సందర్భము: రాముని బ్రహ్మాస్త్రానికి రావణుడు నేలకూలినాడు. లోకైకవీరుడు, అసహాయశూరుడైన రావణుని మృత్యువును విభీషణుడు జీర్ణించుకోలేక కండ్లు మూతలు పడగా ఒక్కసారి నిశ్చేష్టితుడై నిలబడిపోయినాడు. తన శరీరంలోంచి ఇద్దరు దివ్య పురుషులు బయలుదేరి నింగిలో నిలబడడం అతడు గమనించాడు. క్రమంగా వాళ్ళలో ఒకడు రాముడని, మరొకడు తానేనని, వాళ్ళు తన అంతరాత్మ స్వరూపులే అని గుర్తించాడు. ఆ విభీషణుడు ఆ రామునితో ఇలా అన్నాడు. "రావణుడు నిన్ను తన్ని నిరాదరించి వెళ్ళి పొమ్మన్నాడు తప్ప చంపదలచుకోలేదు. నీవు మాత్రం రాముని యండ జేరి మీ యన్నను చంపించినావు." అని ఆర్యులంతా నన్ను చులకనగా చూస్తారు కదా! రామా! రావణుని చంపటం సబబా! "నీలాగే కుంభకర్ణుడూ రావణునికి హితవే చెప్పినాడు. ఐనా ఎవరి కర్మకు వారే బాధ్యులు.. అనుకున్నాడు తప్ప అన్నగారిని విడిచిపెట్టిపోలేదు. వీరమరణం పొందినాడు. కేవలం రాజ్యంకోసం శత్రువుతో నీ యన్నను చంపించినావే! ఛీ!ఛీ!" అని అందరూ న న్నంటారు. రామా! నిర్దయుడవై రావణు ణ్ణెందుకు వధించినావు? ఈ మాటలు అసలు విభీషణుడు వింటూనే వుండగా వాళ్ళిద్దరి రూపాలూ చెదరిపోయి తనలో ప్రవేశించి అదృశ్యమైనవి. కండ్లు తెరచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అదంతా తన ఆత్మఘోషగా గుర్తించాడు. తానిక చేసే దేమీ లే దనీ అవన్నీ బయటి ప్రపంచంలో తాను స్వయంగా అనలేని మాట లనీ గ్రహించాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ఆత్మఘోష*
"తన్ని వెడలిపొమ్మనెఁ గాని నిన్నుఁ జంప నెంచడే యన్న.. నీవె చంపించినాడ వనుచుఁ జులకనఁ జూడరే యార్యులెల్ల.. రావణుని సంహరించుట రామ! సబబ? 1
అన్న మృతితో ఖిన్నుడైన విభీషణుడు వేదనతో పల్కిన పల్కులు:
సుకమౌ రాముని జేర దీరు మదిలో శోకంబు నా కంచు నే లికయున్ భ్రాతయు దండ్రి వంటి నిను జాలిన్ వీడి నే పోయి చా వు కహో కారణ మైతినే కదలి రావో యన్న నన్ జూడ నీ వకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై.
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
LTTE ప్రభాకరన్ (వీరస్వర్గములో): 👇
ప్రకటింపంగ స్వతంత్రమిచ్చటనహో బంగారు శ్రీలంకలో
వికటించంగను పిక్కటిల్లుచునయో విప్పారినన్ మా శక్తులే
నికటంబందున నుండగా విరివిగా నీచుండ్రులౌ బుద్ధులే
యకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై...😊
తొలగించండి* బౌద్ధులే
నా ప్రయత్నం 🙏
రిప్లయితొలగించండితే గీ:
నీ సతిని తాక లేదుట నీకు యెఱుక
సొంత పగలకొరకనియె చంపితివిగ
వారు శివునికి భక్తుడు వందనమ్ము
*"రావణుని సంహరించుట రామ! సబబ?"*
🙏🙏🙏🙇🙇🙇
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వితండవాదుడు యేచూరి "సీతారాముడు": 👇
ప్రకటింపంకయె దూరదర్శనమునన్ ప్రఖ్యాతమౌ తీరునన్
నికరంబయ్యెడు జఠ్మలాని వరునిన్ నిక్కంబుగా పట్టుచున్
సుకరంబొప్పగ కేసు పెట్టకనయో సుప్రీము కోర్టందు నీ
వకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై...
