2, డిసెంబర్ 2019, సోమవారం

సమస్య - 3209 (కుండలోనఁ జొచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు"
(లేదా...)
"కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా"

65 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    దండుగ మారి దేశమిది దారుణ చర్యలు రాజనీతినిన్
    పండుగ జేయుచున్ జరుగు పన్నుగ నవ్వగ భారతీయులే...
    మెండగు సోనియమ్మ కడు మెల్లగ జొచ్చెగ నుద్ధవున్ భళా: 👇
    "కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా"

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "ఘటాకాశం మహాకాశం"

    "ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి
    భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా"

    కుండర దేహమున్ మనది కొట్టుకు పోవును మృత్యువందునన్...
    కొండగు నీశ్వరుండు కడు కూరిమి మీరగ మాయతోడుతన్
    పండుగ జేసి దూరునుర పాపము పుణ్యము లేకయే భళా: 👇
    "కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా"

    రిప్లయితొలగించండి


  3. బండి రావు గారు పాటల పల్లకి
    నెక్కి కారయోకె నేర్పు గాను
    వ్రాయ చూడ సొబగు పాటలు వఱ్ఱోడి
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. కప్ప పాము కలిసి గొప్పస్నే హితులంట
    కరిని కాలు బట్టె మకరి గాదె
    కలియు గంబు నందు కానిదే మున్నది
    కుండ లోనఁ జొచ్చెఁ గొండ గనుడు

    రిప్లయితొలగించండి


  5. గండర గండడైన చెలి కాడు సుమా కురువింద మొక్కటిన్
    నిండుగ కుండ లోన నిడి నివ్వెర పోవు విధమ్ము కుధ్రమున్
    చెండుగ చూపె బింబముగ చేతిని తాకెడు దూర మందు నీ
    కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కుధరము'ను 'కుధ్రము' అనడం సాధువు కాదు. పర్యాయపద నిఘంటువు పేర్కొన్న మాత్రాన ప్రామాణ్యం లేదు.

      తొలగించండి

    2. కుధరము నుంచే కుధరేముఖ్ ( Karnataka hill cum mining station) పేరు వచ్చి వుంటుందేమో ?


      జిలేబి

      తొలగించండి

    3. అవును. మా చిన్నప్పుడు ఆ company advertisements లో గుఱ్ఱం ముఖం కనిపించేది...

      నేనూ ఆ జాతి వాడనే కదా 😊

      తొలగించండి
    4. కుధ్రము కుధరము నుండి యచ్చులోపమున వచ్చిన రూపము కాదండి.
      ధృ ధాతువు (ధరించు) నుండి వచ్చినదండి.
      కు : భూమి, భూమిని ధరించునది కుధృ నుండి వచ్చినది కుధ్రము.

      తొలగించండి

    5. "...Kuduremukha is a mountain range and name of a peak located in Chikkamagaluru district, in Karnataka, India. ... The name Kuduremukha literally means 'horse-face' (Kannada) and refers to a particular picturesque view of a side of the mountain that resembles a horse's face..."

      https://www.google.co.in/search?client=safari&channel=iphone_bm&ei=Uc7kXdncGKmW4-EPkLGysA0&q=kudremukh+meaning&oq=kudremukh+mea&gs_l=mobile-gws-wiz-serp.1.0.0l2j33i160l3.4462.6832..8355...0.1..0.241.915.1j4j1......0....1.........0i71j0i67j0i22i30j46.KeB582dQZAg

      తొలగించండి


  6. కాపిశాయనంపు ఘాటుని పల్కులన్
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు
    రండి రండి యనుచు రావడి చేయుచు
    దారిని బడి దొరలె తాగుబోతు

    రిప్లయితొలగించండి
  7. కొండ నద్దమం దు కొంచమై యుండ గా
    కుండ యందు నీరు నిండి యుండ
    కొండ నీడ గాంచి కొంటె గా నొకడనె
    కుండ లోన జొ చ్చె కొండ గనుడు

    రిప్లయితొలగించండి
  8. విహగ వీధిలోన వేగముఁ జను వాయు
    సుతుని మ్రింగ దలచి సురస రాగ
    సూక్ష్మ రూపమందు సుదతినోటను దూరె
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    రిప్లయితొలగించండి


  9. ఏమి పేలునో


    గ్రహము లారు చేరు గృహము ధనుస్సుని
    నమవసి దినము గ్రహణపు సమయ మి
    రువది యారుని! తలరుల వేళయగునొకొ?
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. కొండయనంగ రాతికి నకుంఠితరూపము పెద్దయాకృతిన్
    గుండను జూడు మియ్యదియె కూన! యటంచును తండ్రి జూప వా
    డుండినచోట రాయియొక టొప్పుగ గుండనువేసి బల్కె నీ
    కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా"

    రిప్లయితొలగించండి
  11. శ్రీ వినాయక


    కమలాసనుడు తన కామపు చిత్తము
    వలనకో ల్పోయెనౌ దలము నొకటి
    వేయిక నులు పొందె వేల్పుల గమిగాడు
    కామాంధుడై ముని భామ కూడి
    పరకాంత పొందును విరటుని బావ మ
    రిది కోరి నిలలో మరిమనుపొందె
    రావణ బ్రహ్మయు రమణి సీతను కోరి
    కోదండ పాణిచే కూల్చ బడెను


    తరచి చూడ చేసె తప్పులు నిరువురు
    యెంచి చూడ నొక్క కంచె లోన
    మేసె మేతను పొల మేపరుల్ ను, సురలు,
    చూడ చూడ రుచుల జాడ యొకటె,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని సూచనలు వాట్సప్ సమూహంలో చూడండి.

      తొలగించండి
  12. (చిన్నకోట బొబ్బిలి మీదకు ఫ్రెంచి సేనాని బుస్సీ , విజయరామరాజుల దండయాత్ర -
    రంగారాయడు తన బావమరది తాండ్ర
    పాపారాయనికి సహాయానికై వ్రాసినలేఖ)
    దండిగ సేనలన్ గొనుచు
    ధార్ష్ట్యపు బుస్సియు , రామరాయడున్
    మెండగు నాయుధంబులను
    మీరుచు కేరుచు వచ్చుచుండిరే !
    యండగ నుండ బావ ! భవ
    దాగమనంబును గాంక్ష జేసితిన్ ;
    కుండను గొండ సొచ్చె నిది
    గో ! కనులారగ జూచి నమ్ముమా !!
    (ధార్ష్ట్యము -ధిక్కారం ;కేరుచు -హుంకరిస్తూ )

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    మొండిగ సింహికాఖ్య ముఖమున్ కడు పెద్దది జేయ, వాయుపు....
    త్రుండొక కొండయై నిలిచి, దూరి తటాలున జంప, వింతగా
    గుండెల చేతులుంచి సురకోటి యనెన్" మనవాడె గెల్చెరా!
    కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. ఎండలోననున్న నిండునీటి ఘటము
    నందు మింటనున్న నంశుమాలి
    ప్రతిఫలించ బలికె పడతి పతినిబిల్చి
    కుండలోన జొచ్చె కొండగనుడు!

    రిప్లయితొలగించండి
  15. ఉండబట్టలేక నిండు గర్భిణికౌర
    వుండు బుట్టకుండ వుంట జూచి
    పిండిగొట్ట కృష్ణు కుండ నందుంచగా
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    నిండుగర్భిణి-గాంధారి;
    కృష్ణు- వ్యాసుడు
    కొండ- సుయోధనుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణలో అస్పష్టత ఉన్నది. వుండు, వుంట అన్నవి వ్యావహారికాలు.

      తొలగించండి
  16. ధన్యవాదములు,🙏🙏🙏
    సమయము చూచి తప్పక ఔచిత్యముగా ప్రయత్నించెద 🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  17. అండను గోలుపోయి తనయావతు సైన్యము బంధుమిత్రులన్
    వెండియు స్వాభిమానమును,వేసటనొందుచు రాజరాజటన్
    భండన భీముధాటికిని బారుచు దాగగ సౌహ్రదమ్మునన్
    కుండను గొండజొచ్చె నిదిగో కనులారగజూచి నమ్ముమా!

    రిప్లయితొలగించండి
  18. మంకు పట్టు విడని మనుమల కొరకింక
    మాయ జేయ వలసె మాన్ప నేడ్పు
    పట్టి జూపె నీట ప్రతిబింబమును తాత
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    రిప్లయితొలగించండి
  19. కుండలోన నీరునిండబోసితనదు
    కూతుబిల్చి చూడు కొండనిందు
    కుండలోనజొచ్చె గొండ గనుడుతేరి
    పార,గాననగునుస్పష్టముగను

    రిప్లయితొలగించండి
  20. సూరి , "కుండ లోన జొచ్చె గండ" యనుచు
    వ్రాయమని తెలుపుచు వదలి పెట్ట
    "కుండలోనఁ జొచ్చెఁ గొండ" గ
    నుడనంగ
    యతి కుదరగ మురిసె నధికముగను

    కండ = మాంసము ముక్క

    రిప్లయితొలగించండి

  21. ఆటవెలది
    కూడు మయ్య నన్ను కొండంత యండగా
    కుక్షి కలశమౌను కుండగాక
    యని గజాసురుండు హరునికై తపియించ
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    ఉత్పలమాల
    మొండిగ నే తపించి హరు మోదము గాంచుచుఁ గోరినంతటన్
    గుండనుఁ బోలు నా కడుపు గూడునుఁ దా కలశమ్ము జేయఁగా
    నుండగఁ గూడఁ బండుగన నొప్పెనటంచు గజాసురుండనెన్
    "గుండనుఁ గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా!"

    రిప్లయితొలగించండి
  22. రాజకీయమందురంగులుమార్చుట
    యెవరికైనతప్పదవసరమ్ము
    మనికికొరకు పాట్లు మహరాష్ట్రమందున
     కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    రిప్లయితొలగించండి
  23. ఆ.వె.

    కరము నందు నెపుడు కదలాడు చరవాణి
    సృష్టి నంత దెలుపు చిటిక లోన
    నెట్టు మహిమ జూడ నింతింత గాదయా
    కుండ లోన జొచ్చె గుండ గనుడు

    వై. చంద్రశేఖర్
    నెట్టు: Internet

    రిప్లయితొలగించండి
  24. గుండు కన్న మిన్న మొండి ఘటము జాలి
    గుండు సున్న సుమ్ము పొండు వాని
    చెంత కేఁగ కుండు వింత గుండె తెలియ
    కుండ లోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు


    మెండుగ ఱెక్క లుండగ నమేయ రయమ్మున జంతుజాలముం
    బిండి యొనర్చుచుండ బలభిత్తునిఁ జూచి భయమ్మునంది యు
    ద్దండుఁడు గాలి వీవ వడిఁ దర్షము నందు నగారి గాన లే
    కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా

    రిప్లయితొలగించండి
  25. మొండిగవాదులాడకను మోమునుద్రిప్పకచూడుమాయిటన్
    కుండనుగొండసొచ్చెనిదిగోకనులారగజూచినమ్ముమా
    కుండనునీళ్ళుపోసి యికకొండకుదగ్గరగాగనుంచుచో
    గండరగండడా!వినుముగానగవచ్చునుగొండనందులో

    రిప్లయితొలగించండి

  26. ఉండర చూడరా నదిని యొక్క వడిన్ ప్రవహించు చున్న దా
    బండల గుట్టలన్ తరుల బ్రక్కల ద్రోయుచు హోరు మంచు నా
    గుండెను బెంచుచున్ దడను గూడెము ప్రక్కన సాగి యాగిపో
    కుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా.

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    సందర్భము: పితృవాక్య పాలనకై రాము డడవులకు వెళ్ళాడు. తమ్ముడైన భరతుడు మాత్రం రాముని మళ్ళీ తీసుకురావా లని బయలుదేరినాడు. అతనివెంట మంత్రులు పురోహితులు మంది మార్బలం సైనికులూ కదిలారు. గుహుడు పాలించే శృంగిబేరపురం వద్ద గంగానదిని సమీపించారు. ఆ రాత్రి అక్కడే విడిది చేద్దా మన్నాడు భరతుడు.
    రామ భక్తుడైన నిషాదరాజు గుహుడు వారిని చూసి రామునికి కీడు చేస్తా రేమో అనుకున్నాడు. తన వారికి యుద్ధానికి సిద్ధంగా వుండం డనీ చెప్పినాడు. తా నొక్కడే కొన్ని కానుకలు తీసుకొని భరతుని ఉద్దేశ్యం కనుక్కుందా మని బయలుదేరాడు. ఆతని సుగుణాలను అర్థం చేసుకున్నాడు.
    ఆశంసే స్వాశితా సేనా
    వత్స్యతీ మాం విభావరీమ్
    అర్చితో వివిధైః కామైః
    శ్వః ససైన్యో గమిష్యతి
    (అయోధ్య.. 84-18)
    (సైన్యం చక్కగా భుజించి ఈ రాత్రి ఇక్కడే వుంటుంది. మా సపర్యలు గైకొని మీరు రేపు ఉదయాన్నే వెళ్ళవచ్చు) అన్నాడు.
    భరతుడు ఆతురతతో "గంగానది దాటి భరద్వాజాశ్రమం చేరే దారి చూపించు" మన్నాడు. మాటల్లోనే..
    బభౌ నష్టప్రభ స్సూర్యో రజనీ చాభ్యవర్తత.. ఈలోగా సూర్యకాంతి తఱిగిపోయి రాత్రి యైనది.
    భరత శత్రుఘ్నులు శయనము చేరినారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "రామ భక్తి రతుడ! రావోయి భరతుడా!
    సేదదీరు" డనుచుఁ
    జెప్పె గుహుడు..
    "ఇదిగొ పశ్చిమాద్రి! ఇనబింబ మగుపడ
    కుండ లోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    2.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. ఉ:

    మెండుగవాడుచుండిరటమెప్పగు నంతరజాలమున్ భళా
    నిండగ లోకమెల్ల కడు నిశ్చయమై లఘు చిప్పు నందునన్
    సండెయు మండె గాని మరి సాటిల లేదది నెందుజూచినన్
    కుండను గొండ సోచ్చె నిదిగో కనులారగ జూచి నమ్ముమా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  29. ఆట వెలది పద్యము 4 వ పాదము లో...
    గుండ ను గొండ గా చదువగలరు.

    రిప్లయితొలగించండి
  30. భండన భీముడార్తజన బాంధవు డైన కపీశు డాంజనే
    యుండు విహంగ వీధిని యయోనిజ గన్గొన బోవువేళలో
    చండిక సింహికన్ దునుమ సాచిన నోటిన జోచ్చుటన్ గనన్
    గుండను గొండ సొచ్చె నిదిగో కనులారఁగఁ జూచి నమ్ముమా

    రిప్లయితొలగించండి
  31. దండగమారి మాటలని,దాడినిజేయుచువైరిపక్షమున్
    పండుగజేసికొంటిరిక,పాలనయందున శ్రద్ధజూపకన్
    నిండుగ మామనమ్ములను, నీటనుముంచెడు తీరుమానకన్
    కుండలకొండజొచ్చెనదిగో, కనులారగజూచి నమ్మరో!

    రిప్లయితొలగించండి
  32. కొండయద్దమందు కొంచమై యుండును
    నిండుగుండె గలిగి నిఖిలజగము
    పండువెన్నెలాయె,పండుగజేయగ
    కుండలోనజొచ్చె కొండగనుము

    రిప్లయితొలగించండి
  33. కొండనెత్తినాడు గోపాలకృష్ణుడు
    బాలుడైన గాని భక్తవిభుడు
    అండ దండ వాడె ఆశ్రితజనులకు
    కుండలోనజొచ్చె కొండగనుము

    రిప్లయితొలగించండి
  34. వండిరి వైరిపక్షముకు వార్తలకెక్కెడు తీరునిచ్చుచున్
    గుండెలకుంపటై నిలిచి,కూల్చిరి రాష్ట్రపు పాలనంతయున్
    మండెడు గ్రీష్మమైనిలువ,మాడగజేసిరి,వృద్ధిరేటునే
    కుండలకొండజొచ్చెగదిగో కనులారగజూచి నమ్మరో.

    రిప్లయితొలగించండి
  35. నిండుమనమ్ముతోగెలిచె ,నింపుగ మాహృదయాంతరాళముల్
    పండుగనిండె మా కనుల ,పావనమూర్తినిజూచు తీరుతో
    దండులుగట్టిరండిటకు, దాసులమేమని జెప్పగోరగా
    కుండలకొండజొచ్చెనదిగో, కనులారగజూచి నమ్మరో.

    రిప్లయితొలగించండి


  36. మాయలెన్నొ జేసి మహిమలు గుప్పించి
    మాజి కులని జెప్పి మర్మమిప్ప
    పిల్లమోము విరియ పేరాశ గాదిది
    కుండలోన జొచ్చెఁ గొండ గనుడు!!

    రిప్లయితొలగించండి
  37. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    సందర్భము: ఇక్ష్వాకు వంశపు సగర చక్రవర్తి త్రవ్వించినదే సాగరం. సముద్రుడు కృతజ్ఞుడై ఆ వంశానికే చెందిన రాముని దూత ఆంజనేయునికి తోడ్పడేందుకు (పావని అలసిపోరా దని) సముద్రంలోని మైనాక గిరితో..
    "హనుమాన్ త్వయి విశ్రాంతః
    తతః శేషం గమిష్యతి
    హనుమంతుడు నీ మీద కాసేపు విశ్రమించి వెళుతాడు." అన్నాడు.
    మైనాకుడు బంగారు శిఖరాలతో పైకి లేచాడు. మారుతి విఘ్నం కలిగించేందుకు ఇది వచ్చిందేమో అని రొమ్ముతో ఢీకొని పడగొట్టినాడు.
    మైనాకుడు విషయ మిలా వివరించినాడు.
    "కృతయుగంలో పర్వతాలకు రెక్క లుండేవి. అవి ఎగురుతుంటే అంతా భయపడేవారు. ఇంద్రుడు కోపించి వేలాది పర్వతాల రెక్కలు ఖండించాడు. (పక్షాన్ చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః)
    వాయుదేవుడు నన్ను సముద్రంలోకి విసరివేస్తే రక్షింపబడ్డాను. శ్రమం మోక్షయ పూజాం గృహాణ.. అలసట తగ్గించుకో.. మా పూజ స్వీకరించు.."
    హనుమంతు డర్థం చేసుకొని "కార్య సమయం మించిపోయింది. ఆగడానికి వీల్లేదు." అని స్నేహంతో స్పృశించి లంకవైపు సాగిపోయినాడు.
    సీతను చూసి వచ్చాక మారుతి మైనాకుని గూర్చి సుగ్రీవాదులకు చెబుతూ.. మైనాకుని వాయుదేవుడు సముద్రంలోకి విసరా డని, నాటినుండి బయటకు రాకుండా వున్నా డని చెప్పాడు.
    గఱి= పక్షి రెక్క; కరువలి= వాయువు
    హరి= ఇంద్రుడు; జడధి= జలధి
    కొండఁ గనుడు= (మైనాకు డనే) కొండ (అదృష్టాన్ని) చూడండి..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    గిరుల గఱుల నరుకు హరికి బెదరిన మై
    నాక గిరిని విసరినాడు జడధిఁ
    బడగఁ గరువలి... యిక కడలిని వెడలి రా
    కుండ... లోనఁ జొచ్చెఁ.. గొండ గనుఁడు

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    2.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  38. గగన వీధి యందు కపివరుండేగగ
    సూక్ష్మ రూపుతోడ సురస చెంత
    చేరి మ్రింగ నెంచ దూరి వేగమెనోట
    కుండలోనఁ జొచ్చెఁ గొండ గనుఁడు

    రిప్లయితొలగించండి