9, మార్చి 2020, సోమవారం

సమస్య - 3304 (హోళీ పండుగ...)

కవిమిత్రులారా,
Image result for హోళీ శుభాకాంక్షలు
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్"
(లేదా...)
"హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా"

57 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    వేళాకోళములన్నిటిన్ చెరచుచున్ బేతాళునిన్ రీతినిన్
    తాళాల్ వేయుచు హైద్రబాదు ప్రజకున్ తాడించి బాధించుచున్
    కాళీమాతను వోలు వైరసిటనున్ కంపింపగా భీతినిన్
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా

    రిప్లయితొలగించండి
  2. (హోళికారాక్షసి రూపం మార్చుకొని కరోనా
    రూపంలో వచ్చిందేమో ! ఎక్కడా ఆనంద
    కోలాహలం లేదు )
    " వేళాయెంగద కామదగ్ధతకు రా
    వేగ" మ్మనండెవ్వరున్ ;
    మేళాలన్ ధరియించి పాడరిది యే
    మేమో ? కతంబెద్దియో ?
    కేళీలోలతతో పరస్పరము కేల్
    కీలింపలేరెందుకో ?
    హోళీపండుగ జేయ నిష్టపడ డే
    యొక్కండయో దైవమా !!

    రిప్లయితొలగించండి
  3. కాళీమాతను బోలుచు
    కేళిగ గబళించ వ్యాధి కీటకరూపున్
    తాళక భీతావహులై
    హోళీపండుగను జరుపడొక్కండైనన్

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నవయుగ గోపికల గోల:

    బోళాబాయి యశోదనున్ వరముగా బొంకించుచున్ ప్రీతినిన్
    కాళీయున్ హతమార్చి కొండ కడనున్ గండమ్ములన్ దీర్చుచున్
    చోళీ చీరల నన్ని దాచగనయో చోద్యమ్ముగా బాలుడే
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా

    రిప్లయితొలగించండి


  5. ఆడండర్రా అంటే ఎవడూ రానంటాడే :)


    జాలీ గానాడెదమన
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్
    బేలా రానంటాడె! హ
    వేలి హవేలియె కరోన బెదురు జిలేబీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. పాళీజూర్తియె కారణమ్మకొ భయోత్పాతమ్ములేకన్బడెన్!
    వేళాయెన్ మరి ధర్మవాసరమిదే! బేలా జిలేబీ హవే
    లీలో నోఘము కానరాదుగద పల్లెత్తైన లివ్వాడగా
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా!

    పాళీజూర్తి - వరుస జ్వరము - జిలేబీయపదము :) కరోన


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. హేళగ నాడెడు రంగుల
    కేళిని చైనా కరోన క్రిములు వెలయుటన్
    తాళుకొ నలేక యిప్పుడు
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్

    రిప్లయితొలగించండి
  8. ఊళలె యెక్కుడు కాగా
    ఖాళీగా వీధులయ్యె కనగ కరోనా
    వేళా విశేష మేమో
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్ !
    **)()(**
    ఊళలు = ఆర్తధ్వనులు;ఆర్తనాదాలు

    రిప్లయితొలగించండి


  9. వేళాయెన్ పున్నమియే
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్
    కాలహరణమ్ము చేయక
    మేళనమిచ్చెనిదె హోమి మిన్నంట భళా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. వేళాకోళముగాదు "పాడుకరొనా" విస్తారమై నేడు భూ
    గోళంబున్ వణికించుచుండ బ్రజ గగ్గోలంది యేరీతిగా
    తాళంజాలని యట్లు చేరునొ మహద్దౌష్ట్యంబుతో నంచు నీ
    "హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా"

    రిప్లయితొలగించండి
  11. కాలుని పాశము వీడుచు
    నేలను జారిన కరోన నిప్పులు చెరగన్
    కేళిశుషిఁ జనులు భీతిలి
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    వేళాపాళయె లేదు చూచునెడ టీవీలో కరోనాయె బొ...
    మ్మాళీరూపము దాల్చి భీతి గలిగింపన్ దేశమందెల్లరున్
    హోళీ పండుగ జేయరాదనిరి మృత్యుప్రార్థనమ్మంచునీ
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. కాళము వోలె కరోనా
    కేళిగ బుస గొట్టు చుండ కీడుకు వెఱచి
    వ్వేళ ను రంగులు వలదని
    హోళీ పండుగను జరుప డొ క్కం డైన న్

    రిప్లయితొలగించండి
  14. కేళీస్వైరకరోన మృత్యుసమమై క్రీడావిహారమ్మునన్,
    గోళీలాడగ, లోకులందు మృతిసంకోచమ్ము పీడించ, బే
    తాళుం గాంచుచు, నాసికాస్యకరముల్ తద్భీతిలో మూయుచున్,
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా!.

