19, ఆగస్టు 2019, సోమవారం

సమస్య - 3108 (వాన లెన్నియో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాన లెన్నియో కురిసె పిపాస పోదు"
(లేదా...)
"దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో"

89 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కొండల మీదనున్ వెలసి కోరిక తీరగ మేడ కట్టగా
    మెండుగ వానలన్నియును మేలుగ నేలకు జారిపోవగా
    గండర గండులందరును గాఢపు లోతున బోర్లు కొట్టగా
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. కొండల వాలు తీరమున కోరిక తీరగ మేడ కట్టగా
      మెండుగ కృష్ణ పొంగుచు మమేకము చేయగ బాబు మేడనే
      దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో
      గండర గండుడా జగను గట్టిగ డ్రోనుల నంపి బట్టెనే!


      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      జిలేబి గారూ,
      మీ పేరడీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  2. ఏ పేపరు చూసినా యిదే మాట!

    దొరకదే త్రాగను జిలేబి దోసిలికి క
    లికపు మంచి నీళ్లకట! ఫలితమిదియె సొ
    రాజ్జమున డెబ్బదేండ్లపై రాష్ట్రమందు!
    వాన లెన్నియో కురిసె పిపాస పోదు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. దుక్కి దున్నెడు తరుణాన దూరమగుచు
    నెదురు చూసిన రైతన్న యెదను మంట
    పెట్టి కాలమె కానట్టి వేళలోన
    వానలెన్నియో కురిసె పిపాస పోదు.

    రిప్లయితొలగించండి
  4. ధనముఁ బోషాణమందెంత దాచుకున్న
    తనివి తీరదు నరునకీ ధరణి యందు
    వసుధను విడి యక్కరలేని వార్ధి పైన
    వానలెన్నియో కురిసె పిపాస పోదు.

    రిప్లయితొలగించండి
  5. దనుజ రూపంబు హెచ్చెగా ధరణి యందు
    కరుణ యిసుమంత జూడగా గాన దాయె
    కువలయంబంత బందూకు గుండ్ల రుధిర
    వాన లెన్నియో కురిసెపి పాస పోదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గానరాదు... నెత్రు వాన..." అనండి. 'రుధిర వానలు' దుష్టసమాదం.

      తొలగించండి
    2. సరి దిద్దుకొనెదను.
      కృతజ్ఞతతో🙏

      తొలగించండి
    3. దనుజ రూపంబు హెచ్చెగా ధరణి యందు
      కరుణ యిసుమంత జూడగా గాన రాదు
      కువలయంబంత బందూకు గుండ్ల నెత్రు
      వాన లెన్నియో కురిసెపి పాస పోదు

      తొలగించండి


  6. వండుట కైన లేదరరె భారత దేశము లోన మంచినీ
    రండి జిలేబి గారు! మన రాష్ట్రపు తీరును చూడుడీ సదా
    దండుకొనంగ గద్దెపయి ధాటిగ కూర్చొనునాయకుల్ సుమా!
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. సమస్య :-
    "వాన లెన్నియో కురిసె పిపాస పోదు"

    *తే.గీ**

    గెలిచిన గెలవకున్నను కీలకమగు
    రాజకీయ నాయకులపై రోజ పూల
    వాన లెన్నియో కురిసె, పిపాస పోదు
    పదవుల కొరకు సతతము ప్రాకులాట
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  8. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దండుగ మాలినన్ బ్రతుకు దైన్యము మీరగ రాళ్ళసీమనున్
    కొండొక రీతినిన్ గడుప గుండమ వోలెడు నత్తయింటిలో;...
    పండుగ చేయగా ప్రజలు బావులు నిండగ రాజమండ్రిలో
    దండిగ వానలే కురిసె...; దప్పిక దీర దిదేమి చిత్రమో

    రాళ్ళసీమ = రాయలసీమ

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    పండితసామవేదమధువాగ్జలధారలు వృష్టిరీతిగా
    గుండెల తాకు., లౌకికపు కోరికలారినయట్లు దోచు., బల్
    మొండిది నా మనమ్ము.! గతమున్ తలచున్ మరి క్రుంగు నిత్యమున్.!
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. కొండలు మ్రింగువా డతడు కూరిమి మీర నధీశుజేయ నా
    గండరగండడన్నియును గైకొని మెక్కుచునుండె చింతలే
    కుండగ, చాలవయ్యె భువినున్న సిరుల్, ఘను వాని నెంచినన్
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో.

    రిప్లయితొలగించండి
  11. వరుణ దేవుడు కరుణింప వసుధ యందు
    వానలెన్నియో కురిసె.... పిపాస పోదు
    పైక మెంత గడించిన వక్రముగను
    మరియు నార్జింప జూతురు మనుజు లిలను

    రిప్లయితొలగించండి
  12. మెండగు జీవనమ్మనుచు మేరలులేకయె వీధివీధులన్
    నిండుగ కాంకిరీటులను నింపగ నీరెటునింకునో యిలన్ ?
    నిండు జలాశయమ్ములవి నీటిని పట్టక పొంగిముంచగా
    తిండికి త్రాగునీటికిని దేహియటంచును తల్లడిల్లగా
    దండిగ వానలే కురిసె దాహముదీర దదేమి చిత్రమో!!

    రిప్లయితొలగించండి
  13. నిండెను వాగువంకలును నిండె జలాశయము ల్తటాకము
    ల్నిండుగ మున్గుచుండినవి నీట గృహమ్ములు దార్లు పచ్చగా
    పండిన పంట లారినవి బాధలు హెచ్చెను కాని భూమికిన్
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో.

    రిప్లయితొలగించండి
  14. ఎండలకు నేలయంతయు యెండిపోయె
    ఋతువునందు మా ర్పువలన యిపుడు విధిగ
    వాన లెన్నియో కురిసె పిపాస పోదు
    పుడమికి , జలను పదిలించ పూనకున్న

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యంతయు నెండిపోయె... వలన నిపుడు" అనండి.
      'పదిలించ'?

      తొలగించండి
  15. ఎండలు మండుచుండెఁ గడు నెక్కడ జూచినఁ గల్మషమ్మె భూ
    మండల మంతనిండి కన మాయనిపుండును బోలి తీవ్రమౌ
    గండము యయ్యెఁ ఖేదమిది కమ్మెను దట్టపు నామ్ల మేఘముల్
    దండిగ, వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గండము + అయ్యె = గండమయ్యె' అవుతుంది. యడాగమం రాదు. "గండము గల్గె" అనండి.

      తొలగించండి
  16. కుండపోతగ వానలు కురియుచుండ
    నిండిన జలాశయాల్దెగి నేలపైన
    వరద పారగ నెటుజూడ బురదనీరె
    "వాన లెన్నియో కురిసె పిపాస పోదు"

    రిప్లయితొలగించండి

  17. బిపాస బసు బసననీకే :)

    నాయకుడదిగొ వచ్చె విన్యాసములకు
    బాలి వుడ్డిది సరసకు భామ పోవె!
    వాన లెన్నియో కురిసె! బిపాస పోదు
    నీ బడాయి బసుబసననీకు సోకు !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. వానదేవుని గరుణన వసుధయందు
    వానలెన్నియోకురిసె,పిపాసపోదు
    త్రాగనుప్పునీటినిసరిత!తెలియుమిది
    దప్పిదీరును మజ్జిగ ద్రాగునెడల

    రిప్లయితొలగించండి
  21. తే.గీ//
    ప్రకృతిలో రసాయనముల ప్రాపకమున l
    గగన తలమందు మేఘాలు క్రమ్ముకొనగ l
    ఫలము లేనట్టి భువిపైన బైతుకు జడి l
    వాన లెన్నియో కురిసె పిపాస పోదు ll

    రిప్లయితొలగించండి
  22. వేదవ్యాసుడికి నారదుని ఉద్బోధ:

    తేటగీతి
    భారతము వ్రాసి వేద విభజన జేసి
    వాజ్ఞ్మయ జలధికిన్ వృష్టిఁ బంచినావు
    విష్ణునామ కావ్యంపు టావృష్టి కొరత
    వాన లెన్నియో కురిసె పిపాస పోదు

    ఉత్పలమాల

    మెండగు వృష్టి భారతము మేటిగ గూర్చితె వేదజాతవై
    నిండె నపార వాజ్ఞ్మయపు నీరధు లెల్ల భవద్ప్రభావమై
    మండిత విష్ణు నామమొగు మంజుల కావ్యఁపు పాన లోటుతో
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వాఙ్మయ' టైపాటు. 'నామమొగు'? 'పానలోటు' దుష్టసమాసం. సవరించండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      ఉత్పలమాల

      మెండగు వృష్టి భారతము మేటిగ గూర్చితె వేదజాతవై
      నిండె నపార వాఙ్మయపు నీరధు లెల్ల భవద్ప్రభావమై
      మండిత విష్ణు నామమున మంజుల కావ్యఁపు పాన లేమితో
      దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో?

      తొలగించండి
  23. ముమ్మరమ్ముగ వానలు కుమ్మరించి
    వరదనీటితొనిండెను వాగువంక
    సీమలోమాత్రమదియేమి చిత్రమౌర!
    వాన లెన్నియో కురిసె, పిపాస పోదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీటితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "నీటను' అనండి.

      తొలగించండి
  24. పండితు లందఱున్గలిసి భవ్యునిగూరిచిబూజజేయగా
    దండిగవానలేగురిసె,దప్పికదీరదిదేమిచిత్రమో
    కొండలనుండిదామిగులగ్రౌర్యపురావముగల్గుచున్వెసన్
    దండిగ వర్షమున్బడగధారుణియంతయుమున్గిపోయినన్

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. త్రాగ నీరు లేక బ్రతుకు వేఁగు చుండ
      వట్టి మాట లయ్యెను రాదు కట్ట యొకటి
      దట్టముగ నానకట్టలు కట్ట మంటి
      వాన లెన్నియో కురిసెఁ బిపాస పోదు

      [అంటివి +ఆనలు = అంటి వానలు; ఆన = ఆజ్ఞ]


      దండిత శాత్రవుండు నిజ దార రతుండును సత్యసంధుఁ డా
      చండ పరాక్రముండు రఘు చంద్రుఁడు రాముని దైత్యభండ నో
      ద్దండుని యక్ష యాక్షర వితాన సమంచిత కీర్తనమ్ములన్
      దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో

      తొలగించండి
    2. అద్భుతంగా ఉన్నవి మీ రెండు పూరణలు. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. ఎండలు పోయివచ్చినవి యెక్కుడువానలు గుమ్మరింతగా
    నిండెను వాగువంకలును నీటను యెల్లెరుతల్లడిల్లగా
    మెండుగ కల్మషమ్ములును మేళనమొందగనీటియందహో
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీటను + ఎల్లరు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "నీటను సర్వులు" అందామా?

      తొలగించండి
  27. జదివితి తెలుగున పలు రస ములు కలిగి
    న కవితలు పద్య కావ్యముల్ నాటకములు
    నవలలు, మరి రస మయమైన సుకవితల
    వాన లెన్నియో కురిసె పిపాస పోదు.

    రిప్లయితొలగించండి
  28. ఎండలు మండుచుండెనని యెల్లరు దేవుని వేడ నంతలో
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో
    నిండె జలాశయమ్ములను నేతల మాటల కేమి గాని రా
    కుండె కొళాయిలందు మరి గుక్కెడు నీరిక నేమి జెప్పుదున్

    రిప్లయితొలగించండి
  29. గండము వచ్చె నన్నటుల గాలియు వానకు తోడు వెల్లువల్
    నిండగ వీథి వాడలను నీరము జేరుచు సంద్రమై జనన్
    తిండికి, త్రాగు నీటికిని తిప్పలు కల్గె జనాళి కంతటన్!
    దండిగ వానలే కురిసె దప్పిక తీరదదేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  30. గుండెలు ముక్కలయ్యె, నట కోతకు వచ్చిన పంట లెల్లడ
    న్నెండగ బాధతో హలికు లేడ్చుచు నుండ పరామృతమ్మదే
    నిండుగ నుప్పునీరుగల నీరధి పైనను జల్లుజల్లుగా
    దండిగ వానలే కురిసె దప్పిక దీరదదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అవసరమ్మె కలుగకుండు నంబునిధిని
    వానలెన్నియో కురిసె; పిపాస పోదు
    వృష్టి కొఱకు కాటకముతో బీడువాఱి
    పొలము లెండిన రైతుల తలపు లందు.

    రిప్లయితొలగించండి
  32. నా శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయమున పూతన వధ నా నలుబదవ దశకము నందలి పద్యము, క్రమాలంకారమున కదాహరణము:

    భయద ఘోషణ భీషణ వర్ష్మ సుశ్ర
    వణ సుదర్శన మోహిత వల్ల వాంగ
    న లసురి యురమునం దాట నలరు నిన్ను
    నక్కున నిడిరి గోపిక లదరి బెదరి

    రిప్లయితొలగించండి
  33. కన్నవారికి దూరంగ గడుపు పాప
    జన్మ దిన శుభ సందేశ జాబు లన్ని
    చేర్చి, తోడెవ్వరును లేక చింత జేసె,
    వాన లెన్నియో కురిసె పిపాస పోదు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దూరంగ' అనడం వ్యావహారికం. "దూరాన" అనండి. 'సందేశ జాబులు' దుష్ట సమాసం.

      తొలగించండి
  34. తేటగీతి:
    మదిని నీపైన కొండంత మమత దాచి
    చేరితినిగ నీ దరికిని జేయి బట్ట
    కానకను దారి నీ మది, కలత రేపు
    వాన లెన్నియో కురిసే, పిపాస పోదు..

    రిప్లయితొలగించండి
  35. 1). తే.గీ. (షట్పది) //
    గ్రుచ్చు కొనుచుండె గుండెలో గునపమోలె l
    వర్ష కాలము నందున వానచుక్క l
    లేక వరిమొక్క లెండగా లేశమైన l
    బాధ లేనట్టి వరుణుడి పాపములకు l
    పూనుకొనుచుండ బాపురే పోనుపోను l
    " వానలెన్నియో కురిసె, పిపాస పోదు" ll

    2). తే.గీ//
    పిడచగట్టుకు పోయెను చలువనాల్క l
    మొరలినగ కరుణించునా మోజుతీర l
    మోడువారిన భూదేవి మోము గాంచి l
    వానలెన్నియో కురిసె, పిపాస పోదు ll

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'గునపము వలె" అనండి.
      రెండవ పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  36. "దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో"
    పండితవర్యులిట్లడిన ప్రశ్నకు హేతువు నెంచజూచుచోన్
    మెండగు వర్షధారలను మేదినిఁ జొప్పడనీక పంపగాన్
    గుండలఁ గుమ్మరించిననుఁ గోటిసురేంద్రులు, గొంతులెండులే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊకదంపుడు గారూ,
      బహుకాల దర్శనం! సంతోషం.
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  37. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.....

    మెండుగ చెర్వు కుంటలును మేదిని పైననుమాయమాయె నా
    కొండలపైన వానపడి గొబ్బున నేరుగ బారి యేరులై
    నిండియు పొంగిపోయి ఘన నీరధిలోనను జేరునందుకే
    దండిగ వానలే గురిసె దప్పిక తీర దదేమి చిత్రమో

    రిప్లయితొలగించండి
  38. ఉత్పలమాల

    మెండుగ వచ్చినన్ వరద మేలుగ నింపి జలాశయమ్ములన్
    దండుగ యయ్యె సాగరముఁ దాకఁగ, వాహిను లన్ని యొక్కటై
    గండముఁ దీర్చఁ గూర్చుటలు కాగితమున్ విడ బద్ధకించగన్
    దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో?

    రిప్లయితొలగించండి
  39. మండెడు నెండ గుండియల మంటలు హెచ్చె నఖండ భారతిన్
    గుండెల పిండు గండములు గొండిక గుండెలతో వనంబులన్
    దండిగ నెండగట్ట మరుధాత్రిని నామ్లపు వర్షమీ గతిన్
    *దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో"*

    రిప్లయితొలగించండి
  40. బండె డభాండమేల జడి వానల వాగులు వంక లన్నియున్
    నిండుగ నిండు గర్భినిగ నెర్రెల నింపి వసుంధరాసతీ
    గుండెల మెండుగన్ ముదము గొల్ప తటాకము లెల్ల సౌధలై
    బండెడు బండలై యడవి ధ్వంసమునై ప్రకృతిన్ జ్వరంబుతో
    *దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో"*

    రిప్లయితొలగించండి
  41. 1). తే.గీ. (షట్పది) //
    గ్రుచ్చు కొనుచుండె గుండెలో గునపము వలె l
    వర్ష కాలము నందున వానచుక్క l
    లేక వరిమొక్క లెండగా లేశమైన l
    బాధ లేనట్టి వరుణుడి పాపములకు l
    పూనుకొనుచుండ బాపురే పోనుపోను l
    " వానలెన్నియో కురిసె, పిపాస పోదు" ll

    2). తే.గీ//
    పిడచగట్టుకు పోయెను పిల్లనాల్క l
    మొరలినగ కరుణించునా మోజుతీర l
    మోడువారిన భూదేవి మోము గాంచి l
    వానలెన్నియో కురిసె, పిపాస పోదు ll

    రిప్లయితొలగించండి
  42. దండిగ వానలే కురిసె దప్పిక దీర దిదేమి చిత్రమో?
    మెండుగ కల్మషమ్ములవి మేఘము లన్నియు పోయుచుండగా
    నిండెను దొర్వులన్నిచెడు నీరముతోడ పురమ్ములందునన్
    కుండెడు శుద్ధమౌజలము కూడక యున్నను దప్పితీరునే ?

    రిప్లయితొలగించండి