2, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 2975 (కుండం జేయఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్"
(లేదా...)
"కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్"

41 కామెంట్‌లు:

  1. అండగ నీవుండి సతము
    గండములను బాపువాడ కరుణామయుడా
    దండమయా! యిడుములు రా
    కుండంజేయంగ నొప్పు కుంభిని నెల్లన్.

    రిప్లయితొలగించండి
  2. ప్రాతఃకాల సరదా పూరణ:

    మండింపంగను మాతృభూమినిట పల్ మాయావి తంత్రమ్ములన్
    చండాలమ్మగు నస్త్ర శస్త్రములతో సాధించి బాధించుచున్
    దండింపంగను పాకి ద్రోహులకటన్ దంభమ్ము ధ్వసింపగా
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్

    కుండము = నిప్పుల గుండు
    కుంభిని = భూమి

    రిప్లయితొలగించండి


  3. జండా పాతవలెనురా
    కొండారెడ్డి జగనన్నకు మనము సాయం
    బండగ పద సైకిలు లే
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. డా. పిట్టా సత్యనారాయణ
    దండం!నాయకులారా!
    దండము!వరుణుండు వర్ష ధారల నీగా
    కుండలు నిండవు మాటల
    కుండం జేయంగనొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  5. డా. పిట్టా సత్యనారాయణ
    కొండన్ బండల జేయు శ్రామిక శ్రమన్ గోరంత దగ్గించగన్
    గండంబాయెను డెబ్బదేళ్ళ నిపుడీ గాండ్రింపులౌ తాయిలాల్
    మండే గుండెల దాహ మెన్నికలనౌమాటల్ నిజాలైనచో
    కుండం జేయగనొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తించగన్

    రిప్లయితొలగించండి


  6. జండాపాతవలెన్ జనాళి మనకై జైజై యనంగన్ పదా
    కొండాడన్ జగనన్న సాయము పదా! కొట్టాలె నోట్లన్ పదా!
    తిండాడాలె సు సైకిలోళ్ళు పదరా దిక్కామొగాలైన లే
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. పండిoచు రైతు కండ గ
    నుండియు నిరతంబు మేలు నోరి మి తోడ న్
    గండము లు నిడు ములు ను రా
    కుండ oజేయంగ నొప్పు కుంభిని నెల్ల న్

    రిప్లయితొలగించండి
  8. ఎండన్ గ్రుంగవు , వానకున్ వెరవబోవెంతేన్ శ్రమంజేయ , నీ
    యండన్ మాకిల తీరునాకలి , మహాత్మా ! కర్షకా ! నీకివే
    దండంబుల్ గొనుమయ్య ! నీ కృషి గనన్ ధాన్యప్రపూర్ణమ్మునౌ
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని, లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్" !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. అండాండంబులు బిండాం
    డండబ్రహ్మాండభాండ ఢమరున్మీటన్
    గుండుల్నీరగిడుమ లే
    *"కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్"*

    రిప్లయితొలగించండి
  10. గుండుల్నీరుగతాండవంబుసలిపెన్ గ్రుద్ధుండునైశంభుడొ
    క్కండైయేడ్చెసతీసతీయనుచు యజ్ఞాగ్నిన్హతంబయ్యెనా
    గుండెన్గుండుగజేసిదక్షుడుసుతన్ గ్రూరంగదూరంగ జో
    *"కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్"*

    రిప్లయితొలగించండి
  11. జెండా నెత్తుచు జెప్పుచుంటి నిదె జే
    జేలన్ సమర్పించుచున్;
    గండంబుల్ దరిజేరకుండ మనలన్
    గాపాడు భూమాతయే;
    పండించున్ ఘనకాంక్ష లన్నిటిని; నే
    పాపంపు క్షైణ్యంబు లే
    కుండం జేయగనొప్పు కుంభినిని; లో
    కుల్ మెచ్చి కీర్తింపగన్.

    రిప్లయితొలగించండి
  12. కొండంత నృహరి మనమున
    అండగ దలచుచు నిరతము నుండగ మరి దా
    నుండు నతడు పాపము రా
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  13. కండల్ పెంచిన రాక్షస,
    చండాలుల్,ద్రోహములను సల్పిరి జగతిన్
    దండుగ వారల కడ పో
    కుండం జేయంగ నొప్పు కుంభిని నిల్వన్.

    రిప్లయితొలగించండి
  14. కుంభిని నెల్లన్ అని చదువ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  15. మండెడి యెండల లోనన్
    పిండమలమటించు చుండు పిప్పలమునకై
    యండగ నుండుటకై జల
    గుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  16. గురుభ్యోన్నమః🙏
    ఆది శంకరులు మండనమిశ్రుల సంవాదము తెలిసికొనుట లోక విదితమని, వేద సంస్కృతిని నిలబెట్టుట నాయుద్దేశ్యము.

    మండన మిశ్రుని గెలువన
    జాండంబుగ తర్కవాద జప మొనరించన్
    దండి దుసంస్కృతి నిలరా
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్.

    రిప్లయితొలగించండి
  17. కాంగ్రెస్ వారి ప్రచారం

    అండగ రాహులుడుండగ
    వండుచు న్యాయపథకమ్ము వచ్చినపదవిన్
    గండపు పేదరికము లే
    కుండం జేయంగవచ్చు కుంభినినెల్లన్

    రిప్లయితొలగించండి
  18. చండాసుర ముండాసుర
    భండాసుర హరణ కర్త భగవతి వలె స్త్రీల్
    చెండాడుచు కుజనులు లే
    కుండం జేయంగ వలయు కుంభిని నెల్లన్ .

    నారాయణం బాలసుబ్రహ్మణ్యం.

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దండిగ పరమేశ్వరునిన్
    మెండగు భక్తిని కొలుచుచు మిన్నగ తెలచన్
    దుండగముల నాతడు రా
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్.

    రిప్లయితొలగించండి
  20. ఈరోజు ఎ. యస్. రావ్ నగర్ (ECIL) సాయినాథపురం వాటర్ టాంక్ దగ్గర ఉన్న ఓల్డ్ ఏజ్ హోముకు మారుతున్నాను. కనుక మీ పూరణలపై స్పందించలేకపోవచ్చు. మన్నించండి.

    రిప్లయితొలగించండి


  21. దండము లిడుదును రామా
    అండగ మాకుండుమయ్య యనవరతంబున్
    గండము లన్నవెపుడు లే
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్.

    నిండెను లోకము నందున
    దండిగ యవినీతి నేడు దశదిశలందున్
    ఖండించుచు దానిలే
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  22. గండమ్ములు భువిలో లే
    కుండం జేయంగ నొప్పు ; కుంభిని నెల్లన్
    నిండుగను పసిడి పంటలు
    పండునదిగ జేయ వలెను పరికింపంగన్.

    రిప్లయితొలగించండి
  23. దుండగముల తోడ భువిని
    మంటలు రేపు ఖలుల పరిమార్చి జనులకున్
    అండై నిలువగ హోమపు
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  24. దండమయా విశ్వంభర!
    దండమయా నీకునెపుడు దండముకృష్ణా!
    దుండగులనిడుమలికలే
    కుండంజేయంగనొప్పు గుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  25. ఖండిని బూర్తిగ నరుణుడు
    కుండం జేయంగ; నొప్పు కుంభిని నెల్లన్
    పిండము తోడన్ నిండిన
    కుండల నేర్పర చినంత గుశలము జేరున్

    రిప్లయితొలగించండి
  26. కండలు పెంచి విరివిగన్
    దండులఁ గూడి తిరిగెడు వదరుఁబోతులకున్
    దండ మొసఁగి దుష్టుల నూ
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్


