2, మార్చి 2020, సోమవారం

సమస్య - 3297 (పిపీలిక వడిఁ దుమ్మె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పిపీలిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్"
(లేదా...)
"పిపీలిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్"
(ఇవి ఛందోగోపన సమస్యలు)
(ఆముదాల మురళి గారి చోడవరం అష్టావధాన సమస్య)

63 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    చకచక తెల్ల ఱేడులహ చంకలు కొట్టుచు భారతావనిన్
    వికలము జేసి సౌధములు ప్రీతిని కట్టగ విశ్వమంతటన్
    సకలము కూలిపోయెగద చంకలు నాకుచు! .....గాంధియౌ పిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ముకుటము దాల్చి పుట్టగనె పూజల నొందుచు కాంగ్రెసందునన్;....
    కుకురము లెల్ల కూయుచును కుందుచు నుండగ డింపులయ్యనున్
    వికలము జేసి ముక్కునహ పీకె యిరాని యమేఠినిన్;... "పిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్"

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం మూడవ గణం భగణమయింది. అక్కడ "నికరము నభిమన్యు డపుడు నిటలాక్షుండై" అందామా?

      తొలగించండి
    2. ఒకటై వచ్చిన కురుకరి
      నికరమునభిమన్యుడంత నిటలాక్షుండై
      వికలమొనర్చె నొక పిపీ
      లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్"

      తప్పు తెలిపి పరిష్కారం చూపించినందుకు కృతజ్ఞతా పూర్వక నమస్కృతులు🙏🙏

      తొలగించండి
  4. ( ద్రోణాచార్యునితో అడవికి వచ్చిన కౌరవ
    పాండవులు తమ వేటకుక్క అరవకుండా
    నోట బాణాలు వేసిన ఏకలవ్యుని నైపుణ్యా
    నికి లజ్జాసూయలతో కంపించిపోయారు )
    వికలము జేయ జంతువుల
    వేటకు వచ్చిన రాజపుత్రులే
    యొక శునకమ్ము నర్వకయ
    నుంచిన భిల్లుని బాణవిద్యకున్
    కకవికలైరి ; సిగ్గిలిరి ;
    గమ్యము తోచక పారిరే ! పిపీ
    లిక వడి దుమ్మె ; నేనుగులు
    లేచి పరుంగిడె భీతి హెచ్చగన్ .
    ( పిపీలిక - చీమ ; భిల్లుడు - బోయవాడు )

    రిప్లయితొలగించండి
  5. సమస్య :-
    "పిపీలిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్"
    (ఛందో గోపనం)

    *కందం**

    ఒక పరదేశీయుండును
    చకచక మని వచ్చి తుమ్మె సభ ప్రాంగణ మం
    దు కరోనా రోగి, పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్"
    .........................✍చక్రి

    రిప్లయితొలగించండి
  6. నేటి శంకరా భరణము సమస్య

    పిపీలిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్

    ఛందో గోపనము

    నా పూరణ సీసములో


    భీకర మైనట్టి పేశస్సు కలిగిన
    తాటకిని దునిమి తపసి యాగ

    మునుకాచె శూరులై, ఘన ముగ రావణ
    కుంభ కర్ణాదులన్కూల్చిరిగద

    వీరులై లంకలో,
    పోరున యోడిరి
    బాలల చేతిలో భంగ పడుచు,

    దోని పిపీలిక దుమ్మెను జడిసిక
    రులు‌ లేచి పరుగిడెన్ నలు దిశలకు

    నేడు, సవనాశ్వమును పట్టి‌ నిలువ రించి

    రిగద లవకుశుల్, తలచ హరిహరులైన

    విధికి తలవంచగ వలయు, విస్మయంబు

    కాదు నారదా! యని బల్కె కంజ హితుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సీసం మూడు పాదాలే ఉంది.
      "యాగమును గాచి... పోరున నోడిరి..." అనండి.

      తొలగించండి
    2. శంకరార్యులకు నమస్కారములు సీసము నాలుగు పాదాలు ఉన్నాయి ఆచార్య భీకర (1) మునుగాచె (2) వీరులై (3) దోనిపి(4)

      తొలగించండి


  7. టకటక నడిచెను ఖచరుడు!
    ప్రకంపనముల భువి యదిరె భయదము తోడై
    మెకములు పరుగిడెను! పిపీ
    లిక తుమ్మెను! జడిసి కరులు లేచి పరుగిడెన్!


