25, డిసెంబర్ 2019, బుధవారం

సమస్య - 3231 (చీకటియే వెలుంగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే"
(లేదా...)
"చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా"

123 కామెంట్‌లు:




  1. మూకుమ్మడిగా నరుడా
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిది యే
    తేకువయున్ కాదు సుమా
    యీ కలి కాలంపు జీవి యిక్కట్ల గనన్



    జిలేబి

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    వేకువ జామునన్ పవరు వేడుక మీరుచు పారిపోవగా
    పీకగ దోమలే జతలు ప్రీతిని పోవగ మిద్దెమీదికిన్
    కూకట పల్లినిన్ వెలుగు కోటుల తారల మిన్కుమిన్కులన్
    చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా

    రిప్లయితొలగించండి


  3. చీకాకులు తొలగును సు
    మ్మీ కష్టములే స్థిరమని మీరనుకోకం
    డీ! కరుణామయు దయ చన
    చీకటియే, వెలుఁగు నిచ్చు జీవిత మిదియే


    ఆమెన్
    ప్రభువు దయ యెల్లరికీ వుండు గాక

    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. ప్రభువా ! అందరిని కాపాడుమా


    ఆకస మందు గాన్పడు సమాకలితమ్ముగ వెల్గురేకలే!
    మీకిక కష్టముల్ తొలగు ! మిన్నుల మీరు కృపాళు ప్రీతితో
    మీకడ గండ్ల తేర్చును సుమీ! యిది క్రిస్మసు వేళ పాఱునా
    చీకటియే! వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. కస్తూరి శివశంకర్బుధవారం, డిసెంబర్ 25, 2019 12:55:00 AM

    చీకాకుల జీవనమున
    చీకటియే; వెలుఁగు నిచ్చు జీవిత మిదియే
    మైకము వలలో మనుజులు
    లౌకిక విషయాల చింతలను విడువగనే

    రిప్లయితొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బైబులు ప్రవక్త (Courtesy: RK Narayan in "My Days")

    "ప్రాకుచు నేలనున్ విరివి పాపము లందున చచ్చు హిందువుల్!
    మీకిక మోక్షమివ్వగను మిక్కిలి వేడ్కను మేము క్రీస్తునిన్
    రాకను బెత్లెహామునను రాతిరి వేళను వేచియుండగా
    చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా"

    రిప్లయితొలగించండి
  7. అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
    *చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే"*

    *కం:*

    లోకము పోకడ లెపుడూ
    చీకటియే, వెలుఁగు నిచ్చు జీవిత మిదియే,
    నే కష్టము లొచ్చిననూ
    భీకరమగు కలతలన్ని వీడిన నిలలోన్!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏ కనులు లేని వాడికి
      చీకటియే వెలుఁగు నిచ్చు, జీవిత మిది, యే
      లోకపు కుట్రలు కానగ
      రాకనె బతుకున పెరుగును సంతస సుఖముల్

      తొలగించండి
    2. మూడవ పూరణము 🙏🙏

      చీకటి చీకటి యనినను
      చీకటి యేవెలుఁగు నిచ్చు? జీవిత మిది, యే
      చీకటి చీకటి కాదని
      చీకటికే యెదురు బోయి జీవించ దగున్
      🙏🙏

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో... "పోకడ లెప్పుడు... జీవితమిదియే। యే కష్టమ్ములు వచ్చిన..." అనండి.
      రెండవ పూరణ చివరిపాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !
    https://www.youtube.com/watch?v=wXDEANzTot0
    A-1)
    చందమామ మసకేసి పోయే :
    __________________________

    నీకిక నే లేననుచును
    ప్రాకటముగ మెట్టినిల్లె - పార్వతి పోవన్
    శోకించు దేవదాసుకు
    చీకటియే వెలుఁగు నిచ్చు - జీవిత మిదియే !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  9. ఆకలి బాధలు తప్పును
    మాకిక వేయంగ నోట్లు మాదయ కలుగన్
    మీ కలలు పండును సుమా
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. మా కరుణామయుని జనన
    మీ కాలమగును దయాళు మీకై వచ్చున్
    వేకువ జామగు తొలగును
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. లోకేశుడు కలడా పెం
    జీకటి కావల యతనము చేయగ నాతం
    డే కృప చూప తొలంగును
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. A-2)
    గ్రుడ్డి కన్న మెల్ల మేలు :
    __________________________

    లోకము గనలేని జనుల
    చీకులనుచు లోకులంత - చీకొట్టెదరే
    కాక,నికన్ మేలే, రే
    చీకటియే వెలుఁగు నిచ్చు - జీవిత మిదియే !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాక యిలన్' అనండి.

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      సవరణతో :
      A-2)
      గ్రుడ్డి కన్న మెల్ల మేలు :
      __________________________

      లోకము గనలేని జనుల
      చీకులనుచు లోకులంత - చీకొట్టెదరే
      కాక యిలన్ మేలే, రే
      చీకటియే వెలుఁగు నిచ్చు - జీవిత మిదియే !
      __________________________

      వసంత కిశోర్ (కవులూరు రమేష్)

      తొలగించండి


  13. ఓ బ్యాచిలర్ శోకము :)


    ఆ కన్బొమ నచ్చెన్! పే
    చీ, కటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే?
    ఆ కాణేలిని చూడగ
    నా కర్షణయే తొలంగె నా లావు గనన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ ప్రత్యేకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  14. A-3)
    మార్చ నక్షి :
    __________________________

    లోకము గానక మసలెడు
    చీకులకును మార్చ నక్షి, - చింతల దీర్చు
    న్నేకముగా శూన్యమయిన
    చీకటియే, వెలుఁగు నిచ్చు - జీవిత మిదియే !
    __________________________
    ఏకముగా = ఒకేసారి

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  15. పాకిస్తానుని కలదా
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే
    మాకు భరతభూమియె! షా
    జీ! కావుడి మమ్ము కాందిశీకులమయ్యా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. A-4)
    తెగె పేచీ :
    __________________________

    ఆ కాంత కక్ష్య కావలె
    నాకున్ కొనమని యన సతి - నగుచున్ బతియే
    తా, కొన మేఖల, తెగె పే
    చీ, కటియే వెలుఁగు నిచ్చు - జీవిత మిదియే !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  17. చీకటి లోనైన బతుక
    మా కలవాటని తలచిన మాన్యుల్లారా
    మీకై "యికిగాయి" యిదే
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    Ikigai -

    https://en.m.wikipedia.org/wiki/Ikigai


    జిలేబి


    రిప్లయితొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    భగవాన్ దేవదాసుతో :
    __________________________

    శోకము మానుమింక యని - శోషిలు మిత్రుని నూరడించుచు
    న్న్నేకము నిచ్చె మందనుచు - నెమ్మది మద్యము, నంతె గాక, తా
    జేకొనిపోయి వేశ్య కడ - జిక్కగ జేయుచు జెప్పె నిత్తరిన్
    "చీకటియే వెలుంగు నిడు - జీవిత మిద్ది యటంచు నెంచుమా "!
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  19. లోకములో వింత కలకల
    నేకాకి గమన లేను నిక్కము చెలియా
    నీకోసమె వెతలు పడుచు
    చీకటియే వెలుగునిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, రెండవ పాదాలలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. లోకము వింతల మయమట
      యేకాకి గమన లేను వినుమో చెలియా
      నీకోసమె వెతల నడుమ
      చీకటియే వెలుగునిచ్చు జీవిత మిదియే

      తొలగించండి
  20. ప్రాకటముగ సకల మహీ
    లోకమునా రవి కిరణములు వెలుగొ నర్చున్
    లోకోత్తర దశశత రో
    చీ కటియే వెలుగు నిచ్చు జీవిత మిదియే

    కటి = మధ్య, నడుమ భాగం

    రిప్లయితొలగించండి
  21. B-2)
    సతీసుమతి సూర్యభగవానునితో :
    __________________________

    శోకము నోప లేను పతి - శోషిలి త్రుంగిన లోకబాంధవా
    నాకిక లేదు రక్షణయె - నాపతి ప్రాణము దక్క, నీవికన్
    రాకుము వేకువన్నలిన - రాయడ నీకిదె ప్రాంజలించెదన్
    చీకటియే వెలుంగు నిడు - జీవిత మిద్ది యటంచు నెంచుమా !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  22. వ్యాకులపాటు పొంది "బ్రతుకంతయు కష్టములే, సుఖంబు నా
    కే కరణిన్ లభించు? తపియించెడు నాకిక లేదు లేదు పో
    వేకువ" యంచు దుఃఖపడు వెఱ్ఱివి; తప్పక నిన్ను వీడు నీ
    చీకటియే; వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా.

    రిప్లయితొలగించండి
  23. మైలవరపు వారి పూరణ

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా"

    నీకగుపించు కష్టములనిత్యములౌ., నెదిరింపగానగున్
    తేకువ జూపి., యేలర? మృతిన్ గొననెంచెదు బేలవోలె? రా...
    నీకుము దుర్బలత్వ., మది నిన్ బలి గోరును., మృత్యురూపమౌ
    చీకటి యే వెలుంగు నిడు ?!., జీవిత మిద్ది! యటంచు నెంచుమా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  24. చీకటిని సంహరించుచు
    చీకటి గొంగయుదయించు చిరుకాంతులతో
    చీకటి యశాశ్వతమ్మది
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి
  25. రాకూడదెపుడు , నేతల
    మోకరిలుచు పైకెదుగగ మోదము పడుటన్
    నాకుండిన యజ్ఞానపు
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి
  26. చీకటి ముసిరిన వేళను
    చీకాకులమరచిపోయి చేరెదరొకటై
    లోకములో దంపతులకు
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి
  27. ఆకలి కేకల కడలుచు
    లోకము లో కుములుట గని లోలత తోడ న్
    వీ కము న సాయపడు బె o
    జీకటి యే వెలుగు నిచ్చుఁ జీవిత మిది యే

    రిప్లయితొలగించండి
  28. ప్రాకటమైనఛాయలను బాడిగ చిత్రములట్లు యంత్రమం
    దేకమతిన్ గ్రహించి ముదమేర్పడ ధ్వాంతగృహంబునందు దా
    జేకొని కడ్గువా డనెను శిష్యునితో మనవంటివారికీ
    "చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా"

    రిప్లయితొలగించండి
  29. భీకరమైన సమరమున
    చీకాకులుపెట్టు వైరి సేనలతోడన్
    వీకఁ దాకి వధించిన
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భీకరమైన సమరమున
      చీకాకులుపెట్టు వైరి సేనలతోడన్
      వీకన్ దాకి వధించిన
      చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

      తొలగించండి
  30. చీకటి వెల్గులు జంటలు
    రాకడ,పోకడలు బ్రతుకు రథ చక్రంబుల్
    చేకొన దేవుని మన్నన
    చీకటియే వెలుగునిచ్చు!జీవితమిదియే.

    రిప్లయితొలగించండి
  31. నీకవసరమైన విధము
    నేకార్యము సాహసింప నేకాంతమునన్
    నేకైక త్రోవ బహుమతి
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి
  32. ఆ కంజాక్షుని మాయయె
    చీకాకులబెట్టు జనుల,జిత్తముధృఢమై
    శ్రీకాంతుని జపియించిన
    జీకటియే వెలుగునిచ్చు జీవితమిదియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాకటమైన సత్యమిది ప్రాణులకెల్లను చక్రరూపమున్
      వేకువ రాత్రియట్లు సుఖదుఃఖము లెప్పుడు వచ్చిపోవునే
      చేకురు శాంతిసౌఖ్యములు చిత్తమునందున ఙ్ఞానమేర్పడన్
      జీకటియే వెలుంగునిడు జీవితమిద్ది యటంచునెంచుమా

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యోస్మి గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
  33. చీకాకులెన్నియున్నను
    నేకాంతముభగ్నమైన నిరువురునొకటై
    మైకములోబడిదేలగ
    చీకటియేవెలుగునిచ్చుజీవితమిదియే

    రిప్లయితొలగించండి
  34. నాకమదేలనే చెలియ నామది దోచిన కోమలాంగి యా
    చీకటి గొంగ క్రుంగగనె చేరుము నర్తన శాలఁ జేరినన్
    జేకురు రాణివాసమది సింహ బలుండ ననుగ్ర హింప నీ
    చీకటియే వెలుంగునిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా!

    రిప్లయితొలగించండి
  35. ఉత్పలమాల
    చేకొని కార్యభారముల శ్రీకరు నెంచుచు నర్పణంబుగన్
    జేకురు మంచి చెడ్డలను చింతన జేయక సాగుచుండినన్
    నీకది శక్తిగూర్చి నిను నేర్పరి జేయఁగ వీడి పోవు నా
    జీకటియే, వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా!

    రిప్లయితొలగించండి
  36. కందం
    నీకగు నోటమి దల్చుచు
    సాకిన వారల మఱచుచుఁ చావగ తగునే?
    లోకము మెచ్చగ సాగిన
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి
  37. రిప్లయిలు
    1. ఆకలి లేములే కలిమి నందగఁ జేయును, మృత్యువే తగన్
      బ్రాకట జన్మహేతువగు, ప్రజ్ఞ నపారమొనర్చు నజ్ఞతల్,
      వ్రేకటి గాసియే శిశునవీనభవమ్మునొసంగు, నట్లు పెం
      జీకటియే వెలుంగు నిడు, జీవిత మిద్ది యటంచు నెంచుమా.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  38. కం.

    వేకువ జామున చదువన
    ప్రాకును జ్ఞానము మనసున పదిలము గానున్
    నౌకరి దప్పక దగులును
    చీకటి యే వెలుగు నిచ్చు జీవిత మిదియే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  39. చీకటి తొలగిన వెన్కనె
    వేకువ కనువిందు జేయు విధముగ దెలియన్
    నీ కలలకు ప్రేరకమగు
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి
  40. ఆకలి బాధఁబాపుటకు నద్భుతమౌ వ్యవసాయ పద్ధతుల్
    చేకొనె రైతు,రోగముల చింతయుఁ బోగఁనవీన వైద్యమే
    వేకువ యంచు హత్తుకునెఁ విశ్వముఁ,జూడగఁ పీడనమ్మునన్
    జీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చీకటి కుటి విటుల తనువు
      లాకటి నైవేద్యమైన యామెకుఁ గలదా
      వేకువ?పగలే పగగొనఁ
      జీకటి యే వెలుఁగు నిచ్చు? జీవిత మిదియే?

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      అవసరం లేని చోటుల్లో అరసున్నలు పెడుతున్నారు.

      తొలగించండి


  41. ఓ కాశీనాథ! బతుకు
    చీకటి! యే వెలుఁగు నిచ్చు జీవిత మిది? యే
    కాకి బతుకాయెనయ తం
    డ్రీ! కవళమ్మునకు గడిగడిని పడిగాపుల్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  42. కాకు విరాగివి తీరును
    శోకములు ముదమ్ము లొదవు సూర్యోదయమే
    నాకము నందు నశించఁగఁ
    జీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే


    కూఁకటి వేరు లెల్ల భువి గూలిన చందము జంతు కోటిలోఁ
    బ్రాకట మౌను జావు గన రాదిక శోకము నందు మున్గఁగా
    రాకలు పోక లెల్ల నవిరామము కల్గును భావి యింక పెం
    జీకటి యే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా

    రిప్లయితొలగించండి
  43. మాకివె మంచి రోజులని మాయలెరుంగని రైతులందరున్
    చేకొనమంచు భూములను జెల్వుగ నిచ్చిరి రాజధానికై
    యా కలలన్ని కల్లలగు యత్నములన్నియు భగ్నమౌను యీ
    చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా

    రిప్లయితొలగించండి
  44. చీకటిలో చేడియఁ గని
    ప్రాకటమౌ వాంఛ పుట్టె పతిదేవునికిన్
    రేకెత్తిన విరహములో
    "చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే"

    - విట్టుబాబు

    రిప్లయితొలగించండి
  45. పార్థా!

    ఉత్పలమాల
    సాకిన తాత, విద్యలను జాలగ నేర్పిన నొజ్జలాదిగన్
    ప్రాకటమొప్ప యుద్ధమునఁ బాల్గొన వీడెద నంచుఁ బల్కితే
    నీకిట గీతఁ జెప్పితిని నేర్పున సాగుమ! వీడు మోహమన్
    జీకటియే! వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా!

    రిప్లయితొలగించండి
  46. వ్యాకులబాటునొందునెడబంధుజనంబులయండనుండుచో
    చీకటియేవెలుంగునిడుజీవితమిద్దియటంచునెంచుమా
    శోకముగల్గుచోహరినిశుద్ధమనస్సునవేడుకొన్నచో
    జీకటియేవెలుంగినిడిజీవితచక్రముమారజేయునే

    రిప్లయితొలగించండి
  47. లోకమునందజ్ఞానము
    చీకటియే, వెలుఁగు నిచ్చు జీవిత మిదియే
    వేకువయను విజ్ఞానము
    చీకటిఁ దొలగంగజేయచిరుదీపమ్మై

    రిప్లయితొలగించండి
  48. శోకముశాశ్వతంబనకు, సౌఖ్యము లెప్పుడు నుండ బోవు, మా
    యా కలితంబులీ గతము లాగతము ల్బహుచక్ర బంధముల్
    తేకువ గల్గి నెమ్మదిని ధీయుతుడైన , దొలంగధీ రతన్
    చీకటియే, వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా"

    రిప్లయితొలగించండి
  49. తేఁకువతో మెలంగుటయు తీయనితేనియ పల్కరింపులున్
    లోకులకష్టనష్టములలో తగురీతిసహాయమిచ్చుటల్
    వ్యాకులపాటునున్న తన వాక్కుల మైమరపింపజేయుచో
    "చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది యటంచు నెంచుమా

    రిప్లయితొలగించండి


  50. లోకంబులదేదైనను
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిది యే
    లోకంబునగన లేమోయ్
    స్వీకారముచేయగా భువిని మాత్రమ్మే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  51. (అర్ధరాత్రి అందరిని విడచి అడవికి వెళ్ళుతున్నసిద్ధార్థుడు సారథి చెన్నుడితో )
    లోకమునందునన్ మదము
    లోభము కామము క్రోధమోహముల్
    వాకొనరాని మత్సరము
    భస్మమొనర్చుచునుండె జీవులన్ ;
    నే కనుగొందు ముక్తి;నిక
    నేత్రములందున నీరు నింప;కీ
    చీకటియే వెలుంగునిడు;
    జీవితమిద్ది యటంచు నెంచుమా!!

    రిప్లయితొలగించండి
  52. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    చీకటియే వెలుంగు నిడు జీవిత మిద్ది
    యటంచు నెంచుమా

    సందర్భము: భిక్షు రూపంలో హనుమంతుడు రామలక్ష్మణులవద్దకు వెళ్ళి తాను సుగ్రీవుని మంత్రి నని చెప్పి వారి వివరా లన్నీ కనుక్కున్నాడు. సుగ్రీవుని పరిస్థితీ చెప్పినాడు. వానర రూపంలో వారిని మూపున నెక్కించుకొని వచ్చి పరిచయం చేయగా సుగ్రీవుడూ సంతోషించినాడు.
    హనుమ జమ్మి కొమ్మలను చిలికి నిప్పు పుట్టించి పూలతో పూజించినాడు. రామ సుగ్రీవుల నడుమ నుంచినాడు.
    తతోఽగ్నిం దీప్యమానం తు
    చక్రతుశ్చ ప్రదక్షిణమ్
    సుగ్రీవో రాఘవ శ్చైవ
    వయస్యత్వ ముపాగతః
    కి.కాం.5-16
    అంత సుగ్రీవుడు రాముడు చేతులు పట్టుకొని మండే అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా స్నేహం చేసినారు..
    అప్పుడు హనుమంతు డిలా అన్నాడు సుగ్రీవునితో..
    "ఇప్పటి జీవితం కొత్తది. వెలుగు నిచ్చేది. కరుణా మయుడైన ఈ రాముడు మన పుణ్యవశాత్తు (మిత్రుడుగా) లభించినాడు.
    ఇక నీవు చింతించే పనే లేదు. రాముడు మనవాడైనాడు. ఈ విధమైన పోకడ (నడవడి) మేలైనదే!
    అప్పటి జీవితం గడచిపోయింది. అది చీకటినే పంచింది."
    కాకతాళీయంగా కాదు. పుణ్యం చేసుకుంటేనే పరమాత్ముడు లభిస్తాడు. నీ బరువుబాద్యతలు వహిస్తాడు. అని భావం.
    పరమాత్ముడు మిత్రుడైనా అందరు మిత్రులలాంటి వా డని పొరపడరాదు. అతడు రక్షకు డని మరచిపోరాదు.
    పోకడ = గమనం, వర్తనం
    ఈ పోకడ మేలగున్.. ఈ దారిలో పోవడం మేలగును.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *పవిత్ర మైత్రి*

    ఈ కరుణామయుండు మన
    కిప్పుడు పుణ్యవశాన దక్కెలే!
    నీ కిక చింత లే దనుట
    నిశ్చయమౌ.. మనవాడు రాము.. డీ
    పోకడ మే లగున్.. గడచి
    పోయిన దప్పటి జీవితం బిడెన్
    జీకటియే! వెలుంగు నిడు
    జీవిత మిద్ది యటంచు నెంచుమా!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    25.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  53. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే"

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ప్రాకటమైన యవిద్యయె

    చీకటి.. విద్య వెలుగౌను.. చిరసుఖమునకై

    వాకొనఁ దొలగదగిన దా

    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    25.12.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  54. శోకంబదేల తెలుపుము
    చీకటి వెలుగులు సహజము జీవుల కెల్లన్
    వేకువ యైనంతట నా
    చీకటియే వెలుగు నిచ్చు జీవిత మిదియే

    రిప్లయితొలగించండి