశ్మీరమ్మునుగూర్చిబల్కితిరొ? దుష్కర్మాత్మదేహంబనే
    కాశ్మీరమ్ముననుగ్రవాదమొసగున్గళ్యాణమిద్ధాత్రికిన్

    రిప్లయితొలగించండి
  8. కాశ్మీరు తీవ్ర వాదము
    భస్మాసుర హస్త మదియె ప్రగతికి చేటౌ
    రశ్మీ! యంతమయిన నిక
    కాశ్మీరపు టలజడి, జన కళ్యాణమిడున్.

    రిప్లయితొలగించండి
  9. వేశ్మము లంతము చేయును
    కాశ్మీరపు టలజడి, జన కళ్యాణ మిడున్
    రశ్మిని పెంచును క్రన్నన
    నశ్మంతము తొలగి నప్పు డాప్రాంతమునన్

    రిప్లయితొలగించండి
  10. రశ్మీయనెపదమొక్కటి
    దుశ్మనులనుమరినొకండు దొరికె;దురాత్ముం
    డ్రశ్ముల్ పాకిస్థాన్ కే
    *కాశ్మీరపు టలజడి జనకళ్యాణమిడున్*

    రిప్లయితొలగించండి
  11. కాశ్మీరము ఘనకళలకు
    వేశ్మము ; భారతజననికి వేణీమణియున్ ;
    కశ్మలకారవధ నణప
    గాశ్మీరపు టలజడి ; జనకల్యాణ మిడున్ .

    రిప్లయితొలగించండి
  12. రశ్మి న్ వెల్గు చు జగతికి
    కాశ్మీరము నాక మట్లు ఘన మై యుండ న్
    కాశ్మీర మం ద దేవి ధి
    కాశ్మీర పు ట ల జడి జన కళ్యాణ మి డు న్?

    రిప్లయితొలగించండి
  13. కాశ్మీరు సమస్యను గన
    కాశ్మీరమునే దహించు కాష్టము వలెనే
    రశ్మియె కోల్పడు; నెట్టుల
    కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్?

    రిప్లయితొలగించండి


  14. వేశ్మంబౌనయ కశ్మలమ్ములకు, ప్రావీణ్యమ్ము వీడన్ పురిన్
    కాశ్మీరమ్మది చేయిదాటును వెసన్, కాంగ్రెస్సు లాలింపులే
    కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్, గళ్యాణ మిద్ధాత్రికిన్
    కాశ్మీరమ్ము మిలట్రి సాయముగ మోకారింప దుర్మార్గులన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. కాశ్మీరద్రోహి పలికె
    "కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్"
    కాశ్మీరవర్ణభానుడు
    కాశ్మీరమునందు జ్ఞానకాంతి నిడవలెన్
    (కాశ్మీరవర్ణభానుడు= కుంకుమ పువ్వు రంగులో ఉండే ఉదయభానుడు)

    రిప్లయితొలగించండి
  16. డా. పిట్టా సత్యనారాయణ
    రశ్మిని గానని దుష్టుల
    కశ్మలమును బాపు యజ్ఞ కర్తలు సేనల్
    చశ్మము(కంటి యద్దము)లంధుల కెందుకు?(వారిని బాగు చేయలేము)
    కాశ్మీరపు టలజడి జనకళ్యాణ మిడున్!

    రిప్లయితొలగించండి
  17. కాశ్మీరపుటందాలను
    రశ్మిన్ కలుగంగజేయు, రాక్షస మూకల్
    ఊష్మంబణచుటయెటులో
    *"కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్"*

    రిప్లయితొలగించండి
  18. డా. పిట్టా సత్యనారాయణ
    కాశ్మీరాగరువాసి(కాళిక)నిన్ గనుమదే ఖండించు దుష్టాత్ములన్
    రశ్మీభూతము వీర సైన్య బలగాల్ రవ్వంతయున్ వీడకన్
    కాశ్మీరమ్మును రక్షసేయు దమనన్ గాకున్న నింకెట్టులా
    కాశ్మీరమ్మున నుగ్రవాదమొసగున్ గళ్యాణ మిద్ధాత్రినిన్?

    రిప్లయితొలగించండి
  19. కాశ్మీరమ్మునకీ స్థలమ్మఖిల లోకమ్మందు పేరొందుటన్
    కాశ్మీరందురు భూమిపైనిదియె స్వర్గమ్మట్లు భాసిల్లు నీ
    కాశ్మీరస్థులు గట్టి పట్టుదలతోకాంక్షించగా దూరమై
    *"కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్"*
    (కాశ్మీరము = కుంకుమ పూవు)

    రిప్లయితొలగించండి
  20. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన.