    భండారమ్ములు నింప నీ ప్రకృతి విధ్వంసమ్ము భావ్యమ్మె బ్ర
    హ్మాండాఖ్యమ్ముగ వాసి కెక్కినది విశ్వాత్ముండు సృష్టించె వి
    శ్వాండం బింపుగఁ బ్రాణి కోటులకు నే యన్యాంబు నెన్నండు లే
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్

    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గండర్ గండురు చంద్రు లిర్వురిటనున్ గాఢమ్ముగా పోరగా
    దండింపంగను దేవతల్ భువినికన్ దంభమ్ముతో జేరగా...
    అండంగుండను మేక కుక్కుటలు పల్ యంత్రమ్ము తంత్రమ్ములన్
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్

    కుండము = వంట కుండ

    రిప్లయితొలగించండి
  28. గండమ్ముల్ దొలగించువాడవగుచున్ కారుణ్యముంజూపు చున్
    యెండావానల లెక్కసేయక సదా నీ ధ్యాసతో నిత్యమున్
    కొండన్నెక్కెడు భక్త కోటికిల సంక్షోభమ్ము లన్ గాంచి లే
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్

    రిప్లయితొలగించండి


  29. దండన ములనిడి యైనను
    చెండాడుము దుర్జనులను శీఘ్రముగా కో
    దండమును దాల్చి చెడు లే
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్.

    రిప్లయితొలగించండి
  30. ... ...శంకరాభరణం....
    02/04/2019 మంగళవారం

    సమస్య

    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    నా పూరణ. కం:

    ***** ***** **** **

    దండిగ దోచుచు ప్రజలను

    పండుగలే జేసుకొన్న పాలకులారా!

    దండమికనైన చెడులే

    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్



    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  31. దండిగ ధనమిడి నేతలు
    గుండాలిడు యండతోడ కొలువుల గొనెడిన్
    షండులయిన నేతలు, రా
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  32. మెండుగ యెన్నికలందున
    నుండెడి నాయకులమైకు యూహలుబలుకున్
    ఎండనుదగ్గింతుము రా
    కుండంజేయంగనొప్పు కుంభినినెల్లన్

    రిప్లయితొలగించండి
  33. దండమ్మంచును చేరిదగ్గరకు వేదాంతమ్ములన్ జెప్పి పా
    షండుల్ నాయకులై ధనమ్ము వడిగా సాధించెడిన్, నిత్యమున్
    గుండాలన్ దరి చేర్చు కొంచు మనునా క్రూరాత్ములన్ ప్రాపు లే
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్

    రిప్లయితొలగించండి
  34. గుండాలెందరొ బంటులై కొలువగా క్రూరాత్ములే నేతలై
    జండాలెన్నియొ మార్చుచున్ కపట వేషాలెన్నొ తా వేయుచున్
    దండాలంచు జనాల యోటునడగే దౌర్భాగ్యులన్నిట రా
    కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్

    రిప్లయితొలగించండి
  35. మండెడు నెండలు నుష్ణము
    గండమ్మై పెరుగుచుండెఁ గాలుష్యముచేఁ
    యండగ ప్రళయము దరిఁ రా
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి
  36. కొండల నెత్తిన వానిని
    మెండుగ పూజింపగూర్చు మేలగు శుభముల్
    గండమ్ములెప్పుడు లే
    కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్

    రిప్లయితొలగించండి

  37. జగత్సాక్షి సాక్షిగా దృక్కర్మ ప్రత్యక్షిగా కర్మ తగలడెన్



    దిక్చక్రమ్ముల కావలన్ కుదరముల్ ధీంధీంయనంగన్ వెసన్
    ప్రాక్చైతన్యుడు దృంహితమ్ముగ నుషస్ వాజేన గాంధర్వమై
    దృక్చాతుర్యము గాంచి తేరు నడుపన్, దృక్కర్మ ప్రత్యక్షిగా
    వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి