ప్రజలకు మాతృభాషయన బండితులన్నను హేయభావమో రుజుడగు ఱేడుపాలకుడు రోసి పదోన్నతి లేదు పొమ్మనన్ నిజము గ్రహించి యాంగ్లమును నేర్చిపదోన్నతి బొంద దల్చరే ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్
నిజమిది కాదు కాదనుచు నివ్వెర పోవు విధమ్ము జోరుగా ప్రజలు తిరస్కరించిరిదె, పద్యకవిత్వము నన్నిరీతులన్ సుజనులు చేవచేర్చినది శోభల గూర్చునటంచు చెప్పి వ చ్చి జయమటంచు ఘోషలను చేసిరి సభ్యుల మెచ్చుచున్ భళా
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండి*ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"*
(*ఆంగ్ల మాధ్యమమే*)
*కం||*
గజిబిజి రాజ్యము నందున
మజిలీ వలె మారి పోవు మన చదువులతో
సుజనులు మెచ్చక పోవగ
*ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😞🙏😞🙏
అందరికీ నమస్సులు
తొలగించండి*కం||*
ప్రజలందరి మెప్పును గొని
అజరామరులైతిరి గద యప్పటి కవులే
నిజమిది నమ్ముట తప్పదు
*ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😞🙏😞🙏
నా *సరదా* పూరణ 🌹🌹🌹
తొలగించండి*కం||*
విజిలును వేయుచు నిత్యము
గజిబిజి సీరియలుకొరకు గంటలు గడుపన్
నిజమగు సొబగులు తెలియని
*ప్రజల, తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😊🙏😊🙏
మరో ప్రయత్నం 🌹🌹🌹🌹
తొలగించండి*కం||*
రజనీలై ప్రజలు వెడలు
భజనలు జేయగ నిరతము పరుగుల నిడుచున్
నిజమగు ఛందసు దెలియని
*ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏🌸🙏
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
మాత్రా గణకుడు (భావం):
భజనలు చేసి పండితులు ప్రాస గణమ్ముల నెత్తికెత్తుచున్
గజగజలాడ జేయుచు నఖండ యతీంద్రుని చీటిమాటికిన్
సుజనుల యన్యదేశ్యముల సూదులు గ్రుచ్చుచు వెక్కిరించగా
ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్
నిజమనినమ్మియీప్రజలు,నీపయిభారముబెట్టినిల్పగా
రిప్లయితొలగించండిభజనలుజేసినావుగద,బాధ్యతనాదని మెచ్చుకోలుగా
ప్రజలికవణ్కుచుంటిరిల, ప్రాభవమందినరాజధానిలో
ప్రజలుతిరస్కరించిరిదె ,పద్యకవిత్వమునన్నిరీతులన్
++++++++=======++++++
రావెలపురుషోత్తమరావు
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
సరదా పూరకుడు:
భజనలు చేసి శంకరుని ప్రాభవ మొందుచు పద్యమల్లుటన్
గజగజలాడకే తునుమ కాంగ్రెసు లీడరు రాహులన్ననున్
సుజనులు మెచ్చగా నిచటి సుందర రీతుల నెచ్చటయ్యరో: 👇
"ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్" ?
రిప్లయితొలగించండిసుజనులు శంకర వర్యుల
నిజమగు ప్రోత్సాహము కృషి నెక్కొలిపె భళా
సజనుల వేదిక నెట్లౌ
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్?
జాల్రా
జిలేబి
(ఎడ్డెమంటే తెడ్డెమనే వితండవాది ఒకసభలో ఎవరికీ తెలియకుండా
రిప్లయితొలగించండినల్లబల్లపైన మన సమస్యావాక్యం వ్రాస్తే పెద్దాయన సమాధానం)
విజయమునందినారు కద
వేయగు నేండ్లకు ముందు నుండియే
సుజనులు నన్నయాది కవి
శూరులు పాఠకకోటి గుండెలన్ ;
గజిబిజి వ్రాతలన్ విడచి
కాంచుము నీయది పద్యపాదమే
"ప్రజలు తిరస్కరించిరిదె
పద్యకవిత్వము నన్నిరీతులన్."