(రావణాసురసంహారానంతరం శోకించే
రిప్లయితొలగించండిమండోదరి నోదారుస్తున్న రఘురాముడు )
" అకటా! రావణు నేల జంపితివి రా
మా ! నిర్దయాత్ముండవై ;
యకళంకుం ; డితడీశ్వరార్చనము నం
దత్యంతనిష్ఠాత్ము " డం
చిక మండోదరి ! శోకవిహ్వలతతో
నేమేమియో యిట్లు ప
ల్కకుమా ! కన్నుల మూయు కామముననే
కన్మూసె ; నంతే సుమా !
మోహముండియు నామెను ముట్ట లేదు
రిప్లయితొలగించండిబలిమి కలిగియు బలవంత బరచ లేదు
ధర్మము నిసుమంతయు గూడ దప్పనట్టి
రావణుని సంహరించుట రామ! సబబ?
అకటా నారకు జంపెనెందులకు సత్యానాథుడే నిర్దయ
రిప్లయితొలగించండిన్నకటా తారకు సంహరించెనొకొ షాణ్మాత్రుండె శూలంబున
న్నకటా రావణు నేలజంపితివి రామా నిర్దయాత్ముండవై
వికటంబయ్యెడు నిట్టిప్రశ్నలు కడున్ విభ్రాంతిగల్గించునే
ప్రకటంబేగద కర్మయౌ సురలకున్ పాలార్చ క్రూరాత్ములన్
రిప్లయితొలగించండిఅతడు పెరియారయె! తమిళ నాట నుద్య
మమ్ము సాగించె రాముని మంకుదనము
న నెగ తాళిచేయుచు సభలోన నడిగి
"రావణుని సంహరించుట రామ! సబబ?"
రిప్లయితొలగించండి1971 Salem Episode. ఈ మధ్య రజనీకాంతుడు హాటు హాటు గా న్యూసయ్యేడు మరిచిన విషయాలను మళ్ళీ లేవదీసి తమిళనాట :)
ప్రకటించెన్ పెరి యారు బ్రాహ్మణులపై ప్రాఘాతమున్ ద్రావిడుల్
తకరారున్ మొదలెట్టి సేలమున సీతారాములన్ త్రిప్పి మీ
దు కనారిల్లి నవాచ్యముల్ పలుకుచున్ దుమ్మెత్తి గర్హించిరే
"అకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై"
జిలేబి
వికలాత్ముల్ దితిపుత్రు లయ్యదనునన్ విస్తార దుఃఖంబునన్
రిప్లయితొలగించండిసకలంబున్ నశియించె నింక నసుర స్వామిన్ నరుండొక్క డా
గక ద్రుంచెంగద”యంచు నెమ్మనములో క్రౌర్యంబుతో బల్కినా
రకటా! రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై
నిత్యమునహింసయెపరమని వచియించు
రిప్లయితొలగించండినా మహాత్ముడు గాంధియే యారణమున
సాక్షి యైనిల్చునెడ దనస్వామి నడుగు
రావణుని సంహరించుట రామ! సబబ?"
ప్రక్క దారుల పేరును బడయగోరి
రిప్లయితొలగించండిఉచ్చ నీచము మరచియు చచ్చు బుధ్ది
హిందు దేవుల దూషించు మందు డనును
"రావణుని సంహరించుట రామ! సబబ?"
పంక్తి గ్రీవుడా దనుజుండు పరమ పాపి
రిప్లయితొలగించండినీదు కర్తవ్య మదియేను నీరజాక్ష
రావణుని సంహరించీట, రామ! సబబ
బ్రాహ్మణ వధయటంచును పానలేల?
డా.బల్లూరి ఉమాదేవి.
రిప్లయితొలగించండికరము లంటి తాకగ లేదు కాంత నెపుడు
గడువు నొసగి వేచెను తాను కాలమెల్ల
నట్టి పరమశివుని యొక్క భక్తుడైన
రావణుని సంహరించుట రామ సబబె
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరావణవధానంతరం... త్రిజట వంటి ఒక రాక్షసి👇
ఎకసక్కెమ్ములనాడినాడు ఖలుడై యెంతేని బాధించినా...
డకలంకన్ సుదతీలలామను., మహాఘౌఘాధ్వసంచారి., వీ...
నికి జీవన్మరణమ్మె శిక్షయగు., వీనిన్ నీవొకే ముల్కుచే...
నకటా! రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
amoghamainadhaara
తొలగించండితనను రక్షించుటలో విలంబనకు వగచు సీతా మనోగతము
రిప్లయితొలగించండిసకలంబీవయె నాకటంచు మదిలోసత్యంబుగా దల్చితిన్
ఒకదానన్నిటరక్కసాధము చెరన్ యుండంగ నీవేల
యూ
రక యున్నాడవొ నేనెరుంగ రఘువీరా! యింత జాప్యంబుగా
నకటా రావణు నేలఁ జంపితివి రామా ! నిర్దయాత్ముండవై"
మనోహరమైన పూరణ!అభినందనలు!
తొలగించండికృతజ్ఞతలు సీతాదేవి గారు. మీ సాదృశ నామధేయురాలి మనోగతం. మీ మెచ్చుకోలు అత్యంత ఉత్సాహకరం.
తొలగించండిరావణుని సంహరించుట రామ సబబ
రిప్లయితొలగించండిఅనుచు ప్రశ్నించు వారికి ననెనొకండు
ధర్మ రక్షణ కొఱకునై ధరను వెలసి
దుష్ట దనుజులనెల్లను దునిమె తాను
తప్పు లేదయ్య దుష్టుడు, చెప్ప వినని
రిప్లయితొలగించండిరావణుని సంహరించుట రామ!; సబబ?
దిక్కుమాలిన పలుకుల లెక్కజేసి
కానలకు నంప సీతను కరుణ మాలి.
చక్కటి పూరణ!అభినందనలు!
తొలగించండి.... శంకరాభరణం....
రిప్లయితొలగించండి10/03/2020..మంగళవారం
సమస్య.
*******
రావణుని సంహరించుట రామ! సబబ?"
నా పూరణ.
** *** *****
రావణుని సంహరించుట రామ! సబబ?
యనుచు దైవమునె నిలదీయ సబబౌనె?
న్యాయ ధర్మముల నిలుప యవనిని దన
ధ్యేయమంచు దైవము లోక హితము గూర్చు
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
. 🌷 వనపర్తి 🌷
*రావణుని సంహరించుట రామ! సబబ?*
రిప్లయితొలగించండియంచు ప్రశ్నింపఁదొడగిన యధములార!
ధారపోయగ రండు మీ దారనన్యు
లకు నుదారముగా!చూప రండు చేసి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసకలశాస్త్రవిదుఁడతడీశ్వరునిభక్తు
తొలగించండిడతడులంకాపురీనాధుడతడు బ్రాహ్మ
ణుండతడసురకులరక్షకుండునయిన
రావణుని సంహరించుటరామ! సబబ!
అనియెరావణుదేవేరియార్తినొంది.
సాధ్వి మండోదరి పరమ సహనశీలి
రిప్లయితొలగించండికుందె పతివియోగము తోడ గుండె చెదరి
తాళ జాలక శోకాగ్ని తరుణి యడిగె
రావణుని సంహరించుట రామ! సబబ?
సకలంబంతయు నీదుసృష్టిగద హే!స్వామీ విచారింపగన్
రిప్లయితొలగించండిప్రకటంబయ్యెను రక్కసుండు కనగా పాపంబు నీదేకదా
సుకుమారంబుగ వానిమార్చు విధినే చోద్యంబుగా వీడి నీ
వకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
పరమశివభక్తుడుగదార్య!రావణుండు
రిప్లయితొలగించండిశివుని బ్రీతికైస్తోత్రముజేసినట్టి
రావణునిసంహరించుటరామ!సబబ
యడుగుమంతరాత్మనుసరియైన?కాద?
బ్రహ్మవరముల బొందియు బ్రాహ్మడయ్యు
రిప్లయితొలగించండినీతిబాహ్యుగడుచు దోచె నెలతసీత
రావణుని సంహరించుట రామ!సబబ
దెన్నడైనను రణమున తిన్నగాను!
నీతిబాహ్యుడగుచు టైపాటు
తొలగించండిఅకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై
రిప్లయితొలగించండిప్రకటంబాయెను నీ యధర్మమను దుర్వ్యాఖ్యల్ నిజంబెట్టులౌ
సుకుమారిన్ జనకాత్మజన్ చెరనిడెన్ శోకమ్మునన్ ముంచెనే
వికటించెన్ దన దుష్ట కార్యములవే వేటాడెలే మృత్యువై
ఇంద్ర సారథి మాతలి భాషణము:
రిప్లయితొలగించండినలినజ వర సంపన్నుఁడు నలినజ కుల
శేఖరుం డవనిజ శాప శిక్షితుండు
నలిన జాస్త్రేతరమ్మున నరవరేణ్య
రావణుని సంహరించుట రామ! తగునె?
వాలి మరణ సమయపు సంతాపము:
అకటా నా యనుజన్ము దుశ్చరిత రాజ్యార్థంపు టుత్సాహ మీ
సకలోర్వీధరగాము లెల్లరకు విజ్ఞాతంబ రఘ్వన్వయా
వికటాత్ముండనె నన్నునీ వడిగినన్ వేగంబ తెత్తుం గదా
యకటా రావణు, నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై
గురువు గారు మీ పూరణ అద్భుతం. ఐనా మీ పద్యం గురించి చెప్పడమంటే సూర్యుడు ప్రకాశవంతుడన్నట్లు ఉంటుంది.
తొలగించండిఅశ్వత్థ నారాయణ మూర్తి గారు ధన్యవాదములు. అది యతిశయోక్తియే కాఁ గల దండి.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"రావణుని సంహరించుట రామ! సబబ?"
"అకటా రావణు నేలఁ జంపితివి రామా
నిర్దయాత్ముండవై"
సందర్భము: రాముని బ్రహ్మాస్త్రానికి రావణుడు నేలకూలినాడు. లోకైకవీరుడు, అసహాయశూరుడైన రావణుని మృత్యువును విభీషణుడు జీర్ణించుకోలేక కండ్లు మూతలు పడగా ఒక్కసారి నిశ్చేష్టితుడై నిలబడిపోయినాడు.
తన శరీరంలోంచి ఇద్దరు దివ్య పురుషులు బయలుదేరి నింగిలో నిలబడడం అతడు గమనించాడు. క్రమంగా వాళ్ళలో ఒకడు రాముడని, మరొకడు తానేనని, వాళ్ళు తన అంతరాత్మ స్వరూపులే అని గుర్తించాడు. ఆ విభీషణుడు ఆ రామునితో ఇలా అన్నాడు.
"రావణుడు నిన్ను తన్ని నిరాదరించి వెళ్ళి పొమ్మన్నాడు తప్ప చంపదలచుకోలేదు. నీవు మాత్రం రాముని యండ జేరి మీ యన్నను చంపించినావు." అని ఆర్యులంతా నన్ను చులకనగా చూస్తారు కదా! రామా! రావణుని చంపటం సబబా!
"నీలాగే కుంభకర్ణుడూ రావణునికి హితవే చెప్పినాడు. ఐనా ఎవరి కర్మకు వారే బాధ్యులు.. అనుకున్నాడు తప్ప అన్నగారిని విడిచిపెట్టిపోలేదు. వీరమరణం పొందినాడు. కేవలం రాజ్యంకోసం శత్రువుతో నీ యన్నను చంపించినావే! ఛీ!ఛీ!" అని అందరూ న న్నంటారు. రామా! నిర్దయుడవై రావణు ణ్ణెందుకు వధించినావు?
ఈ మాటలు అసలు విభీషణుడు వింటూనే వుండగా వాళ్ళిద్దరి రూపాలూ చెదరిపోయి తనలో ప్రవేశించి అదృశ్యమైనవి. కండ్లు తెరచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అదంతా తన ఆత్మఘోషగా గుర్తించాడు. తానిక చేసే దేమీ లే దనీ అవన్నీ బయటి ప్రపంచంలో తాను స్వయంగా అనలేని మాట లనీ గ్రహించాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ఆత్మఘోష*
"తన్ని వెడలిపొమ్మనెఁ గాని నిన్నుఁ జంప
నెంచడే యన్న.. నీవె చంపించినాడ
వనుచుఁ జులకనఁ జూడరే యార్యులెల్ల..
రావణుని సంహరించుట రామ! సబబ? 1
"అకలంకంబు హితంబుఁ జెప్పియు విడం
డన్నయ్య.. నెవ్వాని క
ర్మకు వాడే..యని కుంభకర్ణు డనిలో
రాలెన్ భళా! రాజ్య ల
క్ష్మికినై శత్రువుఁ జేరి యన్న నిటు లి
స్సీ! చంపినా" వందురే!
అకటా! రావణు నేలఁ జంపితివి రా
మా! నిర్దయాత్ముండవై 2
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
10.03.20
-----------------------------------------------------------
ఇక శాంతించుమటంచు వేడెదనుగా యిక్ష్వాకు వంశోత్తమా
రిప్లయితొలగించండివికచాబ్జానని యయ్యయోనిజను తా వేదించినన్ బ్రాహ్మణున్
సకలావస్థల యందు నాగధరుఁ పశ్వత్పా లుఁ భక్తుండెయౌ
నకటా రావణు నేల జంపితివి రామా నిర్దయాత్ముండవై.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅకటారావణునేలజంపితివిరామానిర్దయాత్ముండవై
రిప్లయితొలగించండిసకలంబంతయునీవెగానరయయోసామీజగంబంతటన్
నికనీపుట్టుకదుష్టశిక్షణయ,నీయాకృత్యమాహాసుమా
వికచాబ్జానన!సంయమేంద్ర!హర!నీవేమాకుదైవంబుభో!
రావణ వధానంతరము తల్లడిల్లెడు మండోదరి ఆంతర్యం...
రిప్లయితొలగించండిమత్తేభవిక్రీడితము
వికలమ్మైన మనంబు నుండఁ గుజ, యాపేక్షన్ బ్రతీక్షించెనే !
యొకసారైనను తాకెనా? మగువఁ దా నొప్పించఁ గా జూచెనే!
యకటా! రావణు నేలఁ జంపితివి రామా! నిర్దయాత్ముండవై
నికరమ్మెంచివిజేతగా నిలిచి బంధించంగనే జాలదే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికపట సన్యాసిగా సీత నపహరించ
రిప్లయితొలగించండిధర్మమున్ దీర్చె నేవిధి దాశరథియె;
అల్పు మాటల జానకి నడవి బంప;
రావణుని సంహరించుట; రామ! సబబ?!
రావణ వధానంతరము తల్లడిల్లెడు మండోదరి ఆంతర్యం...
రిప్లయితొలగించండితేటగీతి
కుజను బంధించె నే గాని గూడ లేదె?
యొక్క సారైనఁ దాకెనా వెక్కసమున?
బంధిఁ జేసి నాకర్పించఁ బాడి కాదె?
రావణుని సంహరించుట రామ! సబబ?
వికలంబాయెనుసాధ్విమానసము తావీక్షింప ప్రాణేశునిన్
రిప్లయితొలగించండివిగతప్రాణునిగారణాంగణమునన్ భీతావహక్రాంతయై
యకలంకంబగునామె ప్రేమపతిపైనన్పించెనీరీతిగా
"అకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై"
మాయలేడినిజూడగా మనసు బడెను
రిప్లయితొలగించండిమాయసన్యాసిజూడగా మాటరాని
తల్లిజానకి శీలము తాకనట్టి?
రావణునిసం హ రించుట ;రామ ,సబబ!!
+++++++++++++++
రావెలపురుషోత్తమరావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[రావణ వధానంతరము మండోదరి యేడ్చుచు శ్రీరామునితోఁ బలికిన సందర్భము]
"సకలాదిత్యవినమ్రశీర్షమణిరంజత్పాదపద్ముండవై,
ప్రకటంబైన పరాక్రమాది గుణముల్ భాసిల్లు విష్ణుండవై,
యకలంకాభ్యుదయున్, సుశాస్త్రునిఁ, బులస్త్యబ్రహ్మవంశోన్నతున్,
సుకవిన్, వేదవిశిష్టమంత్రవిదునిన్, సోమేశు సద్భక్తు, నీ
వకటా! రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై!"
కరుడు గట్టిన భక్తికి హరుడు మెచ్చి
రిప్లయితొలగించండివరము లిచ్చెనెన్నెన్నియో విజయమంద
పాలనా ప టిమయుగల్గి ప్రజలనేలు
రావణుని సంహరించుట రామ! సబబ?
కరుడు గట్టిన భక్తికి హరుడు మెచ్చి
తొలగించండివరము లిచ్చె నఖండ విభవమునంద
పాలనా ప టిమయుగల్గి ప్రజలనేలు
రావణుని సంహరించుట రామ! సబబ?
సవరణతో....!
రిప్లయితొలగించండిఅన్న మృతితో ఖిన్నుడైన విభీషణుడు వేదనతో పల్కిన పల్కులు:
సుకమౌ రాముని జేర దీరు మదిలో శోకంబు నా కంచు నే
లికయున్ భ్రాతయు దండ్రి వంటి నిను జాలిన్ వీడి నే పోయి చా
వు కహో కారణ మైతినే కదలి రావో యన్న నన్ జూడ నీ
వకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై.