10, ఆగస్టు 2019, శనివారం

సమస్య - 3101 (కలిమి దొలంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము"
(లేదా...)
"కలిమి దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

55 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    బలుపగు రాజకీయమున వందలు వేలును కోట్ల రూప్యముల్
    సులువగు తీరు చేకొనుచు సుందర రీతిని కుండమార్చెడిన్
    పలువుర నేతలెల్లరివి బంగరు వజ్రపు బిందెలందునన్
    కలిమి తొలంగి నప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  2. పలువిధ బాధలే ముసురు బాంధవు లెల్లరు నీసడించినన్

    గలతను చెందబోకుమిక కావలె ధైర్యము కష్టకాలమౌ

    కలిమి తొలంగునప్పుడె, సుఖంబు లభించును మానవాళికిన్

    పలువురి మెప్పుపొందెడి ప్రవర్తన కల్గిన వేళనే సుమా.

    రిప్లయితొలగించండి
  3. నిలువగ లక్ష్మి యింట, సఖ!నీరధులెల్లను దాటవచ్చు వే
    కొలువగ వచ్చు విశ్వమును కోట్లు గడించినవారు తేలికన్
    పిలువగ వచ్చు స్వర్గమును వింతగ పల్కితివేల నీవిటుల్
    కలిమితొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    ఇల జగమెల్ల దుఃఖమయమే.! తదభావమె సౌఖ్యమందురీ
    కలుములశాశ్వతంబులు., సుఖంబన బ్రహ్మపదమ్మె.! యద్ది కే...
    వలమగు జ్ఞానసంపద., శుభంకరమౌ.!., ధనరూపమైన యీ
    కలిమి దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. చంపకమాల

    కలిగిన సంపదల్ ప్రభువొ గంగయొ శత్రువొ చోరుడో గొనున్
    దెలివిగ సొంతకార్యములఁ దీర్చుటకో పరమాత్మ సేవకో
    బలమిడ నైనవారలకొ పాటిగ జ్ఞానుల నుద్ధరించనో
    గలిమి తొలంగి నప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి


  7. వస్తుతః జిలేబి వస్తువు విలువ తె
    లియగ వచ్చు నదియె లేని క్షణము
    నటులె నిక్కమమ్మ నమ్మదగు! విలువ,
    కలిమి దొలఁగినపుడె, కలుగు సుఖము !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ఇలపయి దీప్తినంది సుఖియించుట కర్థ మవశ్య మెంచగా

    నలయక ధర్మమార్గమున నార్జన చేయుట యొప్పు, దీనినిన్

    దలపక నీతిమాలుట సదా పరిహార్యము, కష్టదాయి యా

    కలిమి తొలంగినప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  9. కలిమికి తోడు గర్వమధికంబగు గాదె భువిన్ మహాత్మ యీ
    వొళపు నెఱుంగుమీ సకల మోదములిచ్చు శివుండు నమ్ముమా
    బలి శిబి సత్యచంద్రులు దపంబులవేమొనరించి రయ్య! నా
    కలిమి తొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాలికిన్

    రిప్లయితొలగించండి
  10. కలిమియెకారణమ్ము కలికాలములోజనపాళి కస్తికిన్
    కలతల మూలకందమది కల్లలు కొల్లలుగా తనర్చుచున్
    కలకలమున్ సృజించు కనుగానని కావరమున్ రగుల్చు నీ
    కలిమితొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి


  11. ఇల కన వచ్చు ద్వంద్వములు;యిమ్ముగ గాన్పడు హాయిహాయిగా
    మిలమిల లాడు నీ బతుకు మిక్కిలి రక్షణ దోచు చేరగా
    కలిమి; దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్
    విలువలు చేరి జీవితము విస్తృత మై వెలుగున్ విచిత్ర మై!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  12. ఆకాశవాణి కి పంపిన ది


    అలవియె లేని భోగముల హర్నిశలున్ కొనియాడు సేవకుల్
    తలచిన తక్షణమ్ము తమ దాష్టికమెల్లెడ చూప గల్గు వా
    రల తల రాత చిత్రము! పరాత్పరు చింతన ప్రాప్తియౌత‌, యా
    కలిమి తొలంగి నప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్!

    కలిమి - అతిశయము


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. కలుములు దుష్టవర్తనల కారణభూతములైన వేళలో,
      కలుములు దానధర్మములకై లవలేశము లేని యత్తరిన్,
      కలిమి మదంబు మత్సరముఁ గల్గగఁ జేయ, దురార్జనమ్మునౌ
      కలమి దొలంగి నప్పుడె, సుఖమ్ము లభించును మానవాళికిన్.

      తొలగించండి
  14. ఆ.వె//
    కుడవ కూడులేక కూలినాలియుజేసి l
    పంట పొలముజేయ పంటపండి l
    కాయ కష్షములకు కలుగుఫలము పొందు, l
    కలిమి దొలఁగి నపుడె కలుగు సుఖము ll

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె//
    చేనుదున్ని నపుడె సేద్యంబు జేయగా l
    భాగ్యవంతు డవడు యోగ్యుడైన l
    చుక్క నీరుపడిన బక్కరైతు నిలచు l
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము ll

    రిప్లయితొలగించండి
  16. చం||

    అలయక గాంధి యెట్లు సిరినాశను వీడి మహాత్ముడయ్యెనో
    విలయముజేయ తామసము వేమన సర్వము వీడెనోయటుల్
    సులభము గాదు జ్ఞానధనశోధన యెల్లరుజేయ! జ్ఞానికిన్
    కలిమితొలంగినప్పుడె సుఖంబులభించును మానవాళికిన్

    Rohit 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  17. కులము మతంబు లెంచక సగోత్రు లటంచు నుదార బుద్ధితోన్
    చెలిమిగ జేర దీయుచు నుచెంత నుప్రీతిగ నాద రించుచో
    వెలయు నతండు వాసిగను పెంపిరి బోవగ చెంగ లించుచున్
    కలిమి తొలంగి నప్పుడె సుఖంబు లభించు నుమాన వాళికిన్

    రిప్లయితొలగించండి
  18. ఆటవిడుపు గంభీర పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    (King Midas):


    కలిమిని కోరి వేడగను కమ్మని దీవెన నాశపోతుగా
    పలుకగ దేవదూత: "యిల పట్టిన వన్నియు హేమమౌనహో!"
    కలవర మొందె శ్రీవరుడు కన్నియ మారగ పైడిబొమ్మగా...
    కలిమి తొలంగి నప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  19. వలదనుకున్న నొచ్చి పడె వర్షము వోలె సిరుల్, విచిత్రమై|
    చెలగె గనెన్నొ కష్టములు, చింతలు, పెక్కు లు దుర్భరంబుగా|
    తలచె, ధనంబు హెచ్చయిన దోషమె, శాంతియె లేదు సుంతయున్|
    కలిమి తొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  20. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము

    సందర్భము: తాను స్వయంగా ఆర్జించినదే పరమానందం. దాని ననుభవించడమే ఒక వ్రతం. ఇతరు లెవరో సంపాదించింది కాదు. అసలు తల్లిదండ్రులు సంపాదించింది సైతం కా దనే చెప్పాలి.
    కేవలం తాను సంపాదించుకున్నది మాత్రమే తాను అనుభవించే వాని కున్న ఆత్మ స్థైర్యం వేరు.
    ఎవరో చెమటోడ్చి సంపాదించుకున్నది మన కెపుడూ సుఖ మీయదు. ఇస్తుం దనుకుంటే అంతకు మించిన పొరపాటు లేదు. అజ్ఞానం అంతకన్నా లేదు.
    తల్లి దండ్రులు సంపాదించింది కూడా ఏదో కొంత సుఖ మిస్తుందే తప్ప సంపూర్ణంగా యీయజాలదు. (వారిది వారి జీవిత కాలంలోనే అనుభవించనీయాలి. అ దింకా మహోన్నతమైన నిర్ణయం.)
    కేవలం తాను సంపాదించుకున్నది మాత్రమే తాను అనుభవించే వాడు పరమానందాన్ని పొందగలుగుతాడు. ఆధ్యాత్మిక జీవితానికి సరియైన అర్హత కలిగిన వా డవుతాడు.
    ధన్యు డవుతాడు. వాని జీవితం సార్థక మవుతుంది.
    అందుకని ఎవరి కుడుపు (అనుభవం) నుండి తల్లి తండ్రులతోసహా ఇతరులు సంపాదించిన సంపద తొలగిపోతుందో వానికే సుఖం కలుగుతుం దనే భావం పద్యంలో ఆవిష్కరించబడింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    స్వార్జితమును మించు నానంద మది యేది?
    తనదు కుడుపునుండి తల్లి దండ్రి
    తో సహా పరు లిలఁ దొడరి యార్జించిన
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    10.8.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  21. ధర్మ మార్గమున నడవలేని మనుజుడు
    నియమమసలు లేక నీతి లేక
    రాశి పోసినట్టి రక్కసి ధనముల
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము

    రిప్లయితొలగించండి
  22. కలిమి గలుగు వాడి కంట నిదుర రాదు
    తలుపు బిగియగట్టి కలతఁ జెందు
    కలిమి లేనివాడె కాళ్ళు పారగఁ జాచు
    *"కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సులభము గాగ జీవితము సూక్తులివన్నని చెప్పవచ్చులే
      కలవరమింతలేక కవి! కాసులు రాశులఁ గాలదన్నగా
      జలములు గూడ దక్కవిట! సాధ్యమె చెప్పగఁ దూలనాడుచున్
      "గలిమి దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్"

      తొలగించండి
  23. కలిగినఁ జాలదా కడుపుకైఁ దినఁ గూడును కట్ట గుడ్డయున్
    నిలుచుట కింత నీడయును నెమ్మది నిల్లును నెట్టు శక్తియున్
    దలిచెద నంతె నాకిడగఁ దండ్రి! దయామయ!! చూడగా భువిన్
    కలిమి దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  24. పరుల బాధ పెట్టి పైకంబు నార్జించి
    భోగ లాలసు లయి భువిని మెలగ
    శుభము కలుగ బోదు శోభ కాదందు రా
    కలిమి తొలగి నపుడె కలుగు సుఖము

    రిప్లయితొలగించండి
  25. కామ మోహ లోభ గర్వ వైరములకు
    మూలకారణంబు ముల్లెయె గద
    అక్రమముగ చేర నక్కరలేని యా
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము

    రిప్లయితొలగించండి
  26. కలిములుదండిగుండిననకారణవైరముపొర్గువారితో
    గలుగుచుమానసంబునుజికాకుమయంబుగజేయుచుండుచున్
    దలపగనీదుదైవమును,ధార్మికదృష్టినిడొల్లజేయుటన్
    గలిమిదొలంగినప్పుడెసుఖంబులభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మితిని మించి యుండు మిసిమిని కాపాడ
    పవలు రాత్రి యనెడి వాదు లేక
    కాల మంత శాంతి కడనుంచ వలయును
    కలిమి దొలగి నపుడె కలుగు సుఖము.

    రిప్లయితొలగించండి
  28. కాంక్షలెక్కువగునుగనకము మీదన
    కలిమిదొలగినపుడె,కలుగుసుఖము
    దైవచింతవలనదేదీప్యముగనిల
    వాంఛలేకయుంట వరముమనకు

    రిప్లయితొలగించండి
  29. ఉర్వి నొసఁగు ధనము నుత్సాహమే కష్ట
    పడ్డఁ గల్గు గౌరవమ్ము కరము
    పనులు సేయఁ జూపు బద్దకమున రాదు
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము


    చలచల మండు టెండలును సాగర భంగ దురాక్రమమ్ములున్
    వలయములై నిరంతరము వారని భూజన కోట్యగమ్యముల్
    కలుగక యీతి బాధలు దలంపుల దౌష్ట్యము మేన రోగపుం
    గలిమి దొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  30. ఇలపయి జీవనమ్ము కడు నింపుగ సాగును, దుష్టమార్గపున్
    కలిమి తొలంగి నప్పుడె, సుఖమ్ము లభించును మాన వాళికిన్
    పలువురు పెద్దలేర్పరచు బాటనెరింగి భువిన్ చరించినన్
    విలువయు హెచ్చు సంతతము విశ్వమునందున నెంచి చూడగా

    రిప్లయితొలగించండి
  31. తలపులయందుగన్పడదు తాలిమి; నిద్దురకూడదూరమౌ
    కలవరపాటుచెంది మది కందునభద్రతసందడించగా
    కలిమిని గల్గియున్నపుడు గల్గెడు సౌఖ్యము కన్ననీభువిన్
    కలిమితొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  32. అటమటమునమనసునలయజేయునెపుడు
    నిదురపట్టనీదు నిలువనీదు
    కలిమిగూర్చునెన్నొ కష్టాలు మనిషికి
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము

    రిప్లయితొలగించండి
  33. . *శ్రీ గురుభ్యో నమః*
    శంకరాభరణం-సమస్యాపూరణం
    సమస్య :: కలిమి తొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్.
    *ఎవ్వని రక్షింప నిచ్ఛయించితి వాని యఖిల విత్తంబు నే నపహరింతు* అని {పోతన భాగవతంలో} వామనమూర్తి బ్రహ్మతో పలికిన సందర్భం.
    పూరణ ::
    బలి నటు నిగ్రహింప గని, “వామనమూర్తి! త్రిలోకరాజ్యమున్
    గొలిచి గ్రహించినాడ, విక కూరిమి జూపు” మటన్న బ్రహ్మతో
    “కలిమి తొలంగ జేసెదను కావగ” నంచనె మాధవుం; డటుల్
    కలిమి తొలంగినప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్.
    కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు 10.8.2019
    ఇటువంటి భావంతో మరొక పద్యం *రోజుకోపద్యం-శంకరాభరణం* అనే నా గ్రంథంలో 157 వ పుటలో

    నిర్భాగ్యున్ బలిచక్రవర్తి నిటులన్ నీ విట్లు బంధించు సం
    దర్భం బే మని బ్రహ్మదేవు డడుగన్, తత్త్వమ్ము బోధించుచున్
    దౌర్భాగ్యమ్ముల నిత్తు నంటి విల భక్తశ్రేణి బ్రోవంగ; నా
    దౌర్భాగ్యమ్ముల నిచ్చి ప్రోవగదరా దామోదరా! సత్కృపన్. [31-12-2017]

    రిప్లయితొలగించండి
  34. జులై సంచిక తెలుగు వెలుగు సమస్య దయచేసి తెలుపగలరు
    నేను తెలుగు రాష్ట్రాల్లో లేనందువలన తెలుగు వెలుగు దొరకలేదు

    రిప్లయితొలగించండి
  35. క్జుషమించాలి ఆగష్టు సంచిక తెలుగు వెలుగు సమస్య దయచేసి తెలుపగలరు
    నేను తెలుగు రాష్ట్రాల్లో లేనందువలన తెలుగు వెలుగు దొరకలేదు

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము

    సందర్భము: "నరునికి ఎంత సంపద వుంటే మంచిది?" అని ఒక రడిగితే శ్రీ సత్యసాయి "కాలి కింద చెప్పంత" అన్నా డట!
    అంటే కా లెంత వుంటుందో చె ప్పంతే వుండాలి సరిగ్గా. కాలికంటె చెప్పు కొంచెం పెద్దదైతే నడువడానికి ఇబ్బంది. కాలుకంటె చిన్నదైతే ముండ్లు రాళ్ళు కుచ్చుకోవచ్చు.
    అందువల్ల ఎవరు సంపాదించిన సంపదో శ్రమ లేకుండానే వచ్చిపడినప్పటికి కూడా అనవసరమైతే అది తొలగిపోవడమే శాంతి దాయకము సుఖ కారకము అవుతుంది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    చెప్పె సత్యసాయి "చె ప్పంత" యని.. "యెంత
    కావలయు నరునికి కలిమి?" యనిన..
    కనుక ననవసరముగా వచ్చిపడునట్టి
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    10.8.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పెలుచగ విత్త సంపదలు విస్తృతమై కొనసాగుచుండగా
    నెలమియు సౌఖ్యమున్ వదలి నేగుచు రాత్రి పవళ్ళు త్రోయగా
    వలయు నిరంతరాయముగ వాటి ప్రపత్తికి నెప్పుడేనియున్
    కలిమి దొలంగి నప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్.

    రిప్లయితొలగించండి

  38. ఆకాశవాణి విశేషములు తెలుప గలరు ; ఈ వారము
    వచ్చే వారమునకై యిచ్చిన సమస్య యేమిటి తెలుప గలరు



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ జిలేబి

      తమరు పలమనేరునుండి పంపిన పూరణ బ్రహ్మాండముగా చదువబడినది 😊

      తొలగించండి


    2. సహదేవుడు గారికి నెనరుల్స్ పంపితిమి


      జీపీయెస్ వారికి

      అమీ యేక్ జాజాబోర్ :)
      పృథ్భీ అమాకె అపోన్ కొరోచె :)


      జేకే :)


      జిలేబి

      తొలగించండి
  39. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
    సమస్యాపూరణ కార్యక్రమంలో...
    10/08/2019 శనివారం ప్రసారమైన నా పూరణ

    సమస్య
    *** *** **

    కలిమి తొలంగి నప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్

    నా పూరణ. చంపకమాల

    **** *****

    తెలియదు మర్త్యులెవ్వరికి తేరకు సంపద లొచ్చి చేరినన్,

    కలిగిన రాజ భోగములు, కల్మషమై మది పాపకార్యముల్

    పలు సలుపంగ ,నా ఘన శివైక్యము జెందెడు భాగ్యమబ్బునే?

    కలిమి తొలంగి నప్పుడె సుఖంబు లభించును మానవాళికిన్

    .-- ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి

    రిప్లయితొలగించండి
  40. ఆటవెలది
    మనజునకు నరకము మనసు తనదికాక!
    నిత్యసత్యమిదను నియతి గనరె
    ఆత్మ శాంతి లేక నంది వచ్చెడిదైన
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము! !

    రిప్లయితొలగించండి
  41. కలిమి దెచ్చు సుఖము కలకాలముండదు
    ఆత్మ తృప్తి మనిషి కసలు సుఖము
    కలిమి కారణమ్ము కలహమ్ములకు నట్టి
    కలిమి దొలఁగినపుడె కలుగు సుఖము

    రిప్లయితొలగించండి
  42. ఉదయం నుండి సాయంత్రం వరకు *అవధాన శిక్షణా శిబిరంలో పాల్గొని వచ్చాను. పూర్తిగా అలసిపోయాను. కళ్ళ మంటలు, నీళ్లు కారుతున్నాయి. అందువల్ల మీ పద్యాలను సమీక్షించలేను.
    రేపు సంగారెడ్డిలో అవధాని అవుసుల భాను ప్రకాశ్ గృహ ప్రవేశానికి వెళ్లాలి. రేపటికి ఆరోగ్యం ఎలా ఉంటుందో?

    రిప్లయితొలగించండి
  43. తలచగ వలయు మీరు స తతము ముదిమి

    నిచ్చు మార్పులు, తిరుగుట నేర మేమి

    కాదు శంకరార్యా,ససి గలుగ చేయ

    గలరు యెన్నియో నవధానములను మీరు ,

    తిన్నదనము కోల్పోయిన దేహమెటుల

    సహకరించు సాహిత్య పు సభల కేగ

    వలదు వలదనిన వినవు వాణి సుతుడ,

    తండ్రి నైనచో దండింతు తగవు లాడి,

    తల్లి నైనచో చెప్పెద తప్పు యనుచు,

    భార్య నైనచో వేడెద పదముల పడి,

    మిత్రుడయిన యెడలమీదు మేలు చేతు

    కాని మీదు శిష్యుడనైతి, కరము లెత్తి

    వేడు కొందును చల్లగా చూడమనుచు

    శంకరార్యుని సతతము శంక
    లేక

    రిప్లయితొలగించండి
  44. విలువలు వీడి ధారుణి నివిత్తము కోరుచు నాగ కుండ తా
    వలసిన దానికన్న నిట వాంఛను పెంచుకు జేబు నింపగా
    తొలగిన నార్జనమ్మదియు దుఃఖమె నిండును డెందెమందు నా
    కలిమి తొలంగినప్పుడె సుఖమ్ము లభించును మానవాళికిన్

    మరొక పూరణ

    ధనము పైన యావ తనువును చెరచును
    మోహమధిక మైన పుడమియందు
    నిదుర తిండిలేక నెమ్మది పోగొట్టు
    కలిమి తొలగినపుడు కలుగు సుఖము

    రిప్లయితొలగించండి