ప్రజలందరి మెప్పు బడసి
రిప్లయితొలగించండి.నజరామరమయ్యెనాడు నవనీ స్థలిలో
గజిబిజి వ్రాతలె నిండగ
ప్రజల తిరస్కృతియె దక్కె బద్యంబునకున్.
ప్రజలకు మాతృభాషయన బండితులన్నను హేయభావమో
రిప్లయితొలగించండిరుజుడగు ఱేడుపాలకుడు రోసి పదోన్నతి లేదు పొమ్మనన్
నిజము గ్రహించి యాంగ్లమును నేర్చిపదోన్నతి బొంద దల్చరే
ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్
నిజమే తెలగాణమ్మున
రిప్లయితొలగించండిప్రజలకు వేదమ్ము మంత్రి పలుకేపలుకౌ
భజనపరులసంబ్లి మెలిగె
"ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్
రిప్లయితొలగించండినిజమిది కాదు కాదనుచు నివ్వెర పోవు విధమ్ము జోరుగా
ప్రజలు తిరస్కరించిరిదె, పద్యకవిత్వము నన్నిరీతులన్
సుజనులు చేవచేర్చినది శోభల గూర్చునటంచు చెప్పి వ
చ్చి జయమటంచు ఘోషలను చేసిరి సభ్యుల మెచ్చుచున్ భళా
జిలేబి
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్
సందర్భము:
శరణు వేడితి యజ్ఞ సంభవ రామా!
అరసి రక్షింపు మయ్య అయోధ్య రామా!
అని పదకవితా పితామహుడు అన్నమాచార్య కీర్తించినాడు రాముని..
యజ్ఞ సంభవు డంటే యజ్ఞం నుంచి పుట్టినవా డని. యజ్ఞజు డంటే కూడా అదే! రాము డని అర్థం.
కావ్య పఠనం ద్వారా రసానందం కలుగాలి. వాల్మీకి రామాయణ పఠనంవల్ల కలిగే ఆనందం చాలా గొప్పది. అది అనుభవైక వేద్యం.
సాహిత్యాభిమాని ఐన వా డా రసానందా న్ననుభవించి తీరాలి. లేకపోతే ఎంతో కోల్పోయిన ట్టవుతుంది.
రసానంద మొక్కటే చాలదు. హితోపదేశమూ కావాలి. అదీ పుష్కలంగా రామాయణంలో లభిస్తుంది. మానవత్వపు విలువలకు కిది పుట్టినిల్లు. కేవల మానవత్వం చాలదు. దివ్యతత్వంలోకి తీసుకుపోవాలి. ఆ పనీ రామాయణం చేయగలుగుతూనే వుండడం గమనించవచ్చు.
అందువల్ల రామాయణ శ్లోకాల రుచి మరిగిన సుజనునికి తెలుగు పద్యాలు రుచించకపోవడంలో ఆశ్చర్యం లేదు.
నికరము = సమూహం
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*వాల్మీకి కోకిల*
సుజన మనోహరము గదా
నిజముగ వాల్మీకి శ్లోక నికరం!.. బని య
జ్ఞజ రామ భక్తి రతు లగు
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
15.03.20
-----------------------------------------------------------
సృజనకు తావై యుండియు
రిప్లయితొలగించండినుజను లితర సాహితీ వినూత్నక్రియలం
దు జవిగొనగ నేడక్కట
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిన్నటి పూరణ.
రిప్లయితొలగించండిఅచ్చతెలుంగు పద్యముల స్వచ్ఛపుఁ దీపి యదొక్క రీతియౌ
నచ్చట నచ్చటన్ మెరియు నన్యపదమ్ముల సొంపదొక్కటౌ
మెచ్చిన రీతి యైన నెడ మేటి యనందగుఁ దాన, నట్లుగా
నచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా!.
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
సుజనత కలిగిన పామర
రిప్లయితొలగించండిప్రజల కెరుకలేని వింత పదముల తోడన్
నిజమును చెప్పిన కూడను
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్
నిజమును విడి పలికితి వని
రిప్లయితొలగించండిప్రజల తిరస్కృతి దక్కెఁ, బద్యంబునకున్
సుజనులు హారతిఁ బట్టగ
ప్రజలామోదించిరికద పద్యరచనలన్.
నిజముల దెల్పని కైతకు
రిప్లయితొలగించండిప్రజల తిరస్కృతియె దక్కె! బద్యంబునకున్
బ్రజ పక్షపాతము గొనన్
భుజముల నిడియె బ్రజ పద్యము జనులు మెచ్చన్ !
రుజువేల పద్యమునకే
రిప్లయితొలగించండియజరామరమై భువి మను నాద్యంతంబున్
నిజమిదెగా!యెటులందువు?
"ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"
విజయము తనదే ననుకొని
రిప్లయితొలగించండిరజనీ కాంతుడు మురియుచు రాస క్రీడన్
నిజమది కాదని తెలియగ
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యం బునకున్
కుజనులు పలికిన మాటలు
రిప్లయితొలగించండినిజమది కాదని తెలిపిరి నేనడిగెద నో
విజయా! యెప్పుడు నెవ్విధి
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్
రిప్లయితొలగించండిమరొక పూరణ
అజరామరమీ పద్యము
సుజనులు మెత్తురు సతతము జోరుగ దీనిన్
నిజముగ నేర్వగ నేరని
*ప్రజల తిరస్కృతియె దక్కె పద్యంబునకున్*
సుజనుల మెప్పు పొందినది సూరుల మన్నన నందెనన్నదే
రిప్లయితొలగించండినిజమది, కల్లమాటలిక నిల్పుము కాదది ధర్మమందునే
రుజువది చూపమంటినిక రోషము మానుచు జూపుమెచ్చటో
ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్
.... శంకరాభరణం.... 15/03/2020 ,ఆదివారం
రిప్లయితొలగించండిసమస్య.
******
"ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్"
నా పూరణ : చం.మా.
***** ****
ప్రజలను విస్మరించుచును వారికి నర్థము కాని భాషయౌ
గజిబిజి గ్రాంధికమ్మె విధిగా మరి యెంచి లిఖించు పద్యమే
విజయము నొందదున్! బ్రజల ప్రేమను బొందదు!ఈసడించుచున్
ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్!
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
సృజన కు పదునును బెట్టి యు
రిప్లయితొలగించండినిజము గ శ్రమియించి మాకు నేర్పెను గదరా
సుజనుడు శంకరు డెట్లగు
ప్రజల తిరస్కృతి యె దక్కు పద్యం బు నకు న్
రజనకుపరుగిడుచదువులు
రిప్లయితొలగించండినిజముగతెలుగుకుతెగులును నిప్పునుపెట్టెన్
గజిబిజి పఠనము పెరిగెను
ప్రజల తిరస్కృతియె దక్కె బద్యంబునకున్.
సృజనాత్మకత యె లేకను
రిప్లయితొలగించండిగజిబిజి గ్రాంధిక రచనల గాభర యనగా
భుజియించ తలలు పాడియ ?
"ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"
భజనకవిత్వముల్విడిచి పాత్రత సాంద్రత గల్గుకావ్యముల్
రిప్లయితొలగించండిసృజనలు సేయుచో నెపుడు సేయరు పద్యము వర్జ్యభాజ్యముల్
అజగల లంబిత స్తనము లట్టి నిరర్థక మైనరాతలన్
ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్"
భజన కవిత్వపు రీతికి
రిప్లయితొలగించండిప్రజల తిరస్కృతియె దక్కెఁ; బద్యంబునకున్
సుజన సమాదరణమమరె
ప్రజ పద్యపు స్ఫూర్తి దోడ బచ్చగ విరిసెన్
నిజమదినమ్మసఖ్యము ననేకవిధాలమార్పులున్
రిప్లయితొలగించండిసృజనయుజొచ్చి తెంచెను సుసూత్ర గణాలు రాతలన్
అజగ రమయ్యి మింగెను మహత్వ పటుత్వ భాషనే
ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్"
నిజములు పలికెను వేమన
రిప్లయితొలగించండి"విజయవిలాసము"రచించె వేంకట కవియున్,
నిజములు,ఊహలు గననే
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"
కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్
అజరామరమౌ కథలను
రిప్లయితొలగించండిద్యజించి దుష్టాత్మ భూప తతుల చరితలన్
భజియించ వింత యేలగుఁ
బ్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్
సుజన సమాహితంపు సభఁ జోద్యము మీఱ జనాంతరంగ మో
ద జనక భార తాగమ సుధారస మొల్కుచు నుండఁగా మనో
రుజ లవి విక్రమించఁగ విరోధి నిరక్షర బుద్ధిహీన దు
ష్ప్రజలు తిరస్కరించి రిదె పద్యకవిత్వము నన్నిరీతులన్
మైలవరపు వారి పూరణ:
రిప్లయితొలగించండిసుజనమనోవికాసపదసుందరభావమరందమల్లికా
స్రజమును బోలు పద్యముల రాజులు లోకులు మెచ్చిరెల్లరున్!
నిజము! విలక్షణములని నీరసపద్యములెన్ని జెప్పినన్
ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండివిలక్షణమ్ములని... అని ఉండాలి 🙏
మైలవరపు మురళీకృష్ణ
అజపజలులేని విధముగ
రిప్లయితొలగించండిగజిబిజిగావ్రాయుకతనగవులమెయనుచున్
ఋజువగుభావములేమిని
ప్రజలతిరస్కృతియెదక్కెబద్యంబునకున్
రిప్లయితొలగించండిఇజముల కలబోతలలో
ప్రజల తిరస్క్రతియె దక్కె బద్యంబునకున్;
నిజము వచింపగ భాషను
ప్రజమెచ్చిరి వచన రచన, పద్యంబులిలన్!
చంపకమాల
రిప్లయితొలగించండినిజము విభిన్న పోకడల నేసిన చీరలు నింపుగూర్చినన్
సుజనులు పట్టుచీరయని సొంపుగ వాణి కలంకరించగా
నజరమునై విహాయసమె హద్దుగ వాఙ్మయమందు వెల్గ నే
బ్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్?
సుజనులుమెచ్చగానపుడు సుందరపద్యము గాత్ర సుద్ధితో
రిప్లయితొలగించండివిజయవిహారముల్ సలిపె వీనులవిందుగ నాటకాలలో
నిజముగనెట్టిపద్యములునేడెవరైన పరిగ్రహింతురా
ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్ని రీతులన్"
గజిబిజిగావడిన్నునిచిగాసరబీసరబ్రాసవేయుచో
రిప్లయితొలగించండిబ్రజలుతిరస్కరించిరిదెపద్యకవిత్వమునన్నిరీతులన్
బ్రజలకుమోదముండునుగవారికిచక్కగపద్యముండుచో
సృజనలుసేయుపండితులుసేయగనోపునుమంచియల్లికల్
సుజనులు మెచ్చగ నప్పుడు
రిప్లయితొలగించండినజరామరమైనిలిచినవందరి మదిలో
నిజముగ పద్యము, లిప్పుడు
ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివ్రజనుతసద్వచఃప్రథ, జరామరణోద్విరహప్రతిష్ఠ, స
త్సృజితవిశిష్టయుక్ప్రతిభ, సేవితశాస్త్రవిశేషసంజ్ఞ, సా
రజవసుసాధనాపటిమ, రంజితకావ్యనిబంధ హీనులౌ
ప్రజలు తిరస్కరించి రిదె పద్యకవిత్వము నన్నిరీతులన్!
కందం
రిప్లయితొలగించండినిజము విభిన్నత మధురము!
స్వజనమ్ములు సృష్టిఁ జేయఁ బరఁగిన గానీ
యజరమునై మెరయఁగ నే
బ్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్?