4, డిసెంబర్ 2019, బుధవారం

దత్తపది - 164

కవిమిత్రులారా,
'కవి' పదంతో నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

48 కామెంట్‌లు:


  1. కవితలు చెప్పెడి నన్నయ
    కవిత్రయము నందు మొదటి కవి యందురుగా
    కవియగ జేసిరి భారత
    కవిదల దెలుగున పఠనము గావించు విధిన్

    కవియు = వ్యాపించు
    కవిదల = యుద్ధము

    రిప్లయితొలగించండి


  2. కవిగొనకోరెద బావా
    కవిదల లో సంగ్రహీతగా నాకై యా
    కవియము బట్టినను నడుప!
    కవియించుమయా విజయుని గా సార్థకతన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కౌరవ సభలో కృష్ణుని మాటలు....

    కవిసిన నిరు బలములు లో
    క వినాశంబగును వంశకీర్తియుఁ జెడు నిం
    క వివాదమ్ములకున్ బలు
    క వలెను స్వస్తి కురురాజ! కలుగు హితమ్మే.

    రిప్లయితొలగించండి
  4. కవిసిరి కాలచక్రమున, కాలపుకూట విషమ్ముకౌరవుల్
    కవులుగనివ్వగోరితిమి, కష్టము నెంచరు కౌరవాధముల్
    కవిలపుకట్టగామిగిలె కందెనవేయని కాలచక్రమై
    కవుడునుజూపగాదగున?, కందువనిచ్చెడు కవ్వడిన్ గనన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో 'కవి' లేదు.

      తొలగించండి
    2. కవిసిరి కాలచక్రమున, కాలపుకూట విషమ్ముకౌరవుల్
      కవులుగనివ్వగోరితిమి, కష్టము నెంచరు కౌరవాధముల్
      కవిలపుకట్టగామిగిలె కందెనవేయని కాలచక్రమై
      కవులట దూయ కావ్య ఖడ్గమది భవ్య గీతగ మిగిలెన్
      --------------------------------


      [సవరణ పాఠము ధన్యవాదాలతో]

      తొలగించండి
    3. కవిసిరి కాలచక్రమున, కాలపుకూట విషమ్ముకౌరవుల్
      కవులుగనివ్వగోరితిమి, కష్టము నెంచరు కౌరవాధముల్
      కవిలపుకట్టగామిగిలె కందెన నోచని కాల చక్రమై
      కవులట కావ్యఖడ్గమయి కాలపు గీతగ బోధజేసెలే
      [సవరణ పాఠము ధన్యవాదాలతో]

      తొలగించండి
  5. కవిదల జేయుట కన్నను
    కవిగొని రాజ్య మందు ఘనమగు కీర్తిన్
    కవికను వేసిన తరుణము
    కవియునట రణము మాని కాకోల న్యాయం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. 'నాయం' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. కవిదల జేయుట కన్నను
      కవిగొని రాజ్యము నందున ఘనమగు కీర్తిన్
      కవికను వేసిన తరుణము
      కవియునట రణము మాని కాకోల నీతిన్

      తొలగించండి
  6. కవిగా భావన జేయుము
    కవిసిరి రణమందువారు కాలును దువ్వన్
    కవిగా నన్నయకృతమున
    కవుడది గొట్టెన్ బుసలను కౌరవులందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో 'కవి' పదం లేదు.

      తొలగించండి
    2. కవిగా భావన జేయుము
      కవిసిరి రణమందువారు కాలును దువ్వన్
      కవిగా నన్నయకృతమున
      కవిసిరి గారవముడిగ్గ కౌరవులందున్

      [సవరణ పాఠము ధన్యవాదాలతో]

      తొలగించండి
  7. కవి వ్యాసుని భారతమున
    కవి కూతురు దేవయానిఁ కనగనె దానిం
    క విచలిత చిత్తుడయ్యె నిఁ
    క విశ్వపతి నాయయాతి కరమున్ గొనియెన్

    కవి-శుకృఁడు (శబ్దరత్నాకరము) 1912

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    1)
    రాయబారమున కృష్ణుడు రారాజుతో:
    __________________________

    కవిదల జేయ నెంచినను - కర్ణుడు జచ్చుట తథ్యమే సుమా !
    కవిదల యందు పావనిని - కష్టము గెల్చుట నీకు నిక్కమే !
    కవిదల ధర్మరాజునకు - కల్గు జయంబదె నన్ను నమ్ముమా !
    కవిదల మాని పొత్తునకు - కారణమై ఘన కీర్తి నొందుమా!
    __________________________
    కవిదల = యుద్ధము

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  9. కవిదల మునకై యిట్టుల
    కవించుటయె పాటిగాదు గదరా యది లో
    క వినాశమనుచు నెఱగుమి
    క విగ్రహము వీడుమంచు కన్నడు పలికెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కవించు' అన్నరూపం లేదు. "కవయించు, కవ్వించు" అన్న రూపాలున్నవి.

      తొలగించండి


  10. జీపీయెస్ వారి తరపున వారి ఫేవరెట్ రాహులయ్య నేటి భారతం :)


    కవిదల యెన్నికలన్ జో
    క విడివడుచు రాహులయ్య కాంగ్రెస్సునరే
    కవికన్ విడిచిన హరివలె
    కవియించెడు థాయిలాండు కై పరుగులిడెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. (మహాభారతానికి లేఖకుడుగా విచ్చేసిన
    వినాయకుడు మహర్షి వేదవ్యాసునితో)
    కవివర ! వచ్చితిన్ బనుప
    గౌరియు నీశ్వరు ; డింతకున్ మహా
    కవివట నీవు ; నే నికను
    గంటము నాపనియట్లు ; వంక లే
    క వినుచుమా ! శుభంకరము
    గన్ జగమంతయు స్వాస్థ్యమున్ - సుఖై
    కవిలసితంబు - వ్యాసముని
    కమ్రముఖాంచితసౌహృదమ్ముగా .
    (వినుచుమా -వినిపింపుమా ;
    సౌహృదము -స్నేహభావం )

    రిప్లయితొలగించండి
  12. రాయబారమందు శ్రీ కృష్ణుడు.... దుర్యోధనుని తో.....

    కవిగొను క్రౌర్యము, కురువర!
    కవియును ధర్మంబు శోక ధామంబగుచున్,
    కవికలు వేయుము, స్వార్థపు
    కవిదల నొనరింప నీకు క్రమపథమగునే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో....

      రాయబారమందు శ్రీ కృష్ణుడు.... దుర్యోధనుని తో.....

      కవిగొను క్రౌర్యము, కురువర!
      కవియును ధర్మంబు శోక కారణమగుచున్,
      కవికలు వేయుము, స్వార్థపు
      కవిదల నొనరింప నీకు క్రమపథమగునే!

      తొలగించండి
  13. కవియగ రిపు సేన ల వెను కంజ వేయ
    కవి వలె ను సేయు గీతకు కదన మందు
    కవిసె వైరుల ను కిరీటి జవము గనుక
    క వికలము జేసి పోరె వికసి తు డగుచు

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    "కవిజా! కుంతిని, నీకు తల్లినిర ! భిక్షన్ బెట్ట నా
    గర్భశో...
    క వినాశమ్మగుఁ., బాండవేయుల రణక్ష్మా సీమ చంపంగబో...
    క వివేకమ్మును జూపరా !" యనగ దీక్షన్ సద్వరంబిచ్చితో!
    కవి వర్ణింపగ నీ వదాన్యతను వాక్యంబందునే !? కర్ణుడా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ గురుభ్యో నమః 🙏ఈ క్రిందివిధముగా సవరించితిని.. పరిశీలింపుమని సవినయముగా కోరుతున్నాను🙏

      కవితేజస్వివి! పుత్ర ! కుంతినిర ! భిక్షన్ బెట్ట నా
      గర్భశో...
      క వినాశమ్మగుఁ., బాండవేయుల రణక్ష్మా సీమ చంపంగబో...
      క వివేకమ్మును జూపురా !" యనగ దీక్షన్ సద్వరంబిచ్చితో!
      కవి వర్ణింపగ నీ వదాన్యతను వాక్యంబందునే !? కర్ణుడా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  15. కవి యనగా తిక్కనయే
    కవి యనగా పోతనకవి గమనింపంగన్
    కవి నేను జనార్దనుడను
    కవి యను నామంబు నీటి కాకికి లేదే?

    రిప్లయితొలగించండి
  16. కవియనగా కార్మికుడే
    కవియనగా కష్ట జీవి కటునిటు యుండున్
    కవి ప్రగతికి రథ సారథి
    కవి జగతికి మార్గదర్శి కాదన గలమే?
    **)()(**
    ('అటునిటు'అన్నది సిద్ధ సమాసమేగా!అందుకే యతిమైత్రి ఉంటుందనుకుంటాను.విజ్ఞులైన పెద్దలు చెప్పాలి)

    రిప్లయితొలగించండి
  17. కవిదలు మానుట యొప్పగు
    గవిదలునేజేయునెడలకౌరవశతమున్
    గవిదలలోమరణింతురు
    కవితిక్కనవ్రాసెనటులకవివరులారా!

    రిప్లయితొలగించండి
  18. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దత్తపది
    'కవి' పదంతో నాలుగు పాదాలను
    ప్రారంభిస్తూ భారతార్థంలో
    నచ్చిన ఛందంలో పద్యం

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కవికి, జనులకు మిగుల లౌక్యమును గూర్చి ,
    కవిత భారతమును బోలెఁ గ్రాలవలెను..
    కవికి, జనులకు నాముష్మిక సుఖ మిచ్చి ,
    కవిత రామాయణమువలెఁ గ్రాలవలెను..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    4.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  19. సరదాగా రాసినది, తప్పులున్న మన్నించ ప్రార్ధన 🙏🙏

    కవులను యడిగిన పిమ్మట
    కవియని తలచిట మొదలిడె కందమురాయన్
    కవి కాదనితలచి మనసి
    క విడిచె నెరుగక భరతపు కదనము నేనున్!

    రిప్లయితొలగించండి

  20. కవి యను ప్రగల్బములతో
    కవియించుచు పరుగులిడెడు కంద జిలేబీ
    కవితా హృదయంబదె లే
    క వితరణల చేయ తగదు కవితల సుమ్మీ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో...

    కందం
    కవియించిన బంధమ్ములు
    కవిగొని నిను చేయనీవు కర్తవ్యమునే
    కవి వైచుచు చింతనలకు
    కవివౌచును గీతఁ దెలిసి కదలుము నరుడా!

    రిప్లయితొలగించండి
  22. కవి వాచస్పతులఁ గొలిచి
    కవి పదముల సంస్మరించి కమనీయంబౌ
    కవి సంయమి వ్యాసుఁడు భవ
    కవి నాశక భారతముఁ బ్రకటితము సేసెన్

    [కవి = 1. శుక్రుడు, 2. వాల్మీకి, 3. కవి, 4. సంకెళ్ళు]

    రిప్లయితొలగించండి
  23. స్వర్గంలో ఊర్వశి అర్జునునితో...

    కందం
    కవిగొన మధురోహలు నిన్
    కవియించెడు నూర్వశి నిటు కాదను మదినిన్
    కవివైచి చెలఁగి తనువుల
    కవిదలమున వీరుడౌచుఁ గర్వించుమురా!

    రిప్లయితొలగించండి
  24. కవి వ్యాసుడె రచియించగ
    కవిభారతమాయెగాద కావ్యపు గరిమన్.
    కవి దలచిన ప్రభవించును
    కవి రవికన్నను సులువగు కరుణనుజూపన్.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ వినాయక
    కీచకుని ఆటకు ఈ రాత్రి సంకెలలు వేస్తాను (చంపుతాను) ఆ వార్త రేపు జగమునకు అంతా తెలుస్తుంది అప్పుడు అతని సోదరులు యుధ్ధము చేస్తారు వారిని కూడ చంపితే వారి శరీరము చర్మ వాయిద్య విశేషముగా మారుతుంది అని భీముని పలుకులు

    కవిక వేతు నేడు రయముగ ఖలునకును,
    కవిగొనును జగతికి చావు కబురు రేపు ,
    కవిదలను జేయు నతని సగర్భులపుడు
    కవిడి గామారు వారల కలిల మంత,

    కవిక సంకెళ్ళు ,
    కవిగొను = వ్యాపించును ,
    కవిదలను చేయు = యుధ్ధము చేయు,
    కవిడి = చర్మ వాద్య విషెశము

    రిప్లయితొలగించండి
  26. కం.

    కవియగు వ్యాసుడు దెలిపెను
    కవియము లేని తురగమును కంకుడు వీడన్
    కవిగొన నాలుగు దిక్కుల
    కవితా గోష్టుల మరుగున కట్టడి యగునే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి


  27. కవియించుచుతురగంబుల
    కవికను బిగబట్టి సాగె కవ్వడి వడిగా
    కవిడియు మ్రోగన్ జవమును
    కవియించెను భీతి యచట కాల్బలమునకున్.

    కవియించు=కవ్వించు
    కవిక=కళ్ళెము
    కలికి=చర్మవాయిద్యము
    కవియించు=కలిగించు

    రిప్లయితొలగించండి
  28. కవికుల గురువులు మువ్వురు
    కవితా మాధురులొలుకగ కమనీయముగా
    కవి జన వంద్యము భారత
    కవితా సుధ దెనుగు జేసి ఖ్యాతిని గనిరే

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దత్తపది
    'కవి' పదంతో నాలుగు పాదాలను
    ప్రారంభిస్తూ భారతార్థంలో
    నచ్చిన ఛందంలో పద్యం

    సందర్భము:
    *భావం..*
    మనస్సుయొక్క కవి (కళ్ళెం) పట్టుకో!
    కడకు విజయం (మనను) వరించక ఏ మవుతుంది? కాబట్టి వినయమును మీరక (అతిక్రమించక) విను..
    వాడు (అంత పెద్ద) గరుత్మంతుడా యేమి? (మనం తలచుకుంటే) ఒక (చిన్న) కవియే (అల్పమైన నీటి కాకియే!) సుమా!
    *భారతార్థంలో..*
    అన్నాడు ధర్మమూర్తి (ధర్మరాజు) కృష్ణుని రాయబారానికి పంపే సందర్భంలో. అన్న యొక్క అతి సహనానికి కోపోద్రిక్తు డౌతున్న తమ్మునితో (భీమునితో) దుర్యోధనుని గురించి..
    వాడు= దుర్యోధనుడు..
    *రామాయణార్థంలో..*
    అన్నాడు ధర్మమూర్తి (రాముడు) కోపోద్రిక్తు డౌతున్న తమ్మునితో (లక్ష్మణునితో) సీతాన్వేషణలో ఆలస్యం చేస్తున్న సుగ్రీవుని గురించి..
    వాడు = సుగ్రీవుడు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "కవి వదలకుండఁ బట్టుమా! కడ వరించ
    క విజయ మ్మేమి యగు నోయి! కనుక మీర
    క వినయమ్మును విను.. వాడు గరుడు డేమి?
    కవియె!" యనె ధర్మమూర్తి
    తాఁ గని యనుజుని..


    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    4.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి