29, జనవరి 2020, బుధవారం

సమస్య - 3265 (సవతి యున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"
(లేదా...)
"సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

93 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    చవటగ మార్చి వల్లభుని చక్కని కోరల నూడబీకుచున్
    పవలును రేయి మానసము పండుగ జేయగ పాలిటిక్సునన్
    నవలలు దూరదర్శనుల నాటక గాథల నింటజూపెడిన్
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే

    రిప్లయితొలగించండి
  2. నవనవలాడు దేహమున నాథునిప్రేమను జూరగొన్నదై
    చెవులకునింపుగా బలికి చెంగునవానిని గట్టుకున్నదై
    జవమున సత్యవోలె నభిజాత్యముగల్గి విదూరనాథులౌ
    సవతులుగల్గినన్ సతికి సౌఖ్యము దక్కునటన్న సత్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోరుతప్పదింట జోరుగా మగనితో
      సవతియున్న సతికి; సౌఖ్యమబ్బు
      వేరుకాపురమున పెద్దలులేకుండ
      మాటదాటనట్టి మగడుదొరక

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    భవనమునందు ముంబయిని పండుగ జేసెడి చక్రవర్తిరో!
    సవరణ జేయగా దగును చక్కగ నిట్టుల కైపదమ్మునున్:
    "సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కునటన్న సత్యమే" ❎
    "సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కదటన్న సత్యమే"✅

    రిప్లయితొలగించండి
  4. ఇంటి దీప మంట యిల్లాలి సొగసులు
    ఇద్ద రున్న చాలు యుద్ధ మేను
    కోరి తగవు లాడి మారుకా పురమన్న
    సవతి యున్న సతికి సౌఖ్య మబ్బు

    రిప్లయితొలగించండి
  5. సమస్య :-
    "సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"

    *ఆ.వె**

    చేతికందునట్లు చిరు వస్తువు లమరి
    పొగయు రాక నీటి పోక యున్న
    నాధునికత గల్గి నన్ని హంగులతో ర
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు
    .....................✍చక్రి

    రసవతి : వంటఇల్లు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      '...గల్గి యన్ని...' అనండి.

      తొలగించండి
  6. స్తవముల నందె హైమవతి తల్లిగ, నమ్మలగన్నయమ్మగా,
    భవుని శరీరమందు సగభాగముపొందెను భాగ్యశాలియై
    ధవుని శిరమ్మునందు నొకతన్వి వసించిననైన గాంచమే
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే.

    రిప్లయితొలగించండి


  7. "అయ్యరొ వినుడు సరి యైన వసతి, రస
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు
    కట్టుడు తిరుమాళిగ నిపుడె ముదిమిని
    సాయ మైవెలయు" బసాలు పలికె!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "సరియైనట్టి వసతి, ర।సవతి యున్న..." అనండి.

      తొలగించండి
  8. దినముదినము పడక దిగులాయె మనసుకు
    శాంతినివ్వలేని సంతుగలరు
    ప్రేమలేనిచోట పెన్నిధి దైవ,మే
    సవతియున్నసతికి సౌఖ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  9. (సుకవికి కీర్తి ,సంపద రెండూ లభిస్తాయి .
    అవి కవిసతికి సౌఖ్యాన్నిచ్చే సవతులేగా!)
    నవనవమైన భావముల
    నాణ్యత చిందెడి శబ్దసంపుటిన్
    గవితల వ్రాసి పాఠకుల
    కంచితమోదము నిచ్చు వ్యక్తికిన్
    శివముగ పత్నిమిత్రములు
    చేరును చెల్వగు కీర్తిసంపదల్ ;
    సవతులు గల్గినన్ సతికి
    సౌఖ్యము దక్కునటన్న సత్యమే .
    (అంచితమోదము - చక్కని సంతోషము )

    రిప్లయితొలగించండి
  10. మనసులేని వారు,మానినులైయుండ
    పురుషతతులకెట్లు పుణ్యమబ్బు
    తగవుతోడ నింట తగలాట మున్న,నే
    సవతియున్నసతికి సౌఖ్యమబ్బు
    -------------------------

    రిప్లయితొలగించండి
  11. ఇల్లు చిన్న దాయె యిల్లాలు కొత్తాయె
    వంట యిల్లు లేక తంటలాయె
    నొక్క పడక గదియు చక్కగ మరియు ర
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు

    రసవతి- వంటగది

    రిప్లయితొలగించండి
  12. అన్ని పనులు జేసి యండగా నిలబడి
    తనదు బాగు గోరు తత్వ ముండి
    తలను నాల్క వోలె ధైర్య ము జెప్పు భా
    సవతి యున్న సతికి సౌఖ్య మబ్బు

    రిప్లయితొలగించండి


  13. A terrific treat between every dip :)


    కవనము, కైపదమ్ములను కాంతలుగా భళి మత్తుదేల్చెడా
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే
    జవనపు వేగమై నవ వసంతము చేరగ, వర్ణతూలికన్
    దవలిని నద్దు వేళల ప్రదాయిగ ముద్దుల తేల్చు గేస్తుడే!


    నారాయణ!
    వసంత పంచమి శుభాకాంక్షలతో


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. అత్త మామ పోరు నతివయోర్చునుగాని
    స్వర్గమందునైన సవతిపోరు
    కోరదయ్యె గాదె కోమలి కెవ్విధి
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు.

    రిప్లయితొలగించండి
  15. తాగుబోతు మగని తన్నులు తినలేక
    తోడుగ నొక జోడు దొరకుటకయి
    మరొకదాని దెచ్చి మగనికిచేర్చగ
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  16. మనసు నిర్మలమ్మె మానిని కెపుడైన 
    "సవతి యున్న?, సతికి సౌఖ్యమబ్బు"
    పతియు తనను గూడి పరమ సౌఖ్యమ్మీయ
    సవతియున్న సతికి సౌఖ్య మెట్లు ?

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "సతత సప్రసన్న సౌమ్యభాస" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. అవునండి గమనించలేదండీ
      మీ సవరణ బాగుందండి.

      తొలగించండి
    3. చారువదనరమ్యచలితబింబరదన
      సతతసప్రసన్నసరళసౌమ్యభాస
      మంజువాగ్విలాసమానితమందహా
      సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు

      తొలగించండి
  18. Malli siripuram,
    శ్రీశైలం ప్రాజెక్టు నుండి,
    ఆ.వె//
    కోరిదెచ్చె మగడు గొడ్రాలువతియైన
    సవతి యున్న, సతికి సౌఖ్యమబ్బు !
    సంతు కలిగి నపుడు సంబరములుజేసి
    ఆదుకొంద్రు నన్ను ఆలిననుచు !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గొడ్రాలువతి' అన్న ప్రయోగం సాధువు కాదు."గొడ్రాలుగా నైన" అందామా?

      తొలగించండి
  19. ఆ.వె//
    కోరిదెచ్చె మగడు గొడ్రాలుగా నైన
    సవతి యున్న, సతికి సౌఖ్యమబ్బు !
    సంతు కలిగి నపుడు సంబరములుజేసి
    ఆదుకొంద్రు నన్ను ఆలిననుచు !!

    రిప్లయితొలగించండి
  20. ప్రేమ మీర జూచు పెనిమిటి ముద్దులు
    మూట గట్టు నటుల ముత్యమంటి
    సంతు యింటి లోన సతతము భూదేవి
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"


    ప్రేమగా చూసుకునే భర్త, ముద్దులొలికించే సంతానము, ఇంటిలో ఎప్పుడూ భూదేవి సవతి అయిన లక్ష్మీ దేవి అనగా సిరిసంపదలూ ఉంటే ఆ ఇల్లాలు సుఖంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  21. మైలవరపు వారి పూరణ

    శంకరాభరణం.. సమస్యాపూరణం..

