21, జనవరి 2020, మంగళవారం

సమస్య - 3257 (కందులు రోదింప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్"
(లేదా...)
"కందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్" 
(ఛందోగోపనం)

78 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    తలుపుల్ చాటున దాగుచున్ విటులహో త్రాగించి మద్యమ్మునున్
    బలుపౌ రీతిని మెచ్చుచున్ జడలనున్ పాలించి లాలించుచున్
    వలపుల్ మీరగ చుంబనమ్ము కొరకై వ్యర్థమ్ములౌ తీరునన్
    పలుకందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్

    అందుల = అచ్చట (ఆంధ్ర శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని భావ వ్యక్తీకరణలో కొంత అస్పష్టత ఉన్నది. 'అందుల' శబ్దాన్ని 'అందుల్' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  2. పందెములగాసి బడిలో
    నందలమెక్కగ క్రికెట్టు యాటలనాడన్
    తొందరపాటున నోడిన
    కందులు రోదింప మిగుల గలగిరి పడతుల్
    కందు=బిడ్డ (ఆం.భా.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క్రికెట్టు+ఆటల=క్రికెట్టాటల' అవుతుంది. యడాగమం రాదు.
      "క్రికిట్టు నాడినవేళన్" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

      తొలగించండి

  3. కోకల్ ముడ్చుచు జంతికల్ మురుకులన్ గోవిందుకై జేయగా
    కాకుల్ జేరగ కొట్టబూని జనుచున్ కవ్వంబులన్ గొంచు భల్
    వాకిల్ జేరగ బల్లులే పడగనున్ బాడీలలో దూరుచున్
    ప్రాకందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్

    అందుల = అచ్చట (ఆంధ్రశబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "కొందరవివేకు లక్కట/లకటా" అనండి.

      తొలగించండి
    2.  కొందరవివేకు లకటా!
      బందని వాహన ములెల్ల బందిల క్షీరం
      బందక క్షుద్బాధకు పసి
      కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్"

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కసితోడన్+అవివేకులై'... ఇటువంటి తావుల్లో ద్విత్వనకార ప్రయోగాన్ని సాధ్యమైనంతవరకు వర్జించండి.

      తొలగించండి
    2. కసితోడన్మతిలేని కొన్ని జన సంఘంబు ల్ప్రభుత్వం బుపై
      విసమున్గ్రక్కుచు బందులన్సలుప భావింపం గనుద్యుక్తులై
      పసులన్బోలుచు పాలవా హనములన్బంధింప పాలందకన్
      పసికందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్"

      గురువుగారూ ద్విత్వనకారం తొలగించి సవరించిన పద్యం చిత్తగించండి.🙏

      తొలగించండి
    3. సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ఎందుకు పిలచిరొ తెలియక
    బందుకు నే పోవగాను బంధించిరి నే
    నందుకు కాదన వినరయె
    కందులు రోదింప మిగుల కలగిరి పడతుల్

    రిప్లయితొలగించండి
  7. డెందమున మాతృ ప్రేమా
    నందంబది వెల్లివిరియ ననురాగమునన్
    స్పందించ, వినగ నా పసి
    కందులు రోదింప, మిగుల కలఁగిరి పడతుల్!

    రిప్లయితొలగించండి
  8. నిందలు వేయుచు పదుగురి
    ముందు తనను పరిహసించి బూతులు తిట్ట న్
    కుందుచు నేడ్చుచు నా పసి
    కందులు రోదింప మిగుల కలిగిరి పడుతు ల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తమను పరిహసించి" అనండి. 'పసికందులు' అని బహువచనం కదా?

      తొలగించండి
  9. సౌందర్యము తగ్గుననుచు
    సుందరులే స్తన్యమీయ స్రుక్కిన తరి పా
    లందక నాకలిచే పసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్

    రిప్లయితొలగించండి
  10. అందరు విడిచిన శిశువుల
    నందుకొని మనుచు సమితిన
    నాకలి బాధన్
    డెందము పగులు నటుల బసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్

    రిప్లయితొలగించండి
  11. అందరికీ నమస్సులు 🙏🙏
    సమస్య..అవును సమస్యే మరి .

    *"కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్"*

    *కం||*

    వందలు గా జనులచ్చటి
    విందులు జేయుచు మనస్సు విహరింపగనే
    చిందులు వేయగ నా పసి
    *"కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు 🙏🙏

      *నా సరదా పూరణ*😀😀

      *కం||*

      అందము అందము యనుచూ
      మందముగా రంగులద్దు మమ్మీల వలన్
      పొందిన భయములతో పసి
      *"కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌹🙏🌹🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో "అందం బందం బనుచును" అనండి.

      తొలగించండి
    3. ధన్యోస్మి ఆర్యా మార్పులు చేసుకొనెదను 🙏🙏

      తొలగించండి
  12. మందుడు కంసుడు రక్కసి
    డెందమ్మున జంపబూని డింభకుగణమున్
    కందుకగతి గ్రీడింపగ
    కందులు రోదింప మిగులగలగిరి పడతుల్

    రిప్లయితొలగించండి
  13. (ప్రాణభయంతో కంసుడు రాజ్యంలోని నవజాత శిశువులను చంపించటం )
    కసితో కంసుడు మేనయల్లుని హరిన్
    ఖండింపగా నెంచుచున్
    మిసిమింతుండయి తాటకన్ బనిపి యే
    మేరన్ గృతార్థుండు గా
    క ససైన్యుండయి కన్నులన్నురుముచున్
    గార్కశ్యుడై చంపినన్
    బసికందుల్ విలపింపగన్ గలగిరే
    భామామణుల్ వేదనన్ .
    ( మిసిమింతుడు - పిరికివాడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      రామాయణం తాటక భాగవతంలోకి వచ్చింది. అక్కడ "పూతనన్ బనిపి" అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  14. విందునదల్లులుమునగగ
    గుందుచుక్రిమిబాధవలన గురగురయనగా
    నందముజిందెడునాపసి
    కందులురోదింపమిగులగలగిరిపడతుల్

    రిప్లయితొలగించండి
  15. సుందరి కల్యాణంబున
    విందులు నృత్యముల దోడ విపరీతంబౌ
    సందడి కలజడియై పసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. విందీయ వెలఁది మండలి
      చిందులు వేయుచు నఱచుచుఁ జెవు లవియంగా
      నందంద దొర్లుచు నకట
      కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్


      రాకల్ పోకలు మాను మింక నిజ మిత్రప్రస్త్య సంచారముల్
      లేకున్నం గట కల్గు నింద లవి దుర్భేద్యమ్ములై నిత్యమున్
      రాకాచంద్ర నిభాస్య! కన్గొనుమ యేలన్ రావు వేవేగ న
      బ్బా కందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  17. విందులు వినోదముల నా
    నందించుచు నిహముమరచి నడయాడంగా
    నందలి లేఁ బ్రాయపు పసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్

    రిప్లయితొలగించండి
  18. విసమున్గ్రక్కుచునాగుపామటనునావేశంబుతోగొట్టగా
    బుసలన్ భీతినిబాఱ,భామినులునమ్మోయేమిసేతుమా
    పసికందుల్ విలపింపగన్ గలగిరేభామామణుల్ వేదనన్
    మసకంబాఱెనునాదుజీవితమునిమ్మాశాంతినోభారతీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  19. కం:

    సుందర వదనలు మిత్రులు
    పొందిక యిముడన ముదమున పోవును సినిమా
    సందడి నిద్దుర తొలగన
    కందులు రోదింప మిగుల గలగిరి పడతుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యిముడగ.. తొలగగ/తొలగిన" అనండి.

