13, డిసెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3219 (మానహీనునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మానహీనునకు నమస్కరింతు"
(లేదా...)
"మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో"

34 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    కోనల కోనలన్ దవిలి కొండొక దారిని కానరాకయో
    గానము జేసి సోనియకు గండర గండుల వీడమంచు నేన్
    దీనుల మాటగా నుడివి;... దిక్కును తోచక పట్టమందునన్
    మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో

    మానము = గర్వము (శబ్దరత్నాకరము)

    "New Delhi: Preparations are on in the Congress to bring Rahul Gandhi back as party president..."

    రిప్లయితొలగించండి
  2. జీవితమనునదియె జీరోగ చివరకు
    మానహీనునకు, నమస్కరింతు
    నే ఘనులకెపుడును నేలను తాకగ
    నాశిరము, తొలుగగ నాభయములు
    🙏🙏

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గాంధి తాత:

    మీనము మేషమెంచకను మిక్కిలి ధైర్యము సంభవించగా
    దీనుల బ్రోవగా చెలగి దివ్యపు శస్త్రము స్వీకరించుచున్
    జానెడు గోచినిన్ తొడిగి జన్యము చేయుచు;...దేహమందునన్
    మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    శ్రీకృష్ణ భగవానుడు :
    __________________________

    భార్య కోపగించ - భయపడు నందరు
    పడని వారు గలరె - పుడమి నందు
    భామ కాళ్ళు పట్టి - భంగ పడిన కృష్ణు;
    మానహీనునకు న - మస్కరింతు !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  5. లోక మెల్లగాచి లోన వెలినిగూడ
    నిండి యుండు వాడి నెట్లు గొలుతు?
    నిర్వికారు విష్ణు నిలిపి నామదినందు
    మానహీనునకు నమస్కరింతు🙏

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    శ్రీకృష్ణ భగవానుడు :
    __________________________

    గానము తోడ గోవులకు - కావలి కాసెడి వేణుధారినిన్
    ఙ్ఞానము తోడ పూజలను - సల్పెడు వారికి యాత్మబంధువున్
    కానల లోన పాండవుల - కంటికి రెప్పగ కాచువానినిన్
    వానల లోన గోపకుల - వాసుల గాచిన శైలధారునిన్
    చానల మేలు బంతి యగు - సత్యయె తన్నిన, సిగ్గు లేని యా
    మానము లేనివానికి న - మస్కృతులం బొనరింతు భక్తితో !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  7. మతము లెన్నియున్న మానవత్వమునేర్పు
    నొక్క నాదు మతమె , యుర్వి లోన
    నున్న వాటి కంటె మిన్నయను దురభి
    మానహీనునకు నమస్కరింతు

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ:

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    విభీషణుడు....

    దీనజనావనుండు నుతధీపరిపూర్ణుడు, ధర్మమూర్తి సం...
    ధానితకార్ముకుండయిన దాశరథిన్ శరణంచు జేర స..
    మ్మానము దక్కు, సత్యమహిమాకృతికిన్, గుణముల్ గణింపగా
    మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. ఎవర దేమి యన్న నింత కోపము రాదు
    మాన హీను నకు : నమ స్క రింతు
    మాన ధనము గలిగి మసలె డు నాత్మ గౌ
    ర వ ము నను సదా విరా జి లంగ

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    నిన్నటి పూరణ :
    ఎడ్డివాడు దలచె చెడ్డను చేయగా :
    __________________________

    ఎడ్డివాడు దలచె - చెడ్డను చేయగా
    గుడ్డివాని యెడల - గొడ్డు వలెను
    మడ్డి వాని చేరి - జడ్డితనము హెచ్చ
    గడ్డిపోచ చాలు - కలహమునకు !
    __________________________
    ఎడ్డి = మోటు, జడ్డి = పిచ్చి, మడ్డి = మూఢుడు

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి

  11. నేటి అల్పజీవి.

    అడిగె లంచ మితడె! నచట ప్రభుత యివ్వ
    వలదు లంచ మనెడు ప్రకటనమిక!
    పని మునుబడ వలెను! పట్టుపట్టనదేల!
    మానహీనునకు నమస్కరింతు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. (చిన్నచిన్న పద్యాలతో పిన్నలకీ పెద్దలకీ అర్థమయేలా సందేశాల
    నందించిన ప్రజాకవి వేమన )

    జ్ఞానము దప్ప నొండొకటి
    జ్ఞప్తికి రాని మహాకవీశుకున్ ;
    దానొక మార్గదర్శియయి
    తక్కువ యెక్కువ లేనివానికిన్ ;
    వైనపు టాటవెల్దులను
    వాసిగ వ్రాసిన మూఢభావస
    మ్మానము లేనివానికి న
    మస్కృతులం బొనరింతు భక్తితో !
    (వైనపుటాటవెల్దులు - తీరైన ఆటవెలది
    పద్యాలు ; మూఢభావసమ్మానము లేని -మొండి భావాలను గౌరవించని )

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    నిన్నటి పూరణ :
    లవకుశులు :
    __________________________

    మిలమిల లాడు చున్నయది - మేలగు నశ్వము బట్టు కొన్నచో
    కలవర మంది రాముడదె - కావగ వచ్చిన వచ్చు గాక మా
    నిలుకడ తోడ గెల్తుమని - నిశ్చితులై సవవాజి బట్టుటన్
    కలహము రేపఁగాఁ దగును - గాలికి లేచెడు గడ్డిపోచయే !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో :
      లవకుశులు :
      __________________________

      మిలమిల లాడు చున్నయది - మేలగు నశ్వము బట్టు కొన్నచో
      కలవర మంది రాముడదె - కావగ వచ్చిన వచ్చు గాక మా
      నిలుకడ తోడ గెల్తుమని - నిశ్చితులై సవనాశ్వమంటన్
      కలహము రేపఁగాఁ దగును - గాలికి లేచెడు గడ్డిపోచయే !
      __________________________

      వసంత కిశోర్ (కవులూరు రమేష్)

      తొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-2)
    నిన్నటి పూరణ :
    గయోపాఖ్యానము :
    __________________________

    బలమదె హెచ్చగా వరము - బ్రహ్మదె యిచ్చిన, క్రింద గానకన్
    గలగల గాలిలో జనుచు - గర్వము మీర, గయుండుమ్మగన్
    జలమున నర్ఘ్యమిచ్చు తరి - చప్పున రాలుట చక్రి దోయిలిన్
    కలవరమంది కృష్ణుడతి - క్రక్కసమైన ప్రతిఙ్ఞ జేసెనే !
    కలహము రేపఁగాఁ దగును - గాలికి లేచెడు గడ్డిపోచయే !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  15. మన్ననలవి యేల మర్యాదలేలయా
    మానహీనునకు; నమస్కరింతు
    మానవత్వము గల మహనీయులకు నేను
    మాన్యులెపుడు వారె మహిని జూడ

    రిప్లయితొలగించండి
  16. మానహీనునకు నమస్కరింతువనగ?
    తప్పదాయె నేటితత్వమంతె!
    గుణముగాదు నేడు గుర్తింపుగలవారె
    కాలమహిమగాదు కలియుగంబు!
    శ్రీ. కె.ఈశ్వరప్ప ఆలూరు

    రిప్లయితొలగించండి
  17. జ్ఞానదుడున్ సుఖప్రదుడు సన్మతిదాతయు రక్షకుండు స్వీ
    యానుగులై చరించెడి మహాత్ములపాలిటి కల్పవృక్ష మా
    దీనజనావనుండు హరి, "దేవర" యన్న యశంబు గూర్చు స
    న్మానము లేనివానికి, నమస్కృతులం బొనరింతు భక్తితో.

    రిప్లయితొలగించండి
  18. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    మాన హీనునకు నమస్కరింతు

    సందర్భము:
    కోన్నస్మిన్ సాంప్రతం లోకే
    గుణవాన్ కశ్చ వీర్యవాన్..
    అంటూ వాల్మీకి ప్రశ్నస్తే నారదుడు
    స చ సర్వ గుణోపేతః
    కౌసల్యానంద వర్ధనః..
    అంటూ రాముడు సకల కళ్యాణ గుణ సంపన్ను డని నొక్కి చెబుతాడు.
    నేతగా..భ్రాతగా.. దాతగా..త్రాతగా.. అన్ని విధాలా పరిపూర్ణుడైన రాముడు.. ఆత్మారాముడు కింది పద్యాల్లోకి అవతరించాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    *మానాష్టపది*

    మాన మతని కేది? మహిలోన నన్యుల
    మాన మతనియొక్క మాన మగును..
    మాన కెల్లవేళ మా రామునకు.. నట్టి
    మానహీనునకు నమస్కరింతు 1

    ఆ యయోధ్య తనదె! అభ్యంతరము లేదె!
    గెలిచె వానర పురి.. గెలిచె లంక..
    నయిన నుంచుకొనడె! ఆ రామునకు, నభి
    మాన హీనునకు నమస్కరింతు 2

    అడవు లెల్లఁ గాలి నడకతోఁ దిరుగాడి,
    యడచినాడె రావణాసురుని, వి
    మాన సహితు.. నట్టి మా రాఘవునకున్, వి
    మాన హీనునకు నమస్కరింతు 3

    నింగిలోన సురలు నిలిచి పూవుల వానఁ
    గురిసినారు.. మరియు మురిసినారు..
    నేలమీద నెపుడు నిలుచు రామునకున్, వి
    మాన హీనునకు నమస్కరింతు 4

    పూని కొలువలేము జేనతో, మూరతో
    వాని గుణము నెపుడు వసుధలోన..
    తూచలేము త్రాసుతో.. రామునకు, తులా
    మాన హీనునకు నమస్కరింతు 5

    కడగి వానియొక్క కళ్యాణ గుణము లి
    న్ని యని చెప్పలేము నిక్కముగను..
    చేరి యభినుతింతు.. శ్రీ రామునకు, నుప
    మాన హీనునకు నమస్కరింతు 6

    ధనదు పుష్పకమును దా గైకొనిన రావ
    ణుని వధించె నద్ది తనదయినను
    బంపె రాము డర్థ పతి.. కట్టి వస్త్వభి
    మాన హీనునకు నమస్కరింతు 7

    ఆత్మయందు వెలుగు నా రామచంద్రుని
    నంటుకొనున వేవి యవని? నట్టి
    జాతి నామ రూప రీతి భాషా ప్రాంత
    మాన హీనునకు నమస్కరింతు 8

    అభిమానము = ధనాదులచే గలుగు గర్వము
    అడఁచు = చంపు, నశింపజేయు..
    విమానము = (పుష్పక) విమానము
    అర్థపతి = కుబేరుడు

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    13.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  19. నేనను నాదనంచు ననునిత్యము స్వార్ధపు చింత గాకయున్
    దీనుల గాచుటన్నెపుడు దివ్య పథమ్ముగ నమ్ము వానికిన్
    దానము జేయగా వెనుక దగ్గని వానికి సుంతయున్నహ
    మ్మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో

    రిప్లయితొలగించండి
  20. ధర్మ యుతము వొందఁ దగు వైభవమ్ముల
    నుత్తముం డనఁబడు నుర్వి వీడ
    నర్థ మందు నాస స్వార్థ రోష దురభి
    మానహీనునకు నమస్కరింతు


    ఈ నరపాల వర్గమున నేను విధేయతఁ జూపి నెమ్మదిన్
    దాన దయాది లోక శుభదాయక రక్షక కర్మ కోటిలో
    ధ్యానము నుంచు సంతత మధర్మ విరోధికి గర్వ మంగుళీ
    మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో

    రిప్లయితొలగించండి
  21. అన్నిశాస్త్రములనునధ్యయనముజేసి
    మనమునందుసుంత మసరులేక
    మసలునట్టిసత్యవంతుడగు దురభి
    మానహీనునకు నమస్కరింతు

    రిప్లయితొలగించండి
  22. సిగ్గులెగ్గులవియచీమంతయుండవు
    మానహీనునకు,నమస్కరింతు
    బరులసేవయందు భక్తిశ్రద్ధలుగల
    వానికెపుడునేనువంగివంగి

    రిప్లయితొలగించండి
  23. కానవుమంచిచెడ్డలిలగానవుబంధుగణంబులనార్తినాదముల్
    మానములేనివానికి,నమస్క్రుతులంబొనరింతుభక్తితో
    మానవసేవయేధరనుమాధవసేవగనెంచువానికిన్
    మానకయాదిదేవునిలమానసమందుననిల్పువానికిన్

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. మానమె ప్రాణమంచునభిమానముతోచరియించువానికిన్
      మానకనెల్లవేళలనుమంచినిజేయుచుమంచిపంచుచున్
      మానవజాతియభ్యుదయమందభిమానముగల్గి యాత్మనే
      మా
      నము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో

      తొలగించండి
  25. కులము జాతి మతము కలిమియు లేమియున్
    గొప్ప కొద్ది విద్య లప్పు సొప్పు
    లిట్టి సంకుచితపు టెరుకలలో కొల
    మానహీనునకు నమస్కరింతు.

    రిప్లయితొలగించండి
  26. ఆటవెలదిలో నా పూరణ
    పదవికై ప రుగిడి పార్టీలు మార్చుచు
    మానహీనునకు నమస్కరింతు
    ననుచు మంటగలిపె నాత్మగౌరవమును
    నట్టి దేశ ద్రోహిఁ నమ్మ రాదె!

    రిప్లయితొలగించండి
  27. ఉ:

    దానము చేయ నెంచ కడు త్రాగుడుగాయలు భిన్నరీతినిన్
    కానుక లందగోరి నట గాయక రూపుల వేశధారణల్
    బోణికి దిర్గుచున్ కనుల భోరున యేడ్చుచు సంచరింపగా
    మానము లేని వానికి నమ స్క్రుతులం బొనరింతు భక్తితో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. ఆటవెలది

    పదవికై ప రుగిడి పార్టీలు మార్చుచు
    మానహీనునకు నమస్కరింతు
    ననుచు మంటగలిపె నాత్మగౌరవమును
    నట్టి హీనుడైన, నమ్మరాదె!

    రిప్లయితొలగించండి
  29. మానములేనివారినభిమానధనుండని యెట్లు జెప్పుటో!
    కానుకగానుయివ్వదగు, కామనగాదుగశీలమన్నచో
    కానిది కాకమానదని,గట్టిగవానితిరస్కరించు నా
    మానములేనివానికి,నమస్కృతులన్ బొనరింతుభక్తితో
    --------------------------------------------------

    రిప్లయితొలగించండి
  30. మానిను లన్న డెందమున మానిత బుద్ధియు సజ్జనాళితో
    బూనెడు స్నేహ బంధమును పూజిత భావము పెద్దలన్నచో
    మానస మందు నెక్కొనగ మంచి పథమ్మున నుండి దుష్ట స
    మ్మానము లేనివానికి నమస్కృతులం బొనరింతు భక్తితో.

    రిప్లయితొలగించండి
  31. నాదినాదియనుచు వాదమించుకలేక
    యేననెడి పదమ్మునెఱుఁగబోక
    యణగిమణగియుండునతిపుణ్యుడు ,దురభి
    మానహీనునకు నమస్కరింతు
    🙏🙏

    రిప్లయితొలగించండి
  32. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
    సమస్యాపూరణ కార్యక్రమంలో...
    14/12/2019 శనివారం ప్రసారమైన నా పూరణ

    సమస్య. :
    **** ****

    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్

    నా పూరణ. శార్ధూలము
    **** *** ***

    వగచే వేడిరి ద్వార పాలకులు శాపమ్మే హరించన్ హరిన్!

    జగదీశుండగు శౌరి చూపె పథమున్ శాపంబు బోగొట్టగన్

    తెగ నిందించగ చక్రి ముక్తి నొసగెన్ త్రెళ్ళించియున్ వారికిన్!

    పగలో మున్గిన వారి పాప చయముల్ భస్మంబు లౌ నెప్పుడున్

    -- ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి

    రిప్లయితొలగించండి