14, మార్చి 2020, శనివారం

సమస్య - 3309 (అచ్చతెలుంగు పద్యమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అచ్చతెలుఁగు పద్యమున నాంగ్లపదములె హృద్యములగు"
(ఛందో గోపనము)
(లేదా...)
"అచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

116 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    ముచ్చటి కూతురల్లుడును ముద్దులు కూర్చగ శోభనంబునన్
    గిచ్చుచు రక్కుచున్ మగని గీరుచు వీపున వాడిగోళ్ళతో
    రచ్చను జేయునత్తయను రంభగ పోల్చుట శోభగూర్చునా?
    "అచ్చ తెలుంగు పద్యమున నాంగ్ల పదంబులు శోభగూర్చునా"?

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కచ్చిత మోయి పండితుడ! కాకియు కోకిల చేరు రీతిగా
    నచ్చ తెలుంగు పద్యమున నాంగ్ల పదంబులు శోభగూర్చునోయ్!
    చచ్చువి ప్రశ్నలివ్విధివి చంపకు వేయుచు నాదు మోమునన్:👇
    "అచ్చ తెలుంగు పద్యమున నాంగ్ల పదంబులు శోభగూర్చునా"?

    రిప్లయితొలగించండి
  3. పచ్చని పద్యముల్ మదిని భాసిలు నంటయుగాం తమందునన్
    మెచ్చగ పండితో త్తములు మేలగు చక్కని హావభావముల్
    ముచ్చట తీరనల్లు చును మోదము నొందుచు మేళ వించగా
    నచ్చ తెలుంగు పద్యముల నాంగ్ల పదమ్ములె శోభ గూర్చురా

    రిప్లయితొలగించండి
  4. నిత్య వ్యవహారముల యందు నెరవుగాను
    సత్య మాంగ్లమే తెలుగింట నృత్యమాడ
    నద్యతన కాలమందున నచ్చతెలుగు
    పద్యమున నాంగ్లపదములె హృద్యమగును

    స్వేచ్ఛగ నాంగ్లమియ్యెడల జేరగనందరి మాటలందునన్
    స్వచ్ఛపు దెల్గుభాష గనసాధ్యమె పద్యము గద్యమందునన్
    మచ్చికయైన భాషమరి, మాన్యులు మన్నన సేయగావలె
    న్నచ్చతెలుంగు పద్యముల నాంగ్లపదమ్ములె శోభగూర్చురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నిత్య వ్యవహార' మన్నపుడు 'త్య' గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!నిత్య కార్యక్రమములందు నెరవుగాను అని సవరిస్తాను!నమస్సులు!

      తొలగించండి
  5. క్రొత్తగ తమ రచనలకు క్రొత్త క్రొత్త
    యందములను చేకూర్చగ నచ్చ తెలుఁగు
    పద్యమున నాంగ్లపదములె హృద్యములగు
    నేటి సాహితీ కల్పనా నేర్పరులకు

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...బోయెనొకొ యాంధ్రము..." అనండి. 'మాత యంకము'నకు అన్వయం?

      తొలగించండి
    2. అచ్ఛవి యేడబోయెనొకొ యాంధ్రము సంస్కృత మాతృసన్నిధిన్
      ముచ్చటలాడుచున్ కరము ముత్యపు సౌరుల నింపునింపుచున్
      హెచ్చిన పేర్మి బేరెలమినేలగ నక్కట! నేడుజూడగా
      నచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా"
      సవరించిన పద్యం చిత్తగించండి, గురువు గారు.

      తొలగించండి
    3. దేశ భాషలందున లెస్స తెలుగటంచు
      తెలుగు కీర్తుల జాటిరి తెలుగు విభులు
      అన్యమే మాన్యమనుచు నే డచ్చతెలుఁగు
      పద్యమున నాంగ్లపదములె హృద్యములగు"

      తొలగించండి


  7. ఛందోగోపనము


    భళి యిటాలియనాఫీస్టు! ప్రభలొలికెడు
    నాదు భాష సజీవమౌ నచ్చతెలుగు
    పద్యమున నాంగ్లపదములె, హృద్యములగు
    రీతి పొసగి తెనుగు వలె రిక్కలిడును!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  8. ఆకాశవాణికి పంపినది


    ఆంగ్ల మేమి, యే భాషైనా తెలుగులో పొసగు !
    ఆంగ్లపదాలిస్తే పూరణ చేయగలరా అంటే కాయ్ రాజా కాయ్ అనగల సత్తా వున్న పండితులు, దానికి పొత్తు గూర్చు భాష తెనుంగు.



    గ్రుచ్చమటంచు పొత్తవని కొంటెపదమ్ముల నీయ దీప్తినే
    తెచ్చిరి కైపదమ్ములను దీర్చి వధానులె తేనెలొల్కగా
    నచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదమ్ములె శోభగూర్చు, రా,
    విచ్చును తేటగీతివలె, వీనులవిందగు నిక్వణమ్ముగా!

    నిక్వణము - వీణానాదము.



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవగ' అన్న రూపం సాధువు కాదు. "మాన్యమయ్యె నే డచ్చతెలుఁగు..." అందామా?

      తొలగించండి
  10. ఉత్పలమాల
    విచ్చిన పూలతేనె నునుపెక్కిన 'మా' యలమేలు మోవిపై
    మెచ్చఁగ వేంకటేశునకు మేటి నివేదనమీయ వచ్చు మా
    యచ్చ తెనుంగు పద్యమున, నాంగ్లపదంబులె శోభగూర్చురా!
    హెచ్చిన కల్పనాతిశయమింపుగ జెప్పెడు 'కీట్సు' కైతలన్!!

    (కీట్సు = John Keats, a famous romantic poet in English)

    రిప్లయితొలగించండి
  11. అచ్చులతోడ నంతమగు నందము గొల్పెడి భాష నెల్లరున్
    మెచ్చెడి రీతి పద్యముల మీటుచు నాంగ్లమొ కింత చేర్చగా
    వచ్చియు రాని తెన్గున ప్రవాసి వచించిన తీరు నియ్యెడన్
    అచ్చ తెనుంగు పద్యమున నాంగ్ల పదమ్ములె శోభ గూర్చురా!

    రిప్లయితొలగించండి
  12. అచ్చెరు వొందబోకు పరిహాసము కాదిది యెంచి చూడగా

    మచ్చయె పెంచెనందమును మస్కరి కెంతయొ గాదె కెంపులున్

    బచ్చలు చేరినంతనె సువర్ణపు టందము హెచ్చురీతిగన్

    అచ్చతెనుంగు పద్యమున యాంగ్లపదంబులె శోభగూర్చురా!

    .

    రిప్లయితొలగించండి
  13. మచ్చికతోడ నిత్యమును మానక ఛందము నేర్పునట్టి యా
    సచ్చరితుండు శిక్షకుడు ఛాత్రులతోననె జంకనేలరా
    వచ్చిన శబ్దముల్ గొనుచు పద్యము వ్రాయుట కుద్యమించు డీ
    యచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా

    రిప్లయితొలగించండి
  14. స్వేచ్ఛగ పద్యమొక్కటియు జెప్పగనెంచితి తేటతెన్గునన్,
    అచ్చరు వాయెనొక్కడును అద్భుత పద్యము నాలకించడే
    మ్లేచ్ఛుల భాషతీరుగని మీరి నిబంధన జెప్ప పద్యమున్
    మెచ్చిరి మేలు మేలనుచు మేలిమి పద్యమనంగ,నా యిదే
    అచ్చతెనుంగు పద్యమున ఆంగ్ల పదంబులె శోభగూర్చురా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తేటతెన్గులో । నచ్చెరువాయె నొక్కరుడు నద్భుత పద్యము..." అనండి.

      తొలగించండి
  15. ఎచ్చట తేనెచక్కెరలు నింపుగనిండిన తెన్గుభాష దా
    నెచ్చట పొందు పొంతనలు నెవ్వియు లేనిప రాయి యాంగ్లమున్
    పచ్చిగ జెప్పజూచిననువాయసనాసిక బింబ మట్లుగన్
    అచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా"

    రిప్లయితొలగించండి
  16. బస్సు, రైలును తెనుగున పలుకుటెట్టు
    లన్నిమాటలుతెలుగునననగలేము
    అట్టిసమయములందుననచ్చతెలుఁగు
    పద్యమున నాంగ్లపదములె హృద్యములగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేము + అట్టి' అన్నపుడు సంధి నిత్యం. "తెలుగున ననగ గలమె । యట్టి..." అనండి.

      తొలగించండి
  17. మైలవరపు వారి పూరణ

    పచ్చడిముద్ద నోటఁగొన పల్లను దూరిన రాయి., వీథిలో
    చెచ్చెర నేగుచున్న తఱి చెప్పుల సందున దూరు కంటకం
    బిచ్చకమైనదై మదికినింపునొసంగిన వానికెంచగా
    నచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదమ్ములు శోభగూర్చెడిన్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  18. ఉ:

    ముచ్చట లాడ నెల్లరును ముద్దుగ మిశ్రిత మైన భాషలో
    తచ్చన మేరకే దెనుగు ధాటిన పల్కుట తారసిల్లగ
    న్నచ్చెరువేల చొప్పడగ నాంగ్లము ఛందము నందునన్ భళా
    అచ్చ తెలుంగు పద్యముల నాంగ్ల పదమ్ములె శోభ గూర్చు రా
    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తచ్చన'? "ధాటిని" అనండి. 'తారసిల్లగన్ + అచ్చెరువు' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగం సాధ్యమైనంత వరకు వర్జించండి.

      తొలగించండి
    2. తచ్చన=పరిహాసము
      మీ అమూల్యమైన సూచనలకు ధన్యవాదాలు.

      తొలగించండి
  19. మెచ్చగలేని పామరులు, మేలిమి బంగరు తెన్గుబాసనున్
    ముచ్చట లేనిమూర్ఖు,లెడబుద్ధులుఁ జేరు సభాస్థలంబునన్,
    అచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా!
    వచ్చుటకంచు హాస్యమును బాసను సంకర పర్చభావ్యమా?

    రిప్లయితొలగించండి
  20. ముచ్చట నేర్వగా తెలుగు ముద్దుగ నేర్పుమ యింటి వద్దనే
    వచ్చును వేరు భాషలును వారికి మిత్రులు మాటలాడగన్
    మెచ్చుగ భాషలే దెలియ మేదిని జ్ఞానిగ మార్గదర్శియై
    అచ్చ తెనుంగు పద్యమున యాంగ్ల పదమ్ములు శోభ గూర్చురా ??

    రిప్లయితొలగించండి
  21. ఉత్పలమాల:

    అచ్చతెలుంగునన్ బలుక యచ్చుల హల్లుల లెక్కలేలనో
    గుచ్చిన హారమే యదియు గుప్పెడు మల్లెల శోభయే గనన్
    మెచ్చిన భాషయే పలుక మేలగు దేనెల దేవభాషయన్
    అచ్చతెలుంగు పద్యముల నాంగ్లపదమ్ములె శోభగూర్చురా"!?!?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...బలుక నచ్చుల... గ్రుచ్చిన... దేవభాషయౌ నచ్చ..." అనండి.

      తొలగించండి
  22. ఉ.
    అచ్చ తెనుంగు మాటలకు నర్థము జెప్పుట కాంధ్రభూమినే
    మెచ్చగు పండితుల్ కరవు, మే లిది నీ కృషి, యీ విదేశపుం
    బచ్చని తెన్గు తోటలను భావము జెప్పగ విప్పి చక్కనౌ
    యచ్చతెలుంగు పద్యముల, నాంగ్లపదమ్ములె శోభగూర్చురా.

    రిప్లయితొలగించండి
  23. భాష ప్రవహించు నది వోలె పరగు చుండ
    పెక్కు భాషలు జేరుచు వెలుగు నింప
    నలరు రచనలు గాంచగా నచ్చ తెలుగు
    పద్యమున నాంగ్ల పదములె హృద్యము లగు

    రిప్లయితొలగించండి
  24. మెచ్చగపండితోత్తములు, మేలగు ఛందము నిండియుండ,తా
    విచ్చుచు భావసంపదకు, పేర్మివధానపు విద్యయందునన్ ,
    మెచ్చ కవీంద్రశేఖరులు ,మేలుసమాసపు పోహళింపులో
    నచ్చతెలుంగుపద్యమున నాంగ్లపదమ్ములె శోభగూర్చురా
    కొరుప్రోలు రాధాకృష్ణారావు ,మీర్పేట్,రంగారెడ్డి






    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి నమస్కారములు గత రెండు వారములనుండి నేను పంపిన పద్య

    రిప్లయితొలగించండి
  26. పద్యాలు చదవటం లేదు పేరుకూడా చదవటంలేదు నాకు acknowledge ment వస్తొంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు శనివారము రాత్రి లోపునే పంపి చూడండి. తప్పక చదువఁ బడును.

      తొలగించండి
    2. అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ పూరణ పద్యాలను కాపీ-పేస్ట్ చేయడంలో అప్పుడప్పుడు ఒకటో రెండో తప్పిపోతుంటాయి. అలా రెండు సార్లు నాకే జరిగింది.

      తొలగించండి
    3. ఈ రోజు నా ప్రయత్నానికి కంప్యూటర్ ఆపరేటరే కారణమేమొ? నేను సోమవారంనాడు పంపితిని. గతంలో గురువారం రాత్రి పదిన్నరగంటలకు పంపినపుడు నా పద్యమే మొదటగా చదువబడింది. 😱

      తొలగించండి
  27. అన్నమయ్య యౌన్నత్యము నందరెఱుఁగ
    నాంగ్ల దత్తపదంబులు స్వార్థము విడ
    మెచ్చ నవధాని జెప్పెడు నచ్చ తెలుఁగు
    పద్యమున నాంగ్లపదములె హృద్యములగు

    రిప్లయితొలగించండి
  28. అచ్చపుజీకటింబడుచునాంగ్లమునించుకరాకయున్నచో
    నిచ్చటయచ్చటన్మఱియునెచ్చటగూడనునుండలేముగా
    మచ్చుకినుండగాదగునుమధ్యన,నాంగ్లపదంబులుండుచో
    నచ్చతెనుంగుపద్యములనాంగ్లపదమ్ములెశోభగూర్చుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "... నిచ్చట నచ్చటన్మఱియు.. మచ్చుకు..." అనండి.

      తొలగించండి
  29. నెచ్చెలి మోముపై వికృతి నింపిన నల్లని మచ్చలట్లు హే
    విచ్చిన మల్లెపూలపయి భీష్మ విషమ్మది చిమ్మినట్లు మా
    యచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె !శోభఁ గూర్చురా
    లచ్చియె నవ్వినట్లుగ గలంగల యచ్చ తెలుంగు పాదముల్

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  30. అచ్చతెలుంగుపద్యమన నచ్చతెనుంగు పదమ్ము లింపుగన్
    విచ్చినఁ బూలఁ దావి వలె వేడ్క సుధారసపానమట్లుఁ గ్రొ
    మ్మెచ్చుల నంది స్వచ్చమగు, , మిశ్రపదమ్ములు నడ్డు పుల్లలై,
    నచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె, శోభఁ గూర్చురా?

    రిప్లయితొలగించండి
  31. అచ్చెరువొందనేల మన ఆంధ్రులకాంగ్లమె ముద్దనంచు దా
    నిచ్చయె మీర జేసెనిటు నిర్ణయమందరు దప్పు బట్టినన్,
    పిచ్చికి మందు లేదు గద, వెల్గునికాంగ్లపు మాధ్యమంబునన్
    దచ్చ తెనుంగు పద్యమున నాంగ్ల పదంబులె శోభ గూర్చురా

    రిప్లయితొలగించండి
  32. డా.బల్లూరి ఉమాదేవి

    .. ఈరోజు ఆకాశవాణిలో చదవ బడిన నా పూరణ

    నచ్చిన భాషలన్ విడక నమ్రత తోడనునేర్చినట్టి వా
    *డచ్చ తెలుంగు మధ్యమున నాంగ్లపదమ్ములె శోభగూర్చురా!"
    మెచ్చుచు నేర్వరా యిటుల మేటిగ పల్కుమ టంచు తా సదా
    నిచ్చకమాడుచున్ దెలిపె నెల్లరు విస్మయ చిత్తులై వినన్.

