28, జనవరి 2020, మంగళవారం

సమస్య - 3264 (వందన మమ్మరో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్"
(లేదా...)
"వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

68 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    Bengal Politics (1967 onwards):

    ముందుగ నక్సలైటులయి ముద్దులు పెట్టుచు మావొ కాళ్ళకున్
    సందుల గొందులన్ తిరిగి చంపుచు కాంగ్రెసు కార్యకర్తలన్...
    కుందుచు పాపకర్మలను కూర్చుచు చేతులు సోనియమ్మకున్
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  2. కస్తూరి శివశంకర్మంగళవారం, జనవరి 28, 2020 12:51:00 AM

    శుభోదయం. అందరికీ నమస్సులు
    స్వాతంత్య్ర పోరాట వీరులని స్మరించుకుంటూ

    కం:
    డెందమున దేశభక్తిని
    బంధనముల భరత మాత వగచిన నాడే
    దుందుడుకుగ ముష్కరులభి
    వందనమో తల్లి యనిన వధియింపఁదగున్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అమిత్ షా ఉవాచ:

    వందల గోవులన్ దునిమి వాడల వాడల బీఫునమ్ముచున్
    పందుల వీడుచున్; వడిగ భాజప రాగను రాజ్యమందునన్
    కుందుచు చేతులెత్తుచును కుండలు మార్చుచు కామధేనుకున్
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  4. వందే మాతర మనుచును
    బంధము లనుపెంపు జేసి బహురీతు లటన్
    డెందమున దుష్ట బుద్ధిని
    వందనమో తల్లి యనిన వధియింప దగున్

    రిప్లయితొలగించండి


  5. కొందలపడకు! మునుపు మన
    కందరికిన్ మార్గదర్శి కలడు మహాత్ముం
    డందు కొను పరశ్వథమున్
    వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తొందర పాటున జేసితి
      వందనమో తల్లి , యనిన వధియింపఁ దగున్
      చిందును , మాత నడతకిది
      యందము నిడునుగద బిడ్డలల్లరి సలుపన్

      చిందు = కోపము

      తొలగించండి

  6. చెవిలో ఝుమ్మంచు నాదము :)


    ముందర మానవుల్ వెనుక ముక్తిని చేర్చెడు ఘోణులున్ శతా
    నందుని రాత గా భువిని నాట్యము చేయుచు వచ్చె గోముగా
    వందన మమ్మరో యనఁ, గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్
    చిందులు వేయు దోమలను శీఘ్రము వ్యాధులు వృద్ధి గానకన్


    జిలేబి

    రిప్లయితొలగించండి

  7. ( పాటలీపుత్రప్రభువులు నవనందులు తమ తమ్ముడైన చంద్రగుప్తుని,అతని తల్లి మురను అవమానించి చివరకు చాణక్యుని తంత్రంతో ఓడి లొంగి ఆక్రోశించే సందర్భం )
    నందులు చంద్రగుప్తుని మ
    నమ్మున నెవ్విధి గారవింప కా
    నందము నందిరే ! మురను
    నల్గురిముందట " దాసి "యంటిరే !
    పందలరీతి ప్రాణముల
    భద్రత కోసము లొంగిపోవుచున్
    " వందన మమ్మరో ! యన గృ
    పామతి జూడక చంపగా దగున్ .

    రిప్లయితొలగించండి
  8. మందునుదాగికొందరిల,మాటలుదూలుచు వాగుచుండగా !
    అందముగల్గుకన్నియల, ఆగముసేయగజూచువారినిన్
    బందెలదొడ్డిలోవదిలి ,బాదుటమేలగునెప్పుడేనియున్
    వందనమమ్మరోయన,కృపామతిజూడక జంపగాదగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మందును ద్రాగి" అనండి.

      తొలగించండి
    2. మందునుద్రాగి గికొందరిల,మాటలుదూలుచు వాగుచుండగా !
      అందముగల్గుకన్నియల, ఆగముసేయగజూచువారినిన్
      బందెలదొడ్డిలోవదిలి ,బాదుటమేలగునెప్పుడేనియున్
      వందనమమ్మరోయన,కృపామతిజూడక జంపగాదగున్.
      [సవరణ పాఠము ధన్యవాదాలతో]

      తొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    డెందమునన్ నమస్కృతి ఘటించిన చాలు దయార్ద్రదృష్టితో
    నందరి గావనెంచు జగదంబవు ! నీ సుతుడన్! మరింక నా...
    కెందుకు రక్షనీవు? వినవే! మదినారని యారు వైరులన్
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. అందమగు సతియె లోకము
    మందాకిని తల్లియె కసుమాలమటంచున్
    డెందమున తలచి నీకొక
    వందనమో తల్లి యనిన పధియింప దగున్.

    మందాకిని... వృద్ధురాలు
    కసుమాలము....రోత.

    రిప్లయితొలగించండి
  11. నందనతుల్యుడన్ నిజము నమ్ము మటంచును బల్కుచుండి యా
    క్రందన జేయురీతి నరరాజిని బీడల ముంచుచుండి నా
    కిందు సహాయకారివయి యెంతయు శక్తిని గూర్చుచుండుమా
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఎందరు మహిషాసురులో
      తొందరగా రావె దుర్గ త్రుంచగ వీరిన్
      పందల చిందర చేయుచు
      వందనమో తల్లి యనిన వధియింపదగున్!

      తొలగించండి
  12. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

    “జారులకున్ శిష్టులెల్ల స్వాగత మని రే”

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    రాయల వారి ఆస్ధానములో అష్ట దిగ్గజములు చక్కటి కావ్యముల సృష్టి కర్తలు (బ్రహ్మలు) ఒక రోజు అల్లసాని వారికి గండ పెండేర సన్మానము రాయల వారు చేయ దలచినారు. ఆ సమయమున అల్లసాని వారు తోటి కవిబ్రహ్మ లతో సభలోకి మేళ తాళముల మధ్యవేద ఆశీస్సుల మధ్య అడుగు బెడతారు. సభలోనికి జ్ఞాన కులపు కంజారులు (కంజారుడు = బ్రహ్మ ) అడుగు బెట్ట శిష్ట్లులెల్లరు నమస్కరించి స్వాగతములు పలికినారు అను భావన


    నంది తిమ్మన కవి నాశికా కావ్యపు
    జలజాసనుడు గాదె సరస గతిని

    పింగళి సూరనా విబుధుడు రాఘవ
    పాండవీయపు పద్మభవుడు గాదె,

    కాళహస్తీశ్వర ఘన శతక విరించి
    ధూర్జటి యే గాదె ధ్రువము గాను,

    రమ్యమౌ వర పాండురంగ మహాత్యము
    రామలింగ నలువ రచన గాదె,

    మనుచరిత్ర నలు మోమయ్య నా అల్లసా
    ని కవివరుడు గాదె నిజముగాను,

    రాజ శేఖర చరిత్ర సృష్టి కర్త మా
    దయగారి మల్లనే తరచి చూడ

    వసు చరిత్ర ఘన సారస గర్భు డా రామ
    రాజ భూషణ డబ్ధి రసన లోన ,

    రామాభ్యుదయ చతురానను డా రామ
    భద్రుడు గాదె భువనము నందు

    మేళ తాళ రవముల్ మింటిని త్రాకన్ స
    భకు నడుగిడి నట్టి ప్రాజ్ఞ, జ్ఞాన

    కులపు కంజారులకున్ శిష్టు లెల్ల స్వా
    గత మని రే కడు ఘనత తోడ,


    నెల్లరు న్నమసంబుల నిడగ ,కృష్ణ
    రాయ లెదు రేగి పెద్ద నార్య కవిని గని ,
    కాళ్ళకు తొడిగె గాంగేయ గండ పెండె
    రమును వేధ ఘోషల మధ్య రమ్య గతిని



    (జలజాసనుడు, పద్మభవుడు, విరించి,నలువ,నలుమోమయ్య,సృష్టికర్త సారస గర్భుడు,చతురాననుడు, కంజారుడు = బ్రహ్మ) ధ్రువము = నిశ్చయము,అబ్ధిరసన,భువనము = భూమి,గాంగేయము = బంగారము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి
  13. చిందుచు విషమును మనసున
    కందువ మగు నుడు ల తోడ కపటు o డై తా
    నందరి ముందు నటించుచు
    వందన మో తల్లి యనిన వధియింప దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మనమున" అనండి. 'మనసు' శబ్దం సాధువు కాదంటారు పెద్దలు.

      తొలగించండి
  14. అందరికీ నమస్సుమాంజలి
    🙏🙏

    నేను ఇచ్చిన సమస్య ని పరిగణలోకి తీసుకున్నందుకు మరో మారు వినమ్ర నమస్సులతో ..🙇‍♂🙇‍♂🙏🙏

    *నా పూరణ* 🌹

    *కం||*

    ఎందరినో జంపుటకై
    మందీ మార్భలము తోడ మారణ కాండన్
    యందరినీ వధియించిక
    *"వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్"*!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో నా వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి
    2. అందరికీ నమస్సులు 🙏
      *పూరణ* గురువులు చెప్పిన సవరణతో 🙏🙏

      *కం||*
      ఎందరినో జంపుటకై
      మందియు మార్భలము తోడ మారణ కాండన్
      అందరిని వధించుచు మరి
      *"వందనమో తల్లి యనిన వధియింపఁదగున్"*!

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌹🙏🌹🙏

      తొలగించండి
  15. ఎందిక బోదు వీవు నను నెందుకు నొల్లవు చిక్కినావు రా
    పొందు కటన్న ధూర్తుని కవుంగిలినిన్ చుర కత్తి పోటుతో
    విందును జేయ గావుమని వేడుచు నందక కాళ్ళు రీతిగా
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్.

    రిప్లయితొలగించండి
  16. కందిన లేతచెక్కిలిని కాంక్షను తీరక మైక మందుతా
    నందిన భోగమం చునిక నాయము నెంచక చిత్రహిం సలన్
    చిందులు ద్రొక్కుచున్ నరుడు చేడియ పైకసి తీరునం తగా
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  17. అందరు మెత్తురు సతతము
    వంద నమో తల్లి యనిన ,వధియింపదగున్
    సుందరి మోజున తల్లికి
    కుందును కూర్చెడి తనయుని కూరిమి లేకన్.

    రిప్లయితొలగించండి
  18. సుందరులగు కాంతల గని 
    కొందరు తప్పని తెలిసియు కూడని రీతిన్ 
    చిందర బ్రతుకులు చేసిన 
    "వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్"  

    రిప్లయితొలగించండి
  19. తొందర పెట్టెడి చిత్తము
    విందును జేయంగ రమ్ము వేడుక తీరన్
    బొందున నీ యందాలకు
    వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్.

    రిప్లయితొలగించండి
  20. విందగు వీనుల కెపుడును
    వందనమో తల్లి యనిన ; వధియింపఁ దగున్
    బొందగు నబలల గడుసుగ
    బొందగ జూచెడు ఖలులను భూలోకమునన్!

    రిప్లయితొలగించండి
  21. వందేమాతరం ఉద్యమంలో బ్రిటీషు అధికా ఆఙ్ఞ

    మందులు భారతవాసులు
    చిందులు వేయుచు నరచుచు జేజేయనుచున్
    రంధిగ భారతమాతకు
    వందనమో తల్లియనిన వధియింపదగున్



    రిప్లయితొలగించండి
  22. వందనమన భారత భూ
    నందను లందరికిని మది నందము నొందన్
    కొందరు మందులు పలుకమి
    వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్"

    రిప్లయితొలగించండి
  23. పొందెదరెంతో పుణ్యము
    వందనమో తల్లి యనిన; వధియింపఁ దగున్
    మందుల మత్తులను మునిగి
    నిందించుచు దల్లి నొంచు నీచులనెపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వందల యేండ్ల సంస్కృతి కపాయము నేడిటు దాపురించెగా
      వందనమంచు స్త్రీల యెడ వత్సల భావము జూపు నేలపై
      వందలు గాను బుట్టిరిటు పాపులకార్యము జేయు వారలన్
      వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్

      తొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    మందును ద్రావి, చిందు లిడి, మాన్య మృగాక్షుల మానభంగముల్,
    డెందమునం గృపన్ విడిచి, ఠీవి నొనర్చిన దుర్మదాంధులన్,
    బందెలదొడ్డిలోఁ బసుల బాదిన రీతిని, నుజ్జు సేసియున్,

    "వందన మమ్మరో!" యనఁ, గృపామతిఁ జూడక, చంపఁగాఁ దగున్!

    రిప్లయితొలగించండి
  25. నందనవనమున అల్లరి
    పొందికలేకుండజేయ పోకిరి మనసున్
    సందేహమ్మిక వలదన
    వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్"

    రిప్లయితొలగించండి
  26. ఎందరొపడతుల శీలము
    విందుగదోచగ తులువలు విచ్చలవిడిగా
    డెందమునజాలి తలుపక
    వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  27. ఉ:

    చందన కుంకుమాదులను చక్కగ సేరిసి పూల దండలున్
    పొందిక గూర్చి యాటలను బోనము నర్పణ జేయ నెంచగన్
    సందడి పోతరాజులును జాతర నాడుచు వైభవమ్మునన్
    వందన మమ్మరో యన గృపామతి జూడక జంపగా దగున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. చిందఱ వందఱ వస్తువు
    లెందెందు గనిన వనజదళేక్షణ దిగులుం
    బొందకుమీ యుందువు నీ
    వం దనమో తల్లి యనిన వధియింపఁ దగున్

    [నీవు + అందు +అనము +ఓ = నీ వం దనమో]


    కందుము పెద్ద లందఱినిఁ గన్పడ లేవఁగ నేల నిత్యమున్
    మందుల భంగిఁ గావలదె మానిని పెద్దరికమ్ము మా కనన్
    దుందుడు కుండ నిత్యమును దుష్టుని బుద్ధినిఁ, జేయకుండు మీ
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక
    చంపఁగాఁ దగున్"

    సందర్భము: దశరథుడు రాముణ్ణి యువరాజును చేయా లనుకుంటే మంధర దుర్బోధవల్ల కైక కోరరాని వరాలు కోరింది. దశరథుడు కుప్పగూలి కన్నుమూసినాడు. వసిష్ఠుడు మేనమామ యింట వున్న భరత శత్రుఘ్నుల పిలిపించినాడు.
    కైక దుర్వర్తనంవల్ల ఎన్నో చెడ్డ పరిణామాలు సంభవించగా భరతు డెంతో దుఃఖించి తల్లిని తీవ్రంగా దూషించినాడు.
    మృత్యు మాపాదితో రాజా
    త్వయా మే పాప దర్శిని!
    సుఖం పరిహృతం మోహాత్
    కులేఽస్మిన్ కుల పాంసని! 5
    (పాపం చేసేదానవు. నీచేత మా తండ్రి (రాజు) మరణించినాడు. వంశంలో ఎవ్వరికీ సుఖం లేకుండా చేశావు.కులాన్నే చెరచినదానవు నీవు) అన్నాడు.
    (అయోధ్యా కాండము.. 73 వ సర్గము)
    "ఈమెను అమ్మ అని మొక్కరాదు. (అలా పిలువడానికే తగింది కాదు.) ఈమె ప్రాణం తీసినా తప్పు లేదు. ఎందుకంటే వంశంలోనే
    చిచ్చు పెట్టింది.
    అంతే కాదు. ఎవ్వడైనా యీమెను పొరపాటున "వందన మమ్మా!" అన్నాడో వాణ్ణి కూడ చంపిపారవేయవలె."
    అన్నాడు భరతుడు కోపంతో ఊగిపోతూ..
    మరింత సమాచారానికై 20.10.19 నాటి "పాపమతివి.." అనే నా పద్యాన్ని చూడవచ్చు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *భరత వేదన*

    ముందుగ నీమె యమ్మ యని
    మ్రొక్కగ రాదు, వధింపఁ దప్పు కా..

    దెందుల కన్న వంశమున
    నిప్పుడు నిప్పు రగిల్చె నీమె.. యి

    బ్బందిగనో మరెట్లొ పొర
    పాటున నీయమ నెవ్వడైనఁ దా

    "వందన మమ్మరో!" యనఁ గృ
    పామతిఁ జూడక చంపఁగాఁ దగున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    28.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  30. డెందముపొందునుగోరుచు
    వందనమోతల్లియనినవధియింపదగున్
    బందముబరిమార్చుచునిక
    మందునివెలివేయవలయుమానినులతనిన్

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వేంకట రాజారావు:

    దందన జేయుచు తమితో
    సుందరముగ నొప్పుచుండు సుదతుల నెల్లన్
    కొందలబెట్టెడి నీచుడు
    వందనమో తల్లి యనిన వధియింపదగున్.