    శ బ రి భ క్తి
    -----------------


    కలత వహించు చేను బహుకాలము నీకయి వేచియుంటి , నే

    ‌నలయక | నేడు నిన్ను కనులారగ గాంచితి | ధన్యనైతి | కే

    వల మొక పేదబోయెతను స్వామి ! రఘూద్వహ ! మా
    కుటీర మీ

    తలమున నుండె రాగదె ? ..... ముదమ్మున నే బదరీఫలమ్ములన్ ,

    వలవనివా తినం దగినవా రుచి జూచుచు , నిచ్చెదన్ బ్రభూ !

    చులకన చేయకుండ దయజూచుచు , గైకొను బీద పూజలన్ |


    { అలయక = విసుగొందక ; తలము = ప్రదేశము చోటు ; బదరీ

    ఫలము = రేగు పండు ; వలవని = పనికిమాలిన ; }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  21. కాశ్మీర మది యొసంగును
    రశ్మి రుచిర భారత నగర సమూహమునం
    గాశ్మీర వాసు లుడిగినఁ
    గాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్


    అశ్మాగారములై చెలంగు రిపు శూరానీక చిత్తమ్ములే
    రశ్మిజ్వాలల రోయ నెల్లెడల వీరశ్రేణు లొక్కుమ్మడిన్
    వేశ్మవ్రాత పరీత రక్షణ దళావేశోర్భటిన్ క్షీణమై
    కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్

    రిప్లయితొలగించండి
  22. వేశ్మము సౌందర్యమునకు
    కాశ్మీరము భరతమందు, గ్రక్కున నడచన్
    కశ్మల ముష్కర కల్పిత
    కాశ్మీరపు టలజడి, జన కల్యాణమిడున్ !

    రిప్లయితొలగించండి
  23. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....

    కాశ్మీరార్థమె భారతావని సదా కయ్యంబు గాకుండ నీ
    కాశ్మీరార్థమె పాకుతో మిగుల సఖ్యమ్మెంతయోచేసినన్
    కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్, గళ్యాణ మిద్ధాత్రికిన్
    కాశ్మీరార్థము తీవ్రవాదమిల ప్రక్షాలించినన్ సర్వదా.

    రిప్లయితొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కాశ్మీరమ్ముకు విట్టుబాబు చనుచున్ కవ్వించి నవ్వించగా
    దుశ్మన్ లెల్లరి పొట్టలుబ్బగను నాందోళన్ము క్షీణింపగా
    సుశ్మాదేవిది నుర్దుభాష వినగా శుష్కించి చల్లారగా
    కాశ్మీరమ్మున నుగ్రవాద,... మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పశ్మీనా యను షాలు చుట్టుకొని కాపాడన్ భళా విట్టుబా
      బాశ్మాన్లో తిరుగాడుచున్ జనులనే, పద్యంబులన్ పాడగా,
      వేశ్మంబందున వేడిపుట్టగ భళా వేగమ్ము వేగమ్ముగా
      కాశ్మీరమ్మున నుగ్ర,"వాద" మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్!

      జిలేబి

      తొలగించండి
  25. కశ్మలమున్బెంచునుగద
    కాశ్మీరపుటలజడి,జనకళ్యాణమిడున్
    గాశ్మీరసోయగంబులు
    పశ్మీనానందుతెలియుప్రస్ఫుటముంగన్

    రిప్లయితొలగించండి
  26. శంకరాభరణము నేటి సమస్య
    కాశ్మీరపుటలజడి జన కళ్యాణ మిడున్

    సమస్య పాదము కందము నేను సీసములో పూరణము చేశాను


    ఐక్య రాజ్య సమితి పాకిస్తానును ఉగ్రవాద చర్యలు ఆపి భారత దేశము తో మైత్రి గా ఉండాలని బిల్లు
    పెట్ట సభలో అన్ని అగ్ర రాజ్యాలు భారత దేశమునకు మద్దతుగా బిల్లుకు ఓటింగు వేసెను దానితో పాకిస్తాను భయపడి
    ఖంగు తిని సరిహద్దు కాల్పులు విరమించు కొని స్నేహ హస్తము అందిoచ కాశ్మీరు అలజడి సమసి పోయి లోక కళ్యాణము
    ఏర్పడెను అని ఒకడు ఈ వార్తను తన చుట్టాలకు తెలియ పర్చుదామని అను కొను చుండగా "తెల్ల వారింది లేవండి" అన్న పని మనిషి పిలుపుతో మెలుకువ వచ్చింది ఒకనికి. ఇది కల గద అని నవ్వుకున్నాడు అని భావన



    ఐక్య రాజ్య సమితి లౌక్యము గా నొక బిల్లును సభ లోన పెట్ట, నగ్ర
    రాజ్యాదిపతులు భారత దేశమునకు ననుగలము గా నిడె నుగద తీర్పు,
    పాకిస్తానుకు కల్గె భంగపాటు, విరమించగ కాల్పులను సంత సముగ సమసి
    పోయెను కాశ్మీరపుటలజడి జన కళ్యాణ మిడున్గద లక్షణముగ
    నిక యనుచు సంతసంబును నేను పొంది
    శుభము గొల్పు నీ వార్తను చుట్టములకు
    తెలుప దలచ, పనిమనిషి తెల్లవారె
    నని పిలువ నా కల చెదరి నగవు వచ్చె

    రిప్లయితొలగించండి
  27. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2860
    సమస్య :: కాశ్మీరమ్మున నుగ్రవాద, మొసగున్ కళ్యాణ మిద్ధాత్రికిన్.
    *కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదం లోక కళ్యాణ కారక మౌతుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అందఱూ క్షమను కలిగియుండాలి. కోపమును వదలివేయాలి. శాంత గుణముతో ప్రకాశించాలి.
    నాదబ్రహ్మోపాసకుడు రామభక్తుడు ఐన త్యాగరాజు గారు తాను రచించి గానం చేసిన కీర్తనలలో *శాంతము లేక సౌఖ్యము లేదు .....* అని మనకు హితాన్ని ఉపదేశించినారు. శాంత గుణము ఉంటేనే మన ఇంటిలోనైనా మన దేశంలోనైనా సుఖం ఉంటుంది. మన మనసుల్లో చల్లని వెన్నెల నిండుతుంది. శాంత గుణం లేకుంటే మృదువుగా ఉండవలసిన మన గుండెలు రాతిబండలైపోతాయి. విశ్వ శాంతి అనేది మన లక్ష్యము మన ధ్యేయము ఐనట్లయితే అప్పుడు కాశ్మీరం లోని ఉగ్రవాద మైనాసరే మాయమౌతుంది. ఆ శాంతియే లోకానికి కళ్యాణమును సౌఖ్యమును అందిస్తుంది అని విశదీకరించే సందర్భం.

    వేశ్మమ్మందున శాంతి లేక సుఖముల్ వెల్గొందునే, మేటి గ్లౌ
    రశ్ముల్ పండునె? త్యాగరాజ పదముల్ రాజిల్లునే? గుండె తా
    నశ్మ మ్మట్టుల నుండు; శాంతి యిల ధ్యేయం బైనచో, మాయమౌ
    కాశ్మీరమ్మున నుగ్రవాద, మొసగున్ కళ్యాణ మిద్ధాత్రికిన్.

    రిప్లయితొలగించండి
  28. అశ్మంతములను దెచ్చును
    కాశ్మీరపు టలజడి, జనకల్యాణ మిడున్
    కశ్మలము లేని మైత్రియె
    రశ్మిని కలిగించు భువికి ప్రాశస్త్యముగన్!!!

    రిప్లయితొలగించండి
  29. కాశ్మీరమ్మున తీవ్రవాదులట దుష్కార్యమ్ములే జేయగన్
    తస్మాత్ జాగ్రత యంచు భారత భటుల్ ధైర్యమ్ముతో పోరినన్
    భస్మమ్మవ్వరె ముష్కరుల్లచటఁ నిల్వన్ జేసినన్ జాలదే
    కాశ్మీరమ్మున నుగ్రవాద, మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్

    రిప్లయితొలగించండి
  30. కాశ్మీరపు చలిమంచే
    కాశ్మీరపు టలజడి!జనకళ్యానమిడున్!
    కాశ్మీరపు దృశ్యంబులు
    కాశ్మీరే కీర్తిబంచె కలియుగమందున్

    రిప్లయితొలగించండి
  31. కశ్మలము నసింపగ రవి
    రశ్మియు రాష్ట్రమ్మునందు రాజిల వేడ్కన్ ,
    సుష్మ దహించుచు దుష్టుల
    కాశ్మీరపు టలజడి , జన కళ్యాణ మిడున్

    రిప్లయితొలగించండి
  32. కాశ్మీరమ్మది శ్వేతవర్ణ హిమ నాగమ్ముల్ ప్రకాశించునే
    కాశ్మీరమ్మది భూతలమ్మునను స్వర్గమ్మంచుఁ గీర్తింతురే
    కాశ్మీరమ్ములె పూయుచుండునట, నిక్కమ్మిద్ది ఖండింపగాఁ
    *"గాశ్మీరమ్మున నుగ్రవాద, మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్"*

    రిప్లయితొలగించండి
  33. కశ్మలమై ఖేదమిడెను
    కాశ్మీరపుటలజడి ,జనకల్యాణమిడున్
    రశ్మిని పెంచెడి దిశగా
    కాశ్మీరము శాంతి పంచ కాంతియు నిండున్.

    రిప్లయితొలగించండి
  34. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అశ్మకరమైన భూమిని
    కశ్మలమతి నార్భటించు గణముల కన్నిన్
    రశ్మి నెడలించ బూనిన
    కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్.

    రిప్లయితొలగించండి
  35. అశ్మాకారోగ్రులచే
    గాశ్మీరపుటలజడి;జనకళ్యాణమిడున్
    వేశ్మాశ్మసారమునకున్
    రశ్మీయన్ స్పర్శవేది లలిలగ్గిడగా

    రిప్లయితొలగించండి