30, జనవరి 2020, గురువారం

సమస్య - 3266 (వాగ్దేవినిఁ గొల్చు...)

కవిమిత్రులారా,
వసంత పంచమి శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁ డగునా"
(లేదా...)
"వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా"

38 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    జగ్దల్ పూరున పుట్టి ముస్లిములకున్ జందెమ్మునున్ దాల్చుచున్
    బాగ్దాదున్ జని మస్జిదందు నిడుచున్ బంగారు నాణెమ్ములన్
    వాగ్దానమ్మును జేసి మాత నెపుడున్ ప్రార్థింప బోనంచు తా
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా?

    రిప్లయితొలగించండి
  2. స్నిగ్దత కలిగిన భక్తిని
    ముగ్దత్వము తోన గొల్వ మోక్షము దక్కున్
    గీర్దేవి తలచి నంతనె
    వాగ్దేవినిఁ గొలుచు వాఁడు పండితుఁ డగునా ?
    { అగును }

    రిప్లయితొలగించండి

  3. శంకరాభరణం..
    30/01/2020...గురువారం

    సమస్య

    "వాగ్దేవిని గొల్చువాఁడు పండితు డగునా"

    నా పూరణ కం!!
    *** *** ***

    వాగ్దేవత దయ యున్నను

    వాగ్దాటియె భూరి నబ్బి ప్రాజ్ణుండవడే?

    వాగ్దండము జేయ కిటుల

    "వాగ్దేవిని గొల్చువాఁడు పండితు డగునా"


    వాగ్దండము..నింద


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దిగ్దంతుండను నాకు సాటి యెవరన్ తీండ్రించి కోపించుచున్
    దగ్దద్దగ్దదమంచు నత్తి వలనన్ దారుణ్యమౌ తీరునన్
    వాగ్దోషమ్మును మాపకే పరిపరిన్ భ్రష్టంపు మంత్రమ్ములన్
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా?

    రిప్లయితొలగించండి


  5. ధగ్దంబై యజ్ఞానము
    వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁడగు నా
    వాగ్దేవి కరుణ మీరగ
    స్నిగ్ధత మెరయు పలుకుల పసిడిమెరుగువలెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. దుగ్ద కలిగి నప్పటికిని
    వాగ్దండము లాడువాడు
    ప్రాజ్ఞుడు గాడే
    వాగ్దలముల పైపైననె
    వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁ డగునా

    వాగ్దండము = నింద/తిట్టు
    వాగ్దలము = పెదవి

    రిప్లయితొలగించండి


  7. వాగ్దేవీ! గను దూరదర్శనులిటన్ ప్రశ్నించిరే శంకతో
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా?
    వాగ్దేవీ! దయ నీదు గా కుదురదే ప్రావీణ్యతల్ చేయగా
    స్నిగ్ధాముగ్ధముహుర్ముహుర్లుఠితమై శీఘ్రమ్ముగాపూరణల్


    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. గురుతరముగ వాగ్దేవినిఁ గొల్చు వాఁడు
    పండితుఁడగు నాణ్యత గల్గి భాసిలు భువి
    లోన శంకరాభరణములో కవీశు
    ల వలె యనుమాన మింకవలదు జిలేబి


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. ముగ్దా! ప్రాజ్ఞుండగు నా
    వాగ్దేవినిఁ గొల్చువాడు పండితుఁ డగునా
    వాగ్దండమిడుతు నెప్పుడు
    వాగ్దేవిని తూలనాడు వ్యర్థుడు భువిలో.

    రిప్లయితొలగించండి
  10. (వాణీవరివస్య చేసినవారు విద్వద్వతం
    సులు-చేయనివారు విద్వద్విహీనులు )
    దిగ్దంతుల్ వలె బెద్దనాది కవులే
    దేదీప్యసన్మాన్యులై
    వాగ్దోషంబులు లేని కావ్యరచనన్
    బ్రఖ్యాతులైనార లా
    వాగ్దేవిం గడుభక్తి గొల్చిన ; నెటుల్
    పాండిత్య మబ్బున్ సఖా!
    వాగ్ధారల్ ? పృథుభావముల్ ? రసములున్ ?
    వక్రోక్తి సౌభాగ్యముల్ ?

