21, డిసెంబర్ 2019, శనివారం

సమస్య - 3227 (చలిపులి పల్కరించఁగనె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్"
(లేదా...)
"చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్"

71 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    మిలమిలలాడు గ్రీష్మమున మీసము త్రిప్పగ చిత్రభానుడే
    జలముల మేఘు డత్తరిని చాపము లీనుచు పారిపోవగా
    కిలకిల నవ్వుచున్ రతపు క్రీడకు రమ్మని కన్నుగొట్టుచున్
    ౘలిపులి పల్కరించగనె ౘయ్యనఁబారె సహస్రరశ్మియున్...

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కులుకుచు కాలు దువ్వుచును కూరిమి జూపుచు శీతకమ్మునన్
    బలుపగు పంజ చూపుచును బంజర హిల్సున గాండ్రుపెట్టుచున్
    వలపులు మీర రమ్మనుచు వంకర టింకర చేష్టలొల్లుచున్
    ౘలిపులి పల్కరించగనె ౘయ్యనఁ బారె సహస్రరశ్మియున్

    రిప్లయితొలగించండి
  3. కలువలు వికసించు ఘడియ
    జలజలమని రాల తుహినజాలము భువిపై
    జలజములు తలలువంచగ
    చలిపులిగని వేవెలుంగు చయ్యనబారెన్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    ఐదవ ఝాములో :
    __________________________

    కలుహారము కనువిప్పెను
    చలిపులిఁ గని వేవెలుంగు - చయ్యనఁ బాఱెన్ !
    కొలనున వెన్నెల మిలమిల
    జలజములే వాడి పోయె - సరసిని జూడన్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  5. అలుకను మానుమిక సఖీ
    చలిపులిఁ గని; వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
    నులివెచ్చగ కప్పుకొనెద
    నెలతుక రావే సరసకు నెయ్యము బారన్


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. అలిగితి వా సఖీ ప్రియతమా! అలుకన్ సరి మానవే వయా
    రి! లలిత మైన రాత్రి యిదె రివ్వున నాదరి రా! జిలేబి! నీ
    పలుకుల తీపు గాత్రమగు పారునికై చెలి రావె రావె! ఆ
    చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "అలిగితివా? సఖీ! ప్రియ! అలుక మానవా?" పాటను గుర్తు చేసారు.

      తొలగించండి


  7. ఆకాశవాణి కి పంపినది :)


    విలవిల లాడి చిక్కగను భీకర కోరల ధాటి చీల్చుచున్
    దులుపుచు జూలు గుర్రనుచు దూకగ చట్టని పైన, పారెనా
    చలి, పులి పల్కరించగనె, చయ్యన పారె సహస్ర రశ్మియున్
    జలజల పారగా కనుల చందిరమయ్యరొ వీడె స్వప్నమే



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    భార్య కోపము సహస్ర సహస్ర రశ్ములకు సమానం : :
    __________________________

    వలపది నీకు లేదనుచు - భర్తను దూరము నెట్ట వెంటనే
    యలుకను దీర్చ నార్యుడదె - హాటక హారము దెచ్చి యిచ్చినన్
    పొలుపున ప్రేమ హెచ్చుటను - పొంద సుఖంబును, భర్త కౌగిలిన్ !
    చలిపులి పల్కరించగనె - చయ్యన పారె సహస్ర రశ్మియున్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  9. వలపుల కౌగిలింతలకు వారిజ నేత్రి శుభోద యమ్మునన్
    పులకిత మైన మేను పరిపోషణ జేయగ కోరినంతనే
    ఫలితము చూడ కుండగనె భానుని వేడిమి తాళ లేకనా
    చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్

    రిప్లయితొలగించండి
  10. తెలవారె నంచు నడుగిడి ,

    చలిపులి గని వేవెలుంగు చయ్యన పారెన్,

    వలదొర రగిల్చె గా నిం

    గలము ననుచు పతి పిలచెను గాదిలి నపుడున్

    రిప్లయితొలగించండి
  11. చలికాలమందున వలయు
    వలువలను తొడిగిన గూడ వదలని రీతిన్
    నలిపెట్టుచుండి యుండిన
    చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్

