16, మే 2019, గురువారం

సమస్య - 3020 (మూఢమె ముద్దటంచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్"
(లేదా...)
"మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్"

74 కామెంట్‌లు:

  1. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    వీడక చాకలింట గల విశ్వసనీయపు జంతు వెద్దియో ?

    గాడిద యోండ్ర పెట్టకయె కాచిన దెప్పుడు దేవకీ పతిన్ ?

    గాడిద పైన నుత్సవమొనర్చ దురాత్ముల కేమి గల్గునో ?

    గాడిద | కాలుఁ బట్టగనె | మోక్షము గల్గును తన్నకుండినన్ |


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  2. రూఢిగ జెప్పిన చాలదు
    గూఢముగా నుండు నంట గొంగళి వలెనే
    మూఢులు పలికిన సోద్యము
    మూఢమె శుభకార్య ములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పలికిన జోద్యము' అవుతుంది.

      తొలగించండి
  3. ప్రాతః కాలపు సరదా పూరణ:

    రూఢిగ నమ్మగా మదిని రూపులు దిద్దు ఖగోళ శాస్త్రమున్
    బాఢము జేయగా వడిగ బంధము లన్నియు త్రోసిపుచ్చుటన్
    గాఢపు నమ్మకంబునను గందర గోళము జ్యోస్యమన్నచో
    మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    పెళ్లి ముహూర్తం పెట్టమని కోరగా.... శాస్త్రి గారిలా సూచిస్తున్నారు..

    గూఢతరమ్ము ! మీ వరునకున్ గ్రహదోషము గోచరింపగా
    వ్యూఢమతిన్ వచింతుమిదె ముందుగ దోచినదౌ పరిష్కృతిన్ ,
    రూఢిగ వీనికిన్ గన విరోధముహూర్తమె మేలు జేయునీ
    మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  5. గాఢము గా వలదనుచున్
    మూఢమె, శుభకార్యములకు ముద్దనిరి జనుల్,
    రీఢము కాని ముహూర్తము
    నే,ఢక్లాయంచెద నొకటేయన్నియు పో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఢక్లాయంచెద'? "ఢక్లాయించెద" అనుకుంటాను.

      తొలగించండి
  6. గాఢ పు ప్రేమను ముని గియు
    మూఢ త లెక్కింప ర పు డు మూరు త గడి యల్
    వ్యూ ఢ మతి న్ మను వా డ రె
    మూఢమె శుభ కార్య ము లకు ముద్ద ని రి జనుల్

    రిప్లయితొలగించండి


  7. రీఢమదేల కాలమొక రీతియె! శోభనముల్, జిలేబి, యా
    మూఢములీ జనాళి తమ మొక్కలపాటున పేర్చినట్టివ
    మ్మా! ఢమరున్బజాయి, మన మానస మందున త్రోలగా వెసన్
    మూఢమె, శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ( నాస్తికభావన - ఆస్తికభావన )
    " మూఢమె శ్రే ష్ఠమౌచు శుభ
    ముల్ బొనరించును కార్యసిద్ధికిన్ ;
    గాఢమతిన్ దలంపుడు ; వి
    ఘాతము రా " దని నాస్తికాగ్రణుల్ ;
    " మీఢము ; సత్క్రియల్ సలుప
    మీరలు బూనకుడయ్య ! చేటగున్ ;
    గూఢము ; త్యాజ్య " మంచు బలు
    కూరిమి బల్కెద రాస్తికోత్తముల్ .
    ( మీఢము - విడువబడినది )

    రిప్లయితొలగించండి
  9. మూఢపు నమ్మకములనే
    బాఢముగా కూలద్రోయు పద్ధతి యనుచున్
    రూఢించిన సంఘమునన్
    *"మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్"*

    రూఢి అంటే మొలకయెత్తు అనే అర్థముంది. అందుకని పుట్టించిన సంఘము అనే అర్థంలో రూఢించిన సంఘము అని వాడినాను.
    🙏🏻

    రిప్లయితొలగించండి
  10. కూడదు శుభముల్ జరుపగ
    మూఢమె, శుభకార్యములకు ముద్దనిరి జనుల్
    రూఢిగవరమగు మాఘమె
    వేడుకలొనరించ తగిన వేళగు నిలలో!!!

    రిప్లయితొలగించండి
  11. గాఢపు ప్రేమను మున్గిన
    మూఢపు శృంగారజంట ముచ్చటదీర్చన్
    రూఢిగ వీడగ శుక్రుని
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
  12. గాఢమగు నమ్మిక మనకు
    మూఢములో జేయు కార్యములు కీడగుగా!
    మూఢత్వముతో నన దగునే?
    "మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "మూఢత నిటు లన దగునే" అనండి.

      తొలగించండి
  13. మూఢుడు రాజ్యము నేలగ
    వ్యూఢమ్ముగ వాని పీడ పోవుట కొరకై
    రీఢపు ముహూర్తమైనను
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
  14. రూఢిగ బల్కెనొకడు గడు
    మూఢుఁడు రాజ్యంబు నొంది మూఢమిలోనన్
    మూఢమి మంచిదనె వెఱన్
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
  15. గాఢముగను నాస్తికత నకార తలపులన్
    బాఢముగ యథేష్టముగ నపారముగనదే
    మూఢులుగను మార్ప కలియె, మూలము మరిచెన్
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశేషవృత్తమైన 'మంగళమణి'లో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. ప్రోడలకు మూడు పదులిక
    చూడగలనతడు తనువుల చూరగొనంగన్
    మూడవనెల యవ ముదితకు
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    ప్రోడ=స్త్రీ, ప్రోడ=నిపుణుడు, ప్రగల్భుడు.
    చూడగలవాడు=మన్మథుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాగా అనే అర్థంలో 'అవ' అనడం సాధువు కాదు. 'డ-ఢ' ప్రాస వేసారు.

      తొలగించండి
  17. శంకరాభరణం
    16/05/2019 గురువారం

    సమస్య

     మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్"

    నా పూరణ. ఉ.మా.
    **** ***

    మూఢ ముహూర్త మెప్పుడును ముంచును నిండుగ ముప్పు దెచ్చియున్

    గాఢ శుభమ్ములున్,జయము గల్గును మేలు ముహూర్త మెంచినన్

    మూఢుల నమ్మబోకుమయ మూర్ఖత వారు వచించ నిట్లుగన్

    "మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్"


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷


    రిప్లయితొలగించండి
  18. డా.పిట్టా సత్యనారాయణ
    గాఢ సునిద్రను గాంచరె
    రూఢిగ యమదిశను(దక్షిణము)కాళ్ళు రొప్పుచు తురకల్
    ప్రౌఢల పెళ్ళిలు లపుడగు
    "మూఢమె శుభ కార్యములకు ముద్దనిరి" జనుల్

    రిప్లయితొలగించండి
  19. డా.పిట్టా సత్యనారాయణ
    మూఢులె వారు కార్యమును ముట్టు తలంపె సులగ్న మంచనన్
    ప్రౌఢులు ,పెద్దలీగతిని బ్రాకగ నేమగు?వింత!"మౌఢ్యమే
    రూఢిగ జెల్లునంచు మత రొష్టును బెంచెడువారలే యిలన్
    గాఢ నిశీధినిన్ జనగ;గానము సంస్కరణమ్ము లీదెసన్
    మూఢమె శ్రేష్ఠమౌను శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్

    రిప్లయితొలగించండి
  20. కందము
    వీడిరి సిద్ధాంతములను
    బాడిరి నాస్తిక మతంబు.పరమాత్ముండున్
    లేడను మూఢులు బల్కిరి
    మూఢమె శుభకార్య ములకు ముద్దనిరి జనుల్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  21. మూఢత పెరిగెను జూడగ
    మూఢులె పండితులనుచును మోసము పెరిగెన్
    మూఢుని మాటలు నమ్ముచు
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూఢమి మంచి గాదనుట ముందరి రోజుల నమ్మికే గదా
      వీడిన మూఢ నమ్మకము పెంపగు జాతి హితమ్ము మేలగున్
      రూఢిగ మంచి చెడ్డలను లోతుగ జూచి సముద్యమించినన్
      మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. రూఢిగ విఘ్నమె తథ్యము
    మూఢమె శుభకార్యములకు; ముద్దనిరి జనుల్
    గాఢపు గంటా గణనము
    ప్రౌఢు౦డగు పండితుడిడ పాటించినచో

    రిప్లయితొలగించండి
  23. రూఢముగా ముహూర్తమ నురోధఫలం బొనగూర్చు నంచిలన్
    బాఢము నమ్ముచుండ, నిట బంధురపంచశుభాంగశుక్రత
    న్మూఢవివర్జితాప్తగురుమోదితతారకలగ్నశుద్ధ్యస
    మ్మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  24. మూఢులమాటలెయీయవి
    మూఢమెశుభకార్యములకుముద్దనిరిజనుల్
    మూఢమిత్యాజ్యమెయనుచును
    రూఢిగనేజెప్పుచుంటిరూపా!వినుమా

    రిప్లయితొలగించండి
  25. రూఢిగ సుఖములు కల్గును
    మూఢమి తప్పించి పనుల ముదమున చేయన్
    మూఢుడ! మాటాడకు మెట
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్?

    రిప్లయితొలగించండి
  26. మూఢమెశ్రేష్ఠమౌచుశుభముల్వొనరించునుగార్యసిద్ధికిన్
    రూఢిగజెప్పుచుంటిరె?యపురూపపుపల్కులుమాటలాడగా
    మూఢులుగారుగాతమరుమూఢపునమ్మకమేలగల్గెనే
    ప్రౌఢతనంబుదోడనిలబూర్వపురీతినినుంటయొప్పగున్

    రిప్లయితొలగించండి
  27. ఊఢుని యుదయాస్తమయము
    మూఢముజూడకనెజరుగుభువిలోనెప్డున్
    రూఢిగతప్పని వేళల
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
  28. గాఢోద్వాహం బీ యా
    షాఢమ్మునఁ జేయ నేల సందేహముగన్
    రూఢిగఁ జెప్పుదుఁ గడచిన
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్


    ఊఢయ వేడ సమ్మతము నొద్దిక వేగ మొసంగి వాహ నా
    రూఢను జేయఁగం బతి వరుండు లభించిన దారకున్ ని జో
    ద్వోఢృ విశిష్ట మానస విభూషిత భక్తి సుసంయు తాభి స
    మ్మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ వొనరించును గార్యసిద్ధికిన్

    [అభిసమ్మూఢము = మిక్కిలి భ్రమ చెందినది]

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రూఢిగ నమ్మి యజ్ఞముల రూకలు జల్లుచు నిర్వహించగా
    మూఢులు వోటరుల్ బెదిరి పుణ్యము కోరుచు నేతనెన్నగా
    గాఢపు ప్రాచితమ్మొసగి కమ్మగ చేరగ మంత్రివర్గమున్
    మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్

    రిప్లయితొలగించండి
  30. రూఢి ముహూర్తముల్ గనము క్రూరత యౌగద కాలయాపనల్
    మూఢమియంచు పెండిలిని ముందుకు చాచుట, దుర్భరమ్మగున్
    గాఢపు ప్రేమ జంటలకు, కావున దేవుని పైభరమ్మిడన్
    మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్

    రిప్లయితొలగించండి
  31. రూఢిగ జెప్పెదవినుడీ
    రీఢగబల్కుటతగదన రేపటి జాడల్
    మూఢమనిరి గద యేలా
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్!!

    రిప్లయితొలగించండి
  32. రూఢిగ శుభకార్యముకా
    షాఢము మూఢము వలదని జనులనిరి గదా!
    మూఢుడొకండిట్లు పలికె
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
  33. రూఢిగ జెప్పుచుంటి విను లోకులు చెప్పిరి వద్దటంచు నా
    షాఢము నందు మూఢమల జవ్రిననే శుభ కార్యమైన నా
    మూఢుడు తా వచించెనట మూర్ఖము గానిటులన్ జనాలతో
    మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్.

    రిప్లయితొలగించండి
  34. మూఢుని నాంతర్యంబే
    నీడగనేనమ్ముచుండ!నేర్పేలేకన్
    తోడుగ దొరుకగ నొక్కతి
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరిజనుల్!

    రిప్లయితొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    [దేవతలకు సుముహూర్తంలోనూ, రాక్షసులకు దుర్ముహూర్తంలోనూ కార్యారంభం జయాన్నిస్తుందని, శుక్రాచార్యులు యజ్ఞం చేయ తలపెట్టినారనుట]

    గూఢగతింజరించుచును కోరిన రూపముఁ దాల్చు దైత్యు లా
    రూఢభయాళిచే మివుల స్రుక్కుచు, నొక్కెడ శుక్రు నానతిన్,
    గాఢపు దుర్ముహూర్తమును గాంచిరి! జన్నము సేయ, వారికిన్
    మూఢమె శ్రేష్ఠమౌచు, శుభముల్ పొనరించును కార్యసిద్ధికిన్!

    రిప్లయితొలగించండి
  36. సినిమాలో కథానాయకునితో సహనటుడు...

    ఉత్పలమాల
    గాఢముగా చెలిన్ వలచి కాదను పెద్దలు లేక యొప్ప నా
    షాఢము నడ్డువచ్చెనని యాగితి వింక ముహూర్తమందగన్
    రూఢిగఁ జెప్పుచుంటి విను రూకల నీయఁగ నాశ జూపినన్
    మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్

    (అందరూ అలాంటి వాళ్లుకాదని నా ప్రగాఢ విశ్వాసం)

    రిప్లయితొలగించండి
  37. కందం
    గాఢ పరిష్వంగమునన్
    రూఢిగ జంటఁ గని మనువు రుచిరమ్మని యా
    షాఢము దాటెను వీడఁగ
    మూఢమె, శుభకార్యములకు ముద్దనిరి జనుల్

    రిప్లయితొలగించండి
  38. [5/16, 12:39] shankargdabbikar999: మూఢులె క్రైస్తవ ముస్లిము
    లూఢములాడంగలేనియూహలవేలా
    మూఢా!నిగూఢమౌఢ్యపు
    మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్
    [5/16, 12:40] shankargdabbikar999: రూఢముగా వచింపుము బురోహిత మంచి ముహూర్తమన్న యో
    మూఢ వివాహమన్ననది బూర్వమె నిశ్చయమయ్యె బొమ్మచే
    బాఢముగాగ ముస్లిములు బాల శశాంకునిరాక జేయరే
    *"మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్"*

    రిప్లయితొలగించండి