19, మార్చి 2020, గురువారం

సమస్య - 3314 (గాండీవోద్గత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాండీవోద్గత శరప్రకాండము తృణమే"
(లేదా...)
"గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే"

54 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    చండీ రాణి:

    పిండాకూడును పెట్టగా దలచుచున్ భీష్మించుచున్ భాజపా
    వండింపంగను మత్స్యముల్ విషముతో బంగాలు రాష్ట్రమ్మునన్
    చండిన్ వోలెడు దీదినిన్ దునుముటన్;...జంబమ్మునన్ మోడిదౌ
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే

    రిప్లయితొలగించండి
  2. పాండవ మధ్యముడా పా
    ర్థుండా నను ఢీకొనునది? దుర్జయుఁడను! గ
    ర్ణుండను!! సమరము నందా
    "గాండీవోద్గత శరప్రకాండము తృణమే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యోఽస్మి గురువుగారూ
      చాలాకాలానికి ప్రశస్తమనే మార్కు..
      😇😇🙏🏻🙏🏻

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    2018 December Telangana Elections:

    గండంబుల్ కడు కానజాలకనయో గర్వమ్ము చిందించుచున్
    పండింపంగను లాలసమ్ములను మా బంగారు రాష్ట్రమ్మునన్
    జండానెత్తగ కుంటిబండి పయినన్;...జంబంపు చంద్రన్నదౌ
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే

    రిప్లయితొలగించండి
  4. చండీశుండు సుభక్తి మెచ్చి చనియెన్ చంచుండునై ధీబలో
    ద్దండీడున్ తపమాచరించు మనికిన్ దండావతంసుండునై
    ఖండింపన్ కిటి నిర్వురున్ పెనగె నాకామారితో పార్థుడే
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే
    గండీరుండును బొందునే బలముచే గంగాధరున్ ధీమతీ

    రిప్లయితొలగించండి
  5. (అర్జునుని పరీక్షచేయటం కోసం మాయాకిరాతరూపంలో
    వచ్చిన మహేశ్వరుడు మహేశ్వరితో)
    చండీ!నీ విటు చింతనందకుము;శిం
    జానంబు మార్మ్రోగ బ్ర
    హ్మాండంబే యిక సంభ్రమద్భ్రమితమై
    యల్లాడ వేతున్ గదా
    మెండౌ కాండములన్ని పార్థుపయినన్
    మేనాసుతా!వీనిదౌ
    గాండీవోద్గతదివ్యబాణము గనం
    గన్ గడ్డితో దుల్యమే.
    (చండి-పార్వతి;శింజానము-వింటినారి ధ్వని;
    కాండములు-బాణములు;మేనాసుత-మేనాదేవి పుత్రిక)

    రిప్లయితొలగించండి


  6. నిండుగ ప్రేయసి గుండెని
    చండముగా పుష్పబాణశరఘాతముతో
    చెండాడ దాని ముగదల
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. దండాకోరితనమ్ము తో దయిత కోదండమ్ము రారాయనన్
    చెండాడన్ ప్రియురాలి పుష్పశరముల్ చెల్వారగాముద్దులన్
    పండావంతుడ దాని ముందర మయిన్ పాలార్చెడాతీండ్రమౌ
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. చెండాడున్ గద శత్రుకోటి నెదురన్ జీల్చున్ గదా దేహముల్
    ఖండించున్ గద దుర్మదాంధులను శోకంబంద దుష్టాత్ములన్
    దండించున్ గద మొక్కవోని దగుచున్ తథ్యంబుగన్ మిత్రమా
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే?

    రిప్లయితొలగించండి

  9. నేటి భారతం ! కరోనా :)


    భాండాగారము బద్దలయ్యె నరరే బాజారు జారంగనే
    ఝండూబాముల లేపనమ్ములవలేశంబా తొగన్ తీర్చదే
    నిండాముంచె కరోన తీండ్రముగ ఓర్నీ! దీని ఘాతమ్ముతో
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. గండర గండడటంచును
    పాండవ మధ్యముని పొగడ పాడియె యిట క
    ర్ణుండుండ యుద్ధ మందున
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే

    రిప్లయితొలగించండి
  11. నిండించుకు మది ప్రేమను 
    పండింప జనులకు  సుపరిపాలన తలచ
    న్గండంబులు పెట్ట విడచు 
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే 

    రిప్లయితొలగించండి
  12. పాండవవీరులనెల్లర
    ఖండించెదఁదురమునందు కాలునిరీతిన్
    మెండగుశౌర్యముజూపెద
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ:

    నందినీధేనుసేవలోనున్న దిలీపుని కుంభోదరుడనెడి సింహము నిశ్చేష్టుని జేసి ఇలా అంటోంది👇

    శుండాలమ్ముల బారినుండి తరువున్ జూడంగ రక్షింపనీ
    కొండన్ నిల్పెను పార్వతీపతియె నన్ కుంభోదరుండన్ నృపా!
    పండెన్ పంట! సమీపవర్తిని భుజింపన్ నాకు శైవాజ్ఞ! త్వ...
    ద్గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. శ్రీ రామాంజనేయయుద్ధం....

      హనుమ.. స్వామితో👇

      రెండే నేర్చితి నేను రాఘవ! త్వదంఘ్రిద్వంద్వసంపూజనం...
      బొండౌ ! తారకరామనామమహిమంబొండౌ ! భవద్భక్తుడన్ !
      దండింపన్ నను నీవు చేత గొన కోదండంబు నాకేమి !? నీ
      గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  14. నిన్నటి పూరణ

    ప్రఖ్యాతసంస్కృతశ్లోకఛాయలో

    "నైవ వ్యాకరణజ్ఞమేతి పితరం న భ్రాతరం తార్కికం
    మీమాంసానిపుణం ---------
    కావ్యాలంకరణజ్ఞమేవ కవితాకన్యావృణీతే స్వయమ్"


    సరవిన్ వ్యాకరణజ్ఞుడౌ పిత లసత్సాధుత్వసంధాతయై
    సువచోరుగ్రుచిరార్థతార్కికుడిలన్ శోభిల్లు సద్భ్రాతయై
    వివిధాలంకృతిరీతిరమ్యరససంవేదిన్ వరించుం గదా
    కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. కర్ణ ఉవాచ
    మెండగు శస్త్ర బలమ్మున
    చెండాడె ద రణమునందు ఛిద్రము గాగ న్
    కొండాడ బోకు పార్ధుని
    గాండీ వోద్గత శర ప్రకాండము తృణ మే

    రిప్లయితొలగించండి
  16. శార్దూలవిక్రీడితము
    దండంబున్ హరి దాల్చ స్యందనమునన్ ధర్మమ్ము కాపాడఁగన్
    జెండాడెన్ గురుసేనలన్ నరుఁడటన్! శ్రీకృష్ణ నిర్యాణమై
    దండున్ హస్తిన చేర్చువేళ తమపై దాడిన్ నివారించగన్
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే!

    రిప్లయితొలగించండి
  17. కందం
    అండన్ వీడ హరి నరుడు
    దండున్ హస్తినకుఁ జేర్చు దారిని దొంగల్
    దుండగమొనర్చ నిలుపన్
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే!

    రిప్లయితొలగించండి
  18. గండరగండడు గాంగే
    యుండసమానాస్త్రశస్త్రయుతయోధుండు
    ద్దండుడతనిపై నర్జున
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే!

    రిప్లయితొలగించండి
  19. కర్ణుడు దుర్యోధనునితో

    అండగ నేనుండగ నా
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే!
    మండిత శస్త్రాస్త్రమ్ముల
    దండోద్ధతి సంహరింతు దడయక పార్థున్

    రిప్లయితొలగించండి
  20. దుండగులే నేతలిపుడు
    చెండాడుచు నొకరి నొకరు జిందింతురు వా
    గ్దండములను జూడగ నిక
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే

    రిప్లయితొలగించండి
  21. నిన్నటి సమస్యకు నా పూరణ పరిశీలింప మనవి:

    ధ్రువముగ వాగర్థములై
    కవితల కొలువుందురెపుడు కలివిడిగానే
    భవముగ బ్రహ్మకు దానా
    కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    [ఇటఁ గిరాతార్జునీయ కథ ననుసంధానించుకొనునది]

    గాండీవిస్థిరసంయతిన్ దగఁ బరీక్షన్ దేల్చు నప్పట్టునన్,
    జండీశుండుఁ గిరీటియుం గిటినిఁ ద్రుంచంగాను బాణంబుచేఁ
    జెండన్ మున్ ద్వయకాండహేల కనిపించెన్! "నాదె" యంచున్, హరున్
    మెండౌ శూరతఁ గొట్ట, వేయ శిఖి గాండీవుండు; ముక్కంటి కా

    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే!

    రిప్లయితొలగించండి
  23. భండనమున కర్ణుండనె
    నండగ నేచెంతనుండ నడలుట యేలా
    పాండు కుమారుడు విడిచెడి
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే

    రిప్లయితొలగించండి
  24. మెండగుశస్త్రములలరుచు
    భండనముంజేయరాగవారించుటకున్
    నండగశంకరుడుండగ
    గాండీవోద్గతశరప్రకాండముతృణమే

    రిప్లయితొలగించండి
  25. దండిత శాత్రవ శూరుఁడు
    గండరగండఁడు నరుం డకట కల్మష కం
    ఠుం డగు శంకరు పాలిట
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే


    గాండీవ మ్మన నీ వెఱుంగ వకటా కాకుత్స్థ హస్తేద్ధ కో
    దండాభ మ్మగు సంగరమ్మున వడిన్ దండించ దుష్టాలి ను
    ద్దండాగ్న్యాభము వీరులెవ్వరికి వ్యర్థం బౌనె? సంధించఁగా
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే?

    రిప్లయితొలగించండి
  26. దండింపన్ రిపులొక్కసారిగదగన్దారాగసైన్యంబుతో
    నెండన్వాననులెక్కజేయకవడిన్ నీసారివిచ్చేయగా
    నండన్శంకరుడుండమాకికభువిన్నాద్యంతమున్జూడగా
    గాండీవోద్గతదివ్యభావముగనంగన్ గడ్డితోదుల్యమే

    రిప్లయితొలగించండి
  27. సమస్యాపూరణము
    "గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే"


    అండౌనీదగుధర్మదీక్ష రణమందడ్డన్ నినున్ గెల్వ నిం

    ద్రుండేయుండఁజయంబునీకొసగుఁసద్యోధుండు చేదోడునై

    చెండాడెన్ గురుభీష్మలన్ హరివశించెన్ దేరునన్ లేనిచో

    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే!

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  28. ఖాండవదహనంబందున
    భండనముగదలచు పిల్ల పక్షుల ప్రేమన్
    మండే యనలుడు బ్రోవన్
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే.

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "గాండీవోద్గత దివ్య బాణము గనంగన్
    గడ్డితోఁ దుల్యమే"

    సందర్భము: "రాము డస్త్ర మంత్రాలు మరచిపోయినాడా! సంద్రంపై అస్త్రాలతో వారధి కట్టవచ్చుకదా!" అన్నా డర్జునుడు.
    "ఆ వీరుల్ పదఘట్టనల్ సలుప నిట్టట్టై పటాపంచలైపోవుం... ఒక మరుద్దేవాత్మజుం డుగ్ర వేగావష్టంభత డాసినన్ నిలుచునే యా యమ్ములున్ గిమ్ములున్..
    హనుమ ఒక్క దూకు దూకితే అన్నీ చెల్లా చెదురౌతా" యన్నాడు కృష్ణుడు. "ఏదీ చూద్దాం!" అని పార్థుడు వార్ధిపై బాణాలతో వంతెన నిర్మించాడు.
    హరి స్మరించగా హనుమ ప్రత్యక్షమై ఒక్కసారి "జై శ్రీ రామ్!!" అంటూ దూకా డంతే! పండుటాకులా వంతెన రాలి కూలింది. (అ ప్పవనాత్మజన్ము డిటు లార్చి జవోద్ధతి నంపకట్టెపై నప్పుడు గుప్పునం దుమికినంతనె దారున విచ్చి నుగ్గులై గప్పె శరప్రకాండ శతఖండములు..)
    (సమీరకుమారవిజయము 7 వ ఆశ్వాసము)
    అర్జునునికి గర్వభంగ మయింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *రామనామ మహిమ*

    గాండీవ ప్రవిముక్త బాణ తతితో
    గర్వంబుతో పార్థుడున్
    మెండౌ వంతెన వార్ధి నిల్ప హరి "మేల్
    మేల్ రామదూతా!" యనన్
    బండాకుం బలె రాలె దూకగనె.. యో
    పం డాయె సామీరి.. తద్
    గాండీవోద్గత దివ్య బాణము గనం
    గన్ గడ్డితోఁ దుల్యమే!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    19.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  30. జెండాపై కపిరాజు ముందుసిత వాజిశ్రేణియున్ గూర్చి కృ
    ష్ణుండా మాయల మారి సారధిగ నన్నోడింపగా రాగఁ గో
    దండంబున్ గొని యడ్డగించుతరి యా దాయాది వివ్వచ్చునిన్
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే

    రిప్లయితొలగించండి
  31. అండాండంబుల విశ్వభాండమున దివ్యాంతఃపురంబందునన్
    బిండాండంబుల గుండెడెందమున సంప్రీతిన్ విడంబించున్
    గొండాడన్ సగమాటదేవరు నెదుర్కొన్నన్ పృథాసూనుదౌ
    గాండీవోద్గత దివ్యబాణము గనంగన్ గడ్డితో్ఁ దుల్యమే

    రిప్లయితొలగించండి
  32. శ్రీ రామాంజనేయయుద్ధం....

    హనుమ.. స్వామితో👇

    రెండే నేర్చితి నేను రాఘవ! త్వదంఘ్రిద్వంద్వసంపూజనం...
    బొండౌ ! తారకరామనామమహిమంబొండౌ ! భవద్భక్తుడన్ !
    దండింపన్ నను నీవు చేత గొన కోదండంబు నాకేమి !? నీ
    గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  33. చెండాడుచుండవైరస్
    నిండామునుగంగనేల నిద్రలుబోకన్
    రండి నివారణదిశగా
    గాండీవోద్గతశరప్రకాండము తృణమే
    -________————/-//
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  34. గుండెలుమండగ చైనా
    పండించెను బ్రతుకుపంట భయ విహ్వలమై
    నిండాముంచెనుజగతిని
    గాండీవోద్గత శరప్రకాండము తృణమే
    -------------------------------------

    రిప్లయితొలగించండి


  35. ఏమండోయ్ కంది వారు

    కరోనా కొరకు ఓ సమస్యా పాదం యివ్వండి రేపు



    జిలేబి

    రిప్లయితొలగించండి