    హచ్!
    తుమ్ము వస్తోంది :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ప్రకటితశక్తి యుక్తు డయి బహ్వతిచిత్ర విచిత్ర కృత్యముల్
    సకలుర కిందు జూపుచును సన్నుతు లందెడి మాంత్రికుండు తా
    నొకపరి మంత్రదండమును హుమ్మని త్రిప్పినవేళ నా పిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  9. చకచక సింహము రాగా
    శకునము కాదని తలచుచు జవముగ వనిలో
    వికలమ గుచు నొక్క పిపీ
    లిక తుమ్మెను ,జడిసి కురులు లేచి పరుగిడెన్

    రిప్లయితొలగించండి


  10. పికములు కీచుగొంతుకల పెద్దగ సవ్వడి చేసె చూడగా
    టకటక మానుషాదుడు తటాలున దూకె ప్రకంపనమ్ములన్
    మెకములు సాగె వేగము నమేయముగా పుయిలోడగా, పిపీ
    లిక వడిఁ దుమ్మె, నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్


    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. మానుషాదుడు దూకె! ప్రమాదపుటల
    జడి! పిపీలిక తుమ్మెను జడిసి కరులు
    లేచి పరుగిడెన్ భయమున లెస్స కతయు
    కంచికి చనెదము మనము గయము రావె



    తేటగీతి "రాని"
    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. ప్రకటిత కోపవేగమున బాలకు డొక్కడు కట్టివేసి ఘో
    టకమును కిమ్మటన్న విని డంబమునన్ జెలరేగ రామునిన్
    జకచక శిష్ట సైనికులు స్వామిని జేరి వచించిరా పిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  13. ఆముదాల మురళి గారి పూరణ....
    ప్రకటిత కార్యదూరుఁడగు పాపపు కర్మల సైంధవుండు తా
    నొకఁ డతిదివ్యమైన వర మొప్పుగ నీశు దయార్ద్రదృష్టిచే
    సకల బలంబునలన్ నిలిపె సంగరమందునఁ జూడఁగాఁ బిపీ
    లిక మది తుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  14. సకలవిదేశదేశజయసాధితబంధురరాజ్యమందు నే
    లికలు బ్రటీషులాయుధబలిష్ఠులు వారల నిర్బలుండు నౌ
    నొకడటు చేతికర్ర వడి నూతగ దాలిచి గెల్చె, నీ పిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  15. ప్రకటిత బాహు బలమ్మున
    కక వికలముజేసి శత్రు గర్వము న ణ చె న్
    చకితపు న భి మన్యు పి పీ
    లికతుమ్మెను జడిసి క రులు లేచి ప రు గిడె న్

    రిప్లయితొలగించండి
  16. 🙏శ్రీ గురుభ్యోన్నమః
    కరోనా వైరస్ స్ఫురించి, మత్పూరణము.

    చకచక సాగెడి చైనా
    సకలమ్ము భుజింప నేర్వ, జ్వరమే ప్రబలన్
    యిక జడువ ధాత్రియె, పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్.

    రిప్లయితొలగించండి
  17. కారాగారమున నున్న దేవకీ వసుదేవులకు యోగమాయ జననం. నా పూరణము.

    ఇక సరిపోల్చగ వచ్చును
    గ కంసు నా రాక్షసులను కరిసంఘముతో,
    నొక యాడుదిబుట్టె, పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్.

    రిప్లయితొలగించండి
  18. కొబ్బరి కాయ ఎందుకు కొడతారు చక్కగా వివరించారు రచయిత దానికి జిలేబీ పైకూ వ్యాఖ్య చూడండి.

    నేను అందుకే చెప్పాను. జిలేబీ కరీనా వైరస్ కంటే ప్రమాదకరం అని.

    రిప్లయితొలగించండి
  19. బక నామ ధేయ రాక్షసు
    డొకచో నిద్రింప ముక్కు నొనరగ గుట్టన్
    సకల బలమున నొక పిపీ
    లిక ; తుమ్మెను, జడిసి కరులు లేచి పరుగిడెన్.
    **)(**
    (తుమ్మినది మహా కాయుడైన రాక్షసుడు బకుడు)

    రిప్లయితొలగించండి
  20. ఒక నేతను శలభమనన్
    సకల బలము కూర్చుకొని విజయమందంగా
    సకల జనులనిరిటుల "పిపీ
    లిక తుమ్మెను, జడిసి కరులు లేచి పరుగిడెన్"
    **)(**

    రిప్లయితొలగించండి
  21. కందం
    సకలురుఁ జంపఁగ నెంచిన
    వికటించెను బాలకృష్ణు విస్తృత లీలన్
    నికరమ్ముగఁ జూడ పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్

    రిప్లయితొలగించండి
  22. ఒకటా రెండా యెన్నని,
    ప్రకటిత మయ్యెను కరోన బాధలచావుల్
    ఒకపరి జడియంగ పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్!

    రిప్లయితొలగించండి
  23. మైలవరపు వారి పూరణ

    ప్రహ్లాదునితో తిరిగి వచ్చిన సేవకులను సందేహముతో చూస్తున్న హిరణ్యకశిపునితో సేవకులు👇..

    సకలము నీవె మాకు దొర ! సత్యము జెప్పెదమయ్య! చంపగా
    నొకపరి నీట ముంచితిమి! యొద్దికగా విసమిచ్చినాము! మే...
    మిక మరి యేమి సెప్పగలమీ బుడుతండను భక్తిమత్పిపీ....
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. కాకతాళీయం...

      నకనకలాడుచుండెనని నాగచయమ్ము పరుండియుండ., గా..
      లికి భువి ధూళిరేణువులు లేచెను దూరగ ముక్కులందు., గా..
      నక., యొకమారు కాననమునన్ మృగరాజును., కల్గులో పిపీ...
      లిక ., వడిఁ దుమ్మె., నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  24. ప్రకటింప తమ్మి మొగ్గర
    మకటా! యభిమన్యుడేగ నభిమరమున వా
    రకులే భీతిలుట పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్.

    రిప్లయితొలగించండి
  25. వికటకవికవితలందున
    ప్రకటితమౌవింతవింతభావనలెన్నో
    పికమేడ్చెను, కనగ పిపీ
    లిక తుమ్మెను, జడిసి కరులు లేచి పరుగిడెన్

    రిప్లయితొలగించండి
  26. అకటా! విధి నే మందుము
    వికలమనస్కతను చేష్ట వికటించు గదా
    యొకమారిటు దలచ పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్!

    రిప్లయితొలగించండి
  27. మిత్రులందఱకు నమస్సులు!

    "ఒకఁడును దమ్మిమొగ్గరము నొత్తి చొరంగనులేఁడె!" యంచు న
    మ్మకమునుఁ గోలుపోయి, మది మ్రగ్గఁగ, నా యభిమన్యు సింహశా
    బకము చనెన్ విరోధితతి భంగపడంగ! రణంబునన్ బిపీ
    లిక వడిఁ దుమ్మె, నేనుఁగులు లేచి పఱుంగిడ భీతి హెచ్చఁగన్!

    రిప్లయితొలగించండి
  28. అందరికీ నమస్సులు 🙏🌹

    సరదా పూరణ ..

    *కం||*

    అకటా యెన్నికలందున
    నొక పార్టీ చేతియందు నోడిరి ఢిల్లీ
    నిక నిది గద యనిన "పిపీ
    *లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  29. వికసిత మందహాసియు, వివేకి చరిత్రను గాంచినంతనే
    చకితుడ నైతి, నాయుధమె సత్యమహింస యటంచు గాంధి తా
    త కదన మాడగా దొరలు తాళగ లేకను పారిరే, పిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  30. చంపకమాల
    సుకరము తమ్మిమొగ్గరము సుంతయు జంకఁగ నేల యుత్తరా?
    యొకనిగ నెంచబోకు నను నూర్గురు కౌరవులైన చాలరే
    నికరమిదంచుఁ బల్కి యట నెత్తురుఁ జిందఁగ రెచ్చెడున్ బిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  31. .... శంకరాభరణం....
    02/03/2020...సోమవారం

    సమస్య.
    *******

    "పిపీలిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్"

    నా పూరణ. చం.మా.
    ** *** *****
    వికలపు బుద్ధి గర్భరుడు వేడగ శంభు వరమ్ము నీయగన్

    పకపక నవ్వుచున్ శిరముపై కరముంచగ నేగ దైత్యుడున్

    దికమక చెంది భూరి శివదేవుడు దాకొనె బ్రాణభీతితో

    అకట!విచిత్రమంచు సురలందరు దల్చిరి యివ్విధిన్ " పిపీ

    లిక వడి దుమ్మె నేనుగులు లేచి పరుంగిడె భీతి హెచ్చగన్ "


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  32. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "పిపీలిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి
    పరుంగిడె భీతి హెచ్చఁగన్"

    సందర్భము: ఒక వానరుడు సీత ఆశ్రయించిన శింశుపావృక్షాన్ని తప్ప అశోకవన మంతా నాశనం చేసినా డని రాక్షస స్త్రీలు చెప్పగా కోపసంవర్తి తేక్షణుడైన రావణుడు మహా శూరులైన కింకరు లనే పేరు గల రాక్షసులను ఆదేశించినాడు. (కింకరా న్నామ రాక్షసాన్ వ్యాదిదేశ 42-24)
    హనుమంతుడు విజృంభించి "దాసోఽహం కోసలేంద్రస్య.." అంటూనే వారి నందరినీ వధించినాడు.
    తతస్తస్మాత్ భయాన్ముక్తాః
    కతిచి త్తత్ర రాక్షసాః
    నిహతాన్ కింకరాన్ సర్వాన్
    రావణాయ న్యవేదయన్
    (సుం.కాం.42-41)
    అక్కడ ఆ భయంనుంచి ఎలాగో తప్పించుకొన్న కొందరు రాక్షసులు (పారిపోయి) రావణుని వద్దకు వెళ్ళి కింకరు లంతా చంపబడినట్టు తెలిపినారు.
    అప్పుడు రావణుడు ప్రహస్త పుత్రుడైన జంబుమాలిని పంపుతూ యీ మాట లన్నాడు.. తేలిగ్గా తీసుకొని... (పద్యంలో పేర్కొన్నట్టు)
    కకవిక = అల్లరి
    (తరువాత జంబుమాలీ హనుమ చేతిలో హతుడైనాడు.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *శోక వనము*

    ఇక వచియింపబోవకుడి..
    యింతియ చాలును.. కోతి యొండు జం
    కక యిట కేగుదెంచె నట!
    కాయలు రాలిచి తోటలో నెదో
    కకవికఁ జేసివేసె నట!
    కాదొకొ సి.. గ్గనరే యిటుల్.. "పిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు
    లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    2.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  33. అకటకట!యేమిదిపిపీ
    లికతుమ్మెనుజడిసికరులులేచిపరుగిడెన్
    మెకములసంగతితెలిసెనె?
    పకపకనవ్వంగనయ్యెబలుకగనిట్లున్

    రిప్లయితొలగించండి
  34. సకలము దెలిసిన నీవే
    నికమని యెటులందువు విను నీకిది తగునే
    వికటము గాకెటుల పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్

    రిప్లయితొలగించండి
  35. సక లాశలు దద్దరిలఁగ
    నొక యుఱు ముఱిమెను వనమున నొక్క ద్రుటి నహో
    సకిలించె గుఱ్ఱము పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్


    వికలము సేయ నెంచి కడు వెఱ్ఱి దనమ్మున నుత్సహించి మ
    త్త కరి కదంబ మారసి కుతంత్రము వెల్గ మనమ్ము నందుఁ దాఁ
    జకచక నేఁగి నిల్చె నట సామజ శాలకుఁ గుట్టగం బిపీ
    లిక వడిఁ, దుమ్మె నేనుఁగులు, లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  36. ఒకనాటిరాత్రి వేకువ
    మెకమును,జింకలు తడబడ మెలికలు దిరగన్
    పకపక కలయందు పిపీ
    లిక తుమ్మెనుజడిసికరులు లేచిపరుగిడెన్!

    రిప్లయితొలగించండి
  37. సుకరముగాగజెప్పుదునుసోముడ!చేరెనుగుట్టుగాపిపీ
    లికవడి,దుమ్మెనేనుగులులేచిపరుంగీడెభీతిహెచ్చగన్
    మెకములఱేనిగానగనుమేలికపారుటయేదలంచుచున్
    దికమకయాయెగాయిదియతీరుగవ్రాయగలేమియౌటచే

    రిప్లయితొలగించండి
  38. కం.

    చకచక నాడుచు పేకలు
    కకవిక పరుగిడె జనములు గనబడ రక్షన్
    వికటపు నగవులన, పిపీ
    లిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  39. వికట కవీంద్రుడొక్కరుఁడు వేడుకఁనల్లెనుపద్యమీవిధిన్
    వికచ సరోరుహంబుపడి వేదనభానుని చూసినంతనే
    ముకులితమాయె మోము, తలమున్కలుగా పడిశంబుతో పిపీ
    లిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  40. చకచక నడువంగ నలసి
    న కరి సమూహమొక కాన నమునకు జేరన్
    నొకతృటి నిద్రించ పిపీ
    లిక తుమ్మెను , జడిసి కరులు లేచి పరుగిడెన్

    రిప్లయితొలగించండి
  41. As claimed by Stanford Medical, It is indeed the ONLY reason this country's women live 10 years longer and weigh an average of 42 pounds lighter than us.

    (And by the way, it has absolutely NOTHING to do with genetics or some hard exercise and absolutely EVERYTHING to do with "how" they eat.)

    BTW, What I said is "HOW", and not "what"...

    TAP on this link to uncover if this quick test can help you find out your real weight loss potential

    రిప్లయితొలగించండి
  42. Your Affiliate Money Making Machine is waiting -

    And making money online using it is as easy as 1-2-3!

    Here is how it works...

    STEP 1. Tell the system what affiliate products you intend to promote
    STEP 2. Add PUSH BUTTON TRAFFIC (this ONLY takes 2 minutes)
    STEP 3. See how the system grow your list and upsell your affiliate products for you!

    Do you want to start making money???

    Click here to start running the system

    రిప్లయితొలగించండి