24, మార్చి 2020, మంగళవారం

సమస్య - 3318 (కడు లాభంబగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సత్ఫలము లభించు నీచసాంగత్యమునన్"
(లేదా...)
"కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్"

77 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  లోకులు పలుగాకులు: (Sri AP Singh: Supreme Court Criminal Lawyer)

  చెడునున్ మంచిని చిత్తగించక కడున్ చీత్కారముల్ సైచుచున్
  గడువుల్ కోరుచు నిర్భయన్ హతమునన్ గాఢంపు నిర్ణీతినిన్
  పడుచున్ లేచుచు కోర్టులందు మిగులన్ ప్రఖ్యాతి నార్జించగన్
  కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్

  https://www.google.co.in/amp/s/www.theweek.in/news/india/2020/03/20/devil-s-advocate--how-a-p--singh-made-every-effort-to-save-nirbh.amp.html

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ముందుగా మీరిచ్చిన లింకు ద్వారా ఎ.పి.సింగ్ గురించి చదివి, ఆ తరువాత మీ పూరణను పరిశీలించాను. బాగుంది. సమయోచితమైన పూరణ.
   "నిర్భయాంతకులకున్..." అంటే బాగుంటుందేమో?

   తొలగించు

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వడిగా నిట్టిది న్యాయమున్ నుడువుటన్ వర్జింపగా కోరెదన్:👇
  “కడు లాభంబగుఁ గాదె నీచజన సాంగత్యంబు ముమ్మాటికిన్”
  చెడుగా నెంచక శంకరా! పలుకుడీ శ్రేష్ఠంబగున్ నీతినిన్:👇
  “కడు లాభంబగుఁ గాదు నీచజన సాంగత్యంబు ముమ్మాటికిన్”

  రిప్లయితొలగించు


 3. ప్రోత్ఫుల్లతని సుజను కెడ
  సత్ఫలము లభించు, నీచ సాంగత్యమునన్
  సత్ఫలముదక్కదయ ! ప
  శ్యత్ఫాలుని నామధేయ సరి పూరణయో?  జిలేబి

  రిప్లయితొలగించు
 4. (ఆదర్శగృహస్థుడు బిల్వమంగళుడు వెలయాలు చింతామణి కోసం అర్ధరాత్రి జడివానలో
  అమెయింటికి వెళ్లి ఆమె మాటలతో విరక్తుడై శ్రీకృష్ణభక్తుడై ముక్తుడౌతాడు.)
  జడివానన్ నడిరేయి పర్వులిడుచున్
  సంస్కారసంపత్తినే
  వడిగా బ్రక్కనపెట్టి మంగళుడు తా
  పాధిక్యతన్ బోవగా
  చెడి చింతామణి యింటికిన్;దుదకు గాం
  చెన్ గృష్ణు కారుణ్యమే!
  కడు లాభంబగుగాదె నీచజనసాంగ
  త్యంబు ముమ్మాటికిన్.
  (తాపాధిక్యత-విరహపువేడిమి;మంగళుడు-బిల్వమంగళుడు)

  రిప్లయితొలగించు


 5. సత్పాత్రులకిడ దానము
  "సత్ఫలము లభించు, నీచసాంగత్యమునన్"*
  సత్ఫలమెల్లయు చనునో
  నుత్పలనేత్రీ నెరుగుచు నొసగుము నీవిన్

  రిప్లయితొలగించు


 6. కడకంటన్ గను కంది శంకరు కెడన్ కందమ్ముగా నేర్వగా
  కడు లాభంబగుఁ గాదె, నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్
  కడగండ్లేను సుమా జిలేబి! సుజనుల్ కాణాచి వారల్ !భళా
  యడియాలమ్ము జనాళి మేలుకొరకై యావత్తువారే సదా!


  జాల్రా
  జిలేబి

  రిప్లయితొలగించు


 7. పశ్యత్ఫాలుని నామధేయ సుజనా వాగ్దేవి పుత్రా నమో !  జిలేబి

  రిప్లయితొలగించు

 8. నా పూరణ :: మత్తేభ విక్రీడితము
  **** ***** ***** ***** ***** ***

  కడగండ్లెన్నియొ కల్గవే దురితులన్ సఖ్యంబుకై వేడగన్?? 

  వడిగన్ మిక్కిలి నాశమొందు గదరా ప్రఖ్యాతులే దారుణిన్!

  చెడుగాఁ నిట్టులఁ బల్కినంత జనులే ఛీకొట్టరే యెప్పుడున్??

  "కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్"

  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించు
 9. ఉత్ఫలము గోరు వారికి
  సత్ఫలము లభించు , నీచసాంగత్యమునన్
  యుత్ఫలముగ దక్కవలయు
  మత్ఫలము చెడు ఫలితముగ మారును గదరా

  ఉత్ఫల = మంచి ఫలము

  రిప్లయితొలగించు
 10. పుడమిన్ సజ్జనకోటి చెంత నిలువన్ భూవాసి కేమౌను? తా
  నిడుముల్ గూర్చునదేది? తెల్పు మనగా నెంతేని సంతోష మా
  యెడగల్గంగను ఛాత్రు డాగురునితో నిట్లాడె నమ్రాంగుడై
  కడు లాభంబగుఁ గాదె, నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 11. సత్ఫలము గోరు వారికి
  తత్ఫల మిచ్చునది ప్రభుని ధ్యానమ్మొకటే
  యుత్ఫుల్ల నేత్రి యెవ్విధి
  సత్ఫలము లభించు నీచసాంగత్యమునన్

  రిప్లయితొలగించు
 12. రిప్లయిలు
  1. ఒక దుశ్శీలవతితో స్నేహం చేస్తున్న స్నేహితురాలితో ఇంకొక సౌశీల్యవతి అంటున్న సందర్భము.

   అడలం జేయును గాదె?, సంతతము నత్యంతమ్ము భీతిం గనన్
   చెడు కీర్తిం గలిగించుఁ గాదె? గతదుశ్శీలాప్తచారిత్ర్యమున్,
   విడ వా నెచ్చెలి స్నేహమున్ వలదనన్ వేయేల? నీ కే విధిన్
   గడు లాభంబగుఁ, గాదె నీచజనసాంగత్యంబు, ముమ్మాటికిన్

   కంజర్ల రామాచార్య
   వనస్థలిపురము.

   తొలగించు
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'కాదె అన్నదానికి అన్వయం?

   తొలగించు
  3. కాదా అని ప్రశ్నార్థకములో గాదె అని ప్రయోగించానండీ పొసగదంటే సవరించు కుంటాను.

   తొలగించు
 13. సత్ఫలము సుసంతానము
  సత్ఫలము సద్గుణము, సతి సద్గుణవతియున్
  సత్ఫలము, చేయు పనులనె
  సత్ఫలము లభించు నీచ సాంగత్యమునన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం రెండవ గణం జగణమయింది. సవరించండి. (కందంలో బేసిపాదాలలో బేసిగణంగా, సరిపాదాలలో సరిగణంగా జగణం ఉండరాదు)

   తొలగించు
 14. 🙏నిన్న రాత్రి పదిగంటల తరువాత యాదృచ్ఛికముగా బ్లాగు చూచితిని. అందులో శ్రీమతి జిలేబి గారి కామెంట్.. *రూటు మార్చారే.. కీచకునిపై వ్రాస్తారనుకున్నా..* అని ఉంది. సరే అని మరల ప్రయత్నించా.. 👇🙏

  కత్తి.. బాకు.. డాలు.. విల్లు..

  సైరంధ్రితో.. కీచకుడు

  అతివా! నన్ను వరింపవా ! కొనఁగ నీకత్తిల్లగున్ మా గృహం...
  బతిసౌఖ్యంబు లభించు., నింత బిడియంబా! కుందదంతస్మితా!
  ఇతడాలున్ మది బ్రేమ జూచుకొనునా యెంతే? ననున్ శంకయా ?!
  హితమున్ గూర్చెదనేల జేరుకొనరావిల్లుబ్ధునిన్ మాలినీ!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. నడతన్ మార్చు! పరోపకారగుణమున్ వర్ధిల్లగా జేయు., నీ
   యడుగుల్ సక్రమమార్గమందు బడగా నందించు ప్రోత్సాహమున్!
   కడు మేలౌ గుణవద్విధానము! కవీ! కాదీగతిన్ బల్కగా
   కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు


  2. నమో నమః ఇప్పుడు కదా విరాటు కొల్వు కవీశ్వరులని పించుకున్నారు !   నెనరుల్స్
   జిలేబి

   తొలగించు
  3. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
 15. సత్ఫల కృత్యము వలననె
  సత్ఫలము లభించు : నీచ సాంగత్యము నన్
  సత్ఫలము దూర మగు గద
  సత్ఫల మాశించు ట నిన సంశ య మౌగా

  రిప్లయితొలగించు
 16. మిత్రులందఱకు నమస్సులు!

  కడు నీచుండును, దుష్టుఁడున్, మొఱకునున్, గాణిక్యలోలుండునున్,
  బడతిన్ దొంగిలినట్టి రావణునకున్, మైరావణాఖ్యుండు దో
  డ్పడె శ్రీరాముఁడు నిద్రనుండఁ గదియింపంబూని! యౌరా, భువిన్

  గడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. చిన్న సవరణముతో...

   కడు నీచుండయి, దుష్టుఁడై, మొఱకునై, గాణిక్యలోలుండునై,
   బడతిన్ దొంగిలినట్టి రావణున కా మైరావణాఖ్యుండె తో
   డ్పడె శ్రీరాముఁడు నిద్రనుండఁ గదియింపంబూని! యౌరా, భువిన్

   గడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్!

   తొలగించు
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 17. సత్పథగాముల సేవను
  సత్ఫలము లభించు;నీచ సాంగత్యమునన్
  తత్ఫలములె యొనగూడుగ
  నుత్పలనేత్రా!త్యజింపు మోగులచెలిమిన్

  రిప్లయితొలగించు
 18. *ఒక నచ్చీలవతిని వేశ్య తన వృత్తిలోకి రమ్మని చెబుతున్న సందర్భము*

  పడతీ కూడును పెట్టలేని తరి యా పట్టింపదే యెందుకో
  విడు చాదస్తము రమ్ము నా దెసకిటన్ బెంపొందు భాగ్యమ్ములే
  తొడువుల్ గూడును మాన్యముల్ దొరుకు సంతోషమ్మటన్ దక్కునే
  కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బాగుంది మీ పూరణ. అభినందనలు.
   'తొడవుల్' అనడం సాధువు అనుకుంటాను.

   తొలగించు
 19. ఉత్ఫాల మేలనయ్యా
  యుత్ఫుల్లక మన్న నీవటుఱుకుట మేలా?
  తత్ఫలిత మెఱుగ వేలా
  సత్ఫలము లభించు? నీచ సాంగత్యమునన్.

  ఉత్ఫాల-తొందరపాటు
  ఉత్ఫుల్లకము-ఆడుగురి,యోని

  రిప్లయితొలగించు
 20. మత్తేభవిక్రీడితము
  విడలేనంతగ విశ్వదన్ మరుగుచున్ వేమాఖ్యు డేపార వ
  త్తిడి నా మోహము బాపగన్ వెలది సాదృశ్యాన సాధించఁగన్
  బొడచూపెన్ వరయోగి నీతి శతకమ్మున్ గూర్చఁగా నొక్కచో
  కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గురుదేవుల సూచన మేరకు సవరించిన పూరణ :

   మత్తేభవిక్రీడితము
   విడలేనంతగ విశ్వదన్ మరుగుచున్ వేమాఖ్యు డేపార నొ
   త్తిడి నా మోహము బాపగన్ వెలది సాదృశ్యాన సాధించఁగన్
   బొడచూపెన్ వరయోగి నీతి శతకమ్మున్ గూర్చఁగా నొక్కచో
   కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్

   తొలగించు
 21. విడువన్నేరడు గర్ణునిన్ మనమునన్ యీరీతి రారాజు, దా
  వడిగా బాణము లేయుచున్ తికమకన్ పాండిత్యమే జూపుచున్
  దడపుట్టించుచుపాండుపుత్రుల పయిన్ దాదాగిరే జేయగా
  కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనమునన్+ఈరీతి' అన్నపుడు యడాగమం రాదు. 'దాదాగిరి' అన్యదేశ్యం.

   తొలగించు
 22. ఉత్ఫాలరహితపనులకు
  సత్ఫలములభించు,నీచసాంగత్యమునన్
  సత్ఫలములందనేరరు
  సత్ఫలములువచ్చుమనకుసజ్జనుజెలిమిన్

  రిప్లయితొలగించు
 23. కంస సాంగత్యముతోఁ బూత నాదులకు మోక్షము :

  హృత్ఫేన కలుష హరమై
  తత్ఫణి తల్ప కర పంచతా భాగ్యమహో
  తత్ఫల మెంచఁగ నాహా
  సత్ఫలము లభించు నీచసాంగత్యమునన్


  అడరం గాంచమె పాండవేయులకు నాహా కృష్ణ సాంగత్యముం
  బుడమిం గాంచమె ధార్తరాష్ట్రునకునుం బో కర్ణ సాంగత్యమే
  బడయన్ సజ్జన దర్శనమ్ముఁ గడు దుష్ప్రాప్తిన్ విసర్జించఁగాఁ,
  గడు లాభంబగుఁ గాదె, నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 24. కందం
  ఉత్ఫలుఁడటంచు వేమన
  హృత్ఫలము వెలదిగ నెరిగి యింగితమొసగన్
  దత్ఫలము యోగిఁ జేసెన్
  సత్ఫలము లభించు నీచసాంగత్యమునన్

  రిప్లయితొలగించు
 25. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "కడు లాభంబగుఁ గాదె నీచజన సాంగత్యంబు
  ముమ్మాటికిన్"

  సందర్భము: తాత యైన సుమాలి రావణుని ప్రేరేపించినాడు లంకను స్వాధీనం చేసుకొమ్మని, కుబేరుని జయించు మని..
  "మనుమడా! నీ విప్పుడు మహా తపస్సంపన్నుడవు. బ్రహ్మ వలన వరాలు పొందావు. అజేయుడవు. చాలా సంతోషం.
  నీవు చేయవలసిన మొదటి పని ఒక టున్నది. పిడుగులాగా లంకపై పడి విజృంభించి కుబేరు నోడించి లంకను స్వాధీన పరచుకోవడం."
  సుమాలి మాటలు విని రావణుడు "తాతా! కుబేరుడు స్వయానా మా అన్న. సోదరునిపై యుద్ధం సమంజసమా! ఈ పద్ధతేం బాగా లేదు." అన్నాడు. ఐనా ఆలోచనలో పడ్డాడు.
  కొన్నాళ్ళకు సుమాలి కొడుకు ప్రహస్తుడు వచ్చి "శూరులకు సోదర భావం అడ్డు రాకూడదు. ఐనా సోదరులమీద యుద్ధం నీతోనే మొదలయిం దనుకున్నావా! నీ శక్తి సామర్థ్యా లెందుకు మరి?" అని రెచ్చగొట్టాడు.
  రావణుని మనసు మారిపోయింది. కుబేరునిపై ద్వేషం మొదలయింది. భయంకరమైన యుద్ధం చేసి కుబేరుని తరిమికొట్టి లంకను, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *తాత - మనుమడు*

  "పిడుగై మన్మడ! ఆ కుబేరునిపయిన్
  బేట్రేగి లంకాపురిన్
  వడిగా గైకొను మెట్టులైన" నని నే
  ర్పంగా సుమాల్యుక్తి కే
  ర్పడ మారెన్ దశకంఠు డల్పమతిగా..
  భావింప నీచాళికిన్
  గడు లాభం బగుఁ గాదె నీచ జన సాం
  గత్యంబు ముమ్మాటికిన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  24.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 26. ఉత్ఫుల్లాబ్జాక్షు గొలువ
  సత్ఫలము లభించు; నీచసాంగత్యమునన్
  ప్రోత్ఫుల్లంబగు కామము
  తత్ఫలముగ దుస్ఫలములు దప్పవు వినుమా

  రిప్లయితొలగించు
 27. అందరికీ నమస్సులు 🙏
  నా పూరణ ప్రయత్నం

  *ఎన్నికలలో గెలుపుకోసం అనే ఉద్దేశ్యముతో*

  ( *శంకరార్యా అన్వయం సరిపోయినదా* 🤔😞)

  *కం||*

  సత్ఫలమని నీచులతో
  సత్ఫలముగ గెలిచి జూడ సాయము కోరెన్
  సత్ఫలమేగెలుపనుగొన
  *"సత్ఫలము లభించు నీచసాంగత్యమునన్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙏

  రిప్లయితొలగించు
 28. ఉత్ఫుల్లమునీటనొదవ
  సత్ఫలము లభించు, నీచసాంగత్యమునన్
  తత్ఫలమేవికటమగును
  సత్ఫలములభించుసుజన సాంగత్యమునన్

  రిప్లయితొలగించు
 29. మత్తేభవిక్రీడితము
  విడువన్ జాలను నిన్ను నేను కుజకై వేషమ్మునన్ లేడివై
  నడయాడన్ నిను గాంచి రామునటు సంధానించ నేదెచ్చెదన్
  బెడదారిన్ జన చావుఁదప్పదనుచున్ వేదించ లంకేశుడున్
  వడిగా రాముని బాణధాటిఁ బడసెన్ స్వర్గమ్ము మారీచుడున్
  గడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 30. చెడుగామాటలుబల్కకుండగనురాజీమార్గమున్గోరుచో
  కడులాభంబగుగాదె,నీచజనసాంగత్యంబుముమ్మాటికిన్
  వడిగాచెడ్డనునేర్పునేగదిల,నెవ్వండైనమారున్సుమా
  కడులాభంబగుమంచివానిచెలిసాకారంబుపెంపొందగన్

  రిప్లయితొలగించు
 31. గురువు గారికి నమస్సులు
  సత్పురుష లెల్లరికిన్
  సత్ఫలము లభించు ,నీచసాంగత్యమునన్
  సత్పురషులు విటులగుదుర్
  సత్పురుషులభాగ్యమేది? సతియే! సుమతీ!

  రిప్లయితొలగించు
 32. కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్
  చెడుమా ర్గంబను నచ్చేజనులకు ఛీఛీనీచపాలోచనన్
  కడుమూర్ఖత్వపు దారుణంబిదియె, చీకట్లెల్లచీల్చేందుకున్
  నడువిజ్ఞానుల మార్గమున్ నిరుపమానంబున్ సుశీలంబుతోన్.

  రిప్లయితొలగించు
 33. తత్పరసేవాగుణమున
  సత్ఫలములభించు,నీచసాంగత్యమునన్
  నుత్పన్నమౌనుబహువిధ
  నుత్పాతముజీవనంబు నొసగునశాంతిన్

  రిప్లయితొలగించు
 34. మ:

  బడయన్ జొచ్చెను భోగముల్ ప్రబల సంభావ్యమ్ము రాధేయుకున్
  కలగా నిల్చును కూడలేనియెడ నా గాంధారి సంతానమున్
  భళిరా యెంతటి వైపరీత్యమిది భావావేశ కుంతీయమై
  కడు లాభంబగుగాదె నీచ జన సాంగత్యమ్ము ముమ్మాటికిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 35. సత్ఫలమగు సజ్జనులకు
  సత్ఫలమది ఎంచిచూడ సత్సాంగత్యమ్
  సత్ఫలమన నీచులకది
  సత్ఫలము లభించు నీచసాంగత్యమునన్"
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించు
 36. సుడిలోచిక్కిననావచందముననేశోకానలజ్వాలలన్
  బడియేదిక్కునుతోచకున్నతరితాబంధుండయెన్ ధూర్తుడొ
  క్కడువాడేకద పైకమాశగొని నాకండాయె నన్గావగన్
  కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 37. వికలముగావించె రుజయు
  *సకలజనభయంకరముగ,శార్వరి వచ్చె*
  న్నికమన కిడగా శుభములు
  చకచక స్వాగతమిడంగ చానలు మీరున్

  మరొక పూరణ

  పికముల సందడెచ్చట ను వీనుల నిప్పుడు విందు చేయదే
  తికమకచేయనెంచుచునదెక్కడి నుండి యొ వచ్చె నిప్పుడున్
  *"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ"*
  వికలత మాన్పిమోదమునువేగమెకూర్చగసంతసంబుతో

  రిప్లయితొలగించు