    మరొక పూరణ

    ఇతర భాషాపదమ్ములు నింపు మీర
    పద్యగద్యములాదిగా పలువిధాల
    నన్ని ప్రక్రియ లందున నిచ్చు తెలుగు
    *పద్యమున నాంగ్ల పదములె హృద్యములగు*

    రిప్లయితొలగించండి
  33. ఖచ్చిత మైనతెల్గునను కమ్మదనంబది మాయమౌటఁ దా
    మెచ్చరు మాన్యులెవ్వరును మేలగు పండితు లిజ్జగంబునన్
    హెచ్చిన వంపుసొంపులతొ నింపొన రించుచు ముద్దుగొల్పుగా
    నచ్చతెనుంగు పద్యమున నాంగ్ల పదంబులె శోభ గూర్చురా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సొంపులతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
  34. మెచ్చగ పండితోత్తములు మేలగు వాడిన తత్సమంబుల
    న్నచ్చ తెలుంగుపద్యముల;నాంగ్లపదమ్ములె శోభగూర్చురా,
    చెచ్చెర జేరగాయువత,చేర్చిన నేర్పుగ పద్యమందునన్
    మ్లేచ్ఛుల భాషయే మనకు మిక్కిలి చేరువగాగ మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తత్సమంబులన్ + అచ్చ' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగం వర్జించండి.

      తొలగించండి
    2. అటులనే గురుదేవా!ధన్యవాదములు!

      తొలగించండి

  35. నేటి ఆకాశవాణి విశేషములు తెలుపగలరు.



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈరోజు మీ పద్యం కాని, పేరు కాని వినబడలేదు.
      వచ్చే వారానికి సమస్య....
      "దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్"

      తొలగించండి

    2. కొరోనా వైరస్సని quarantine చేసి‌‌ వుంటారు :)

      నెనరుల్స్ పంపించినాము :)



      జిలేబి

      తొలగించండి
  36. సమస్య. : ఉ.మా.
    **** ****
    అచ్చ తెలుంగు పద్యమున నాంగ్ల పదంబులె శోభగూర్చురా

    నా పూరణ. ఉ.మా.
    **** *** ***

    వచ్చుచు జేర భూరి పరభాష పదమ్ములు దెల్గునందునన్

    హెచ్చుగ బ్రజ్వరిల్లుచు
    మహీతలమంతట విస్తరిల్లగన్

    మెచ్చును లోకమంతయును మిన్ను స్పృశించు తెనుంగు కీర్తినే

    అచ్చ తెలుంగు పద్యమున నాంగ్ల పదంబులె శోభగూర్చురా


    ౼ ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి

    రిప్లయితొలగించండి
  37. బస్సుమొదలగుపదములప్రస్ఫుటమగు
    నర్ధమునుజెప్పదెలియునే?యందువలన
    నందమైనట్టిపదములనచ్చతెనుగు
    పద్యముననాంగ్లపదములెహృద్యములగు

    రిప్లయితొలగించండి
  38. హాస్య మొలికించుఁ జదువంగ నట్టి కృతులు
    మత్స్య కన్య మెచ్చునె పరిమళము సోఁక
    నచ్చెరు వగు నీ విట్లన నచ్చతెలుఁగు
    పద్యమున నాంగ్లపదములె హృద్యములగు


    అచ్చపు టాంగ్ల మందు మఱి యాంధ్ర పదమ్ముల వారు మెత్తురే
    నిచ్చలు గౌరవం బగు ననేక పదమ్ములు భాష నుండవే
    మెచ్చరు పండితోత్తములు మేదిని మార్చుమ శోభఁ జెర్చె నీ
    యచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చు రా

    [రా = రమ్ము]

    రిప్లయితొలగించండి


  39. ఉ: కచ్చితమౌ తెలుంగునను కమ్మని పద్యములన్ లిఖించినన్

    మెచ్చెద రందరున్ గొనుచు మిక్కిలి మోదము, బొంత రీతిగా

    గ్రుచ్చి పరాయి భాషలను గూర్చిన పద్యము గాంచ నెవ్విధిన్

    అచ్చ తెలుంగు పద్యమున నాంగ్ల పదమ్ములె శోభ గూర్చురా ?

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "అచ్చతెలుఁగు పద్యమున నాంగ్లపదములె
    హృద్యములగు"
    (ఛందో గోపనము)

    సందర్భము:
    నమోఽస్త్వనంతాయ సహస్ర మూర్తయే
    సహస్ర పాదాక్షి శిరోరు బాహవే..
    అన్నది ప్రసిద్ధం.
    విష్ణు పదము స్థిరంగా వుండేది. అవతారాలు అవసరం వచ్చినప్పుడు మాత్రమే వచ్చి ప్రయోజనం నెరవేరగానే కనుమరు గయ్యేవి. అందువల్ల...
    విష్ణుడు స్థిరుడు..అనంతుడు
    అవతారాలు అలా కావు.. అని ధ్వని..
    తెలుగు పద్యం.... విష్ణువుతో పోల్చబడింది.
    ఆంగ్ల పదాలు.....అవతారాలతో పోల్చబడినవి.
    శాశ్వతమైనది తెలుగు పద్యం.. అందులో అప్పుడప్పుడు ఆంగ్లపదాలు కనిపించినా అవసరంమేరకే తప్ప మరేమీ లేదు... అని భావం
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *విష్ణు పదము*

    స్థిర, మనంతము విష్ణుని దివ్య పదము..

    రామ కృష్ణాది ఘటనలు రమ్యము లయి

    వచ్చి పోవుచునే యుండు.. నచ్చ తెలుఁగు

    పద్యమున నాంగ్లపదములె హృద్యము లగు..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    14.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  41. నచ్చినముంతపప్పునను,నాణ్యముగూర్చెడు జీడి బద్దలై
    గుచ్చినపూలమాలకడ,గుంపుగ దూరెడు మర్వపాకుగా
    మెచ్చినకావ్య పాఠమున, మేలుగజెప్పెడు కాంతబోధతో
    అచ్చతెనుంగుపద్యమున ,నాంగ్లపదమ్ములు శోభగూర్చులే
    ++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  42. గురువులకు నమస్సులు 🙏🙏

    నా పూరణ ప్రయత్నం 🙏🙇‍♂️

    *తే గీ*

    తెలుగుకు తగిలెనుగదర తెగులు నిపుడు
    వలదు వలదనుచుండెను ప్రభుత మనకు
    అట్టి స్థితుల నడుమజూడ *"అచ్చతెలుఁగు*
    *పద్యమున నాంగ్లపదములె హృద్యములగు"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  43. నిచ్చలునన్నిపద్దెములు నిక్కపు జానుతెనుంగు నందునన్ 
    మెచ్చెడురీతి వ్రాయుటన మిక్కిలి కష్టము 'రైలు స్టేషనున్'
    అచ్చతెనుంగునన్ పలుక నచ్చెరువందగజేయు, నట్టిచో
    నచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభగూర్చురా!

    రిప్లయితొలగించండి
  44. అందరికీ నమస్సులు��

    చదువు లేమొ పరాయిభాషన నెరపగ

    మధుర భావ రసాస్వాద మధువు లొలుకు

    పద్యమే రీతి తెలియును పదుగురికిని

    యచ్చమైన పూదండవలె యచ్చ తెలుగు

    *పద్యమున నాంగ్ల పదములె హృద్యములగు*

    వాణిశ్రీ నైనాల, హైదరాబాద్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పదుగురికిని నచ్చమైన పూదండవలె నచ్చ తెలుగు..." అనండి.