    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే"

    వివిధసుగంధబంధురనవీనవసంతవనాంతరమ్మునన్
    నవనవమల్లికాశరమనోభవతప్తకృశాంగి బాధలన్
    కవులు రచింప., నామెఁ గనగా పరిచర్యలకై చెలుల్ విలా...
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  22. కవితల నాదరించెడు సుకావ్యవిచారరసప్రసంగతల్,
    వివిధపురాణశాస్త్రగతవిశ్రుతచర్చల జేయ నొప్పెడున్
    ప్రవిమలమానసాబ్జమృదుభావవయస్యలు,ధీలసద్వికా
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే

    రిప్లయితొలగించండి
  23. కాయముచెడిన పతి కదలని స్థితినుండ
    సేవ జేయటకొక సేవికవలె
    దొరక భార ముండదు, సతికి ,నాస్థితిన్
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  24. ఆ.వె//
    జగము నేలు భవుని శిగలోని గంగమ్మ
    గౌరి కోర్కె మీర గౌరవముగ !
    తీర్థ నదిగ మారి దీనార్తులను బ్రోచు
    సవతి యున్న, సతికి సౌఖ్యమబ్బు !!

    రిప్లయితొలగించండి
  25. ఈరోజు సిద్దిపేట జిల్లా అనంతసాగర్‌లో బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారు ప్రతిష్ఠించిన శ్రీ సరస్వతీ దేవాలయంలో సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాను. రేపు వరంగల్లులో ఉంటాను. ఈ రెండు రోజులు మీ పద్యాలను సమీక్షించక పోవచ్చు. మన్నించండి.
    నిజానికి అస్వస్థత నుండి పూర్తిగా కోలుకోలేదు. ఇంకా ఒంటినొప్పులున్నాయి. అయినా పోక తప్పదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయినను పోయిరావలె హస్తినకు !!

      తొలగించండి

    2. శంకరాభరణం సమస్య - 948

      "అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్"

      రయమున స్కూటరెక్కుచును రంగుల టీవిని మార్కెటందునన్
      భయమును వీడి గైకొనుచు భామకు తోడుత మంచమెక్కుచున్
      నయమున చూడ వచ్చుగద నందము మీర పకోడి మేయుచున్...
      అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్
      ప్రియముగ నేడిపించగను పిండిని రుబ్బెడి యత్తగారినిన్

      (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

      https://gpsastry.blogspot.com/2019/08/948.html?m=0

      తొలగించండి
  26. ఈరోజు అనంతసాగర్ సరస్వతీ క్షేత్రంలో నేను చదువబోయే పద్యాలు...

    సరస్వతీ స్తుతి....

    జననీ! భారతి! బ్రహ్మ వక్త్రములలోఁ జైతన్య చిద్రూపివై
    యనయంబున్ వసియించి సృష్టి కరణవ్యాపారతన్ నిల్పి నా
    థుని, సద్విద్యల నెల్ల నేర్చు పథ నిర్దుష్టమ్మునున్ జూపు నీ
    ఘన విద్వత్ప్రభలన్ మనోంబుజమునన్ గాంచంగ నేనెంచెదన్.

    నిరతము నీ పదాబ్జముల నిల్పి మనమ్ములలోఁ గవీశ్వరుల్
    సరస వచో విలాస పరిసర్పిత ‌మంజుల సత్కవిత్వమున్
    స్ఫురదవధారణా సహిత ముగ్ధ మనోహర కావ్య దీప్తి సం
    భరిత రసజ్ఞ మానస విభాసిత శేముషితో రచింతురే.

    పలుకుల వెలఁది వగుచు మా
    తలవాకిటఁ బొల్చుచున్ సతము లచ్చికిఁ గో
    డలివై చదువుల సిరులిడు
    తలఁపు గలుగు తల్లివని ముదంబునఁ గొలుతున్.

