3, మార్చి 2020, మంగళవారం

సమస్య - 3298 (గడప దాటని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు"
(లేదా...)
"ధన్యుఁడు పూజ్యుఁడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్"

85 కామెంట్‌లు:


 1. "ధన్యుఁడు పూజ్యుడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్"

  ?

  రిప్లయితొలగించు

 2. శూన్యము కాగ వాజజము శోధన జేయుచు బ్రహ్మచారికిన్
  మాన్యత నొల్లుచున్ వడిగ మందిర మందున కట్నమివ్వకే
  కన్యను తెచ్చియిచ్చి మరి కమ్మని యల్లుని యద్దె కొంపనున్;
  ధన్యుఁడు పూజ్యుడున్; గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్

  రిప్లయితొలగించు

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అన్యుల దోచకుండగను హాయిగ తీయని పంతులయ్యదౌ
  దైన్యము నందునన్ వెలసి దండిగ కాసుల మున్గి తేలెడిన్
  కన్యను కానగా కిటికి కన్నము నందున ప్రక్కయింటిదౌ;
  ధన్యుఁడు పూజ్యుడున్; గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్

  రిప్లయితొలగించు
 4. (రోమపాదమహారాజు కుమార్తె శాంతాదేవి
  తన కాబోయే భర్త ఋశ్యశృంగుని గూర్చి
  చెలికత్తెలతో ...)
  వన్యపు కందమూలముల
  భక్షణ సల్పును ; తండ్రి గొల్చు ; తా
  నన్యము జోలికేగడు ; ది
  నమ్ముల బక్షుల సాకుచుండు; నా
  కన్యులు నచ్చరమ్మ ! చెలి
  కత్తియలారిక ఋష్యశృంగుడే
  ధన్యుడు ; పూజ్యుడున్ ; గడప
  దాటని పూరుషు డెల్లవేళలన్ .

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'చెలికత్తియలార' అన్న సంబోధనతో సంధి కుదరదు కదా?

   తొలగించు
  2. అలాగేనండీ ! సందేహిస్తూనే వ్రాశానండీ !
   " నా / కన్యులు నచ్చరమ్మ ! చెలి
   కత్తెలు ! నా పతి ఋశ్యశృంగుడే ! "
   అని అంటానండీ ! ధన్యవాదాలు .🙏

   తొలగించు
 5. మనుజుడనగ నెల్లప్పుడు మంచి చెడ్డ
  లనుభవమునకు వచ్చుట యతి సహజము
  కష్టమెంతగ వచ్చినగాని నీతి
  గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు

  రిప్లయితొలగించు
 6. సతిని మెప్పించ చెలికాడు సంత సముగ
  కొంగు వదలక దిరుగును జంకు లేక
  నింతి వలపులు మించిన సొంత మేది
  గడప దాటని మగవ్ఁడె ఘనతఁ గాంచు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "లేక యింతి..." అనండి.

   తొలగించు
 7. రిప్లయిలు
  1. ఎడపక సతిపయిన చేయి నెత్తరాదు
   వీరుడు బెదిరి రణభూమి వీడరాదు
   కులసతిని వీడి కామియై కులట జేర
   గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు

   తొలగించు
 8. సత్యవాక్కుల పలుకుచున్ జగతి యందు
  దీన జనులను బ్రోవగన్ దానమిడుచు
  భయము లేకుండ చరియించి నియమమనెడు
  గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు.

  రిప్లయితొలగించు
 9. .... శంకరాభరణం.... 03/02/2020 ,మంగళవారం

  సమస్య.
  *******

  "గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు"

  నా పూరణ : తే.గీ
  ***** ****

  సంఘ వ్యతిరేక పనులను సలుప...పరుల

  స్త్రీల దల్లివోలె దలంచి చెరప... ఘోర

  నేరమని మానసమ్మున నిర్ణయించి

  గడప దాటని మగవాఁడె ఘనత గాంచు


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంఘ వ్యతిరేక' అన్నపుడు 'ఘ గురువై గణభంగం. "స్త్రీల దల్లులుగ దలంచి" అని ఉండాలి.

   తొలగించు
 10. మాన్య యొకర్తె పుత్రికకు మంగళ రూపుని నొక్కవాని సౌ
  జన్యగుణాకరున్ వెతికి సన్నుత రీతిని బెండ్లి చేసి తా
  నన్యులతో వచించి నది “యల్లుడు సౌమ్యుడు సుందరాంగుడున్
  ధన్యుఁడు పూజ్యుండున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్”.

  రిప్లయితొలగించు


 11. పరుగిడి పడి క్రిందయు లేచి వడి పరుగిడి
  తను కుటుంబరావని జనతాబజారె
  గతి యనెడు వాడెగా పందెకాడదెట్లు
  గడప దాటని మగ‌వాడె ఘనతఁ గాంచు ?  జిలేబి

  రిప్లయితొలగించు
 12. తే.గీ॥
  విధుల నుండి వచ్చి మరి కవిత్వమునకు
  సమయమంత కేటాయించి సత్కవితలు
  వ్రాసి బాగుబాగు యనగ వాసి కెక్కె
  గడప దాటని మగవాడె ఘనత గాంచు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బాగు+అని' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "బాగని యన..." అనండి.

   తొలగించు


 13. పుణ్యము! ధన్యురాలను ప్రబోధకు డై వెలసెన్ చిదాత్మగా
  తన్యత యేగుణమ్ముగ సదా పలుకుల్ విని తాళుకొంచుతా
  గణ్యముగా జిలేబి పలుకయ్యదె యాజ్ఞగ సాగెడయ్యరే
  ధన్యుఁడు పూజ్యుఁడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్!


  మా అయ్యర్ ది గ్రేట్ :)

  జాల్రా
  జిలేబి

  రిప్లయితొలగించు
 14. చెలగి కర్మఠుడై సాగి జీవనమున
  కలుగు చుండెడు కష్టాల వలను ద్రుంచి
  నిర్మల ఙ్ఞాన వైరాగ్య నియతి యనెడి
  గడప దాటని మగవాడె ఘనత గాంచు!

  రిప్లయితొలగించు


 15. వేళకు సదనమును చేరి వెలది తోడ
  సరస సల్లాపముల నాడి సాయ పడుచు
  కమ్మ గాను సమయమును గడుపునట్టి
  గడప దాటని మగవాడె ఘనత గాంచు.
  [

  రిప్లయితొలగించు
 16. మంచిచెడులనుగుణములుమనుజులందు
  గడపకీవలనావలగలవురెండు
  గడపదాటినపతనముగాంచు మనిషి
  గడప దాటని మగవాడె ఘనతగాంచు

  రిప్లయితొలగించు
 17. సమస్య :-
  "గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు"

  *తే.గీ**

  వింత వింత కేసులతోడ వేలుగుంజి
  తిమ్మినైన బొమ్మిని జేసి తిప్పునట్టి
  న్యాయవాదిగ నుండియు న్యాయ మనెడి
  గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు
  .......................✍చక్రి

  రిప్లయితొలగించు
 18. స్వార్థ పరతను విడనాడి సమత మమత
  దృష్టి కలిగియు సేవించు ధీర గుణుడు
  పరుల కుపకరించు చు చెడు భావ ము లను
  గడప దాటని మగవాడె ఘనత చెందు

