సందర్భము: ఇంద్రజిత్తు వీరమరణం పొందగా భార్య భర్తతో సహగమనం చేయ నెంచింది. మృత కళేబరాన్ని రణభూమినుంచి తెప్పించు మని ఒక అనుభవజ్ఞుడైన సేవకునితో రావణుని వద్దకు సందేశాన్ని పంపగా అతడెంతో కష్టం మీద రావణుని కలిసి అన్న మాట లివి. రావణుని పరిస్థితి అప్పు డిలా వుంది. పుత్రశోకంతో చాలా చిరాకుగా వున్నాడు. తన వద్ద కెవరినీ అనుమతించడమే లేదు. అనుమతించినా అతి క్లుప్త సమాధానం. పరాకు. అందరిమీదా అసహనం. అనవసరమైన కోపం. ఇంద్రజిత్తు భార్య సులోచన. తానే స్వయంగా మామగారి వద్దకు వెళ్ళవచ్చు కదా..అంటే ఆ పరిస్థితిలో "నీకు వైధవ్య యోగం వ్రాసిపెట్టబడి వుండటంవల్లనే మా వా డిలా అయ్యా" డనే వాళ్ళూ వుంటారు లోకంలో.. సేవకుడు ఇంతకు ముందు రావణునితో కలిసి మాట్లాడిన అనుభవం కలవాడు కాబట్టి చొరవ కలిగినవాడు కాబట్టి రావణుని ఆదరాభిమానా లొకింత చూరగొన్నవాడు కాబట్టి వయసులో పెద్ద కాబట్టి బయలుదేరాడు. ఐనా ఇటువంటి పరిస్థితిలో మాట్లాడడం కొంత ఇబ్బందే! అందించవలసిన సందేశంకూడా ప్రత్యేకమయినదే! "రణభూమినుంచి ఇంద్రజిత్తు మృతకళేబరాన్ని తెప్పించండి. మీ కోడలు సహగమనం చేస్తుందిట!" అనే కదా చెప్పాల్సింది! సేవకుడు చిత్తస్థైర్యాన్ని పుంజుకొని వెళ్ళి రావణుని కలిసి ఎలాగో విషయం నివేదించాడు. అదీ పద్య సందర్భం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*విషాద సందేశము*
రా డిక నీ కుమారు.. డట రాముని తమ్మునిచేతఁ బ్రాణముల్ వీడె..నదెంత వానికిని వేదనయే!..పతిఁ గూడి యేగ మీ కోడలు భర్త దేహమును గోరెను..తెమ్మని పంపుమా! ప్రభూ! కోడలి వైపు వాఁడ నని కోపము నాపయిఁ జూపఁబోకుమా!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 17.03.20 -----------------------------------------------------------
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండినా సరదా పూరణ 🙏
(మామ గారు భార్యతో)
*కం||*
జోడుగ నీవాడిని నే
తోడుగ నీకుంటిననుచు తొడగొట్టితినే
మాడుపగుల గొట్టెదవా
*"కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏🌸🙏
మరో పూరణ 🙏🌹
తొలగించండి(మామ గారు భార్యతో)
*కం||*
వేడిగ బజ్జీ పునుగు ప
కోడీలను వేసి తెచ్చె గోడు వినినదై
నీడగ వెంటాడుదువా
*"కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
నా మరో పూరణ 🌹🌹🌹
తొలగించండితెలివైన పాత తరం సినిమాలో ఓ కోడలు గురించి ఇంటి తప్పుడు లెక్కలు వేసే గుమస్తాతో ...
*కం||*
మాడిన ముఖమును వేసుకు
తోడుగ వచ్చితి విచటకు దోచుకొనుటకున్
తేడా లెక్కలు నీవను
*"కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిశతాధిక వందనములు ఆర్యా ..
తొలగించండినమస్సులు 🙏🙏
రూఢిగ జెప్పెద వినుమా
రిప్లయితొలగించండికోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా
నేడే మెట్టినదినమన
మూడీగ నుముగ్ధ యామె ముద్దుగ నుండన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడ-ఢ ప్రాసను వర్జించండి. 'మూడీగన్' అన్యదేశ్యం.
రిప్లయితొలగించండిగాడిదలా తెగ తిరుగుచు
పీడించుచు గరుణ లేక భీతిలు సతిపై
దాడులు చేసెడి కొడకా!
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
"కలవారి కోడలు కలికి కామాక్షి..."
పేడల నద్ది గోడలకు పెండిలి చేయుచు నాదు చెల్లికిన్
పోడిమి మీర పంపమని పుట్టిన యింటికి మాఘమందునన్
వేడగ చేతులన్ ముడిచి వెండిని బంగరు తెచ్చియిచ్చినన్
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికోడైకూయుదురు జనులు
రిప్లయితొలగించండికోడలి నేడ్పించగాను గొడవలు జరుగున్
వీడకు నోర్పువహించుము
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా!
***నా రెండవ పూరణ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపాడియు గాదు కడవరకు
తోడుగ నుంటననె మాట త్రోసియు సతినిన్
బీడించుట మెచ్చ రెవరు
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తోడుగ నుందుననె..." అనండి.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
తోడుగ మామనున్ గొనుచు దొబ్బులు పెట్టుచు రాత్రిప్రొద్దుటన్
మేడలు మిద్దెలన్ కొనగ మేలిమి కట్నము రోజు కోరుచున్
పోడును బెట్టుచున్ తమరు పోకరు తోడను కొట్ట బోవగా
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ. ఉ.మా.
**** *** ***
మేడలలోన నుంచెదను మేటిగ జూచెద నంచు బల్కి యా
ఆడిన మాట దప్పి కడు యాతన బెట్టుట ధర్మ పత్నికిన్
పాడియు గాదు!మెచ్చుదురె పండిత పామరులైన పుత్రుడా??
కోడలి వైపు వాడనని కోపము నాపయి జూప బోకుమా
౼ ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(సక్కుబాయి అత్తగారితో మామగారు )
రిప్లయితొలగించండిచూడుము ధర్మపత్ని!మన
చొక్కపు పుత్రుని పెండ్లికోసమై
వాడల వాడలన్ వెదకి
వజ్రము వంటిది సక్కుబాయినే
తోడుగ దెచ్సుకొంటి;మిటు
త్రోయుట,కొట్టుట నీకు న్యాయమా?
కోడలివైపువాడనని
కోపము నాపయి జూపబోకుమా!
(చొక్కపు-నిర్మలమైన;వాడలు-వీధులు)
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిపీడించు చుండెను గదా
రిప్లయితొలగించండివీడు తనసతిని గృహ మున ,వేయగ వలయున్
వీడికి శిక్ష ని పలికితి
కోడలి వైపుంటి ననుచు కోపింపకుమా
వ్యసన పరుడైన కుమారుని పోలీసులకు ఒక తండ్రి అప్పగించి తన భార్యకు సర్ది చెప్పటం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ నాటి శంకరా భరణము వారి సమస్య
రిప్లయితొలగించండికోడలివైపుంటిననుచు కోపింపకుమా
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
రాముడు గర్భవతి అయిన సీతను అడవులకు పంపగా కౌసల్య కోపముతో “సీతమంచిది రాముని నీవే తప్పు చేశావు” అని పలికిన పలుకులు
తోడుగ నడచెను పోడుకు నీతోడ
వీడుచు పోడిమి నాడు ,వెగడు
బడయక,దనుజుని పడుసరమున నడ
లక నెడతెగక తలచెను గాదె
నెడదన నీపేరు విడువక, క్రొత్తడి
మడతుక యనుచు పొగడెను హృషుడు,
బాలకా ! కోడలి వైపుంటి ననుచు కో
పింపకు మా విలపించు చుండి
రెల్ల రంత: పురములోన, తల్ల డిల్లు
చుండె నామది, భావ్యమా నిండు మనిషి
ని నడవులకు పంపగ, తీవ్ర నేరమనుచు
పలికె కౌసల్య కోదండ పాణి తోడ
డకార ఆవృత్తి కలిగిన వృత్త్యనుప్రాసాలంకారంతో మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూడునుఁ గూడు లేక బ్రతుకుం గడు దీనత సాగఁదీయుచున్
రిప్లయితొలగించండిపోడిమితోడ వ్రాసితిని ముగ్ధ మనోహర కావ్య రాజమున్
వేడెదనమ్మ సత్కవిగఁ బేరు గడించిన నన్ను మాధవీ!
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా.
అద్భుతమైన పూరణము! శుభాభినందనలు!
తొలగించండిఅద్భుతం
తొలగించండి🙏🏽🙏🏽🙏🏽
గోడకు కొట్టిన పిడకై
రిప్లయితొలగించండివీడక యుండంగవలయు వెలదిని యెపుడున్
చూడకు నేరము లెంచకు
కోడలి వైపుంటిననుచు కోపింపకుమా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వెలదిని నెపుడున్" అని ఉండాలనుకుంటాను.
తోడుగ నేనుండెదనని
రిప్లయితొలగించండినాడే తాఁ దలచి వచ్చె నాసతి గాదే
పీడింపకు కోమలినిక
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేడుకగ దంపతులచట
రిప్లయితొలగించండివాడిగ జనియించబోవు పాపను యెంచన్
పాడియగు వాదులాడగ
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పాపను నెంచన్" అనండి.
🙏🏽
తొలగించండితాడును గాంచి పామనుచు దల్చితివమ్మరొ పాడికాదు, నీ
రిప్లయితొలగించండికోడలు సౌమ్యురాలికను కోపము వీడుము చిన్నదానిపై
దాడియదేలనే, విడుము తల్లివలెన్ దయ జూపమంటినే
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితోడుగ నుందునటంచును
రిప్లయితొలగించండినాడే చెల్లెలికొసంగినానది నిజమే
నేడుండకతప్పదు నా
కోడలి వైపుంటి ననుచు కోపింపకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికళ్ళాలు గయ్యనుచుండు ; తల్లి చాడీలను చెప్పు :) నడుమ మురారి ఫ్యూచర్ సేఫ్ :)
హోడంబీ జీవితమ
మ్మా!డంబంబనుకొనకు సుమా! ఓ యమ్మా!
చాడీలవేలనే? నే
కోడలి వైపుంటిననుచు కోపింపకుమా
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేడితినమ్మ లక్ష్మి మురిపించవె సంపదలిచ్చివేగ నం
రిప్లయితొలగించండిబాడితి వీణనై యొడిని పాడితినమ్మరొ నాల్గువేదముల్
చూడగ నీకు మన్మడను క్షోభను పేదరికమ్ము మాన్పు *మా*
*కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితల్లా పెండ్లామా ? Stay tuned to future :) మధ్యతరగతి మానవుడి Decision :)
హోడము జీవితమ్మను మహోదధి దాటగ నాదు నేర్పిద
మ్మా!డబుడుక్కు డుక్కనుచు మాటికి మాటికి యా జిలేబియున్
క్రీడగ కాలుబంతి వలె కీసర బాసర మీరు తన్నగా
జోడుగ మేలు మార్గమిదె! జోతలు ! నిబ్బరికించు మమ్మరో!
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినిన్నటి నాగమ పూరణ మొత్తం మీద హైహేయులను , మాహిష్మతీ నగరపు చరిత్ర లను మహరాష్ట్రియన్ అనుగురాజు ను తెలియ పరచి తల తిరిగెను ! ఆహా యేమి బల్ , నాటి చరిత్ర !
జిలేబి
నిన్న ప్రయాణంలోను, అవధానంలోను ఉండి ఎవ్వరి పూరణను చదవలేకపోయాను. ఈరోజు తీరిగ్గా చూస్తాను.
తొలగించండిమేడలు మిద్దెలున్ నగలు మేలిమి భూమియె సొంతమౌననిన్
రిప్లయితొలగించండికోడలిఁ దెచ్చుకొంటివి సగోత్రుల వంశమునుండి నింటకే
తోడుగఁ జే రరిష్టమెటు తోకను ముడ్చును? బుద్ధి చెప్పగా
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా౹౹
(మామగారు తన భార్యతో సంభాషణ)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "భూమియె దక్కునంచు నా..." అనండి.
సరేనండి
తొలగించండివేడిగ కాఫీ నొసగుచు
రిప్లయితొలగించండినీడగ వెన్నంటి తనదు నిర్మల హృదితో
వీడక సేవించె డి నా
కోడలి వైపుంటి ననుచు గోపింప కు మా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోడలనన్ గృహంబున నగోచర మాధవి రూపమౌ గదా
రిప్లయితొలగించండికోడలు నింటిదివ్వె మన కోసరమే మన వంశ వృద్ధికై
కోడలు మెట్టె నేటికిని గూతురు చందము నాద రించనన్
"కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమంచి మామ....
రిప్లయితొలగించండిఏడ జనించెనేమొ! మన యింటికి వచ్చినదీమె., వీనికిన్
తోడుగనుండి., యింటిపనితో నిను నన్నలరించె., మన్మనిన్
వేడుకనిచ్చె., నీమెనిటు వేదన బెట్ట ధనాశఁ బాడియే?
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండితోడూ నీడా మనకీ
రిప్లయితొలగించండిచేడియ వృద్ధాప్యమందు! చిన్నపరుపగాఁ
గూడదె ఓ నాకాంతా!
*కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా!*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగోడకు కొట్టిన వెల్లౌ
రిప్లయితొలగించండిపోడిమి కోడలి దొసగుల పోగొట్టదగున్!
పీడించఁదగదు గృహిణీ!
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాడియ సతిదాసుడనుట
రిప్లయితొలగించండివేడుక కయినను జననిరొ యింతిని మీరన్
పోడిమి యగునా మగనికి
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[కురుసభలో ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుఁడు పలికిన పలుకులు]
"వేఁడెద నిన్ను, మామ! మును పెట్టిన బాధలఁ బాండవేయులున్,
గోడలు ద్రౌపదీ సతియుఁ గోరి సహించిరి! వారి భాగమున్
నేఁడిఁక నిచ్చివేయుటయె నిక్కపు ధర్మము! జాగదేలయా?
కోడలివైపు వాఁడనని, కోపము నాపయిఁ జూపఁబోకుమా!"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివీడుము దుస్సాంగత్యము
రిప్లయితొలగించండికీడౌ కులసతిని వేచి గేలిని సేయన్
పాడు తలంపులు మానుము
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఓ కవీశుని నివేదన
బేడయు లేదు కరమ్మున
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా
హోడము సాగవలెను త
ల్లీ! డింగరుడ దయనుకురిపించుము లక్ష్మీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభార్యతో భర్త...
రిప్లయితొలగించండిఉత్పలమాల
ఆడుచు పేకముక్కలను యావిరిఁ జేయుచు నుండ సంపదల్
కూడదటంచు నీ కొడుకుఁ గ్రుచ్చుచు నారడి పెట్ట నామెకున్
దోడుగఁ దిట్టి నాడఁ దన దోషమెఱుంగఁ గుమారునిన్ సతీ!
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పేకముక్కలను నాడుచు.." అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. 'పేకముక్కలను నావిరి'
తొలగించండిఅంటే అన్వయిస్తుందని నా భావన. దయతో పరిశీలించ ప్రార్థన.
లేక ఇలా సవరిస్తే బాగుంటుందంటారా?
'ఆడుచు జూదమున్ గలిమి నావిరి జేయుచు నుండ బాధతో'
పరిశీలించ ప్రార్థన.
కందం
రిప్లయితొలగించండిఆడిన మాటను దప్పక
తోడితి మౌనికిఁ గలుములఁ దొలుత జలధిజా!
వీడ నిను హరిశ్చంద్రుఁడఁ
గోడలివైపుంటి ననుచుఁ గోపింపకుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాడుగనీయుటకేగెను
రిప్లయితొలగించండినేడైననురాకపోయెనింటికియేలా?
చూడగవలయునునెచ్చట
కోడలివైపుంటిననుచుగోపింపకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"... నింటికి నేలా చూడంగ వలయు నెచ్చట..." అనండి.
మేడలు భూముల్ లేనటి
రిప్లయితొలగించండివాడను చదువున శ్రమించువాడను లక్ష్మీ
కూడా నువు కావలె నీ
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మేడలును లేవు భూములు..." అనండి.
తల్లితో నేటి కొడుకు
రిప్లయితొలగించండితాడును గట్టితిన్ మెడకు తాళిగ బెండ్లిని యగ్నిసాక్షిగా
వీడని బంధమంటిరిగ పేర్మిని మీరలె జల్లియక్షతల్
నేడును భార్యమాటవిన నేరమదెట్లగు బాతకోడలా?
కోడలివైప వాడనని కోపము నాపయి జూపబోకుమా!
వైపు
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...బెండ్లిని నగ్నిసాక్షిగా... బంధమే యనిరి..." అనండి.
ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!
తొలగించండిమరో పూరణ 🌹🌹🌹🌹
రిప్లయితొలగించండి(మామ గారు, భార్య, కొడుకుతో)
*కం||*
మేడలు మిద్దెల నడిగిరె
వేడుక జేయక నొదిలిట వేధించితిరే
వాడిక నీవును నే మన
*"కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"*!!*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆడపడు చన్న మన్నన
రిప్లయితొలగించండికీడు దలఁప దేరికి మృదు గిరలె పలుకు నీ
కోడలు గుణవతి యమ్మరొ
కోడలి వైపుంటి ననుచుఁ గోపింపకుమా
పాడుచు నుంటిఁ గీర్తనలు భామరొ మిత్త్రులఁ గూడి యిచ్చటం
బాడిగ వింటి నీ వగు సుభాషణముల్ దమి నాకు నెవ్వడుం
దేఁ డిట నమ్ము నా పలుకు దిక్కులు సూచుచు నానుకున్న నా
కో డలి వైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా
[కోడు + అలి =కోడలి; కోడు = మంచపుఁ గోడు; అలి = మద్యము]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండివాడలువాడలుందిరిగిబండ్లనునమ్ముచుమమ్ముదాదగన్
రిప్లయితొలగించండిపోడిమితోడపోషణముభూరిముదంబునచేయుచుండుటన్
వేడుచునుంటినిన్నిపుడువేయివిధంబులరామనాయుడా!
కోడలివైపువాడననికోపమునాపయిజూపబోకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోఁడిమి గలుగగ నింటను,
రిప్లయితొలగించండిౙోడుగ మన కొమరునికిని శుభములు గూర్చున్,
తోడుగ కూతురు గద! నీ
కోడలి వైపుంటి ననుచు కోపింపకుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూడదు పరాయి భావన
రిప్లయితొలగించండికోడలనగనెవరునీకు కూతురు సమమే
వీడుము వైరంబామెతొ
కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీడుము వైరమెందులకు వేరుగజూడకు నీదు కోడలిన్
రిప్లయితొలగించండివేడుకనిర్వురున్ కలిసి భేదమెరుంగకనున్న మేలగున్
కోడలివైపువాఁడననికోపమునాపయిఁజూపఁబోకుమా
కోడలిపైననీవెపుడు కూతురుభావన కల్గియుండుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూడును గూడుఁ గూర్చదది, కూర్మి నుతించ సృజించు శక్తి నా
తొలగించండిగోడు సహించి యిచ్చి, విధికోమలి కోడలె గాదె, కోపమా!
వీడు మసూయ, నిర్ధనుడ వేడితి, గూల్చు దరిద్రతన్ సిరీ!
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
కోడలివైపు వాఁడ నని కోపము
నాపయిఁ జూపఁబోకుమా
సందర్భము: ఇంద్రజిత్తు వీరమరణం పొందగా భార్య భర్తతో సహగమనం చేయ నెంచింది. మృత కళేబరాన్ని రణభూమినుంచి తెప్పించు మని ఒక అనుభవజ్ఞుడైన సేవకునితో రావణుని వద్దకు సందేశాన్ని పంపగా అతడెంతో కష్టం మీద రావణుని కలిసి అన్న మాట లివి.
రావణుని పరిస్థితి అప్పు డిలా వుంది.
పుత్రశోకంతో చాలా చిరాకుగా వున్నాడు. తన వద్ద కెవరినీ అనుమతించడమే లేదు. అనుమతించినా అతి క్లుప్త సమాధానం. పరాకు. అందరిమీదా అసహనం. అనవసరమైన కోపం.
ఇంద్రజిత్తు భార్య సులోచన. తానే స్వయంగా మామగారి వద్దకు వెళ్ళవచ్చు కదా..అంటే ఆ పరిస్థితిలో "నీకు వైధవ్య యోగం వ్రాసిపెట్టబడి వుండటంవల్లనే మా వా డిలా అయ్యా" డనే వాళ్ళూ వుంటారు లోకంలో..
సేవకుడు ఇంతకు ముందు రావణునితో కలిసి మాట్లాడిన అనుభవం కలవాడు కాబట్టి చొరవ కలిగినవాడు కాబట్టి రావణుని ఆదరాభిమానా లొకింత చూరగొన్నవాడు కాబట్టి వయసులో పెద్ద కాబట్టి బయలుదేరాడు. ఐనా ఇటువంటి పరిస్థితిలో మాట్లాడడం కొంత ఇబ్బందే! అందించవలసిన సందేశంకూడా ప్రత్యేకమయినదే!
"రణభూమినుంచి ఇంద్రజిత్తు మృతకళేబరాన్ని తెప్పించండి. మీ కోడలు సహగమనం చేస్తుందిట!"
అనే కదా చెప్పాల్సింది! సేవకుడు చిత్తస్థైర్యాన్ని పుంజుకొని వెళ్ళి రావణుని కలిసి ఎలాగో విషయం నివేదించాడు. అదీ పద్య సందర్భం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*విషాద సందేశము*
రా డిక నీ కుమారు.. డట
రాముని తమ్మునిచేతఁ బ్రాణముల్
వీడె..నదెంత వానికిని
వేదనయే!..పతిఁ గూడి యేగ మీ
కోడలు భర్త దేహమును
గోరెను..తెమ్మని పంపుమా! ప్రభూ!
కోడలి వైపు వాఁడ నని
కోపము నాపయిఁ జూపఁబోకుమా!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
17.03.20
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివాడల వాడలన్ దిరుగు పైడి నెలంతవు తల్లితల్లి నీ
రిప్లయితొలగించండివాడను వాక్కుచేడియ ప్రభావముతో రచియించనేర్చి ని
న్నాడగపాడనేర్చితి దయామయి దైన్యము నూడ్పుమమ్మ మా
*కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితేడా చూపుట తప్పే!
రిప్లయితొలగించండికోడలివే కావ? నాడు కోపిష్టిసతీ!
నేడీ బేధములేలనె!?
"కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాడియు పంటలున్ ధనము పాయక నుండెడి బంధు మిత్రులున్
రిప్లయితొలగించండిపోడిమి గూర్చు పుత్రులును పోతము భృత్యులు వాహనంబులున్
వేడుక మీర నీయగదె వేడితిగా సిరి నీదు పాదముల్
కోడలి వైపువాడనని కోపము నాపయి జూపబోకుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరో పూరణ 🙏
రిప్లయితొలగించండినాడును నేడు ధర్మమున నా మది నిల్చును రాజరాజ ! పో...
రాడిన బంధుమిత్రకులహాని! ప్రచండమహారణమ్మునం...
దోడిన సిగ్గు., పాండవులనొక్కని గెల్వగలేవు! కుంతికిన్
కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితోడుగ నుండుచు గృహమున
రిప్లయితొలగించండికూడునిడుచునుండె తృప్తిఁ కొడుకునకు సదా
దాడులుచేయకు శ్రీమతి
కోడలివైపుంటినంచు కోపింపకుమా