1, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3122 (కర్ణపేయమ్ముగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము"
(లేదా...)
"గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్"

37 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  పాడిగ కారు స్కూటరులు పండుగ జేయగ వీధులందునన్
  గాడిదలన్ని వీడగను కన్నుల కానక పట్టణమ్ములన్
  చూడగ నాలినిన్ కడకు సుమ్ముగ వీధిని హైద్రబాదునన్
  గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 2. పనికి మాలిన గాడిద వనుచు తిట్టి
  ప్రోత్సహించని తలిదండ్రి మోదమంద
  శ్రమను నమ్మి నిరంతర సాధనమునఁ
  గర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి పాదాన్ని మార్చి...

   తేటగీతి
   అడ్డగాడిద వీవని యాడిపోసి
   ప్రోత్సహించని తలిదండ్రి మోదమంద
   శ్రమను నమ్మి నిరంతర సాధనమునఁ
   గర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

   తొలగించండి
 3. వాడిన పూవులన్ని చెలువంబుగ నొప్పెను నూత్న కాంతితో
  మోడులువారు వృక్షతతి పూర్ణ వికస్వన జృంభితాళియై
  మాడిన జీవితంబున ప్రమాదముఁతప్పగ బక్కవానికిన్
  గాడిద కర్రపేయముగ గానము సేయగ మెచ్చిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 4. వాయు వర్త్మమున నెగిరె భార్గవమ్ము
  జంగలమ్మును భక్షించె సౌరభేయి
  కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము
  లుండ బోవని తెలియదే యుర్వియందు.

  రిప్లయితొలగించండి
 5. హైదరాబాద్ రోడ్ల మీద సరదాగా

  ఎప్పటికిని పూర్తిగ చేయలేని రోడ్రి/
  పేరు పనులను జూచుచు భోరు నేడ్వ/
  లేక పక్కున నవ్వుచు కేక లిడుచు/
  *కర్ణ పేయమ్ముగా పాడె గార్ధభమ్ము*//

  రిప్లయితొలగించండి
 6. వాడొక మాంత్రికుం డవును వాస్తవ మియ్యది పెక్కురీతులన్
  చూడు డటంచు జిత్రములు చూపుచునుండగ జూడబోయినా
  నాడ ముదంబు గల్గె నత డప్పుడు దండము జూపి నంతనే
  గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్.

  రిప్లయితొలగించండి


 7. పేరు చూడ జిలేబి! సభికులలర న
  కర్ణపేయమ్ముగాఁ బాడె! గార్దభమ్ము
  దారి బోవుచు వినగాను తన సపక్షు
  లుండ వచ్చునని తలచి లుకలుకయనె!


  జిలేబి

  రిప్లయితొలగించండి

 8. వామ్మో ! గాడిద చేత పాట పాడించి సెబాసని‌ పించు కోవడాని ఇంత కత కట్టవలెనా :)  చూడుడు మంత్రవాది యొక సుందరి నచ్చట గార్ధభమ్ముగా
  వేడుక చేయ మార్చె! తన వెన్కటి మానవ జన్మ వాసనల్
  తోడుగ వచ్చె నిప్డు ! తను తొండొరు సేవల మూటలెత్తి యా
  గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. సమస్య :-
  "కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము"

  *తే.గీ**

  అడవిలోని జంతువులన్ని యరవసాగె
  కుక్క భౌభౌ మని మొరిగె, కోకిలమ్మ
  కర్ణపేయమ్ముగాఁ బాడె, గార్దభమ్ము
  కంఠము సవరించగ జంతు గణము పారె
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి

 10. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వేడుక మీర మోడియహ వీడగ నస్త్రము కాశ్మిరమ్మునన్
  తాడును పేడునున్ గనక తన్నుకు చచ్చుచు వీధి వీధినిన్
  పాడగ పాకు ఖానుడట ప్రాకట రీతిని తోచె నివ్విధిన్:
  "గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్"

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  వేడుక స్వీయజాతి ఘన విశ్రుత కీర్తిని జాటె, నొంటె నే...
  నాడుచునుండ గాంచిన జనావళి మేలు భళీ భళీ యనన్.,
  గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్
  పోడిమి నాది., శ్రోతలనుభూతిని పొందెడి గానమామెదౌ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 12. గాడిదా, ఎప్పుడూ ఫోన్లు వీడియోలు/
  ఆటలేన? అను నొకచొ మాతను విని/
  రమ్ము, కలిసి యాడుదము రా, రమ్మనుచును/
  *కర్ణ పేయమ్ముగా పాడె గార్దభమ్ము*

  రిప్లయితొలగించండి
 13. చెట్టు పైకోకిలమ్మలు చిగురు తినుచు
  కర్ణపేయమ్ముగా బాడె,గార్ధభమ్ము
  వాయసమ్ము యు జతగూడి కోయిలమ్మ
  పాటతోగొంతు కలుపుచు పోటి పడెను

  రిప్లయితొలగించండి
 14. పాడగ లేడు పాటలని వాసిగ నొజ్జయె నేర్పఁ రెండుమూ
  డేడుల కాలమందె యతడెంతయొ చక్కగ పాటలెన్నియో
  పాడుచు నుండగా గనుచు వానిప్రజాపతి చెప్పెనిట్లు, మా
  గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 15. అడ్డ గాడిదఁని తనయుఁ నతిగ దిట్ట
  చెప్పిన పనులెల్ల సలుపుచేవ మీర
  తనను బోల్చుట దండ్రిది తప్ప టంచు
  కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము!

  రిప్లయితొలగించండి
 16. పాడుతా తీయగానందు భానుమతియె
  కర్ణపేయమ్ముగాబాడె,గార్దభమ్ము
  మోయునెంతటి బరువైన మూపుమీద
  వేయ,శ్రమకునమ్మినబంటు పృధివియందు

  రిప్లయితొలగించండి

 17. పిన్నక నాగేశ్వరరావు.

  జంతువుల సమావేశము జరుగు తఱిని
  ముందుగా స్వాగతము పల్కి యందరకును
  ప్రార్ధనా గీతమును రాజు పాడమనగ
  కర్ణపేయముగాఁ బాడె గార్దభమ్ము.

  రిప్లయితొలగించండి
 18. పరవశము గూర్చు కోయిల పాట విడిచి
  కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము
  ముచ్చటంచును మురియును మూర్ఖుడొకడు
  నక్కకే రీతి దెలియును నాక మహిమ

  రిప్లయితొలగించండి
 19. రాజుజేసెడు పనులెల్ల రంజుయనుచు
  వేడ్కమీరగ బల్క విదూషకుండు
  వింతగాదుగ మిత్రుని సుంతబొగడ
  కర్ణపేయమ్ముగా బాడె గార్ధభమ్ము

  రిప్లయితొలగించండి
 20. ముదిమి వయసున తానది మూల్గు చుండ
  బధిరుడొకడు చెప్పదొడంగె బాగు బాగు
  కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము
  పాట నేర్చె నే నేర్పగా పరవశించి

  రిప్లయితొలగించండి
 21. పనియుఁ బాటయు నేరఁడు వారి వీరిఁ
  జేరి తిరుగు చుండుఁ జదువు చింత సుంత
  లేదు కూనిరాగమ్ముల నూదుఁ గనుఁడు
  కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము


  ఈడనె యుండె గడ్డి తిని యింపుగ నంతట మాయమయ్యెనే
  యేడకుఁ బోదు నెందు మఱి యెవ్వరి వేడుదు గాంచ గాడిదం
  బోడిమి నా కిదే యనుచు మూర్ఛిలి రేవఁడు చింత నుండగా
  గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 22. గాడిదకర్ణపేయముగ గానముసేయగమెచ్చిరెల్లరున్
  బాడియె యట్లనంగరమ!పండితులెవ్వరునొప్పుకోరుగా
  గాడిదపాటపాడగనుగాయనివోలెనునింపుగుండెనో
  గాడిదపాటపాడుటయుకర్ణములింపుగ నుంటయాభళా

  రిప్లయితొలగించండి
 23. ఉత్పలమాల
  గాడిదవీవటంచు నను గాసిలి నన్ గురు వర్య! బాధ లే
  దాడిన వన్ని మాకొరకె, యందల మెక్కితి నేడు మంత్రిగా!
  తోడుగ నుందు మీ పనులఁ దొందరఁ జేసెద రమ్మటంచు నా
  గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 24. గాడిద పెండ్లియందునొక
  గాడిద నాట్యమునాడ, వేడుకన్
  గూడిన తోటి గాడిదలు
  కూరిమి తాళము వేయుచుండగా
  చేడియ గాడిదల్ మురిసి
  సిగ్గున పుచ్ఛములూపుచుండ నో
  గాడిద కర్ణపేయముగ
  గానము సేయగ మెచ్చిరెల్లరున్

  రిప్లయితొలగించండి
 25. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము

  సందర్భము:
  . ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
  వ్యాహరన్ మా మనుస్మరన్
  యః ప్రయాతి త్యజన్ దేహం
  సయాతి పరమాం గతిమ్..
  అని గదా గీతా వాక్యం.
  *"ఓమ్"* అనే ఒక్క అక్షరం చాలు పరబ్రహ్మమును సూచించటానికి. మృత్యు సమయంలో ఎవడైతే *ఓమ్* అంటూ దేహం వదలి పెడుతాడో వాడు ఉత్తమ గతి పొందుతా డని గీత చెబుతోంది.
  ఏ జంతువూ ఓ మ్మని ఆరంభింపదు. మన గాడిద మాత్రం *ఓం* అని మొదలుపెట్టి అంటే ఓండ్రపెట్టి పాటపాడుతున్నది. ప్రేయసికోసం పాడినా సంప్రదాయం మరచిపోలేదు. కన్ను మూసేటప్పుడే కాదు.. బ్రతుకుపొడుగునా ఇలాగే పాడుతున్నది కదా! ఖచ్చితంగా దానికి ఉత్తమగతులే కలుగుతాయి. మనకంటే చాలా నయం..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  *ఆడుగాడిద యడిగెను పాడు మనుచు*

  *ప్రియుడయిన మగ గాడిదన్ ప్రేమమీర..*

  *"ఓం"డ్రపెట్టుచు సంస్కార మూపిరగుట*

  *గర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము*

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  1.9.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 26. తేటగీతి
  ఏ పనిన్ జేయ వేమని కోపగించు
  బంగి గాడిద కొడకాయ నంగ వినెనొ
  సుతుడు వీడెట్లు నాకని చోద్యమనఁగ
  కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము?

  రిప్లయితొలగించండి
 27. అతని గానమ్ము లోనిండెనమృతధార
  రవళిలోపులకించె చరాచరమ్ము
  గానమాధురీ విభవంపు గరిమగాంచి
  కర్ణపేయమ్ముగాఁ బాడె గార్ధభమ్ము

  రిప్లయితొలగించండి
 28. తే.గీ.

  ఓటు కోసము పొట్లాడి ఓగు లొడెడి
  జనుల యిక్కట్లు చూచుచు జాలి పడుచు
  మాకు యీబాధ ల్లేవంచు మాపు వేళ
  కర్ణపేయమ్ముగా పాడె గార్దభమ్ము

  రిప్లయితొలగించండి
 29. సభ ను రంజిo ప జేయఁగ పాడె నొక డు
  కర్ణ పేయంబు గా పాడె . గార్ధ బంబు
  పరుల పనుల ను జేయఁగ వక్ర మతి గ
  చెడె ను గోల్పో యి ప్రాణా లు చిత్ర ముగను

  రిప్లయితొలగించండి
 30. కూడిరి వాడ నందరును కూర్మి వినాయకు పూజ సేయగా
  వేడుక వేళ,నప్పుడట వేవురి మెప్పును పొంద నిద్దరున్
  పాడిరి,పోటిగా నొకడి వాక్కున కోకిల కూయ..మూగనై
  గాడిద.., కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్

  రిప్లయితొలగించండి
 31. గురువు గారికి
  నమస్కారములు
  ��
  వేడుక మీరగాజరిగె విందుగ పాటల పాటిలోపలన్

  పాడిరి బాలబాలికలు భారము లేకను సుస్వరంబుతో

  పాడగ మిక్కటంబుగను ప్రాజ్ఞలు మెచ్చిరి సంబరాన, *యే*

  *గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చిరెలగలరున్*

  మీ

  సిహెచ్. భూమయ్య,

  నారాయణఖేడ్.

  రిప్లయితొలగించండి
 32. తే.గీ.

  ఛాత్రు నేర్వగ గానము శాస్త్ర గతుల
  తరచు తప్పగ శృతియును తాళ యతుల
  గురువు మనసున తలచెను గుర్రు పడుచు
  కర్ణపేయమ్ము గా బాడె గార్దభమ్ము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి