28, ఆగస్టు 2019, బుధవారం

సమస్య - 3117 (ఎగ్గుసిగ్గుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు"
(లేదా...)
"విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్"

107 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    సడియును సవ్వడిన్ కనక చక్కగ నోడగ కాంగ్రెసోత్తమా!
    మడినిక చేరుచున్ వడిగ మందులు జల్లుచు పుర్వుపుట్రకై
    వడిగల యెద్దులన్ నిలిపి వాసిగ దున్నుచు పైరులన్ భళా
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "ప్రభాకర శాస్త్రి గారూ, సమస్యను ఇస్తున్నప్పుడే అనుకున్నా మీనుండి చక్కని పొలిటికల్ సెటైర్ వస్తుందని. మీ సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు."

      ...కంది శంకరయ్య గారు

      తొలగించండి
  2. కుడిచెడి వేళ సిగ్గుపడ కూడదు కోరుము చాలినంతగన్
    పడుచును గూడు వేళ పరువమ్ముల దోచుటకేల సిగ్గురా
    విదువుము సుగ్గురా సభను వేదికపై సఖ!పాడు వేళలన్
    *"విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్"*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎక్కడెక్కడ సిగ్గు పడకూడదో చక్కగా వివరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
      "విడువుము సిగ్గురా..." టైపాటు.

      తొలగించండి
  3. నిన్నటి పూరణ.

    మక్కువఁ గొల్పు, నిచ్చలు సమస్య నొసంగగఁ, గంది శంకరుం
    డెక్కడ సేకరించునొ?, మరే కృతి యందు లిఖించియుండెనో?
    లెక్కిడ వేనవేలు నవలీలను గూర్చగ నెట్లు తోచునో?,
    యెక్కడి మేధ పొత్తముల నెన్నడు జూడని వానికివ్విధిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      నన్ను ప్రస్తావిస్తూ చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. పడయగగోరి సద్యశము పాటుపడందగు సర్వవేళలన్
    గడగి మహత్కృతుల్ సలుపగాదగు దుష్టుల వాక్యజాలమం
    దడలక ముందుకేగవలె నన్నిట లోకహితంబు నెంచినన్
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్.

    రిప్లయితొలగించండి
  5. తేలు ప్రాకెను 'లుంగీ' కి -తిక్కరేగె-
    పరుగు తీసితి దూరము పారవైచి
    కట్టుకొని యున్న లుంగీని-గసలుఁబెట్టి--
    ఎగ్గు సిగ్గును విడఛుటె హితమొసంగు.

    రిప్లయితొలగించండి
  6. బలము లేనట్టి వాడయ్యు భారతమున
    నీతి మాలిన వాడయి నియమము లను
    విడిచి, చేసెడు కార్యముల్ చెడును జేయ
    ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు!!

    రిప్లయితొలగించండి
  7. సకల శాస్త్రము లెరగిన జాణ విట్లు
    చెప్ప బూనుట సరియౌన తప్పుకాదె
    మాన ధనులైన నరులకీ మహిని యెటుల
    నెగ్గు సిగ్గుల విడుచుటె హితమొసంగు?

    రిప్లయితొలగించండి
  8. పడిపడి వందనంబులని వాడికి వీడికి మూఢ కోటికిన్
    బడుగులు నిచ్చి పుచ్చిననె బాధ్యత వీడిన లంచగొండులే
    వడివడి ఫైళ్లదుమ్ము దులుపంగ దలంతురు వారిముందరన్
    *"విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్"*

    రిప్లయితొలగించండి


  9. ఎరుగను చిదంబర రహస్యమెవరి తరము!
    ఈడి సీబియై పట్టుకొనిన చిరునగ
    వులను చిందించుచున్ తన వునికి చాటి
    యెగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. 'వునికి' అనడం సాధువు కాదు. "సీబియై తనను బంధించిన నగ। వులను... తన యునికి..." అనండి.

      తొలగించండి
  10. కుడుచునె సిగ్గులున్న యెడ కూర్మి రుచించు పదార్థజాలమున్?,
    తడయక మూటగట్టునె నితాంతధనమ్మును?, దీర్చునో తమిన్?,
    కడగి జయమ్ము నీదె యగు, కల్గు సుఖమ్ములు, నన్నితావులన్
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    భీముని పరివేదన...

    కుడిచి విషాన్నమున్ బ్రతికి కుందుచునుంటిఁ బరాభవాగ్ని నా
    యెడద దహించుచుండె., రుచియించుటలేదు రసాన్నమైన., ని
    ప్పుడునిక కన్నులన్ జెవుల మూసుకొనన్ కడు మంచివాడనే.!
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. ధైర్య సాహసమున యరు దర్ప మణుచు
    కూరిమిని పడతిని పొంద గోరునపుడు
    ఆకలిని మారు ముద్దను అడుగు నపుడు
    ఎగ్గు సిగ్గుల విడుచుట హిత మొసంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సాహసమున నరి దర్ప మడచు... గోరునప్పు । డాకలిని... ముద్దనే యడుగు..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు మాస్టారూ..
      సవరణలతో

      ధైర్య సాహసమున నరి దర్ప మడచు
      కూరిమిని పడతిని పొంద గోరునప్పు
      డాకలిని మారుముద్ద నడుగు నపుడును
      ఎగ్గు సిగ్గుల విడచుటె హిత మొసంగు

      తొలగించండి


  13. పిడికిలి మూత విప్పుటకు వీరికి చాలిక యేది? సీబియై
    నడకయు నత్త వేగము! దినమ్ములు వేగము సాగిపోవు! నే
    తడబడకన్ విచారణ విధానము చూచెద నవ్వుకొంచు! చే
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్!



    జిలేబి

    రిప్లయితొలగించండి

  14. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తుడుచుచు కంటి నీరమును తుమ్ముచు దగ్గుచు ముక్కు మూయుచున్
    తడికల మాటునన్ నిలిచి తన్మయ మొందుచు పాతటేకునన్
    కడకిక ఫర్నిచర్ దులిపి గారబు పుత్రున కిచ్చుటన్ భళా
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  15. ముడిచిన మల్లెమొగ్గలవి మోహముఁబెంచుచు రమ్ము రమ్మనన్
    గడపట కీడుఁ గల్గుటకుఁ గారణ మౌనను జింత శూన్యమై
    జడువకఁనింత ముందునకు జారులరీతిగఁ జార్చు వాంఛఁ బో
    విడుచుటె-యెగ్గుసిగ్గులను, విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  16. వినుము వైద్యుని కడ రోగ వివరమందు
    చేయ రాని పనుల కడ్డు చెప్పుటందు
    సరస శృంగార సల్లాప సమయమందు
    ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు

    రిప్లయితొలగించండి
  17. బాధలందున మున్గిన వారి కొరక
    వెట్టి పనులైన సేయంగ నిష్ట పడుచు
    తమదు స్థాయిని మరచియు తగ్గుట యును
    ఎగ్గు సిగ్గుల విడుచుట హితమొసంగు

    రిప్లయితొలగించండి
  18. కుడిచిన మాతృ క్షీరమును గొప్పగదల్చని హీనమానవుల్
    గడచిన బాల్యమంతటిని,గారవమొప్పగజేసెనాపెనే
    తడబడునట్లు సేయుటది , ధన్యతలేనటువారిచేష్టలే
    విడుచుటె ఎగ్గుసిగ్గులను, విజ్ఞులకున్ హితమిచ్చునిచ్చలున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాతృక్షీరము' అన్నపుడు 'తృ' గురువై గణదోషం. "మాతృదుగ్ధమును" అనవచ్చు. "గొప్పగ నెంచని" అనండి.

      తొలగించండి
  19. రాజకీయాన రాణించి రాజ్య మేల
    దలచు వారికి భయమేల తప్పు సేయ
    పాప భీతియు నభిమాన పౌరుషమ్ము
    లెగ్గు సిగ్గుల విడుచుటె హిత మొసంగు

    రిప్లయితొలగించండి


  20. నా పూరణ. చం.మా.
    ***** **** **
    తడబడి వ్రాయు వేళలను తప్పక జ్ఞానుల నాశ్రయించి నీ

    వడిగిన సిగ్గు వీడుచును, ఖ్యాతిని పొందెడు రీతి మిక్కిలిన్

    వడిగను తప్పుజేయకను పద్యపు మాలల నల్లవచ్చులే!

    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
    🌷🌷 వనపర్తి 🌷🌷



    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.

    ఎదురుచూచుచు నవకాశ మెప్పుడనుచు
    గోడమీది పిల్లి వలెను కూరుచుండి
    రాజకీయము లందున రంగుమార్చ
    నెగ్గుసిగ్గుల విడుచుటె హితమొసంగు.

    రిప్లయితొలగించండి

  22. భ్రష్టు బట్టెను గాదెయీ పాలిటిక్సు
    నేతి బీరలట్టుల సుంత నీతి లేదు
    నేడు రాణింప వలెనన్న చూడచూడ
    నెగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు !

    రిప్లయితొలగించండి
  23. ఎదుటి పక్ష సభ్యులు తమయెడల తిట్ట
    నాలకించి సహించుట యపసరంబు
    రాజకీయమందలి నేతలందరికిని
    యెగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు

    రిప్లయితొలగించండి
  24. దుడుకుగ ధార్తరాష్ట్రుడటు దుర్మతియై తన కొంగు లాగగా
    విడువమటంచు సాధ్వి కడు వేదనతోడ తనెంత వేడినన్
    విడువని వేళ నన్నియును వీడి పరాత్పరు రక్ష బొందెగా
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  25. చీదరించిన గొలదిని సిగ్గుబడక
    తనయు నికినిదా మఱచియుతగ్గియుంట
    యెగ్గుసిగ్గులువిడుచుటె,హితమొసంగు
    నవిరళంబగు దానమ్ము లర్హులకిల

    రిప్లయితొలగించండి
  26. ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు
    బాగుపడు విద్య నేర్వగా బాల్యమందు,
    విందు భోజనంబు కడుపు విషయమందు,
    కలికి బొందును కోరగా గవయుటందు!

    రిప్లయితొలగించండి
  27. *పారెడీ.. పూరణ*

    మద్యమ్ము నెవడురా మాన్పజాలెదమంచు రాగాలనే తీయు త్రాగుబోతు
    మద్యమ్ము నెవడురా మానవత్వము లేక మట్టుబెట్టగ జూచు మంకు వాడు
    మద్యమ్ము జలమురా మర్త్యలోకము నందు మాధుర్యములు పంచు మహిత గంగ
    మద్యమ్ము నెప్పుడో మానివేసితి మేము మద్యమ్ము త్రాగురా మమ్ము నేడు

    ఇప్పు డద్దాని మాన్పుట యెవడి తరము
    *ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు*
    నిన్నటికి మున్ను మొన్ననే నిశ్చయముగ
    బీరు బ్రాండీలు యేరులై పార లేదె

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  28. ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు
    ఆలుమగలు గూడిన మహానందవేళ;
    వైద్యుడి కడ; పోరాడగ వైరి తోను;
    బోధ చేయు గురుని కడ; భోజనమిడు
    వారి వద్ద; తెలిసి నడవర తెలివిగ

    రిప్లయితొలగించండి
  29. ధర్మజునితో శ్రీకృష్ణ పరమాత్మ :

    చంపకమాల

    ఉడుకువ లేని కయ్యమున నోర్వగఁ జాలెనె పర్శుపాణి? తా
    మడమనుఁ ద్రిప్పబోడు నసమానుడు భీష్మ పితామహుండనిన్
    ముడివిడు మర్మమున్ దెలియఁ బోవుము జెప్పును తాత, ధర్మజా!
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి

  30. సత్య నిష్టనుపాటించు సమయమందు
    కాటి కాపరి యాయెభూకాంతుడొకఁడు
    మాట నిలబెట్టుకొనుటకై మానధనులు
    ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు

    రిప్లయితొలగించండి
  31. *గెలుచు గుర్రమ్ము నెక్కుటే తెలివి గదర*

    తేటగీతి
    పదవి నందితిఁ బాలక పక్షమందు
    నేటి యెన్నికల గెలుచు ధాటి లేదు
    వైరి పక్షానఁ గెల్వఁగాఁ జేరిపోదు
    నెగ్గు సిగ్గుల విడుచుటె హిత మొసంగు

    రిప్లయితొలగించండి
  32. చూచు టన్యుఁల దనవలె సుఖము దుఃఖ
    మును గనుట యొక్క రీతిని ననువు గాను
    బ్రాణులఁ బరమాత్మఁ గనుట పక్షపాత
    మెగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు


    అడరఁగ సద్గుణమ్ములు సమంచిత యుక్తి పరాజయమ్మునన్
    విడువక ధైర్య మెన్నఁడును వీడక కర్మము లందు యత్నముం
    దడఁబడ కుండ నాపదల ధారుణి జీవన మందు నాకలిన్
    విడుచుటె యెగ్గు సిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    [జీవన మందు: ఎగ్గు; ఆకలిన్: సిగ్గు]

    రిప్లయితొలగించండి
  33. 1. వడివడిగా యడుంగులన వన్నెల గన్నెను యాపుటెట్లనఁన్
    తడబడు బల్కులే బిలువ దట్టని బేరున చిన్నవాడుయున్
    విడివడు కేశసంపదన వేడుక జేసెడు జంద్రబింబమున్
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    2. తేటగీతి:
    సిగ్గు సిగ్గని భీష్మించి జెప్పలేక
    మొగ్గ దొడుగు బ్రేమయు నీకు మోస మగును
    అగ్గగుగ తదుపరి మనసంత గనగ
    ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చిన్నవాడు తా..' అనండి.

      తొలగించండి
  34. విడచెను రాజ్యసంపదను వీడెను భార్యను పుత్రరత్నమున్
    విడచెను భోగ భాగ్యముల వీడెను సౌఖ్యము సత్యసంధతన్
    విడచెనుసిగ్గు భూవిభుడు వీడక సత్యము కాటికాపరై
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  36. నడకువమంచియుండిననున్యాయముబొందగవంగియుండుటన్
    విడుచుటె యెగ్గుసిగ్గులను,విఙ్ఞులకున్హితమిచ్చు నిచ్చలు
    న్నడకువతోడ బీదలకు నార్ధికసాయము జేయగోరుచో
    బడుగులపాలిటయ్యది యపారపుగారవమౌనునేసుమా

    రిప్లయితొలగించండి

  37. యెగ్గు తినుడీ :)


    బుగ్గలను నొక్కు కొనకమ్మ పూవుబోడి!
    తినవలెననిపించిన నిక తీరు గాను
    ముక్కు మూసుకు తినదగు! ముప్పు గాదె
    "యెగ్గు"! సిగ్గుల విడుచుటె హిత మొసంగు!


    జిలేబి
    యాకు :)

    రిప్లయితొలగించండి
  38. స్వీయ కల్పిత నూతన వృత్తము: మందారము
    ఛందము: 20 , కృతి; వృత్తము సంఖ్య : 1.
    మ మ మ మ మ మ గగ; ప్రాస కలదు; 10 వ యక్షరము యతి.


    భామా రత్నంబుల్ వే విత్తంబుల్ భాగ్యాగార శ్రేణుల్ బంధువ్రాతంబ
    మ్మా మాయల్ ధాత్రిన్ దాటన్ వీకన్ మా కౌనే యాదిత్యాపత్య శ్రేష్ఠుండా
    కామగ్రామంబుల్ రేగెన్ నాలోఁ గావన్ రావే వేగం గాకుత్స్థ జ్యోతీ
    రామా సీతానాథా నా కీయన్ రావయ్యా ముక్తిం గారుణ్యాంభోరాశీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. చాలా బాగుందండీ నూత్నంబై ఛందోబద్దంబై మందారంబై నిల్చెన్


      జిలేబి

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవాదములు.

      ధన్యవాదములండి జిలేబి గారు. సర్వ గురువులతో వృత్తము వ్రాయాలనిపించి వ్రాసినది యిది.
      అన్ని ఛందములలో మొదటి వృత్తమునకు నన్నియు గురువులే యుండును. ఆఖరి వృత్తమునకు నన్నియు లఘువులే యుండును.

      తొలగించండి


    3. భళిభళి పదముల యమరిక కవివరులకు భవముగ వెలసెను పుడమిని చదువులపడతి కృపన్



      సరియేనాండీ పోచిరాజు వారు ?


      జిలేబి

      తొలగించండి


    4. ఆహా! అదికూడా లఘువే కావలయునా!

      సరియేనా నండీ సవరణ ?




      భళిభళి పదముల యమరిక కవివరులకు భవముగ వెలసెను పుడమిని చదువులపడతియె పరి
      మళముల పొదుపుచు విరివిగ తను మనుజుల మదిని చి
      లుకను వరమిదియె చదువరులకు శివముగ!


      జిలేబి

      తొలగించండి
    5. జిలేబి గారి మెదడునకు మేత. (మునుపు ప్రకటించితి నేమో గుర్తు లేదు.)

      ఏకాక్షరము:

      కాకి కూఁక కూక కాకీఁక కేకి కూఁ
      కా కుకు కుకు కూక కీక కౌకు
      కాక కాకి కాకి కేకి కేకే కేకి
      కాకి కెక్కు కాకు కేకి కాఁక

      తొలగించండి
    6. నమో నమః గూగులాయ నమః ఒక ముక్కా అర్థం కాలేదు కాబట్టి గూగులించగా మీ బ్లాగు నుంచి యథాతథము కట్ పేష్టు -



      ఏకాక్షరము:
      కాకి కూఁక కూక కాకీఁక కేకి కూఁ
      కా కుకు కుకు కూక కీక కౌకు
      కాక కాకి కాకి కేకి కేకే కేకి
      కాకి కెక్కు కాకు కేకి కాఁక 38

      [ఊఁక = పొట్టు; కూక =కూత; ఈఁక= రెక్క; కూఁక +ఆ = కూఁకా; కుకు కుకు (కూ) : పికముల తొలి కూత, ధ్వన్యనుకరణము; ఔకు = దుర్బలము; కాక = కావచ్చు; ఆఁక = అడ్డంకి.]
      తాత్పర్యము:

      కాకికి పొట్టు కేకికి పొట్టే (ఆహారము). కాకి కూక కేకి కూకకు, కాకి యీక కేకి యీకకు నౌకు కాక! కాకి కాకీయే కేకి కేకీయే కేకి కాకి కన్న మిన్న , కేకికి నడ్డంకి కావలదు.


      నెనరులు


      జిలేబి

      తొలగించండి
  39. వెడవిలుతున్ శరమ్ములవి వేడుకఁ బెంచగ తాళలేక నా
    గడసరి చాన నేత్రములె కాంక్షగ జూచుచు పిల్చునట్టి యా
    పడతిని పొందగోరి పతి ప్రక్కన జేరిన పాళమందు తా
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్.

    వెడవిలుతుడు= మన్మథుడు
    వేడుక= కోరిక
    పాళము = సమయము.

    రిప్లయితొలగించండి
  40. తే.గీ.

    రాజ కీయము సేయగ రాటు దేల
    మిత్రుడని గూడ జూడక శత్రు వనియు
    భంగ పడుచును పబ్బము బాపు కొనగ
    ఎగ్గు సిగ్గుల విడచుటె హితమొసంగు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  41. గురు చరణముల శుశ్రూష గురిగ సలిపి
    విద్య నేర్చెడు విమలపు విద్య అర్ధి
    తనదు యఙానపు స్థాయిని తెలుపు నపుడు
    ఎగ్గుసిగ్గుల విడుచుటె హిత మొసంగు

    గురువు పాదముల దగ్గర శుశ్రూష చేసి, విద్య అభ్యసించాలని అనుకునే విద్యార్ధి సిగ్గు పడకుండా తన అఙానం ఎంత ఉందో గురువు గారికి తెలియపరిస్తే అందుకు తగ్గట్టుగా బోధన చేసి హితం కలిగిస్తారు గురువు గారు.

    రిప్లయితొలగించండి
  42. రిప్లయిలు
    1. దుర్యోధనమనోగతము,

      మడియుట లెస్స గాదె యవమానము నొందుట కంటె, ద్రౌపదిన్
      వడి సిగఁ బట్టి యీడ్చుచు సభాభవనమ్మున వల్వలూడ్వగా
      నుడుగు పరాభవాగ్ని, తనివొందు ప్రతిక్రియ తీరు వేళలో
      విడుచుట యొగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్.

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురము.

      తొలగించండి
  43. తే.గీ.

    విద్య నేర్వగ న్యాయము వెల్లడింప
    మంచి పెంచన లోకాన మార్పు గోర
    తల్లిదండ్రుల పోశింప దాటు వరకు
    ఎగ్గు సిగ్గుల విడచుట హితమొసంగు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  44. అడుగిడ శాంతికాముకులె ,అంతట, వీవగ ప్రేమభావనల్
    కడకిట కశ్మిరమ్మునను,కాంతలు పొందిరి ధైర్యమెంతయో!
    విడివడి యున్న పూరుషులు,వేగమె వచ్చెడు తీరుదల్చుచున్
    విడుచుటె సిగ్గుయెగ్గులను ,విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  45. తల్లి దండ్రులు దిట్టంగ తపన వలదు
    యెగ్గు సిగ్గులు విడుచుటె హితమొసంగు
    భావి జీవితమున కది పసిడి బాట
    యౌననెడి మాట లాలించు మనవరతము.


    వలచి వచ్చితి మనసార పార్థ నిన్ను
    వావి వరుస వీడితినను వగపదేల
    యెగ్గు సిగ్గులు విడుచుటె హిత మొసంగు
    కోరి వచ్చితి నరవరా కూడదనకు.


    బిడియము బాసి నేర్వుమిక విద్యల నెల్లయు నో కుమారుడా
    విడుచుటె యెగ్గుసిగ్గులను విజ్ఞులకున్ హితమిచ్చు నిచ్చలున్"*
    కుడుచుట నిద్రలన్ విడిచి కూరిమి తో నింక నభ్యసించినన్
    తడయక బాయు నజ్నతయు దక్కును భాగ్యమదెల్ల వేళలన్.

    రిప్లయితొలగించండి