    రిప్లయితొలగించండి
  32. అందముజూచిజవ్వనులనారడిపెట్టెడి కీచకాధమున్
    పిందెలవంటిపిల్లలను వీడక దౌష్ట్యముసల్పు దుష్టునిన్
    నందమునొందనందరునునాలుగువీధులకూడలందునన్
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  33. ఏడు గురు శిశువులను గం గ దయ లేకుండా చంపుతుంది. ( మనసులో తల్లీ మమ్మలను చంప వద్దు అని వేడుకున్నా) అప్పుడు శంతనుడు గంగను ప్రశ్నించు సందర్భం


    డెందము లేదా నీకు


    వందన మోతల్లి యనిన వధియింప దగుని

    క్కందులనను కఠినత నీ

    వెందులకు తలచితి వనుచు విన్నది నడిగెన్

    రిప్లయితొలగించండి
  34. కందం
    కుందితిమని సత్యాంబను
    వందనమో తల్లి యనిన, వధియింపఁదగున్
    దుందుడుకుగ మాన్యుల సతు
    లందరి బంధించు నరకు నతి హేయముగన్

    రిప్లయితొలగించండి
  35. క్రొవ్విడి వేంకట రాజారావు:

    దందన జేయుచు న్నడరి ధర్మము వీడుచు కామచారియై
    యందముతోడ పొల్పడరు నంగనలన్ బిగగట్టి వారలన్
    మందుడు రావణాసురుని మాదిరి సంకటబెట్టు నాతడే
    వందన మమ్మరో యన గృపామతి జూడక చంపగా దగున్.

    రిప్లయితొలగించండి
  36. ఉత్పలమాల
    ఇందిరఁ బోలు రూపమున నింతులు మైకము నంద బ్రాంతితో
    నందుని యింటఁ బూతన జనార్దనుఁ బాలిడఁ బట్టఁ దల్లులున్
    చిందులు ద్రొక్కి వద్దనినఁ జేరఁగఁ వెన్నుడుఁ బీల్చఁ బ్రాణమున్
    వందన మమ్మరో! యనఁ గృపామతిఁ జూడక చంపఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  37. అందరియాడవారలనునాలిగభావనజేయుచున్దుదిన్
    వందనమమ్మరోయనగృపామతిజూడకచంపగాదగున్
    బందములన్నియున్విడగభామినులందఱుజేసియాతనిన్
    బందువులందఱువెలినిబాఱగజేయుటనొప్పునిద్ధరన్

    రిప్లయితొలగించండి
  38. ఇందునిభాస్యలన్ గనిన హీనపు బుద్ధిని జూపి రేగు కా
    మాంధుల పైన జాలినిసు మంతయు జూపక కాళికాంబవై
    ముందుకు సాగుమంటినిను మూర్ఖుడు భక్తినటించుచున్ మదిన్
    వందన మమ్మరో యనఁ గృపామతిఁ జూడక చంపగాఁ దగున్.

    రిప్లయితొలగించండి
  39. కొందరుబుద్ధిహీనులిట కోపముతాపములన్నిజూపుచున్
    కుందగజేయగాదగున,కుంపటిగాల్చుచు సంస్కృతీప్రభల్
    బందెలదొడ్డిగాదుగద,భారతమన్న ఫవిత్ర భూమిలో
    వందనమమ్మరోయన,కృపామతిజూడక జంపగాదగున్.

    రిప్లయితొలగించండి
  40. సుందరమైన జానకిని స్రుక్కగజేసిన రావణాసురున్
    మందినగూడికొందరిల,మాన్యుడుగా నుతియించ ధర్మమా
    ముందరగాను వారికిక ముక్తినొసంగెడు మార్గమెంచుచున్
    వందనమమ్మరోయన,కృపామతిజూడక జంపగాదగున్.

    రిప్లయితొలగించండి

  41. ... శంకరాభరణం... 28/1/2020 ...మంగళవారం

    సమస్య.
    *******

    వందనమో తల్లి యనిన వధియింపఁ దగున్"

    నా పూరణ. కం
    ** ***

    డెందముల గాయపరుచుచు

    వందలకొలది దురితముల ప్రఘనుల వోలెన్

    మందు డొకండు నొనర్చుచు

    వందనమో తల్లి యనిన వధియింప దగున్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  42. ఎందరు మహిషాసురులో
    తొందరగా రావె దుర్గ త్రుంచగ వీరిన్
    పందల చిందర చేయుచు
    వందనమో తల్లి యనిన వధియింపదగున్

    రిప్లయితొలగించండి