13, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3308 (ప్రత్యుపకారమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"
(లేదా...)
"ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్" 

56 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    "Don't be silly!"

    భృత్యుని పెండ్లిసందడిని పీటల మీదను పెండ్లికూతుకున్
    ముత్యపు హారమీయగను ముద్దులు మీరగ రాణిగారహో
    పైత్యము పిక్కటిల్లగను పచ్చడి పంపుచు రోజురోజునన్
    ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్

    రిప్లయితొలగించండి
  2. అత్యాశాపరుడు, సతమ
    సత్యపువాది, యుపకార సంస్మరణపు రా
    హిత్యుడు, నమ్మకద్రోహికి
    ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్౹౹

    రిప్లయితొలగించండి
  3. అందరికీ నమస్సులు 🙏🙏

    *"ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"*

    *కం||*

    పైత్యము పెరిగి తిరుగుచున్
    నిత్యము చెడు పనులు జేయు నీచుని కిలలో
    సత్యము నమ్ముడు నిజమిది
    *"ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  4. సత్యము పుణ్యమె దక్కును
    ప్రత్యుపకారమ్ము సలుపఁ, బాపము దక్కున్
    వ్యత్యస్తాచరణమ్మున!
    ప్రత్యుపకారముపకారికావశ్యకమౌ!

    రిప్లయితొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "చేసిన మేలు చెబితే పోతుంది"

    కృత్యము లేశమైన పడి క్రిందను మీదను దొర్లి పొర్లుచున్
    సత్యము చెప్పెదంచు కడు చంకలు కొట్టుచు వీధివీధినిన్
    నిత్యము గోలవెట్టుచును నివ్వెర వోవగ లోకులెల్లరున్
    ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్

    రిప్లయితొలగించండి


  6. అత్యున్నతమై వెలుగు
    ప్రత్యుపకారమ్ము సలుపఁ, బాపము దక్కున్
    హత్యాసదృశ్యమగునను
    నిత్యము నుపకారమున్ కనికరము మరువన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "వెలుగును" అనండి.

      తొలగించండి
  7. సత్యమును తెలుపుచుంటిని
    ప్రత్యూహము జరిపి మిమ్ము బాధలనుంచే
    కృత్యములెన్ని జరిపినను
    ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"

    ప్రత్యూహము = విఘ్నము

    రిప్లయితొలగించండి


  8. కందివారివ్వాళ సెలవా :)

    సత్యమరిష్టతాతికి విశాలత జూపగ, పాడిగానగున్
    ప్రత్యుపకారమున్ సలుపఁ, బాపము దక్కుట తప్ప దెప్పుడున్
    హత్యను చేసినంతయె విహాపితమున్ మరువంగ మానవా!
    నిత్యము ధర్మమార్గమును నెమ్మిని చేర్చుచు స్వీకరింపుమా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. అత్యవ సరమ్ము కొరకని
    నిత్యము దరిజేరు దోస్తు నెయ్యము పేర్మిన్
    కృత్యము లేకనె ముదముగ
    ప్రత్యుప కారమ్ము సలుపఁ బాపము దక్కున్

    రిప్లయితొలగించండి


  10. నిత్యంబనేక పాపపు
    కృత్యములను చేసి సతము కీడెంచంగన్
    సత్యం బెరుగక వానికి
    ప్రత్యుపకారమ్ము సలుప బాపమె దక్కున్

    రిప్లయితొలగించండి
  11. సత్యమె వచించు నట్టుల
    నిత్యము నటియించి యెరను నేతలు జూపన్
    ముత్యము వోలిన ఓటరు
    ప్రత్యుపకారమ్ము సలుప పాపము దక్కున్!

    రిప్లయితొలగించండి
  12. అత్యుత్సాహము తోడ న
    సత్యము వచియించు వాడ చాలించు మికన్
    పైత్యమ్మా? యే రీతిని
    ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    భృత్యునకేని భూమిపతికేని యతీంద్రునకేని యింట దాం... పత్యసుఖమ్మునిచ్చు తన భార్యకునేని సుతాళికేని యా...
    దిత్యునకేని ప్రత్యుపకృతిన్ నెఱపన్ సుకృతమ్మె గల్గెడిన్
    ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్!!

    (తప్పు! +అదెప్పుడున్)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  14. నిత్యము నీరుబోసెనని నీడ ఫలమ్ములు పూలనిచ్చితిన్
    సత్యము ధూర్తుడీనరుడు సంకుచితంబయ వీనిబుద్ధి లా
    లిత్యము వీడుచున్ నను భరింపని రంపపు కోతబెట్టె చీ
    ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  15. నిత్య మకృత్యా పరుడై
    సత్యము విడనాడి చిన్న సాయ మొనర్ప న్
    ప్రత్యుపకృతి జేయ గడ గి
    ప్రత్యుప కారమ్ము సలుప పాపము దక్కు న్

    రిప్లయితొలగించండి
  16. అందరికీ నమస్సులు 🙏🙏
    🌹🌹
    *"ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"*

    *కం||*

    నిత్యము పాపపు పను లను
    నిత్యము నబలల చెరచెడి నీచుని మనమే
    హత్యను చేయగ సరియది
    *"ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  17. వ్యత్యాసమ్ములు దెలియవు
    సత్యాసత్యము లెఱుఁగని సామాన్యుడ నే!
    సత్యముఁ దెల్పుడి యెట్టుల
    "ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"

    రిప్లయితొలగించండి
  18. సత్యము పలుకుచు దేవుని
    నిత్యము కొలిచెడి గురువుల ఋణమును తీర్పన్ |
    భత్యముగ బారుకు పిలిచె |
    "ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"

    రిప్లయితొలగించండి
  19. నిత్యము మదిరకు బానిస
    సత్యమునేబలుకడెపుడు సర్వముతానౌ
    భృత్యుడు పాపియె గావున
    ప్రత్యుపకారమ్ముదలుప పాపము దక్కున్
    ++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  20. ఉత్పలమాల
    వ్యత్యయమెంచినారనుచు నార్యులు నంగదుడౌచు పంచ సాం
    గత్యముఁ గర్ణుఁడున్ మిగుల గారవమిచ్చియు ధార్తరాష్ట్రఘా
    యిత్యములన్నిటన్ గలిసి యీల్గె సహించి యధర్మవర్తనన్
    బ్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్

    రిప్లయితొలగించండి
  21. కం:

    నిత్యము నుపకారికి తగు
    పత్యుపకారమ్ము సలుప, పాపము దక్కున్
    సత్యము నపకారిగనగ
    ముత్యము వోలెన్నుపకృతి ముదమున నొసగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము
    దక్కుట తప్ప దెప్పుడున్"

    సందర్భము: రావణునికి వరుసకు చెల్లెలు కుంభీనసి. మధువనే రాక్షసు డపహరించుకు పోయి పెళ్ళాడినాడు. రావణుడు వాణ్ణి చంపబోయినాడు. చెల్లెలు ప్రార్థిస్తే వదలిపెట్టినాడు.
    "రావణుడు దేవేంద్రునిపైకి యద్ధానికి వెళుతున్నాడు. నీవు సాయంగా వెళ్ళు. ప్రత్యుపకారం చేసినట్టుంటుంది" అన్నది భర్తతో కుంభీనసి.
    అప్పుడు భార్యతో అత డిలా అన్నాడు.. అదీ పద్య సందర్భం.
    "దాంపత్యపు విలువలూ తెలియవు. రక్తసంబంధాలూ తెలియవు రావణునికి.."
    "ఏదో చెల్లెలు బ్రతిమలాడిందని వదలిపెట్టాడు తప్ప రావణునికి మేలు చేయాలనే ఉద్దేశ్యమే లేదు. కాబట్టి అది ఉపకారం కాదు. దానికి ప్రత్యుపకారం చేయాల్సిన పనిలేదు.చేస్తే పాపమే దక్కుతుంది" అని మధువు భావన.
    మధువు ప్రేమించినాడు. ఎత్తుకుపోయి నాడు. తప్పే! కాని పెండ్లాడినాడు. మోసం చేయలేదు. కాబట్టి క్షమించవచ్చు. (రావణుడే ఇంకా అపహరించిన చాలామంది యువతులను పెండ్లి చేసుకోలేదు.)
    రావణుడు మధువును సహాయం కోరలేదు.(చెల్లెలు మీద ఆమె భర్తమీద ఒక రకమైన చిన్న చూపే!) అడుగకుండానే సహాయం చేస్తా నంటూ వెళ్ళడం మధువు కిష్టం లేదు.
    రావణునికి చెల్లెలుమీద ఏదో ప్రేమ వుందనీ కాదు. ఉండి వుంటే చెల్లెలు భర్తను చంపా లనుకోడు. మధువును వదలిపెట్టడమూ పేరు కోసమే!
    మొత్తానికి తనను చంపకుండా వదలిపెట్టినప్పటికీ మధువుకు రావణునిపై సదభిప్రాయంగాని ప్రేమగాని లేవు.
    చివరికి బలవద్విరోధం మంచిది కాదన్న భార్య మాట కాదనలేక మధురాక్షసుడు రావణునికి సాయంగా వెళ్ళాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *కుంభీనసి భర్త*

    హత్య నొనర్ప వచ్చె నను,
    నాతని చెల్లికి నీకు భర్తనే!
    భృత్యుల మేమి? నీ వటులఁ
    భీతిలి వేడగ నన్ను వీడె.. దాం
    పత్యపు విల్వలే తెలియవా!
    దశకంఠుని.. కట్టి వానికిన్
    బ్రత్యుపకారమున్ సలుపఁ
    బాపము దక్కుట తప్ప దెప్పుడున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    13.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  23. సత్యము బలుకని వారలు
    నిత్యం బితరులను వేచు నీచ మనస్కుల
    కృత్యాభ్యాసులకు నెపుడు
    ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్

    రిప్లయితొలగించండి
  24. అత్యంత చింతనీయము
    స్తుత్యము కాదు సుజనులకు దుశ్చరితునితో
    సత్యము స్నేహము, మఱచిన
    ప్రత్యుపకారమ్ము, సలుపఁ బాపము దక్కున్


    నిత్యము ధర్మసూక్ష్మములు నేలఁ బరంగును వాటి నెన్నుచుం
    గృత్యము లెల్ల వారికినిఁ గీ డని యెంచఁ గరమ్ము దోషమే
    ప్రత్యుపకార మేరికినిఁ బాడియ చేయుట ధర్మ దూష్యపుం
    బ్రత్యుపకారమున్ జలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్

    రిప్లయితొలగించండి
  25. హత్యలు దోపిడి సలుపుటె
    నిత్యపుకృత్యమ్ములైన నేరచరిత్రున్
    స్తుత్యంబగుమేల్జేసిన
    ప్రత్యుపకారమ్ము సలుప బాపమె దక్కున్

    రిప్లయితొలగించండి
  26. నిత్యమునెల్లవారలకు నేస్తముగా తలలోన నాల్కయై
    సత్యపుమార్గమందుజనుసచ్చరితుండొనరించు మేలుకున్
    ప్రత్యుపకారమున్ సలుప పాడియె దౌష్ట్యము సల్పువానికిన్
    ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్

    రిప్లయితొలగించండి
  27. సత్యముబలుకక యెప్పుడ
    సత్యమునేబలుకుచుండిసత్పురుషువలెన్
    నిత్యముమసలెడు వానికి
    ప్రత్యుపకారమ్ముసలుపబాపముదక్కున్

    రిప్లయితొలగించండి
  28. సత్యము నెఱుగకయే యను
    నిత్యము పాపములజేయు నేరస్తులకే
    హత్యకు సమాన.మగునా
    ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్!
    **)(**
    (పాలకులకు డబ్బు క్రుమ్మరించి శాసన విరుద్ధమైన లబ్దిని పొందు నేరస్తులకు చేయు ప్రత్యుపకారము హేయము)

    రిప్లయితొలగించండి
  29. సత్యము చెప్పుచుంటి విను జాలి మనంబున నాకు జూచినన్
    నిత్యము కష్టమందు గల స్నేహితు నాదుకొనంగ జూతు నీ
    ప్రత్యయము న్నశక్తతగ భావన సేతువె చాలు నౌనులే
    ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  30. నిత్యముహింసజేయుచునునీచపుబుద్ధినిమెల్గువారికాన్
    బ్రత్యుపకారమున్సలుపబాపముదక్కుటతప్పదెప్పుడున్
    సత్యముమాటలాడుచునుసత్పురుషుండుగనుండుచోభువిన్
    బ్రత్యుపకారమున్నొనరపాపముగల్గదునెట్టివారికిన్

    రిప్లయితొలగించండి
  31. "ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్"



    నిత్యమనర్హులందఁగణనీయయశస్సులలంచమిచ్చుచున్
    స్తుత్యపురస్కృతుల్ బడయజూతురుపెద్దలమభ్యపెట్టుచున్
    సత్యముతొట్రిలన్ ప్రతిభసాయములంచమునెంచియెన్నికన్
    "ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  32. కందం
    నిత్యమ్మంగదు డని సాం
    గత్యమ్మున రాజరాజు కై కర్ణుఁ డఘా
    యిత్యములఁ గూలె నమతికిఁ
    బ్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్

    రిప్లయితొలగించండి
  33. సత్యము విధ్యుక్తమ్మగు
    ప్రత్యుపకారము సలుప;బాపము దక్కున్
    భృత్యుల వేధించి పలు య
    కృత్యములకు బాల్పడంగ కీచకవృత్తిన్

    రిప్లయితొలగించండి
  34. సత్యముబల్కనేమిటికి,సర్వము సంపదలోనెయుండగా
    నిత్యము పాపకృత్యములె ,నివ్విధిగానెరవేర్చుచుంటినే
    భృత్యుడగానుయెవ్వరికి, భూరి యశమ్మది నాకెయుండయే
    ప్రత్యుపకారమున్ సలుప ,పాపముదక్కుటదప్పదెన్నడున్
    **********************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి