30, ఆగస్టు 2019, శుక్రవారం

సమస్య - 3119 (ఏనుఁగు చంపఁ జాలదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఏన్గు చంప నోప దెలుకనైన"
(లేదా...)
"ఏనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్"
(డా. వెల్దండ సత్యనారాయణ గారికి ధన్యవాదాలతో...)

48 కామెంట్‌లు:

  1. రాజు మంత్రి భటుల మోజుగా కదిలించి
    యాడునట్టి క్రీడ యద్భుతమ్ము
    సకల సైన్యమున్న చదరగ మందలి
    యేన్గు చంప నోప దెలుకనైన

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కానల నందునన్ తిరిగి గాభర నొందుచు దోమకుట్టగా
    దీనుడు డెంగినిన్ వగచి దిల్లిని జేరుచు కుంటుచున్ భళా
    పీనుగు వోలెనున్ సమసి పీడితుడౌచును వ్యాధితోనహా
    యేనుఁగు చంపజాలదు గదే
    యెలుకన్ గడు విక్రమించినన్

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    బాల భక్తు డైన ప్రహ్లాదుడెలుకంత
    హేమకశిపు డేమొ యేనుగంత
    హరి భజనల వీడ నవఘలించిన గాని
    యేన్గు చంప నోప దెలుకనైన

    రిప్లయితొలగించండి


  4. తనకు ముప్పు లేని తరుణము తనదారి
    యడ్డు పడని హరిమ యనవసరము
    గాను మతియు వీడి గర్వము తోడుగా
    యేన్గు చంప నోప దెలుకనైన!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. దేవదేవు మదిని తిరముగ నిల్పిన
    హాని జరుగఁబోదు హాయిఁగల్గు
    నతని కష్ట జాల మంటదు,చెనకదు,-
    ఏన్గు చంపనోప దెలుకనైన.

    రిప్లయితొలగించండి
  6. ఈశ్వరేచ్ఛలేకనీభువియందున
    యేన్గు చంప నోప దెలుకనైన
    జీవులన్ని సమముదేవుని సృష్టిలో
    యేనుగైన చిట్టియెలుకయైన

    రిప్లయితొలగించండి
  7. జ్ఞానసుఖప్రదుం డగుచు సర్వజగంబున సత్వదీప్తి సం
    ధానము చేయుచున్ బహువిధంబుల నున్న చరాచరంబులన్
    దానయి నిల్పు దైవత ముదారత నాజ్ఞను చేయకున్నచో
    నేనుఁగు చంపజాలదు గదే
    యెలుకన్ గడు విక్రమించినన్

    రిప్లయితొలగించండి


  8. స్థానబలమ్ము వాజినము శౌర్యము సంహతి వ్యుష్టిగానదే
    మానసి! యత్న మెంతయు సమానము కాదు విధాత యాజ్ఞయే
    వైనము దేనికైనను! సవాలును వేయుచు పోతరమ్ముతో
    యేనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. బలిదనుజుడు చూడపద్మి సమానము
    వామనుండు బహ్య పత్యముగద
    తరచి చూడ నతని సరసన , నిజమిది
    ఏన్గు చంప నోప దెలుకనైన"

    రిప్లయితొలగించండి
  10. ఎలుక వంటి మనుజు డెదిరించి నిలువంగ
    నేమి జేయ లేరదెంతవారు
    తప్పు చేసి నపుడు ధైర్యముగా బూని
    ఏన్గు జంప నోపదెలుక నైన

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    కానల మూలికాఘృతనికాయవినిర్మితగేహమిద్ది! యి...
    ద్దానిని జూచితో యొకటె ద్వారము! గాన బిలమ్ము త్రవ్వుమా !
    పూనిక నాత్మరక్షణమె ముఖ్యము! లోపల దాగియున్నచో
    నేనుగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. 😊సింపుల్ లాజిక్ 🙏

      కరములోన దూరి కల్లోలమొనరించి
      యెలుక చంపజాలునేన్గునైన.!
      కలుగులోన దాగి కిలకిల నవ్వుచో
      నేన్గు చంపజాలదెలుకనైన.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    2. చాలా కాంప్లికేటెడ్లీ వైర్డ్ (అవధానుల) బుర్ర కావలె ఇటువంటి సింపుల్ లాజిక్కు ఛందోబద్ధము గా లాగుటకు :)


      అదురహో!


      జిలేబి

      తొలగించండి
  12. నిన్నటి పూరణ,

    సారవిచారధారల ప్రసంగము నందున లుప్తసౌఖ్యసం
    సారసముద్రమగ్నవరశౌరిపదాంబుజదివ్యనౌక తా
    పారముఁ జేర్చు నంచు విని, పన్నుగ కోవెలఁ జేరి, గోడకుం
    బారునఁ గూరుచున్న వరభక్తుఁడుగా గణియింత్రు సజ్జనుల్.

    గోడకున్ + పారున, గోడ పారు= గోడ ప్రక్క

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  13. కానన సంచరించు కరి కానక మూషిక మున్నకన్నము
    న్నూనగ తొండమున్ చెనగి దూరెనొకానొకమూషికమ్మె పో
    గానక గాలి పీల్చు తరి గండము మోదుచు యద్దరిద్దరిన్
    ఏనుగు చంపజాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్

    రిప్లయితొలగించండి

  14. కండ బలము చూసి గర్వపడగ రాదు
    ఎదుటి వాడు జిత్తు లెన్నొ చేయు
    బుద్ధి బలము లేని భుజ బలమొప్పునే
    ఏన్గు చంప నోప దెలుక నైన

    రిప్లయితొలగించండి
  15. (ఇంతటి శివాజీ - అంతటి ఔరంగజేబు )
    కానగరాని పౌరుషము
    గన్పడజేయుచు " కొండయెల్క" యై
    మానుగ జీజియా సుతుడు ;
    మావళె ధీరుడు ; షాజహాన్ సుతున్
    సేన సమీకరించి యని
    జెండుచు మెండుగ ఖిన్ను జేసెగా ;
    ఏనుగు చంపజాలదుగ
    దే ! యెలుకన్ గడు విక్రమించినన్ .

    రిప్లయితొలగించండి

  16. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ధోనిని జూడగా మురిసి దోమల గూడను ఘీంకరించుచున్
    ఖానును జూడగా వగచి కాశ్మిరు నందున బాంబు వేయుచున్
    సోనియ గాంచగా బెదిరి శోకము మీరగ నేలగూలగా
    నేనుఁగు చంపజాలదు గదే
    యెలుకన్ గడు విక్రమించినన్

    రిప్లయితొలగించండి
  17. వెనుక కాలు కొఱుకు వీపు పై నాడును
    తోక బట్టి వ్రేలు తుండమునకు
    దొరుక బోక బట్ట దూరును కలుగులో
    ఏన్గు చంప నోప దెలుకనైన.

    రిప్లయితొలగించండి
  18. దేహబలము గంటెదీటైన బలమును
    గాన రామనుచును గర్వపడకు
    బుద్ధి బలము ముందు భుజబల మేపాటి
    యేన్గు చంపనోప దెలుకనైన

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కాలుడు పొలయుచు మృకండు కుమారుని
    పట్ట బోయి వచ్చి భంగ పడెను
    బాలుడైన నేమి భగుని భక్తుడు గదా!
    యేన్గు చంప నోప దెలుకనైన

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువు గారికి నమస్కారములు. దయతో మొన్నటి నిన్నటి పూరణలను పరిశీలించగలరు.

    28-08-2019:

    మాటలల్లుట యందున మేటియగుచు
    యుద్థతంత్రమె శూన్యమౌ నుత్తరునకు
    కౌరవులనడ్డు పార్థుడు తేరునుండ
    నెగ్గు సిగ్గుల విడచుటె హితమొసంగు.

    29-08-2019:

    ఆ రాముని ధర్మములను
    పారమ్యముగా పలికెడి పరిషత్తులలో
    కోరిక జూపుచు శ్రద్ధగ
    బారున గూర్చున్నవాడె భక్తవరుడగున్.

    కీరితి నొందినట్టివగు కేశుని లీలలనెల్ల నెంచుచున్
    తీరగు కైవడిన్ గలిగి తేకువ తోడుత మీఱుచున్ సదా
    జోరుగ మంచి మాటలను చోటుల యందున తోడివారితో
    బారున గూరుచున్న వరభక్తుడుగా గణియింత్రు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
  21. కలుగు పెద్ద బలము కరికినిజూడగా
    కలుగు గలదు జూడ నెలుకకెపుడు
    కలుగుగులోనదూరగలుగదు తాపట్టి
    ఏన్గు చంప నోప దెలుకనైన

    రిప్లయితొలగించండి
  22. గానగ విఘ్నరాజునొక గర్జరముభ్రమనొందె దంతిగా
    తానది బోరు సల్పగను దారుణ రీతిన వేగమే చనెన్
    పూనెను మూషికోత్తముడు భూవరు రక్షణ సేయ నింక నా
    యేనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్

    రిప్లయితొలగించండి
  23. ఏనుగుచంపజాలదుగదే యెలుకన్ గడు విక్రమించినన్
    గాననమందునన్మసలు గంజరమెక్కడ కన్నమందునన్
    బూనికతోవసించునల మూషికమెక్కడ చింతజేయగన్
    గానగరాదుగాబుడమిగాయలుగాచువిధంబుగాగనన్

    రిప్లయితొలగించండి
  24. శివుని యాజ్ఞ లేక, చీమైన కుట్టనే?
    ఏన్గు చంప నోప దెలుకనైన
    కలసిరాని వేళ గాడిద తోకయు
    కాలసర్పమగుచు కరచు సుమ్ము

    రిప్లయితొలగించండి
  25. ఉత్పలమాల
    పూనిక తో హిరణ్యకశిపుండన పుత్రుని విష్ణు భక్తినిన్
    మానుమటంచుఁ దండ్రి నొక మత్త గజంబుగ దెల్సి యాఖువై
    మానక తోటి బాలలను మార్చగ జూచిన, దైవదూషణన్
    యేనుగు చంపఁ జాలదుఁ గదే యెలుకన్ గడు విక్రమించినన్

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఉదయం జ్వరంతోను, విపరీతమైన ఒంటి నొప్పులతోను నిద్ర లేచాను. కొద్దిగా దగ్గు కూడా మొదలయింది. పూర్తిగా నీరసంగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ స్థితిలో మీ పద్యాలను సమీక్షించలేను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.

    రిప్లయితొలగించండి

  27. ... శంకరాభరణం... . 29/08/19 ....బుధవారం...

    సమస్య::

    ఏనుగు చంప జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్

    నా పూరణ. ఉ.మా.
    ***** ****

    " నేనన దెల్వదోయి కరి ?నే గణనాయక వాహనుండనే!

    హానియె జేయ బోకు గజమా!యది నీకిడు జావు తథ్యమే!

    పూనకు నన్ను జంప ".. గని మూషికమే యన భీతిజెంది యా

    యేనుగు చంప జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్


    🌱🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱🌱
    🌷🌷 వనపర్తి 🌷🌷



    రిప్లయితొలగించండి
  28. ప్రభుత శక్తి యుండ పారెరార్థిక తప్పు
    సలిపి యుండి గూడ చతుర జూపి
    బలిమి యొకటె గాక వలను పన్న వలయు
    నేన్గు చంప నోప దెలుకనైన

    రిప్లయితొలగించండి
  29. ఆ నటరాజు పృథ్విపయి నానతి నివ్వక కూడ దెద్దియున్
    యేనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్?
    కాన వసించువాడయిన కాంచును చెచ్చెర స్వర్గ సౌఖ్యముల్
    దీనుడు పొందు సంపదలు తీరును బాధ గిరీశు నాజ్ఞతో

    రిప్లయితొలగించండి
  30. కరి ముఖారవింద కమనీయ రూప వి
    లాస విఘ్న భగ్న రాజ కార్య
    రతుని కరము గాంచి ప్రవర సామ్యం బెంచి
    యేన్గు చంప నోప దెలుక నైన


    వానలు రాఁగఁ దూఱి వడిఁ బంటలు మెక్కుచు నాశ బెంచఁగా
    మేనును బందికొక్కులను మించి చరించెడి, విశ్వమేఖ లా
    హీన బిలమ్ములం దుఱుకు నిట్టె తొలంగెడి చిట్టి యెల్క లం
    దేనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్

    [ఏనుఁగు = పెద్దది]

    రిప్లయితొలగించండి
  31. అమిత బలుడనంచు అదిరిపాటేలరా
    దేహ బలము కన్న తెలివి మిన్న
    ఆత్మ బలము లేక నన్నియు వ్యర్ధమే
    ఏన్గు చంప నోప దెలుకనైన

    రిప్లయితొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పూనిన భక్తి నాహరుని పుల్కలు జెందెడి తీరు నాదటన్
    థ్యాన మొనర్చుచున్ సతము దాస్యము జేయు మృకండు సూనునిన్
    జానుగ పట్టబోయి శని స్రగ్గిన తెన్నును జూడ నెంచుచో
    నేనుగు చంపజాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్.

    రిప్లయితొలగించండి
  33. ప్రాణము లేని బొమ్మ యది బాలక భీతిల నేల? శిల్పి పా
    షానముఁ జెక్కినట్టి కలు సామజ రూపమటంచెఱంగుమా!
    కానలలో చరించు కరి కాదిది చూడర రాతి బొమ్మ యౌ
    యేనుఁగు చంపఁ జాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్

    రిప్లయితొలగించండి
  34. ఆకుల శివరాజలింగం వనపర్తి
    ఆటవెలది
    ఆర్తినేల నీళ్ళు డనుకంప





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర‌్తి నేల నీశు డనుకంప బూనిన
      నేకమైన నేమి లోకమెల్ల
      హానిజేయతరమ హరు నాజ్ఞ లేనిదే?

      ఏన్గు చంప నోప దెలుకనైన

      ఆకుల శివరాజలింగం
      వనపర్తి

      తొలగించండి
  35. వార మాయె యపుడె వాదనలు మొదలై/
    దారి దొరకదా? చిదంబరుడవ?/
    ప్రజల స్వామ్యపు మరి పద్ధతీ లాగునే/
    ఏన్గు చంప నోప దెలుక నైన //

    రిప్లయితొలగించండి
  36. కాననమందు నొక్కపరిఁ గల్గెను తర్కము మూషికమ్ముకున్
    యేనుగుకున్ బలాఢ్యతను నెయ్యది మిన్నయటంచు నత్తరిన్
    కర్వముకుంభిపైకెగసి గర్వము ఖర్వమొనర్చి రెచ్చిలన్
    యేనుగు చంపఁ జాలదుఁ గదే యెలుకన్ గడు విక్రమించినన్

    రిప్లయితొలగించండి
  37. సవరణతో..
    ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    ఏన్గు చంప నోప దెలుకనైన

    సందర్భము: కౌరవుల పక్షాన అస్త్ర విద్యా విశారదుడైన.. కౌరవ పాండవు లందరికీ ఆచార్యుడైన ద్రోణు డున్నాడు. కారణ జన్ముడైన మహా వీరుడైన కౌరవ పాండవులకు పితామహుడైన భీష్ము డున్నాడు. సంక్రందన కుమారు డనగా అర్జునునకు అస్త్రవిద్యలో సరిజోడైన కర్ణు డున్నాడు. ఐనా ఏనుగుల్లాంటి వారందరినీ కాలం కబళించివేసింది.
    ఇక పాండవులా! ఏండ్ల తరబడి అరణ్య వాస అజ్ఞాత వాసాలతో చచ్చీ చెడీ అంగబలం గాని అర్థబలం గాని సమకూర్చుకో లేకపోయారు. స్థానబలం ముందే కోల్పోయారు.
    సైన్యం ఏ డక్షౌహిణులే! కౌరవుల కేమో 11 అక్షౌహిణులు. పాండవు లైదుగురే!. కౌరవులు నూరుగురు..
    కాని కురుక్షేత్ర సంగ్రామంలో దైవానుగ్రహంవల్ల పాండవులే గెలిచారు. అది చాలా విచిత్రం. ఇందులో అర్థం చేసుకోవలసింది చాలా వుంది.
    దైవ బలం వున్నట్టైతే ఎలుకను ఏనుగుకూడ చంపజాల దనిపిస్తున్నది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కురువీరులకు నస్త్ర గురువైన ద్రోణుండు,
    భీష్ముండు పరిపంథి భీకరుండు,
    సంక్రందన కుమారు సరిజోడు కర్ణుండు,
    కాలమ్ము కబళించె కౌరవులను..
    కానన వాసాన స్థాన బలము, నంగ
    బల, మర్థ బలమును బడయరైరి..
    ఐదుగుర్ పాండవు, లక్షౌహిణులు నేడు..
    దైవ సాహాయ్యాన దగ గెలిచిరి...
    ఎలుక చంపు నేన్గు నిల దైవ బలముతో..
    దైవబలము లేని తరుణమందు
    నిలను బోలెడంత బలము గలదియైన
    నేన్గు చంప నోప దెలుకనైన

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    30.8.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  38. ఆ.వె.

    యాజ మాన్య మెంత యడ్డమై నదిగాని
    ముంచ జాలకుండు మంచి వాని
    శక్తి గలుగ నేమి యుక్తి సంరక్షింప
    ఏన్గు చంప నోప దెలుకనైన

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  39. ఆ.వె//
    ప్రాణభీతి జెంది ప్రార్ధించు నప్పుడు l
    దాగుకొనెడి జాగ దానమొసగ l
    తొండమందు దూరి తోలు గొరుకుచున్న l
    ఏన్గు చంప నోప దెలుకనైన ll

    రిప్లయితొలగించండి