7, మార్చి 2020, శనివారం

సమస్య - 3302 (తనువు లేదఁట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ"
(లేదా...)
"తనువు లేదఁట చిత్రమే యువతంత్రులన్ మఱి మీటెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

48 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    తినుచు మెండుగ పుణ్కులన్ మరి తియ్యనైన జిలేబులన్
    కనగ నింతుల హైద్రబాదున కమ్మకమ్మని వీధులన్
    కనగ వచ్చును బూడిదైనను కామదేవుని చూడగా
    తనువు లేదట;...చిత్రమే యువ తంత్రులన్ మఱి మీటెడిన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తినుచు మెండుగ రాజభోగులు తియ్యనైనవి
    పంతువాల్
    మునుగు చుండిన గంగలోనటు ముద్దుగొల్పెడి హిల్సలన్
    మనువు నాడక వంగభూమిని మల్లయుద్ధము జేసెడిన్
    తనువు లేదట;... చిత్రమే యువ తంత్రులన్ మఱి మీటెడిన్

    Rajbhog, Pantuva = Bengali sweets
    Hilsa = Famous river-water-fish

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "వంగ భూమిని వదలరెందుకు పంక్తులన్నిట చిత్రమే!
      తింగరంచును రాహులన్నను తిట్టుచుందురు చిత్రమే!

      తరువాత రెండు కాళ్ళు తమ చిత్తం...
      😄🙏🏻"

      ...విట్టు బాబు

      **************************************************************

      "వంగభూమితో భువిలో మన *ప్రభాకరులవారు* దివిలో ఆ ప్రభాకరులవారు తొలుత తొంగి చూసేదేశమది. అందుకే వారికదంటే *వీరాభిమానం*"

      ...మునిగోటి సుందరరామ శర్మ

      **************************************************************

      😊

      దీదీ ఒక ప్రత్యేక వ్యక్తి. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, జయలలిత మొదలగు నాయకీమణుల వలె పురుషుల నీడను నాశ్రయించకయే, తనకై తాను టైపిస్టుగా చేసే ఉద్యోగం విరమించి రాజకీయ రంగంలో చొరబడి 33 సంవత్సరాల పాటు నిరంకుశముగా పరిపాలన చేసిన కమ్యూనిస్టుల రాజ్యాని కూలదోసినది. న భూతో...

      జై మమతా!

      తొలగించండి
  3. మనువు కోరుచు సంతసం బునమాయ లోమును గంగతా
    కనులు మూసియు మైకమందు నగార డీలుగ జూపుచున్
    మనసు మూగది మాటలుండవు మౌన భాషణ జేయుచున్
    తనువు లేదట చిత్రమే యువ తంత్రులన్ మరి మీటెడిన్

    రిప్లయితొలగించండి

  4. అదేదో సినిమాలో ధనుష్ పాట మన్మథ రాజా మన్మథ రాజా అని వస్తుంది :)


    మనవుల మగువల సరసపు
    పనంటి లో త్రోసి వేయు పండగ వలపుల్,
    మునుపు శివుడు కాల్చెనటన్
    తనువుఁ గనము, మీటెను యువతంత్రుల వెఱఁగౌ!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. (ఘంటసాల కనులకు కనిపింపరు .
    వారి కంఠం వీనులకు వినిపిస్తూనే ఉంటుంది మధుర మధురంగా . )
    తరళము ( ధ్రువకోకిల )
    .............................
    ఘనుడు బాణిని గూర్చుటందును ;
    గానమందున దివ్యుడే !
    కనెను దేశవిదేశమందున
    గణ్యగౌరవ సంపదన్ ;
    మనెను కేవల మేబదేడులు
    మంజుభావుడు ధన్యుడై ;
    చనెను స్వర్గము వేంకటేశుడు
    చారుగీతు లొసంగుచున్ ;
    తనువు లేదట ! చిత్రమే ! యువ
    తంత్రులన్ మరి మీటెడిన్ .
    ( మంజుభావుడు - చక్కని భావాలు కలవాడు ;
    చారుగీతులు - శ్రావ్యమైన పాటలు )

    రిప్లయితొలగించండి

  6. ఆకాశవాణి కి పంపినది :)


    గొనబుకాడట! భ్రాంతి గొల్పెడు గుబ్బెతల్ సరిజోడుగా
    మనువులన్ శృతిచేసి పేర్మిని మత్తితో కలబోసెనే!
    మునుపు కాల్చగ కమ్మవిల్తుని మూడుకన్నులవాడె పో
    తనువు లేదఁట చిత్రమే యువతంత్రులన్ మఱి మీటెడిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  7. అనుపమంబగు రూపసంపద కాత డెల్లెడ స్థానమై
    ఘనసుమంబులు బాణరాశిగ కార్ముకంబుగ నిక్షువున్
    గొని యనంగునిగా ప్రసిద్ధిని గొన్నవాడట వింటిరే
    తనువు లేదఁట చిత్రమే యువతంత్రులన్ మఱి మీటెడిన్"

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    మనసు నిల్వదు నిన్ను జూడక మానినీ! యను మాటలన్
    తినగనేది రుచింపబోదని తెల్పు సంజ్ఞలకర్థమున్
    గనగ ప్రేమయె! ప్రేమ గుడ్డిది! కాని యెంచగ దానికిన్
    తనువు లేదట చిత్రమే! యువతంత్రులన్ మరి మీటెడిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. మనసు దోచెడు మల్లెపూవులు మాలికల్ విరబూయగా

    ననిలుడే తన వాహనమ్ముగ నత్తమిల్లి నయా సువా

    సనలె కన్నులవించి జోదుని సాయకమ్ములె, తావికిన్

    దనువు లేదట చిత్రమే యువ తంత్రులన్ మది మీటెడిన్.

    .

    రిప్లయితొలగించండి
  10. తరళము (ధ్రువకోకిల)
    వినఁగ నందరి వాణిఁ దెల్పుచు వేడ్కఁ బంచును చిత్రముల్
    గొనఁగ వచ్చును కాంక్షితమ్ములఁ గూర్మినింటికిఁ జేరఁగన్
    దనరఁ జేతఁ బ్రపంచముంచెడు ధన్యతన్ జరవాణికిన్
    దనువు లేదట చిత్రమే యువ తంత్రులన్ మరి మీటెడిన్!

    రిప్లయితొలగించండి
  11. పునుక తాలుపు మానసంబున ప్రుక్షి కీలలు పెంచి యా
    మనసిజుండు ఉదర్చి వీక్షణ మందు మాడి నశించినన్
    ముని వరేణ్యుడు గాదిపట్టికి మోహమున్ కలిగించె గా,
    వనజజుండగు బ్రహ్మ డెందము వచ్చతో రగిలించె, యో
    చనము చేయగ పంచ బాణుడు, చైత్రసారది కెప్పుడున్

    తనువు లేదట, చిత్రమే యువతంత్రులన్ మరిమీటెడిన్

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. కనువిందుగ యమునా తటి
      వనమాలీకృత విలాస వైభవ లీలన్
      గను రాధా భామామణి
      తనువుఁ గనము, మీటెను యువతంత్రుల వెఱఁగౌ

      తొలగించండి
  13. మనసును దోచుచు మల్లెలు
    వనమున ఘనతావు లీనె పవనమ్మే వా
    హనమై చరించు తావికి
    తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ

    రిప్లయితొలగించండి
  14. మనువు మంత్రము మానవాళికి మారునందగ మేలగున్
    మనుఁగు ధర్మము మారురూపున మారునందగ కీడగున్
    మనము మానము చిత్రమే యది, మారునందగ బంధమున్
    "తనువు లేదఁట “చిత్రమే” యువతంత్రులన్ మఱి మీటెడిన్"

    రిప్లయితొలగించండి


  15. ఆహా! తేటగీతి :)


    తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁ
    గౌ,మనవుల పడతుల సుఖకర మైన
    మత్తి తోరహత్తుగ సృష్టి మరి మరి తెఱ
    గంటిపెద్ద యానగ వృద్ధి గాన సతము!



    జిలేబి
    సెబాసో :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మత్తి తోరహత్తుగ సృష్టి మరి మరి తెఱ
      గంటిపెద్ద యానగ వృద్ధి గాన రమతి,
      తనువుఁ గనము, మీటెను యువతంత్రుల వెఱఁ
      గౌ,మనవుల పడతుల ప్రకంపనముల !



      జిలేబి

      తొలగించండి
  16. అనువగు సమయము నందున
    సునిశిత సూన శరములను చోద్యము గాగన్
    మునుకొని వేయు రతి పతికి
    తనువు గన ము మీటె ను యువ తంత్రుల వెఱ గౌ

    రిప్లయితొలగించండి
  17. ఆకాశవాణిలో ప్రసారం

    మనసుపాడిన మౌనగీతముమారుఁడే వినిమెచ్చగన్
    కనులుమూసిననీదురూపమెకానుపించును ప్రేయసీ!
    తనువునందునపూలబాణమతండుగుచ్చెనువానికిన్
    తనువులేదటచిత్రమేయువతంత్రులన్ మరి మీటెడిన్

    రిప్లయితొలగించండి
  18. అనఘునా హరు ధ్యాన లోలుని కాశలన్ మది రేపగా
    మనసిజుండనుకూలుడై కుసుమాస్త్రముల్ గురి పెట్టగా
    కనుల నిప్పుల గాల్చె నీశుడు గాని కాముడసాధ్యుడే
    తనువు లేదట చిత్రమే యువ తంత్రులన్ మరి మీటెడిన్
    మనసులో ననురాగ మాలిక మంద్ర సుస్వర మాధురిన్
    (ఆకాశవాణికి పంపినది)

    రిప్లయితొలగించండి
  19. మనమునందునమారుమోగినమౌనరాగములెన్నియో
    కనులముందర నిల్చెనేడొక కాంతరూపున వింతగా
    తనువుపొంగెనుమారుడే'శరదాంశతం'మ్మన వానికిన్
    తనువులేదటచిత్రమేయువతంత్రులన్ మరి మీటెడిన్

    రిప్లయితొలగించండి
  20. ననశరంబుల వాడు‌! గామము నాటువాడు మనంబులన్!
    ఘన శివాక్షి వినిర్గతాగ్నినిఁ గాలిపోయిన హేతువం
    దనువు లేదట! చిత్రమే యువతంత్రులన్ మరిమీటెడిం
    గనఁగ రాకయు నిష్ఠమై నిజకార్యమున్ నెరవేర్పగా!

    రిప్లయితొలగించండి
  21. చినిగిన ప్యాంటులు షర్టులు
    వెనుకను చీలిన బ్లవుజులు వెర్రిగతోడై
    పెనగొన రేగిన మోహము
    తనువుగనము మీటెను యువతంత్రుల వెరగౌ

    రిప్లయితొలగించండి
  22. వనరుహాంగన సోయగమ్ములు బాలవాయుజవీచి కల్
    మనసుకింపును నింపు బాలపికమ్ములాడెడు గీతి కల్
    గనగ నావని నయ్యహో యెరుగన్వసంత ననంగు లకిర్వురన్
    తనువు లేదఁట చిత్రమే! యువతంత్రులన్ మఱి మీటెడిన్"

    రిప్లయితొలగించండి
  23. తినకనె తీయం దనమిడి
    కనకనె రసరాగ లహరి కన్నుల నిలుపున్
    మనసున నెగసిన మధురిమ
    తనువు గనము, మీటెను యువ తంత్రులు వెఱగౌ!

    రిప్లయితొలగించండి
  24. తరళము:

    వినరె భాగ్యము దెల్గు నాటన వెల్గు లొల్క టి హబ్బ నన్
    కనుగొ నంగన గ్రొత్త సంగతి కార్య రూపము దాల్చుటై
    యనువుగా నది యుండుటన్ కడు యంకురమ్ముల కాసరా
    తనువు లేదట చిత్రమే యువ తంత్రులన్ మరి మీటెడిన్

    T-Hub = టి హబ్బు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. వచ్చే వారపు ఆకాశవాణి సమస్య తెలుపగలరు

    రిప్లయితొలగించండి
  26. మన నాయకుడు యువకుడని
    ఘన కీక్తినిడి పలు కమతకారులు తమదౌ
    మనుగడ చాలించ కనుల
    తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ

    తనువు = తడి

    రిప్లయితొలగించండి
  27. ఈరోజు ఆకాశవాణి లో చదువబడిన నా పూరణం
    మనసు పొంగును!ఊహలింపగు!మంత్ర ముగ్ధుల జేసెడిన్
    ఘనమునై,మధురంబునైనది కమ్ర శోభల "ఫేసుబుక్"
    తనివి తీరగ తెల్పు డెందము దౌడు తీయగ సంగతుల్
    తనువు లేదట!చిత్రమే!యువ తంత్రులన్ మరి మీటెడిన్.

    రిప్లయితొలగించండి
  28. వినగ విదేశీ వాద్యము
    మనము మునిగె మత్తులోన మైమరపింపన్
    ఘనముగ సంగీత మహిమ
    తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ

    రిప్లయితొలగించండి
  29. తరళము:

    వినుమహో నొక వాద్య యంత్రము వింత గొల్పగు రీతినిన్
    కనగ నందున కానరాదగు కాయమే, యిక తంత్రులే,
    వినగ సొంపగు వీణ మాదిరి పెక్కు రాగము లాపగ
    న్ననగ దానిని లైర నంచన నాదరించగ ఎల్లరున్
    తనువు లేదట చిత్రమే యువ తంత్రులన్ మరి మీటెడీన్

    Lyre- ఒక వాద్యము
    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి


  30. ఆకాశవాణి‌ విశేషములేమి? వచ్చే వారపు సమస్య తెలుపగలరు.


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీపూరణ చదువబడినది!
      వచ్చేవారం సమస్య
      "అచ్చతెలుంగు పద్యముల నాంగ్లపదమ్ములె శోభగూర్చురా"
      పండగ జేసుకోండి!

      తొలగించండి

    2. "విచ్చెవరైన లాంగ్వేజియు" వీనుల విందుగ విచ్చు తెన్గులోన్ :)






      నెనరుల్స్ పంపించినాము :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  31. కనులక్రమ్మగ మాయయే మరి కానరాదుగ లోకమే
    తననుమించిన వాడులేడని తామసంబున మారుడే
    చనగనేరని చోటుకున్ జని చచ్చెగా హరునేత్రమున్
    తనువులేదట చిత్రమే యువతంత్రులన్ మరిమీటెడిన్

    రిప్లయితొలగించండి
  32. మనకుగలుగునటులుగనా మన్మధునకు
    తనువుగనము,మీటెనుయువతంత్రులవెఱగౌ
    చిన్నపిల్లయా గాయత్రిచిఱుకరముల
    శ్రావ్యమగురీతిచక్కటిస్వరమురాగ

    రిప్లయితొలగించండి
  33. మనసునే మెలి బెట్టుచున్ సుమ మార్గణమ్ములు రువ్వుచున్
    కనికరమ్మును లేక కాంక్షల కమ్మటమ్మున ముంచుచున్
    జనుల చిత్తము లెల్ల దోచెడు చక్కనయ్యకు, వింటిరే
    తనువు లేదట చిత్రమే యువ తంత్రులన్ మరి మీటెడిన్!!!

    రిప్లయితొలగించండి
  34. మనువు కాదుర ముఖ్యమైనది మామ శ్రీలుడు కావలెన్
    అను విదేశములేగినట్టి మనాంధ్ర "మామధనం వినా
    తనువు లేదఁట" చిత్రమే యువతంత్రులన్ మఱి మీటెడిన్
    మనసు దోచెడి పాటతోడను మంత్రముగ్ధులఁ చేసెనోచ్౹౹

    రిప్లయితొలగించండి
  35. మనిషి చిత్తము మారదేలనొ మర్మమేమిటొ తెల్యకన్
    పనికి మాలిన పుస్తకమ్ము,ల పారమై
    రస హీనమై
    మనసు మెచ్చక మాన్యుడై
    మదమత్సరమ్ముల దాటగన్!
    తనువు లేదట చిత్రమే యువతంత్రులన్ మరి మీటెడిన్!


    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "తనువు లేదఁట చిత్రమే యువ
    తంత్రులన్ మఱి మీటెడిన్"

    సందర్భము: దేవేంద్రుడు గౌతమముని రూపంలో వచ్చి అతని భార్యయైన అహల్యతో సంగమించినాడు.
    అడరి గౌతము డహల్యాదేవి జూచి
    "పడతి! పాషాణమై పడియుండు మీవు"
    అని శపించినాడు. శాప విమోచనా న్ననుగ్రహించు మని వేడగా..
    "రాముడై వచ్చి పురాణ పూరుషుడు
    భూమిపై జన్మించి పొగడు దీపించి
    ....
    తొలగిపోవక నిన్ను ద్రొక్కిన జాలు
    జలజలోచన! నీదు శాపంబు దీఱు"
    అన్నాడు. (రంగనాథ రామాయణం బా.కాం.)
    కామం తప్పుకాదు. కాని సమాజంలో శాంతి వెల్లివిరియా లంటే కామం ధర్మంతో పెనవేసుకోవాలి. అధర్మంతో అనుసంధింపబడినప్పుడల్లా అశాంతి పరిఢవిల్లుతుంది.
    నేటి యువతరం ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి కామమునందు ప్రవర్తించటంవల్లనే కదా అవాంఛనీయ సంఘటన లెన్నో సంఘంలో చోటు చేసుకుంటున్నాయి!
    ధర్మ కామానికి రాముడు ప్రతీక కాబట్టే అధర్మ కామంతో అంటిన కల్మషాన్ని తొలగించి అహల్యకు శాప విమోచనం కలిగించగలిగాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *అధర్మ కామము*

    కనుగొనంగను ధర్మకామమె
    కాయమౌ రఘురాముడున్
    వనిఁ జరించుచు వచ్చి నీపయిఁ
    బాద మల్లన మోపునం
    దనుక రాయిగ నుండిపోవె! య
    ధర్మ కామ దురూహకున్
    దనువు లేదఁట చిత్రమే యువ
    తంత్రులన్ మఱి మీటెడిన్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    7.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  37. కందం
    కందం
    ప్రణవమ్మాదిగ జననము
    సనాతని కరంపు వీణ సవ్వడి మీదన్
    విన మొదలౌ గానమునకు
    తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ!

    రిప్లయితొలగించండి
  38. మనువునిచ్చెడువారిజాసనుమామకూతురుభర్తకున్
    దనువులేదటచిత్రమే,యువతంత్రులన్మఱిమీటెడిన్
    ననుగుబిడ్డయరాజ్యలక్ష్మికిహర్షనామక పుత్రికే
    వినుముసోదర!నాదుమాటనువిందుజేయునునద్దియే


    రిప్లయితొలగించండి
  39. కనమీ సౌందర్య మహో
    మును పెన్నఁడు దేవకన్యఁ బోలిన దీనిన్
    వనజాక్షిం గదిసెడు లో
    తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ

    [లోతు + అనువు = లో తనువు; గంభీరపు టుపాయము]


    తరలము.
    తను వహో మఱి కంప మొంద లతా వితాన లతాంత కా
    నన విహారము సల్పఁగా లలనా యుతమ్ముగఁ గాంచఁ గా
    లున కశక్యము కౌముదీ నిశలోనఁ జంద్రుఁడు రాఁ ద్రయీ
    తనువు లేదఁట చిత్రమే యువతంత్రులన్ మఱి మీటెడిన్

    [త్రయీతనువు = సూర్యబింబము]

    రిప్లయితొలగించండి
  40. తరళము:
    మనువు గోరిన శాంభవే వరమా కపాలిని గోరఁగన్
    చనువు జూపిన మారుడే విరి చాపమే జతజేయగా
    కనుల యగ్నియె బుట్టెలే కసి గాల్చియూ రతి బ్రోచెనే
    తనువు లేదట చిత్రమే యువతంత్రులన్ మరి మీటెడున్

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ"

    సందర్భము: ఒక అనాకారి రామ కీర్తన ఎంతో మధురంగా ఆలపిస్తున్నాడు. గొప్ప ప్రార్థన.
    నిజానికి అతని రూపు చూడలేము కాబట్టి చూడము. పాట మాత్రం వింటాం.. అది యువ తంత్రులను మీటింది. ఆశ్చర్యమే!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *గాన సౌందర్యము*

    విన మిట్టి రామ కీర్తన..
    ఘన మగు ప్రార్థన సుమీ! వికార మయిన రూ
    పును గనజాలము.. కావున
    తనువుఁ గనము.. మీటెను యువ
    తంత్రుల.. వెఱఁగౌ..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    7.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  42. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "తనువు లేదఁట చిత్రమే యువతంత్రులన్
    మఱి మీటెడిన్"

    సందర్భము: ధనుః పౌష్పం మౌర్వీ.. అనే సౌందర్యలహరీ శ్లోకంలో ఇలా చెప్పబడింది.
    "హిమగిరితనయా! మన్మథుని ధనుస్సేమో పువ్వులది, అల్లెతాడేమో తుమ్మెదలది, పూలబాణా లేమో ఐదే, సామంతుడేమో వసంతుడు, రథమేమో పిల్లగాలి, తా నేమో ఒక్కడే!
    ఈ విధంగా ఏరకంగానూ సమర్థుడు కాకున్నప్పటికీ అనంగుడు..అనగా శరీరం లేకపోయినప్పటికీ నీ కడగంటి చూపువలన కదా లోకాన్నంతా జయించగలుగుతున్నాడు.."
    మన్మథుడు దేవీ ఉపాసకు డని, ఆమె కృపవల్లనే శరీరం లేకపోయినా తన కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా చేసుకుపోగల్గుతున్నా డని పేర్కొనబడింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *జగన్మాత కృప*

    ఘనుడు మన్మథు.. డా మహేశ్వరు
    గంటి మంటల దగ్ధమై

    తనువు పోయినఁ నెప్పటిం బలెఁ
    దా నొనర్చు స్వధర్మమున్..

    గనుగొనంగను లోటు లేదట
    కార్య సాధన!.. నిప్పు డే

    తనువు లేదఁట చిత్రమే! యువ
    తంత్రులన్ మఱి మీటెడిన్..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    7.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  43. As reported by Stanford Medical, It is really the ONLY reason this country's women get to live 10 years longer and weigh 19 kilos less than us.

    (Just so you know, it has NOTHING to do with genetics or some secret diet and absolutely EVERYTHING related to "HOW" they are eating.)

    P.S, What I said is "HOW", not "what"...

    TAP on this link to uncover if this short quiz can help you unlock your true weight loss potential

    రిప్లయితొలగించండి