నిన్న ప్రకటించిన ఉగాది పద్య సంకలనం అందరికీ ఆనందాన్ని కలిగించింది. సామూహిక భాగస్వామ్యంతో పుస్తకంగా ముద్రించాలని అందరి కోరిక. ఈ కరోనా వ్యగ్రత తొలగిన తర్వాత అలాగే చేద్దాం. ఇప్పుడు తొందర లేదు.
అయితే ఇప్పటి పి.డి.యఫ్.లో కొన్ని పొరపాట్లు దొర్లాయి. కొందరు పంపిన ఉగాది పద్యాలు నా అజాగ్రత్త వల్ల తప్పిపోయాయి. మరికొందరు "అయ్యో... మాకు తెలియదండీ. ఇప్పుడు పంపించమంటారా?" అని అడిగారు.
ఎలాగూ పొరపాట్లు సరిచేసి శుద్ధప్రతిని సిద్ధం చేయబోతున్నాను కనుక తప్పిపోయిన కవిమిత్రులు తమ ఉగాది పద్యాలను పంపించ వలసిందిగా కోరుతున్నాను.
మీ పద్యాలను shankarkandi@gmail.com అన్న చిరునామాకు మెయిల్ చేయండి. లేదా నా వాట్సప్ నెం. 7569822984 కు పంపించండి.