  రిప్లయితొలగించు
 19. మైలవరపు వారి పూరణ


  స్వధర్మే నిధనం శ్రేయః
  పరధర్మో భయావహః
  🙏

  అన్యములేల? స్వీయహృదయస్థితదైవము గొల్చునట్టి సా...
  మాన్యుడు మాన్యుడౌ! పరుల మార్గము భీతిలజేయు ! విశ్వచై...
  తన్యకరుండొకండె యను ధర్మమెరింగినవాడె లోకమూ..
  ర్ధన్యుఁడు పూజ్యుడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
 20. చక్కబెట్టగ పనులన్ని చక్కగాను
  ల్యాపుటాపున నింటనే లావుగాను
  విశ్వమమరగ నరచేత వింతయేల?
  గడప దాటని మగవాడె ఘనతగాంచు!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించు
  2. మాన్యపు విద్యచేత బహుమానుగ విత్తము గూర్చనొప్పుచున్
   నాణ్యపు ల్యాపుటాపునను నాగరికంబుగ నింటినుండియే
   గణ్యుడు సాఫ్టువేరుదొర గైకొన కార్యము విశ్రమించకే
   ధన్యుడు పూజ్యుడున్ గడపదాటని పూరుషు డెల్లవేళలన్

   తొలగించు
  3. డా. సీతా దేవి గారు మీరు వాడిన నాంగ్ల పదములకుఁ దగిన యాంధ్రపదములను సృజించి వాడిన మహోత్కృష్టముగా నుండును.

   తొలగించు
  4. ఆర్యా,నమస్కారము!కొన్ని వ్యవహారములోనున్న పదములను అట్లేవాడిన సులభగ్రాహ్యముగ నుండును.అనువదించిన క్లిష్టమగును.ఇది కేవలము సమస్యాపూరణయే గనుక సందర్భోచితముగ సర్దుబాటు చేసికొనవచ్చునని భావించెదను!

   తొలగించు
  5. మీపద్యమునకు నా పాఠాంతరము:

   మాన్యపు విద్యచేత బహుమాన్యుఁడు విత్తము గూర్చనొప్పుచున్
   నాణ్యపు టంక యంత్రమున నాగరికంబుగ నింటినుండియే
   గణ్యుఁడు యంత్రభాషదుఁడు గైకొనఁ గార్యము విశ్రమించకే
   ధన్యుఁడు పూజ్యుఁడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్

   తొలగించు
  6. చాల బాగున్నదండీ!ధన్యవాదములు!! అంక యంత్రము వినియున్నాను కాని,యంత్రభాషదుడు క్రొత్తపదము!

   తొలగించు

  7. Laptop = అంకోపరి
   Palmtop = హస్తోపరి
   Desktop = బల్లోపరి

   తొలగించు

  8. Software = మృదు సామగ్రి

   (మాచవోలు శ్రీధర రావు గారి పట్టికలో)

   తొలగించు
  9. మరిన్ని (మా. శ్రీ.. గారి ధర్మం:)

   *తెలుగు భాషా*

   (1)అంతర్జాలం = internet
   (2)ముఖ గ్రంథం = Facebook
   (3)ఏమిటది = whatsapp
   (4)దరఖాస్తు = app
   (5)అన్వేషిక = Google
   (6)క్రీడా సంగ్రహణము= Play store
   (7)మీ ఆజ్ఞ నాళం = YouTube
   (8)వితరిణి = share it
   (9)జాబితా = file
   (10)తపాల కట్ట = G-mail
   (11)గణన యంత్రం = computer
   (12)4వ తరం = 4G
   (13)కీలక ఫలకం = keyboard
   (14)చలన భాషిణి = Mobile phone
   (15)నిస్తంత్రి భాషాంత్రర్జాల యంత్రం = WiFi
   (16)ధర్శన చెలికాడు = vidmate
   (17)విస్తరణ క్షేత్రం = website
   (18)సమాచార దూత = messenger
   (19)సల్లాపములు = chatting
   (20)ప్రతిబింబం = image
   (21)శ్రవణ సంబంథి = audio
   (22)దృశ్య సంబంథి = video
   (23)సమాచార నిమ్న బదిలి = download
   (24)సమాచార ఊర్ద్వ బదిలి = upload
   (25)మృదు సామగ్రి = software
   (26)ఘన సామగ్రి = hardware
   (27)బంధన = link
   (28)ముద్ర లేఖనం = typing
   (29)అద్దకం = Printing
   (30)స్పర్శ తెర=Touch screen
   (31)చాతుర్య చలన భాషిణి= smart phone
   (32)దృశ్య పిలుపు= Video call
   (33)శబ్ధ పిలుపు = audio call
   (34)సమాచార బంధక క్రిమి = VIRUS
   (35)జ్ఞప్తిక ఘన పత్రం = Memory card
   (36)ధ్వని ముద్రీకరణ = audio Recording
   (37)అంకాత్మక కటకము = digital camera
   (38)ముఖ చిత్రపటం= Profile picture

