11, అక్టోబర్ 2019, శుక్రవారం

సమస్య - 3159 (మోదీ పెండ్లికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్"
(లేదా...)
"మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

87 కామెంట్‌లు:

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


ప్రాతః కాలపు సరదా పూరణ:

బాదర్బందిది బ్రహ్మచర్యమనుచున్ బంగారు బెంగాలులో
ఖాదర్వల్లులు బ్రాహ్మణేతరులునున్ గర్వమ్ముతో చూడగా
దీదీ తోడను కూడు మూర్తముననున్ దివ్యంపు నానందమున్
మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...


కంది వారి సవరణతో:

ప్రాతః కాలపు సరదా పూరణ:

బాదర్బందిది బ్రహ్మచర్యమనుచున్ బంగారు బెంగాలులో
ఖాదర్వల్లులు బ్రాహ్మణేతరులునున్ గర్వమ్ముతో చూడగా
దీదీ తోడను కూడు మూర్తముననా దివ్యంపు టానందమున్
మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

కంది శంకరయ్య చెప్పారు...

మీ సరదా పూరణ బాగున్నది. శుభోదయం!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

🙏🙏🙏

vsnmhari చెప్పారు...

శ్రీదుండై యనిశంబు భక్తతతికిన్ చిత్సౌఖ్య మందించు న
వ్వేదారాధ్యుడు శంకరుండు గిరిజన్ వేదోక్తసద్రీతిలో
నేదంపూర్వవిధాన నందునని తామెంతేని హర్షంబుతో
మోదీ! పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

విరించి చెప్పారు...

వేదన గాంచిన యింద్రుడు
సాదరమున దలచె పెండ్లి సామజమునకే
యాదరమున బిలువగ నా
మోదీ పెండ్లికిఁ జనిరట ముక్కోటి సురల్

ఆమోది...= పదిహేడేళ్ళ యేనుగు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

మైలవరపు వారి పూరణ

ఛేదించెన్ ఘనమౌ సమస్యనట కాశ్మీరమ్మునందెన్నొ స...
మ్మోదమ్ముల్ విరబూసె, నెల్లరకునామోదమ్ముగాన్ ,వేడ్కగా
తాదాత్మ్యమ్మున భక్తితో జరుప సీతారామకళ్యాణమున్
మోదీ., పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో !

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

Akula shanthi bhushan చెప్పారు...


... శంకరాభరణం... . 11/10/2019 ......శుక్రవారం

సమస్య:

మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్

నా పూరణ.
***** ***

షాదీ యన గంపరమనె

మోదమిడక శోకమిడిచి ముంచునది యనెన్

ఏదీ!యెక్కడ నెప్పుడు

మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్


🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷

Ram Kidambi చెప్పారు...

వాదనలు మరచి కూడిరి
మోదీ తో కాంగులెల్ల మోములు దాచిన్
కాదన కుండగ పిలిచెను
మోదీ, బెండ్లికి జనిరట ముక్కోటి సురల్

రామస్వామి కిడాంబి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

దాదా రాహులు జందెమూనుచునువే తంత్రమ్ము మంత్రమ్ములన్
గోదారొడ్డున జేరి కుల్కుచును భల్ గూఢమ్ముగా పన్నగా
సీదాసాదగ దీది తెల్ల వలువన్ సిగ్గొందుచున్ కూడగా
మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

*******************************

Zilebiఅక్టోబర్ 10, 2019 6:56 PM

జీపీయెస్ వారి దే పూరణైనా దీది చుట్టు తిరగాల్సిందే :)

జిలేబి

*******************************

G P Sastry (gps1943@yahoo.com)అక్టోబర్ 10, 2019 8:18 PM

She fascinates me...came up from nowhere like a tornado in Bengal politics

Zilebi చెప్పారు...



ఖాదీ గ్రామోద్యోగులు
మోదీ పెండ్లికిఁ జనిరఁట, ముక్కోటి సురల్
దీదీ తోడుగ వచ్చిరి
షాదీ చూడంగ కంది శంకర వర్యా !


జిలేబి

ఆవుల చక్రపాణి యాదవ్ చెప్పారు...

సమస్య :-
"మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్"

*కందం**

కోదండరాముని మనువు
వేదపు మంత్రము చదవగ విశ్వము జరిగెన్
ఖాదీ వస్త్రము లివ్వగ
మోదీ, పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్
....‌‌‌‌..... చక్రి

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

ఈరోజు సమస్యాపూరణం

మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

మోదీ వరుడని యన నా
మోదీ నీరవ్ గ యంచి మోసము సేయగ
గాదా వజ్ర మహారాజ్
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

#కళ్యాణ్ చక్రవర్తి#

కంది శంకరయ్య చెప్పారు...

సంబోధనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. కాని 'ఆమోది పెండ్లికి' అనాలి కదా! సంబోధనగా ఆమోదీ అని దీర్ఘాంతం?

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని విరుపుతో మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. సమూహంలో నా సవరణలను గమనించండి.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. 'దాచిన్'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. నన్నూ ఇరికించారు!

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. 'నీరవ్‌గ నెంచి...' అని ఉండాలనుకుంటాను.

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మోదీ వరుడని యన నా
మోదీ నీరవ్ గ నెంచి మోసముసేయఁన్
గాదా వజ్ర మహారాజ్
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

చెప్పిన మార్పులతో
ధన్యోస్మి

విరించి చెప్పారు...

కేదారుని ధనుసు విరిచి
యా దాశరథియె పరిణయ మాడె కుజను తా
మోదము తోడను వినుమా
మోదీ! పెండ్లికి జనిరట ముక్కోటి సురల్.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సాదర భక్తి వి న మ్ర త
మోద ము జనియింపఁ జరుప పొల్పగు రీతి న్
పాదు గ శివ కళ్యాణ ము
మోదీ : పెండ్లి కి జని రట ముక్కోటి సురల్

Dr. Acharya Phaneendra చెప్పారు...

ఏదో కల్లును చవిగొని
సౌదీ సుల్తానొకండు స్వప్నమునందు
న్నీ దేశము వైపు కనగ -
మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్!
- డా. ఆచార్య ఫణీంద్ర

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మరొక ప్రయత్నం

కాదని యనిపించినదియు
లేదని తెలిసినది మనకు లేటుగ నయినా
మోదీ వరుడని యన, యే
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్?

Dr. Acharya Phaneendra చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Zilebi చెప్పారు...



మోదీ చీనియ చాయి తోడు దసరా మోదమ్ము రామ్లీల నా
మైదానమ్మున కౌసలేయుని కెడన్ మైథిల్య! వేంచేయగా
మోదీ, పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో,
ఖాదీనేతలు, భాజ్ప నేతలు భళా కాషాయవస్త్రమ్ములన్!


జిలేబి

Surya చెప్పారు...

నా దేవుడు మోదీ యని
నా దేశపు రక్షకుడని నమ్ముచు మదిలో
మోదముగా కల గాంచెను
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

Zilebi చెప్పారు...


:)

జిలేబి
ఇవ్వాళ మేము కూడా దీదీ పంఖా :)

Zilebi చెప్పారు...



ఈ పాదానికి ఆముదాల వారి పూరణ ఏమిటో కుతూహలము . చెప్పగలరు


జిలేబి

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(ఒక వీరవైష్ణవుడు పరమాత్ముని గద పేరు కుమార్తెకు పెట్టాడు . ఇప్పుడు అమ్మాయి కౌమోది పెండ్లి .దీవించ టానికి దేవతలందరూ వచ్చారు .)
వేదాంతంబున కందనట్టి ప్రభువౌ
విష్ణున్ సదా నెమ్మదిన్
మోదంబార భజించు భక్తుడదియే
మూఢత్వదైతేయ వి
చ్ఛేదన్ విష్ణుగదన్ సుపుత్రి కిడె సు
శ్రేయంపు నామంబు ; " కౌ
మోదీ " పెండ్లికి పోయినారు గదరా
ముక్కోటి దేవుళ్ళహో !!




Ram Kidambi చెప్పారు...

ఏదీ? విద్యను జూపుము
మాదీ మీ కులమె! యన్న మాజిక్ గ్రూప్ లో,
దీదీ రాహుల్ను గలుప
మోదీ, బెండ్లికి జనిరట ముక్కోటి సురల్!

కులము .. సమూహము

రామ్ కిడాంబి

Surya చెప్పారు...

నా దేశమ్మును నిల్పు నాయకుడుగా నాతండె ప్రాజ్ఞుండనున్
నా దైవంబతడే యటంచు విధిగా నమ్మున్ ప్రగాఢమ్ముగా
మోదీ భక్తుడొకండు స్వప్నమున సమ్మోదమ్ముగా గాంచెనే
మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో

Ram Kidambi చెప్పారు...

