8, ఆగస్టు 2019, గురువారం

సమస్య - 3099 (మాతను భర్తగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్"
(లేదా...)
"మాతను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్"

67 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పొరణ:

    వేతన మొల్లకే చనుచు భీతిని వీడుచు యాత్ర జేయుచున్
    శీతల పర్వతమ్ముజని సిగ్గును వీడుచు సన్యసించుచున్
    నేతగ భాజపా నగుచు నీమము వీడక భారతీయతౌ
    మాతను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్

    ఉమాసతి = ఉమా భారతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పూరణ బాగున్నది. అభినందనలు.
      మరి 'కాంచెను కార్తికేయునిన్' అన్నదానికి అన్వయం?

      తొలగించండి
  2. ఆతతసద్యశోవిభవు నాద్యుని శంకరు నాశుతోషునిన్
    ఖ్యాతిగడించి లోకమున గాంక్షలు తీర్చెడి చంద్రశేఖరున్
    బూతచరిత్రు నీశ్వరుని భూతగణాధిపు నాదితేయ స
    న్మాతను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఘాతకుడు తార కాసురు
    ఘాతించెడు సుతుని బడయ గట్టు సుతయె దా
    శీతలనగరాజుకు జా
    మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్

    రిప్లయితొలగించండి
  4. హేతువు దెలియక ముదమున
    ప్రీతిగ తాముక్తి కోరి భీకర తపమున్
    చేతనము పొంది సుఖముగ
    మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని సమస్య పరిష్కృతం కానట్టుంది.

      తొలగించండి
  5. కందం

    జాతిని సంరక్షించగ
    మాతా నీవే శరణము మాకని వేడన్
    భూతమునను దక్షుని జా
    మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్
    ......‌........చక్రి

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గురుభ్యోన్నమః🙏

    శీతనగాధిపు గూతురు
    భూతపతిని వేడి జేసె భూరి తపంబున్
    చేతనుడు చెంత జేర ప్ర
    మాతను తనపతిగ గొని యుమాసతి మురిసెన్

    చేతనుడు-శివుడు, ప్రమాత-జ్ఞాని

    రిప్లయితొలగించండి


  7. ఓ తరుణీ ! పెండ్లాడెను
    గా తొయ్యలి శంకరుని సుఖమ్ము బడెసెనా ?
    ఏతావాతా ఓ మా
    మా! తను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈరోజు ఆటవిడుపుకు విడుపు...సారు విపరీతమైన పౌరాణిక గుగ్లీ వేశారు

      :(

      తొలగించండి
  8. *అప్పకింతల సమయంలో విచారించుచున్నటువంటి అత్తగారిని అల్లుడు ఓదార్చు సన్నివేశము*


    ప్రీతిగ తన్మయత్వమున రేయిబగళ్ళను కన్నులార యీ
    నాతియు నాదు ప్రేమగననాశ వివాహమునాడగాను నీ
    కూతురి భక్తితత్పరత కూరిమి నాకును చాలజూపెన
    మ్మా! తను భర్తగాగొనియు మా సతి గాంచెను కార్తికేయునిన్!
    Rohit 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రోహిత్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కన్నులార నీ...' అనండి.

      తొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    ఆతడు భిక్షుకుండు.,విషమాక్షుడు., సర్పవిభూషణుండు., నీ..
    కాతడు జోడు కాదు తనయా ! యన మేన.., తపస్సు జేసి నా...
    కాతడె భర్త యంచనునయమ్మొనరించుచు ముద్దులాడుచున్
    మాతను., భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    రిప్లయితొలగించండి
  10. ఇతరము నొల్లక యీశ్వరు |
    సతతము బూజించి ,ముదమున శాంభవి యడిగెన్ |
    సతిగా కరమును , చేకొను |
    మా, తను , తన పతిగ గొని యుమా సతి మురిసెన్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కుసుమ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "సతతమ్ము గొలిచి ముదమున శాంభవి యడిగెన్" అనండి.

      తొలగించండి
  11. ఇతరము నొల్లక యీశ్వరు |
    సతతము బూజించి ,ముదమున శాంభవి యడిగెన్ |
    సతిగా కరమును , చేకొను |
    మా, తను , తన పతిగ గొని యుమా సతి మురిసెన్|

    రిప్లయితొలగించండి
  12. శీతల నగమున నిరతము
    జ్యోతిర్మయుడై వెలిగెడి శుభకరు హరునిన్
    ప్రీతిగ నా దక్షుని జా
    మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్

    రిప్లయితొలగించండి
  13. చేతనరూపుడు సదయుడు
    భూతములకుబతియునైన బూతచరిత్రున్
    శీతల నాగపుప్రభు,జా
    మాతనుతనపతిగగొనియుమాసతి మురిసెన్

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శీతాద్రిని తానుండుచు
    భూతల జీవుల ననయము బ్రోచెడి శివునిన్
    భూతేశుని నగపతి జా
    మాతను తన పతిగ గొని యుమాసతి మురిసెన్.

    రిప్లయితొలగించండి
  15. ఆతత దీక్షగ తపమును
    ప్రీతిగ నొనరించి శివుని ప్రేమకు వశుడౌ
    ధీతమ హిమవంతుని జా
    మాతను తనపతిగ గొని యుమాసతి మురిసెన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.

    ప్రేతవనపు సంచారిని
    భూతలమున జనులు వేడ బ్రోచెడు వానిన్
    భూతేశుని, దక్షుని జా
    మాతను తన పతిగ గొని యుమాసతి
    మురిసెన్.

    రిప్లయితొలగించండి
  17. మాతనివారణన్మదిని మాన్యతజేయక దీక్షతోడనన్
    భూతలనాధునిన్గురిచిపోడిమితోడన జేసిసంయతిన్
    బూతమనస్కుడున్నగపుభూపతి,హైమవతేశుమామజా
    మాతనుభర్తగాగొనియుమాసతిగాంచెనుకార్తికేయునిన్

    రిప్లయితొలగించండి


  18. చూతము రమ్మ నీశ్వరిని! సుందర మూర్తిని పెండ్లి యాడె! ర
    మ్మా, తను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్,
    చేతనుడాయె నాతడె ప్రచేతము తోడుత రమ్మ కొల్వగాన్
    భ్రాత వినాయకుండితడె పల్కుము జోతల జై గణేశ! జై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రమ్మ యీశ్వరిని' అనండి.

      తొలగించండి
  19. ఆతత విభూతి విలసిత
    భూతాత్మ భుజంగ సద్విభూష శిరస్సం
    పాత విరాజిత గంగా
    మాతను దన పతిగఁ గొని యుమాసతి మురిసెన్


    శ్వేత తనూ విరాజిత సుభీకర లోచన చంద్రమౌళి సం
    వీత గజాంబరద్యుతి సభృంగి వృషార్చిత హర్ష చిత్తు నా
    భూత నికాయ నేతృ ఫణి భూషణ భాసిత బాహుమద్జగ
    న్మా తను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను గార్తికేయునిన్

    [జగన్మా తను= జగన్మాతను గూడిన తనువు గలవాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  20. పాతకి తారకాసురుని బాధలు తాళగ లేని దేవతల్
    మాతృక చెంతజేరి పరమాత్ముడు శ్రీగళు బెండ్లియాడగా
    నా తులువన్ వధించెడు షడాస్యుడు పుట్టునటంచు వేడిరా
    మాతను, భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్

    రిప్లయితొలగించండి
  21. శీత నగాధిరాజ సుత చిన్మయ రూపుని చిద్విలాసునిన్
    భూత గణాధి సేవితుని భూరి కృపాకర దివ్య మూర్తినిన్
    ప్రీతిగ జేరి సన్నిధిని వేడ్కగ నందరు మెచ్చ దక్షు జా
    మాతను భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్

    రిప్లయితొలగించండి
  22. ఆతత భక్తి నా శివునికై యొనరింతు దపమ్ము వీడుమా
    భీతిని, నాకు ది క్కతడె, వీడను పట్టు, 'ను మా' యటంచు న
    న్నీ తెఱ గాప కమ్మ! యని యియ్యకొనంగను జేసి ప్రేమగా
    మాతను, భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్.

    రిప్లయితొలగించండి
  23. భూతేశుడు చంద్రధరుడు
    చేతనుడా శమనరిపుని చేపట్టంగా
    ప్రీతిగ నా నగపతి జా
    మాతను తన పతిగ గొని యుమాసతి మురిసెన్!!!

    రిప్లయితొలగించండి
  24. ఉమా సతి అంటే ఉమ యొక్క భార్య అని కదా

    ఉమ స్త్రీ అయినప్పుడు ఆమెకు భార్య ఉండటం ఏమిటి

    ఒక WhatsApp groupలో అడిగిన ప్రశ్నసర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'అర్థవత్ సమాసః' అన్నారు. మనం చెప్పుకునే అర్ధాన్ని బట్టి సమాసనామం ఉంటుంది.
      ఉమ అనే సతి - సంభావనా పూర్వపద కర్మధారయం
      ఉమ యొక్క సతి - షష్ఠీ తత్పురుష సమాసం
      సతి అయిన ఉమ - విశేషణోత్తర పద కర్మధారయం
      .... ఇక్కడ మొదటిదే తీసుకోవాలి.

      తొలగించండి
  25. . *శ్రీ గురుభ్యో నమః*
    శంకరాభరణం-సమస్యాపూరణం
    సమస్య :: మాతను భర్తగా గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్.
    పూరణ ::
    భూతపతిన్, సదాశివుని, పూజ్యుని, శంభుని, శూలి, నీశ్వరున్,
    భూతినిదాల్చు తాపసిని, మోహనరూపుని, కృత్తివాసునిన్,
    పూతుని, చంద్రశేఖరుని, పుంగవవాహను, స్థాణు, దక్షజా
    మాతను భర్తగా గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్.
    కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు 8.8.2019

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. భూతపతిన్ మహానటు విభున్ శివు శంభుని శూలి నీశ్వరున్
      భూతినిదాల్చు తాపసిని మోహనరూపుని కృత్తివాసునిన్
      పూతుని చంద్రశేఖరుని పుంగవవాహను స్థాణు దక్షజా
      మాతను భర్తగా గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్.
      కోట రాజశేఖర్ నెల్లూరు

      తొలగించండి
  26. చేతము శివుని పయినిలిపి
    యాతతమౌ తపము చేసి యాహరు కృపతో
    ప్రీతి యడర దక్షుని జా
    మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్

    రిప్లయితొలగించండి
  27. శీతనగరాజపుత్రికి
    చేతనమున భవునియూహ చేష్టలనుడుపన్
    చేతులుమోడిచి గిరి జా
    మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్

    రిప్లయితొలగించండి
  28. ఉత్పలమాల

    ఘాతక తారకాసురుని గర్వమడంచెడు సూనునీయుచున్
    భూతగణాధిపా! రయమె బ్రోవు మటంచు సురల్ నుతించగన్
    శీతనగాద్రివాసి కన జీవనుడయ్యెడు వానికొప్పెడున్
    మాతను, భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సూను నిచ్చుచున్' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      ఉత్పలమాల

      ఘాతక తారకాసురుని గర్వమడంచెడు సూను నిచ్చుచున్
      భూతగణాధిపా! రయమె బ్రోవు మటంచు సురల్ నుతించగన్
      శీతనగాద్రివాసి కన జీవనుడయ్యెడు వానికొప్పెడున్
      మాతను, భర్తగాఁ గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్

      తొలగించండి
  29. భూతపతి, యజ్ఞమూర్తిని
    శీతాద్రిని తపముజేయు శితి కంథరునిన్
    పాతక నాశున్, క్షితి ని
    ర్మాతను తనపతిగగొని యుమాసతి మురిసెన్

    రిప్లయితొలగించండి
  30. ఉత్పలమాల:
    శీతమయూఖునిన్ దనదు శీర్షముపైన ధరించు వాడు సం
    ప్రీతిని భక్తులెల్లరకు రివ్వున దర్శనమిచ్చు దా స్వయం
    భూతుడు నాగభూషణుడు బూచులరాయడు పర్వతీశు జా
    'మాతను భర్తగా గొని యుమాసతి గాంచెను కార్తికేయునిన్'!

    రిప్లయితొలగించండి

  31. చేతమున ప్రీతి నిండగ
    భూతేశుని పెండ్లి యాడ బూధర సుతయున్
    కౌతుకమున నొప్పించుచు
    మాతను,తనపతిగ గొని నుమాసతి మురిసెన్.

    మరొక పూరణ

    శీతా చలమ్ము నందున
    తా తప మొనరింప గోరి తడయక చనగా
    మాతయు నొప్పగ గిరిజా
    మాతను,తనపతిగ గొని నుమాసతి మురిసెన్.

    రిప్లయితొలగించండి