      తొలగించండి
  45. పచ్చడినంచుకుంటుతిన పాయసమెట్లురుచించుకొందరిన్
    పుచ్చినకాయలన్ తురిమి పోపులుదట్టముగానుచేర్చినన్
    మెచ్చుచులొట్టలేయుచును మేయుజనాలకుచెప్పుదేటిదిన్
    అచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారూ! నాది మిడిమిడి జ్ఞానం....Fools rush in , where angels fear to tread అన్నట్టు ఉబలాటం ఎక్కువ అసలు తక్కువ... దయచేసి తప్పులుంటే సవరించి..సలహాలివ్వండి

      తొలగించండి
  46. తే.గీ:
    తింగిలీషుకుబలియైరి తెలుగు జనులు
    స్వచ్ఛమైనట్టితెలుగులో నుచ్ఛరించ
    అచ్చెరువగుజనులుకాన నచ్చతెలుగు
    పద్యముననాంగ్లపదములెహృద్యమగును

    రిప్లయితొలగించండి
  47. సమస్య :-
    "అచ్చతెలుఁగు పద్యమున నాంగ్లపదములె హృద్యములగు"
    (ఛందో గోపనము)


    *తే.గీ**

    బస్సు, సెల్లు,టీ,టై వంటి పలుకుబడులు
    తెలుగున కలసిపోయెను తీయలేము
    ముచ్చటగ వ్రాయవచ్చులే యచ్చతెలుఁగు
    పద్యమున నాంగ్లపదములె హృద్యములగు
    ......................✍చక్రి

    రిప్లయితొలగించండి
  48. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "అచ్చతెలుఁగు పద్యమున నాంగ్లపదములె
    హృద్యములగు"
    (ఛందో గోపనము)

    సందర్భము: ఒక ఆంగ్ల కవి ఆంగ్ల పద్యాలలో రామావతరణ కథ వ్రాశాడు. ఆతని మిత్రుడైన తెలుగు కవి ప్రశంసిస్తూ ఇలా వాపోయినాడు.
    " ఆంగ్ల పద్యంలో మీరు ప్రయోగించిన ఆంగ్ల పదాలు హృద్యములైనవి. నేను దానినే అచ్చతెలుగులో వ్రాయాలని యత్నిస్తే కొనసాగడం లేదు."
    (పద్యారంభంలోనే ఆంగ్ల పద్యమని చెప్పినందువల్ల చతుర్థ పాదంలో పేర్కొనబడిన పద్యం ఆంగ్ల పద్యమే అయింది నిస్సంశయంగా..
    అచ్చతెలుగును 3 వ పాదంలోనే విడదీసి దాని ప్రసక్తి అక్కడికే పూర్తి చేసినందువల్ల తర్వాతి సమస్యా పాదానికి గల అవరోధమూ తొలగిపోయింది.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *అచ్చ తెలుగు*

    ఆంగ్లపద్యాన శ్రీ రాము నవతరణము

    దివ్యముగఁ జెప్పినావులే! దీనిఁ జెప్ప

    యత్న మొనరింప సాగదే యచ్చతెలుఁగు!..

    పద్యమున నాంగ్లపదములె హృద్యములగు!


    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    14.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి

  49. విచ్చు కొనియెడి భాషలన్ విస్తృతించ
    మెచ్చి వాడెడి పరభాష మేలెరింగి
    అచ్చటచ్చట రవళించ నచ్చ తెలుగు
    పద్యమ్మున నాంగ్ల పదములె హృద్యములగు!

    రిప్లయితొలగించండి
  50. తేనె లొలికెడు మనభాష తీయదనము
    పరుల భాషకు లేదయ్యె పరిగణింప
    పిచ్చిమాటలవియె యేల యచ్చ తెలుఁగు
    పద్యమునకాంగ్ల పదములె హృద్యములగు?

    రిప్లయితొలగించండి
  51. ఆకాశవాణి లో చదువబడిన నా పూరణ అచ్చర లాడి పాడినటు లద్భుత నాట్యము తాండవించెడిన్
    అచ్చ తెలుంగు పద్యమున; ఆంగ్ల పదమ్ములె శోభ గూర్చురా
    వచ్చియు రాని మాట పసిపాప వచించెడు* "ట్వింకి ట్వింకి " *లన్
    మెచ్చిన "రైము " పాడుచును మేలిమి వజ్రపు చుక్క జూపగన్

    రిప్లయితొలగించండి