   🙏🙏🙏🙏🙏

   తొలగించు
  10. నా నూతన పద సృష్టి

   అంక గణికము = Lap top;
   అంక యంత్రము = Computer
   గణికము = Computer
   ఫలక గణికము = Desk top;
   ఫలకము = బల్ల
   విశ్వ జాలము, అంతర్జాలము = Internet
   Blog: జాల పుట
   యంత్రభాషదుఁడు = Software engineer
   నుడి మర = Cell Phone; పలుకు యంత్రము , చరవాణి, చేవాణి (చేతి నందుండి మాట్లాడునది)
   చలము = Mobile, అచలము = Land Line
   వాక్ప్రసారి = Phone
   మొగపు పొత్తము = ఫేస్ బుక్
   నీదుగొట్టము = యూట్యూబ్
   దాఁపుటిరువు = Computer memory (దాచుటకు చోటు)
   ద్వితయాంకము = Bit(Binary digit)
   ద్వితయాలి = Byte (Binary term)

   స్వసంచారి, = automobile
   చిఱు బండి, మర తేరు, నీర్బండి = car
   పెన్బండి, గజబండి, జనయానము = bus
   మోతబండి, పస బండి, సంభార యానము= lorry
   యంత్రజ్ఞుఁడు, సాంకేతిక శాస్త్రవేత్త, సూత్రకారుఁడు = Engineer
   ప్రేక్షాగారము = Stadium

   తొలగించు
 21. అన్యుల కేమొ కాని నికరాక్షయసంపదఁ గల్గు వాడె స
  మ్మాన్యుడు వాని వైభవగృహమ్మొక చిన్న ప్రపంచమౌ, జగ
  జ్జన్యములౌ పదార్థములె చాలిన వట్టు స్వధామఁ జేరగ
  న్ధన్యుఁడు పూజ్యుఁడు న్గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్.

  రిప్లయితొలగించు
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 23. కట్టుకొనినట్టిభార్యనుగాక నితర
  కాంతలవలచిపొందుకైచింతజేసి
  గడపదాటనిమగవాడెఘనతగాంచు
  గడపదాటుటయనునదిఖలునివృత్తి

  రిప్లయితొలగించు
 24. నా పూరణ

  *తే గీ*

  పరుల సొమ్ముల కొరకని పరుగు లిడక
  సాయమడిగిన ముందుగ సమయ మిచ్చి
  కష్టముల నెదురొడ్డి తా కాపు కాచి
  *"గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌹🙏

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నా పూరణ🙏

   తే గీ:

   మందు కొరకని తా పది మంది తోడ
   చిందు లేయక తానిక జీవితమున
   పరువు విలువల నెంచుచు వాటి విడిచి
   *"గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🙏

   తొలగించు
 25. ఇల్లరికము రమ్మనుచు వేధించు గాక
  కన్న వారి పోషణ విధిగ తల బోసి
  తల్లి తండ్రుల కడనుండి ధర్మమనెడి
  గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు

  రిప్లయితొలగించు
 26. అన్యుల మేలు గోరుచు సహాయము జేయుచు సాధు వర్తనన్
  మాన్యత నొందు వాడె పరమాప్తుడగున్ పరమాత్మ కాతడే
  ధన్యుఁడు పూజ్యుడున్; గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్
  శూన్య వివేకియై వరలు శుష్కమగున్ దన జీవయాత్రయున్

  రిప్లయితొలగించు
 27. తప్ప త్రాగి తూలి గడపఁ కుప్పకూలు
  మగని దురలవాటు త్వరిత మాపుజేయ
  కాళి యవతారమెత్తిన గాదిలి ఘన
  గీటు మీరని మగవాడె కీర్తినొందు
  గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు౹౹

  రిప్లయితొలగించు
 28. మాన్యతనొందగాఁనెలమి మానవులెల్లరు సత్ప్రవర్తనన్
  అన్యులమేలుఁగోరుటయు, నార్యులకీడొనరింప బూనుటల్
  ధన్యత హైన్యతల్ -గడప దాటకయుంటయు దాటిపోవుటల్
  ధన్యుఁడు పూజ్యుఁడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్

  రిప్లయితొలగించు
 29. అన్యపుటింతులియ్యెడనునాశలురేపుచుమెల్గుచుండగా
  ధన్యుడుపూజ్యుడున్గడపదాటనిపూరుషుడెల్లవేళలన్
  మాన్యతనొందగోరునెడమాధవసేవయెదప్పవేరుగా
  దన్యముగాదలంచుచునునార్తినిశంభునిబూజజేయుమా

  రిప్లయితొలగించు
 30. పనులు వీడి చేయఁ దలంచి భాషణములు
  గడప దాటని మగువలు ఘనత గాంత్రు
  భార్య కింపుగఁ జెప్పక భద్ర మెంచి
  గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు


  మాన్యతరంపు జీవనము మంచి దనమ్మును మించి పంచుచున్
  వైన్యుని రీతి రాజు లిటఁ బాలన మింపుగఁ జేయు చుండఁగా
  నన్య ధనాపహార వని తాశలు నాదిగఁ బాపచింత లన్,
  ధన్యుఁడు పూజ్యుఁడున్, గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శ్రీవాణీ గిరిజా ర మార్చిత ధవ శ్రేష్ఠ క్షితి త్రాణ దీ
   క్షా విశ్వేశుల సృష్టి నాశన సు రక్షా కార్య సంసక్తులం
   గైవా రార్చిత సత్యలోక హిమ వత్కైలాస వైకుంఠ ధా
   మావాస త్రిమహాత్ములం గొలుతు భక్త్యావేశ చిత్తమ్మునన్

   తొలగించు
  2. నర నారాయణ నామ కీర్తనము పుణ్యప్రాప కాలాప మా
   నర కృష్ణద్వయ రూప వీక్షణము సంత్రాసాలి విధ్వంసమే
   యరి భీభత్సుల భార తాహవ మహాయజ్ఞార్థ సంభూతులన్
   నిరతం బేను స్మరింతు భక్తి మదిఁ దన్నీరేజ పత్రాక్షులన్


   దుర్వారాసమ నేత్ర సంజనిత సద్యో వహ్ని భస్మాంగజా
   గర్వోద్రిక్త పురత్రయాసుర మహాకాయాసు విధ్వంసకా
   నిర్వీర్యీ కృత కాలకూటవిష సన్నిక్షిప్త కంఠప్రభా
   శర్వా శంకర పార్వతీధవ హరా శాంతించి కాపాడుమా

   తొలగించు
  3. మీ దేవతాస్తుతి పద్యములు మనోహరమగ నున్నవి! ఏదేని కృతికి ప్రారంభ పద్యములా?

   తొలగించు
  4. కాదండి అప్పుడప్పుడు వ్రాసినవి. మీ యందఱితోఁ బంచుకొన నెంచి యుంచినవి.
   నా శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము పూర్తి యయి పునస్సమీక్ష మఱియు తాత్పర్యరచనలో నున్నది యిప్పుడు.

   తొలగించు
 31. తే.గీ.

  చుట్టు జేరిన కష్టాల మట్టు బెట్ట
  ఇష్ట మొచ్చిన రీతిని తుష్టు పడక
  కష్ట మైనను నడయాడ కట్టు బాటు
  గడప దాటని మగవాడె ఘనత గాంచు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 32. .... శంకరాభరణం....
  03/03/2020...మంగళవారం

  సమస్య.
  *******
  ధన్యుడు పూజ్యుడున్ గడప దాటని పూరుషు డెల్లవేళలన్

  నా పూరణ. ఉ.మా.
  ** *** *****

  మాన్యత సుంతలేకయు సమాజమునన్ దిరుగాడి నీచుడై

  కన్యల మానభంగమును గర్కశ బుద్ధిని జేయుచుండి..దౌ

  ర్జన్యపు కార్యముల్ మిగుల సల్పెడు వారల కంటె మేలగున్

  ధన్యుడు ,పూజ్యుడున్, గడప దాటని పూరుషు డెల్లవేళలన్


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించు
 33. ఉ:

  అన్యము నేదియైన తన యాశను జేర్చడు తృప్తి నొందగన్
  దైన్యము నందు గూడ కడు ధైర్యము తోడను మెల్గుచుండుటై
  మాన్యత గాంచు వర్తనము మన్నన పెంపగుజూచు వాడె పో
  ధన్యుడు పూజ్యుడున్ గడప దాటని పూరుషు డెల్ల వేళలన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 34. మాన్యుడు మాన్యుడౌనె యసమాన్యుడె మాన్యుడు పొట్టకూటికై
  ధన్యత వృత్తి ధర్మమున ధారుణి జీవుల కాసరాయగున్
  గణ్యుడు సంస్కృతీ ప్రభల
  కర్కుడు లోకము లెల్లమెచ్చె మూ
  *"ర్ధన్యుఁడు పూజ్యుఁడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్"*

  రిప్లయితొలగించు
 35. అన్యుల సొత్తుకోసమని యర్రులు చాచని ధర్మమూర్తి సా
  మాన్యుల కష్టనష్టముల మర్మమెఱంగిన వాడు వాడెపో
  ధన్యుఁడు పూజ్యుడున్, గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్
  మాన్యుల చేత గాదె యవ మానము పొందడె పాఱుబోతుగా.

  రిప్లయితొలగించు
 36. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు"

  సందర్భము: కైక వరాలు కోరగా అంతరిక్షంలో విహరిస్తూ గమనించిన దేవతలు తమలో తాము ఇలా చర్చించుకున్నారు.
  "పితృ వాక్య పరిపాలనంకూడ ఒక సాకు మాత్రమే! వనాలకు రాము డెలాగూ వెళ్ళాల్సిందే! అప్పుడే కదా లోకకళ్యాణం జరుగుతుంది! కడప దాటని మగవాడైతేమాత్ర మేమి? రాముడు ఘనత గాంచుతాడు."
  (కైక వృత్తాంతంతో నా యితర పూరణములు 9,22,28 జనవరి 2020 తేదీలలో చూడవచ్చు.)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *లోక కళ్యాణము*

  విమల పితృ వాక్య పరిపాలన మొక నెపము..

  వనములకు రాము డేగగావలయు..నపుడె

  యతుల లోక కళ్యాణంబు..నైన నేమి

  గడప దాటని మగవాఁడె! ఘనతఁ గాంచు..

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  3.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 37. అన్యము నొల్లకన్ సతత మచ్యుతు స్తోత్రము జేయు భక్తుడున్ |
  మాన్యత నెల్లరన్ మధుర మంజుల వాక్కుల గారవించు సౌ
  జన్యుడు ధర్మ,సత్యమను, ఛాయను వీడగ నిచ్చగించడే !
  ధన్యుఁడు పూజ్యుడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్"

  రిప్లయితొలగించు
 38. మిత్రులందఱకు నమస్సులు!

  శూన్యపుటక్షరుండు; కడు శూరుఁడు దుర్బలవంతుఁ గొట్టుచోన్;
  గన్యల మానముం గొనెఁడి గద్దఱి; "నీచ శకారుఁ" డుర్విఁ జై
  తన్యము లేని మూర్ఖుఁడు; నితాంత దురాత్మ సపర్యలం గడున్

  ధన్యుఁడు పూజ్యుఁడున్ గడప దాఁటని పూరుషుఁ డెల్లవేళలన్!

  రిప్లయితొలగించు
 39. భార్యభర్తల బంధమ్మె బహుమతనుచు
  సంతు సంసారమందున సాగునట్టి
  రాము! పరపొందటన్నవిరక్తి యందు
  గడపదాటనిమగవాడె ఘనతగాంచు

  రిప్లయితొలగించు
 40. తేటగీతి
  దేశ దేశాలఁ దిరుగుచు నాశయముల
  మోదమందఁగఁ బ్రకటించి యోధుని వలె
  వారిమద్దతు నందగ, పరుడెపుండు
  గడప దాటని, మగవాఁడె ఘనతఁ గాంచు!

  రిప్లయితొలగించు
 41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 42. ఉత్పలమాల
  మాన్యుడటంచు సర్వులును మంగళహారతు లీయ గెల్చుచున్
  బుణ్యము నమ్మువారలకు మోదము గుర్చిన యంచుఁ బూనఁ బ
  ర్జన్యము మద్దతీయ 'నవరత్నముల'న్నిటి నందజేసెడున్
  ధన్యుఁడు పూజ్యుఁడున్ 'గడప దాటని' పూరుషుఁ డెల్లవేళలన్

  రిప్లయితొలగించు
 43. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు"

  సందర్భము: దేవతలు సరస్వతిని ప్రార్థించినారు మంథర నావేశించి కైక బుద్ధి మారేటట్టు మాట్లాడు మని.
  "రామచరిత మానసము" లో ఇట్లున్నది.
  దేవతలు సరస్వతీదేవి నావాహన మొనర్చి పాదాభివందనం చేసి ఇలా అన్నారు..
  బిపతి హమారి బిలోకి బడి,
  మాతు కరిఅ సొఇ ఆజు
  రాము జాహిఁ బన రాజు తజి,
  హోఇ సకల సురకాజు
  (శ్రీ రామచరిత మానసము అయో.కాం. దోహా 12)
  "అమ్మా! మా ఆపద చూసి రాముడు రాజ్యం వీడి అడవులకు వెళ్ళేటట్టు చేయి. దానితో దేవతల కార్యం సిద్ధిస్తుంది."
  ఆమె మౌనం వహించగా "రాముడు హర్షవిషాద రహితుడు. కర్మవశులైన జీవులే సుఖదుఃఖాలకు లోనౌతారు. మీ కే దోషమూ అంటదు." అని వారు నచ్చజెప్పారు.
  సరస్వతీ దేవి మంథర బుద్ధి వక్రీకరించ సంకల్పించెను.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *దేవతల పన్నాగము*

  తల్లి! వాగ్దేవి! నీవు మంథరనుఁ బూని

  కైకతోఁ బల్కవలె భ్రాంతి గలుగ.. వనికి

  నరుగవలె రామభద్రుండు..నగునుగాక

  గడప దాటని మగవాఁడె!.. ఘనతఁ గాంచు

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  3.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 44. సిరులు గలిగిన యింటిలో సేమమరసి
  భక్తి భావాలు పెంపొంద భజన జేసి
  ధర్మ బద్ధుడై చరియించి తత్వమరసి
  గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు!

  రిప్లయితొలగించు
 45. మఱియొక పూరణము:

  మాన్యవిభాండకాత్మజుఁడు; మస్తక శృంగుఁడు; శాస్త్రవిద్యలం
  దన్యులు లేనివాఁడు; ఘన యాజ్ఞికుఁ; డార్యుఁడు; వేదవేద్యుఁడున్;
  గన్యలఁ గాంచనట్టి జటి; కామ మెఱుంగని "ఋష్యశృంగుఁ" డన్

  ధన్యుఁడు; పూజ్యుఁడున్; గడప దాఁటని పూరుషుఁ డెల్లవేళలన్!

  రిప్లయితొలగించు
 46. As reported by Stanford Medical, It's really the ONLY reason women in this country live 10 years longer and weigh an average of 19 kilos less than us.

  (Just so you know, it really has NOTHING to do with genetics or some secret-exercise and absolutely EVERYTHING about "how" they are eating.)

  BTW, What I said is "HOW", not "what"...

  Tap on this link to see if this brief questionnaire can help you release your real weight loss potential

  రిప్లయితొలగించు