      తొలగించండి


  20. అందరు చూచిరయా పసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్
    కొందలపడుచున్ మదియే
    సుందరులది వెన్నెపూస చువ్వన కరుగున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్

    సందర్భము: దూతను చంపరా దని విభీషణు డంటే కోతులకు తోకే భూషణ మని దాన్ని కాల్చి పురమంతా తిప్పి వదలివేయు డని రావణు డన్నాడు. రాక్షసు లాంజనేయుని తోకకు గుడ్డలు చుట్టి నిప్పంటించి లంకలో తిప్పుతూ చాటింపు వేసినారు.
    సీత అగ్నిదేవుని శీతోభవ హనూమతః.. అని ప్రార్థిస్తే తోక మండుతున్నా చల్లదనాన్నే యిచ్చింది.
    ఉత్తమ గృహాలతో అగ్నిదేవుని తృప్తి పరచా లని మారుతి ప్రదీపిత లాంగూలంతో ఇంటింటికి వెళ్లి అంటించినాడు. (గృహాద్గృహం..చచార)
    అందమైన లంకానగరం దహించబడింది. గృహా లొకదాని వెంట మరొకటి తగులబడి పోతున్నవి. అంతకంతకూ ఉవ్వెత్తుగా భయంకరంగా నింగి నంటేట్టు ఎగిసిపడుతున్న అగ్ని జ్వాలలను అదుపు చేయటం తమ చేతిలో లేదన్నది అర్థమైపోయింది పౌరులకే గాక నేతలకు కూడా.
    అందువల్ల నీళ్ళతో మంటల నార్పే ప్రయత్నాలు ఫలించలేదు. చూడడమే సరిపోయింది. చూసి చేసేదేమీ లేదని కొందరు ప్రాణ భయంతో అటూ యిటూ పరుగులెత్తారు.
    ..ప్రధావతామ్ స్వగృహస్య పరిత్రాణే భగ్నోత్సా హోర్జిత శ్రియామ్ (తమ యిండ్లను రక్షించుకోవటంలో భగ్నమైన ఉత్సాహం అధిక సంపద గలవారు.సుం.కాం.54-24)
    ఎటు చూసినా మంటలే! ఎవరికీ ఏం చేయాలో తోచడం లేదు. ఈ హడావుడికీ గందరగోళానికీ ఉయ్యాలల్లోని పసికందులు జడుసుకొని ఏడ్పు లంకించుకున్నారు. గృహిణులెంతో కలత (కంగారు) పడ్డారు.
    కొందరైతే అరుస్తూ చంటిబిడ్డల నెత్తుకొని అగ్ని చుట్టుముట్టిన మేడలనుండి కిందకు దూకినారు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *లంకా దహనము*

    సుందర లంకను మారుతి

    యందందు దహింప గృహము
    లంటుకొనన్ నీ

    రందుకొనరు నేతలు పసి

    కందులు రోదింప మిగులఁ
    గలఁగిరి పడఁతుల్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    21.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  22. మైలవరపు వారి పూరణ

    కసితో, నీనెలతోడ పత్రములతో కాండమ్ముతో పూలతో
    మసితో జేసి ప్రయోగశాలకయి బొమ్మన్., రేయి నిద్రింపగా
    పసివాండ్రందరు., మూషికమ్ము కొరుకన్ పాడయ్యెనంచార్తితో
    పసికందుల్ విలపింపగన్ గలగిరే భామామణుల్ వేదనన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  23. శిశిరమ్మైనను గ్రీష్మమైన నది వర్షాకాలమే కానిపో
    కసువున్ నూకి దువారమందునుషలో కళ్ళాపినే జల్లగన్
    బసిపాపన్ బడకింటిలో విడిచునా పాళమ్ములో యాకటన్
    కందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "విడుచు నా పాళమ్ములో నాకటన్" అనండి.

      తొలగించండి


  24. అసురుల్ దూరిరి మారు వేషముల నాహాకార ముల్చేయుచున్
    కసితీరంగను పేలె బాంబులకటా కార్పణ్యమేహెచ్చగాన్
    మసియై బూడిద యై జనాళి చెదరన్ మాగన్ను కన్మోడ్పులో
    పసికందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. పస లుప్తంబు లనంతదుఃఖవిలపద్వ్యాపారలక్య్షైకనీ
      రసధర్మోక్తివిరుద్ధదూష్యములు సీర్యల్లన్ నిమగ్నాంధులై,
      విసుగుం జెందక గాఢదృకగ్బధిరలై వీక్షించుచున్, బోరునన్