దీదీ, రాహుల్ వివాహానికి అందరూ తరలి రావలసిందిగా విజ్ఞప్తి !😊

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
ఆదరమునఁ బెండ్లి వలెన్
' హౌదీమోదీ' జరుగఁగ నమెరిక నాశీ
ర్వాదము భక్తినిఁ గోరఁగ
మోదీ, పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్!

Surya చెప్పారు...

మోదీ భారత కీర్తి పెంపొదవగా మూర్ధన్యుడాయెన్ గదా
మోదంబాయెను బంధు మిత్రులకు దామూహింపగా నిట్టులన్
మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో
మోదీ దీవెనలందెనేమొ యపుడే మున్ముందు కాలమ్ముకున్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

[గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి జరిగిన షష్టిపూర్తి మహోత్సవ సందర్భము]

పాదమ్మూనియు భారతీయ జనతా పార్టీనిఁ బెంపొందుచున్
సీదా సాదగ ముఖ్యమంత్రి గుజరాత్ శ్రేష్ఠుండునై మోది స
మ్మోదమ్మందుచు వందనమ్ము లిడి తా మున్ బిల్వ  షష్ట్యబ్దికిన్,
మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

Sitharamayya Solasa చెప్పారు...

ఈ దేశమందు పన్నులు
మోదుట చేతన యిడుమల మోసిరి జనముల్
యా దేవుళ్ళే మికనుచు
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్ ?

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

మూడవ ప్రయత్నం

మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

మోదమె యని తలచగనా
మోదీ పదవితొ పరిణయ మొనరఁగ తెలిసెన్
పోదామని యనుకొన నా
మోదీ పెండ్లికిఁ, జనిరఁట ముక్కోటి సురల్

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.
"ధనువు/విల్లు విరిచి" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.

కంది శంకరయ్య చెప్పారు...

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు శంకరాభరణంలో మీ పూరణ. సంతోషం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

బాగున్నది.

కంది శంకరయ్య చెప్పారు...

బాగున్నది.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి.

కంది శంకరయ్య చెప్పారు...

వారిని అడిగాను. వారు పంపగానే పోస్ట్ చేస్తాను.
(నేను మొదటి రోజు మాత్రమే ఆ శతావధానంలో ఉన్నాను).

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.
'...గాంక్షించంగ' టైపాటు. 'ఆమోదీ'?

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది. కానీ అది 'కౌమోదకి' కదా?

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సాదము పైఁగల మక్కువ
వేదన యేల సురలన భువికి సురలనుకో
కాదన మున్నిచ్చిరి యే
మో దీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్
[దీ = డీ]


పాదాక్రాంత సితాద్రి నేత్ర విల సత్ఫాలుండు వేదాంగ సం
వేదోద్యాన విహారుఁ డద్రి తనయం బెండ్లాడఁ గారుణ్య భా
రోదారాస్వని తాంతరంగ రుచి విద్యోతుండు మృష్టాన్న స
మ్మోదీ! పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.
'జనముల్ + ఆ' అన్నపుడు యడాగమం రాదు.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.
'పదవితొ' అని తో పత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మొదటి బాగున్నది. రెండవది అద్భుతంగా ఉన్నది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు.

టైపాటు సవరణతో...

ఆమోది : వావిళ్ల నిఘంటువు 1949
సం.వి. (న్.ఈ-నీ.న్.)
1. ఆమోదము గలది, సువాసన గలది;
2. ఆమోదించువాఁడు, సంతోషించువాఁడు.

శార్దూలవిక్రీడితము
ఖేదమ్ముల్ విడ తారకాసురుని మక్కించన్ గుమారున్ గనన్
గేదారున్ సురలెల్ల స్తోత్రముల గాంక్షించంగఁ బుష్పాయుధున్
బూదిన్జేయుచు పార్వతిన్గొనఁగ సమ్మోదంబుఁ జూపంగ నా
మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!

మిస్సన్న చెప్పారు...

ఏదీ దారిక నప్పులిచ్చి యకటా యీ నీరవున్ బెంచినా
మా దుర్మార్గుడు మోసగించి చనె నమ్మా యంచు బ్యాంకేడ్వగా
నా దేశం బతనిన్ స్వదేశమునకే యంపంగ నిచ్చోట నా
మోదీ 'పెండ్లి'కి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో.

లంక శివ రామక్రిష్ణ శాస్త్రి చెప్పారు...

రాదే బుధ్ధియె మీకిక
*"మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్"*
ఏదీ ఎక్కడ చూపుడి
షాదీ గానా బజాన సైతము లేదే!!

చడీ చప్పుడు లేకుండా ఎక్కడి పెళ్ళెకెళ్ళారొ?

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

ఆధునిక భక్తుడు కనుక ఇప్పటికి తగినట్లు
" కౌమోదీ " అని కొత్తపాతల క్రొమ్మెరుగులతో
బిడ్డకు పేరు పెట్టాడండీ !😊

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!

Sreedhara Rao Machavolu చెప్పారు...

మోదమునన్ మది నెంచగ
కాదేదియు నిట సమస్య; కవివరులారా
ఖేదమనక పూరింపుడు,
"మోదీ బెండ్లికి జనిరట ముక్కోటి సురల్!"

కంది శంకరయ్య చెప్పారు...

వైవిధ్యమైన చక్కని పూరణ.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మోదమలర దొరికెనుమన    
మోదీకిన్నాళ్ళకునొక ముచ్చట యిల్లాల్    
ఖేదములన్నియుఁ దొలగగ
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్

కంజర్ల రామాచార్య. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంజర్ల రామాచార్య. చెప్పారు...

మోదమ్మొందగ కాశి నెన్నికను నామోదించి గెల్పించ ని
ర్వాదాంశమ్ములునౌ లసత్పథకముల్ వాసిం గనన్ జేకొనెన్
వేదోక్తమ్ముగ పార్వతీసతికిఁ గావింపన్ వివాహమ్ము నా
మోదీ, పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో

Sitharamayya Solasa చెప్పారు...

సాదరముగ తేనీటిని
చీదరపడకుండ నమ్ము చిరుతని లోనన్
ఆ దేవుళ్ళే మికనుచు
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్ ?

chandrashekhar yelisetty చెప్పారు...

కం.
సాదా సీదా బ్రతుకున
నేదో సాధింప దలచి నేతగ నిలువన్
కాదనుటెట్లగు నా విధి
మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్

వై. చంద్రశేఖర్

తంగిరాల సుందర రఘురాం చెప్పారు...

రాదే బంధువులైన మైత్రి వలనన్ ప్రాపై, వినా తండ్రి యా
మోదంబే యొకటైన జంటకిక తామూ సాక్షులై రాణి, యా
మో దీ పెండ్లికి పోయినారు గదరా, ముక్కోటి దేవు ళ్ళహో
మోదంబున్ తెలిపెన్ కదా! శుభము శంభో శంకరా భార్గవా!

మిస్సన్న చెప్పారు...

ధన్యాదాలండీ.

కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు...

ధన్యోస్మి .. చెప్పిన మార్పుతో

మోదమె యని తలచగనా
మోదీ పదవిని పరిణయ మొనరఁగ తెలిసెన్
పోదామని యనుకొన నా
మోదీ పెండ్లికిఁ, జనిరఁట ముక్కోటి సురల్


ఇంత చక్కగా తప్పులు దిద్దుతున్న మీకు నా నమస్సుమాంజలి

chandrashekhar yelisetty చెప్పారు...

కం.
షాదీ గాదది పేరున
కాదా చదురని తెలుపగ కానగు టెట్లో
సీదా భారత ప్రతినిధి
మోదీ పెండ్లికి జనిరట ముక్కోటి సురల్

వై. చంద్రశేఖర్

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

దీదీకలగనిజెప్పెను
మోదీపెండ్లికిజనిరట ముక్కోటిసురల్
సౌదామినివధువటయిక
మోదీజీయగుటవరుడుమోదముగలిగెన్

Vojjala Sharath babu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

దాదాసాహెబు చెప్పెనిట్లనిభళామోదంబునొందంగగా
మోదీపెండ్లికిపోయినారుగదరాముక్కోటిదేవుళ్ళహో
మోదంబందుచుజూడశూన్యమెకటాభోస్వప్నమందుండెగా
దాదాసాహెబుమాటలన్నియుకలన్దధ్యంబులేయౌనుసూ

Vojjala Sharath babu చెప్పారు...

మోదంబొందిరహో! స
మ్మోదంబున సుజనమంత,ముద్దార సం
ధ్యాదంగన శోభా!కౌ
మోదీపెండ్లికి జనిరట ముక్కోటిసురల్

Ram Dokka చెప్పారు...

హోదా నీయగ రాదా?
లేదా సాక్ష్యము? తిరుపతి లెక్కకు రాదా?
వాదా మరచుట తగదని
మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్..��

Ram Dokka చెప్పారు...

శ్రీదేవేరుల జతగొని
గాదిలి బ్రహ్మోత్సవమున కల్యాణమనన్
వేదాత్మకుడగు హరియా
మోదీ, పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్..🙏