    నీ కమనీయ రూపము పునీతము సచ్చిదనూనదీప్తమౌ
    నీ కరుణాకటాక్షము జనింపఁగఁ జేయును పాండితీప్రభల్
    నీకయి చేయు సన్నుతులు నిక్కముగాఁ దొలఁగించు నజ్ఞతన్
    నీ కొమరుండ నేనని గణించి సుశబ్దము లిచ్చి ప్రోవుమా!

    భక్తిన్ త్వచ్ఛుభ దివ్య నామమును సంభావించుచున్ సత్క్రియా
    సక్తిన్ విద్య గడింపఁ జూచు నను శశ్వద్ జ్ఞాన సందీప్త వా
    గ్యుక్తున్ జేసెడి తల్లి వీవనుచు సద్యోభక్తిభావంబునన్
    రక్తిం బూజలు సేయుదున్ విబుధహృద్రమ్యాకృతీ! భారతీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అధ్భుతమైన పద్యమాలిక!ఆచార్యా నమోనమః!!

      తొలగించండి
    2. అద్భుతము ఆచార్య పాద పద్మములకు నమస్కారము అరొగ్యము జర జాగ్రత్త సుమా

      తొలగించండి
    3. పంచపద్యపుష్పగుచ్ఛంబుతో వాగ్దేవీ పూజ మహోత్కృష్టముగా నాచరించితిరి గురువరేణ్యులు. నమస్సులు.
      భక్తిం ద్వచ్ఛుభ...

      తొలగించండి
  27. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య


    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు

    సీస ములో పూరణము



    మాద్రి తోడుగనుండ మగువ కుంతి నెపుడు కలతను బడలేదు ఖలము లోన
    కైక సుమిత్రలు కౌసల్య కు సతులై నను వారు సతము మోదనము బడిసె
    సాత్రాజితి కితోడు జాంబవత్యాది సవతులుండ రుక్మిణి వంత నెపుడు
    పడలేదు భువి లోన, పార్వతియు శిరము పైన సవతి తోడ బాళి పొందె

    తరచి చూడ దేవతలకు మనుజులకు
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"
    నేర మనుచు నిపుడు నీవు తలచ నేల
    ననుచు సతిని కాంచి నాధుడనెను




    ఖలము = భూమి , వంత = బాధ , బాళి = ఆనందము

    రిప్లయితొలగించండి
  28. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు
    నటన్న సత్యమే"
    "సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"

    సందర్భము:
    1 వ పూరణం
    "కౌసల్య ముక్తి కాంతా సమానాకార
    నలి సుమిత్ర యుపాసనా స్వరూప
    విజయరమాకార వినయాంబుధి సుమిత్ర
    కైకేయి మధు సామ గానమూర్తి"
    ( రామాయణ కల్పవృక్షం)
    అవతార ప్రణాళికలో భాగంగా కైక వరాలు కోరింది. రాముడు వనగమనం చేశాడు. దశరథుడు కన్ను మూశాడు. కౌసల్య భోరున విలపిస్తూ ఇలా అన్నది..
    " "నాథా! నీ వెప్పుడూ ఇలా అంటూ వుండే వాడివి కదా! "భర్త క్షేమమే భార్యయొక్క ప్రధానమైన తలంపు (బాధ్యత). సవతు లుంటే ఆ బాధ్యతను పంచుకుంటారు కాబట్టి భార్యకు శ్రమ తగ్గుతుంది."
    పిచ్చిదాన్ని నమ్మాను. కాని, అయ్యో! ఇప్పు డిట్లా అయిం దేమిటి! విధిని దాటలేము కదా!
    ఇంకా నీ విలా అంటూ వుండే వాడివి.. "సవతులు వుంటే సతికి సౌఖ్యం లభిస్తుంది." కాని ఆ మాటలో సత్య మెక్క డున్నది?" "
    2 వ పూరణం..
    దశరథ నిర్యాణంతో పురప్రజ లిలా అనుకున్నారు.. " మగని పంచుకున్నా మేలే అనుకోవచ్చు. కాని చంపకుంటే చాలు. (భర్త తన మాట జవదాటరా దని తనకు మాత్రమే వశమైపోవా లని పెట్టుడు మందులు పెట్టిన సతు లున్నారు. ఆ మందులతో జబ్బుపడి మృతులైన భర్తలూ వున్నారు లోకంలో.)
    సవతియైన కైకవల్ల కౌసల్య ఏం సుఖపడింది? అస లే రీతిగా వస్తుంది సవతి వుంటే సతికి సౌఖ్యం ?"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *సవతి సుఖము*

    "ధవుని కులాసయే సతికి
    దండి తలంపు.. సపత్ను లున్నఁ ద
    క్కువ శ్రమ.. యట్టి బాధ్యతను
    కోరి వహించెద" రంటి.. విట్టు ల
    య్యె.. విధిఁ దరింప రాదు గద!
    యెప్పుడు నీ విటుఁ బల్కుచుంటివే!
    "సవతులు గల్గినన్ సతికి
    సౌఖ్యము దక్కు" నటన్న సత్యమే! 1

    మగనిఁ బంచుకొన్న మరి మేలె యనవచ్చుఁ..
    జంపకున్నఁ జాలు సవతి మగని..
    కైకతోడ సుఖమె కౌసల్య!.. కే రీతి
    సవతి యున్న సతికి సౌఖ్య మబ్బు?.. 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    29.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  29. అందరికీ వినమ్ర నమస్సులతో 🙏🙇‍♂

    *కంది గురువులకు మరొక్కమారు నా సమస్యని ఆమోదించినందుకు శత సహస్ర ధన్యవాదములతో*

    *కళ్యాణ్ చక్రవర్తి*
    *పూరణ*

    *ఆ వె*

    ఇల్లు నొకటి యుండె నిరుకుగ మాకును
    పండు కొనుట కుండె వండు నెటుల
    మెండు వంట కొరకు మేలగు నొక్క ర
    *"సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"*

    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరదా పూరణ ప్రయత్నం 🙏

      *ఆ వె*
      భయము నేర్పు గొరకు భర్తలకెపుడును
      అన్నమొండి పెట్ట నత్త కొరకు
      ఆడబిడ్డ జేయుఁ నవహేళనల కొక
      *"సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"*!

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
    2. *మరో సరదా పూరణ*
      *ఆ వె*

      పళ్ళు పోయినట్టి యొళ్లు తడబడుచున్
      పండు ముదుసలి యగు పతి కొరకు
      పైసలు వలదనుచు పరుగున వచ్చెడి
      *"సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🌸🙏🌸🙏

      తొలగించండి
  30. మిత్రులందఱకు నమస్సులు!

    "భవితయె వెల్గునట్లుఁ దన పజ్జను నెప్పుడుఁ దోడునీడగన్
    సవనము రీతిఁ ద్రిమ్మరుచుఁ; జక్కఁగఁ బ్రేముడి బందముం దగన్
    భవనము వోలెఁ దీర్చి; పనిపాటులఁ దోడ్పడు సేవికా విలా

    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు!" నటన్న సత్యమే!

    రిప్లయితొలగించండి
  31. అవధులు లేని ప్రేమ బతి యాదరమొప్పగ జూచినన్ పరా
    భవముగ దోచునెన్నడును భర్తను వేరొక నాతితో గనన్
    భవముగ భోగ భాగ్యముల బంచుకొనందగు గాని దల్పగా
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సగము మేను నిచ్చె శంకరుండు సతికి
      దలను నిలిపె సవతి దలప దానె
      యగ్ర భాగమటుల నామెకంద నెటుల
      సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు

      తొలగించండి
  32. రామరావణజగడమ్ముగలుగుసుమ్ము
    సవతియున్నసతికి,సౌఖ్యమబ్బు
    వేరుకాపురమ్ముబెట్టుసతికిగద
    చిలుకగోరువంకవలెనునుండ్రు

    రిప్లయితొలగించండి
  33. ఆటవెలది
    చక్కనైన వాడు సంపదల్ కలవాడు
    స్థితికి కార కుండు శ్రీహరి యన
    ధనము నీయఁ దాను ధాన్యమ్ము నొసఁగెడు
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  34. అన్న మూల మయ్య యవనీ తలమ్మని
    యన్న మాట నరయ సన్న మగునె
    యాధునికము మఱియు నద్భుతం బైన ర
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు

    [రసవతి = వంట యిల్లు]


    వివశులఁ జేసి శత్రువులు పీడ లొసంగఁగ శాంతి యుండునే
    కవియఁగ నింటఁ దస్కర నికాయము దాచిన కాసు లుండునే
    వివరము లున్న భాండమునఁ బేయము లక్కటఁ ద్రాగ నిల్చునే
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే?

    రిప్లయితొలగించండి

  35. ... శంకరాభరణం... 29/1/2020 ..బుధవారం

    సమస్య.
    *******
    "సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే

    నా పూరణ. చం.మా.
    ** ***
    (తాగుబోతు భర్త కొట్టె దెబ్బలు భరించలేక ...సవతులు ఉంటె కొన్ని దెబ్బలు వారికి పడును గదా అని శ్రీకృష్ణునితో ఓ భార్య ఇలా విన్నవించుకొనుచున్నది )


    చవటగు భర్త త్రాగి నను చచ్చెడు రీతిగ గొట్టుచుండె..మా

    ధవ!పతి కున్న నీకు వలె దారలు నెన్మిది గల్గియున్న నా

    భవుడు విఘాతముల్ కొలది భాగము వారలు స్వీకరించరే??

    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి

  36. ... శంకరాభరణం... 29/1/2020 ..బుధవారం

    సమస్య.
    *******
    "సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే

    నా పూరణ. చం.మా.
    ** ***
    (తాగుబోతు భర్త కొట్టె దెబ్బలు భరించలేక ...సవతులు ఉంటె కొన్ని దెబ్బలు వారికి పడును గదా అని శ్రీకృష్ణునితో ఓ భార్య ఇలా విన్నవించుకొనుచున్నది )


    చవటగు భర్త త్రాగి నను చచ్చెడు రీతిగ గొట్టుచుండె..మా

    ధవ!వినుమయ్య! నీకు వలె దారలు నెన్మిది గల్గియున్న నా

    భవుడు... విఘాతముల్ కొలది భాగము వారలు స్వీకరించరే??

    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  37. Really very happy to say that your post is very interesting. I never stop myself to say something about it. You did a great job. Keep it up.
    We have an excellent information in cinema industry. We are showing updated news that are very trendy in the film industry. For further information, please once go through our site.
    Trending

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. సి నే మా లో సమస్యాపూరణకు పిలుస్తున్నారు కామోసు :)



      తొలగించండి
  38. క్రొవ్విడి వేంకట రాజారావు:

    శాంతి మృగ్యమగును సదనమ్మునందున
    సవతియున్న; సతికి సౌఖ్యమబ్బు
    పతియె శీలుడౌచు పావనమౌ రీతి
    కాపురమ్ము నెంచి కదలునపుడు.

    రిప్లయితొలగించండి
  39. ధవుని తురంగమందున సదా తన రూపమె నిల్చిన చాలునంచునీ
    నవలలు కోరుచుందురిల, నారకమే కద యుర్విలో గనన్
    సవతులు గల్గినన్ సతికి, సౌఖ్యము దక్కు నటన్న సత్యమే
    యువిదను గారవించెడి మహోత్తముడే పతి యైన భార్యకున్.

    రిప్లయితొలగించండి
  40. చం:

    వివరము లెంచి జూడ నగుపించును భాగవతమ్ము లో గనన్
    కవనము నందు కృష్ణుడును కారణ హేతువు సత్యభామయున్
    దివి కడ నెగ్గి యుద్ధమున దేవగ వృక్షము పారిజాతమున్
    పువులిడ సాగె రుక్మిణిగ పూనిక వేడుక భవ్య సంపదల్
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  41. చంపకమాల
    శివుడు శిరమ్ము గంగ కిడఁ జిక్కదె శాంకరి నిద్రమానుచున్?
    జివుకదె సత్య, రుక్మిణికి శ్రీకరుఁ డీయఁగ పారిజాతమున్?
    ధవుని మనమ్ము నింకొకరి ధ్యాసనుఁ జిక్కిన నోర్వదేని యే
    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే?

    రిప్లయితొలగించండి
  42. క్రొవ్విడి వేంకట రాజారావు:

    సౌరు గూడిన రీతి సవరించబడి యుండి
    వంట చేయు కొఱకు వాసిమీఱ
    దిగులు లేని రీతి దినుసులుంచబడు ర
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు.

    రిప్లయితొలగించండి
  43. సవరణతో.


    ... శంకరాభరణం... 29/1/2020 ..బుధవారం

    సమస్య.
    *******
    "సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే

    నా పూరణ. చం.మా.
    ** ***
    (తాగుబోతు భర్త కొట్టె దెబ్బలు భరించలేక ...సవతులు ఉంటె కొన్ని దెబ్బలు వారికి పడును గదా అని శ్రీకృష్ణునితో ఓ భార్య ఇలా విన్నవించుకొనుచున్నది )


    చవటగు భర్త త్రాగి నను చచ్చెడు రీతిగ గొట్టుచుండె..మా

    ధవ!వినుమయ్య! నీకు వలె దారలు నెన్మిది గల్గియున్న నా

    ధవుడిక సుంత ఘాతములు, తాడము వారల కిచ్చు గావునన్

    సవతులు గల్గినన్ సతికి సౌఖ్యము దక్కు నటన్న సత్యమే


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  44. భవములునాశనంబగునుభావితరాలునుగేలిసేయునే
    సవతులుగల్గీనన్ ,సతికిసౌఖ్యముదక్కునటన్నసత్యమే
    ధవుడనునాతడెప్పుడునుదానపురూపముగాగజూచుచో
    భవితనుగూర్చిబెంగయునుబాధనుగానికలేకయుండుటన్

    రిప్లయితొలగించండి
  45. కనగయొరనురెండుకత్తులెట్లిముడును
    నేలయెట్లుగూడునేలతోడ
    వెర్రితనముగాదె పేరిమినూహింప
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు?

    రిప్లయితొలగించండి
  46. ఆటవెలది
    ధనము సౌఖ్యమొసఁగు తలపునఁ దలయూచి
    కోటి ధనము నిచ్చు బోటి తోడఁ
    దాళిఁ బంచు కొనగ ధనరాశులన్ దేల్చు
    సవతి యున్న సతికి సౌఖ్యమబ్బు! ?

    (శుభలగ్నం సినిమా నేపథ్యంలో..)

    రిప్లయితొలగించండి


  47. ఆటవెలది పాదగర్భిత కందపూరణ జిలేబీయము :)



    మిన్నగ మగడిని కోరుము
    తిన్నగ కట్టుకొనుము వసతిగ పువుబోడీ
    యెన్నగ మేలగు ర "సవతి
    యున్న సతికి సౌఖ్యమబ్బు" ను కదా పుడమిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  48. ఇంటి నన్నివసతు లిమ్ముగా యున్నను
    ఆధునికత తోడ నన్ని గదులు
    కంటికింపు గాను కన్పించు మంచిర
    సవతి యున్నసతికి సౌఖ్యమబ్బు
    మరొక పూరణ

    ఈసు హెచ్చు చుండు నిలలోన పడతికి
    *సవతి యున్న,సతికి సౌఖ్యమబ్బు*
    పతియు రామచంద్రు వలె నొక్కభార్యకె
    పంచు చుండ ప్రేమ పదిలముగను.

    రిప్లయితొలగించండి