6, జనవరి 2020, సోమవారం

సమస్య - 3243 (ముదితా! పాడ్యమి నాఁడె...)

కవిమిత్రులారా,
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్"

54 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:
    +
    ఆటవిడుపు పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చదువుల్ చెప్పెడు శంకరార్యవరులే జంబమ్ముగా నీయగన్
    మదినిన్ తొల్చు సమస్యనున్ కటకటా మాన్యమ్మునౌ తీరునన్
    పదిరోజుల్ గడువంగ సంబరమునన్ పాడ్యమ్ము పోవంగనో
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సంబరము జూపన్ వచ్చు, నేడో కనన్ ముదితా! పాడ్యమి; నాడె..." అంటే అన్వయం కుదురుతుందేమో?

      తొలగించండి

  2. గోవిందా గోవిందా


    మదియే మూలము ప్రార్థనల్ సలుప ప్రామాణీకమా పోలి గా
    ధ!దశాకర్షము నూలుకొల్పగను ప్రాధాన్యమ్ముగా ముక్తికై
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్; ముక్కోటి యేకాదశిన్
    ముదమారంగను వేంకటేశ్వరుని ప్రాముఖ్యమ్ముగా కొల్వుమా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఈ కథ ఓల్డ్ కథేనా లేక మాడర్న్ పోలియా ?

      https://www.google.com/amp/s/telugu.samayam.com/religion/festivals/history-and-significance-of-poli-padyami-or-poli-swargam-the-last-day-of-karthikam/amp_articleshow/72237966.cms

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రామాణికము' అనడం సాధువు అనుకుంటాను.

      తొలగించండి
  3. నదిలో మున్గిన మాఘ పౌర్ణమిన నానాపాపముల్ నాశమౌ
    ఎదలో సంశయమేమి లేక వినరావే నూత్న యేడాది హే
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్; ముక్కోటి యేకాదశిన్
    పద గోవిందుని దర్శనంబునకు సంపాదించ బుణ్యంబులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పౌర్ణమిని' అనండి. 'నూత్న యేడాది' దుష్టసమాసం. "నూతనాబ్దమ్ము"అనండి.

      తొలగించండి

  4. పదిలమ్ముగ వేంకటపతి
    హృదిని జిలేబీయమై సహృదయత చేరన్
    మదియే ముఖ్యము పూజకు
    ముదితా! యేకాదశియు సముచితము ప్రథమన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    ఒక క్షుద్రుడు తన భార్యతో :
    __________________________

    చదువన్ సాగెను క్షుద్ర మంత్రముల ని - శ్శంకన్ యథాజాతుడే
    కుదిరెన్ జూడగ కొన్ని విద్యలవి, సం - క్షోభమ్ము హెచ్చవ్వగా
    మది తా నెంచుచు గొప్ప వాడినని యు- న్మాదంబునన్ బల్కెనే
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  6. A-2)
    ఒక భర్త భార్యతో :
    __________________________

    అదిగో వచ్చెను నూత్న వత్సరము, నా - హ్లాదంబు గా పండుగన్
    ముదితా, పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ;- ముక్కోటి యేకాదశిన్
    మదిలో బెంచుచు పుణ్య భావనల స - న్మార్గంబు నన్ జేయుమా
    నదిలో మున్గుచు పుణ్య గాహనమునే - నైర్మల్యమే బొందగన్
    విధిగా జేయుము దైవతాయతనమున్ - వేదాధిపున్ దర్శనమ్ !
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దర్శనమ్' అని హలంతంగా ప్రయోగించారు.

      తొలగించండి
  7. అది పాశ్చాత్యధరిత్రి యక్కడి కొకం డత్యాశ నర్థంబులన్
    మది పొంగంగను గూర్చనేగి యచటన్ మాతృస్థిరాధర్మముల్
    వదిలెన్ మూర్ఖుడు వానిపత్ని యడుగన్ వాడాడె నజ్ఞానియై
    "ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'స్థిరధర్మముల్' అనడం సాధువు అనుకుంటాను.

      తొలగించండి

    2. ఆర్యా
      నమస్కారములు.
      "స్థిరా" అనునది "భూమికి" పర్యాయపదము వాడానండి. ఆకారాన్తముకదా.

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్!

    మదిలో విష్ణుని గొల్వగావలె ధనుర్మాసంబునన్ భక్తితో.,
    పదిలమ్మౌ ఘనమంత్రరాజము తిరుప్పావై పఠింపంగ., స...
    మ్ముదమౌ రీతి గణించుమా దశదినంబుల్ నేటికిన్., నేడిదే
    ముదితా! పాడ్యమి.,! నాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. మదిలో విష్ణువు రూపము న్ నిలిపియు న్ మందార పూమాల తో
    విదితం బౌ హరి ధ్యానము న్ సలుపు చున్ విస్తా ర మౌ పూజల న్
    ముదితా పాడ్యమి నాడె చేయగ దగున్ : ముక్కోటి యేకాదశి న్
    సుదతు ల్ కోవెల కేగి భక్తి యుతు లై సొంపారఁ బూజిం ప రే

    రిప్లయితొలగించండి
  10. పదవే పాడ్యమి వచ్చెనంట మన పాపాల్పొవ చేయవలెన్

    ముదమారంగను తానముల్ నదిని మోదంబందగా పోదమే

    కదలన్ కోరవు పాపమే వినుము కాదన్నన్ యిదే మంచిదే

    ముదితా ! పాడ్యమినాడె చేయగ దగున్ ముక్కోటి ఏకాదశిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాపాల్పోవ చేయన్వలెన్' టైపాటు. రెండవ, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి


  11. అదిరెన్ పోవె జిలేబి నీతెలివి ! బాహాటమ్ముగా చెప్పకే
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్
    సదనంబందున నవ్విపోదురు సుమా చక్కంగ విద్వాంసులే
    మది! పొద్దాయెను వీడుమానిదుర గొమ్మా లెమ్మ బింబాధరా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఏదో పాశురం విన్నట్లుగా ఉంది

      తొలగించండి
  12. క్షమించండి. నిన్నటి సమస్యకు పూరణ
    గఅక్కజంబుగాను నర్చకాళికి జూడ
    నాదివారమె సెలవందదేల"?
    యరసిజూడ దెలిసె నాదిత్య దేవుని
    ఆలయంబు, భక్తులధికమనుచు

    రిప్లయితొలగించండి
  13. పదిరోజుల్ హరినామవాచకము జెప్పన్ నిష్ఠ జేరున్ మదిన్
    పదునున్ బెట్టుటమేలగున్ మదికి సంపాదించ చిత్శక్తినిన్
    సదుపాయంబగుతద్దినంబునుపవాసంబాచరింపంగనో
    ముదితా, పాడ్యమినాడె! జేతగదగున్ ముక్కోటియేకాదశిన్!
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ఓ అమ్మాయీ పదిరోజులు నిష్ఠ గా హరినామము జెప్పుట సాధన జేయుము. ముక్కోటి యేకాదశి జేయుట అవశ్యము అని నా పూరణ.

    రిప్లయితొలగించండి
  14. మ:

    పదులా కావవి నొక్క రోజునటయే భక్తిన్ మదింనింపగా
    విధిగా పొందుట జెప్పిరై కృపను తావేనోళ్ల పూజింపగన్
    యిదియే మార్గము లోకమందు భవ భూయిష్టంబు సంప్రాప్తికై
    ముదితా పాడ్యమి నాడె చేయగ దగున్ ముక్కోటి యేకాదశిన్

    భవ=శుభము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      కావవి యొక్కరోజనుటయే... జెప్పిరే... పూజింపగా నిదియే... అనండి

      తొలగించండి
  15. సదయుండౌ పరమాత్ముఁగొల్చుటకు నీసంకల్పమేముఖ్యమిం
    కదియే రోజనునట్టి సంశయముగల్గంగా మదిన్ చెల్లునా
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్, ముక్కోటి యేకాదశిన్,
    మదిలోనిండగుభక్తితోడ మరియే మాసంబునందేనియున్.

    రిప్లయితొలగించండి
  16. ఇది యేమాసము పక్షమేది యనుచున్నీరీతి శంకించుటే
    యదియే మాత్రము నచ్చబోదుకదనే యంభోజ పత్రేక్షణా
    మదియే మాధవ మందిరమ్మయిన నేమాసమ్ముతో నీకేమిటే
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్

    రిప్లయితొలగించండి
  17. విదితం బియ్యది దేశ దేశముల సంప్రీతిం బ్రజామోద మై
    నది సర్వోత్తమమై చెలంగు భువి మాన్యంబై సుశాస్త్రంబులన్
    గదితం బింపుగ నేత దుత్సవ బృహత్కార్యంపు టారంభమున్
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్, ముక్కోటి యేకాదశిన్

    [ముక్కోటి యేకాదశిన్ = ముక్కోటి యేకాదశియందు]

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వేంకట రాజారావు:

    పదురౌనట్టి యుదంచితమ్ములగు శోభల్ వ్యాప్తి గావించి య
    భ్యుదయంబిచ్చెడి కృత్యముల్నుడువు నీవున్ తర్కమేలేక నో
    ముదితా! పాడ్యమినాడె; చేయగదగున్ ముక్కోటి యేకాదశిన్
    ముదమున్ గూర్చెడి నోములన్ హరికి నిమ్మున్ గూడుచున్ భూరిగా!

    రిప్లయితొలగించండి
  19. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్
    ముక్కోటి యేకాదశిన్"

    సందర్భము:
    సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళో
    ద్భాసమానే విమానే..
    కావేరీ మధ్య దేశే మృదుతర ఫణిరాట్
    భోగ పర్యఙ్క భాగే
    నిద్రాముద్రాభిరామం కటి నికట శిరః
    పార్శ్వ విన్యస్త హస్తం
    పద్మా ధాత్రీ కరాభ్యాం పరిచిత చరణం
    రఙ్గరాజం భజేఽహమ్

    విభీషణుడు తన భార్య సరమతో ఇలా అంటున్నాడు...
    "శ్రీ రాముడు రంగని విగ్రహాన్ని పట్టాభిషేక వేళ బహూకరించినాడు. తెస్తూవుంటే అది కావేరీ తీరంలోనే నిలిచిపోయింది. (అదే శ్రీ రంగం.) స్వామి ఇక్కడే వుండి లంక వైపు చూస్తూ వుంటా నని ఏడాది కో రోజు దర్శనం చేసుకొ మ్మని ఆదేశించాడు. ఆరోజే ముక్కోటి ఏకాదశి. (శ్రీ రంగంలో వైభవంగా జరుగుతుంది.)
    ప్రతి సంవత్సరం మనం వెళుతాం గదా! నీవేమో (ముందు జాగ్రత్తగా) ఎప్పుడూ పాడ్యమినాడే జ్ఞాపకం చేస్తూవుంటావు. ముక్కోటి ఏకాదశి పర్వదినం జరుపుకోదగిందే మరి!"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *శ్రీ రంగము*

    ముద మారంగను రంగ విగ్రహము రా
    ముం డిచ్చినన్ నిల్చె న
    య్యది కావేరి తటాననే.. దరిసెనం
    బౌ నేటి కొక్కండు.. చే
    సెదవే జ్ఞాపక మెప్పుడున్ మహితమౌ
    శ్రీ రంగ మేగంగ నో
    ముదితా!పాడ్యమినాఁడె..చేయఁగఁ దగున్
    ముక్కోటి యేకాదశిన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    6.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. విదియాదిం గొని లెక్క
      తో నెఱుగవే విఖ్యాతపర్వమ్మునున్
      పదిసంఖ్యాకదినమ్ము లున్నవిగదే పస్తేల నేడిట్లు?శ్రీ
      ప్రదమౌ భక్తిఁ బఠింపు చాలును దిరుప్పావైని, ఈ రోజు నో
      ముదితా! పాడ్యమి, నాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్.

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురము

      తొలగించండి
  21. మొదలౌ పౌష్యము విష్ణు భక్తులకు సమ్మోదమ్ముగా దల్పగన్
    ముదితా! పాడ్యమినాఁడె; చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్
    మదినా శ్రీ హరి ధ్యానమున్ విడక సన్మార్గమ్మునే గోరుచున్
    విధిగా పూజలు జేయుటన్ నిడునదే వేవేల పుణ్యంబులన్

    రిప్లయితొలగించండి
  22. మత్తేభవిక్రీడితము
    సుదినంబియ్యది పుష్యమాసమున నీ సూర్యోదయారంభవై
    చదువన్ భాగవతమ్ము పూటకొకటౌ స్కంధమ్ము
    నుంకించుచున్
    ముదితా! పాడ్యమి నాఁడె, చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్
    తుదియౌ ద్వాదశి నాడు శౌరికిడ సంతోషాన నైవేద్యమున్



    రిప్లయితొలగించండి
  23. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ ముక్కోటి యేకాదశి పర్వదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  24. ముదితా!పాడ్యమినాడెచేయదగున్ ముక్కోటియేకాదశిన్
    బదలాయింపులుసేయగాదగునెయమ్మాయేమియిట్లంటిరే
    విదితంబేగదమీకునున్ దనరవేవేలంబ్రజానీకముల్
    ముదమారంగనుసేవజేతురిలనావైకుంఠవాసున్ రతిన్

    రిప్లయితొలగించండి
  25. చదువన్ మాత్రము వచ్చువాడొకడు పంచాంగమ్మదేనాటిదో
    చెదలున్ బట్టిన దానినెంచె చదువన్ చిత్రమ్ముగానున్నటుల్
    తుదకున్ దెల్పెను నింగితమ్ము కరువై తొట్రన్నదే శూన్యమై
    "ముదితా!పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్!"

    రిప్లయితొలగించండి
  26. మొదలౌ పక్షము చాంద్రమానమున నీపుష్యంపు మాసంబునన్
    ముదితా!పాడ్యమినాడె;చేయగదగున్ ముక్కోటి యేకాదశిన్
    మదిలో నిండగు భక్తితోడ హరి నామానంద పారాయణన్
    అదియే మోక్షమునిచ్చెడిన్ దెరవు యాహ్లాదంబు జేకూర్చుచున్

    రిప్లయితొలగించండి