    పారు = ప్రసరింౘు

    రిప్లయితొలగించండి
  12. కలతలు రేపకు చెలియా
    వలపుల వెన్నెల సౌరులు వంచన జేయన్
    కలసిన మనసుల ప్రేమను
    చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్

    రిప్లయితొలగించండి



  13. చలిపులియన్నమార్గడియె,సంక్రమణంబగురాశిచక్రముల్,
    వలచినరంగనాధునుని పాటన సేయగ మాలలల్లుచున్
    పలికెడి పాశురంబులవి భక్తుల పాలిట సంధికాలమై
    చలిపులి పల్కరించగనె చయ్యన
    బారెసహస్త్రరశ్మియున్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ రంగారెడ్డి


    రిప్లయితొలగించండి
  14. అలఘు ముదంబు గూర్చు "హరియాణము" రాష్ట్రములందు మేటియై
    నిలిచితి నైదువర్షములు నిష్ఠను బూనుచు నందు వర్షముల్
    కలుగుట యబ్బురంబు, బహుకాలము గ్రీష్మమె నిండియుండి యా
    చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్.

    రిప్లయితొలగించండి
  15. మలమల మాడ్చఁ భాస్కరుడు మైత్రము నందున గాంచి క్రుద్ధుడై

    తొలకరి జువ్వరించగను ద్యుమ్నము తగ్గిన వృద్ధ భానుడే

    విలవిల లాడువేళ భువిఁ వేడ్కగఁ జేరిన సీతుకందువౌ

    చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్.

    . - విరించి.

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    శంకరాభరణం.. సమస్యాపూరణం

    చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున

    ఇలకు మరింత దగ్గరగ నీవు చరించి దహించునట్టి యెం..
    డల సమయమ్ము కాదిదినుడా! వలపుల్ రగిలింతు నే జనా...
    వలులకు., మిత్ర! జాలి గనవా! యని చేతులు మోడ్చి మ్రొక్కుచున్
    చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. ఉదయము పదకొండు గంటలైనా వీధుల్లో మంచుకురుస్తుండడంతో సూర్యుడు కనిపించక పోవడం వల్ల ఎదుట ఏముందో తెలియనంతటి చలి దేశాల్లో ఉదయానంతరం ఒక శ్రీమతి తన శ్రీవారితో....

    చంపకమాల

    జలజల ధారగా హిమము జారుచు నుండెడు కుండపోతతోఁ
    జలిపులి పల్కరింపగనె చయ్యనఁ బాఱె సహస్ర రశ్మియున్
    విలవిలలాడుచున్ వడకి వేదనఁ జెందితె రాతిరంతయున్
    గొలువుకుఁ బోదు రెట్లు? పదకొండయినన్ గనరావు వీధులున్!

    రిప్లయితొలగించండి
  18. చెలరేగి గ్రీష్మమందున
    నలసిన రవిపై జలపతి యలకయె బూనన్
    బలహీనుండై శీతపు
    చలిపులిఁగని వేవెలుంగు చయ్రనఁ బాఱెన్

    రిప్లయితొలగించండి
  19. మలయ సమీరము వీచెను
    కలవర పాటున రవియును కను మరు గ య్యెన్
    విలవిల లాడెను జీవులు
    చలి పులి గని వే వెలుగులు చయ్యన బాఱెన్

    రిప్లయితొలగించండి
  20. వలపుల వానలోదడిసె ,వారిజనేత్రులు విస్తుబోవగా
    కులుకులుకుమ్మరించుచును,కూనలుతోడుగవచ్చిరందరున్
    పిలిచినబల్కు రాగములు, పిన్నలుపాడగ సుప్రభాతమున్
    చలిపులిపల్కరించగనె ,చయ్యన బారె సహస్రరశ్మియున్
    ********************************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  21. గిలగిల కొట్టుకొంచు తెగ
    గింజుకొనంగగ జేయు మారియున్ ;
    మెలికల ద్రిప్పుచున్ జనుల
    మేనుల స్వారిని సల్పు మాయయున్ ;
    బలుపగు నున్నిదుప్పటుల
    బారుల నన్నిటినిన్ జయించు - నా
    చలిపులి పల్కరించగనె
    చయ్యన బారె సహస్రరశ్మియున్ .

    రిప్లయితొలగించండి
  22. వెలుగులుజిమ్మువేదికలు, వెల్లలువేసినరీతిమారెలే
    కలుగులదాగుకోరికలు,కాలపువహ్నినగాలె బూడిదై
    ములుకులగుచ్చెయమ్మకిట, ముద్దుగగోరుచు నాంగ్లభాషనే
    చలిపులిపల్కరించగనె ,చయ్యనబారె సహస్రరశ్మియున్
    +++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  23. తెలతెలవార మంచుతెర దిక్కుల నిండ వడంకుచున్ జనుల్
    వెలుపల సంచరింపక తపింపఁ గడున్ నెగడుల్ రచించి వే
    వెలుఁగు ప్రభూతుఁడౌ ననుచు వేచిన వేళ హిమాని రూపమౌ
    జలిపులి పల్కరించగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్.

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  25. ఛలికి హిమాంశు శేఖరుడు జాతశృతీయుతనేత్రుడై చనెన్
    కలితవినీలతన్వియు నఖండ సహస్ర ఫణాభి రక్షతన్
    నిలిచె మహోగ్ర శీతల వినీతులు గాక జనంగ శక్యమే
    చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్"

    రిప్లయితొలగించండి
  26. వచ్చేవారం ఆకాశవాణి వారి సమస్య...

    *దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్*

    గురువారం సాయంత్రం లోపల చేరేటట్టుగా
    Padyamairhyd@gmail.com కు పంపవలెను.

    రిప్లయితొలగించండి
  27. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారం:

    చలిమలనుండివీచు చలిగాడ్పు వణంకగజేయనెల్లరున్
    చలనములేని చిత్తరువుచందముదుప్పటులందుమున్గి యే
    ఫలితముగానరాక నభపాంథుడె దిక్కని చూచునంతలో
    చలిపులి పల్కరించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్

    రిప్లయితొలగించండి
  28. మెలకువ రాదు వేకువను మెల్లగ జారెను నీమ నిష్ఠలున్
    తలపులనైన దైవమును ధ్యానము జేయగ దల్పనద్దియున్
    చలిపులి పల్కరించగనె చయ్యన పారె; సహస్ర రశ్మియున్
    వెలవెలబారె మింట దన వేడిమి దగ్గెను శీతకాలమున్
    (ఆకాశవాణికి పంపినది)

    రిప్లయితొలగించండి
  29. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
    సమస్యాపూరణ కార్యక్రమంలో...
    21/12/2019 శనివారమైన నా పూరణ

    సమస్య. :
    **** ****
    ౘలిపులి పల్కరించగనె ౘయ్యనఁ బారె సహస్రరశ్మియున్*

    నా పూరణ.  చంపకమాల
    **** *** ***

    చెలయుచు విస్తరిల్లు భువి శీతలమే చలికాలమందునన్!

    విలవిలలాడదే తనువు వేదనజెందుచు మిక్కటమ్ముగన్

    ౘలిపులి పల్కరించగనె?.... ౘయ్యనఁ బారె సహస్రరశ్మియున్

    విలసిత దేహ కాంత నులివెచ్చని కౌగిట జేరినంతటన్!

    --  ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి



    రిప్లయితొలగించండి
  30. చం:

    తెలతెల వారు చుండ నది తీరము వెంబడి సంచరింపగన్
    జలజల పారు నీరు మది చక్కని ఊహల నోల లార్చ నే
    పలుకులు రాని చందమున ప్రాంతము వీక్షణ గాంచుచుండ గా
    చలిపులి పల్క రించగనె చయ్యన పారె సహస్ర రశ్మియున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  31. 21/12/2019
    గురువులందరికీ నమస్సుమాంజలి 🙏🙏

    *చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్*

    *కం:||*

    చలి తనువున పెరుగుట యా
    చలిపులిఁ గని, వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
    ఇల నీ శృంగార తళుకు
    కులుకులు జూచుచు నిలబడి కుదురే లేకన్!

    **కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🌸🙏💐🌸🙏

    రిప్లయితొలగించండి
  32. అలికులవేణిచింతిలెనవారితశీతమువ్యాప్తిచెందెనే
    చలిపులిపల్కరించగనె,చయ్యనపారెసహస్రరస్మియున్
    దెలతెలమబ్బుదొంతరలుదివ్యమునందుననోలలాడుచున్
    విలసిలుగాంతిపుంజములువేలకువేలుగనింగిచుట్టలై

    రిప్లయితొలగించండి


  33. మేమే కుంపటి రాజేస్తామండి మాయింట్లో :)


    విలవిల లాడుచు చచ్చితి
    చలిపులిఁ గని; వేవెలుంగు చయ్యనఁ బాఱెన్
    మెలకువ పొద్దుపొడిచిన తృ
    టి లెస్స గా వచ్చె కుంపటిని రాజేయన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. సలసలకాగుదేహమది ,సన్నిహితత్వముగోరుటేలనో?
    వలపులవానలోదడిసి,,వాసిని బొందిన ప్రేమపక్షులే
    తెలతెలవారిపోయినను,తేరగముద్దులతేలుచుండ యా
    చలిపులిపల్కరించగనె ,చయ్యనబారె సహస్రరశ్మియున్
    ***********************************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  35. కొలఁకులఁ దామర తండ
    మ్ములు వికసించఁ బ్రవిమల నభోమార్గములో
    నలయక ధిక్కారమ్మునఁ
    జలిపులిఁ గని, వేవెలుంగు చయ్యనఁ బాఱెన్


    నలుదిశ లందుఁ గ్రమ్ముకొన నాకము నంటుచు నంధకారమే
    వెలవెల వోవ పద్మములు పిన్నలు పెద్దలు చూచు చుండగం
    గలవర మంది యబ్బురముగం బగ లక్కట సైంహికుండు గ్రొం
    జలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్

    రిప్లయితొలగించండి
  36. వెలుపలలోకమంతయును,వేదికయాయెనుమంచువానకున్
    కులుకులుమానివేయుచును ,కూటమిగట్టితలొంచె పూవులే
    సలసలకాగు దేహములు,సంగమతత్వము వీడకుండగా
    చలిపులి పల్కరించగనె ,చయ్యనపారె సహస్రరశ్మియున్
    ++++++++++++++======
    రావెలపురుషోత్తమరావు




    రిప్లయితొలగించండి
  37. సమస్య: చలిపులి పల్కరించగనె చయ్యన బారె సహస్రరశ్మియున్ (ఆకాశవాణి)
    చ: పులకలు రేపె మంచుతఱి పుష్కరమున్ రవి నిష్క్రమించ వే
    చలిపులి పల్కరించగనె చయ్యన బారె సహస్రరశ్మియున్
    వలపుల రాజు వేగముగ బాణములన్ విడువంగ యామినిన్
    చెలి దరిచేరె వల్లభుడు సీత భయమ్ముఁ బాప నెంచుచున్

    రిప్లయితొలగించండి
  38. చలిమలకేగివచ్చితిని,చారునగమ్మున భీతిజెందితిన్,
    తలపుల తన్నుకొచ్చితివి,తాపసినైతిని వెంటవెంటనే
    చిలుమును తుప్పునే వదలజేయుము,చెంతకువచ్చినంతనే
    చలిపులిపల్కరించగనె,చయ్యన బారె సహస్రరశ్మియున్
    --------------------------------------------

    రిప్లయితొలగించండి


  39. తెలవారి టీ సరసనా
    జిలేబి గొని దానితోడు చిన్నగ విజిలే
    యు లలన్తికాసమస్యల
    చలిపులిఁ గని వేవెలుంగు చయ్యనఁ బాఱెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. అలికులవేణియెభీతిలె
    చలిపులిగనె,వేవెలుంగుచయ్యనబాఱెన్
    వెలుగులఱేనింగనుగొని
    నిలనరయుముసూర్యచంద్రులిరువురుసఖులే

    రిప్లయితొలగించండి

  41. పిలువగ నెచ్చెలీ మధుర వీణియ రాగ సరాగ గీతికల్
    వలపుల పండుగల్ సలిపె పాయని వేడుక ప్రేమికుండు ఆ
    చలిపులి పల్కరించగనె; చయ్యన పారె సహస్రరశ్మియున్
    మిలమిల లాడు మేఘముల మేలి ముసుంగు ధరించెనో యనన్.



    రిప్లయితొలగించండి
  42. విలవిలలాడు మేనులకు వేడియొసంగును నూలువస్త్రముల్
    చలిపులి పల్కరించగనె, చయ్యన బారె సహస్ర రశ్మియున్
    కలువల ఱేనిరాకగని కమ్మగ చీకటి లోకమందునన్
    కులముగ పక్షులన్నియును గూళ్ళకు బోవుచునుండె మిన్నునన్!!!

    రిప్లయితొలగించండి
  43. చం. వెలుగులతో ప్రభాకరుడు వేసవి తాపము చింది నంతటన్
    ఫలము లొసంగ రైతునకు, వర్షము గోరుచు నూరడిల్ల నా
    కలుముల గూడి వచ్చు హిమ కాంతకు జిక్కె గదయ్య! చూడగా
    చలిపులి పల్కరించగనె చయ్యన బారె సహస్ర రశ్మియున్

    రిప్లయితొలగించండి
  44. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "చలిపులి పల్కరించఁగనె చయ్యనఁ బాఱె
    సహస్ర రశ్మియున్"

    సందర్భము:
    "న హ్యహం జీవితుం శక్త
    స్తా మృతే జనకాత్మజామ్.."
    సీత నెడబాసి నే నెంతమాత్రం జీవించలేను.
    (కి.కాం. 1-113)
    ధరణీపుత్రి నెదం దలంచుకొని హృత్సంతాప మంతంతకున్ బెరుగన్ బెక్కు తలంపు లూరగ గడున్ భీతిల్లి కామవ్యథాతురతన్ హా తరుణీమణీ యనుచు నెంతో పారవశ్యంబు నొంది రయంబార ముహూర్త మాత్రమునకున్ దె ల్వొంది తా గ్రమ్మఱన్
    గోపీనాథ రామాయణం.. కి.కాం.726
    సీతా వియోగంతో విలపించే రాముణ్ణి చూసి నింగిలోని దేవత లిలా సంభాషించుకుంటున్నారు.
    "ఆడపిల్లలాగా ఏడుస్తున్నా డేమిటి రాముడు?"
    అంటే మరొక వేల్పు అంజలి ఘటించి ఇలా అన్నాడు.
    "అది స్త్రీసహజం. ఎందుకంటే తాను *లలితా స్వరూపుడు* గదా! ఐనా ఈ దుఃఖం కొద్ది సేపే వుంటుందిలే!
    స్త్రీవియోగ మనే చలి రాగానే సహస్రరశ్మి (సూర్యుడు) పారిపోయాడు. (అని అనిపించినా అది కొద్దిసేపే! కొంచెమే.. అని పైన పేర్కొనబడింది. అంటే యథావిధిగా సూర్యుడు ప్రకాశిస్తూనే వుంటాడు శాశ్వతంగా..చింతించే పనిలేదు.)
    ఇదంతా లోకాన్ని భ్రమింప జేయటానికే! మంచు తెరలు శాశ్వతంగా వుండవు. కాసేపటికి కదలిపోతాయి సూర్య ప్రకాశం అధికతర మయ్యేకొద్దీ.. అని తాత్పర్యం..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "లలనవలెన్ విలాపమును
    రాము డొనర్చు ని దేలొ!".. యన్న నం
    జలి ఘటియించి "స్త్రీకి సహ
    జం బది తా *లలితా స్వరూపుడౌ*
    నిల" ననె వేలు పొక్కరుడు
    "నీ వెత కొంచెమె! స్త్రీ వియోగ మన్
    జలి పులి పల్కరించఁగనె
    చయ్యనఁ బాఱె సహస్రరశ్మియున్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    21.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  45. కులికెడు భారతమ్మునిట కూల్చగజూచెడు ద్రోహచింతనల్
    పలుకునతేనియల్నొసగు,పావనధాత్రిని బాధపెట్టుచో
    మెలకువవచ్చినంతనిక,మేదిన వారికి ,నూకలుండునా?
    చలిపులిపల్కరించగనె, చయ్యను బారు సహస్రరశ్మియున్

    రిప్లయితొలగించండి