    రిప్లయితొలగించండి
  15. కం॥
    మాలో నొక మిత్రుడు ప్రా
    ణాలను గోల్పోయె గట! వనపురము లోనన్
    చాలా విచారకరమే!
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్.

    (రాత్రి విజయకుమార్ అనే ఒక మిత్రుడు గుండెపోటుతో మరణించాడు..అందరూ శోకసముద్రంలో మునిగిపోయారు)

    రిప్లయితొలగించండి
  16. కేళీ వినోదములకిది
    వేళయె కాదట తెలియుము విషమా కోవిడ్
    ఖాళీ యైనవి వీధులు
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్

    రిప్లయితొలగించండి
  17. .... శంకరాభరణం....
    09/03/2020...సోమవారం

    సమస్య. శార్ధూల విక్రీడితము
    *******
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా

    నా పూరణ.
    ** *** *****

    ఊళల్ వేసి చనెన్ కరోన క్రిమి యయ్యో!భీతి గల్గించెనే!

    కాళీమాత!నిరర్థకమ్మె మములన్
    గాపాడ నేతెంచినన్

    భోళాశంకర!నీ వశంబవదుగా భూస్పృక్కులన్ గావగన్

    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో! దైవమా!


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    . 🌷 వనపర్తి 🌷



    రిప్లయితొలగించండి
  18. వేళాకోళము చేసిరి
    హోళీయన నమెరికనులు హూస్టను నందున్
    తాళుము కూడదనె సుతుడు
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్

    రిప్లయితొలగించండి
  19. కాలున్ మోపె కరోన ధాత్రి వడిగా కాలుండు తా పంపనో
    కేలన్ బట్టిన రంగులందమరి హే!క్రీడించదా మృత్యువై
    మేలున్ గూర్చగ మిన్నకుండె ప్రజ స్వామీ మోది మార్గమ్ములో
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు హోళీపర్వదిన శుభాకాంక్షలు!

    ["కరోనా వైరసు కలిగించెడి రోగ బాధలకు భయపడి, చైనానుండి దిగుమతియగు వర్ణములను నిషేధించు క్రమమున, భీతిఁ గొల్పునదై, యే యొక్కనికిని నీ "హోళీ పండుగ" జరుపుకొనరానిదైనది గదా!" యని ప్రజలు వాపోవు సందర్భము]

    "వేళల్ భ్రాంతులఁ గ్రాఁగఁజొచ్చెఁ! గన, సద్వేళల్ గతంబయ్యె! నీ
    కేళాకూళినిఁ ’జైనవర్ణ’ మలఁదన్, గేరున్ రుజల్ వేగ! నేఁ
    దాళన్ లేను, ’కరోన వైరసు’ వ్యథల్, త్రాసంబు!" లంచున్, భువిన్

    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా!

    రిప్లయితొలగించండి
  21. అందరికీ నమస్సులు 🙏🙏

    *నీటి కొరత* 😢

    *|కం|*

    మాళిక మందున నీరిల
    ఖాళీ యాయెను నిజమిది కన్నీరాయే!
    వేళాకోళము కాదిది
    *"హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏🌹🙏

    మాళిక= మిద్దె, మేడ ..
    (ఆంధ్రభారతి)

    రిప్లయితొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్

    సందర్భము: హోళీ ఫాల్గుణంలో వస్తుంది. శ్రీ రామనవమి చైత్రంలో వస్తుంది. మధ్య నెలరోజులే కదా! అని భావించి అయోధ్యలో శ్రీ రామనవమి ఏర్పాట్లలోనే మునిగిపోయి రామునే స్మరిస్తూ
    హోళీని మరచేపోయారు.
    రాముని పండుగ రానే వస్తుందిగా కొద్ది రోజులకు. ఇక కాముని పండుగెందుకులే! అనుకొన్నారు కొందరు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *రా(కా)ముని పండుగ*

    లీలను జూపిన రాముని
    మేలగు పండు గొక నెలకె మేదిని రా నిం
    కే లని మరచి, యయోధ్యను
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్ 1

    "మేలగు రాముని పండుగ
    లీలగ నొక నెలకె వచ్చులే!" యని మరువం
    జాలుటఁ గాముని పండుగ
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్ 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    9.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  23. శా:

    కీడెంచన్ భరతావనెల్లయును తాకీదున్ ప్రతింబింపగన్
    హోళీ యాడుట కీడుగా దలుప మాయో పాయమున్ సాగుటన్
    భారీ యైనను వూర కుండిరిక యీ పారిన్ కరోనా యనన్
    హోళీ పండుగ జేయ నిష్టపడ డే యొక్కండయో దైవమా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. ఖాళీలాయెను వీధులు
    కేళీనృత్యమునుసలుప కీడు కరోనా
    బాళియెటులొదవుజనులకు
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్

    రిప్లయితొలగించండి
  25. లీలామానుషవిగ్రహుండుహరియేలీలావినోదంబునన్
    హేలన్ జేసినరాసలీలలెగదాయీ హోళి సంరంభముల్
    యేలానేడవిగానరావుభువిలోనేమాయెనీజాతికిన్ ?
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా!

    రిప్లయితొలగించండి
  26. వేళాకోలముగాదగు
    తాళనిరోగమ్మురాగదరమునుగొలుపన్
    గాళీమాతనువేడుచు
    హోళీపండుగనుజరుపడొక్కండైనన్

    రిప్లయితొలగించండి
  27. వ్యాళంబైన కరోన కీటకమదే వ్రాపింప విశ్వంబునన్
    వేళంగాదని చెప్పుచుండిరికదా భీతిల్లి శోకంబుచే
    కేళిన్ మానుటె మానవత్వమని సంక్షేమమ్మటంచున్ గదా
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా

    రిప్లయితొలగించండి
  28. వేళావేళ లెఱిఁగి యా
    వేళయె దాటిన నరుండు వీతోత్సాహా
    ప్తాళి గత నిజగృహుండై
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్


    వేళౌచిత్యము నెంచ వ్యాకుల మహా వీచీ నిధిం గూలి పా
    తాళాభాంబక ఘోర పావన శిఖాధారోష్ణ సంతప్తు నా
    నాళీకాస్త్రు నదేహుఁ జేయ నకటా నాగేద్ధ హారుం డహో
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా

    [పాతాళము = బడబాగ్ని]

    రిప్లయితొలగించండి
  29. శార్దూలవిక్రీడితము
    ఖాళీ చేయఁగ మానవాలినిలలో 'కారోన' జృంభించఁగన్
    హేళా రీతిని రంగుజల్లు కొనుచో హెచ్చౌ ప్రమాదమ్మనన్
    తాళన్ జాలక ప్రాణ నష్టము ప్రభుత్వాదేశమౌ జాగ్రతన్
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా!

    రిప్లయితొలగించండి
  30. ఖాళీజేబులజీవనంబునుదగన్ గావించుటన్హేతువే
    హోళీపండుగజేయనిష్టపడడేయొక్కండయోదైవమా
    వేళాకోళముకాదుగాబ్రదుకుచేవిత్తంబులేకుండుచో
    హేళనజేయుదురందరున్గదయహాయింకేమిజేయంగదే

    రిప్లయితొలగించండి

  31. కందం
    హేళా రీతిని రంగుల
    కేళిని జరుపన్ 'గరోన' గిట్టించునొ? త
    జ్జ్వాలన్భరించ నోపక
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్

    రిప్లయితొలగించండి
  32. కేళీ విలాస మొప్పగ
    హోళీ వేడుక జరుపక హోరను మహం
    కాళి కరోనను జూడగ
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్"

    ఆనందంగా హోళీ పండుగ జరుపుకోవలసిన ప్రజలు మహంకాళిలాగా భయపడుతున్న కరోనా వైరస్ చూసి ఒక్కరు కూడా హోళీ జరుపుకోవడం లేదు.

    రిప్లయితొలగించండి
  33. కాళీయోరగ హాల భీకరగతిన్ కారోన జృంభించగా
    హోళీ వేడుక లద్భుతంబగు విధిన్ హోరెత్తగా జేతురే
    వేళాకోళము లాడనైన వెలికిన్వెళ్ళంగ భీతాత్ములై
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా"

    రిప్లయితొలగించండి
  34. గాలము వేసెను జబ్బులు
    కాలునిగామారెనకట కనగావైరస్
    తాళగమేలనిదలచుచు
    హోళీపండుగనుజరుపడొక్కండైనన్
    +++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  35. కాలానలభీకరమై
    హాలాహలసదృశమైన యా కరొనా యా
    మూలాగ్రము వెరపింపన్
    "హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్"

    రిప్లయితొలగించండి
  36. వేళాకోళమ యేమి దేనికయినన్ వేళుండదా? వైరసే
    ఖాళీ చేయుచునుండ దేశములలో గ్రామాల బస్తీల నీ
    వేళన్ పండుగ యంచు రంగు లలదన్ వెర్రెక్కెనా యంచు నీ
    హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా!

    రిప్లయితొలగించండి
  37. ఖాళీ లే దను నొక్కడు
    వేళాకోళాలు నాకు వెగ టను నొకడున్
    వేళ యిది కాని దొకనికి
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్.

    రిప్లయితొలగించండి
  38. కాళమ్ములను సహితము మ
    షాళాతో కలిపి తినగ సహ దేశంబే
    కాళివలె కరోన ప్రబల
    హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్.

    రిప్లయితొలగించండి
  39. ఖాళీయయ్యొను బాటలు
    హోళీపండుగను జరుప డొక్కండైనన్
    వేళాపాళయు లేకను
    కాళీ యునివలె కరోన కలవరమిడగా.

    రిప్లయితొలగించండి