సందర్భము: త్వరమాణో జగామాథ సీతా దర్శన లాలసః శూన్య మావసథం దృష్ట్వా బభూవోద్విగ్న మానసః (అర.కాం. 60-3) రాముడు సీతను చూసే ఉత్కంఠతో తొందర తొందరగా ఆశ్రమానికి వెళ్ళాడు. శూన్యమైన ఆశ్రమాన్ని చూసి ఆతని ఉల్లము తల్లడిల్లిపోయింది. దదర్శ పర్ణశాలాం చ రహితాం సీతయా తదా శ్రియా చ విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీ మివ 5 చలికాలంలో మంచు కురిసి కాంతి తొలగి చెడిపోయిన తామర కొలనులాగా వున్న సీత లేని పర్ణశాలను రాముడు చూశాడు. రావణుడు సీత నపహరించుకొని వెళ్ళినాక శూన్యమైన పర్ణశాలను చేరుకొని రాముడు తమ్మునితో ఇలా అన్నాడు.. "నేను రాగానే మీవదిన నగుమోముతో సడిచేయకుండా నా కెదురువచ్చేది. అంతకు ముందే సిగలోని పూల తావులు గుప్పు మనేవి.. దివ్వె కూడా చిన్నబోయే ఆ వనదేవత నే డేదీ? కనిపించదే! పర్ణశాలలోని దీపం (సీత) వెలుగుతూ వుండే గదిలో నేడు ఎటు చూసినా చీకట్లే కమ్ముకున్నవి. ఆమె సిగలో పువ్వులూ నవ్వుతాయి నేను కనిపించగానే. అప్పుడు నాకు సీత తలనిండా కొంగు కప్పుకొని ఎదురుగా వచ్చేది. ఇంటికి దీపం సీతయే! ఆ దీపం వెలిగే పర్ణశాల గదిలో నేడు చీకటి నిండింది." ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ఇంటికి దీపము ఇల్లాలు*
నవ్వు మొగాన మీ వదిన నా కెదురై సడిలేక వచ్చుఁ గ్రొం బువ్వులు కొప్పులో నొదిగి ముందుగఁ గు ప్పనఁ గమ్మ తావి.. యా దివ్వెయుఁ జిన్నవోవు వన దేవత నే డెది? పర్ణశాలలో దివ్వె వెలుంగుచుండిన గ దిన్ నలువంకల నిండెఁ జీకటుల్
సందర్భము: రావణునితో కుంభకర్ణు డిలా అన్నాడు ఆవేదనతో.. "సీతను తెచ్చినావు. సంబరం తీరిందా! హాయిగా మనం కలిసి నవ్వుకోవడాని కింక ఏం మిగిలింది? నీ గుండె అనే గదిలో జ్ఞాన కాంతులు చిందించే దివ్వె ఆరిపోయింది. నీ దివ్య తప మంతా జారిపోయింది. ఒకప్పు డా దివ్వె వెలుగులు చిందిస్తూ వుండినటువంటి గదిలో ఏ మూల చూసినా యిప్పుడు చీకట్లే నిండిపోయినవి.." కైక ప్రవేశంతో దశరథుని జీవితం ఏ విధంగా అతలా కుతలమైపోయిందో సీత ప్రవేశంతో రావణుని జీవితంకూడా అట్లే అయింది. అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస నెత్తీ నోరూ కొట్టుకొని చెప్పాడు.. కామినీ కాంచనాలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రధానమైన ప్రతిబంధకా లని.. ఈ రెంటిలో ఏ ఒక్కదాని చేతిలో చిక్కినా అది భయంకరమైన పతనాన్నే రుచి చూపిస్తుంది సుమా! ~~~~~~~~~~~~~~~~~~~~~~~
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
త్రవ్వుచు గోతులన్ మిగుల ధైర్యము మీరగ చెట్లు నాటుచున్
పువ్వులు కోయుచున్ విరివి పూజలు చేయుచు భద్రకాళికిన్
నవ్వుచు త్రుళ్ళుచుండెడిది నాకము జేరగ నత్తగారయో
దివ్వె వెలుంగు చుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్
మంచి అత్తాకోడళ్ళన్న మాట! బాగుంది మీ సరదా పూరణ. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
తొలగించండిఅత్తగారు అల్లుడు సార్!
😊
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పువ్వులలోన పుట్టుచును మోదము నొందుచు తల్లి నీడనున్
నవ్వుచు పార్లమెంటునను నందము చిందుచు కన్నుగొట్టుచున్
క్రొవ్వును జూపు రాహులును కొట్టగ భామ యమేఠి నందునన్
దివ్వె వెలుంగు చుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్
రాహులుకు చీకటి మిగిల్చిన మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండినివ్వెర బోయిగాం చెనట నీడల నీడలు నృత్యమా డగా
రిప్లయితొలగించండిసవ్వడి జేయగా సకల సౌఖ్యము లందున తేలిపో వుచున్
మువ్వల చేడియల్ మురిసి ముచ్చట లందున తేలకున్నచో
దివ్వె వెలుంగు చుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్
రాజేశ్వరి. నేదునూరి.
new jersee .
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమువ్వల సవ్వడిన్ వినిన ముద్దుగ తోచె నదేమి వింతయో
యెవ్వడెరుంగునీ జగతి నేమని చెప్పగలుంగు వాడనో
రువ్వె భయానకంబగు కరోన,నుగాది దినంబువేళలో
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్..!"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(లోకంలోని శోకాలకు విచలితుడైన సిద్ధార్థగౌతముని అంతరంగస్థితి)
రిప్లయితొలగించండిచివ్వున లేచి కూర్చొనిన
శ్రీకరరూపుని చిత్తమందునన్
నవ్వుల పుత్రుపత్నివద
నమ్ములు గుర్తుకు వచ్చుచుండగా
మవ్వపు మోముపై నెవియొ
మాయలు గ్రమ్మగ మాటిమాటికిన్
దివ్వె వెలుంగుచుండిన గ
దిన్; నలువంకల నిండె జీకటుల్.
(మవ్వపు-కోమలమైన;శ్రీకరరూపుడు-మంగళమూర్తి)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅవ్వలినుండి జొరబడదు
రిప్లయితొలగించండిదివ్వె వెలుంగు ; గదిలోనఁ దిమిరము నిండెన్
చువ్వన జని నీవేయొక
దివ్వెను వెలిగించి తెమ్ము తేజము నిండున్
చువ్వన = చప్పున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగువ్వలు చేరుకొన్నవివె గూటికి, తారక లాకసమ్ములో
రిప్లయితొలగించండినివ్వటిలెన్, మృగమ్ములు వనిన్ దిరుగాడగసాగె, భర్తకై
యవ్వల నిల్చి చూచు మదిరాక్షి కరాంబుజమందు గొప్పగా
దివ్వె వెలుంగు చుండిన, గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్.
మనోహరమైన పూరణ గురువర్యా!నమఃపూర్వక అభినందనలు!!
తొలగించండిరవివర్మగారి చిత్రం గుర్తుచేశారు!
తొలగించండిఅద్భుతంగా పూరించారు గురువు గారూ.... నమస్సులు!
తొలగించండి
రిప్లయితొలగించండిరవ్వపడనివ్వదే! మా
యవ్వయె లేదాయె చేరె నవ్వల తృటిలో
చివ్వున చిలుకయె యెగురను
దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆకాశవాణికి పంపినది
నెవ్వలు దీర్చి యందరికి నెమ్మిని చూపుచు నాదరమ్ముతో
వెవ్వెఱలాడు వారి మది వెల్తిని దూరము పాఱనొత్తె! మా
యవ్వయె చేరగా ప్రభుని నాసమయమ్మున మాగృహమ్ములో
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండినా పూరణ - కరోనా దాడి ..
*కం||*
సవ్వడి జేయుచు మెల్లగ
నవ్వుల పువ్వుల సిరులిట నాశనమొందన్
నివ్వెర బోవగ దేశము
*"దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ. అవ్వల నివ్వలంచు సరిహద్దులు లేక ధరిత్రి నిండుగా
తొలగించండిసవ్వడి జేయుచున్ బ్రజలు సాగియు నేడు కరోన తాకిడిన్
గువ్వల వోలె భీతిలుచు గూటికి హత్తుకు బోవ జూచిరే!
దివ్వె వెలుంగు చుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్ !
మఱియొక పద్యం:
ఉ. జవ్వని తెల్ల చీరయును చక్కగదాల్చిన మల్లెపూవులా
మువ్వల కాంతులున్ నిశను ముట్టడి జేసి ముదమ్ము గూర్చగా
నవ్వనితన్ గనంగ మది హాయిని బొందుచు భర్త నెంచె నీ
దివ్వెవెలుంగు చుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.
తొలగించండివిరించి.
రిప్లయితొలగించండి*ఆనందకరుడు లోకరక్షకుడైన శ్రీకృష్ణుని అండదండలుండియు పుత్రశోకము తప్పలేదని అర్జునుడు బాధపడుతూ సుభద్రతో పలికిన పలుకులుగా నూహించి*
చివ్వను జొచ్చి బాలకుడు చేడ్పడె నంచును తాళలేక నా
జవ్వని కృష్ణసోదరి విచారము నందున కృంగియుండగా
కవ్వడి వాసుదేవుఁగని గద్గద మందున పల్కెనిట్టులన్
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలు వంకల నిండెఁ జీకటుల్.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండికవ్వడి లేని వేళఁ గని కౌరవులెంచగ తమ్మిమొగ్గర
మ్మవ్వల నుగ్రుడై చెలఁగి యయ్యభి మన్యుడుఁ గన్నుమూయఁగన్
జవ్వని నిండుగర్భమున సైచునె యుత్తర కంటిధారలన్
దివ్వె వెలుంగు చుండిన గదిన్ నలువంకల నిండె జీఁకటుల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిసవ్వడి లేదు., వేణురవసాంద్రరసామృతగీతి లేనెలే...
రిప్లయితొలగించండిదెవ్వరి యింట దూరెనొ ? మఱెవ్వతె కోరెనొ? వాని మోముపై
నవ్వులె చంద్రకాంతులవి! నల్లనివాడిటు రాని రేయిలో
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది.
తొలగించండిపువ్వుగ పెంచితి మీమెను
రిప్లయితొలగించండిక్రొవ్వున ప్రేమంచు నేడు కూడగ పోయెన్
నెవ్వగ మిగిలెను మాకును
దివ్వె వెలుంగు గదిలోన తిమిరము నిండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండినివ్వెర చెంది రెల్లెడల నివ్విధి వైరసు వృద్ధి బొందుట
న్నెవ్వరు జాచినన్ దగిన నిర్ణయ రీతిని శ్రద్ధ జూపినన్
మువ్వము గానరాదు గడు మ్రొక్కగ దేవుని నిట్లు గన్పడన్
దివ్వె వెలుంగు చుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్
మువ్వము:నయము
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిఎవ్వని పెండ్లికి నిత్యముఁ
బువ్వులు తోమాలలౌచు ముక్తిని గనునో
నవ్వానిఁ దిరుమలఁ గనక
దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎవ్వని దేశభక్తిమరిఎవ్వని యుద్దపుశౌర్యశక్తి , యిం
రిప్లయితొలగించండికెవ్వని త్యాగశీలతయు కీలకమయ్యెడు సైనికుండు తా
దివ్వెగ నిల్చియుండి మన దేశము కోసము ప్రాణమివ్వగా
దివ్వెవెలుంగు చుండినగదిన్ పలువంకల నిండెచీకటుల్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
ఇది ఆకాశవాణి కి పంపలేదు యిప్పుడే పూరించాను
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిరవ్వల గొలుసును తెచ్చెను
జవ్వనితో పొందుగోరి షట్టజ్ఞుండే
నవ్వుచు సఖిపలిచిన తరి
దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'షట్టజ్ఞుడు' క్రొత్త పదం తెలిసింది. "సఖి పిలిచిన" టైపాటు.
ఆకాశవాణిలో ప్రసారం:
రిప్లయితొలగించండినివ్వెరపాటుగొల్పుచు వినీల విశాల వియత్తలంబునన్
నివ్వటిలెన్ ఘనాఘనము నీరజబంధుని క్రమ్ముకొంచు సం
దివ్వకనొక్కసూర్యకర దీప్తికినైనను ధాత్రి చేరగన్,
దివ్వె వెలుంగుచుండిన గదిన్, నలువంకల నిండెఁ జీకటుల్.
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఅవ్వల రుక్మిణీమణికి నచ్చపువేడుక పారిజాతమున్
రిప్లయితొలగించండినవ్వుల మోముతోడనిడ నల్లని స్వామియె విన్నసత్యకున్
నివ్వెరపాటునన్ మదిని నిస్పృహ నీరస మావరింపగా
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండెజీకటుల్
నవ్వుల నారేడిటకును
తొలగించండిచవ్వున చనుదెంచడాయె ఝూములు గడచెన్
దవ్వుల సవ్వడి గానమి
దివ్వె వెలుంగు గదిలోన దిమిరము నిండెన్
దవ్వుల సవ్వడి లేమిని గా చదువ ప్రార్థన!
తొలగించండిమల్లీశ్వరి
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురుదేవా,నమస్సులు!
తొలగించండిచివ్వున యాత్మజన్మునకు చెందగ రాజ్యపు నాధిపత్యమే
రిప్లయితొలగించండిపువ్వులు భూషణమ్ములను ముక్కలు జేయుచు ద్రోహచింతనన్
మవ్వము వీడి రోషమను మంటల గాలుచు నిల్వ కైకయే
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చివ్వున నాత్మజన్మునకు..." అనండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలు
వంకల నిండెఁ జీకటుల్"
"దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్"
సందర్భము:
త్వరమాణో జగామాథ సీతా దర్శన లాలసః
శూన్య మావసథం దృష్ట్వా బభూవోద్విగ్న మానసః (అర.కాం. 60-3)
రాముడు సీతను చూసే ఉత్కంఠతో తొందర తొందరగా ఆశ్రమానికి వెళ్ళాడు. శూన్యమైన ఆశ్రమాన్ని చూసి ఆతని ఉల్లము తల్లడిల్లిపోయింది.
దదర్శ పర్ణశాలాం చ రహితాం సీతయా తదా
శ్రియా చ విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీ మివ 5
చలికాలంలో మంచు కురిసి కాంతి తొలగి చెడిపోయిన తామర కొలనులాగా వున్న సీత లేని పర్ణశాలను రాముడు చూశాడు.
రావణుడు సీత నపహరించుకొని వెళ్ళినాక శూన్యమైన పర్ణశాలను చేరుకొని రాముడు తమ్మునితో ఇలా అన్నాడు..
"నేను రాగానే మీవదిన నగుమోముతో సడిచేయకుండా నా కెదురువచ్చేది. అంతకు ముందే సిగలోని పూల తావులు గుప్పు మనేవి..
దివ్వె కూడా చిన్నబోయే ఆ వనదేవత నే డేదీ? కనిపించదే! పర్ణశాలలోని దీపం (సీత) వెలుగుతూ వుండే గదిలో నేడు ఎటు చూసినా చీకట్లే కమ్ముకున్నవి.
ఆమె సిగలో పువ్వులూ నవ్వుతాయి నేను కనిపించగానే. అప్పుడు నాకు సీత తలనిండా కొంగు కప్పుకొని ఎదురుగా వచ్చేది. ఇంటికి దీపం సీతయే! ఆ దీపం వెలిగే పర్ణశాల గదిలో నేడు చీకటి నిండింది."
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ఇంటికి దీపము ఇల్లాలు*
నవ్వు మొగాన మీ వదిన
నా కెదురై సడిలేక వచ్చుఁ గ్రొం
బువ్వులు కొప్పులో నొదిగి
ముందుగఁ గు ప్పనఁ గమ్మ తావి.. యా
దివ్వెయుఁ జిన్నవోవు వన
దేవత నే డెది? పర్ణశాలలో
దివ్వె వెలుంగుచుండిన గ
దిన్ నలువంకల నిండెఁ జీకటుల్
పువ్వులు నవ్వగ నెదురై
దువ్విన తలమీది కొంగుతో నరుదెంచున్..
దివ్వె యగు సీత యింటికి..
దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
21.03.20
-----------------------------------------------------------
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచివ్వలు లేనియట్టి సుఖజీవనముం గొనఁగాను, జేరి తా
దవ్వున నుండెడిన్ గురుని, దబ్బున విద్యల నేర్వ, రాతిరిన్
నవ్వుల పువ్వులు న్వెలిఁగె! నమ్మ గురున్, మదిలోన జ్ఞానపున్
దివ్వె వెలుంగుచుండిన, గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్!
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండినివ్వెరపడితి, మగడు త్రా
రిప్లయితొలగించండిగువ్వెత్తున మీదబడుచు గోర్కె ముగించెన్
జవ్వాడెన్ భావి కలలు
దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'త్రాగి+ఉవ్వెత్తున' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినేటి ఆకాశవాణి విశేషములు తెలుపగలరు.
జిలేబి
మీ పద్యం చదివారు.
తొలగించండివచ్చే వారానికి సమస్య...
"నవ వాసంత శుభాగమంబిది కరోనా నామ నూత్నాబ్దమౌ"
తొలగించండినెనరుల్స్ పంపించినాము
జిలేబి
సవ్వడి సేయక చొరబడి
రిప్లయితొలగించండికవ్వించుచు నుండ జగతి కలవర పడుచున్
నవ్వుట మరచె కరోనా
దివ్వె వెలుంగు గదిలోనతిమిరము నిండె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య: దివ్వెవెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్ (ఆకాశవాణి)
రిప్లయితొలగించండిఉ: మువ్వల దాల్చి పాదముల ముద్దులగుమ్మచరించుచుండగా
రువ్వుచు నోరచూపులను, రూపసి కన్నులు చెంగలించగా
నవ్వులు పూవులన్ కురిసె, నాతి చటాలున మూయ నేత్రముల్
దివ్వెవెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఅవ్వలి చీనా నుండిటు
రిప్లయితొలగించండిరివ్వున బెనుగాలి విసరె రేగె కరోనా
నివ్వెరబోవగనారెను
దివ్వె వెలుంగు, గదిలోనఁ దిమిరము నిండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజవ్వనియోర్తు దాసరగు చావడిముందుననుండుగోడకు
రిప్లయితొలగించండిన్నవ్వలివైపునన్దెరకునానుకు దీపమువెల్గజేయగా
దివ్వెవెలుంగుచుండినగదిన్నలువంకలనిండెజీకటు
ల్లవ్వయదేమియట్లుగనుహాకనికట్టుల మంత్రసారమా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చీకటుల్ + అవ్వ' అన్నపుడు ద్విత్వలకారం రాదు.
అవ్వా!చూడుముకాంతిని
రిప్లయితొలగించండిదివ్వెవెలుంగుగదిలోన,తిమిరమునిండెన్
రివ్వునవీచెడుగాలికీ
దివ్వెలులేయారిపోవదీప్తులులేమిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినవ్వులు మాయం బైనవి
రిప్లయితొలగించండియవ్వదనమ్మునఁ గడు బరు వయి దుస్సహమై
యవ్వగ నిండ హృదయమున,
దివ్వె వెలుంగు గదిలోనఁ, దిమిరము నిండెన్
దవ్వుల నున్న దీప మిటు ధైర్యము నూని భయమ్ము వీడి వే
నొవ్వక తెమ్ము మిత్రమ వినోదము సూచెద వేల యిత్తరిన్
రివ్వున వీచ గాలి విపరీతము, నాఱె గదయ్య సక్కఁగా
దివ్వె వెలుంగు చుండిన, గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిపువ్వులలోనితావివలెపున్నమివెన్నెలరేయి హాయియై
రిప్లయితొలగించండినవ్వుచు కన్న వారలను నవ్వులలో తనియించు పాపడే
జివ్వుమనంగ ప్రాణములు జేరెను దేవునిచెంత కయ్యయో!
దివ్వెవెలుంగుచుండిన గదిన్, నలువంకల నిండెఁ జీకటుల్.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండినివ్వెర పాటన, ప్రాణము
రిప్లయితొలగించండిచివ్వున గాలిలొ కలిసెను చింతలు రేపన్ |
సవ్వడి లేని శవముకడ |
"దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'గాలిలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.
రిప్లయితొలగించండిఅవ్వరొ! నేమిజెప్పనగు నవ్వల ప్రాగ్దిశ మందునన్ గనన్
నువ్విళులూరగన్ జనము నుర్విన బుట్టిన జీవరాశుల
క్రవ్వపు ముక్కలన్ తినగ కర్కటి బోలు కరోన ప్రవ్వగా
దివ్వెవెలుంగుచుండిన గదిన్ నలువొంకల నిండె చీకటుల్.
క్రవ్వము-మాంసము; కర్కటి-సర్పము
ప్రవ్వు- సమృద్ధమగు.
యజ్ఞభగవాన్ గంగాపురం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"అవ్వరొ యేమి... ప్రాగ్దిశయందునన్... నుర్విని...జీవరాశులే..." అనండి.
తప్పక సరైన చేసుకొనెదను. ధన్యవాదములు🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎవ్వతొ భూతమై యిలఁ జరించె కరోన యనన్ లయమ్మునై
తొలగించండిబువ్వగ మార్చి మానవులఁ బుష్టికరమ్ము భుజించె భీష్మమై,
నెవ్వెఱ గీములందకట! నిశ్చలులైరి జనమ్ము, భీతిలో
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్
రిప్లయితొలగించండిరువ్వెడి కాంతి పుంజముల
రోచిని వీచు మహద్ద్యుతీ ప్రభల్
నవ్వగలేని మానసము
నన్ పరివేదనలీను వైనము
న్నెవ్వరు తోడురాని హృది
నెగ్గునుగూడుచు వెక్కిరించగా
దివ్వె వెలుంగుచుండిన గ
దిన్ నలువంకల నిండె జీకటుల్!
అవ్వ నిదెక్కడి చోద్యము
రిప్లయితొలగించండిత్రవ్వుచు శకటములు నింప తరగని వేదం
నివ్వెర పోయెగ చూడన్
దివ్వె వెలుంగు గదిలోన దిమిరము నిండెన్
అవ్వని లోపలన్ సరిగ యద్దమ రేయిన పోవుచుండగా
రిప్లయితొలగించండిదివ్వెవెలుంగు చుండిన గదిన్ నలువంకల నిండె చీకటుల్.*
జివ్వున లాగినట్లయిన జీవము భీతియు గుండె నిండుగా
కెవ్వున గట్టిగా నచట కేకలు పెట్టితి బ్రోచువారికై
మరొక పూరణ
రవ్వల నగలను ముదమున
జవ్వని కొసగంగ నెంచి జవమును రాగా
చివ్వున దీపము లారగ
దివ్వె వెలుంగు గదిలోన దిమిరము నిండెన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"దివ్వె వెలుంగుచుండిన గదిన్
నలువంకల నిండెఁ జీకటుల్"
సందర్భము: రావణునితో కుంభకర్ణు డిలా అన్నాడు ఆవేదనతో..
"సీతను తెచ్చినావు. సంబరం తీరిందా! హాయిగా మనం కలిసి నవ్వుకోవడాని కింక ఏం మిగిలింది? నీ గుండె అనే గదిలో జ్ఞాన కాంతులు చిందించే దివ్వె ఆరిపోయింది. నీ దివ్య తప మంతా జారిపోయింది.
ఒకప్పు డా దివ్వె వెలుగులు చిందిస్తూ వుండినటువంటి గదిలో ఏ మూల చూసినా యిప్పుడు చీకట్లే నిండిపోయినవి.."
కైక ప్రవేశంతో దశరథుని జీవితం ఏ విధంగా అతలా కుతలమైపోయిందో సీత ప్రవేశంతో రావణుని జీవితంకూడా అట్లే అయింది.
అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస నెత్తీ నోరూ కొట్టుకొని చెప్పాడు.. కామినీ కాంచనాలు ఆధ్యాత్మిక మార్గంలో ప్రధానమైన ప్రతిబంధకా లని..
ఈ రెంటిలో ఏ ఒక్కదాని చేతిలో చిక్కినా అది భయంకరమైన పతనాన్నే రుచి చూపిస్తుంది సుమా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ఆరిన దివ్వె*
జవ్వని సీతఁ దెచ్చితివి..
చా లిక సంబర మన్న! హాయిగా
నవ్వు లి కేవి? గుండె గది
జ్ఞానపు కాంతుల నీనుచున్నదౌ
దివ్వెయె యారె.. జారె గద
దివ్య తపం బదియే! ఒకప్పు డా
దివ్వె వెలుంగుచుండిన గ
దిన్ నలువంకల నిండెఁ జీకటుల్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
21.03.20
-----------------------------------------------------------