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    బాగ్దాద్వాసివొ? హైందవేతరుడవో? పౌరాణికార్థమ్ము స...
    మ్యగ్దృష్టిన్ గనలేని యంధుడవొ! అమ్మన్ నమ్మగాలేని నీ
    దృగ్దారిద్ర్యమునేమనన్ వలెనొ ? వాదింపంగ నిట్లందువా !
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  12. దిగ్దంత్యార్య సమాజమున్ మదముతో దిట్టన్ బ్రయత్నించుచున్
    వాగ్దాక్షిణ్యలవంబు లేక ఖలుడై వర్తిల్లుచున్ దౌష్ట్యముల్
    దిగ్దైవంబుల సాక్షిగా సలుపుచున్ "దేవీ! నమో" యంచు నా
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా

    రిప్లయితొలగించండి
  13. కం.
    వాగ్దేవి కృపను బొందగ
    వాగ్దేవిని బొగుడు పతికి వాక్కుల నొసగెన్ !
    వాగ్దాటి లేక నేడ్చుచు
    వాగ్దేవిని గొల్చువాడు పండితుడగునా !!

    రిప్లయితొలగించండి
  14. కోర్కె మీర వాగ్దేవిని గొల్చు వాడు 
    పండితుడగు నాకా యిది పని యనుచును 
    పద్య మల్లగ దలచిన పట్టువడునె 
    యామె కరుణ లేకను యది యలవడునదె ?

    రిప్లయితొలగించండి
  15. వాగ్దేవి కరుణ బొందగ
    వాగ్దేవిని గొల్చు వాడు పండి తు డ గు : నా
    వాగ్దేవిని నిందింపగ
    వాగ్దేవి కరుణ దొరఁగి వ్యర్థుo డగు దాన్

    రిప్లయితొలగించండి
  16. వాగ్దానంబిది శ్రుతులన్
    వాగ్దేవిని గొల్చువాడు పండితుడగు,నా
    దిగ్దంతులబోలు కవులు
    వాగ్దేవిని గొల్చిగాదె ప్రాభవమందెన్ ?

    రిప్లయితొలగించండి
  17. దిగ్దంతుడు దానగుగా
    వాగ్దేవినిఁ గొల్చువాఁడు; పండితుఁ డగునా
    వాగ్దుష్టతతో నిరతము
    వాగ్దండములాడు వాడు పాషండుడె పో!

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    "వాగ్దానంబుల నిల్పఁగాను నెపుడున్ వాక్శుద్ధికై విద్యలన్
    బాగ్దాదైనను బోయి నేర్వవలయున్ బాండిత్యమేపారఁగా!
    దిగ్దంతుల్ సెనకంగలేరు! చదువుల్ దిగ్దర్శినుల్ సూడకే,

    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా?"

    రిప్లయితొలగించండి
  19. అందరికీ నమస్సులతో ..🙏🙏

    కవివర్యులందరికీ వసంతపంచమి శుభాకాంక్షలతో 🙏🙏💐💐

    *కం||*

    వాగ్ధాటిని పెంచుకొనిన
    వాగ్దేవియె రాదు నీకు వాదించకు, యా
    వాగ్దేవి కృపను లేకయు
    *"వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁ డగునా"*


    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏💐🙏💐🙏

    రిప్లయితొలగించండి
  20. తండ్రి కూతురు లతో కాబోయే అల్లుడి సంభాషణ:

    కం:

    వాగ్దానముగా బొందితి
    వాగ్దాత్తా నేను నీకు వావియు వరుసన్
    వాగ్దన్డము లేల యిపుడు
    వాగ్దేవిని గొల్చు వాడు పండితుడగునా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  21. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁ డగునా


    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    కాళిదాసు ఒక గొల్లవాడు. పామరుడు. విద్యోత్తమ అను ఒక యువరాణి పండితుల నందరిని ఓడించు చుండెడిది. పండితులు అందరు అవమానము పొందుచు ఆ యువరాణి మీద పగ తీర్చుకోవటానికి ఒక పధకము పన్ను తారు. కాళిదాసును అతని వేష భాషలు మార్చి గొప్ప పండితుడుగా తెలుపుచు యువరాణిని, రాజును మోసము చేసి ఆవిడతో వివాహము జరిపిస్తారు. మొదటి రాత్రి కాళిదాసు యొక్క నిజ స్వరూపము కాంచి ఆ యువరాణి బాధ పడు సందర్భము.
    .

    కావ్యము లెన్నియో కడు రమణీయతన్ వ్రాసినట్టి ఘను డీ పండితుడని
    దెల్ప రయముగ వాగ్దేవి నొసంగిన పతియని తలచుచు పరవశముగ
    నొక పామరునిచే గళకమున తాళిని గట్టించు కొంటిగా, కపట బుధ్ధి
    నెరుగక పోతిని, వెరవక గుడిలోన నిల్చి వాగ్దేవినిఁ గొల్చువాఁడు
    పండితుఁ డగునా భువనము నందనెడి సందియము నీ చెదరు మదిని దొరయగ

    లేదు గా నాడు, హతవిధీ! రోదనమ్ము
    చేయుచు నతనితో గొడవలు చేయ నాదు
    పరువు పోవుగా ననుచు పడక టింట
    సతి కలత చెందె కోనాడి పతిని గాంచి

    కోనాడి = గొల్లవాడు
    చెదరు మది = చెడ్డ బుధ్ధి
    దొరయుగ లేదు = కలుగ లేదు

    రిప్లయితొలగించండి
  22. కందం
    దుగ్ధా పూర్వకముగ సం
    దిగ్ధమ్ముల్ తీర్చు కొనక ధీకవి పఠనన్
    వాగ్దారన్ బడయకయే
    వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁ డగునా?

    శార్దూలవిక్రీడితము
    దుగ్ధన్జెందక భాష మ్రింగుడగునే? దోషాలు బాయంగ, సం
    ధిగ్ధమ్ముల్ విడ పూర్వ కావ్య పఠనల్తీర్చంగ నభ్యాసివై
    వాగ్దారన్ పురుషప్రయత్నమున సంపాదించగన్ బూనకన్
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా!

    రిప్లయితొలగించండి
  23. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  24. స్నిగ్ధుండనె తా కవియగు
    వాగ్దేవిని గొల్చువాడు,పండితుడగునా
    వాగ్ధాటియులేకనుసం
    దిగ్ధముతోనెల్లపుడును తిరుగును భువిలో

    రిప్లయితొలగించండి
  25. ప్రాగ్దేశాంతర వాసు లు
    దగ్దే శావాసులు నిరతము వెండియు ప్ర
    త్యగ్దేశు లడుగుదు రిటులు
    వాగ్దేవినిఁ గొల్చువాఁడు పండితుఁ డగునా


    ధిగ్దోషావృత నిత్య శంకిత మనో ధీరా మహా మానవా
    ప్రాగ్దిక్భూతుఁడ విన్ము తీరుఁ ద్రుటి దుష్పాత్రంపు సందేహమే
    వాగ్దోహాభిష వార్ద్ర చిత్త జని తాపార ప్రతోషమ్మునన్
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విద్యల కెల్ల దేవతవు వేద గిరార్చిత మాతృ మూర్తివే
      హృద్య ఫలాశ నాక్ష కుసు మేప్సిత పుస్తక యుక్త పాణివే
      చోద్య విపంచికా స్వర యశో భరి తాఖిల లోక వేదసం
      వేద్య సురాళి పూజిత వివిక్త విరించి మనో విలాసినీ

      తొలగించండి
    2. సాహిం సోద్యమ తర్జితాంగ్ల జన సర్వాధీనతా భావ సం
      దోహభ్రాజిత పుణ్య పూరుషుఁడు సద్యో వైభ వోద్యుక్తుఁడున్
      బాహాబాహవి వైర భీత సుమహాజ్వాలావృతస్వాంత సం
      దేహవ్రాత సుచోది తాపకృత నిర్దేశ్యుండు మా గాంధియే

      తొలగించండి
  26. స్నిగ్ధతనువ్రాయురచనలు
    వాగ్దేవినిగొల్చువాడు,పండితుడగునా?
    వాగ్ధాటి లేనిమనుజుడు
    వాగ్దేవియుసంతసిలదుపాండిత్యమునున్

    రిప్లయితొలగించండి
  27. దిగ్దంతియె కవివర్యుడు
    వాగ్దేవినిఁ గొల్చువాఁడు, పండితుఁ డగునా
    వాగ్దేవినెపుడుగొల్వక
    స్నిగ్ధంబగుకావ్యరచన జేయగబూనన్

    రిప్లయితొలగించండి
  28. వాగ్దేవింగడుభక్తిగొల్చిననెటుల్ పాండీత్యమబ్బున్ సఖా!
    వాగ్దేవేగడురక్తినిచ్చునుదగన్ బాండిత్యమున్ దానుగా
    వాగ్ధాటిన్ గడునేర్పుమీరగవచోపాండిత్యమున్ జూపుచో
    దుగ్ధన్ నొందుచునేర్చుకుండినవహాదానంతరాకుండునా!

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్
    పాండిత్యమబ్బున్ సఖా"

    సందర్భము: ఋషి కాని వాని వ్రాతలు నీటిమీది వ్రాతలు. కాలాని కెదురీద లేని యీతలు. ఒట్టి సొరకాయ కోతలు. అందుకే నా నృషిః కురుతే కావ్యమ్.. అన్నారు లాక్షణికులు. వాల్మీకి ఒక ఋషి పుంగవుడు. రామాయణ మా మహానుభావుని తపః ఫలం. అనుభవిస్తున్నది మనం.
    అందుకే విశ్వనాథవారు కల్పవృక్షంలో ఇలా అంటారు..
    "ఈ సంసార మి దెన్ని జన్మలకునే
    నీ మౌని వాల్మీకి భా
    షా సంక్రాంత ఋణంబు దీర్పగలదా!
    సత్కావ్య నిర్మాణ రే
    ఖా సామగ్రి ఋణంబు దీర్పగలదా!
    కాకుత్థ్సు డౌ స్వామి గా
    థా సంపన్నము భక్తి దీర్చినను ద్వై
    తాద్వైత మార్గంబులన్"
    ఎక్కువ చెప్పజాల నిక నింతటితోనె ముగింతు..
    వాగ్దేవీశ్వరుడు (బ్రహ్మ), పార్వతీశ్వరుడు (శివుడు) కొలువగా విరాజిల్లే రాముని కథ తపోధీరుడైన వాల్మీకి కావ్యంగా రచించాడు. కేవలం వాగ్దేవిని కొలిచే వానికి తపస్వి కాని వానికి (అంత గొప్ప) పాండిత్య మబ్బుతుందా!.. అని నా పూరణ పద్య భావం.
    పుట్ట పుట్టువు = వాల్మీకి
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *నా నృషిః కురుతే..*

    వాగ్దేవీశ్వర పార్వతీశ్వరులు గొ
    ల్వం విశ్వ కళ్యాణ స

    మ్యగ్దృష్టిన్ బయనించు రాము చరితం
    బందించె సాహిత్య స

    ద్దిగ్దంతిన్ బలెఁ బుట్ట పుట్టువు.. తపో
    ధీరుండు కాకున్నచో

    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్
    పాండిత్య మబ్బున్ సఖా!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    30.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  30. స్నిగ్ధంబౌపదగుంఫనమ్ములునురాశీభూతమౌ భావముల్
    వాగ్దిగ్దంతులభవ్యకావ్యములసంభావింపగాదోచెడిన్
    వాగ్దేవీమహిమంబు, నెంచతరమాభక్తాగ్రగణ్యుల్ వినా
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా!

    రిప్లయితొలగించండి
  31. ముగ్దా! పండితుడై భువిన్ వెలుగడే మూడుండదే చూడగా
    వాగ్దేవీ కరుణాకటాక్షముల సంపాదింప నిత్యంబు తా
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చిన, నెటుల్ పాండిత్యమబ్బున్ సఖా
    వాగ్దండమ్ముల వేయుచున్ గురువులన్ వంచించు హీనాత్ముకున్.

    రిప్లయితొలగించండి