..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂దత్తపది🤷♀.................... కత్తి, బాకు, డాలు, విల్లు.. పై పదాలు అన్యార్థంలో భారతార్థంలో పద్యం
సందర్భము: ఉత్తమా తారకోపేతా మధ్యమా లుప్త తారకా అధమా సూర్య సహితా ప్రాతస్సంధ్యా త్రిధామతా ఉదయం చుక్క లున్నపుడు చేసే సంధ్యా వందనం ఉత్తమం. అవి పోయిన తర్వాత చేసేది మధ్యమం. పొద్దెక్కిన తర్వాత చేసేది అధమం.. అన్నారు. సంధ్యావందనంవల్ల శరీరానికి రోగనిరోధక శక్తి , మనస్సుకు స్థిరత్వం, తద్వారా దేవతానుగ్రహం కలుగుతా యన్నారు. (దాని కోసం వీలైనంత ముందుగా లేచి స్నానం చేయవలె.) దేవతల మేలుకొలుపు పాటలన్నీ నిజానికి మనం మేలుకోవడంకోసమే! ఆ ప్రయోజనం పొందడంకోసమే! దురదృష్టవశాత్తు మనం ఇవన్నీ మరచే పోయినాము. ఆధునికయుగంలో రాత్రి పొద్దుపోయినంతవరకు మేల్కొనియుండడం ఎప్పుడో పొద్దెక్కాక లేవడం అనే చెడ్డ అలవాట్లు చేసుకున్నాం. విశ్వామిత్రుడు రాముని మేల్కొలుపుతూ ఇలా అన్నాడు. "పరిసరాలు తెల్లబడినవి రామా! ఆ తిమిరహరుడు (సూర్యుడు) మీరినాడు (అతిశయించినాడు లేదా ఉదయించినాడు). ఐనా లేవవు. ఇది సబబా! (సమంజసమా!) మేలుకో!.. తూర్పు డాలు (వెలుగు) చూసి మేలుకో! (అలా మేలుకుంటే) స్వస్థత (ఆరోగ్యం) అవలీలగా పరిఢవిల్లుతుంది (అతిశయిల్లుతుంది లేదా చక్కబడుతుంది)." అని ముని (విశ్వామిత్రుడు) పలికినా డని ముని (మార్కండేయ మహర్షి) వినిచినాడు (వినిపించినాడు) ధర్మరాజుకు.. రామకథలో భాగంగా.. 23.10.19, 30.10.19 నాటి దత్తపదుల పూరణములలోను మార్కండేయుడు ధర్మరాజుకు రామగాథ వినిపించిన సందర్భాలు పేర్కొనబడ్డాయి. చూ.మహాభారతము.. అరణ్య (వన) పర్వము 6 వ ఆశ్వాసం 267-411 7 వ ఆశ్వాసం 1-169 ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*మేలుకొలుపు వల్ల మేలు కలుగు*
"తెల్లబడె రామ! పాయ _క_ _త్తి_ మిర హరుడు
మీరె.. లేవవు.. సబ _బా కు_ మార! తూర్పు
_డాలుఁ_ గని లెమ్ము.. స్వస్థత లీలఁ బరిఢ
_విల్లు"_ నని ముని యనె నని వినిచెను ముని
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 23.03.20 -----------------------------------------------------------
అందకత్తియ ద్రోవది నందు కోరి
రిప్లయితొలగించండికుద్భవిల్లగ మది విజయుండు తాను
జూపులెగబాకకుండగ చోద్యముగను
చేపతిరుగలి ఛేదించి చేయిపట్ట
నేలుకొనిరైదుగురు జగడాలు వడక!
అన్నదమ్ములు దలదాల్చి అమ్మ యాన!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...కుద్భవిల్లుడు...లెగబాకుచుండగ..." అనండి. అయినా 'ఎగబ్రాకు' అన్నది సాధువు.
హౌసుతోడ పరిఢవిల్లు నందకత్తి
రిప్లయితొలగించండియ ద్రుపదాత్మజ పైఁబాకు నాశ రేచఁ
బెక్కు దండాలు పెట్టి గోవిందునకెద
ఫల్గునుడు మత్స్యయంత్రము పడనుగొట్టె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసుభద్ర ద్వారక నుండి హిడింబ ఇంటికి చేరు సందర్భం...
రిప్లయితొలగించండితేటగీతి:-
పుట్టినింటభరింపలేనట్టిబాధ
ఆమెకత్తింటఁబోయెడిఆనలేక
యాహిడింబాకుటీరానయడుగుమోప
వింతసుమధురపుష్పతావిల్లునిండ
తల్లిదండాలుమీకనితరలెజనులు..
......✍బోరెల్లి హర్ష.
కర్నూలు
మీ ప్రయత్నం ప్రశసింపదగినదే.
తొలగించండి'పుష్పతావి' దుష్టసమాసం. 'కుటీరాన నడుగు మోప.. వింతయైనట్టి పూలతా విల్లు నిండ... తలరి రెల్ల' అనండి.
(మేనకావిశ్వామిత్రము)
రిప్లయితొలగించండిసొగసుకత్తియ మేనక వగలనగల
కలియబాకుచు గాధేయు గన్నులంత
టక్కుటెక్కుల డాలుకు జిక్కువడుచు
బలుకలేనంత మోహాన బరిఢవిల్లు.
(వగలనగలు-విలాసములనే ఆభరణాలు;గాధేయుడు-విశ్వామిత్రుడు
డాలు-కాంతి;పరిడవిల్లు-అతిశయించు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికీచకుని మాట గా ( మైలవరపు వారికి ముందే :)
అందకత్తియ! యెగబాకుటంబరంపు
వీధి ననుచేరి యావిర్భవిల్లు విరహ
మున మునక లేల? నీ మగండ్లు నిను వీడి
రాయె; రా! డాలుకొను నన్ను రావె రమణి!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఎగబ్రాకు' అనడం సాధువు. (బూదరాజు వారి తెలుగు భాషాస్వరూపంలో ఉన్నా ఎగబాకు అన్నది అసాధువు)
రిప్లయితొలగించండినేటి భారతం
(జీపీయెస్ వారి తరపున :))
అరెవో సాంబా! కుపితుడ!
పెరిగెనురా పరిఢవిల్లు పెనుభూతముగా
మరిమయె చైనాకత్తియ
కరోన గురిగా దడాలు కరణమ్మెదియో?
జిలేబి
__/\__
తొలగించండి🙏
తొలగించండిజి పి యస్ వారికి ఈ రోజు "తోక ముడుపు"
సైరంధ్రి కీచకునితో....
రిప్లయితొలగించండిచెలి'కత్తి'య యని యిట్టులఁ
బలుకఁగ సబ'బా? కు'మతివి, పతు లేవురు, వా
రలతో గం'డా లు'సురుకుఁ
గలవిక నీ'విల్లుఁ' జేరఁ గలవే? తులువా!
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ రన్య దేశపదము ప్రయోగింతు రని యూహించ లేదండి.
తొలగించండివైరి కత్తి మి రశరము వంత గూర్ప
రిప్లయితొలగించండివిజయు డంబా కులము గాచి విజయ మొసగు
మనుచు దండాలు పెట్టియు నాల మందు
కెర లె పరిఢ విల్లు చు తన కీర్తి వెలుగ
మిక్కిలి బాగున్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ :: తేటగీతి
**** ***** ***** ***** ***** ***
చాలు చాలు చాలిక జగడాలు బావ!
చేరు కడ కత్తిమిరము నీ జీవితమున
రణమిడదు శుభంబా కుఠిలత్వమేల??
సంధి గోర పరిఢవిల్లు జగతినందు
నీదు కీర్తి సుయోధన !నిక్కమిదియె!
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'కుటిలత్వమేల' టైపాటు.
స్వర్గంలో అర్జునునితో ఊర్వశి....
రిప్లయితొలగించండికందం
సరసాని కత్తిపత్తివె?
విరుపులు సబబా? కురువర! విరివిల్తుడు నీ
కరదండాలు బిగించెనె?
మురిపాలకు పల్లవిల్లు మోజులు కరువే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అత్తపత్తి'ని 'అత్తిపత్తి అన్నారు.
గురుదేవులకు ధన్యవాదములు. వికీపీడియా అత్తిపత్తి అనిచెబుతుంటే వ్రాశాను. మీరన్న తర్వాత ఆంధ్రభారతి లో చూస్తే 'అత్తపత్తి' అని కనిపించింది. 🙏🏻
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన
తొలగించండిస్వర్గంలో అర్జునునితో ఊర్వశి....
కందం
సరసమున కత్తిరింపులె?
విరుపులు సబబా? కురువర! విరివిల్తుడు నీ
కరదండాలు బిగించెనె?
మురిపాలకు పల్లవిల్లు పురుషుఁడ వేరా?
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి*శ్రీకృష్ణదౌత్యం*
మతి నీకత్తిమిరమ్మునార హితమౌ మా మాట ! కర్ణాదిసై
న్యతతిన్ గెల్చును క్రీడి! యెంచుమశుభంబా కుత్సితత్త్వమ్ము ! సం
స్థితచిత్తమ్మున జూడనంతమగునీ తేడాలు! రారాజ! పొ...
ర్లుత శాంత్యాపగ! సంధిచే పరిఢవిల్లున్ సౌఖ్యసందోహముల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిమైలవరపు వారు ట్రాకు మార్చే సారు :) కీచకునిపై రాస్తా రనుకున్నానే !
జిలేబి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండి"...తిమిరమ్ములారు" టైపాటు.
తొలగించండికత్తి.. బాకు.. డాలు.. విల్లు..
అన్యార్థంలో భారతపరంగా దత్తపది...
మరోపూరణ🙏
ధర్మరాజు.. శ్రీకృష్ణునితో..
హరి నీవే మము గాచెదెప్పటికి మాకత్తింటిబంధుండవై!
కురుసమ్రాట్టిటు జేయ మాకిది హితంబా? కుందగాజేసె ! త్వ..
ద్వరవాగ్వైఖరి సంధి జేయ జనుమా! దండాలు దండాలు! వా...
రు రణమ్మున్ విరమింపగా పరిఢవిల్లున్ శాంతిసౌభాగ్యముల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
విరటు గొల్వున 'బాకు'కు వేషధారి
రిప్లయితొలగించండియైన భీమకు కీచకు నాగ'డాలు'
పరిఢ'విల్లు'ట గూర్చి ద్రౌపది తెలుపగ
'కత్తి'గట్టిన యాతడు గాసెదననె
పాకుకుడు = వంటవాడు
పరిఢవిల్లు = వెల్లివిరియు
కత్తిగట్టు = విరోధము ప్రకటించు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కత్తిగట్టు' అన్నపుడు స్వార్థంలో ప్రయోగించినట్లే.
🙏🏽
తొలగించండికీచకునితో సైరంధ్రి
రిప్లయితొలగించండిరాణి చెలికత్తియను నేను రాజునీవు
నీకిది సబబా? కుజనుడ నిగ్రహించు!
నీచుడా!లుప్తమయ్యెను నీతినీకు
బంధకుండను యపకీర్తి పరిఢవిల్లు!
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిబంధకుండను నపకీర్తి యనవచ్చునండి. యడాగమము తగదు.
తొలగించండిగురువుగారికి ధన్యవాదములు,నమస్సులు!
తొలగించండిపూజ్యులు కామేశ్వరరావుగారికి ధన్యవాదములు!సవరిస్తానండీ!
*మద్యమును కీచకునకిచ్చిరమ్మని ఆదేశించిన సుధేష్ణతో ద్రౌపది మాటలు గా నూహించిన పద్యం*
రిప్లయితొలగించండికలికిరొ సబబా కుంటెన కత్తియ వలె
పరిఢ విల్లుట పాటియే యరయ నీకు
వీరుడనని బండాలముఁ వీగువాని
చెంత కంపుట సరికాదు కాంత వినుమ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబండాలములో డాలు లేదు.
గమికత్తియ నీ కీచకు
రిప్లయితొలగించండిరమియించెను కామ జ్వాల ప్రభవిల్లుచు, నా
తమి కరదండాలేల? హ
ఠము యుక్తంబా కుమారి? టక్కున రావే!
(కీచకుని అంతరంగం)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కామ జ్వాల' అన్నపుడు 'మ' గురువై గణభంగం. "కామవాంఛ" అనవచ్చు.
సవరణతో
రిప్లయితొలగించండివిరటు గొల్వున 'బాకు'కు వేషధారి
యైన భీమకు కీచకు నాగ'డాలు'
పరిఢ'విల్లు'ట గూర్చి ద్రౌపది తెలుపగ
అంటు'కత్తి'య రూపున నరయు దుననె
పాకుకుడు = వంటవాడు
పరిఢవిల్లు = వెల్లివిరియు
అంటుకత్తియ = విటురాలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిరాట రాజుతో సైరంద్రి
రిప్లయితొలగించండిఅంటకత్తియ గా నెంచి వెంటపడియె
పెద్దల సభా? కువాదుల వేశ్య వాడ?
వెంబరకునర దండాలు వేయలేర?
ఉద్బవిల్లు ప్రళయమొక్క యువిద యేడ్వ
రాణి సుధేష్ణచెలికత్తిననెడుమాట
రిప్లయితొలగించండిమఱచియెగబాకుచుంటివి మందమతిని
నుద్భవిల్లునుజగడాలులుచ్ఛగాడ!
యనుచుననియెనుద్రౌపదియసురుతోడ
3వపాదంచివరన
తొలగించండిసత్యమిదియ
గాచదువప్రార్ధన
ఎగబాకు పద మసాధు వని యెఱింగి సవరణముతో:
రిప్లయితొలగించండిప్రభవిల్లు నరుం డాలుఁ గొ
ని భాసురం బాకులంపు నిజరిపు చయమున్
సభ కత్తిరస్కృత ధరా
విభులన్ దూరమ్ము సేసి వింటి బలమునన్
ద్రౌపది చెలి'కత్తి'యెనయె దైవలీల |
రిప్లయితొలగించండిపైకి నెగ'బాకు'తెగువను పాండు సుతులు|
పరిఢ'విల్లు' ట కనలేని పాప బుధ్ధి
నరయ దాయాది మత్సర యాగ'డాలు' |
కత్తి.. బాకు.. డాలు.. విల్లు..
రిప్లయితొలగించండిఅన్యార్థంలో భారతపరంగా దత్తపది...
మరోపూరణ🙏
ధర్మరాజు.. శ్రీకృష్ణునితో..
హరి నీవే మము గాచెదెప్పటికి మాకత్తింటిబంధుండవై!
కురుసమ్రాట్టిటు జేయ మాకిది హితంబా? కుందగాజేసె ! త్వ..
ద్వరవాగ్వైఖరి సంధి జేయ జనుమా! దండాలు దండాలు! వా...
రు రణమ్మున్ విరమింపగా పరిఢవిల్లున్ శాంతిసౌభాగ్యముల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂దత్తపది🤷♀....................
కత్తి, బాకు, డాలు, విల్లు.. పై పదాలు
అన్యార్థంలో భారతార్థంలో పద్యం
సందర్భము:
ఉత్తమా తారకోపేతా
మధ్యమా లుప్త తారకా
అధమా సూర్య సహితా
ప్రాతస్సంధ్యా త్రిధామతా
ఉదయం చుక్క లున్నపుడు చేసే సంధ్యా వందనం ఉత్తమం. అవి పోయిన తర్వాత చేసేది మధ్యమం. పొద్దెక్కిన తర్వాత చేసేది అధమం.. అన్నారు.
సంధ్యావందనంవల్ల శరీరానికి రోగనిరోధక శక్తి , మనస్సుకు స్థిరత్వం, తద్వారా దేవతానుగ్రహం కలుగుతా యన్నారు. (దాని కోసం వీలైనంత ముందుగా లేచి స్నానం చేయవలె.)
దేవతల మేలుకొలుపు పాటలన్నీ నిజానికి మనం మేలుకోవడంకోసమే! ఆ ప్రయోజనం పొందడంకోసమే!
దురదృష్టవశాత్తు మనం ఇవన్నీ మరచే పోయినాము. ఆధునికయుగంలో రాత్రి పొద్దుపోయినంతవరకు మేల్కొనియుండడం ఎప్పుడో పొద్దెక్కాక లేవడం అనే చెడ్డ అలవాట్లు చేసుకున్నాం.
విశ్వామిత్రుడు రాముని మేల్కొలుపుతూ ఇలా అన్నాడు.
"పరిసరాలు తెల్లబడినవి రామా! ఆ తిమిరహరుడు (సూర్యుడు) మీరినాడు (అతిశయించినాడు లేదా ఉదయించినాడు). ఐనా లేవవు. ఇది సబబా! (సమంజసమా!) మేలుకో!..
తూర్పు డాలు (వెలుగు) చూసి మేలుకో! (అలా మేలుకుంటే) స్వస్థత (ఆరోగ్యం) అవలీలగా పరిఢవిల్లుతుంది (అతిశయిల్లుతుంది లేదా చక్కబడుతుంది)."
అని ముని (విశ్వామిత్రుడు) పలికినా డని ముని (మార్కండేయ మహర్షి) వినిచినాడు (వినిపించినాడు) ధర్మరాజుకు.. రామకథలో భాగంగా..
23.10.19, 30.10.19 నాటి దత్తపదుల పూరణములలోను మార్కండేయుడు ధర్మరాజుకు రామగాథ వినిపించిన సందర్భాలు పేర్కొనబడ్డాయి.
చూ.మహాభారతము.. అరణ్య (వన) పర్వము 6 వ ఆశ్వాసం 267-411
7 వ ఆశ్వాసం 1-169
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*మేలుకొలుపు వల్ల మేలు కలుగు*
"తెల్లబడె రామ! పాయ _క_ _త్తి_ మిర హరుడు
మీరె.. లేవవు.. సబ _బా కు_ మార! తూర్పు
_డాలుఁ_ గని లెమ్ము.. స్వస్థత లీలఁ బరిఢ
_విల్లు"_ నని ముని యనె నని వినిచెను ముని
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
23.03.20
-----------------------------------------------------------
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచేరి చెలికత్తి*యగ కృష్ణ చెందె శ్రమము
రిప్లయితొలగించండిమారెభీముఁడుబాకుకుఁదీరునచట
విరటుకొల్వునగండాలు* వేనవేలు
పాండవులకవివరములై పరిఢవిల్లు*
కత్తి- - బాకు - డాలు - విల్లు
రిప్లయితొలగించండిభారతార్థములో
భీమ ప్రతిజ్ఞ:
బోనకత్తిగ ద్రౌపదిఁ బొందు కోరి
బల్కు దుర్యోధనుఁ నని బేబాకు చేతు
నండ పిండ బ్రహ్మాండాలు నదర, పరిఢ
విల్లుఁ గీర్తి పాండవులకు నెల్లెడలను.
బోనకత్తి-దాసి
బేబాకు-బాకీలేకుండ చేయు
సవరణతో
రిప్లయితొలగించండిపుట్టినింటభరింపలేనట్టిబాధ
ఆమెకత్తింటఁబోయెడిఆనలేక
యాహిడింబాకుటీరాననడుగుమోప
వింతయైనట్టిపూలతావిల్లునిండ
తల్లిదండాలుమీకనితరలిరెల్ల...
తే.గీ.
రిప్లయితొలగించండిసొగసు కత్తియ ద్రౌపది సొబగు జూడ
జన్మ చండాలు సోదరి చంకకెక్కి
భావ మెరిగించి పొందుకై బాకులాడ
పరిఢ విల్లుచు నుండెనా పాటు గనగ
జన్మచండాలుడు: కీచకుడు
వై. చంద్ర శేఖర్
ఆందకత్తియ నాశించి యాత్మ యందు
రిప్లయితొలగించండికీచకుడెగ బాకుచు నుండ కేలుతోడ
భీము డణచ నాచండాలు భీకరముగ
పరిఢవిల్లుచు నుండె నా పడతి మోము
దత్తపది :-
రిప్లయితొలగించండి*కత్తి, బాకు, డాలు, విల్లు*
పై పదాలను అన్యార్థంలో
భారతార్థంలో
నచ్చిన ఛందంలో....
*కందం**
చెలికత్తియకు పొగరు తగదు
పిలిచిన దండాలు మరచి బిడియము లేకన్
నిలబడ సబబా? కుమతిగ
విలువనిడక పరిఢవిల్లు వెలదీ ప్రియమే
..................✍చక్రి
(కీచకుడు సైరంధ్రి తో....)