8, డిసెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3214 (యమున కగును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"యమున కగును బూది యగుట యెపుడొ"
(లేదా...)
"యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్"

65 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    విమలపు హృత్తు వారలకు వీరులు భీరులు రాకుమార్లకున్
    శమమును బొందు యోగులకు జారులు క్రూరులు దేహధార్లకున్
    కమలపు నాభునిన్ విడిచి కాలుని రాకకు వేచియున్న కా
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ (ఏదో సరదాకు వ్రాసినదానిలా లేదు) చాల బాగున్నది. అభినందనలు.
      'రాకుమార్లు, దేహధార్లు' ప్రయోగాలే పానకంలో పుడకలా ఉన్నాయి.

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Rahul Gandhi on onion scarcity:

    విమలపు నుల్లి పాయ వెల వేగము జేరగ నాకసమ్మునన్
    సమయము జూచి రౌరవము చల్లగ వీడుచు నుల్లిదోసెకై
    కమలపు రాజ్యమందునను కమ్మగ కూడగ ప్రీతిమీర నా
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆయమునకు = మర్మస్థానానికి, రాబడికి, పన్నుకు... ఏ అర్థాన్ని నిర్దేశించారు?

      తొలగించండి
    2. 🙏

      ఆ..యమునకు

      (రౌరవము వీడి వచ్చిన) ఆ "యమునకు"

      అట్టి యమధర్మరాజునకు 😊

      తొలగించండి
  3. ధనము యెంత యున్న దానమ్ము జేయక
    ధరను పూడ్చి బెట్ట తనది యగునె
    ముసలి తనముచేత ముక్కుచు మూల్గు కా
    యమున కగును బూది యగుట యెపుడొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని పూరణ. అభినందనలు.
      'ధనము + ఎంత' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "ధనమదెంత యున్న" అనండి.

      తొలగించండి
    2. 🙏🙏 ధన్యవాదములు.
      సరి చేసుకొనెదను.

      తొలగించండి
  4. నేర వృత్తి తోడ నెలతలను చెరచి

    సుఖము పొందలేరు చోరులెపుడు

    సజ్జనారులున్న జగము నందు మటుమా

    యమున కగును బూది యగుట నెపుడొ

    రిప్లయితొలగించండి
  5. దొంగ భక్తి చూపి దొరవలె నటియించి
    పుణ్య మబ్బు ననుచు పూజ లందు
    మోస కారి తనము ముప్పదిప్పలు బెట్టు
    యమున కగును బూది యగుట యెపుడొ

    రిప్లయితొలగించండి

  6. Enjoy Maadi :)

    జీవితము‌న సంతసింప వెరవకు! కా
    యమున కగును బూది యగుట యెపుడొ
    దాని చింత వలదు ! దమ్ముబట్టి యనుభ
    వించు నరుడ యెల్ల వేళలన్ను!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌

      చార్వాక సిద్ధాంతము (భస్మీ భూతస్య...)

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేళలన్ను' అనడం సాధువు కాదు. "వేళలందు" అనండి.

      తొలగించండి
  7. మైలవరపు వారి పూరణ


    మమతను మానవత్వమును మంటల ద్రోసి పరాంగనాంగసౌ...
    ఖ్యమును నరాధముండు పరమావధిగా దలపోయ జాతి మొ...
    త్తము నినదించు *"జంపు"* మని ! దారుణకృత్యమదాంధదుష్టకా...
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  8. భోగములను మరిగి ముక్తిమార్గము వీడి
    సుఖమటంచు దలచు సుదతి వినుము
    వయసు బుద్బుదమ్ము వడలిపోవునది కా
    యమున కగును బూది యగుట యెపుడొ

    రిప్లయితొలగించండి


  9. ఘుమఘుమ లాడ జీవితపు గుల్యము గాఢముగా సుఖమ్ములన్
    తమకము తీర పొందవలె! దమ్మును బట్టుచు సాగిపొమ్ము! కా
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్
    చిమచిమలాడు యోచనల చిక్కిన కాలము వట్టి చేయకోయ్


    జిలేబీయం :)
    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. ఆటవెలది పాద గర్భిత కందము


    బాదరబందియె నిజమని
    మోదనములవేలనొకొ! ప్రమోది జిలేబీ!
    సోదరి! కాయమున కగును
    బూది యగుట యెపుడొ పడకు బూకని వినుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. (శంబరారి కావించిన శంకరతపోభంగం)
    విమలవిశాలనేత్ర యుమ
    విచ్చినపువ్వుల యంజలించి హృత్
    సుమముల తోడ గల్పి తన
    సుందరు నీశ్వరు జేరుచుండగా
    సుమశరపంచకమ్ము నెద
    సూటిగ వైచెడి మీనకేతు కా
    యమునకు దప్ప దెన్నడు హు
    తాశనకీలల బూదియై చెడన్ .
    (శంబరారి , మీనకేతుడు -మన్మథుడు ;
    హుతాశనకీలలు -అగ్నిజ్వాలలు )

    రిప్లయితొలగించండి
  12. ప్రాణమనెడు చిలుక పంజరమౌ బొంది
    నున్నపుడె మనుజున కుర్వి యందు
    విలువ, శ్వాస వీడు వేళ మరణమె కా
    యమున కగును, బూది యగుట యెపుడొ.

    రిప్లయితొలగించండి
  13. అమలిన భావసంపదల నందక స్వార్థముతోడ నిత్యమీ
    క్షమపయి సంచరించుచు కుకర్మలదేలుచు మత్సరించుచున్
    భ్రమగొని సుస్థిరత్వమున బాపము జేసెడి మానవా స్వకా
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్.

    రిప్లయితొలగించండి
  14. శాశ్వత మని తలచి సంపద లను బెంచి
    భోగ భాగ్య మందు మురియ వలదు
    ధృవము మృత్యువెట్టి ధీమంతు కైన కా
    యము న కగును బూది యగుట యెపుడొ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధీమంతునకైన' అనడం సాధువు. అక్కడ "ధీమంతునకును కా..." అనండి.

      తొలగించండి
  15. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    యమునకుఁ దప్ప దెన్నడు హుతాశన కీలల
    బూదియై చెడన్

    సందర్భము:
    యముడు ముని వేషంలో వచ్చి రామునితో "రహస్యంగా మాట్లాడా" లన్నాడు.
    నాన్యేన చైత చ్ఛ్రోతవ్యం
    నాఖ్యాతవ్యం చ కస్యచిత్
    శ్రుణుయాద్వా నిరీక్షేద్వా
    యః స వధ్య స్త్వయా ప్రభో 18
    (అధ్యాత్మ రామాయణం ఉత్తర కాండం 18 వ సర్గం)
    "ఈ మాటలు అన్యు లెవ్వరూ వినరాదు. ఎవరితోనూ చెప్పరాదు. విన్నవాడుగాని చూసినవాడుగాని నీచే వధింపబడాలి.."
    అలా శపథం చేయా లన్నాడు.
    రాము డలా చేసి ద్వారంవద్ద లక్ష్మణుని నుంచినాడు. అనే సందర్భం.
    "మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా వస్తే వధ్యులే" యన్న నియమం విధించగా రాముడు యమునితో "తప్ప దెన్నడు హుతాశన కీలల బూదియై చెడన్" (అలాంటి పని చేస్తే అత డెన్నటికైనా డగ్ని కాహుతియై బూదియై చెడిపోతాడు..)" అన్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    యము డొకనాడు మౌనివలె
    నప్పురిఁ జొచ్చి "రహస్యమౌ ప్రసం
    గము గల.. దెవ్వరే నడుమఁ
    గా లిడ వధ్యులె యంచుఁ జెప్పుమా!
    విమల గుణాఢ్య! రామ!" యని
    వేడిన రాముడు చెప్పె నిట్టులన్
    యమునకుఁ.. "దప్ప దెన్నడు హు
    తాశన కీలల బూదియై చెడన్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    8.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి


  16. తనువు స్థిరముగా కాదు ధరలోన జనులకు
    నాయు వాగిన క్షణ మైన గాని
    పుడమి పైన నుండ బోమిది నిజము కా
    యమున కగును బూది యగుట యెపుడొ

    రిప్లయితొలగించండి
  17. కమలము మాడుటేలనిట,కాంతలుధాత్రిన మానహీనులా?
    క్రమమును దప్పెగాయువత క్రాగగతల్లులగుండెలన్నియున్
    సమతనుగోలుపోవనికసాధ్యముగాదుగబాగుసేయ,కా
    యమునకుదప్పదెప్పుడు హుతాశనకీలల బూదియైచెడెన్
    ***********************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  18. మరణమొందుపిదప మంటలగాలికా
    యమునకగునుబూదియగుటయెపుడొ
    కానబ్రదుకునంతకాలము పరమాత్ము
    సేవజేయవలయుశివముకొఱకు




    రిప్లయితొలగించండి
  19. నిమిషము విశ్రమింపక పనింబడియంత్రమనన్ ధనార్జనం
    బమితముగానొనర్చుచునహంకృతులందుచునుంద్రుజూడ శా
    శ్వతములు కావు సంపదలు సౌఖ్యములందెడు నట్టి మట్టి కా
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  20. నిమిషము విశ్రమింపక పనింబడియంత్రమనన్ ధనార్జనం
    బమితముగానొనర్చుచునహంకృతులందుచునుంద్రుజూడ నా
    శమగుసమస్తసంపదలు సౌఖ్యములందెడు నట్టి మట్టి కా
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్

    రిప్లయితొలగించండి
  21. వింత ప్రశ్న గాదె వేయంగ నివ్విధి
    యమున కగును బూది యగుట యెపుడొ
    యనఁ బ్రళయము జగతి నరుదెంచు నప్పుడ
    తప్ప కుండ నౌను దర్క మేల


    అమల మనస్కు లందఱు మహా విభవమ్ములు పొందకున్ననున్
    సమల మనస్కు లెల్లరును శార్ఙ్గధ రాగ్రహ పాత్రులే చుమీ
    విమతి దశాననుండు భుజవింశతి సన్నత వీర్య వచ్ఛిరో
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్

    రిప్లయితొలగించండి
  22. పుట్టిపెరిగితుదకు గిట్టుట తథ్యము
    సకల జీవకోటి జగమునందు
    యేదిశాశ్వతమ్ము మేదినిలోన కా
    యమున కగును బూది యగుట యెపుడొ

    రిప్లయితొలగించండి
  23. ఎంత ప్రేమ జూపి యెంత పోషించినా
    సుంతయైన నీదు చెంత రాదు
    వింత, దేహ భ్రాంతి విడువరె జనులు, కా
    యమున కగును బూది యగుట యెపుడొ

    రిప్లయితొలగించండి
  24. సమరము గోరు వారయిన శాంతిని గోరెడు వారికిన్ సదా
    దమమును వీడువారికిని ధర్మము తప్పని వారికేని కా
    లమదియె నిండినంతట పరాగమమన్నది సంభవింప కా
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్

    రిప్లయితొలగించండి
  25. మమతలతోడదేహమునుమానినులెంతగశుద్ధిజేయ,కా
    యమునకుదప్పడెన్నడుహుతాసనకీలల బూదియైచెడన్
    విమలమనస్కుడౌచునిల వేంకటనాధునిసేవజేయుచో
    నమలమునైనమోక్షమునునాహరియేగదయిచ్చునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  26. యమున గంగ స్నాన మఘము లణగి యభ
    యమున కగును; బూది యగుట యెపుడొ
    యముని యాజ్ఞ గాన నటు వెరవక, నిర్భ
    యముగ బ్రతుకు నడుపుటదియె మేలు

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. ఆటవెలది
      పేర్మి ధనముఁ దోచి పిల్లలు, మనుమలు,
      ముని మనుమల సుఖము ముఖ్య మనక
      బ్రతుకుచు బ్రతికించు బాటయే మేలు కా
      యమున కగును బూది యగుట యెపుడొ

      చంపకమాల
      నిముషము నూరకుండక యనేకములైన ధనార్జనా ప్రయా
      సముల మునింగి సంఘమున సాగక వీడితె యాలుబిడ్డలన్
      శమము గడింతువే నరుడ! సాయము పేదల కెంచ మేలు, కా
      యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్!

      తొలగించండి
  28. సమముగలేదుభారతము,సంఘమదంతయు నేర వృత్తులే
    క్రమమునుదప్పెనీయువత,క్రాకులవోలెను సంచరించుచున్
    కొమరులదుష్టకార్యముల,క్రొవ్వుమదించినవారలెంత? నీ
    యమునకుదప్పదెప్పుడు,హుతాసనకీలలబూదియైచెడన్.

    రిప్లయితొలగించండి
  29. రిప్లయిలు
    1. సుమలతలైన భామినులు,శూన్యపుదృక్కుల వేచియుండగా
      సమయముజిక్కెలెమ్మనుచు,సందులగొందులద్రిప్పివారినిన్
      దమమునొకింతలేకనిక, దారుణకృత్యముజేయువాడునౌ
      యమునకుదప్పదెప్పుడు,హుతాశనకీలలబూదియైచెడన్.

      తొలగించండి
  30. మరొక పూరణ

    ఆశతోడ ధనము నార్జించి దాచిన
    వెంట రాద దేది విశ్వమందు
    మంచి చెడులె మిగులు మానుగాను మనకా
    యమునకగును బూది యగుట నెపుడొ

    రిప్లయితొలగించండి
  31. ప్రేమ లుండ వెడద గామమే కొలు వౌను
    తరుణి భోగ్య వస్తు వరయ వీర్కి
    హింస వేద మైన కంస సంతాన చ
    యమున కగును బూది యగుట యెపుడొ.

    రిప్లయితొలగించండి
  32. మందువిందుపొందు మౌక్తికమనియెంచి
    చేయరాని పనుల చేసినారె
    చేటుగూడెవారి చెంత మృత్యుముఖ హే
    యమున కగును బూది యగుట యెపుడొ!!

    రిప్లయితొలగించండి
  33. చంపకమాల
    సమయము జూచి పొంచి దిశ సాత్విక భాషణ మోసపుచ్చుచున్
    భ్రమరములై విలాసమున రాల్చగ నా సుకుమార సూనమున్
    నిమిషము వేచి చూడకయె నీచులఁ గాల్చుమటన్న వారి కా
    యమునకుఁ దప్ప దెన్నఁడు హుతాశన కీలల బూదియై చెడన్

    రిప్లయితొలగించండి