      పసికందుల్ విలపింపఁగన్, గలఁగిరే? భామామణుల్ వేదనన్.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  26. విందులలో మనసు పడి ప
    సందగు మందును గ్రహించి పరవశులగుచున్
    పందిరిలో నుంచిన పసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు

    1. మత్తేభవిక్రీడితము
      అసలే మేటి కథాంశమై నటుల యాహార్యమ్ము మెప్పించగన్
      రసకందాయపు సన్నివేశమున హర్షాంభోధినిన్ దేలగన్
      కుసిలింపుల్ వినిపించి చన్గుడువ గగ్గోల్వెట్టి యైమాక్సునన్
      బసికందుల్ విలపింపఁగన్ గలఁగిరే భామామణుల్ వేదనన్

      తొలగించండి
  28. ఈ రోజు శంకరాభరణము వారి సమస్య

    కందులు రోదింప మిగుల గలగిరి పడతుల్



    ఇచ్చిన పాదము కందము

    నా పూరణము సీసములో



    కైక తన సుతుడు భరతుని కన్నా మిన్నగా రాముని పెంచింది. రాముడు ఎక్కువగా కైక అంటే ప్రెమగా ఉండేవాడు. ఆట్టి సంధర్భములొ చిట్టి బాల్య క్రీడ
    చిన్న భావన


    నాదు తల్లి యనుచు నారీ శిరోమణి
    కైక చెంతను జేరె కన్న తల్లి


    కౌసల్య వలదని గారాల రాముడు,
    మాతల్లి కైకమ్మ, మాట లాడ


    తగదని భరతుడు తగవు లాడుచు నెట్టి
    వేసెను రాముని విసురు గాను,

    సౌమిత్రి యది కాంచి, సంజ్వరము బడసి
    భరతుని వెనుకకు పట్టి లాగె,


    సమయము చూసి నా శతృఘ్నుడు జవమున్
    కైక పై కెక్కెగా , కాంచి నట్టి



    మువ్వురు యేడుపు మొదలు పెట్టిరి ,
    నాదినాది యనుచు నలుగురు నిడె


    రొద, పసి కందులు రోదింప మిగుల
    గలగిరి పడతుల్దికమక పడుచు


    దశరధుం డది కాంచిముదముగ పలికె
    నిటుల “కనుమిది చంద్రుడు నింగినుంచి
    నిటకు వచ్చె చూడగ రమ్మని “ పిలచె నొక
    మంకురములోన చంద్రుని, మంకు నాప


    రిప్లయితొలగించండి
  29. బృందముతోగూడిమహిళ
    లందరు విందుల సరసపు చిందులువేయన్
    నిందలు వేయగ గనిపసి
    కందులురోదింప మిగుల కలగిరి పడతుల్.

    రిప్లయితొలగించండి
  30. మందును దాగుట మానక
    మందులుగానిలుచు భర్త మానిని దిట్టన్
    కుందెను శ్రీమతియును పసి
    కందులురోదింప మిగుల కలగిరి పడతుల్
    -----------------

    రిప్లయితొలగించండి
  31. బందుల సమయము లందున
    మందిరములు దాటి యెవరు మసలగలేక
    న్నందక నవదోహము పసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్!!!

    రిప్లయితొలగించండి

  32. కందం
    విందును వివస్త్ర యగుచున్
    సందడి వడ్డించ మనఁగ సాధ్వీమణినే
    సందిత త్రిమూర్తు లౌ పసి
    కందులు రోదింప మిగులఁ గలఁగిరి పడఁతుల్

    సాధ్వీమణి = అనసూయ
    పడఁతులు = ఆశ్రమంలో సేవక స్త్రీలు

    రిప్లయితొలగించండి
  33. ధన్యవాదాలండీ ! ఏమిటో తాటక పూతన చోటులోకి
    వచ్చింది నన్ను కూడా మాయచేసి .��

    రిప్లయితొలగించండి
  34. విందుకు నాహ్వానింపగ
    నందరు విచ్చేయుటకట నసవస కాగా
    చిందులు వేయుచు నాపసి
    *కందులు రోదింప మిగుల గలిగిరి పడతుల్*
    ‌‌.

    రిప్లయితొలగించండి